ముఖ్య గమనిక: ఇది ఒక పవన్ పిచ్చోడు, పవన్ పిచ్చోళ్లకి రొటీన్, వెరైటీ, హైలైట్స్, డ్రాబ్యాక్స్, హిట్టూ, ఫ్లాప్, కలెక్షనలూ, రికార్డులూ, సందేశాలూ, వెర్రి వేషాలూ, విమర్శలూ, విశ్లేషణలూ వీటన్నిటికీ అతీతం గా చెప్తున్న అంతరంగం. పంచుకుంటున్న ఆనందం.
ఇప్పటికే చాలా రివ్యూలు చదివేసుంటారు. చాలామంది సినిమా చూసేసుంటారు. కాబట్టీ రివ్యూ రాయాల్సిన అవసరం లేదు. కానీ సాటి పవన్ వీరాభిమాని అయిన బద్రి కి ఇచ్చిన మాట కోసం కొన్ని సంవత్సరాలుగా మాగన్ను వేసి నిద్రపోతున్న నా లోని పవన్ పిచ్చోడిని లేపి డ్యాన్స్ వేయించాను ఈరోజు.
గబ్బర్ సింగ్.... దబాంగ్ రిమేక్.... అదీ హరీష్ శంకర్ అనే చిన్న డైరెక్టర్ తో అనగానే పెదవి విరిచేసిన వాళ్లలో
నేనూ ఉన్నాను. నేను స్కూల్ కి వెళుతున్న రోజుల్లో సూపర్ హిట్టూ, జాబ్ కొట్టిన కొత్తలో జస్ట్ హిట్టూ, గత మూడు సినిమాలూ అట్టర్ ఫట్టూ కొట్టిన పవన్ కళ్యాణ్, ఆ చోటా డైరెక్టర్ కలిసీ పాతాళం లో ఉన్న అంచనాలని, పర్వత శిఖరం మీదకి తీసుకెళ్ళి ఆకలితో ఉన్న అభిమానులకి విస్తరాకులేసి విందుభోజనం పెడతారని ఊహించలేదు.
చిన్న..ట్రైలర్ ఇస్తా....
గ... బ్బ....ర్... సిం....గ్.. అని తుపాకీ పేలుతూ ఒక్కో అక్షరం వస్తుంటే ఎలా ఉంటుందీ??
రక రకాల గన్స్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుండగా..టైటిల్స్ పడితే ఎలా ఉంటుందీ??
పదేళ్ల కుర్రాడు... మెడ మీద కుడి చేత్తో రాసుకుంటూ, మత్తు గా, పొగరు గా చూస్తుంటే ఎలా ఉంటుందీ??
"ఆ పసివాడు.... "పవన్ కళ్యాణ్" అయ్యాడు" అని టైటిల్ వేసిన డైరెక్టర్ తీసిన సినిమా ఎలా ఉంటుందీ?
వెయ్యి మంది మొహాల్లో వెలుగుని ఒక్క సారే చూశారా??? ఎప్పుడయినా?? నేను చూశానీ రోజు.
రెండు వేల కళ్ళు వెండితెరకి లాక్ అయిపోవటం చూశారా??
మా ఎదురు చూపులు ఇందుకే.. మాక్కావల్సిందిదే అని గుండెల్లోంచొచ్చిన పిచ్చి అరుపులతో చెప్పటం ???
ఎమోషనల్ సీన్ కి పెరిగిన చాతీ,
కామెడీ కి విరిసిన నవ్వూ,
ఫైట్ కి బిగుసుకున్న పిడికిలీ
ఉద్వేగంగా తీసుకున్న ఊపిరీ..
సెంటిమెంట్ కి తడిసిన కన్నూ
డ్యాన్స్ కి ఊపిన కాలూ
పాటకి కలిపిన గొంతూ..
వీటన్నిటినీ ఏకైక కారణం.............. ఒన్ & ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ In & As
గబ్బర్ సింగ్...
ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒక పవన్ అభిమాని పవన్ సినిమాని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఒక పవన్ అభిమాని తనకి కావల్సినవన్నీ చెప్పి, పవన్ చేత చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది.
రెండున్నర గంటలు నాన్ స్టాప్ గా అరుపులూ, కేకలూ, చిరిగిపోతున్న చొక్కాలూ, ఎగిరిపోతున్నా కాగితం ముక్కలూ, చప్పట్లూ, నవ్వులూ, గెంతులూ, మొదలైన వాటితో ధియేటర్ దద్దరిల్లింది.
సాధారణం గా రీమేక్ సినిమాలకి రెండు రకాల కమెంట్స్ వస్తాయ్.
౧. సినిమా ఒరిజినల్ లాగా నే ఉంటే... "మక్కీ కి మక్కీ దించేశాడ్రా" అంటారు.
౨. మార్పులు చేస్తే... "చేంజెస్ చేసి ఒరిజినల్ ఫీల్ చెడగొట్టాడ్రా.. ఒరిజినల్ సినిమానే బాగుంది" అంటారు.
దేన్ని సపోర్ట్ చేయాలి?? ఏది కరెక్ట్??? దీనికి ఆన్సర్ తెలీదు నాకు. అక్కర్లేదు కూడా.
ప్రేక్షకులకి నచ్చిందా లేదా? ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందా లేదా? అన్నదే ముఖ్యం అనుకుంటాను.
రివ్యూల్లో చాలా మంది రాసినట్టూ సెకండ్ హాఫ్ తగ్గినట్టూ, స్లో అయినట్టూ అయితే నాకు అనిపించలేదు. హీరోయిన్ కూడా బాగానే ఉంది. అయితే వాయిస్ కొంచేం సింక్ అవ్వకపోవటం, గాయత్రి క్యారెక్టర్, మలైకా ఐటెమ్ సాంగ్(పవన్ రాకముందు) మాత్రమే ఇగ్నోర్ చేయదగ్గ నెగటివ్ పాయింట్స్ గా అనిపించాయ్. దబాంగ్ సినిమా తో ఈ సినిమాని పోల్చలేం. మన నేటివిటీ కి తగినట్టూ, పవన్ చుట్టూ కధ తిరిగేట్టూ చేసి ఫైనల్గా ఎంటర్టైన్ మెంట్ ఇస్తూ
మాటలు - మార్పులు - దర్శకత్వం అని సగర్వం గా కార్డ్ వేసుకున్న హరీష్ శంకర్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి.
సినిమా లో పవన్ డ్యాన్స్ సూపర్ అని టాకొచ్చింది. నిజానికి అది పెద్ద డ్యాన్సేం కాదు. కానీ ఒకటి చెప్పాలి
చిరంజీవి డ్యాన్స్ చూడ్డానికి జనం వెళ్ళేవాళ్ళు.
అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్, చరణ్ లు మెలికలు తిరిగి ఒళ్ళు హూనం చేసుకొని డాన్స్ ఇరగదీస్తే చూస్తారు.
కానీ పవన్ కళ్యాన్ డ్యాన్స్ చెయ్యడానికి ట్రై చేసినా చాలు మళ్ళీ మళ్ళీ చూసే పిచ్చోళ్ళున్నారు. ఆ పిచ్చోళ్ళలోనేనూ ఉన్నాను ;) ;)
తక్కిన సినిమా అంతా... కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.. కేకా.. నా సామి రంగా కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక...
పేరు, గోత్రం చెప్పడానికి నేను గుడికొచ్చానేంట్రా.. ఇక్కడ తెలుసుకోడాలు లేవు. తేల్చుకోడాలే
నేను హీరోని కాను విలన్. తప్పు చేసే ప్రతీ పకోడీ గాడూ హీరోలా ఫీలవుతుంటే, తప్పు చేసే వాళ్ల తుక్కు రేగ్గొట్టే నేను విలన్ గానే ఫీలవుతా.
మా మీద ఈగ వాలనివ్వరా సార్?
ఈగ వాలితే మీరు చూసుకోండీ. మిగతావి ఏమి వాలినా నేను చూస్కుంటా
బాల గబ్బర్ సింగ్ః ఈ రోజు నేన్ చిన్నపిల్లాణ్ణీ, మీరు పెద్దవాళ్ళు కాబట్టీ పారిపోతున్నా... పెద్దయ్యాక మళ్ళీ వస్తా.... పరిగెట్టిస్తా...
మూడు ముళ్ళా? ముప్పై గుళ్ళా?
సుహాసినిః పోతే పోనీ అని వదిలెయ్యడానికీ వాడు పని పిల్లాడు కాదండీ పసి పిల్లాడు
రౌడీలతో కబడ్డీ ఆడుతూ పవన్ః మీరిటు వస్తే కూత..నేనటు వస్తే కోత. మీరు కూతకొస్తారా... నన్ను కోతకి రమ్మంటారా ?
పవన్ః పోలీసులంటే జనాన్ని భయపెట్టకూడదు రా.. జనం భయం పోగొట్టాలి
మిరపకాయ తెచ్చావా? మిరపకాయ?
మనిషికి తిక్క, పిచ్చి, పొగరు, బలుపు ఏదైనా ఉండొచ్చు. కాని దాని వల్ల ముందుకెళ్తున్నామా? ఎనక్కెళ్తన్నామా అనేది చూసుకోవాలి
పవన్ః ఏంట్ర మెడ ఇలాఆఅ గోకేస్తున్నావ్. అంత దూలెక్కిపోయిందా? ఎదవ ఇమిటేషన్లూ నువ్వూనూ
సిగరెట్ మానేయడం అంటే పారేయడం కాదు రా పక్కనుంచుకుని మరీ ఆపేయడం.
అరెఓ.... గబ్బర్ సింగ్ కే ఫౌజో.............. YES SIR
రూల్స్ ఒప్పుకోవురా...... మీరే ఎలాగోలా ఒప్పించెయ్యండి సార్
గబ్బర్ సింగ్ ఒప్పుకుంటే..రూల్స్ తప్పుకుంటాయ్
ఎంత బుజ్జిగా పారిపోతున్నాడురా ..... ఒరే చిట్టితల్లి(పిస్టల్) లాభంలేదు కానీ మహాలక్ష్మి(పెద్దగన్)నివ్వరా
పది మంది కోసం మంచి చేద్దాం అనుకునే వాడిని. పది కాలాలు బతకాలని ఆశీర్వదించమ్మా
కుక్కలు పెంచుకునేది అవతల వాళ్ల మీద మొరగడానికి . మనమీద అరవడానికి కాదు
అవతల వాడు మనల్ని చంపడానికి వచ్చినప్పుడూ మనమ్ చావాలా?చంపాలా? చంపాలీ... అదీ లెక్క.
ఒక అమ్మాయ్ వారం లో పడొచ్చు. ఒక నెలలో పడొచ్చు. ఒక రోజు అయినా, రెండ్రోజులయినా, రెండు సంవత్సరాలయినా అమ్మాయి పడేది మగాడికే రా. అది సృష్టి ధర్మం.
నీ బలుపు, ఆవేశంమ్ మడిచి లోపల పెట్టుకో.. బయటకు రానీయకు. చావటానికి కూడా కంగారే నీకు
"ఉంగరం ఏదిరా?
పాకెట్లో పెట్టాను.
ఏదీ.. చూపించూ.
పడిపోతుందేమో అనీ తాకట్లో పెట్టాను"
నీకు మనుషుల్ని పంపడంతెలుసు.. నాకు మనుషుల్ని చంపడం తెలుసు
ఈ గబ్బర్ సింగ్ స్టేషన్ నుండి పారిపోడమంటే పైకిపోడమే.
అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి పిరంగ్...
హిందీ సినిమాకి తెలుగు సబ్ టైటిల్స్ లాగా ఆ భాషేంట్రా?
నాకూ అలగ్ అలగ్ ఊర్లకి ట్రాన్స్ఫర్ హై తో మేరా భాషా కిచిడీ కిచిడీ హోగయా
ఆలీః మీరు కొత్తగా వచ్చిన C.I అయితే నేను లేట్ గా వచ్చిన కానిస్టేబుల్ ని
చట్టం తనపని తాను చేసుకుపోతుందీ..(ఇక్కడ అరాచకం గా...)
ఆలీః ఓహో.... గుర్రం, బుల్లెట్టూ, జీపూ.. రోడ్ ని బట్టి వాడతాడా?
కాదు మూడ్ ని బట్టీ వాడతాడు
హీరోయిన్ : ఏవండీ పడిపోయేలా ఉన్నాను...
పవన్: తప్పకుండానండీ నేనాల్రెడీ పడిపోయాను.
గట్టిగా ఉన్నోళ్ళు ఎడంపక్కకి వెళ్ళండి. పొట్టిగా ఉన్నోళ్ళు కుడి పక్కకి పొండీ.. ఫిట్టు గా ఉన్నోళ్ళూ నా వెనక రండీ.
సుహాసినిః నాయుడు గారిదగ్గర ఆశీర్వాదం తీసుకోరా..
పవన్ః ఇంత విషమియ్యమ్మా తీసుకుంటానూ.
భరణిః నిద్ర రాకపోతే నిద్ర మాత్రలేసుకుందాం, మందేస్కుందాం గానీ, మర్డర్లెందుకురా సిద్దా??
భరణిః కసి.... మా అల్లుడికీ ప్రజాసేవంటే కసీ.
అప్పుడప్పుడూ భావాలు తన్నుకొచ్చేస్తుంటాయ్. నేను చెప్తూ ఉంటాను నువ్ రాస్కుంటా ఉండూ
బ్రహ్మిః క్రిమినల్ కి టెర్రర్, క్రైమ్ కి హర్రర్, ఒన్ అండ్ ఓన్లీ గబ్బర్.. గబ్బర్ సింగ్ .. లుక్ అట్ దేర్.. ఒక్క అడుగు ముందుకేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండీ.
బ్రహ్మీః క్యారెక్టర్ లో కంటెంట్ ఉండాలి గానీ కట్ ఔట్ చాలురా
<<<<<<<<<<< మిత్రులు బద్రీ, వేణూశ్రీకాంత్ గార్లకి అంకితం >>>>>>>>>>>>>>>>>>>

డైలాగ్స్... మీకోసం..... సినిమా చూడని వాళ్ళూ, చూద్దాం అనుకుంటున్న వాళ్ళూ చదవద్దని మనవి. థ్రిల్ పోతుంది. ;)
పేరు, గోత్రం చెప్పడానికి నేను గుడికొచ్చానేంట్రా.. ఇక్కడ తెలుసుకోడాలు లేవు. తేల్చుకోడాలే
నేను హీరోని కాను విలన్. తప్పు చేసే ప్రతీ పకోడీ గాడూ హీరోలా ఫీలవుతుంటే, తప్పు చేసే వాళ్ల తుక్కు రేగ్గొట్టే నేను విలన్ గానే ఫీలవుతా.
మా మీద ఈగ వాలనివ్వరా సార్?
ఈగ వాలితే మీరు చూసుకోండీ. మిగతావి ఏమి వాలినా నేను చూస్కుంటా
బాల గబ్బర్ సింగ్ః ఈ రోజు నేన్ చిన్నపిల్లాణ్ణీ, మీరు పెద్దవాళ్ళు కాబట్టీ పారిపోతున్నా... పెద్దయ్యాక మళ్ళీ వస్తా.... పరిగెట్టిస్తా...
ఎప్పుడో ఒకసారి తాగితే సంతోషం, అప్పుడప్పుడూ తాగితే వ్యసనం, రోజూ తాగితే రోగం
అరెవో సాంబా.... రాస్కో....
చరిత్రలగురించి చెత్తబుట్టలగురించి తెలుసుకోను.
నాకు నేనే పోటీ. నాతో నేనే పోటీ.. నాతో ఎవరూ పోటీకి రారూ.. రాలేరు.
పేరంటం అన్నాక లేడీసూ, పేకాట అన్నాక పోలీసూ రాకుండా ఉండర్రా... ఎవరి తాంబూలం వాళ్ళకి ఇచ్చేయటమే
తపస్సు చేస్తే ప్రత్యక్షమవడానికి నేను దేవుడ్ని కాదు తప్పుచేస్తేమటుకు ఆటోమాటిక్ గా మన దర్శనమైపోద్దిరోయ్..
మూడు ముళ్ళా? ముప్పై గుళ్ళా?
విలన్ః వీడు మరీ భయపడుతున్నాడు. చంపుతాడంటావా?
భరణిః పెపంచికం లో చాలా మర్డర్లు భయం తో చేసేవేరా సిద్దా..
సుహాసినిః పోతే పోనీ అని వదిలెయ్యడానికీ వాడు పని పిల్లాడు కాదండీ పసి పిల్లాడు
విలన్ : నాకు బిజినెస్ లో భయపడే కస్టమర్లు కావాలి భయపడే పార్టనర్లు కాదు
విలన్ః నా డబ్బు కొట్టాడు భరించాను. నా పరువు మీద కొట్టాడూ సహించాను. నన్ను అవమానించాడు.. అనుభవించాను
రౌడీలతో కబడ్డీ ఆడుతూ పవన్ః మీరిటు వస్తే కూత..నేనటు వస్తే కోత. మీరు కూతకొస్తారా... నన్ను కోతకి రమ్మంటారా ?
పవన్ః పోలీసులంటే జనాన్ని భయపెట్టకూడదు రా.. జనం భయం పోగొట్టాలి
మిరపకాయ తెచ్చావా? మిరపకాయ?
మనిషికి తిక్క, పిచ్చి, పొగరు, బలుపు ఏదైనా ఉండొచ్చు. కాని దాని వల్ల ముందుకెళ్తున్నామా? ఎనక్కెళ్తన్నామా అనేది చూసుకోవాలి
భరణిః పోలీసోడు రౌడీలకు శత్రువుకాని రాజకీయ నాయకులకు కాదు మనం ఇపుడిపుడే రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నాంకదా.. ముందు పలకరించాల తలెగరేస్తే దించాలా తేడా జేస్తే తుంచాల
పవన్ః ఏంట్ర మెడ ఇలాఆఅ గోకేస్తున్నావ్. అంత దూలెక్కిపోయిందా? ఎదవ ఇమిటేషన్లూ నువ్వూనూ
సిగరెట్ మానేయడం అంటే పారేయడం కాదు రా పక్కనుంచుకుని మరీ ఆపేయడం.
అరెఓ.... గబ్బర్ సింగ్ కే ఫౌజో.............. YES SIR
రూల్స్ ఒప్పుకోవురా...... మీరే ఎలాగోలా ఒప్పించెయ్యండి సార్
గబ్బర్ సింగ్ ఒప్పుకుంటే..రూల్స్ తప్పుకుంటాయ్
ఎంత బుజ్జిగా పారిపోతున్నాడురా ..... ఒరే చిట్టితల్లి(పిస్టల్) లాభంలేదు కానీ మహాలక్ష్మి(పెద్దగన్)నివ్వరా
పది మంది కోసం మంచి చేద్దాం అనుకునే వాడిని. పది కాలాలు బతకాలని ఆశీర్వదించమ్మా
కుక్కలు పెంచుకునేది అవతల వాళ్ల మీద మొరగడానికి . మనమీద అరవడానికి కాదు
అవతల వాడు మనల్ని చంపడానికి వచ్చినప్పుడూ మనమ్ చావాలా?చంపాలా? చంపాలీ... అదీ లెక్క.
ఒక అమ్మాయ్ వారం లో పడొచ్చు. ఒక నెలలో పడొచ్చు. ఒక రోజు అయినా, రెండ్రోజులయినా, రెండు సంవత్సరాలయినా అమ్మాయి పడేది మగాడికే రా. అది సృష్టి ధర్మం.
నీ బలుపు, ఆవేశంమ్ మడిచి లోపల పెట్టుకో.. బయటకు రానీయకు. చావటానికి కూడా కంగారే నీకు
"ఉంగరం ఏదిరా?
పాకెట్లో పెట్టాను.
ఏదీ.. చూపించూ.
పడిపోతుందేమో అనీ తాకట్లో పెట్టాను"
నీకు మనుషుల్ని పంపడంతెలుసు.. నాకు మనుషుల్ని చంపడం తెలుసు
ఈ గబ్బర్ సింగ్ స్టేషన్ నుండి పారిపోడమంటే పైకిపోడమే.
అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి పిరంగ్...
హిందీ సినిమాకి తెలుగు సబ్ టైటిల్స్ లాగా ఆ భాషేంట్రా?
నాకూ అలగ్ అలగ్ ఊర్లకి ట్రాన్స్ఫర్ హై తో మేరా భాషా కిచిడీ కిచిడీ హోగయా
విలన్ః అది చెప్పడానికి నువ్వెవడ్రా
పవన్ః ఆడు నా ఫాన్.. నేను చెప్పినా ఒక్కటే నా ఫాన్స్ చెప్పినా ఒక్కటే
ఈ గబ్బర్ సింగ్ కి లంచమా? ఇదే మగాడయితే ఈ పాటికి షూట్ చేసుండే వాణ్ణి.
ఆలీః మరి ఇప్పుడు ఈ అమ్మాయిని ఏం చేస్తారు?
నిన్ను ముందు ఎన్ కౌంటర్ చేసేస్తాను రా శనొదిలిపోతుందీ.
ఆలీః మరి ఇప్పుడు ఈ అమ్మాయిని ఏం చేస్తారు?
నిన్ను ముందు ఎన్ కౌంటర్ చేసేస్తాను రా శనొదిలిపోతుందీ.
ఆలీః మీరు కొత్తగా వచ్చిన C.I అయితే నేను లేట్ గా వచ్చిన కానిస్టేబుల్ ని
చట్టం తనపని తాను చేసుకుపోతుందీ..(ఇక్కడ అరాచకం గా...)
ఆలీః ఓహో.... గుర్రం, బుల్లెట్టూ, జీపూ.. రోడ్ ని బట్టి వాడతాడా?
కాదు మూడ్ ని బట్టీ వాడతాడు
హీరోయిన్ : ఏవండీ పడిపోయేలా ఉన్నాను...
పవన్: తప్పకుండానండీ నేనాల్రెడీ పడిపోయాను.
గట్టిగా ఉన్నోళ్ళు ఎడంపక్కకి వెళ్ళండి. పొట్టిగా ఉన్నోళ్ళు కుడి పక్కకి పొండీ.. ఫిట్టు గా ఉన్నోళ్ళూ నా వెనక రండీ.
సుహాసినిః నాయుడు గారిదగ్గర ఆశీర్వాదం తీసుకోరా..
పవన్ః ఇంత విషమియ్యమ్మా తీసుకుంటానూ.
భరణిః నిద్ర రాకపోతే నిద్ర మాత్రలేసుకుందాం, మందేస్కుందాం గానీ, మర్డర్లెందుకురా సిద్దా??
భరణిః కసి.... మా అల్లుడికీ ప్రజాసేవంటే కసీ.
అప్పుడప్పుడూ భావాలు తన్నుకొచ్చేస్తుంటాయ్. నేను చెప్తూ ఉంటాను నువ్ రాస్కుంటా ఉండూ
ఇలాంటి ఆణిముత్యాలన్ని కలిపి ఒక బుక్కేయిద్దాంరా...
ఆలీ : ఈయనా... ఈయన పైత్యం
పవన్ : ఆ...... టైటిలదేరా "నేనూ నా పైత్యం"
పవన్ః మీరు బందెందుకు చేస్తున్నార్రా?
విలన్ః అసంతృప్తి
పవన్ః అసంతృప్తి, భావప్రాప్తి అయితే డాక్టర్ దగ్గరకెళ్ళాలి కానీ దానికి మార్కెట్ మీద పడటం ఎందుకు రా?
నేను టైం ని నమ్ముకోను రా.. నా టైమింగ్ నమ్ముతాను
పరిగెట్టలేని పోలిసుల్ని చూసి: దేవుడా మనోళ్ళు ఫైటింగ్ చేయకపోయినా పర్లేదు కనీసం డైటింగ్ చేసేలా చూడుతండ్రీ....
నేను ట్రెండ్ ఫాలో అవ్వనూ... సెట్ చేస్తా.
నా తిక్కేంటో చూపిస్తా.. అందరిలెక్కలూ తేలుస్తా..

పాపులారిటీ పాసింగ్ క్లౌడ్ లాంటిది వాతావారణం వేడెక్కితే వానై కరిగిపోద్ది. మీరు మేఘాల్లాంటోళ్ళు. నేను ఆకాశంలాటోడ్ని ఉరుమొచ్చినా మెరుపొచ్చినా పిడుగొచ్చినా నేనెప్పుడూ ఒకేలా ఉంటాను.
రావురమేష్ః నువ్వెప్పుడూ ఇలా జోకులేస్తూనే ఉంటావా ?
పవన్ః అవును సార్ డ్యూటి ఒక్కటే సీరియస్ గా చేస్తాను
పవన్ విలేకర్లతోః మీరు మాట్లాడాలంటే మైకులు ఛానలు ఉంటే చాలు నేను మాట్లాడాలంటే సాక్షాలు, ఆధారాలు కావాలి..
వీడ్ని చంపడం న్యాయం, దీనికి ఎవడడ్డొచ్చినా చావడం ఖాయం.. వీడికోసం చచ్చిపోతారా ? వీడు చచ్చాక బతికి
పోతారా ?