Monday, January 30, 2012

అప్పిగాడి ఆగడాలు - 2

ది ఎమ్సెట్ ర్యాంకో, మా ల్యాండ్ లైన్ నంబరో తెలీక మేమే కన్ఫ్యూజ్ అయిపోయే అయోమయం లో నేనూ, అప్పల్రాజుగాడూ, హిట్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ లాగా, స్టూడేంట్స్ కోసం ఎదురుచూస్తున్న మా ఇంజినీరింగ్ కాలేజ్ లో జాయినయిపోయాం.
రోజూ మా ఊరినుండి సగం దూరం R.T.C బస్ లోనూసగం నుండి కాలేజ్ బస్సు లోనూ నిద్రమత్తులో 
కాలేజ్ కెళ్ళొస్తూక్లాస్ లో  శీతాకాల సుప్తావస్థ లో ఉండే కప్పల్లాగా నిదరోయే గమ్మత్తయిన రోజులు అవి.


మా మైక్రోవేవ్స్ మ్యాడమ్ కుడిచేత్తో మా ఇంటర్నల్ ఎగ్జాం పేపర్లు పట్టుకొనిఎడం చేత్తో ముక్కు తుడుచుకుంటూ
తుమ్ముకుంటూ [మా మెదళ్లకి పట్టిన దుమ్ము మరిహార్న్ రిపేరొచ్చిన స్టీరింగ్ ఆటో లాగా క్లాస్ లో కొచ్చారు, తన 
సబ్జెక్ట్ పట్టుమని పదిమందయినా పాసయ్యేట్టు కనిపించట్లేదని  పనిలోపని గా కళ్ళు కూడా తుడుచుకుంటూ 
పేపర్లివ్వటం మొదలెట్టారుఅందరి పేపర్లూ ఇచ్చేసి చివారఖరున ఒక ఆన్సర్ పేపర్ పైకెత్తి పట్టుకొని 
"ఇక్కడ వీ డాట్  [V.A] ఎవరమ్మా?" అనడిగేరు.అప్పటివరకూ  చెరువొడ్డున చేపల సంత లాగా ఉన్న క్లాసంతా చేస్తున్న గోల ఆపేసీ చెవులు రిక్కించింది. చివరి బెంచ్ లో సినిమా పాటల పుస్తకాలు చదువుకుంటున్న "విజయ్ బాబు & కో" పాటలాపేసి తలలు పైకెత్తారు. చేతులు మారుతున్న చీటీ మెసేజ్ లు సగం లోనే ఆగిపోయాయి. అందరి కీ అదొక పజిల్ లాగా ఉందిభూతద్దాలు చెరో కంటికీ బిగించేసుకొని " 150/100 తెచ్చుకోటం ఎలా?" అనే కాన్సెప్ట్ మీద మినీ ప్రాజెక్ట్ చేస్తూ  జుత్తు రాలిపోయేలా ఆలోచించే మా క్లాస్ టాపర్ తాతాజీ గాడు పీడకలొచ్చి నిద్రలేచినోడిలాగా అరుస్తూ "V.A means Vertical asymptotes మ్యాడమ్. Vertical asymptotes are vertical lines near which the function y = f(x) grows without bound" అనేసీ మా వైపు తిరిగీ ముక్కు మీద జారిపోతున్న భూతద్దాలు పైకెత్తి గర్వం గా నవ్వేడు.
మ్యాడమ్ : నేనడిగేది అది కాదు.
తాతాజీ :  Oh..Shitttt... but i got it.  V.A means "volt-ampere". it  is the unit used for ....
మ్యాడమ్ : నువ్ నీ వికీ నాలెడ్జ్ కాసేపు ఆపుతావా? ఇక్కడ నేనేమన్నా ఆన్సర్ చెప్పినోళ్ళకి చాక్లెట్లిస్తానని చాటింపేశానా?......... మేటర్ అది కాదు.  పేపర్ ఎవరిదండీ?
సైలెంట్ గా స్టేజ్ దగ్గరకి సిసింద్రీలా దూసుకొచ్చిన అప్పల్రాజు గాడు "నాదే మేడమ్" అంటూ మోటుగా పేపర్ లాక్కోబోయాడు. 
మ్యాడమ్ : మరి పేరు V.A అని రాశావ్?
అప్పల్రాజుః  నేనే..  "వాసిపల్లి అప్పల్రాజు" -> V.A
మ్యాడమ్ : షార్ట్ కట్లేమిటండీ? ఆన్సర్ షీట్ మీద పేరు రాయటానికి నీకు  బద్దకమా? ఒళ్ళు బలుపా, తలపొగరా?   
అప్పల్రాజూః తల 45 డిగ్రీల కోణం లో పెట్టీ, పళ్ళు బయటెట్టీ, నాలుక మడతెట్టీ, కళ్ళూ చెవులూ పెద్దవి చేసి, సౌండ్ రాకుండా నవ్వుతూ..
మ్యాడమ్ : అడిగేది నిన్నే...బదులివ్వకుండా నవ్వేంటీ? చాలా ఇరిటేటింగ్ గా ఉంది నాకు.
అప్పల్రాజుః సేం ఎక్స్ప్రెషన్ మైంటైన్ చేస్తూ కుడిచేత్తో క్రాఫ్ సరి చేసుకుంటూ..  
మ్యాడమ్ : నువ్ చేసింది పెద్ద మిస్టేక్ కాదు. కానీ ఇప్పుడు చేస్తున్నది మేనర్స్ కాదు. అడిగిందానికి సమాధానం చెప్పవేం?
అప్పల్రాజుః [నన్ను కాదు అన్నట్టూ గెడ్డం గోక్కుంటూ, కిటికీ లోంచి కాకుల జంటని ఆరాధన గా చూస్తూ..] 

" ఛీ నా జీవితం. ఎగ్జాం పేపర్ మీద షార్ట్ సిగ్నేచర్ చేసేవాడి రిప్లై కోసం వెయిట్ చెయ్యటం నాదీ తప్పు. మళ్ళీ మీ క్లాస్ కి వస్తానేమో చూడండీ..Final exams లో మాత్రం ఇలా రాసి తగలడకు. " అనరిచేసీ, చేతిలో ఉన్న చాక్ పీస్ పిండి పిండి చేసుకుంటా బయటకెళ్లిపోయారు మేడం.

***********************************************************

సమయం: ఆరోజు సాయంత్రం 
సంధర్భం: బస్ స్టాప్ లో ఆల్ స్టాప్ ఎర్ర బస్ కోసం నాన్ స్టాప్ గా వెయిట్ చేస్తా ఉన్నాం.
మూడీ గా ఉన్న అప్పిగాడిని చీరప్ చెయ్యటానికి "ఏరా..నాకాకలేస్తుంది. ఏమన్నా తీసుకురానా నా డబ్బుల్తో? " అనడిగేను.
అప్పల్రాజుః " రోజు నేను ఉపవాసం రా.. రెండు ప్లేట్స్ బజ్జీలు తీసుకో చాలు
నేనుః ఇలా అన్నానని కాదుగానొరే.. పాపం మేడమ్ అంతసేపడిగినా రిప్లై ఇవ్వకపోవటం పొగరు కాకపోతే మరేటెహే?
అప్పల్రాజుః ఏం చెప్పాల్రా? ఆన్సర్ షీట్ మీద సరదాగా సిగ్నేచర్ చేశానంటే సిల్లీగా తీసుకుంటాదా? జస్ట్ లైక్ దట్ రాసానంటే జాలిపడి వదిలేస్తుందా? పోనీ పేరు మరిచిపోయానని నిజం చెప్తే మురిసిపోయి బోనస్ మార్కులేస్తాదా? నా టైం బ్యాడ్ అంతే."
అనేసీ, తెచ్చినవి తినేసీ, ఆవేశంగా ఆగిన బస్సెక్కి కూర్చున్నాడు. అది L.H(limited halts) సెర్వీస్ బస్.అందులో స్టుడెంట్ మంత్లీ పాస్ లు అల్లో చెయ్యడు. కాలేజ్ లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల కసి మీదున్నాడో, అప్పుడే తిన్న మిరపకాయ బజ్జీల వల్ల నోరుమండిపోతుందో తెలీదు గానీ స్టూడెంట్స్ అందర్నీ బస్ ఎక్కీంచీ, మా బస్ పాస్ లు ఎందుకు ఆక్సెప్ట్ చెయ్యటం లేదన్న విషయం మీద కండక్టర్ తో గొడవెట్టుకున్నాడు అప్పల్రాజు గాడు.
 
స్టూడెంట్స్ అందరూ దిగే వరకూ బస్ కదలదని కండక్టరూ , దిగే ప్రశ్నే లేదని అప్పిగాడూ పంతం పట్టుక్కూర్చున్నారు. గొడవ అలా అలా పెద్దదవుతుంది. కొంత మంది అప్పిగాణ్ణి కమాన్ కమాన్ అని క్లాప్స్ కొట్టీ ఎంకరేజ్ చేస్తున్నారు. ప్యాసింజర్స్ లో కొంత మంది ఆడలేడీసు ఆ డ్రయివర్ సచ్చినోడు బస్సు తియ్యట్లేదనీ, ఈ మాయదారి స్టూడెంట్ సచ్చినోళ్ళే 
ఆపేసేరనీ వినిపించీ వినిపించకుండా తిడతున్నారు. 
 నేను ఆల్రెడీ విషయం లో ఒకసారి దెబ్బ తినేసి ఉండటం తో వ్యూహాత్మక మౌనం పాటిస్తూ, బస్ దిగేశాను. నన్ను చూసి ఎందుకొచ్చిన గొడవలే అనుకొని ఒక్కొక్కరూ దిగేశారు. సపోర్టర్స్ ఎవ్వరూ లేక " యాభయ్యో ఓవర్లో, డక్కౌటయిన ఓపెనర్" లాగా వచ్చిన అప్పిగాడు "అంత గొడవ జరిగితే నాకు సపోర్ట్ చెయ్యటం మానేసి బస్సు దిగేస్తావా? నా పిడివాదం వల్ల అదే కండక్టర్ పాస్ లు allow చేస్తే మాత్రం ఎంచక్కగా కూర్చుంటావ్. అక్షరాలా అవకాశవాదివి రా నువ్వూ.. గొప్ప పని చేసినప్పుడు పొగడటమ్ గొప్ప కాదురా..గొప్ప పని చేస్తున్నప్పుడు సపోర్ట్ చెయ్యటం గొప్ప" అని నన్ను ఎడా పెడా ఏకిపరేశాడు.  గొప్ప డవిలాగ్ నాకు సరిగా అర్ధం కాక ఒన్స్ మోర్ అన్నాను.

"
మంచి పని చేసినప్పుడు మెచ్చుకోకపోవటం ఎంత తప్పో... గొప్ప పని చేస్తున్నప్పుడు గుర్తించి ఎంకరేజ్ చెయ్యకపోవటమూ అంతే తప్పు"

**********************************************************************************************
మర్నాడు.. మా కర్మకాలీ మేం రోజూ ఎక్కే బస్ క్యాన్సిల్ అయ్యింది. ముందు రోజు ఫెయిలయిన తన హీరోయిజాన్ని చూపించడానికి అప్పిగాడు అవకాశాన్ని అలుసుగా తీసుకున్నాడు.
రాజన్న సినిమా లో నాగార్జున లాగా ఒత్తుల్లేని డవిలాగులు వాడిగా వదిలీ  స్టూడెంట్స్ అందర్నీ మోటివేట్ చేసీ 
L.H బస్ ఎక్కీచాండు.  టికెట్ తీసినా , మారు మాట్లాడినా బాగోదని నాకు వార్ణింగ్ ఇచ్చాడు."ఎర్రబాబుఅనే గవర్న్మెంట్ డిగ్రీ కాలేజ్ కుర్రోణ్ణి దాదాపు గా హిప్నటైజ్ చేసేసీ వీడి తిక్కంతా వాడికెక్కించాడు. టికెట్స్ తీసుకోమన్న కండక్టర్ తో తీసే ప్రసక్తే లేదని మర్కట ద్వయం కారం తిన్నకోతుల్లాగా అరిచీ, గోల చేసీ రచ్చ రచ్చ చేస్తున్నారు. మోకాల్లో నిద్రోతున్న నా  సెవెంత్ సెన్స్  చెవిలో జోరీగ లాగా గీపేట్టి నన్ను మేల్కొలిపింది. తొమ్మిదింటికి కి ఇంటర్నల్ ఎగ్జాం ఉందనీ, ఈ టైం లో గొడవొద్దనీ అప్పల్రాజు గాడికి గుర్తుచెయ్యబోతుంటే, గొడవలంటే గీరెక్కిపోయి, ఇరువర్గాలనీ రెచ్చగొట్టి రసస్పూర్తి పొందే కిరణ్ రాజ్ గాడు నా హాట్ ప్యాక్  లోంచి గుడ్డు తీసి నోట్లో కుక్కి నా నోరు నొక్కేశాడు. అప్పల్రాజు గాడు వేస్తున్న కేక లకి కలిగిన భయాన్నికండక్టర్ కళ్ళల్లో  చూశాన్నేను. ముందురోజు చూసిన ఛత్రపతి సినిమా  ఎఫెక్ట్ ఏ రేంజ్ లో చూపించాడంటే………….







"ఏయ్.. కండక్టర్..! ఆర్డినరీ బస్సయినా, ఎక్స్ప్రెస్ సెర్వీసయినా,వీకెండయినా, వీక్ డేస్ అయినా, చిల్లర లేదన్నా, పాస్ చెల్లదన్నా... నీ సంచిలోని చిల్లర తో మా పాకెట్లు నిండుతాయ్. చేతిలోని టిక్కెట్లన్నీ చెల్లాచెదురవ్వు..తాఆఆయ్"
డియర్.. ఫ్రెండ్స్.. & కాబోయే గర్ల్ ఫ్రెండ్స్.. ఈ రోజు నుండీ మీ అందరి బతుకులూ మారాయ్. డ్రయివర్ బెదిరిస్తే బెదిరిపోయి, కండక్టర్ అదిరిస్తే అదిరిపోయే పిరికితనాన్ని సమాధి చెయ్యండి. జేబులోని చిల్లరంతా లాగేసుకొనీ, బొక్కలెట్టిన టికెట్టు చేతికిస్తే దాచుకొనే బానిస బతుకు చచ్చింది.  ఇకపై మీరు బస్సెక్కేది పాస్ లు చూపించడానికి. టికెట్ కి తియ్యడానికి కాదు. తల దించుకోవలసింది పాస్ ఎక్స్పైర్ అయినప్పుడు. టికెట్ ఎగ్గొట్టినప్పుడు కాదు. మనీ మనదీ, ప్రయాణం మనదీ, పెత్తనం మనదీ. ఈ బస్ మనందరిదీ దీనిని పరిశుభ్రం గా ఉంచుదాం. ఈ ఆరాటం పోరాటాన్ని కోరితే మీ అందరి ముందూ నేనుంటా. కడుపుకాకలైతే  పిడికెడు బిర్యానీ పార్సిల్ కట్టిస్తా. గొంతెండిపోతే గుక్కెడు బీరు పోయిస్తా. ఆర్గ్యుమెంట్ కొస్తే..అడ్డదిడ్డం గా వాదించే…. అప్పల్రాజు నవుతా..!
నేనుః నువ్వు అప్పల్రాజువి కాదురా… నీ చుట్టూ ఉన్నోళ్ళని ముంచెయ్యడానికొచ్చిన మూర్ఖ శిఖామణివీ. మూస్కోరా నోరూ.!
కండక్టరుః  ఇలా అయితే బస్ పోలీస్ స్టేషన్కెళతాది[ వణుకుతున్న వాయిస్ తో]

"
పోలీస్ స్టేషన్ అంటే భయపడతామా? ఆళ్ళకీ నీకూ పగిలిపోద్ది. తీసుకెళ్ళు.. నీకు దమ్ముంటే తీసుకెళ్ళేస్.." అని రిప్లై ఇచ్చారీళ్ళు. డ్రయివర్ స్టీరింగొదిలేసి తలపట్టుక్కూర్చున్నాడు.[మా ఊరి పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటే 6km వెనక్కి వెళ్లాలి మళ్ళీ ]. బుద్ధున్నోడెవడూ అంతదూరం బస్ వెనక్కి తీసుకెళ్ళి టైం వేస్ట్ చేసుకోడు.  కానీ అనూహ్యం గా బస్ యూ టర్న్ తీసుకొని వెనక్కి తిరిగింది.నిజానికది యూ టర్న్ కాదు మా పాలిట రాంగ్ టర్న్.
మరికొద్ది నిమిషాల్లో మా జీవితాలు స్పైసీ గా మారబోతున్నాయని సంకేతాలందాయ్ నాకు. ఏం జరగబోతుందో తెలుసుకోడానికి నేను కళ్ళు మూసుకొని యోగ సమాధి లోకెళ్ళాను. "పోలీస్టేషనొచ్చింది దిగండీ" అన్న కండక్టర్ పిలుపుకి  తెలివొచ్చింది.


To be continued...