Monday, January 30, 2012

అప్పిగాడి ఆగడాలు - 2

ది ఎమ్సెట్ ర్యాంకో, మా ల్యాండ్ లైన్ నంబరో తెలీక మేమే కన్ఫ్యూజ్ అయిపోయే అయోమయం లో నేనూ, అప్పల్రాజుగాడూ, హిట్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ లాగా, స్టూడేంట్స్ కోసం ఎదురుచూస్తున్న మా ఇంజినీరింగ్ కాలేజ్ లో జాయినయిపోయాం.
రోజూ మా ఊరినుండి సగం దూరం R.T.C బస్ లోనూసగం నుండి కాలేజ్ బస్సు లోనూ నిద్రమత్తులో 
కాలేజ్ కెళ్ళొస్తూక్లాస్ లో  శీతాకాల సుప్తావస్థ లో ఉండే కప్పల్లాగా నిదరోయే గమ్మత్తయిన రోజులు అవి.


మా మైక్రోవేవ్స్ మ్యాడమ్ కుడిచేత్తో మా ఇంటర్నల్ ఎగ్జాం పేపర్లు పట్టుకొనిఎడం చేత్తో ముక్కు తుడుచుకుంటూ
తుమ్ముకుంటూ [మా మెదళ్లకి పట్టిన దుమ్ము మరిహార్న్ రిపేరొచ్చిన స్టీరింగ్ ఆటో లాగా క్లాస్ లో కొచ్చారు, తన 
సబ్జెక్ట్ పట్టుమని పదిమందయినా పాసయ్యేట్టు కనిపించట్లేదని  పనిలోపని గా కళ్ళు కూడా తుడుచుకుంటూ 
పేపర్లివ్వటం మొదలెట్టారుఅందరి పేపర్లూ ఇచ్చేసి చివారఖరున ఒక ఆన్సర్ పేపర్ పైకెత్తి పట్టుకొని 
"ఇక్కడ వీ డాట్  [V.A] ఎవరమ్మా?" అనడిగేరు.అప్పటివరకూ  చెరువొడ్డున చేపల సంత లాగా ఉన్న క్లాసంతా చేస్తున్న గోల ఆపేసీ చెవులు రిక్కించింది. చివరి బెంచ్ లో సినిమా పాటల పుస్తకాలు చదువుకుంటున్న "విజయ్ బాబు & కో" పాటలాపేసి తలలు పైకెత్తారు. చేతులు మారుతున్న చీటీ మెసేజ్ లు సగం లోనే ఆగిపోయాయి. అందరి కీ అదొక పజిల్ లాగా ఉందిభూతద్దాలు చెరో కంటికీ బిగించేసుకొని " 150/100 తెచ్చుకోటం ఎలా?" అనే కాన్సెప్ట్ మీద మినీ ప్రాజెక్ట్ చేస్తూ  జుత్తు రాలిపోయేలా ఆలోచించే మా క్లాస్ టాపర్ తాతాజీ గాడు పీడకలొచ్చి నిద్రలేచినోడిలాగా అరుస్తూ "V.A means Vertical asymptotes మ్యాడమ్. Vertical asymptotes are vertical lines near which the function y = f(x) grows without bound" అనేసీ మా వైపు తిరిగీ ముక్కు మీద జారిపోతున్న భూతద్దాలు పైకెత్తి గర్వం గా నవ్వేడు.
మ్యాడమ్ : నేనడిగేది అది కాదు.
తాతాజీ :  Oh..Shitttt... but i got it.  V.A means "volt-ampere". it  is the unit used for ....
మ్యాడమ్ : నువ్ నీ వికీ నాలెడ్జ్ కాసేపు ఆపుతావా? ఇక్కడ నేనేమన్నా ఆన్సర్ చెప్పినోళ్ళకి చాక్లెట్లిస్తానని చాటింపేశానా?......... మేటర్ అది కాదు.  పేపర్ ఎవరిదండీ?
సైలెంట్ గా స్టేజ్ దగ్గరకి సిసింద్రీలా దూసుకొచ్చిన అప్పల్రాజు గాడు "నాదే మేడమ్" అంటూ మోటుగా పేపర్ లాక్కోబోయాడు. 
మ్యాడమ్ : మరి పేరు V.A అని రాశావ్?
అప్పల్రాజుః  నేనే..  "వాసిపల్లి అప్పల్రాజు" -> V.A
మ్యాడమ్ : షార్ట్ కట్లేమిటండీ? ఆన్సర్ షీట్ మీద పేరు రాయటానికి నీకు  బద్దకమా? ఒళ్ళు బలుపా, తలపొగరా?   
అప్పల్రాజూః తల 45 డిగ్రీల కోణం లో పెట్టీ, పళ్ళు బయటెట్టీ, నాలుక మడతెట్టీ, కళ్ళూ చెవులూ పెద్దవి చేసి, సౌండ్ రాకుండా నవ్వుతూ..
మ్యాడమ్ : అడిగేది నిన్నే...బదులివ్వకుండా నవ్వేంటీ? చాలా ఇరిటేటింగ్ గా ఉంది నాకు.
అప్పల్రాజుః సేం ఎక్స్ప్రెషన్ మైంటైన్ చేస్తూ కుడిచేత్తో క్రాఫ్ సరి చేసుకుంటూ..  
మ్యాడమ్ : నువ్ చేసింది పెద్ద మిస్టేక్ కాదు. కానీ ఇప్పుడు చేస్తున్నది మేనర్స్ కాదు. అడిగిందానికి సమాధానం చెప్పవేం?
అప్పల్రాజుః [నన్ను కాదు అన్నట్టూ గెడ్డం గోక్కుంటూ, కిటికీ లోంచి కాకుల జంటని ఆరాధన గా చూస్తూ..] 

" ఛీ నా జీవితం. ఎగ్జాం పేపర్ మీద షార్ట్ సిగ్నేచర్ చేసేవాడి రిప్లై కోసం వెయిట్ చెయ్యటం నాదీ తప్పు. మళ్ళీ మీ క్లాస్ కి వస్తానేమో చూడండీ..Final exams లో మాత్రం ఇలా రాసి తగలడకు. " అనరిచేసీ, చేతిలో ఉన్న చాక్ పీస్ పిండి పిండి చేసుకుంటా బయటకెళ్లిపోయారు మేడం.

***********************************************************

సమయం: ఆరోజు సాయంత్రం 
సంధర్భం: బస్ స్టాప్ లో ఆల్ స్టాప్ ఎర్ర బస్ కోసం నాన్ స్టాప్ గా వెయిట్ చేస్తా ఉన్నాం.
మూడీ గా ఉన్న అప్పిగాడిని చీరప్ చెయ్యటానికి "ఏరా..నాకాకలేస్తుంది. ఏమన్నా తీసుకురానా నా డబ్బుల్తో? " అనడిగేను.
అప్పల్రాజుః " రోజు నేను ఉపవాసం రా.. రెండు ప్లేట్స్ బజ్జీలు తీసుకో చాలు
నేనుః ఇలా అన్నానని కాదుగానొరే.. పాపం మేడమ్ అంతసేపడిగినా రిప్లై ఇవ్వకపోవటం పొగరు కాకపోతే మరేటెహే?
అప్పల్రాజుః ఏం చెప్పాల్రా? ఆన్సర్ షీట్ మీద సరదాగా సిగ్నేచర్ చేశానంటే సిల్లీగా తీసుకుంటాదా? జస్ట్ లైక్ దట్ రాసానంటే జాలిపడి వదిలేస్తుందా? పోనీ పేరు మరిచిపోయానని నిజం చెప్తే మురిసిపోయి బోనస్ మార్కులేస్తాదా? నా టైం బ్యాడ్ అంతే."
అనేసీ, తెచ్చినవి తినేసీ, ఆవేశంగా ఆగిన బస్సెక్కి కూర్చున్నాడు. అది L.H(limited halts) సెర్వీస్ బస్.అందులో స్టుడెంట్ మంత్లీ పాస్ లు అల్లో చెయ్యడు. కాలేజ్ లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల కసి మీదున్నాడో, అప్పుడే తిన్న మిరపకాయ బజ్జీల వల్ల నోరుమండిపోతుందో తెలీదు గానీ స్టూడెంట్స్ అందర్నీ బస్ ఎక్కీంచీ, మా బస్ పాస్ లు ఎందుకు ఆక్సెప్ట్ చెయ్యటం లేదన్న విషయం మీద కండక్టర్ తో గొడవెట్టుకున్నాడు అప్పల్రాజు గాడు.
 
స్టూడెంట్స్ అందరూ దిగే వరకూ బస్ కదలదని కండక్టరూ , దిగే ప్రశ్నే లేదని అప్పిగాడూ పంతం పట్టుక్కూర్చున్నారు. గొడవ అలా అలా పెద్దదవుతుంది. కొంత మంది అప్పిగాణ్ణి కమాన్ కమాన్ అని క్లాప్స్ కొట్టీ ఎంకరేజ్ చేస్తున్నారు. ప్యాసింజర్స్ లో కొంత మంది ఆడలేడీసు ఆ డ్రయివర్ సచ్చినోడు బస్సు తియ్యట్లేదనీ, ఈ మాయదారి స్టూడెంట్ సచ్చినోళ్ళే 
ఆపేసేరనీ వినిపించీ వినిపించకుండా తిడతున్నారు. 
 నేను ఆల్రెడీ విషయం లో ఒకసారి దెబ్బ తినేసి ఉండటం తో వ్యూహాత్మక మౌనం పాటిస్తూ, బస్ దిగేశాను. నన్ను చూసి ఎందుకొచ్చిన గొడవలే అనుకొని ఒక్కొక్కరూ దిగేశారు. సపోర్టర్స్ ఎవ్వరూ లేక " యాభయ్యో ఓవర్లో, డక్కౌటయిన ఓపెనర్" లాగా వచ్చిన అప్పిగాడు "అంత గొడవ జరిగితే నాకు సపోర్ట్ చెయ్యటం మానేసి బస్సు దిగేస్తావా? నా పిడివాదం వల్ల అదే కండక్టర్ పాస్ లు allow చేస్తే మాత్రం ఎంచక్కగా కూర్చుంటావ్. అక్షరాలా అవకాశవాదివి రా నువ్వూ.. గొప్ప పని చేసినప్పుడు పొగడటమ్ గొప్ప కాదురా..గొప్ప పని చేస్తున్నప్పుడు సపోర్ట్ చెయ్యటం గొప్ప" అని నన్ను ఎడా పెడా ఏకిపరేశాడు.  గొప్ప డవిలాగ్ నాకు సరిగా అర్ధం కాక ఒన్స్ మోర్ అన్నాను.

"
మంచి పని చేసినప్పుడు మెచ్చుకోకపోవటం ఎంత తప్పో... గొప్ప పని చేస్తున్నప్పుడు గుర్తించి ఎంకరేజ్ చెయ్యకపోవటమూ అంతే తప్పు"

**********************************************************************************************
మర్నాడు.. మా కర్మకాలీ మేం రోజూ ఎక్కే బస్ క్యాన్సిల్ అయ్యింది. ముందు రోజు ఫెయిలయిన తన హీరోయిజాన్ని చూపించడానికి అప్పిగాడు అవకాశాన్ని అలుసుగా తీసుకున్నాడు.
రాజన్న సినిమా లో నాగార్జున లాగా ఒత్తుల్లేని డవిలాగులు వాడిగా వదిలీ  స్టూడెంట్స్ అందర్నీ మోటివేట్ చేసీ 
L.H బస్ ఎక్కీచాండు.  టికెట్ తీసినా , మారు మాట్లాడినా బాగోదని నాకు వార్ణింగ్ ఇచ్చాడు."ఎర్రబాబుఅనే గవర్న్మెంట్ డిగ్రీ కాలేజ్ కుర్రోణ్ణి దాదాపు గా హిప్నటైజ్ చేసేసీ వీడి తిక్కంతా వాడికెక్కించాడు. టికెట్స్ తీసుకోమన్న కండక్టర్ తో తీసే ప్రసక్తే లేదని మర్కట ద్వయం కారం తిన్నకోతుల్లాగా అరిచీ, గోల చేసీ రచ్చ రచ్చ చేస్తున్నారు. మోకాల్లో నిద్రోతున్న నా  సెవెంత్ సెన్స్  చెవిలో జోరీగ లాగా గీపేట్టి నన్ను మేల్కొలిపింది. తొమ్మిదింటికి కి ఇంటర్నల్ ఎగ్జాం ఉందనీ, ఈ టైం లో గొడవొద్దనీ అప్పల్రాజు గాడికి గుర్తుచెయ్యబోతుంటే, గొడవలంటే గీరెక్కిపోయి, ఇరువర్గాలనీ రెచ్చగొట్టి రసస్పూర్తి పొందే కిరణ్ రాజ్ గాడు నా హాట్ ప్యాక్  లోంచి గుడ్డు తీసి నోట్లో కుక్కి నా నోరు నొక్కేశాడు. అప్పల్రాజు గాడు వేస్తున్న కేక లకి కలిగిన భయాన్నికండక్టర్ కళ్ళల్లో  చూశాన్నేను. ముందురోజు చూసిన ఛత్రపతి సినిమా  ఎఫెక్ట్ ఏ రేంజ్ లో చూపించాడంటే………….







"ఏయ్.. కండక్టర్..! ఆర్డినరీ బస్సయినా, ఎక్స్ప్రెస్ సెర్వీసయినా,వీకెండయినా, వీక్ డేస్ అయినా, చిల్లర లేదన్నా, పాస్ చెల్లదన్నా... నీ సంచిలోని చిల్లర తో మా పాకెట్లు నిండుతాయ్. చేతిలోని టిక్కెట్లన్నీ చెల్లాచెదురవ్వు..తాఆఆయ్"
డియర్.. ఫ్రెండ్స్.. & కాబోయే గర్ల్ ఫ్రెండ్స్.. ఈ రోజు నుండీ మీ అందరి బతుకులూ మారాయ్. డ్రయివర్ బెదిరిస్తే బెదిరిపోయి, కండక్టర్ అదిరిస్తే అదిరిపోయే పిరికితనాన్ని సమాధి చెయ్యండి. జేబులోని చిల్లరంతా లాగేసుకొనీ, బొక్కలెట్టిన టికెట్టు చేతికిస్తే దాచుకొనే బానిస బతుకు చచ్చింది.  ఇకపై మీరు బస్సెక్కేది పాస్ లు చూపించడానికి. టికెట్ కి తియ్యడానికి కాదు. తల దించుకోవలసింది పాస్ ఎక్స్పైర్ అయినప్పుడు. టికెట్ ఎగ్గొట్టినప్పుడు కాదు. మనీ మనదీ, ప్రయాణం మనదీ, పెత్తనం మనదీ. ఈ బస్ మనందరిదీ దీనిని పరిశుభ్రం గా ఉంచుదాం. ఈ ఆరాటం పోరాటాన్ని కోరితే మీ అందరి ముందూ నేనుంటా. కడుపుకాకలైతే  పిడికెడు బిర్యానీ పార్సిల్ కట్టిస్తా. గొంతెండిపోతే గుక్కెడు బీరు పోయిస్తా. ఆర్గ్యుమెంట్ కొస్తే..అడ్డదిడ్డం గా వాదించే…. అప్పల్రాజు నవుతా..!
నేనుః నువ్వు అప్పల్రాజువి కాదురా… నీ చుట్టూ ఉన్నోళ్ళని ముంచెయ్యడానికొచ్చిన మూర్ఖ శిఖామణివీ. మూస్కోరా నోరూ.!
కండక్టరుః  ఇలా అయితే బస్ పోలీస్ స్టేషన్కెళతాది[ వణుకుతున్న వాయిస్ తో]

"
పోలీస్ స్టేషన్ అంటే భయపడతామా? ఆళ్ళకీ నీకూ పగిలిపోద్ది. తీసుకెళ్ళు.. నీకు దమ్ముంటే తీసుకెళ్ళేస్.." అని రిప్లై ఇచ్చారీళ్ళు. డ్రయివర్ స్టీరింగొదిలేసి తలపట్టుక్కూర్చున్నాడు.[మా ఊరి పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటే 6km వెనక్కి వెళ్లాలి మళ్ళీ ]. బుద్ధున్నోడెవడూ అంతదూరం బస్ వెనక్కి తీసుకెళ్ళి టైం వేస్ట్ చేసుకోడు.  కానీ అనూహ్యం గా బస్ యూ టర్న్ తీసుకొని వెనక్కి తిరిగింది.నిజానికది యూ టర్న్ కాదు మా పాలిట రాంగ్ టర్న్.
మరికొద్ది నిమిషాల్లో మా జీవితాలు స్పైసీ గా మారబోతున్నాయని సంకేతాలందాయ్ నాకు. ఏం జరగబోతుందో తెలుసుకోడానికి నేను కళ్ళు మూసుకొని యోగ సమాధి లోకెళ్ళాను. "పోలీస్టేషనొచ్చింది దిగండీ" అన్న కండక్టర్ పిలుపుకి  తెలివొచ్చింది.


To be continued...

37 comments:

sarma said...

pl continue. very good narration

రసజ్ఞ said...

టపా మొదలే అదిరింది! ఎమ్సెట్ ర్యాంకో, మా ల్యాండ్ లైన్ నంబరో తెలీక పాపం మరీ ఇంత అమాయకులైతే ఎలా అండీ ;) కిటికీ లోంచి కాకుల జంటని ఆరాధన గా చూస్తూ.. కేవ్వ్వ్వవ్ హహ ఛత్రపతి పేరడీ బాగుంది! మొత్తంగా టపా ఎప్పటిలాగానే సూపరు! పాపం మీ పరీక్షో?

గిరీష్ said...

చత్రపతి డైలాగ్ అరుపులు
>>తల దించుకోవలసింది పాస్ ఎక్స్పైర్ అయినప్పుడు. టికెట్ ఎగ్గొట్టినప్పుడు కాదు.>>
కేక రాజ్.. waiting for spicy episode.. :)

Raviteja said...

jyothilakshmi dance chesinattu
kanipinchi kanipinchakunda..
chupinchi chupinchakunda...
thinesindevaru....??
Asalem jarigindi...em jaruguthondi...em jaragabothondi.... nakippude theliyali..theliyali..thelisi theerali....!! story continue chainde sir :D

చాణక్య said...

నాకు విపరీతంగా నచ్చిన పంచ్ డైలాగులు:

*అది ఎమ్సెట్ ర్యాంకో, మా ల్యాండ్ లైన్ నంబరో తెలీక మేమే కన్ఫ్యూజ్ అయిపోయే అయోమయం లో నేనూ, అప్పల్రాజుగాడూ, హిట్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ లాగా, స్టూడేంట్స్ కోసం ఎదురుచూస్తున్న మా ఇంజినీరింగ్ కాలేజ్ లో జాయినయిపోయాం.

*సపోర్టర్స్ ఎవ్వరూ లేక " యాభయ్యో ఓవర్లో, డక్కౌటయిన ఓపెనర్" లాగా వచ్చిన అప్పిగాడు

*ఛత్రపతి డైలాగులు చింపి ఆరేశారు.. :)))

*పోలీస్ స్టేషన్ అంటే భయపడతామా? ఆళ్ళకీ నీకూ పగిలిపోద్ది. తీసుకెళ్ళు.. నీకు దమ్ముంటే తీసుకెళ్ళేస్.....(ఇది అరాచకం. మనూరి ట్రేడ్‌మార్క్ డవిలాగు) :D

SHANKAR.S said...

నాకు మీ తాతాజీ అస్సలు నచ్చలేదు.ప్రశ్నకి సంబంధం లేని జవాబులు చెప్పే తింగరి సన్నాసి.

అప్పి సూపర్. అసలు ఆన్సర్ షీట్ మీద ఇనీషియల్స్ వేసి వదిలేయాలనే ఆలోచన నేను చదువుకునే రోజుల్లో నాకు రానందుకు తీవ్రంగా బాధపడుతున్నాను. వాటే క్రియేటివిటీ!!

"మంచి పని చేసినప్పుడు మెచ్చుకోకపోవటం ఎంత తప్పో... గొప్ప పని చేస్తున్నప్పుడు గుర్తించి ఎంకరేజ్ చెయ్యకపోవటమూ అంతే తప్పు"

నిజమే కదా. అసలు నీలాంటి వాళ్ళు వెనక్కాల ఉండటం వలెనే అప్పి లాంటి ఒక గొప్ప లీడర్ ని ఈ రాష్ట్రం, వీలైతే దేశం కోల్పోయిందేమో రాజ్. నువ్వు ఘోరమైన చారిత్రక తప్పిదం చేశావు. నీ వలెనే ఒక మహానాయకుడు సామాన్యుడిగా మిగిలిపోయాడు. నీ పాపానికి నిష్కృతి లేదు రాజ్...నిష్కృతి లేదు. :((((

పోలీస్ స్టేషన్లో పోలీసుల దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిన ఘట్టం కోసం వెయిటింగ్.

(ఇది అప్పి క్యారెక్టర్ చూసిన తర్వాత నా గాఠి నమ్మకం)


గమనిక: ఈ పోస్ట్ లో నీ పంచ్ ల గురించి చెప్పడం అంటే మన సుమన్ బాబు మహానటుడు అని మరొక్క మారి ప్రకటించడం లాంటిదే అని భావించి వాటి గురించి రాయలేదు. అయినా నా dts ఆపుకోలేక ఒక్క మాట చెప్పదలచుకున్నాను


"కుమ్మేశావంతే :)"

ఫోటాన్ said...

రాజ్,,, ఇరగదీసావ్... :))

అప్పీ కేక... :)))

Sravya Vattikuti said...

ఇంతకీ ఏంటి నిజం గానే పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా ఏంటి ?

పోస్టు మాత్రం సూపర్ రాజ్ ! నిజం గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఉంటె ఆహా నెక్స్ట్ పోస్టులో బీభత్సం ఇంట్లో క్లాస్ , కాలేజ్ లో క్లాస్ :)))

సుజాత said...

తర్వాతేమయింది ఛత్రపతీ...సారీ, రాజ్, త్వరగా చెప్పండీ? చెప్పండీ?

ప్రతి డైలాగూ నేను కూడా కోట్ చేయలేక వదిలేస్తున్నా ఈ సారికి!

awesome:-))

karthik said...

తరువాత పోస్ట్ లో మిమ్మల్ని స్టేషన్ లో వేసి సుమన్ బాబు సినిమా ఫ్యాన్స్ షో చూపించారని నాకు బలంగా అనిపిస్తోంది.. అంతేనంటావా??

rajachandra akkireddi said...

హహ్హహ.. అంతకన్న నేను ఏమి రాయలేను :)

వేణూ శ్రీకాంత్ said...

ఛత్రపతి అరుపులు రాజ్ :-)
అసలు ఓపెనింగే అదిరింది :)

శశి కళ said...

ఇకపై మీరు బస్సెక్కేది పాస్ లు చూపించడానికి. టికెట్ కి తియ్యడానికి కాదు. తల దించుకోవలసింది పాస్ ఎక్స్పైర్ అయినప్పుడు. టికెట్ ఎగ్గొట్టినప్పుడు కాదు. మనీ ....ha...kaakula janta...బాబు పొలికల్లొ నీకు సాటి యెవరు లెరు?ఇంతకి పరీక్ష వ్రాశారా లెద?హ...హ...)))

avve said...

excellent

SHANKAR.S said...

ఇందాకా నా కామెంట్లో అప్పుతచ్చు పడింది. అర్ధం మారిపోతోంది కాబట్టి మళ్ళీ ఇంకో సవరణ కామెంట్ పెడుతున్నా:).

" నీ వలెనే ఒక మహానాయకుడు సామాన్యుడిగా మిగిలిపోయాడు."

దీన్ని

"నీ వల్లనే ఒక మహానాయకుడు సామాన్యుడిగా మిగిలిపోయాడు."

నిషిగంధ said...

ఎమ్సెట్ ర్యాంకో, మా ల్యాండ్ లైన్ నంబరో తెలీక - :)))))))

యాజ్ యూజువల్ హిలేరస్ కానీ ఛత్రపతి వీడియోతో బోల్డంత ఎక్కువ నచ్చేసిందీ టపా :))

chubby said...

ha ha ha rajku....very nice :):):)

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>>అది ఎమ్సెట్ ర్యాంకో, మా ల్యాండ్ లైన్ నంబరో తెలీక ….
>>>"ఈ రోజు నేను ఉపవాసం రా.. రెండు ప్లేట్స్ బజ్జీలు తీసుకో చాలు
>>>గొప్ప పని చేసినప్పుడు పొగడటమ్ గొప్ప కాదురా..గొప్ప పని చేస్తున్నప్పుడు సపోర్ట్ చెయ్యటం గొప్ప"
నాగార్జున లాగా ఒత్తుల్లేని డవిలాగులు వాడిగా వదిలీ…

సూపర్ అంతే. మాటల్లేవు. ఓన్లీ కేకలు, కెవ్వులు.

sagittarian@27 said...

మీరు భలే వాళ్ళండి బాబు! మాంచి suspense లో వదిలారు మమ్మల్ని! eagerly waiting now!
మీరెక్కడుంటారో తెలిస్తే వచ్చి అడిగేస్తాను అదేంటో !!

reglreader,
ప్రకాష్

KumarN said...

హ హ హ ఇప్పుడే రెండు పార్టులూ చదివాను. జింబ్లీ ఆజమ్(kerala basha lendi).

I am jealous. Eamcet ranks సెల్ ఫోన్ నెంబర్లలా ఉండాలి కానీ, లాండ్ లైన్ నెంబర్లలా ఉండటమేమిటి, అసహ్యంగా.....జాతి ద్రోహులు :-))


---బస్ స్టాప్ లో ఆల్ స్టాప్ ఎర్ర బస్ కోసం నాన్ స్టాప్ గా వెయిట్ చేస్తా ఉన్నాం
---డియర్.. ఫ్రెండ్స్.. & కాబోయే గర్ల్ ఫ్రెండ్స్.
---వ్యాకరణానికీ, గ్రామకరణానికీ తేడా తెలీని ఘనుడివి కదరా నువ్వూ
---అది ఎమ్సెట్ ర్యాంకో, మా ల్యాండ్ లైన్ నంబరో
---తోలు తెల్లగా ఉంటే తిక్క తలకెక్కకుంటాదా?
---చటుక్కున కోడి తిప్పినట్టూ తల తిప్పేసుకుంది
---మనసు మంచిదీ, గుణం గుడ్డిదీనూ
--హైస్కూల్ లో ఉన్నప్పుడు ఎడారి లో ఆముదం చెట్లలాంటి మేము, ఇక్కడ తులసివనం లో గంజాయ్ మొక్కల్లాగా నిలబడిపోయిన మేము, కృష్ణవంశీ కి ప్రొడ్యూసర్లు దొరికినట్టూ దొరికేశాం
--అప్పుడే కొన్న సెవనోక్లాక్ బ్లేడ్ తో పెన్సిల్ చెక్కేటప్పుడున్నంత జాగ్రత్తగా అమ్మాయిల్తో ఉండాలని అర్ధమయ్యిమ్ది..

రాజ్ కుమార్ said...

@Sarma garu.. sure..:) thnQ :)

రసజ్ఞ..! అమాయకులం కాదండీ తెలివెక్కువయ్యిపోయీ అలా వచ్చింది ర్యాంకు. ధన్యవాదాలు. డౌట్స్ నెక్స్ట్ పార్ట్ లో క్లారిఫై చెయ్యబడును ;)

గిరీషూ... థాంక్యూ.. ఊర స్పైసీ.. రేపే విడుదల ;)

రాజ్ కుమార్ said...

రవితేజ గారూ.. కొంచెం వెయిట్ చెయ్యండి లెంగ్త్ ఎక్కువయ్యిందని ఆపేశాను ;) థాంక్యూ అండీ

చాణక్యా.. థాంకులు..థాంకులు.;) ఎంతైనా నేటివిటీ అబ్బాయ్ ఆ మాత్రం ఘాటు ఉంటాది మరి ;)

శంకర్ గారూ.. హిహిహి "మహానాయకుడు" అవుతాడండీ.. ఏదో ఒకరోజు. వాడికి పాలిటిక్స్ ఇంట్రస్ట్. బ్యాక్ గ్రౌడ్ కూడా అదే..

సుమన్ బాబు తో నన్ను పోల్చారా? ఆహా..ఓహో.. కుయ్యో..మొర్రో... ;)
మీకు లెక్కలేనన్ని థాంకులు.. ;)

రాజ్ కుమార్ said...

ఫోటానూ.. థాంక్యూ.. ;)యెస్.. అప్పీ రాక్స్

శ్రావ్య గారూ.. సందేహాలకి సమాధానాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో ;) ధన్యవాదాలు ;)

సుజాత గారూ... ధన్యవాదాలండీ. చత్రపతి కాదండీ చిత్తయిన పతి ;)

రాజ్ కుమార్ said...

@కార్తీక్.. దాదాపు అలాంటిదే.. ;) నెనర్లు ః)

@rajachandra akkireddi గారూ థాంక్యూ అండీ

వేణూజీ.. థాంక్యూ.. మా వాడి లో చాలా వేరియేషన్స్ ఉన్నాయ్ ;)

శశిగారూ.. థాంక్యూ.. చెప్తా చెప్తా అన్నీ వివరంగా ;)

రాజ్ కుమార్ said...

@avve thnQ ;)

@chubby thnQ.. u know all these things ;)

Sankar గారూ నేను అబ్జర్వ్ చెయ్యలేదండీ. మీరు అనుకున్న మీనింగ్ నే నేనూ అనుకున్నా.. హహహ్ థాంకులు ;)

రాజ్ కుమార్ said...

నిషి గారూ.. ధన్యవాదాలండీ.. ;)

బులుసుగారూ.. ధన్యవాదః. అరుపులూ,కేకలూ నా? కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్ ;) థాంక్యూ సర్

రెగ్యులర్ రీడర్ ప్రకాష్ గారూ.. కొంచెం వెయిట్ చెయ్యండి.అంత టెన్సన్ పడిపోయేంత లేదుః
థాంక్యూ సో మచ్.

రాజ్ కుమార్ said...

kumar N గారూ. చాలా థాంక్స్.. మీకు కూడా నచ్చినందుకు ఫుల్ హ్యాపీస్ ;)thq so much 4 ur big comment sir ;)

శ్రీనివాస్ పప్పు said...

కుమ్మేసి ఇరగదీశావంతే చెప్పడానికి మాటల్లేవు పొట్ట పగుల్స్

Raj said...

బాబోయ్.. నాయనోయ్.. ఏం పంచులు బాబు అవి.. పంచ్ పలక్నామా లాగా ఉన్నావ్ గా...

టపా కెవ్వు కేకలంతే.. ఇంతకీ ఏమంటారు.. రేపటి దాకా ఎదురు చూడాలి అంటారా?? నేను నిద్ర పోకుండా ఎదురు చూస్తా...
(night shift కదా... :P)

రాజ్ కుమార్ said...

పప్పుసారూ.. ధన్యవాదాలూ...

రాజేంద్రా.. అలాగే..థాంక్యూ సో మచ్ ;)

మధురవాణి said...

Hilarious post Raj.. as always! :)

<<<డియర్.. ఫ్రెండ్స్.. & కాబోయే గర్ల్ ఫ్రెండ్స్..
ROFL.. :)))))))))

ఆ.సౌమ్య said...

సూపరెహే...కుమ్మేసావు.
మిగతా కామెంటు తరువాతి పోస్టులో

ఆ.సౌమ్య said...

మీ అప్పిగాడు నాకు తెగ నచ్చేసాడు...అందరికీ ఎంత హాస్యాన్ని పంచుతున్నాడు! మొత్తనికి అప్పారావు భలే కేండిడేట్. లాస్ట్ పోస్ట్లోనూ, ఈ పొస్ట్ లోనూ పంచులు కేక...ఇది అని ప్రత్యేకంగా చెప్పలేను...వేటికవే సాటి. ఇప్పటినుండీ నిన్ను పంచుల రాజ్ అని పిలవాలేమో!

మీ అప్పారావు మాయ కి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు! రాబోయే రోజుల్లో వాళ్ళావిద ఇంకెన్ని చెబుతుందో! :)

శేఖర్ (Sekhar) said...

పంచ్ ల తో జర్నీ బాగుంది...next episode చదివి మళ్లి వస్తా

రాజ్ కుమార్ said...

సౌమ్యగారూ.. ధన్యవాదాలు.. ;)
అప్పల్రాజు అంతే.. అందరికీ నచ్చేస్తాడు ;)
పంచుల రాజ్ నా? జనాలు అపార్ధం చేసుకుంటారేమో నండీ ;)

శేఖరూ థాంక్యూ సో మచ్.. ఇంత లేట్ గానా చదివేదీ? ఆయ్...!

Found In Folsom said...

Hammaaa....super....rofl....

రాజ్ కుమార్ said...

Found In Folsom gaaroo..
thnQ so much :)