Sunday, April 28, 2013

షాడో.... ది ఎండో..!!


 "గాలిని ముట్టుకోలేవ్.. మంటని తట్టుకోలేవు... ఈ షాడోని పట్టుకోలేవ్... నేనొక మిస్టరీ... మీరంతా చూడబోయేదీ... నా విక్టరీ"సరికొత్త విచిత్ర కేశాలంకరణ తో కడుపంతా గరిటపెట్టి దేవేసేంత స్టైలింగ్ తో ఎంకటేష్ బాబు మెరిసిపోతుండగా తుపాకీ మోతలతో కార్ల కీచు శబ్దాలతో కూడిన ట్రైలర్ చూసినప్పుడే డిసైడైపోయాను ఇది U SQUARE movie కాదూ శక్తి స్క్వేర్ మూవీ అని.
"వెంకటేసుల తర్వాత సినిమా మెహర్ రమేష్ దర్శకత్వం లో భారీ గా ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటుందీ" అన్న వార్త రాంగానే నాకు బాబు మీద జాలేసింది. కానీ ఈరోజు మాత్రం గర్వం గా ఉంది. మా ముత్తాతల కాలం నాటి కధని దాదాపు అదే టేకింగ్ తో తీస్తానంటే చెయ్యడానికి ఒప్పుకున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలీ? ఎంత త్రెడ్ తెగింపు ఉండాలీ??

ఇదేమీ సస్పెన్స్ సినిమా కాదు గనక...కధ చెప్పినా మీరు మిస్సయ్యేదేమీ లేదు గనక.. ఆ మాటకొస్తే కధే లేదు గనక మొదట్నుండీ చెప్తాను.
మొట్టమొదటేమో... సింహం ఒకటి పరిగెట్టుకుంటూ వస్తాదన్న మాట. ఏ సర్కస్ కంపెనీ నుండో పారిపోయి వచ్చేస్తుందేమో అనుకున్నా. హాల్ నుండి బయటకెళ్ళేటప్పుడు "మీ పరిస్థితి ఇంతే" అని సింబాలిక్ గా చెప్పేడు మన రమేషు.

మన "తమ్ముడన్నయ్య" నాగబాబు ఉన్నాడు కదా. సినిమాలో తన పేరు "రఘురాం" ఆ బాబు అడ్డపాయ తీసి హెయిర్ స్ట్రైటెనింగ్ చేయించిన విగ్గుని నెత్తి మీద పెట్టుకొని(అది శక్తి సినిమాలో ఎన్టీఆర్ కి వాడిన విగ్గే అని నా డౌటనుమానం) ఒక "డాన్" దగ్గర నమ్మకంగా పని చేస్తూ వాడి రహస్యాలన్నీ కనిపెట్టి "Operation Shadow" అనే పుస్తకం (ఆధారాలతో ఉన్న ఫైల్) రాస్తాడు.ఈ పొడుగైన బాబుకి ఒక తెల్లని భార్య, చిన్నారి కూతురు, పగపూరిత కొడుకు(హీరో.. హీరో బాలషాడో). ఇంత రిస్క్ చేసి విలన్ల దగ్గర అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్నాడంటే నాగబాబు "పోలీసాఫీసరేమో??" అనుకున్నాన్నేను. కానీ అదే ట్విస్ట్.... నాగ బాబు తను పనిచేసే న్యూస్ పేపర్లో విలన్ చరిత్ర ప్రచురించడానికి అంతకు తెగిస్తాడు. విలన్ కి అసలు విషయం తెలిసిపోయి అందర్నీ చంపేసి ఆధారాలు పట్రమ్మని మనుషుల్ని రఘురాం ఇంటికి పంపిస్తాడు. భార్య, కూతురు తప్పిమ్చుకొని పడవెక్కేయగా, రఘురాం, కొడుకు రాజారాం విలన్లకి దొరికేస్తారు. "దేశం కోసం చెడుపక్కనే తిరుగుతూ మంచి కోసం పని చేసిన" రఘురాం ని కొడుకు కళ్ళముందే చంపేస్తాడు విలన్. కోపమొచ్చిన పిల్లాడు చాకచక్యంగా పక్కవిలనీయుడి కత్తి తీసుకొని తెగువగా ఒకడ్ని చేతి మీద పొడిచేసీ తెలివిగా తప్పించుకొని ధైర్యంగా పారిపోతాడు (అంత మంది రౌడీలని తప్పిమ్చుకొని ఎలా పారిపోయాడూ? అని అడగొద్దు. అదో మిస్టరీ). అమ్మ, చెల్లి ఎక్కిన పడవ దగ్గరకి వెళ్ళేసరికీ, విలన్ గ్రూప్ లో ఒక గోవిందం ఆ పడవ మీద బాంబ్ వేసేయడంతో పడవ పేలిపోద్ది. 

ఆ రోజు రాత్రి విచారం తో వర్షం లో కూర్చొని పగతో రగిలిపోతున్న బాలషాడో రాజారాం కి ఒక రౌడీ బ్యాచ్ చేత తరుముకు రాబడిన కొందరు పిల్లలు, ఒక ముసలి ముసల్మాన్ (నాజర్) పరిచయమవుతారు. వాళ్ళని కాపాడడానికి రౌడీ బ్యాచ్ ని పిచ్చకొట్టుడు కొట్టేస్తాడు పిల్లషాడో. ఒక ఎలిమెంటరీ స్కూల్కెళ్ళే కుర్రోడు అంతమంది రౌడీలని ఎలా కొట్టేసేడూ? అనే డౌటు మీకొస్తుందని నాకు తెలుసు. మీరో బేసిక్ పాయింట్ మరిచిపోతున్నారు... "ఈ సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్".
బాలా షాడో కధ విన్న  నాజర్ "నీ ఆశయానికి తగినట్టూ నేను నిన్ను పెంచుతాను" అని మంగమ్మ శపధం చేస్తాడు.

కట్ చేస్తే....
ఇరవై యేళ్ళ తర్వాత....మలేషియా లో...!

నాజర్ ముసలోడవుతాడు. పెంచిన మగ పిల్లలు గాడిదల్లా ఎదుగుతారు. ఆడ పిల్ల కత్తిలాంటి ఫిగర్ గా రూపాంతరం చెంది పొట్టి బట్టలేసుకొని పోష్ గా తిరుగుతా ఉంటాది. వీళ్ళంతా షాడో తో కలిసి మలేషియా లో పాతుకుపోయిన విలనీ బ్యాచ్ ని చంపెయ్యడానికి ప్లాన్లు గీస్తూ, గూగుల్ మేప్లు, డాన్ల ఫోటోలూ గోడమీద అతికించుకొని లోక కళ్యాణం కోసం తపిస్తూ ఉంటారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కి ముందు ఫైట్ ఉండాలి కాబట్టీ సిల్లీ గా ఒక మాస్టర్ ప్లేన్ వేసీ ఫైట్ చేసీ ఒక డాన్ అసిస్టెంట్ ని చంపేస్తాడు షాడో.

ఇప్పుడు పాట....!!

డీడబడీడబడీడబ డబడబడబడబడబడబ యముడికి మనవడు షాడో......!!


ఈ పాటలో పావు మీటరు గుడ్డ ఒంటిమీద వేసుకున్న ఫారిన్ ఫిగర్స్ + షాడో బ్యాచ్ లోని స్వదేశీ లేడీ ఒళ్ళు విరుచుకొని అరుస్తూ ఉండగా... పాత బట్టలు ఒంటి మీదేసుకున్న గంగిరెద్దు లాగా షాడో తలాడిస్తూ ముందుకీ వెనకకీ తూలతా ఉంటాడు.

పాటయిపోయాక, సందట్లో సడేమియా లాగా డాక్టరు హీరోయిన్ తాప్సీ (గ్లామర్ ప్యాకేజ్ లో భాగం), ఆళ్ల చీపు డాక్టరు ఎమ్మ్సెస్ నారాయణ (కుళ్ళు కామెడీ ప్యాకేజ్.. ఒన్ మేన్ ఆర్మీ), సైలెంట్ స్టార్ శ్రీకాంతు (యాక్షన్ + సెంటిమెంట్ + ఆటలో అరిటిపండు పాకేజ్ లో భాగం) మలేషియా ఎంటరవుతారు. నెత్తి మీద కాకి గూడు పెట్టిందేమో అన్నట్టు ఉండే తాప్సీ కీ అందగాడైన తింగరి సుబ్బరాజు కాకుండా ముసలి కోతికి మేకప్పేసినట్టు ఉన్న గెడ్డం హీరో హ్యాండ్సమ్ గా ఉన్నాడని భ్రమించి ప్రేమించేస్తుంది.

పోలీస్ స్టేషన్ లో ఐపీయల్ మ్యాచులు చూస్తూ టైంపాస్ చేసే టాలెంట్ ఉన్న తెలుగోళ్ళకి పోలీసుజ్జోగం ఇచ్చిన మలేషియా పోలీస్ డిపార్ట్మెంట్ కి సహాయం గా పుడింగి పోలీసాఫీసర్ శ్రీకాంత్ వస్తాడు మాఫియా డాన్లని పట్టుకోడానికి. తీరా చూస్తే మన షాడో ఒక్కో విలన్ నీ మెదడు మోకాల్లో ఉండగా వచ్చిన ఐడియాలతో చంపేస్తూ ఉంటాడు. అసలు అడివి మనిషి గెటప్ లో వెంకీ బాబు అరెస్ట్ అయ్యి, తను లాకప్ లో ఉండి బయట తిరుగుతున్న పోలీసుని లోపలకి లాగి తన ప్లేస్లో పడుకోబెట్టి, మర్డర్ చేసి తప్పించుకునే సీన్ చూసి తీరాలి. రమేషుడి దర్శకపిత్వానికి జేజేలు కొట్టాలి. ఆ తర్వాత పు.పో ఆఫీసర్ తను వచ్చిన పని మరిచిపోయి, అసలు విలనీయులని గాలికొదిలేసి, ఐఫోన్ అప్లికేషన్స్ తో గన్ షూటింగ్ చేసి మర్డర్లు చేస్తున్న షాడోని పట్టుకోడానికి వెంట పడతాడు. ఆ చేజింగులలో షాడో కి ఏక్సిడేంట్ అయ్యి తల వెనక భాగం లో  దెబ్బ తగిలి నుదుటి నుండి రక్తం వస్తుంది. చిన్నమెదడు లో స్టోరేజ్ ఏరియా లో రక్తం గడ్డ కట్టడం వల్ల వెంకీ గతం మరిచి పోయి పిచ్చోడయిపోతాడు. (యెస్.. .మీరు చదివింది కరెక్టే)

పిచ్చోడంటే పూర్తి స్థాయి పిచ్చోడు కాదు. స్వాతి ముత్యం సినిమా లో కమల్ హాసన్ ( ఆ రేంజ్ సీన్స్ ఉంటాయి అని చెప్పి ఒప్పించి ఉంటాడు రమేషు) లాగా చిన్నపిల్లోడి లా నంగి గా మాట్లాడుతూ అందర్నీ అంకుల్ అని పిలుస్తూ, తాప్సీని ఆంటీ అని పిలుస్తూ అమాయక కామెడీ పేరుతో ఊచకోత కోస్తాడు. కంత్రీ, బిల్లా, గబ్బర్ సింగ్ మొదలగు సినిమా పేరడీలూ, గబ్బర్ సింగ్ గెటప్ లో బాబు చేసే అంత్యాక్షరీ సీన్లూ, "అవి వీటికి పేరడీ సీన్లు సుమా" అని చెప్పడానికి ఒరిజినల్ సినిమాల్లోని సీన్లూ తెరమీద కదులుతూ తెర చించెయ్యాలన్న బలమైన కోరికని కలిగించడమే కాక డైరెక్టర్ని పీక కొరికి రక్తం తాగెయ్యాలన్నంత కసిని ప్రేక్షకుల గుండెల్లో కలిగిస్తాయి.

ఇంటర్వెల్ కి పావుగంట టైం ఉందనగా Ipad లో HD Quality తో తన భార్య తో వీడియో చాట్ చేస్తుంటాడు శ్రీకాంత్. వీడియో చాట్లో శ్రీకాంత్ అత్తగారిని చూసిన షాడో కి విపరీతమైన తలనొప్పి వచ్చి గతం గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే ఆవిడెవరో కాదు షాడో తల్లి. శ్రీకాంత్ స్వయానా తన బావ. అందేంటీ షాడో తల్లీ, చెల్లీ పడవలో బాంబ్ పేలి చనిపోయారు కదా? అన్న డౌట్ మెదడు మోకాల్లో ఉన్నోళ్ళకి కూడా వస్తుంది. అక్కడే పాలలో ఉప్పేసారు. పచ్చట్లో పులుసేసారు. బాంబ్ పేలడానికి కొన్ని సెకన్ల ముందే వాళ్ళు నీట్లోకి దూకేసి తప్పించేసుకుంటారు. (మహానుభావా... మెహర్ రమేషా... తుసీ గ్రేట్ హో)

షాడో చిన్నప్పుడు కత్తి తో పొడిచిన విలన్ ని చంపుతూ...
"పగతో పెరిగాను.. కోపంతో రగిలాను. ఇన్నాళ్ళూ తిరిగి తిరిగి.. దేశాలు వెతికి వెతికి, నీ వైపే దూసుకొస్తున్న చావుని నేనే రా... షాడోఓఓఓఓఓఓఓఓఓఓ.
భయం ఎంత భయంకరంగా భయపెడతాదో చూస్తావా??" అని ఒక పొడుగు డైలాగ్ చెప్పేసి తల్లి, చెల్లిలని చూడటానికి ఇండియా వచ్చేస్తాడు. ఫస్టాఫ్ లోనే మెయిన్ విలన్ ని తప్ప అందరినీ చంపేసిన షాడో కి సెకండ్ హాఫ్ లో చంపడానికి విలన్లే ఉండరు.

ఇక్కడే రమేష్ లోని క్రియేటివ్ రైటర్ నిద్రలేచి కళ్ళు నులుముకొని మొహం కడుక్కొని రెడీ అయ్యాడు. దెబ్బకి సెకండ్ హాఫ్ సాగదీయడానికి స్టోరీ రెడీ అయిపోయింది. షాడో తండ్రిని చంపినట్టే , వాళ్ల మావయ్యని కూడా చంపేస్తారు మరికొంత మంది హైదరాబాదీ విలన్స్. వీళ్ళు కూడా మెయిన్ విలన్ కి అసిస్టెంట్స్ అన్నమాట. ఇక షాడో వేట క్లైమాక్స్ వరకూ సాగి మన దుంప తెంచేస్తుంది. మెయిన్ విలన్ చచ్చే టైంకి టికెట్ కొనుక్కొని ఏసీ నరకం లోకి ఎంటరయిన దౌర్భాగ్యులకి జీవితం మీద విరక్తి వచ్చేసి, ముందు సీట్ కేసి తలకొట్టుకొని చచ్చిపోవాలని కోరిక పుట్టినా గానీ ఓపిక లేక మిన్నకుండిపోతారు.

టూకీగా ఇదీ స్టోరీ...ఇంత కంటే వివరంగా స్టోరీ చెప్పి పాపం మూట కట్టుకోవటం నాకిష్టం లేదు కాబట్టీ చెప్పట్లేదు.  ఇప్పుడు కొన్ని హైలైట్స్ చెప్పుకొని ఆనందిద్దాం.


మ్యూజిక్ :  పెళ్ళిళ్ళకీ, దినాలకీ బ్యాండ్ మేళం వాయించినట్టు వాయించొదిలాడు తమన్ బాబు. టైటిల్ సాంగ్ మాత్రం బాగుంది (ఎక్కడ నుండి కొట్టుకొచ్చాడో మరి). ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయానికొస్తే స్టీల్ సామాను గచ్చు మీద పడేసి అదే టైం లో "షా..డో.. షాడోఓ..." అని అరిపించి అదరగొట్టాడు.
ముఖ్యంగా "ఏయ్ ఐతలకా..ఉస్క్ లకా..తద్దినకా జజ్జనకా డంకనకా జింకుచికా హోయ్" అనే పల్లవి తో మొదలయ్యే పాట సాహిత్యం, పిక్చరైజేషన్... మహాద్భుతం.


హీరోయిన్ః హీరో కి హీరోయిన్ ఉండాలి కాబట్టీ హీరోయిన్ క్యారెక్టర్ ఉంది. పాటల్లో తక్కువ కాస్ట్యూమ్స్ వాడి బడ్జెట్ తగ్గించాలి కాబట్టీ తాప్సీ ఉంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే తాప్సీ అయితే ఐటెం సాంగ్స్ కి కూడా సరిపోద్ది కాబట్టీ ఖర్చు కలిసొస్తాది.
ఇక ఆ పాటల్లో కుక్కల చింపిన విస్తరిని ఒంటికి కట్టుకున్నట్టూ ఉన్న ఆ బట్టలూ, ఆ కాకిగూడు లాంటి హెయిర్ స్టైల్సూ చూసి భరించి బాధపడాలి గానీ మాటల్లో చెప్పటం కష్టం బాబా..!!

 


అన్నట్టు ఒక అరాచకపు సీన్ చెప్పాలి. అబ్బో ఇది హైలైటు.

తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయిన షాడో కి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది డాక్టర్ తాప్సీ. సాధారణం గా ఇలాంటి కేసుల్లో తలకి కట్టుకడతారు లేకపొతే గుండు చేసి కుట్లేస్తారు. "కానీ హీరో కి గెడ్డం గీసి, హెయిర్ కట్ చేస్తుంది" ఇదేం చోద్యమో...!!!!!!
నాయనా రమేషా... నీ దర్శకత్వ పటిమ కీ, నీ స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ కీ తల వంచి సలాములు చేస్తున్నాను తండ్రీ.

హైలైట్ సీన్స్ః  1.    గణేశ్ నిమజ్జనం జరుగుతూ ఉంటాది. విలనీయుడిలో ఒకడైన పోలీస్ కమీషనర్ కి జనాల్లో "నాగ బాబు" (చనిపోయిన షాడో బాబు) కనిపిస్తాడు. ఇరవై యేళ్ల క్రితం చనిపోయిన "రఘురాం" ఎలా బతికొచ్చాడా? అని ఆశ్చర్య పోతాడు తెరమీది పోలీసోడు.
సినిమా బిగినింగ్ లో చనిపోయిన నాగబాబు బతికొచ్చాడా? అని తెరముందు అవాక్కయ్యాను నేను. హీరో అమ్మ, చెల్లి బతికున్నట్టే వీడు కూడా బతికున్నాడేమో??  అన్ని సార్లు ఇనపరాడ్ తో కొట్టి, గుండెల్లో కాల్చి, తల మీద షూట్ చేశాక ఎలా బతికుంటాడూ?? ఏమో ఈ కంత్రీ డైరెక్టర్ సినిమా లో ఏదయినా సాధ్యమే సుమీ. ఒక వేళ బతికుంటే పాపం తన వాళ్ళని చంపారనుకొని హీరో షాడో అవతారం ఎత్తి అన్యాయంగా మాఫియా డాన్లని చంపేస్తున్నాడే అని బాధ పడ్డాను. నా కోడి మెదడు లో సవాలక్ష సందేహాలు.
ఇంతలో నాగబాబు అక్కడ నుండి పరిగెడతాడు. పోలీసాఫీసరు వెంబడిస్తాడు. ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళాక నాగబాబు ఆగి వెనక్కి తిరుగుతాడు. "అది ఆ పోలీసోడి భ్రమ కాదు. నిజంగా నాగబాబే. ఓర్నాయనోయ్... వీడెలా బతికొచ్చేసాడ్రా దేవుడోయ్.." అని నేను ఆశ్చర్యపోతుండగా నాగబాబు తన మొహం మీది మాస్క్ తీసేస్తాడు. పొడుగు జుత్తున్న నాగబాబు, పొట్టి జుట్టున్న వెంకటేష్ బాబు లా మారిపోతాడు. ఆ...హా ఏమి ట్విస్ట్ రాజా...??  ఇక ఆ తర్వాత వేల మంది జనాల మధ్య పోలీసాఫీసర్ని షాడో కత్తి తో పొడిచి చంపేస్తాడు. అంత మంది జనం లో తాప్సీ, ఎమ్మెస్ నారాయణ తప్ప అక్కడున్న జనంగానీ, ఒక్క పోలీసోడు గానీ చూడరు. అసలు పట్టించుకోరు.
2. మలేషియా లో షాడో - పోలీసుల మధ్య చేజింగ్ జరుగుతూ ఉంటాది. అందులో హీరో ఎనకాల వచ్చే పోలీసు కార్లు గార్లో ఎగరడం కోసం విశాలమైన మలేషియా రోడ్ మధ్యలో రెండు మీటర్ల పొడవైన "ఇండియన్ స్టైల్" డివైడర్ ని అత్యంత నాసిరకం గా పెట్టిన డైరెక్టర్ సారు అతి తెలివితేటలని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో..!

3. తెలుగు హీరోల్లో "నటుల" వర్గానికి చెందిన అతి కొద్ది మందిలో ఉన్న వెంకటేషు లోని "భరించలేని" నటవిపరీతాన్ని తోడిన డైరెట్రు ఓ కొత్త విలన్ నీ, పదుల సంఖ్యలో విలన్లనీ, ఆర్టిస్టులనీ, గెస్ట్ అప్పీరెన్స్ లో "సుమన్" నీ వాడిన తీరుకీ, ఓ పెద్ద హీరో చేత పవన్ అంకుల్, మహేష్ అంకుల్, ఏన్టీఆర్ అంకుల్, చరణ్ అన్న అని పదే పదే జపం చేయించి పరువు తీసేసిన విధానానికీ, కుదిరితే కాలు మీదో, కుదరకపోతే నెత్తి మీదో కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకోవాల.

4. ఒకే ఒక్క ఫోన్ కాల్తో హీరో మిమిక్రీ చేసి హోం మినిస్టర్ ని బురిడీ కొట్టించి వాడుకునే సీన్ల పరంపర.. వాటి నుండి పుట్టించిన అద్బుత కితకితల కామెడీ.. హిష్షోఓఓఓఓఓఓఓఓ.....!!!!!!!


స్వామీ... హే రమేషా.... ఏమి నీ లీలలు తండ్రీ..!! తెలుగు సినిమాలు చూస్తున్నోళ్ళు ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా?

5. మూడుగంటలు మానసిక క్షోభ అనుభవించీ, రక్త కన్నీరు కార్చీ, బాధని పంటి బిగువున భరించిన పిమ్మట "హమ్మయ్యా..అయిపోయిందిరా దేవుడా" అనుకున్న టైం లో
మె.రమేష్ నల్ల కళ్ళజోడు పెట్టుకొనొచ్చి... అక్కడికేదో దేశాన్ని ఉద్ధరించే సినిమా తీసేసినట్టూ "డీడబడీడబ డబడడబడడబడ షాడో" అని అరుస్తూ ఊగిపోతుంటే నా ఫీలింగ్ చెప్పడానికి మాటలు రావట్లేదు.కధ - డైలాగులుః " పగ బాబాయ్.. పగ.. నా తండ్రినీ, తల్లినీ, చెల్లినీ తమ్ముడినీ.............etc చంపిన ఆ దుర్మార్గులంటే నాకు పగ బాబాయ్ పగ" అనే లైన్ తో రొట్ట స్టోరీని, ప్రాస తో కూడిన పకోడీ డైలాగులతో రచించిన శ్రీ కో. వెంకట్, గో. మోహన్ గార్లకీ, ఎక్కడ సినిమా పొరపాటున హిట్టయిపోయి క్రెడిట్ వాళ్లకి పోతుందో అన్న భయం తో మధ్యలో తన పైత్యపు పెన్ పెట్టి కెలికేసి "కధ మాటలు దర్శకత్వం" కార్డేసుకున్న మె.రమేష్ లకి నా సాష్టాంగ ప్రణామాలు. సహస్ర కోటి అభివందనాలు.

"మీరు కొడితే పోకిరిలో మహేష్ బాబు లా మైండ్ బ్లాక్ అయిపోద్దనుకుంటే... వీడి మైండ్ బ్లాంక్ అయిపోయిందేంటీ?"
"మా వాడికి నీ అడ్రస్ తెలిస్తే.. నువ్ అడ్రస్ లేకుండా పోతావ్"
"ఎవడి మీదన్నా చేయ్యేసే ముందు, చెయ్యేస్తే ఎవడోస్తాడో ఆలోచించాలి"

ప్రాస కోసం ప్రాణాలు తీసేస్తారా సార్ మీరూ??
రైమింగ్ బాగుంటే రాసిపారేస్తారా అయ్యోర్లూ??

మీ పంచ్ డైలాగులు నాలోని రచయితని నిద్రలేపాయి. మీ నెక్స్ట్ సినిమాల్లో వాడుకోండి సార్లూ. వాడుకున్నోళ్లకి వాడుకున్నంత.

"పేడని ముట్టుకోలేవు.. ముక్కుకి పెట్టుకోలేవు... ఆ వాసన తట్టుకోలేవ్.... అదొక హిస్టరీ... మీరంతా తినబోయేదీ... పేస్ట్రీ.....!!!"
 "అడ్రెస్ చెప్పరా... డ్రెస్సేసుకొని వస్తానూ..గుమ్మం లోకొచ్చి కొట్టానంటే ఖమ్మం లో పడతావు"
"అరిచేత్తో కొట్టేనంటే అరిచే చాన్స్ కూడా ఉండదు."
"నేను పిన్ను పీకేసిన బాంబు లాంటోణ్ణీ... పేలే ముందు ఇలాగే సైలెంట్ గా ఉంటా"
"నిన్ను కట్ చెయ్యడానికి నేను టచ్ చెయ్యక్కర్లేదురా... పంచ్ ఏస్తే చాలు"
"పదునెక్కిన కొడవలీ..పిచ్చెక్కిన నేనూ చాలా ప్రమాదకరం"
"నా ఆశయం కోసం అడ్డంగా నరికేస్తా... ఎదురొచ్చినోడిని నిలువుగా చీరేస్తా "
"నా కోపం బ్రేకుల్లేని కారు లాంటిది డామేజ్ జరిగాకే ఆగేది"
"డిక్షన్ లేని వాడి ఏక్షన్లకి నా రియాక్షన్ ఇలాగే ఫ్రిక్షన్ తో కనెక్షన్ కట్టయ్యేలా ఉంటుంది" (అబా బ్బా.. ఏమి రైమింగూ..)
"షాడో తో పెట్టుకోవద్దు.. మాడు పగిలిపోద్ది"
"ఎగిరి తన్నానంటే ఆకాశం లోకీ, దుమికి తొక్కానంటే పాతాళానికీ పోతావ్రా"
"వేలెడంతే ఉన్నానని వీజీగా తీసుకోవద్దురా... సానబెట్టిన గొడ్డలి కన్నా తుప్పట్టిన పిన్నీసే డేంజరస్"
"నే తలచుకుంటే గాడిద చేత గుడ్డు పెట్టిస్తా.. బ్రాయిలర్ కోడితో పొదిగిస్తా....నీ ఆత్మ చేత నిన్నే చంపిస్తా"
.
.ఇలాంటివి బోల్డు చెప్తా..!

రమేషుడి తరువాతి సినిమాకోసం ఆతృత గా సిగ్గులేకుండా ఎదురు చూస్తూ....!!!!!

జై హింద్.

169 comments:

KRISHNA KISHORE G said...

అంకుల్ నవ్వి నవ్వి కడుపునొప్పొచ్చింది మీ బ్లాగ్ చదువుతుంటె

KRISHNA KISHORE G said...

అంకుల్ నవ్వి నవ్వి కడుపునొప్పొచ్చింది మీ బ్లాగ్ చదువుతుంటె

నిషిగంధ said...

:)))))))

ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడే మాకు హేపీస్.. మీ రివ్యూతో ఒక మాంఛి కామెడీ మూవీ చూపించేస్తారు. కష్టం మీది, నవ్వులు మావి అన్నమాట! :)

వేణూశ్రీకాంత్ said...

మొన్న మూడుగంటల పాటు ఈ చిత్రహింసకి బలైపోయి ఏం చేయాలో అర్ధంకాక నిలువెల్లా రగిలిపోతున్న నాలోని కసిని నీ రివ్యూద్వారా కాస్త చల్లార్చావ్ రాజ్ :-) రివ్యూ అరాచకం :-)) సినిమాలో డైలాగులకన్నా నువ్ రాసినడైలాగులే బెటర్..

కొన్నాళ్ళా మెహర్ రమేష్ రోడ్ మీద తిరగకపోడం బెటర్. సినిమా అయ్యాక హాల్లో ప్రతివాడూ ఒరేయ్ మెహర్ రమేషా ఎంతపని చేశావ్ రా.. అనేసి ఆడినంబర్ కనుక్కోండిరా ఎవరైనా అని ఎంక్వైరీ చేసే వాళ్ళే.

Anonymous said...

kevuu basu.. asalu aa mehar ramesh nijamga chala gr8 ..aa nirmathanu baga vadukunnadu ..tanu chudalanukunn a placesses ni baga tirigesi vachhinattu unnadu.. ayina mana venki babuki em edisno ilanti cinema oppukunnadu...

Anonymous said...

తెలుగు సినిమాల కథలకి, డైరక్టర్లకి కరువు అంటుంటే ఎంటొ అనుకున్నాను,
నిజమేనన్నమాట.

Anonymous said...

ఏ మధుబాబు నవలో సినిమాగా తీశారేమోనని భ్రమపడి చూద్దామని ఆశపడ్డాను. బతికించినందుకు థేంక్స్‌

rajasekhar Dasari said...

(నీ)మెహo+ఢర్+హర్రర్= మెహార్ రమేష్

rajasekhar Dasari said...

ముందు కామెంట్ లో నీ అంటే మీరు కాదు

శ్రీనివాస్ said...

ఎవరైనా e e రివ్యు ని మెహర్ బాబు చదివేలా చేయండి బాబు .... భావితరాల వారి శ్రేయస్సు కోసం .

Sravya V said...

ROFL :-))))))))))))))))))))))

Sudha Rani Pantula said...

షాడో మెహర్ ని ఛంపేసి రివ్యూ చింపేసారు రాజ్. నీడలో వడదెబ్బ అంటూ ఫేస్ బుక్కులో చాలా చూసాను కానీ మీరు రాసాక బాగా తెలిసింది....ఈ సినిమా దెబ్బ.శక్తి లో విగ్గే మళ్ళీ వాడారేమో అన్న మీ అనుమానం డౌటు ...ఆహా ఏం నిశిత పరిశీలన...భలే.మరిన్ని సినిమాలు ఇలాంటివి రావాలని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే అప్పుడుకానీ మీ పెన్ను దులపరుగా.

Anuradha said...

:)))

Found In Folsom said...

Hammaa....raj Kumar garu...aa cinema choodaledu kani, meeru choosi chachi mammalani bratikincheru...too much kada...DVD vachina kooda $2 petti kontam waste ani decide ayyipoya...mari darunam ga unnatlu undi kada..anyway, thank u for the wonderful review..aa cinema team tho chadivinchali..appudu gaani aa Meher Ramesh ki gnanodayam avvadu...AAdivaram udayanne navvula panta pandincharu..annti kanna last lo mee dailogues super :)

జయ said...


రాజ్ కుమార్, ముందు మీ పోస్ట్ లో నేను కామెంట్లు చదువుతా. ఎందుకంటే ఇంకా ఇంకా ఎంజాయ్ చేయొచ్చు:)

అసలు ఆ జుట్టు పీక్కున్న వెంకటేష్ ని చూస్తుంటేనే భయంకరమైన దడ గా ఉంది.

మరి ఆ కాకి గూడు తాప్సీ కోసం మళ్ళీ వెళ్ళే ప్లానేమి లేదా:)

ట్విస్ట్ సీన్లు బ్రహ్మాండంగా ఉన్నాయ్:)

అబ్బా! ఆ డవిలాగులు అంత జాగ్రత్తగా మాకు అప్పచెప్పటం మాత్రం....జీనియస్ జీనియస్:))))))

Anonymous said...

బాబ్బాబు ఈ రివ్యూని మెహర్ రమెష్ చూసేటట్టు చేసి పుణ్యం కట్టుకోండి. తెలుగు ప్రేక్షకులు మీకు ఆజన్మాంతం ఋణపడి ఉంటారు

Anonymous said...

బాబ్బాబు ఈ రివ్యూని మెహర్ రమెష్ చూసేటట్టు చేసి పుణ్యం కట్టుకోండి. తెలుగు ప్రేక్షకులు మీకు ఆజన్మాంతం ఋణపడి ఉంటారు

..nagarjuna.. said...

ఈరోజు మావాళ్ళతో ఈ సినిమా చూద్దామని అనుకున్నా అంకుల్ ! కాని ఎవ్వరూ తోడు రాలేదు ప్చ్ :(
wish me good luck.

Padmarpita said...

మీ షాడో-2 (అదేనండి రివ్యూ) సూపర్ డూపర్ కామెడీ హిట్ అని బ్లాగ్ లోకం అంతా కోడై కూస్తుంది...అయినా బోలెడంత చెప్పాలనుకున్నా కానీ నవ్వీ నవ్వి కడుపుబ్బి:-).

జలతారు వెన్నెల said...

:))) hilarious రాజ్ గారు.

Gangadhar said...

మెహర్ రమేష్ తీసిన ఏ సినిమా ఇంతవరకు ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు, పైగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు, నిర్మాత అతని మీద ఏ నమ్మకంతో అంత పెద్ద బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తాడో అర్ధమై చావదు. యుగంధర్ లాంటి సినిమాని "బిల్లా" లాంటి చవకబారు సినిమాతో రీమేక్ చేసి జనాల్ని చావగొట్టి చెవులు మూసిన మెహర్ రమేష్ కి ఇక ఏ సినిమా చెయ్యడానికి ఇండస్ట్రీ లో ఎవరూ ధైర్యం చెయ్యరు అనుకున్నాను కాని వెంకటేష్ లాంటి పూర్ ఫెలోస్ ఉన్నంతకాలం మెహర్ లాంటి వాళ్ళ పైత్యానికి ప్రేక్షకులుగా మనం ఏ జన్మలోనో చేసిన పాపాన్ని అనుభవించక తప్పదు. నాసిరకం వస్తువులు అమ్మినందుకు కన్స్జూమార్ కోర్టులు లో శిక్షలు ఉన్నట్లే ఇలాంటి పైత్యంపు సినిమాలు తీసి మన కడుపుల్ని దేవేసినందుకు సదరు దర్శకులని శిక్షించే కోర్టులుంటే ఎంత బాగుండు......................

బంతి said...

హ హ సూపరు

శ్రీనివాస్ పప్పు said...

"వేలెడంతే ఉన్నానని వీజీగా తీసుకోవద్దురా... సానబెట్టిన గొడ్డలి కన్నా తుప్పట్టిన పిన్నీసే డేంజరస్"

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ రాజ్ కుమ్మేసావ్ కదా

Karthik said...

supero.. super.. hha..haa..-:)

Unknown said...

అబ్బో అబ్బో, మీరు ఆ సినిమా చూసి థియేటర్ లోంచి బయట పడటమే గొప్ప విషయం, అసలు మాకు ఇంత మంచి కామెడీ సినిమా చూపించడం కోసం మీరు అంత కష్టపడి ఆ సినిమాకి వెళ్ళారంటే మీ ధైర్యానికి మెచ్చుకోవాలి..

వైణిక

Unknown said...

అబ్బో అబ్బో, మీరు ఆ సినిమా చూసి థియేటర్ లోంచి బయట పడటమే గొప్ప విషయం, అసలు మాకు ఇంత మంచి కామెడీ సినిమా చూపించడం కోసం మీరు అంత కష్టపడి ఆ సినిమాకి వెళ్ళారంటే మీ ధైర్యానికి మెచ్చుకోవాలి..

వైణిక

బులుసు సుబ్రహ్మణ్యం said...

చెత్త సినిమాలు చూస్తేనే మీలో కామిడీ కింగ్ నిద్ర లేస్తాడన్నమాట.
అద్భుతః.
మీరు వ్రాసిన డైలాగు లకి
పొ.ప.న.

Chandu S said...

రాజ్ కుమార్, అద్భుతంగా ఉంది రివ్యూ. My hearty congratulations.

Anonymous said...

మేం హాయిగా నవ్వుకోటానికయినా నువ్వు ఇలాంటి సినిమాలు చూస్తూ వుండాలి బాబూ...చూస్తూ వుండాలి...

Sai Praveen said...

నువ్వు ఈ సినిమా చూస్తావో లేదో , చూసి ఇలాంటి మరో ఆణిముత్యాన్ని (review ) మాకు అందిస్తావోలేదో అనే నా అనుమానాన్ని ఆవేదనని పటాపంచలు చేస్తూ ..... కుమ్మేసావంతే :)
రివ్యూ లో పంచులతో పాటు చివర్లో పంచ్ డైలాగులు ఉన్నాయి అసలు...
అద్భుతః :)

మధురవాణి said...

హహ్హహ్హా.. మాకు మాత్రం షాడో సినిమా బాగుంది రాజ్.. బాగా నవ్వుకుంటున్నాం.. :))

Anonymous said...

rating:-1000/5

Anonymous said...

Posted by శివరామ ప్రసాద్
--------------------------------------------
నవ్వి నవ్వి తరించి పోయాము, బ్రతికి పోయాము (సినిమాకు వెళ్ళకుండా)..ఆ డైరెక్టర్ అడ్రస్సు ఇదిగో..
Meher Ramesh XX , XXXX , XXXXXXX Hyderabad, XXXXXXXXXXXXX, XXXXXXX India XXXXXXXXXX . XXXXXXXXXX xxxxxxxxxx @gmail.com. http://www.celebzone.in నేను మెయిలు పంపించాను, చూద్దాము.

--శివరామ ప్రసాద్

@ శివరామ ప్రసాద్ గారు , ఫోన్ నంబర్స్ , ఈమెయిలు లాంటి పర్సనల్ డీటెయిల్స్
ఎడిట్ చేసి ఈ కామెంట్ పబ్లిష్ చేసానండి , థాంక్స్ !

Raviteja said...

అబ్బా అబ్బా అబ్బా ఏం రాశారు సర్. జై మెహర్ జైజై మెహర్ :D

శశి కళ said...

హ...హ...నీ రివ్యు ల కోసం సినిమా ఎప్పుడు ప్లాప్ అవుద్దా అని చూస్తుంటాను ...ఇక్కడే రమేష్ లోని క్రియేటివ్ రైటర్ నిద్రలేచి కళ్ళు నులుముకొని మొహం కడుక్కొని రెడీ అయ్యాడు. దెబ్బకి సెకండ్ హాఫ్ సాగదీయడానికి స్టోరీ రెడీ అయిపోయింది.<<<పాటలు ఏమి వ్రాసావు...:))))))))))))))

S said...

ఈ సినిమాలు రాగానే నాకు కొందరి రివ్యూలు చదవాలనిపిస్తుందండీ. అందులో మీదొకటి. ఇవి చదివేందుకన్నా ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని సాడిస్టిక్ గా కోరుకోవాలనిపిస్తుంది నాకు! :-)

ఫోటాన్ said...

Kevvvvvv, super Raj :)))))))

Unknown said...

ninnati nundi mee blog non stop ga chaduvuthunna kaali dorikinappudalla :) ninna aythe pani aapesi maree .. !!!

sai said...

Asalu..chidadam enduku ..Inthala badapadatamenduku.. .Dabbu paya...Seni Patte ..

ప్రవీణ said...

అబ్బబ్బ... ఏమి రాసారండి! పుణ్యం వుంటుంది ఆ డైరక్టరీ బాబుకు మీ రివ్యూ పోస్ట్ చేద్దురు!

Anonymous said...

ఒక సినిమాకి రివ్యూ వ్రాయాలంటే, మరి ఓపిగ్గా ఆ సినిమా అంతా చూడొద్దూ మరి?
రివ్యూలకి ఏ "దాదాసాహెబ్ ఫాల్కే ఎవార్డు" ఏదైనా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే గింటే, మీరు దానికి అర్హులు..

rajachandra said...

నాయనా రమేషా... నీ దర్శకత్వ పటిమ కీ, నీ స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ కీ తల వంచి సలాములు చేస్తున్నాను తండ్రీ. :) super.. movie chusina taruvata kuda opika tecchukuni .. movie gurtupettuni rasina mi dairyaniki joharlu :)

ఫోటాన్ said...

ఆ బొమ్మలు ఎక్కడ పట్టావు బాబూ, వాఇని చూసి నవ్వలేక చస్తున్నా అనుకో :)))

Sudheer Kumar Eega said...

Thank you much for making non stop laugh.

శారద said...

ఈ మధ్య కాలంలో ఇంతగా నవ్వింది లేదు!
మీరు ఇలాటి సినిమాలే చూస్తూ వుండాలి, లోక కల్యాణం కోసం.
శారద

రహ్మానుద్దీన్ షేక్ said...

:)

diya said...

సూపర్ సర్! చాలా ఎంజాయ్ చేసాం!
బీ.పీ ఉన్న వాళ్లకి పొద్దున్నే టాబ్లెట్ బదులుగా మీ బ్లాగ్ చదివించాలి...
అసలయినా కామెడి ముంది ఉంది... వీళ్ళు ఇప్పుడు సినిమా విజయ యాత్రలు, టీ.వీ లో ఇంటర్వ్యూలు ఏ రకంగా చెబుతారో వినాలి.

Unknown said...

"పేడని ముట్టుకోలేవు.. ముక్కుకి పెట్టుకోలేవు... ఆ వాసన తట్టుకోలేవ్.... అదొక హిస్టరీ... మీరంతా తినబోయేదీ... పేస్ట్రీ.....!!!

I dont watch telugu movies often.. Peda ki, Pastry ki link pettina meeku Johar :) Hillarious post

బంతి said...

రమేషుడి తరువాతి సినిమాకి నీ రివ్యుకోసం వేయి కన్నులతో ఎదురుచూస్తూ ....

Unknown said...

"పేడని ముట్టుకోలేవు.. ముక్కుకి పెట్టుకోలేవు... ఆ వాసన తట్టుకోలేవ్.... అదొక హిస్టరీ... మీరంతా తినబోయేదీ... పేస్ట్రీ.....!!! Hillarious ...

Anonymous said...

వీళ్ళకి రిటైర్మెంట్ లాంటివేమీ ఉండవా? రిటైరవమని చెప్పండి. ప్లీజ్... పోనీ, జీవన సాఫల్య పురస్కారం వంటి వాటితో ఏదయినా పని జరగచ్చేమో అని ఆశ గా ఉంది.

-- సుధ

Sai Padma Murthy said...

సినిమా సంగతి ఎలా ఉన్నా .. ఈ మధ్య కాలంలో ఇంత నవ్వలేదండీ... సడన్ గా మా ఆయన వచ్చి చూసి , నాకు పిచ్చి పట్టిందేమో నని కూడా ఆదుర్దా పడ్డాడు. బాబోయ్... బ్లాగ్ లో ఈ కామెడీ ..హ హ హ...

Anonymous said...

Hillarious!!
Non stop laughing here. Thank you for making us laugh so much.

Surabhi


Anonymous said...

too much kada review... i thouroughly enjoyed your review

Aswin Budaraju said...

Superb !!!

Aswin Budaraju said...

సూపరు
పిన్నీసే డేంజరస్ ;-)

Anonymous said...

సమీక్ష సూపర్........

కాని ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పడిగాడట ఇంకొకడు. అసలే చచ్చిన పాముని ఇంకా చంపుతారా? ఈ దెబ్బతో షాడో రమేష్ కూడ ఆరెంజ్ భాస్కర్ అయిపోతాడు.

అయినా జనాలు ముసలి హీరోల సినిమాలు చూడ్డం మానేసారు. చిరంజీవిలా బాలయ్య, నాగ్, వెంకీ కూడ తప్పుకోవాలి. వీళ్ళకి హీరోల అన్నల వేషాలే దిక్కు. రేపు గ్రీకు వీరుడు కూడ అంతేనా?

శ్రీ said...

బాబు రమేశా నీకు సరిగ్గా కాపి కొట్టడం కూడా రాదు... సినిమా అవసరమా నీ @@@@ పేస్ నువ్వును నువ్వు ఓ ఉదర గొట్టిన సినిమా కథ మొత్తం రెండేళ్ళ క్రితం వచ్చిన కొలంబియన సినిమా కి మక్కి మక్కి కదరా @@@@@@ ##$#$#$

http://en.wikipedia.org/wiki/Colombiana

Anonymous said...

Superb Ramesh garu...ila ila inka inka reviews raasi veela cheta cinemalu teeste janam tidatharu kodatharue ani pinchela cheyali...hats off...superb reviews...IDI GAURANTEE GAA GV lanti vallu chusi....koncham siggu padatharu anukunta

రవి said...

సినిమాను సినిమా లాగా చూడకుండా మెహర్ రమేష్ అనే జీనియస్ ను ఆడిపోసుకున్నందుకు పునః మెహర్ రమేష్ సినిమా దర్శన ప్రాప్తిరస్తు అని శపిస్తున్నాను.

ఈ సైన్మాకు పైరసీ డీవీడీ కొందామనుకున్నాను. అదీ వేస్టే అని తేలింది. థాంకులు. :)

Nagrockz said...

one of the finest reviews I ever read

and this is nagrockz :) nagrockz.blogspot.in

Unknown said...

Super Bro... nuvvu rasina review chaduvuthunte.. nenu theater lo padda badha... i mean.. frustration, irritation, emotion, anni gurthukosthunnayi..

Unknown said...

:))హ్హ హ్హ ఏమి రివ్యు అండి .చాలా బాగుంది .నవ్వి నవ్వి పొట్ట పగిలింది

రాధిక(నాని ) said...

వావ్ ఏమి రివ్యు అండి ఎప్పుడూ ఇంతగా నవ్వలేదు రివ్యు చదివి అంత చండాలమైన సినిమాని అంత ఓపికగా చూసి మా కోసం చక్కటి రివ్యూ రాసారు.చాలా థాంక్స్ ఈ సినిమాకి వెళదామని మీ రివ్యు చదివి ఆగిపోయము లేకపోతే అమ్మో తలుచుకుంటే ........

రాస్తాడు......... said...

మిత్రమ నువ్వుకూడా మంచి రచయితవి అందుకనే నీకు అరకొరగా అర్దమైన విషయాన్నికూడా అందరికీ అర్దమైయేలాగా ఆశక్తికరంగా రాసావు...అటువంటిది సాటి రచయతలని కించపరచే నీ మాటలు...బాలేదు

సినిమా రచయితల సంగతి నీకు తెలీయదుకావచ్చు.. మా కలానికి స్వేచ్చలేదు.. ఇక్కడా
దర్శకుడి గత సినిమాలనిబట్టి చేస్తే తెలుస్తుంది...అతనికి రచయితలతో యెంత అవసరం ఉందో...కనుక రచయితలని... వక్రీకరించటం సమంజసంకాదు....
ఏదేమైనా నీ రచనా సౌశీల్యం బాగుంది....

రాస్తాడు......... said...

మిత్రమ నువ్వుకూడా మంచి రచయితవి అందుకనే నీకు అరకొరగా అర్దమైన విషయాన్నికూడా అందరికీ అర్దమైయేలాగా ఆశక్తికరంగా రాసావు...అటువంటిది సాటి రచయతలని కించపరచే నీ మాటలు...బాలేదు

సినిమా రచయితల సంగతి నీకు తెలీయదుకావచ్చు.. మా కలానికి స్వేచ్చలేదు.. ఇక్కడా
దర్శకుడి గత సినిమాలనిబట్టి చేస్తే తెలుస్తుంది...అతనికి రచయితలతో యెంత అవసరం ఉందో...కనుక రచయితలని... వక్రీకరించటం సమంజసంకాదు....
ఏదేమైనా నీ రచనా సౌశీల్యం బాగుంది....

Kottapali said...

మీ ఓపికకి జోహార్లు! ఈ మధ్యన యూట్యూబులో సుమారు 20 యేళ్ళ వార ఉన్న సినిమాలు రెండు చూశా వెంకటేశువి. ఏ మాత్రం తేడా లేకుండా, 20 ఏళ్ళలో improvement కానీ, deterioration కానీ లేకుండా అచ్చం అలాగే చేశాడు రెండు సినిమాల్లోనూ. అతని consistencyని మెచ్చుకోవాలి!

Sujata said...

Thouroughly enjoyed and laughed mercilessly. Kudos to your brave synopsis. Wish venky could read this.

Anonymous said...

That is MEHARISM Kadhu heights of SADISM ....Vodabba Jeevitham..

Kondaveeti Naani said...

ఏవండి .. శ్రీను వైట్ల గారు ఇది చదివారా .. ?
మీకో మంచి రైటర్ దొరికాడు .... :)

హ హ హ హ హ హ హ
తమ్ముడూ Rajkumar Neelam
చాలా రోజులైంది నీ రివ్యూ చదివి ..
చితకొట్టేసావు .... :)

Kondaveeti Naani said...

ఏవండి .. శ్రీను వైట్ల గారు ఇది చదివారా .. ?
మీకో మంచి రైటర్ దొరికాడు .... :)

హ హ హ హ హ హ హ
తమ్ముడూ Rajkumar Neelam
చాలా రోజులైంది నీ రివ్యూ చదివి .. చితకొట్టేసావు .... :)

myselfchandra said...

arachakam review. so called websites ee review chadivithey review ela rayalo teluskuntaru..


chustunnanta sepu aadhyntham aasabangamaina maku aadhyantham anandam kaliginchina meeku hrudaya poorvaka kruthagnathalu

pavan said...

it was great reading ......one of the best .even no one these days gave a insightful and super review in plain telugu ......man take a bow for that .....you rocked

Manoj Kota said...

Nenu ee review chadavaka mundu.. My favourite review was on Balayya babu's dhamaka movie "VIJAYENDRA VARMA"... I can never ever forget such a hilarious review. Now this SHADOW review reminds me of that... Simply superb man... Kudos to you... :)

Vijay Muvva said...

Annaya.. Arupulu pedabobbalu.. mee review chadivaka kocham aa cinema frustration lo nunchi bayataki vocham.. ee vidhangane meeru, devudu chesina manushulu, nippu, nuvva nena elanti palurakala cinemalaki kuda rayandi.. please..

Anonymous said...

Ika Nandi me review choosakee cinemalu chooda daluchukunna....adBhutam saaru

Anu said...

Rofl..mi dialogues keka vadukonnodi adrustam

Bhardwaj Velamakanni said...

kevvvvvv

kishore said...

i really enjoyed this review... velite e review ni video cheyalani undi

Unknown said...

neku manchi bavishyathu vundi...daya chesi nuvvu matram dailougs rasthanani ....dirctions cheasthanani ...maro ramesh la thayaru kakandi....gurivnda ginjja----- eragadanta

chubby said...

Superrrr rajku super!!!!! Kevvv.....

సుజాత said...

నాకు ఇంకో రివ్యూ కావాలీ! అందుకే రమేష్ ఇంకో సినిమా తీయాలీ! నువ్వు చూడాలీ

తాప్సీ నిన్ను మళ్ళీ దెబ్బ కొట్టింది పో :-)))

Anonymous said...

I agree.. please paina perkonna movies ki kuda reviews rayandi...

Vasu said...

ఒక్కసారి ఇది మెహెర్ రమేష్ కంట పడితే ఎంత బావుంటుంది .. నిర్మాతలు బతికిపోతారు

వద్దులే .. అలా అయితే మళ్ళీ ఇలాటి పోస్టులు పడవే


నువ్వు అర్జెంట్ గా ఒక తెలుగు కామిక్ స్ట్రిప్ మొదలెట్టు రాజ్ .

కావలసినంత వ్యంగ్యం, కావల్సినదానికంటే ఎక్కువ కంటెంట్ ఉన్నాయి .. అదే తెలుగు లో ఇలాటి మాస్టర్ పీస్లు వస్తూనే ఉంటాయి కదా .. సో కొరత లేదు .

Unknown said...

mee punch dialogues adbhutam.Long live your blog

Unknown said...

mee punch dialogues adbhutam.Long live your blog

chaithanya said...

' తెగులు ' సారీ.. తెలుగు సిన్మాను ఇంత బాగా 'పోస్టుమార్టం' చేసినవాళ్ళెవరినీ ఇంతకుముందు చూడలేదు. గ్రేట్ అన్నా.
మీ రివ్యూ చదువుతుంటే.. నవ్వాపుకోలేక చచ్చిపోయాం. సోకాల్డ్ స్టుపిడ్ తెలుగు కామెడీ సిన్మాను చాలా బాగా చూపించావన్నా..

..krishna pinninti

chaithanya said...

' తెగులు ' సారీ.. తెలుగు సిన్మాను ఇంత బాగా 'పోస్టుమార్టం' చేసినవాళ్ళెవరినీ ఇంతకుముందు చూడలేదు. గ్రేట్ అన్నా.
మీ రివ్యూ చదువుతుంటే.. నవ్వాపుకోలేక చచ్చిపోయాం. సోకాల్డ్ స్టుపిడ్ తెలుగు కామెడీ సిన్మాను చాలా బాగా చూపించావన్నా..

..krishna pinninti

kiran said...

kikikikikikikikikikiki

babu...nee prasale bagunnaay....evarikanna ammey..labham 50-50 :P

kevvvvvvvvvvvvvvvvvv............3 hours fully fully enjoyed annamata :D

Anonymous said...

adbhutahaa

Anonymous said...

Amazing great work !

Anonymous said...

Narration is superb..lol:-)

Anonymous said...

Great narration raj..! Awesome...

Jyostna said...

Baboi, greatandhra telugu review kante hilarious ga undhi...chaala navvincharu...meher ramesh daya valla super comedy generate authundi :)

Sirisha said...

best review i have ever read....

Anonymous said...

Review super bhayya..!! mavodu Shadow ankunte eadho ankunna.. kaani Meher Ramesh Shadow ani thelsindhi.. Direction rakunte moolakkoorchovaali kaani ila.. janaalanu champoddhu

My Almanac said...

"అధ్భుతహః"

Anonymous said...

em babu..nee thalaki kooda emaina debba tagilinda..raj kumar ni uncle antunnavu?..atani vayasu neelo sagam kooda undademo!

Naveen said...

"అధ్భుతహః".....kevvu keka....
thanks for the entertainment and for the information about the film.

kvrao said...

ఇంత మందిని తన బ్లాగ్ ద్వారా అలరించటం ద్వారా షాడో విజయవంతమైనట్టే. రాజ్ కుమార్ కు ఆ అవకాశం ఇచ్చే ప్రయత్నం లో డైరెక్టర్ రమేష్ సఫలీకృతుడయ్యాడు.

kvrao said...

సినిమా ఫట్ కాకపొతే మీ బ్లాగ్ హిట్ అయ్యేదా? So say thanks to the director.

kvrao said...

సినిమా ఫట్ కాకపొతే మీ బ్లాగ్ హిట్ అయ్యేదా? So say thanks to the director.

kvrao said...

సినిమా ఫట్ కాకపొతే మీ బ్లాగ్ హిట్ అయ్యేదా? So say thanks to the director.

T.V.SRINIVAS said...

HELLO TAMMUDU,
NIJAMGAA YEE CINEMA ACTION MOVIE KAADU. COMEDY FILM. ARDHAM CHEYSUKOO.BEST COMEDY MOVIE AWARD YIVVAVACHU. JENAALANU VERRI----- CHEYATAANIKI TEESINA CINEMA YIDI. NEE COMMENTS 1000% YEKIBHAVISTUNNAANU.

Unknown said...

Mee vishleshanaa chaturatha ki, creativity ki Joharlu...
Hats-off - continue blog forever!

Anonymous said...

ఈ సినిమా 100 రోజులు ఎలాగూ ఆడదు కాని, మీ టపాకి 100 కామెంట్లు దాటాయి.

Niyogee said...

Rajkumar garu,
Ekkadoo forums lo evaroo meeru rasina Shadow review link pedithe chadivaanu. Chaala sarada paddanu. aa cinema darsakudu Mehar kada, enduku lee chodakharaledu anukunnanu, kani mee review chadivi aa cinema choosi athyantha aanadam pondaanu.
Meeku manchi expression undi. Alageee aa madhya inkekkadoo maroo blog choosanu , thotaramudu anee peru tho rasthunnaru aayina evaroo.. chaala hasyanga rasaaru...machuki ee kinda link lo dooradarsan meeda rasina blog chadavandi...chala baga haasyanga rasaru aayina evaroo..
idedoo advertisement anukuneru...porapaatuna kooda kaadu.. aa thotaramudu evaroo koda naku teleedu., baga rasaaru..chadivi choodandi
http://thotaramudu.blogspot.ae/2007/03/blog-post.html

Anonymous said...

Nice one ..

చాతకం said...

ROFL. thank you for the review, even though you went through that torture. Hopefully you feel better by now, keep drinking lots of water, take medicine on time, don't watch any more Telugu movies for some time. All would settle down. Take lots of rest.

చైతన్య.ఎస్ said...

షాడో ది *ఎండో*
- -----------

ఎవరికి డైరెక్టర్ కా ప్రొడ్యుసర్ కా లేక హీరో కా ??

:)))))))))))

koteswar said...

its really awesome writeup..very nice really enjoyed your review than the movie..:)

Roop said...

super hit story 100 paise ticket pettina evaru vellaru

Unknown said...

Keka review boss..

Unknown said...

ఇన్ని చెప్పెవారు మిరె ఒక్క సినిమా తియవచ్చు కధా

NAVEEN RAJ said...

This is the most wonderful review i ever read. keep reviewing our movies and let our people know the truth before they dare to watch such kind of movies. And hats off to your sense of humour. Your punch dialogues are really awesome. I would like to suggest you one thing, Please write a book on present movie trends with your sense of humour added to it.

BALA said...

Thank U boss, enka nayam Cinema Chudddam anukunna, Epudu Aa avasram ledu eka naku.........

Suneel said...

Keka Review..
First day after coming out from theatre i said to media that movie is ok..
But inner i felt my hero venky movie flop.
Director mehar ramesh should be killed..
Venky does nt deserve this movie
We really feel sad y he accepted this movie

Being Myself said...

Ha ha.. chaala baaga raasarandi.. mee postlu chadavadam ippude start chesa..nenu kooda ivvale blog modalupettanu :)

RKris..!! said...

Nenu navvina paddatiki janalu chuttu cheri maree chusaru ... Review ante ila undaali mastaru !!

RKris..!! said...

Mee review chadivaaka nenu maa manager ni kuda kshamincha galiganu .. dhanyosmi mahanubhaava !!

RKris..!! said...

Nenu navvina paddatiki janalu chuttu cheri maree chusaru ... Review ante ila undaali mastaru !!

Just Jai said...

I realized that the story line of Shadow is inspired from the movie "Colombiana"-A young woman, after witnessing her parents' murder as a child in Bogota, grows up to be a stone-cold assassin.

The opening episode of Nagababu is a complete ripoff from this film(including the chase). In that movie, heroine's father gives her a memory card but Meher Ramesh 'creatively' changed it to a cassette!

:)

Just Jai said...

I realized that the story line of Shadow is inspired from the movie "Colombiana"-A young woman, after witnessing her parents' murder as a child in Bogota, grows up to be a stone-cold assassin.

The opening episode of Nagababu is a complete ripoff from this film(including the chase). In that movie, heroine's father gives her a memory card but Meher Ramesh 'creatively' changed it to a cassette!

:)

Just Jai said...

I realized that the story line of Shadow is inspired from the movie "Colombiana"-A young woman, after witnessing her parents' murder as a child in Bogota, grows up to be a stone-cold assassin.

The opening episode of Nagababu is a complete ripoff from this film(including the chase). In that movie, heroine's father gives her a memory card but Meher Ramesh 'creatively' changed it to a cassette!

:)

ChiranD said...

మీ రివ్యూ package సూపర్ అండి.

Anonymous said...

Super Babu ,,,,,, couldnot cntrl laughing

Manasa said...

adaraho

A Homemaker's Utopia said...

హ హ హ నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్లోచ్చేస్తున్నాయి రాజ్ గారు.. ఈరోజు ఉదయం లేవగానే చదివిన రివ్యూ...ఇలా మీరొక్కరే రాయగలరు..:-) Enjoyed reading :-))

Anonymous said...

Fantastic review...hats of to ur SOH...u have a bright future in TFI :)

రాజ్ కుమార్ said...

KRISHNA KISHORE G అంకుల్... థాంక్యూ ;)
నిషిగంధ గారూ ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుద్దామరీ? ;) థాంకుల్స్
వేణూజీ.. సింపుల్ గా నాదీ అదే ఫీలింగ్.. మీరు కమెంట్లో బయటడ్డారు. నేను పోస్టులో బావురుమన్నాను.. అంతా మీ చలవే కదా.. ;)

అనానిమస్ గారూ.. హహహ.. అలాగే ఉంది ;)
కాముధ గారూ కరువు అని కాదండీ. మంచి సినిమాలు తీస్తుంటే చాలామందికి నచ్చట్లేదు. ఇలాంటి సినిమాలు వదుల్తున్నారు ;( ;(

రాజ్ కుమార్ said...


puranapandaphani గారూ భలేవారే ;);)
rajasekhar Dasari హిహి బాగుమ్దండీ. ఏ సంధి?
శీనన్నా.. ఎందుకులే ;) ;) థాంకుల్స్
శ్రావ్యగారూ.. thankso ;)

సుధమ్మ గారూ ఏదో సినిమాల మీద ఇష్టం తో వచ్చిన సునిశిత పరిశీలన అంతేనండీ ;) ఇలాంటి సినిమాలు వరసగా పుంజుడు తగిల్తే అసలుకే మోసం వస్తుందండీ ;౦
అనూరాధ గారూ ;)))))))
Found in folsom గారూ ఆ ముచ్చట ఆల్రెడీ అయ్యిందని వినికిడి ;)థాంక్యూ వెరీ మచ్

రాజ్ కుమార్ said...


జయ గారూ.. ముందస్తు గా థాంకులు.. ఆ డైలాగులు నావండీ.. సినిమాలో చెప్పుకోదగ్గవి (నవ్వుకోదగ్గవి) మూడో నాలుగో అంతే ;)
అనానిమస్ గారూ హిహిహి ;) ;;)
చారంకుల్ చారంకుల్ చూసి ఎమ్జాయ్ చేసి రండు ;)
పద్మార్పిత గారూ అవునట..;) ;) అంతా షాడో దయ అండీ.. థాంక్యూ ;)

జలతారువెన్నెల గారూ థాంక్యూ
గంగాధర్ గారూ నాకు కూడా ఇవే డౌట్లండీ.. ;)కోర్టులూ కేసులూ ఎందుకు లెండీ ;)
థాంక్స్ బంతీ
పప్పుసార్ థన్యవాదః
ఎగిసే అలలు గారూ థాంక్యు

రాజ్ కుమార్ said...


స్వాతి బొట్టు గారూ మీ మెప్పుకోలుకి నా ధన్యవాదములు ;)
బులుసుగారూ.. అలా ఏం లేదండీ ఏదో అలా కలిసొచ్చింది అంతే.. థాంక్యూ ;)
శైలజగారూ థాంక్స్ అండీ, లలితమ్మ గారూ... మీరు మరీ భయంకరమైన కోరికలు కోరుకుంటున్నారు సుమండీ ;౦
సాయి ప్రవీణూ...బుక్కయ్యి పోయాను బాబూ.. బరకక పోతే పిచ్చెక్కిపోయేలా ఉందీ ;) థాంక్యూ

మధుర గారూ అదృష్టవంతులు మరీ.. ;)))
శివరాం ప్రసాద్ గారూ రిప్లై ఏమయినా వచ్చిమ్దాండీ? ధన్యవాదాలు
రవితేజా.. బోలో మెహర్ బాబా కీ.... ;))))))))
శశికళ గారూ ధన్యవాదాలు ;) ;) ఒక సారి వెళ్ళి చూసిరండీ తెలుస్తాది

రాజ్ కుమార్ said...


సౌమ్యగారూ మీరు సాడిస్టులుగా మారడానికి నేను కారణం అవుతున్నందుకు ఆనందిస్తున్నాను. థాంక్యూ అండీ
ఫోటానూ.. థాంక్సొ
నికిత చంద్రసేన గారూ... కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.. చదవండి చదవండీ నా బ్లాగుకి కొత్త రీడరు దొరికారన్నమాట. ధన్యవాదాలండీ.. అన్నట్టు మీకు స్వాగతం ;)

సాయి గారొ ఇలా ఉంటాదని తెలీక, ఏదో ఒక చిన్ని ఆశతోచూశానండీ.. ఇలా అయింది.. ఏడవక తప్పదు గా మరీ ;))
ప్రవీణ గారూ ధన్యవాదాలు ;)
హరేఫల గారూ.. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ నాకే ??? అవార్డే...??? అహొ..... థాంక్యూ అండీ

రాజ్ కుమార్ said...

రాజా చంద్ర గారూ థాంక్యూ
ఫోటానా... గూగుల్లో పట్టా... కికికి
సుధీర్ గారూ థాంకుల్స్ ;)
శారద గారూ థాంక్యూ అండీ
రహ్మానూ.. ;)))))))))) (బిస్కట్ )

విక్కీ గారూ థాంక్యూ అండీ ;) ;) ఆ కామెడీ కి అవకాశం లేదు లెండీ ;))))
మమత గారూ థాంక్యూ
బంతీ.. నువ్వు కూడానా ;))
సుధ గారూ.. మీ ఆలోచనని పరిగణీంచాల్సిందే సుమండీ ;))))))
సాయి పద్మ గారు ధన్యవాదాలండీ.. ;) ;)

రాజ్ కుమార్ said...


సురభి గారూ థాంక్యూ వెరీమచ్
అనానిమస్ గారూ థాంక్స్ ;)
అశ్విన్ గారూ హిహిహి ధన్యవాదః

బోనగిరి గారూ.. అలా అని కాదు గానీ కొంచెం కధ కొత్తదనం కుదరకపోతే కనీసం వినొదం ఉన్న సినిమాలొస్తే చాలండీ
శ్రీ గారూ అట్టర్ ఫ్లాప్ సినిమాలు రీమేక్/ఫ్రీమేక్ చేసి హిట్టు కొట్టడం అతని స్టైల్...ః)
అనానిమస్ గారూ.. నా పేరు రమేష్ కాదండీ... ః((((((((((((( థాంక్యొ ;)

రాజ్ కుమార్ said...


రవి గారూ పెంటకుప్పని పైరసీ లో చూద్దామనుకున్నారా? ;) ః) ;) మీ వరానికి నా నమస్కారాలు ;)
థాంక్యూ నాగ్రాజ్ గారూ ;)
రవికుమార్ గారూ హిహిహి సేం పించ్ థాంక్యూ
అన్నోన్ గారూ థాంక్యూ
రాధిక గారూ అదృష్తవమ్తులు... థాంక్యూ ;)

నారాయణస్వామి గారూ.. ;)))))) ధన్యవాదాలు ;)
సుజాత గారూ థాంక్యూ ;)
అనానిమస్ గారూ కంట్రోల్... కంట్రోల్... ;)
కొండవీటి నానన్నా థాంక్యూ సో మచ్ ;)

రాజ్ కుమార్ said...


చంద్ర గారూ థాంక్యూ వెరీమచ్ ;))))))
పవన్ కుమార్ గారూ థాంక్యూ వెరీ మచ్
మనోజ్ గారూ హహహ్.. థాంకులు ;)
విజయ్ తమ్ముడూ..ధన్యవాదాలు ః) ఆ సినిమాలు పాతవి అయిపోయాయి గా.. దొంగలు పడ్డ ఆర్నెళ్ళకి కుక్కలు మొరిగినట్టు ఇప్పుడెందుకు? ;)
అనానిమస్ గారూ అలాగలాగే ;)
అను గారూ, రౌడీగారూ, కిషోర్ గారూ, చబ్బీ.. థాంక్యు వెరీ మచ్
శివరాం గారూ నాకు ఎందులో మంచి భవిష్యత్తు ఉన్నదీ?? క్లియర్ గా చెప్పండి

రాజ్ కుమార్ said...


సుజాత గారూ ఇప్పుడప్పుడే కాదు లెండీ. తాప్సీ పాపం దురదృష్టం ;( అందంగా ఉందండీసినిమాలో ;)
అనానిమస్ గారూ ;)))))) కేవలం కొత్త సినిమాలు మాత్రమే ;) థాంక్స్
వాసు గారూ ః)))))) అన్నీ అనుకూలిస్తే చూద్దాంలెండీ.. థాంక్యూ వెరీ మచ్ ;)
పావని ప్రసాద్ గారూ థాంక్యూ వెరీఈఈఈఈ మచ్ అండీ

@krishna pinniti థాంక్యూ వెరీ మచ్ ;)
కిరనా..అలాగే... అలాగే ;) ః) థాంక్యూ
అనానిమస్ గార్లందరికీ థాంక్స్
జ్యోశ్న గారూ హిహిహి అదే కదా అంతా రమేషుని దయ ;) థాంక్యూ
శిరీష గారూ థాంక్యూ అండీ
అనానిమస్ గారూ ః))))))))))))))
My almanac గారూ థాంక్సో ;)
అనానిమస్ గారూ ఏదో సరదాకి అన్నార్లెండీ కూల్ ;) ;) థాంక్యూ

రాజ్ కుమార్ said...


నవీన్ గారూ థాంకులు
kvRao గారొ నిజమేనండీ. నా తరుపున డైరెక్టర్ కి థాంక్సో ;))))))
TV srinivas గారూ యెస్... ;) ధన్యవాదాలు
yallapragada sree ram siva nag tapasay గారూ థన్యవాదాలండీ ;)
బోనగిరి గారూ ... కదా.... నాకూ ఆశ్చర్యం ధన్యవాదాలండీ

నియోగి గారూ మీకు ముందుగా ధన్యవాదాలు. తోటరాముడు గారు సీనియర్ & ఫేమస్ రైటర్ అండీ. ఆయనని తెలియని వారు ఎవరూ ఉండరు ఇప్పుడు ఎక్కువ గా రాయటం లేదు. ఆయన శిఖరం. మిగిలినవి కూడా చదవండి ఎంజాయ్ చేస్తారు.
అనానిమస్ గారూ థాంక్యూ
చాతకం గారూ అహహహ్ థాంక్యూ వెరీ మచ్
చైతన్య.ఎస్.. ప్రేక్షకులకి ;)
కోటేశ్వర్ గారూ థాంక్యు ;)
రూప్ గారూ హిహిహి ;)))))))))
ఆదిత్య గారూ థాంక్యూ ;)

రాజ్ కుమార్ said...శ్రుతి గారూ నేను సినిమా తీసేవాడిని కానండీ చూసేవాడిని. ఎలా ఉన్నాదో చెప్పాను గానీ ఎలా తియ్యాలో సలహాలు ఇవ్వలేదు గా?
నవీన్ గారూ ష్యూర్ ;) పుస్తకాలు రాసేంత సీన్ లేదు లెండీ ;) ఏదో పడిన బాధని , కోపాన్నీ ఇక్కడ రాసుకున్నానంతే ;)
బాల్రాజ్ గారూ థాంక్యూ ;)
సునీల్ గారూ మరీ అమ్త వయొలెన్స్ ఎందుకు లెండీ ;) థాంక్యూ ;)

being myself గారూ థాంక్యూ సో మచ్.. అన్నీ చదివేసి అభిప్రాయం చెప్పండీ.. ;)
RKris గారూ హహహ్హ.. థాంక్యూ అండీ.. మీలో క్షమాగుణం పెరిగిమ్దన్నమాత నైస్ ;)
Just jai gaaroo.. yeah.. heard the same :) that is mehar's creativity ;) & he totally forgot about that cassette ;))))))
ChiranD గారూ థాంక్యూ
అనానిమస్త్ గారూ., మానస గారూ, నాగిణి గారో థాంకుల్స్ ;)))))

అన్నానిమస్ గారూ TFI???? అంత ఆశల్లేవండీ ;)))))) థాంక్యూ ;)

జ్యోతిర్మయి said...

అక్కడ కలక్షన్ నిల్ ఇక్కడ కామెంట్స్ ఫుల్.
కేకలు....అరుపులు...

రాజ్ కుమార్ said...

రాస్తాడు గారూ.. అరకొరగా అర్ధం కావడానికి ఇదేమన్నా ఇన్సెప్షన్ సినిమానా? నాకు ఏది అర్ధం కాలేదు అని అనుకుంటున్నారో చెప్తే అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తానండి.
నేను రచయితని కాదండీ కేవలం ప్రేక్షకుడిని. రచయితలని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. రచయితలని నేను విమర్శించింది ఎందుకంటే ఇదే రైటర్ గారు "డైరెక్టర్లకి ఏమీ తెలీదు.. మొత్తం రాసేది మేమే.. హిట్లు మావల్లే, కష్టం
మాది, పేరు డైరెక్టర్లది' అన్నారు. రచయితలకి స్వేచ్చ లేదు, విలువ లేదు అని మీరంటున్నారు. అందులో నిజం ఉండే ఉండొచ్చు. నేను సినిమా చూసేవాడినే గానీ తీసేవాడిని కాను. అయితే ఒక సందేహం
హిట్టయిన సినిమాల కి క్రెడిట్ మాది అన్నారు, మా వల్లే హిట్ అన్నారు. మరి ఫ్లాపయిన సినిమాకి మాత్రం కేవలం డైరెక్టర్నే ఎందుకు బాద్ఘ్యుణ్ణీ చెయ్యాలి? ఆ సినిమాలకి బాగా రాశారు.. జనం మెచ్చారు సినిమా ఆడింది.
ఈ సినిమాకి వారి స్థాయి లో రాయలేదు. జనానికి నచ్చలేదు. మేం బాలేదు అని అంటే "కించ పరిచే మాటలు" అంటున్నారు. ఇది కరెక్టే అనిపిస్తుందా మీకు??

http://rajkumarneelam2.blogspot.in/2011/09/blog-post.html
ఇది చూడండి

ధన్యవాదాలు

జ్యోతిర్మయి గారూ.. హహహహ్హ అలాగే ఉంది మరి
థాంక్యూ అండీ

Anonymous said...

It's going to be end of mine day, except before ending I am reading this impressive post to increase my experience.

Have a look at my web page: acoustic guitar a chord

Gowri Kirubanandan said...

నెత్తి మీద కాకి గూడు పెట్టిందేమో అన్నట్టు ఉండే తాప్సీ కీ అందగాడైన తింగరి సుబ్బరాజు కాకుండా ముసలి కోతికి మేకప్పేసినట్టు ఉన్న గెడ్డం హీరో హ్యాండ్సమ్ గా ఉన్నాడని భ్రమించి ప్రేమించేస్తుంది.

ఇలాంటి వాక్యాలు ఎలా రాస్తారండీ మీరు? అదిరి పోయింది రివ్యూ.

దొరబాబు వొళ్ళంతా వెటకారమే said...

మా బర్రె ఖాతాలో మరొకరు భళి ..... అన్నటు మెహర్ రమేష్ ఖాతాలో వెంకి భళి

దొరబాబు వొళ్ళంతా వెటకారమే said...

మా బర్రె ఖాతాలో మరొకరు భళి ..... అన్నటు మెహర్ రమేష్ ఖాతాలో వెంకి భళి

రాజ్ కుమార్ said...

గౌరి గారూ.. సినిమా చూడండి ఆటోమేటిగ్గా వహ్చ్ఏస్తాయి. ధన్యవాదాలు ;)

అనానిమస్ గారూ థాంక్యు వెరీ మచ్ ;)

Unknown said...

చాలా బావుంది , మొదటిసారి మీ బ్లాగుని చూసాను, ఇంత హ్యాపీ గా ఫీల్ అయ్యాను ,చాలా చాలా బావుంది ...

మీకు వీలున్నప్పుడు మా బ్లాగుని చూడండి ,

ధన్యవాదాలు ,
http://techwaves4u.blogspot.in/
తెలుగు లో టెక్నికల్ బ్లాగు

Balarcade said...

We had a riot reading this in a party. Keep it up Raj. Need more Movie Reviews like this ... who can put things in real persepective, instead of the bland paid reviews in newspapers.

ganesh said...

మ్యూజిక్ : పెళ్ళిళ్ళకీ, దినాలకీ బ్యాండ్ మేళం వాయించినట్టు వాయించొదిలాడు తమన్ బాబు. టైటిల్ సాంగ్ మాత్రం బాగుంది (ఎక్కడ నుండి కొట్టుకొచ్చాడో మరి). ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయానికొస్తే స్టీల్ సామాను గచ్చు మీద పడేసి అదే టైం లో "షా..డో.. షాడోఓ..." అని అరిపించి అదరగొట్టాడు.
ముఖ్యంగా "ఏయ్ ఐతలకా..ఉస్క్ లకా..తద్దినకా జజ్జనకా డంకనకా జింకుచికా హోయ్" అనే పల్లవి తో మొదలయ్యే పాట సాహిత్యం, పిక్చరైజేషన్... మహాద్భుతం.

Sayaram said...

Last lo mee sontha dialogues adiripoyai.....baga navvanu.....superb......

రాజ్ కుమార్ said...

reddy Tarun గారూ.. థాంక్యూ అండీ.. మీ బ్లాగ్ కూడా చూశాను. మంచి విషయాలు రాస్తున్నారు ;)

Balarcade gaaroo.. thank you so much.. will try ;)

Ganesh garu.. thank you andi ;)

సాయారాం గారూ ధన్యవాదాలండీ ;)

Unknown said...

Abba emi rasaru andi review...chala rojula taravtha inthala navvukunna..mee review lo naku baga nachina line
ఒక వేళ బతికుంటే పాపం తన వాళ్ళని చంపారనుకొని హీరో షాడో అవతారం ఎత్తి అన్యాయంగా మాఫియా డాన్లని చంపేస్తున్నాడే అని బాధ పడ్డాను. నా కోడి మెదడు లో సవాలక్ష సందేహాలు....

Ultimate comedy ga undhi..

Unknown said...

abba emi rasu andhi review chala bagundhi .. chala rojula taravtha inthala navvukunna ...meeru rasina review lo naku baga nachina line.
ఒక వేళ బతికుంటే పాపం తన వాళ్ళని చంపారనుకొని హీరో షాడో అవతారం ఎత్తి అన్యాయంగా మాఫియా డాన్లని చంపేస్తున్నాడే అని బాధ పడ్డాను. నా కోడి మెదడు లో సవాలక్ష సందేహాలు.....keka...meer inka inka e lanti utter flop cinemalu rayalani korukuntunna..

Unknown said...

abba emi rasu andhi review chala bagundhi .. chala rojula taravtha inthala navvukunna ...meeru rasina review lo naku baga nachina line.
ఒక వేళ బతికుంటే పాపం తన వాళ్ళని చంపారనుకొని హీరో షాడో అవతారం ఎత్తి అన్యాయంగా మాఫియా డాన్లని చంపేస్తున్నాడే అని బాధ పడ్డాను. నా కోడి మెదడు లో సవాలక్ష సందేహాలు.....keka...meer inka inka e lanti utter flop cinemalu rayalani korukuntunna..

Malineni Vamshi krishna said...

abba emi rasu andhi review chala bagundhi .. chala rojula taravtha inthala navvukunna ...meeru rasina review lo naku baga nachina line.
ఒక వేళ బతికుంటే పాపం తన వాళ్ళని చంపారనుకొని హీరో షాడో అవతారం ఎత్తి అన్యాయంగా మాఫియా డాన్లని చంపేస్తున్నాడే అని బాధ పడ్డాను. నా కోడి మెదడు లో సవాలక్ష సందేహాలు.....keka...meer inka inka e lanti utter flop cinemalu rayalani korukuntunna..

Priya said...

హహ్హ్హహ్హహ్హ... బాబోయ్! రాజ్ గారు.. ఇప్పుడే జెమినీ లో ఈ అద్భుతమైన సినిమా ఎందుకు చూస్తున్నానో కూడా తెలియకుండా చూస్తూ అనుకోకుండా మీ ఈ పోస్ట్ చూశాను. సరిగ్గా ఏం చదువుతున్నానో అదే స్క్రీన్ మీద జరుగుతోంది. అబ్బాహ్ పొట్ట చెక్కలయిపోతోందంటే నమ్మండి నవ్వి నవ్వీ! మీ రివ్యూ కేక!

అసలు వెంకటేష్ లాటి హీరో ఇలాటి గొప్ప సినిమా ఎలా ఒప్పుకున్నాడో ఎంత బుర్ర బద్ధలు కొట్టుకున్నా అర్ధం కావడంలేదు.

Anonymous said...

raj garu,
Firstly mee writing style super andi..jandhyala gaarini gurthu chesesthunnaru mee sarcasm tho..
ee madhya cinema lu chudatam leda? meeru raase review lu chadavadaniki waiting andi..Koncham update chesthu undandi pleeeaaasee! :)

Unknown said...

very nice sir
మీ రివ్యూతో ఒక మాంఛి కామెడీ మూవీ చూపించేరు..రివ్యూ చింపేసారు

onlinejyotish.com said...

మరే సినెమా చూడాలంటే టికటే కాదు, కూసింత ఓపిక, ఒక ఝండూబామ్ సీసా కూడా కావాలి.
మద్యలో పని ఒత్తిడిలో బ్లాగ్ మిస్ అయ్యాను. చాలా రొజుల తర్వాత :)

రాజ్ కుమార్ said...

Vamshi Krishna Malineni గారూ ధన్యవాదాలు ;)
Priya గారూ కొరివితో వీపు గోక్కోడానికి ఉదాహరణ ఈ సినిమా చూడటం. థాంక్యూ
అనానిమస్ గారూ , venkatesh gurrala గారూ, సంతోష్ కుమార్ గారూ ధన్యవాదాలండీ

Maitri said...

Wow :) How did I miss all these hilarious posts all this time!
Sorry. Telugulo raayadaaniki ippudu veelu padatam ledu. Mee posts anni ninnatinundi chadavadam modalupettenu. Chala baagunnayi.
Krishna Veni

Unknown said...

nice blog hrnice blog hrnice blog hrnice blog hr

Unknown said...

Boss meeru super.. nenu first time blogger telugu lo chustunnanu.. Good work keep it up. And to book movie tickets online in India you must book your tickets in mastitickets.in because of it is very good site i have seen recently and its very user friendly. Visit this site : Masti Tickets

Unknown said...

Nice blog...but why you stop update information about Telugu Movies

Srilatha Behara said...

very nice blog... pls visit www.jobsandexams.com

Srilatha Behara said...

excellent blog... www.cinepopularnews.com

sangeethrm said...

wonderful Post.Keep posting such Telugu movies, Telugu movie reviews posts.Thanks