Sunday, September 25, 2011

"దూకుడు" డైలాగ్స్ వింటారా?

కారణం లేకుండా (నా దృష్టి లో) ఫ్లాపయిపోయిన ఖలేజా తర్వాత మహేష్ బాబు, నమోవెంకటేశా లాంటి హారర్ మూవీ తర్వాత శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన కామెడీ + యాక్షన్ ఎంటర్టెయినర్... దూకుడు.......!

దూకుడు అంటే... "ప్రజల మంచి కోసం ఎన్నికష్టాలు ఎదురయినా లెక్క చెయ్యకుండా ఎదిరించి ముందుకు పోవటమే దూకుడు"

కధ గురించి పెద్దగా చెప్పుకోడానికేం లేదు గానీ శ్రీను వైట్ల గత చిత్రాల శైలి లో అంటే ఢీ, రెఢీ, కింగ్, రీసెంట్ గా వచ్చిన కందిరీగ సినిమాల తరహానే. పూర్తి శ్రీనువైట్ల మార్క్ కామెడీ సినిమా.

పాలుగారే పిల్లోడు మహేష్ బాబు ఎప్పటిలాగే అదరగొట్టాడు. లుక్స్, యాక్షన్, డైలాగ్స్, తన ట్రేడ్మార్క్ స్టెప్స్ (అంటే.. నడుము వంచకుండా, జిమ్నాస్టిక్స్, యోగా లాంటీవి చెయ్యకుండా నించొని ఆకట్టుకునే విధంగా చేసే డ్యాన్స్) తో చింపేశాడు. ఖలేజా సినిమా లో లాగే కామెడీ బాగా చేశాడు.  చాలా సీన్ లలో తన స్టైలో పరిగెడుతూ విలన్లని కొడుతూ పిచ్చెక్కించాడు.
కానీ పాపం సమంతా ఈ సినిమా లో మహేష్ పక్కన డల్ అయిపోయిందీ. కేవలం పాటల్లోనూ, ఒకటో రెండో సీన్ల లో మాత్రమే ఉంటుందీ. ఏమాయ చేశావే సినిమాలోని మ్యాజిక్ ని కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా రిపీట్ చెయ్యలేక పోయిందీ.
అయినా నాగ చైతన్య, ఎన్టీయార్ పక్కన అయితే చూస్తారేమో గానీ మహేష్ పక్కన ఏ రకంగానూ ఆనలేదు.

ఫస్టాఫ్ మొత్తం ఇంచ్ ఇంచ్ కీ పంచ్ లతో సమ్మగా సాగిపోతుందీ సినిమా. కానీ నా వరకూ ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ బోర్ కొట్టిందీ. కావల్సినన్ని ఫైట్స్ ఫస్టాఫ్ లోనే పెట్టేసీ పోకిరి క్లైమాక్స్ ని తలపించేలా ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చాడు డైరెట్రు. సెకండ్ హాఫ్ లో పెద్ద విష్యం లేక
పోయినా గానీ, స్టోరీ లో సవాలచ్చ లొసుగులున్నా గానీ, సాగదీత ఉన్నాగానీ, బ్రహ్మీ, ఎమ్మెస్, ధర్మవరపు, & ప్రిన్స్ ల కామెడీ లో కొట్టుకు పోతాయ్ అవన్నీ.

హైలైట్స్ సీన్స్ః

పోకిరి లో లాగా హీరోయిన్ ఉందని తెలీక మహేష్ ఫ్రెండ్స్ తో మాటాడే సీన్

బ్రహ్మీ "ఓంకార్ ఆట, చాలెంజ్" షో లని పేరడీ చేసే సీన్..... బ్రహ్మీ ఎస్సెమ్మెస్ రిక్వెస్ట్ చేసే సీన్ మంటలు

ఎమ్మెస్ నారాయణ ప్రివ్యూ చూపించే సీన్. ఇది అరాచకం

మహేష్ బాలయ్య బాబు ని ఇమిటేట్ చేస్తూ  " కార్లోవచ్చినా సరే.. కాలినడకనొచ్చినా సరే.. డే టైం వచ్చినా సరే.. నైట్ టైం వచ్చినా సరే.. ఎప్పుడయినా సరే ఎక్కడయినా సరే... ఆఆఅయ్య్య్య్య్య్.." అని తొడగొట్టే సీన్.

పార్వతీ మెల్టన్ ఐటెం సాంగ్. బక్కగా అయిపోయీ "అవి కాళ్ళా..? ట్యూబ్ లైట్సా? అన్నట్టూ నిక్కరేసుకొచ్చీ అదోరకమయిన స్టెప్స్ వేసి రచ్చ చేసిందీ ;) ;) ;)

సోనూ సూద్ పాతపాటలు వినే సీన్స్ కూడా ఓకే. బట్ ఈ సినిమా లో పెద్దేం చేయలేదు.పే...ద్ద పాజిటివ్ ఏంటంటే పంచ్ డైలాగ్స్ ఇరగ. మచ్చుక్కి కొన్ని కొంచేం అటూ ఇటూ గా.

౧. మహేష్ః  "చూశావా? పంచ్ పడేసరికి ప్రొఫెషన్ చెప్పేశావ్.? "

"పడుకున్న పులినీ, పని చేసుకునే పోలీసునీ కెలికితే..... వేటే"

"పరిస్థితులేంటి సార్.. ఇలా పగబట్టేశాయ్?"

"దూకుడు లేకపోతే పోలీస్ కీ పోస్ట్ మ్యాన్ కీ తేడా ఏం ఉంటదీ?"

"నేను నరకటం మొదలెడితే నరకం లో హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టుకోవాలి "

కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు.

నాకు ఒక్క నిమిషం ఇస్తే ఆలోచిస్తా, రెండు నిమిషాలు ఇస్తే యాక్షన్ లోకి దిగుతా, మూడు నిమిషాలు ఇస్తే ముగించేస్తా...!

భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాదీ..!

మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోవటమే..

హీరోయిన్ తో:   నేను పక్కన నిలబడితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నోణ్ణి చూసినట్టూ చూస్తున్నావ్. నా హైట్ ఎంటీ నీ హైట్ ఏంటీ? నా కలర్ ఏంటీ నీ కలర్ ఏంటీ? ఎదవ పిట్ట మొహమేసుకొని..

పోలీసోడికి ఫోకస్ తో పాటూ పేషన్స్ కూడా కావాలి.

మా నాన్నెప్పుడూ ఒకటి చెప్తుండేవాడు 'సాహసమే ఊపిరిగా బతికేవాడికి దారితో పనిలేదు దమ్ముతోనే పని' అని

చూస్తావ్ గా.. పర్మిషన్ ఇస్తే పేకాడేస్తాను.

డైలాగ్ అనేదీ ఇంటెన్సిటీ తో చెప్పాలి. నువ్ ఇంటెన్సిటీ కేర్ లో ఉన్నట్టూ చెప్తున్నావ్.
 

"నీ లైఫ్ లో నువ్ చాలా మంది తో పెట్టుకొని ఉంటావ్. కానీ ఒక్కడి తో మాత్రం పెట్టుకోకు. అమ్మ కడుపులోంచి ఎందుకు బయటకొచ్చానా? అని ఫీలవుతావ్. ఆ ఒక్కడినీ నేనే "

బ్రహ్మీ - ఎమ్మెస్ తో:
   ఒరేయ్ దరిద్రుడా.. నేనంటే డబ్బ్లులకి కక్క్రుర్తి పడ్డాను. నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటే ఎలా నమ్మేశావురా? "కళ్ళ కింద క్యారీ బ్యాగ్ లేసుకొని ఎదవ మొహం నువ్వూనూ.."

బ్రహ్మీః క్రైం చెయ్యటం నాకు ఐస్ ఫ్రూట్ తినడం తో సమానం రా. ఐస్ ఫ్రూట్ చీకితే పుల్లయినా మిగుల్ తుందీ. నేను క్రైం చేస్తే ప్రూఫ్ కూడా ఉండదూ.. నో బడీ కెన్ స్క్రాచ్ మీ."పందిలాగాతిని పొట్ట పెంచడం కాదు కొంచెం బుఱ కూడా పెంచు"  -- "నంది లెవెల్లో పెర్ఫార్మెన్స్  ఇస్తే నన్ను పందంటావా? ""ఎవరో చెప్తే ఇన్ఫర్మేషన్.. కళ్ళతో చూస్తే కన్ఫర్మేషన్. "

"నువ్వొకదానివీ.... వాడు ఆవలించినా మా అన్నయ్య పోలికే అంటావ్"

"హే.. లుకింగ్ ఫర్ సమ్ వన్? హి ఈజ్ ద వన్"

"చూడండి సార్. ఇతనికి దూకుడెక్కువయి పోయిందీ.. కుక్కని కాల్చినట్టూ ఎలా కాల్చాడో.." ----------- "నేను కాల్చింది కుక్కనే"ఏది ఎలా ఉన్నాగానీ కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు ఈ సినిమాని. కాకపోతే సినిమ చాలా పెద్దదీ. మూడు గంటలు అంటే టూమచ్. నేను నిన్న సినిమాకి వెళ్ళీ ఈరోజు వచ్చాను అదేలెండీ సెకడ్ షో.. (పది నుండీ ఒంటిగంట వరకూ )