ప్రజలారా.. తెలుగువారిగా మనందరికీ తెలుసు మహేష్ బాబు కి మేకప్ అక్కర్లేదనీ, శ్రీనువైట్ల సినిమా కి స్టోరీ అక్కర్లేదనీ, మనం కామెడీ మాత్రం మనం కనెక్ట్ అయిపోతామనీ. కానీ నెత్తి మీద పిడుగు పడినప్పుడూ,
పాము కాటేసినప్పుడూ, గేదె పేడేసినప్పుడూ ఒకటే మంత్రం వేస్తానంటే జుత్తు కాలిపోయి, నోట్లోంచి నురగలొచ్చేసి, సీన్ కంపు కొడతాది... సినిమా తీసినోళ్ళకీ, చూసినోళ్లకీ కూడా.! ఆ తర్వాత ఇదిగో... ఇట్టాంటి పోస్టులు చదవాల్సిన కర్మ పడతాది మీకు.
చిన్న ఊక దంపుడు కార్యక్రమంః
గుడుంబా శంకర్ తో మొదలయ్యి ఫెయిలయిన ఒక స్టోరీ టెంప్లేట్ నీ, మార్పులు చేసి బంపర్ హిట్ లు కొట్టిన ఘనత శ్రీమాన్ శ్రీను వైట్ల దే. అది ఎలాంటి ఘనతంటే
ప్రస్తుతం తెలుగు సినిమాలకి డైరెక్టర్లు వేరై ఉండొచ్చు, హీరోలు మారి ఉండొచ్చు, హీరోయిన్లు కామన్ అయి ఉండొచ్చు, రైటర్లకీ, డైరెక్టర్లకీ పడకపోయి ఉండొచ్చు, విడిపోయి విడివిడి గా దాడి చెయ్యొచ్చు కానీ "ఆవు వ్యాసం" లాగా అదే టెంప్లేట్.
ఈ ఎదవ ఫార్ములా పుణ్యమా అనీ తెలుగు హీరోలు కమెడియన్లు గానూ, హీరోయిన్లు , ఐటెం నంబర్లు గానూ, విలన్లు బఫూన్లు గానూ, కమెడియన్లు హీరోలుగానూ రూపాంతరం చెందారు. హరిశ్చంద్రుడి జీవిత చరిత్రైనా, సిపాయిల తిరుగుబాటు కధ అయినా ఈ టెంప్లేట్ లో పెట్టాక
ఒకలాగే తయారవుతాయి.
ఉదాహరణకి రామాయణాన్ని సినిమాగా తీయమని వీళ్ల చేతిలో పెడితే ఈ కమర్షియల్ టెంప్లేట్ లో పెట్టి, అవసరం అనుకుంటే కామెడీ బిట్లు హిందీ సినిమాల నుండీ, కాన్సెప్ట్ కొరియా సినిమా నుండీ, ఫైట్లు హాలీవుడ్ సినిమా నుండీ లేపేసి కలిపేసి పులిహోర చేసి హిట్ చేసెయ్యగలరు.
సపోజ్... పర్ సపోజ్... ఇదే శ్రీనుగారికి మహేష్ బాబుని రాముడుగా పెట్టి రామాయణాన్ని తీయమంటే......... అది ఈ ఆవు వ్యాసం టెంప్లేట్ లో ఇల్లా అవుతుంది.
(గమనికః ఇదో భయంకరమైన, మా చెడ్డ ఊహ మాత్రమే. నాకు రామాయణం అంటే ఇష్టం, గౌరవం)
సినిమా బిగినింగ్ లో బాల రాముడు-దశరధుడి మీద రెండు సెంటిమెంట్ సీన్లు, అడవి లో ఫస్ట్ ఫైట్, ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ సాంగ్, తొట్టిగ్యాంగ్ ఫ్రెండ్స్ తో కామెడీ, సీత తో పరిచయం-డ్యూయెట్, సూర్పణఖ తో లక్ష్మణుడి ఐటెం సాంగ్.(క్షమించాలి)
ఇంటర్వెల్ బ్యాంగ్ కి రావణాసురిడి తో చాలెంజ్, సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం ఎంట్రీ (దీనికి లాజిక్కులతో పని లే..!!) బ్రహ్మానందాన్ని బకరాని చేసి, ఆ అడ్డెట్టుకొని రావణాసురిడింట్లో మకాం. విలన్ గ్యాంగ్ ని మొత్తాన్నీ వెధవల్ని చేసి, ఇంద్రజిత్ తో ఫైటింగ్ చేసీ చంపేసీ,చివరాఖర్న రావణాసురిడి లో మార్పు తెచ్చి, శాంతిని నెలకొల్పి సీతని విడిపించుకొని శుభం కార్డ్ వేసి, టికెట్ రేటు వందా, ధియేటర్లు వెయ్యీ పెంచి ఫస్ట్ వీక్ కలెక్షన్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తారు. ఈ వారం రోజులూ టీవీ నైన్ లో లైవ్ షో దగ్గర నుండీ దూరదర్శన్ లో పందుల పెంపకం
ప్రోగ్రాం దాకా గెస్ట్‌లు గా వీళ్ళే ఉంటారు. ఏ రియాలిటీ షో జూసినా ఏమున్నది గర్వకారణం.. హిట్టయిన సీరియల్ ఆర్టిస్టులూ, ఫ్లాపయిన సినిమా బృందాల ఓవరాక్షన్లూ తప్ప. ఆ సినిమాని ఏ పండక్కో టీవీ లో వేసే లోగా, యూట్యూబ్ లో పెట్టే లోగా బస్సు యాత్రా, నా వల్లకాడు యాత్రానూ..!!
అసలు సంగతి వదిలేశాను. కీలక మైన పంచ్ డైలాగులు. ఇప్పుడు SuperStar in & as శ్రీరాముడు గా అద్దిరి పోయే పంచ్ డైలాగ్స్.
[మరే.... పంచ్ డైలాగుల ప్రభావం జనాల మీద గట్టి గానే ఉంది]
మధ్య మధ్య లో ముక్కు ఎగబీలుస్తూ...
కీచు గొంతుతో.... రవణా...(రావణా) ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.... బాణం దిగిందా లేదా ?
రవణా..... మధురై ని కాపాడ్డానికి మీనాక్షమ్మ ఉందీ.. నా సీత ని కాపాడుకోడానికి నేనున్నాను
బాణం తీశాకా.. బ్లైండ్ గా వేసెయ్యటమే (నీ దూకుడూ... సా...టెవ్వడూ... )
విభీషణుడు హ్యాండిచ్చాడంటగా.. మండోదరి హ్యాపీసా? యుద్ధా.......నికొస్తున్నారంటగా? గెలుపూనాదే సీతా నాదే... ఎప్పుడిస్తున్నావ్ సీతనీ ఆ .....?
పడుకున్న పులినీ, వనవాసం చేసుకుంటున్న నన్నూ కెలికితే..... వేటే
దూకుడు లేకపోతే ఈ రాముడుకీ కీ ఆ రావణుడికీ తేడా ఏం ఉంటదీ?
నేను యుద్దానికొస్తే నరకం లో హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టుకోవాలి
బాణాలకి బెదరని బాడీ రా నాదీ..!
మా నాన్నెప్పుడూ ఒకటి చెప్తుండేవాడు "మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మూకుడు లో వేపుడైపోద్ది బతుకూ.. అని"
విల్లు చూడాలనుకో.... తప్పులేదు.. కానీ బాణాన్ని చూడాలనుకోకు చచ్చిపోతావ్.
మహేశ్ః రావణాసురుడు గారు.. మీరు చేసింది తప్పు.
రావణాసురుడుః తెలుసయ్యా.. కానీ మానలేకపోతున్నాను. పూర్వం పది డబ్బాలు వాడేవాడిని.ఇప్పుడు తగ్గించా.
మహేశ్ః నేను మాట్లాడేది మెంతోప్లస్ గురించి కాదండీ.
రావణాసురుడుః కొంపదీసి సీత గురించా? చూడు రామా... నువ్ ఇప్పుడొచ్చావ్.. నేను ఆల్రెడీ జటాయువు రెక్కలు తెగ్గొట్టోచ్చాను. అది తెలిస్తే మీ వాళ్ళకి హార్ట్ ఎటాక్ వస్తుందీ.. రామసేతు దగ్గర రెడీగా ఉండు
నేను ఈ లంకా నగరం చేత &$*$(@% కొచ్చాను.
ఈళ్ళేంటీ.. ఇంగ్లీష్ మాట్లాడ్డం ఏంటీ అనుకుంటున్నారా?? "సినిమాల్జూట్టం లేదేటీ??"
ఇంకేముందీ... పంచ్ డైలాగులకి సినిమా హిట్టు. మనోభావాలు గాయపడినందుకు ధియేటర్ బయట ధర్నా చేసిన ప్రజానీకం. రెండో వారం ఊపందుకున్న కలెక్షన్లు. సినిమా సూపర్ డూపర్ హిట్టు.
***********************************************************************************************************************
ఏదో రాద్దామని మొదలెట్టి ఇంకేదేదో రాసినట్టున్నా... ఫ్రస్ట్రేషన్.. ఫ్రస్ట్రేషన్..!!! ఇంట్లో మా ఆవిడ ప్రేమ పూర్వక హింస , ఆఫీసులో మా డామేజరు అధికారిక హింస. రిలాక్స్ అవ్వడానికి సినిమా కెళ్తే వినోదాత్మక హింస.
పొద్దున్న తొమ్మిది నుండి రాత్రి ఎనిమిదింటిదాకా ఆఫీసు లో అఘోరించి, బజారు చేసీ, ఇంటి కొచ్చి, అంట్లు తోమి, వంట చేసీ (కంట్రోల్...కంట్రోల్... అబ్బెబ్బే అదేం లేదు...అంతా తూచ్..) పదింటికి ఐదొందలు పెట్టి టికెట్ట్ కొనీ "ఆగడు" సినిమాకెళ్ళి మహేష్ బాబు ఎంట్రన్స్ కి విజిలేసి
అలసిపోయిన పాపానికి ఇదా ప్రతిఫలం???
ఈ సినిమాకి రివ్యూ రాసే ఓపిక మాత్రం నాకు లేదు బగమంతుడా..!! ఓ ఉత్తరం ముక్క మాత్రం రాస్తున్యా.
నాకు చాలా డౌట్లు ఉన్నాయ్... ఐ వాంట్ ఆన్సర్స్ రైట్ నౌ.
గౌరవనీయులైన శ్రీను వైట్ల సారు కీ,
మీ కొత్త సినిమా "ఆగడు" బాధితుడు పిచ్చాసుపత్రి నుండి అశ్రు నయనాలతో , రక్త కర్ణాలతో, శిరోభారం తో, స్వహస్తాలతో రాస్తున్న విన్నపం ఏమనగా,
అయ్యా... గత కొన్నేళ్ళుగా మీ సినిమాలకి కామెడీ సీన్లు తీశాక స్టోరీ అల్లుకుంటారనిన్నూ, బ్రహ్మానందం లేని మీ సినిమా బాస్మతీ రైస్ లేని బిర్యానీ లాంటిదనిన్నూ సమైక్య వాదులూ, తెలంగాణా వాదులూ మూకుమ్మడి గా ఒప్పుకునే ఒకే ఒక్క గోప్ప వాస్తవం. సర్వ కధ సమ్మేళనం లాంటి మీ ఏకైక కధ భిన్నత్వం లో ఏకత్వాన్ని ఎలుగెత్తి
చాటుతూ ఎక్కడ మొదలవ్వుద్దో , ఏడేడ తిరుగుద్దో ఎవ్వరూ పట్టించుకోరనీ, మీ చేతకాని తనాన్ని క్షమించేసి
హాస్యాన్ని మాత్రం ఆస్వాదించి డైలాగులు నెమరేసుకొంటూ హాలు బయటకొస్తారన్నది జనమెరిగిన సత్యం.
1. సినిమా మొదలవ్వటమే దుమ్ము, ధూళి తో మొదలయ్యింది. అది చూసి "బెంగుళూర్ లో పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసీ, మరో వైపు పొగ" అనేసుకొని నేను తెగ ఇదైపోయాను. ఆ తర్వాత రియలైజ్ అయ్యి పోనీ లే ఔట్ డోర్ షూటింగ్ అక్కడ ప్లాన్ చేశారు అనుకున్నాను. మొదటి పాట కూడా
ధూళి బాంబులు పేలుస్తూ, ఆ దుమ్ము లోనే తీశారు. ఎందుకలగా?? "సినిమా దుమ్ము లేపుతాది" అని చెప్పడమా? లేకా మీ టీం తల విదిలించగా రేగిన మట్టా??
2.అసలు మా గురించి మీరేం అనుకుంటున్నారు??
"అవునండయ్యా.. మా ఇండస్ట్రీ లో మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ & డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు జనాలకి కావల్సినవన్నీ కొలిచి వాళ్ల టెంప్లేట్ లో మసాలాలు దట్టించి వదుల్తారు. ఎందుకంటే మా ప్రేక్షకులకి ఇవే కావాల.
మన జనాలున్నారే?? తీసిన సినిమాని మళ్ళీ మళ్ళీ తీసి చూపించినా, హిట్టయిన సినిమాలని మిక్సీ లో వేసి వండేసినా, కామెడీ బాగుంటే కాంప్రమైజ్ అయిపోతారు. ఆ కామెడీ లేక పోతే హారర్ సినిమాలు కూడా చూడరు తింగరి కుంకలు. (నిజమే కదా??)
ఈళ్ళ మొహాలకి హాలీవుడ్ రేంజ్ సినిమాలొద్దు గానీ, హాలీవుడ్ సినిమాలనుండి లేపేసిన సీన్లు, ఫైట్లూ చాలు.
ఎవడైనా ధైర్యం చేసి "1" లాంటి సినిమాతీస్తే అరాయించుకొనే శక్తి లేదు. మిధునం లాంటి సినిమాలకి ధియేటర్లు దొరికే పరిస్థితి లేదు. చూసే ఓపిక అస్సలు లేదు. ప్రాసలు రాసే రైటర్లు, తన్నులు తినే బ్రమ్మానందం, ట్రయిలర్లు చూసి ఫేస్బుక్ లో
కొట్టుకు చచ్చే ఫ్యాన్సుండగా మా కేల చింత??"
ఇదేనా మాపై మీ అభిప్రాయం?? అందుకేనా మిగిలిపోయిన పలావునీ, పాచిపోయిన పులిహోరనీ కలిపి పోపెట్టి పార్సిల్ చేసేసి మా ప్రాణాల మీదకి తెచ్చారు??
౩. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న.
సినిమా లో క్యారెక్టర్లన్నీ, ఎవరో తరుముకొస్తున్నట్టూ, పాడైపోయిన లౌడ్ స్పీకర్ మింగినట్టూ హడావిడిగా, హై పిచ్ లో అరుస్తాయెందుకనీ?? దీన్నేనా ఏక్టర్ల భాషలో టైమింగ్ అంటారు??
దూకుడు సినిమా క్లైమాక్స్ లో బ్రహ్మీ చూపించిన ఎనర్జీ కి జనాల రియాక్షన్ బాగుందని ఈ సినిమా మొదటి నుండీ చూపించాలన్న దురాశే అలా చెయ్యించిందా?? మహేష్ చేత బ్రహ్మీ ని ఇమిటేట్ చేయించినట్టుగా అనిపించలేదా?? అవి డైలాగులు చెప్పినట్టు లేవు దేవరా.... కాకా హోటల్ లో సప్లయిర్ "ఇడ్లీ,వడా,పూరీ,ఉప్మా, పొంగల్, దోసా,పెసరట్,మినపట్," అని గ్యాప్ లేకుండ లిస్ట్ చదివినట్టూ, సాఫ్ట్వేర్ కంపెనీ పేర్లకి అబ్రివేషన్స్ వింటున్నట్టూ ఉన్నాది. ఒక్క డైలాగన్నా పూర్తిగా చెవులోకెళ్తే మీ నెక్స్ట్ సినిమాకి నాకు ఫ్రీ టెకెట్స్ పంపించి పగదీర్చుకోండి.
4. ప్రాస ఉన్న ప్రతి మాటా పంచ్ డైలాగ్ ఐపోతుందా?? అవసరం ఉన్నా లేకపోయినా రైమింగ్ కోసం రాసి పారేస్తారా?? ఆ రైమింగ్ కోసం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పక్కనెట్టుకొని రాసినట్టూ బొచ్చెడు ఇంగ్లీష్ పదాలు
గ్యాప్ లేకుండా రాసి పొలాల్లో మందుకొట్టినట్టూ మా చెవుల్లోకి పిచికారీ చేశారు. వై దిస్ కొలవెర్రి ఢీ గోవిందా?? బాద్షా
సినిమాని హిట్ చెయ్యలేదని ఇంత పగబడతారా??
5. నేను ఒక శ్రీను వైట్ల సినిమాకి వెళ్ళీ, ఒక్క సారి కూడా నవ్వకుండా రావడం. ఇదొక రికార్డ్ మాషారూ..! మా తాత చనిపోయినప్పుడు కూడా అంత సీరియస్ గా లేను నేను.
ఫస్టాఫ్ లో బ్రహ్మీ వచ్చాక నవ్వుదామని వెయిట్ చేశాను. బ్రహ్మీ వచ్చాక సినిమా ఎప్పుడైపోద్దా అని వెయిట్ చేశాను. బహుశా నాలో హాస్యగ్రంధులు హరించుకుపోయాయేమో..!!
5. ఫస్టాఫ్ గబ్బర్ సింగ్ నీ ( హీరో ఇంట్రొడక్షన్, హీరోయిన్ కాస్టూంస్ తో సహా పోలిక కనిపించేలా) , సెకండ్ హాఫ్ దూకుడునీ కలిపేసి రీమిక్స్ చేసి వదిలేస్తానంటే చేసెయ్యడానికి మేం ఏక్టర్స్ కాదూ.. రిసల్ట్ డిసైడ్ జేసే ఫ్యాక్టర్స్. (ఇదీ పంచ్ డైలాగుల ప్రభావమే)
తమరికి షార్ట్ టైం మెమొరీ లాస్ గానీ ఉందా లేకా మాకుందని మీ ఫీలింగా?? ఈ రోజుల్లో జనాలు చాలా షార్ప్ గా ఉన్నారయా.. సీన్ చూసి ఏ సినిమా నుండి లేపేశారో, ట్యూన్ విని ఏ ఆల్బం కాపీ కొట్టారో ఫేస్బుక్ లో పెట్టి దులిపేస్తున్నారు. అంచేత "నో చెవిలొ పువ్వెట్టింగ్...నో చెవిలొ పువ్వెట్టింగ్"
6.తమన్ బాబు గారి మొబైల్ లో ఇంటర్నెట్ ప్యాకేజ్ వెయ్యించలేదా?? కొట్టెయ్యడానికి కొత్త పాటల్లేక వారు సొంత ట్యూన్స్ ఇచ్చినట్టున్నారు. ఏంది సార్ ఆ పాటలో?? అసలేంటంటున్నాను?? దూకుడు పాటల్నే మళ్ళీ పెట్టుకోవాల్సింది. మిమ్మల్ని ఎవరాపగలరు?? ఇహ ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాబా...
పాలరాతి నేల మీద అందమైన అమ్మాయి హై హీల్స్ తో క్యాట్ వాక్ చేసినట్టూ "టిక్కుం..టిక్కుం..ట్రియ్యుం ట్రియ్యుం"
7. ఇందాకే వీడియో లో చూశా. ఆ డైలాగులు అర్ధం చేస్కోడానికి రెండో సారి చూడాలనీ, ఆ పై ఎల్లలు లేని ఎంజాయ్మెంట్ మీదేననీ సెలవిచ్చారు.... అడ్డెడ్డె... అర్ధం చేసుకోడానికి మళ్ళీ మళ్ళీ చూడ్డానికి ఇది క్రిస్టోఫర్ నోలన్ సినిమా కాదు గదా శ్రీను వైట్ల కామెడీ సినిమా.
8.పాపం ప్రకాష్ రాజ్ ఎమోషనల్ స్పీచ్ ని ఏజిటీజ్ గా వాడేసుకుని కమ్మగడతారా? తప్పు కదూ?? పోనీ ఆ డైలాగు అక్కడ విలన్ కి సూటయ్యి ఏడ్చిందా అంటే అదీ లేదు." గిసుంటివి మస్తు జేసినం. గిదేమన్నా ఫస్ట్ టైమా? నాకు నచ్చకపోతే నెక్స్ట్ సినిమా లో క్యారెక్టర్ ని చేసి కసి దీర్చుకుంటా" నంటారా?? వాకే...!
9. సినిమా మొత్తం అయిపోయాక, చూశాక "సినిమా ఏంటి ఇంత చెత్తగా ఉందీ?" అని మీకు ఎందుకు అనిపించలేదూ అని ప్రశ్నిస్తా ఉన్నా?? సోనూ సూద్ లాంటి విలన్ని పెట్టుకొని, క్లైమాక్స్ లో బ్రహ్మీ చేత గ్రాఫిక్స్
డాన్సులు చేయించడమేందో.. జనాల్ని నవ్వించీడానికే?? ఆ...హా??
10. కేవలం పంచ్ డైలాగుల కామెడీ, పాత సినిమాల పేరడీ ఒకసారి చూడొచ్చు. రెండో సారి భరించొచ్చు. కానీ మళ్ళీ
మళ్ళీ చూపిస్తుంటే వాటికోసం రిపీటెడ్ గా ఎగబడే రోజులు కావండయ్యా. యూట్యూబ్ లో బొచ్చెడు కామెడీ షార్ట్
ఫిల్మ్స్ ఉన్నాయ్. టీవీ లో వచ్చే జబర్దస్త్ కీ, సినిమాలకీ కొంచెం తేడా చూపెట్టండి. అప్ డేట్ అవ్వండి అయ్యోరా..!
"సినిమాని విమర్శించడం కాదు.. నువ్వు తియ్యగలవా..?? అసలు సినిమా గురించి మీకేం తెల్సు?" అని, టికెట్టు
కొనుక్కొని ఆ తర్వాత నెత్తి కొట్టుకొని ఏడ్చే మా లాంటి ప్రేక్షకుల మీద పడకండి. మాకు స్క్రీన్ ప్లే లాంటి పదాలకి
స్పెల్లింగులు కూడా రావు. (అందుకే తెలుగు లో రాశా).
కొత్తగా ఉంటే కధ బాగున్నట్టూ, పాత కధయినా ఆసక్తి గా చూస్తుంటే స్క్రీన్ ప్లే బాగున్నట్టూ, పాటలొచ్చినప్పుడు ,
ఫైట్లొచ్చినప్పుడు కూడా సెల్ ఫోన్ చూడకుండా ఉంటే సినిమా సూపరన్నట్టు.
మీ నెక్శ్ట్ సినిమాలు వస్తాయి కదా... ఒంగడు,దాగడు,దగ్గడు, మింగడు,కక్కడు.. మున్నగు టైటిల్స్ తో. మా లాంటి బాధితుల ఆవేదనని అర్ధం చేసుకొనీ వాటిని కొంచెం చూడదగ్గ సినిమాలుగా తీసి వదలాల్సిందిగా వేడుకుంటున్నాను.
"లేదూ... ఆ శీనువైట్ల ఆనందం, వెంకీ సినిమాలకే పరిమితం, ఇప్పుడు స్టార్ డైరెక్టర్నీ.... సరికొత్త శీను ని , పూర్తిగా
మారిపోయాను" అంటారా?
ఇట్టాంటి సినిమాలు ఇంకా తీసి మమ్మల్ని చచ్చేలా చావగొట్టండి. ఆ తర్వాత హృదయకాలేయం, మూత్రపిండాలూ, అరుస్తున్న పేగులు, మెదడు వాపు, లాంటి టైటిల్స్ తో మరిన్ని సినిమాలొచ్చి మీరు ఇత్తడి చేసొదిలేసిన మా మీద ఇంత మట్టేసి పోతాయి. దరిద్రం వదిలిపోద్ది.
చివరిగా...
ఈ సినిమా లో కొన్ని డవిలాగులున్నాయిగా కత్తి తో మామిడికాయ కోసినట్టూ.. కస్ కస్ కస్ లాడుతా.... ఆ స్టైల్ లో చెప్పుకుంటే
ఈ సినిమా ఒక Senseless,worthless,time killing,money wasting,torturing,brain damaging,bone breaking,,boring, blunderful,harmful,pathetic,predictable,unbearable,unstoppable, routine,రొట్ట , చచ్చు, పుచ్చు చెత్త సినిమా.
ఇల్లాంటి డైలాగులు మాకు ధియేటర్లో ఎలా వినిపించినియ్యో తెలుసునా??
Senselessworthlesstimekillingmoneywastingbraindamagingbonebreakingtorturingboringblunderfullharmful
patheticpredictableunbearableunstoppableroutineరొట్టచచ్చుపుచ్చుచెత్తసినిమా.
ఇంతే సంగతులు
చిత్తగించవలెను.
జై హింద్.!!!

70 comments:
Super review. Cinema choosina dourbagyullo nenu kooda okadini.
Nenokkadine laanti cinemalu flop ayithe illanti cinemaale vasthai andi. mana karma anthe
Sooperoooo sooperu..
Naa kasi kontha panchukunnaru..thanks..
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక, బాద్షా తర్వాత ఆ రేంజ్ లో రివ్యూ
Innalu Emaipoyaru
Meeru kothaga try chesaru ,
Mee old making (puches e) super,
Bahusha Aagadu effect anukunta.
Dooramga pokandi .
Super(????)movies vastunai,
chala miss avuthunnam minimalni .
Keep in touh .
In bolg or FB
Srinivas
Raj!!!...Ee post chadivithe Srinu suicide cheskuntademoo alochinchu...post chaduvuthunnathasepu AHA NA PELLANTTA movie lo brammi kalla mundu kanipinchadu...
Thank god movie chudaledu.....n Ika chudanu kuda...Nice review..
Hyd lo new posters vesaru dance steps(2 fingers round ga petti chupisthuadu...) kuda dookudu nundi tesaru anipinchindi
-Roopa
భలేగా వుంది సార్ మీ కామెంటరీ. మీరూ రాసెయొచ్చు సినెమాలకి డయలాగులు. ఆల్ ద బెస్ట్

భయ్యా డవిలాగులు అద్దిరిపోనాయి....నీ భాధ కూడ అర్ధం అయ్యింది...అన్ని సినెమాలనుంచి ఎత్తిపెత్తినా కొంచెం అన్నా నవ్వు వస్తుందేమొ వెళ్ళి చూద్దాం అనుకున్న...రక్షించావు....
"కొత్తగా ఉంటే కధ బాగున్నట్టూ, పాత కధయినా ఆసక్తి గా చూస్తుంటే స్క్రీన్ ప్లే బాగున్నట్టూ, పాటలొచ్చినప్పుడు ,
ఫైట్లొచ్చినప్పుడు కూడా సెల్ ఫోన్ చూడకుండా ఉంటే సినిమా సూపరన్నట్టు."
బాగా చెప్పారు
Satish.
మీ లేత హృదయాన్ని వైట్ల ఎంత బాధించాడో నాకర్థమైంది :-)
సినిమాకంటే మీ రివ్యూ కామెడీగా ఉంది.
3వ ప్రశ్న చాలా కరక్టు, ముఖ్యంగా ఫస్టాఫులో. డబ్బింగు చెప్పే ముందు అందరికి మంచి ఘాటైన కొత్త ఆవకాయ అన్నం పెట్టించినట్టు గట్టిగా అరిచి మరీ డైలాగ్స్ చెప్పారు. ఇంగ్లీషు మీడియం పిల్లలకైతే అర్థం కావు.
ఇలాగే మహేష్‌బాబుతో అతిగా వాగించిన ఖలేజా సినిమా ఎలా ఆడిందో పాపం శ్రీను మర్చిపోయాడు.
Super dialogues...hilarious review..
ధీరా!!!! ధీరా ఎవరంటావేమో!! నా చిన్నప్పటి స్నేహితుడు.. కథ పొడుగ్గా ఉంటది. క్రంచ్ చేసి చెప్తానే.. ఆడు బాగా తెలివైనోడు.. కాని ఆడికి కథల పిచ్చి.. కథ చదివి నచ్చకపోతే కథ కన్నా పొడుగ్గా ఇంకో కథ రాసీవోడు.. జనాలు కథనీ మర్చిపోయే వారు.. ఈడి కథనీ మర్చిపోయేవారు.. నీ క్రియేటివిటీని క్రాప్ మీద కాకుండా క్రాఫ్ట్ మీద పెట్టమని చెప్పాను. అందుకు అలిగి నాతో మాట్లాడ్డం మానేసి వాట్సాప్ లోకెళ్లిపోయాడు. అప్పట్నించి ఆడ్నెదుక్కుంటూ తిరుగుతున్నా.. ఇన్నాళ్ళకి నీ రూపంలో కనిపించాడు.. ఒకసారి శంఖూ అని పిలు..
good review by rajkumar 4.5/5
చాలు మహప్రభొ.. office లో monitor చూస్తూ నవ్వుతున్న నన్ను అంత అదో రకంగా చూస్తున్నారు ! :D
"మీ నెక్స్ట్ సినిమాకి నాకు ఫ్రీ టెకెట్స్ పంపించి పగదీర్చుకోండి." సూపర్
-దినకర్
ఆగాడు సినిమా వలన చాలా రోజుల తర్వాత మీ బ్లాగ్ పోస్ట్ చదివే భాగ్యము కలిగింది. ఎప్పటిలాగే పోస్ట్ అదిరింది. శీను తన తరువాత చిత్రం మిమ్మల్ని పొలి ఉండే పాత్ర సృష్టిస్తాడు ఎమో చూసుకోండి. ....:-)
ఈ రివ్యూను చదివితే పరిగెత్తుకెళ్ళి నీళ్ళులేని బావిలోదూకుతాడు శ్రీనువైట్ల .
మీ బ్లాగ్ చూడటం వల్ల మీ రచనా నైపుణ్యం తెలుసుకున్నాను... ఇంత బ్రహ్మాండమైన బ్లాగుని ఇంతకాలం మిస్స్ అయ్యాను....మీ విశ్లేషణా శైలి అద్భుతహా..వారు వీరు ఎందుకు మీరే తెలుగు స్క్రీన్ ప్లే రాసేస్తే సరి..ముందు మీ బ్లాగ్ ని వాటిలోని సారాంశం మీద పేటెంట్ హక్కు తీసుకోండి..లేకుంటే ఇక్కడినుండే స్క్రీన్ ప్లే,డయలాగులు ఎత్తెసే అవకాశం ఉంది సినిమా వాళ్ళకి ముఖ్యంగా వైట్లకి... కోన వెంకట్ విడిపోయాక మాంచి కచ్చతో డయలాగ్స్ అతనికన్న బాగా రాసి మెప్పించాలని పేజీలకు పేజీలు రాశారు...కాని ఆ వాగుడుకి తల వాచింది.ఈ వాగుడు రిలీస్ అయ్యిన కొన్ని గంటల్లోనే డీ.వీ.డీ ప్రింట్ నెట్లో వచ్చిందంటే ఈ సినిమా ఏపాటిదో అర్ధమయ్యింది..
ఎవరన్నా పరభాషా చిత్రాలను రీమేక్ చెయ్యాలనుకుంటారు..కాని వైట్ల గొప్పతనం ఏంటంటే తన సినిమాలన్నింటినీ ఒక్క సినిమాగా రీమేక్ చెయ్యడం..వెరసి కంగాళీ గోంగూర లా తయారయ్యింది..
పంచ్ డయలాగ్స్ అంటూ ఈ మధ్య తెగ ఊదరగొడుతున్నారు జనాలు....అవేమో సరిగా పేలి ఏడవ్వు....పైగా బోల్డు వెటకారియాలు సినిమాలు...వెటకారియా రొంబ చండాలియా...
ఈ సినిమా ఒక ఆగని వాగుడు......
one of the worst movies i have seen offlate..

one of the worst movies i have seen in sometime

ha...ha...raj nuvvu post veyalante oka plop cinima tagalali.lolz
మీ చేత రివ్యూ రాయించుకునే రేంజ్ కి రావాలని డైరెక్టర్లందరూ పోటీ పడి బాగా కృషి చేస్తున్నట్టున్నరు :))
అబ్బబ్బా...ఎంత బాగా చెప్పారు. నిజంగా ఇంత చెత్త సినిమాని ఈ మధ్య కాలంలొ చూడలేదు. నేను ఐతే హాల్‌లొనే మా వారిని పెద్దగా అడిగేసాను. ఏంటి శీను వైట్ల ఇంక సినిమాలు తీయడా? ఇదే లాస్ట్ సినిమా అన్నట్లు డైలాగులు రాసాడు అని? ఇంటెర్వల్ టైమె కి తల నొప్పి వచ్చి అది మూడు రొజులైనా తగ్గలేదు. ప్రామిస్. ఇంక తెలుగులో టైప్ చేయటం నా వల్ల కాదు కాని.. Missed reading your reviews and blog...pelli aindani blog ni marchipote ela :) I had to read this to take away the headache. Mee post kinda plug ins add cheyochu kada...FB lo share cheyataniki..btw, you should also try to write dialogues for movies..
మీరు కాస్త ఆగండి రాజ్‌కుమార్ గారూ, ఆగండి :)
రివ్యూ సూపర్ :)
. ఆ తర్వాత హృదయకాలేయం, మూత్రపిండాలూ, అరుస్తున్న పేగులు, మెదడు వాపు, లాంటి టైటిల్స్ తో మరిన్ని సినిమాలొచ్చి మీరు ఇత్తడి చేసొదిలేసిన మా మీద ఇంత మట్టేసి పోతాయి. దరిద్రం వదిలిపోద్ది.
mamule, cinema choodakkarla.... review adaragottesaav
Adaragottav guru. Cinema ki vellakonda cinema chuponchav... Hats offfff.....
మీ స్టైల్ లో రివ్యు ఇరగదీసేసారు. థంక్ యు.
సినిమా అయిపోయాక వెంటనే ఈ రివ్యును స్క్రీన్ పై చూపించి, వినిపిస్తే ప్రేక్షకులకు కనీసం తము పెట్టిన టికెట్ డబ్బులకు ఎంతో కొంత కామిడి చూసినట్లు అవుతుంది. నవ్వు మొహాలతో ఇంటికి వెళ్ళగలరు :-)
కేక రాజ్...
కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడల్లా నీ బ్లాగ్ లోకి తొంగిచూసే వాళ్ళలో నేనూ ఒకడిని..
సూపర్,
ఎ రివ్యూస్ చూసైనా తెలుగు డైరెక్టర్స్ కొంచెం మారితే మేలు :)
సినిమాలో మూడుగంటలు భరించిన టార్చర్ కి కాస్తైనా ఉపశమనం లభించినట్లు అనిపిస్తుంది రాజ్ నీ రివ్యూ చదువుతుంటే.. థాంక్స్... రివ్యూ అదుర్స్.. కొందరు డైరెక్టర్స్ అయినా ఈ రివ్యూలో నువ్ చెప్పిన పాయింట్స్ గురించి సీరియస్ గా ఆలోచిస్తే బాగుండు.
adarahoooooooooo!
innaalluu ee nippu ni ye nivuru kappindi?
srinivaitla gari samadhanam ila untundemo!
"ivannee vedallone unnayisha bhayya! badha padaku"!
రాజ్ కుమార్ అన్నాయ్ ,
అరిపించావ్ నీ రివ్యూ తొ. సూపెరంటె సూపరు!!!
ఒక తమ్ముడు
రాజ్‌బాబు నువ్వు శ్రీనువైట్లని కడిగి ఉతికి తిరగేసి మెలేసి తిప్పి ... తిప్పి బండకేసి కోట్టి చింపేసి రక్కేసి బరికేసి పీల్చి పిప్పి చేసి ఆరేసావు.... (ఏం చేస్తాం, ఆగడు, పంచ్ డైలాగుల ప్రబావం ఇంకా తగ్గలేదు నా మీద)
ఎవరన్నా ఈ రివ్యుని శ్రీనువైట్లకి పంపి పుణ్యం కట్టుకోండి.
రెండవ ప్రశ్న కరెక్ట్ గా అడిగావు రాజ్, తప్పు స్టార్ దర్శకులదే కాదు, ప్రేక్షకులది కూడా ఉంది. కామెడి బావుంది అంటే చాలు, కాంప్రమైజ్ అయిపోతారు. నువ్వు చెప్పింది నిజమే, ఒన్ లాంటి సినిమాలు, మిధునం లాంటివి మన జనాలకి అరగవు... ఏదో ఓ కొద్దిమందికి తప్ప. మిగతా వాళ్ళకంతా అలాంటి సినిమాలు గుళకరాళ్ళే ... !!
రాజ్, ఆగడు మమ్మల్ని నిరాశ పరచిన, నువ్వు మాత్రం కుమ్మేసావ్ పొ ... :-)
Bhale comedy review ra babu...good bagane kasta paddav
Do not tell that people will not accept "1" like movies.... then what about Gajini
They accept comedy less movies as well if the script and story are proper. Mainly,
scipts should be spell bound when the story is entirely new. Then it will make audience forget about comedy.
"1" movie failed not because of it had no comedy, because it created confusion in audience than instigating curiosity........
vammoooooooooooo... superrrrrrrrrrrrrrrrrrrr
మహేశ్ః రావణాసురుడు గారు.. మీరు చేసింది తప్పు.
రావణాసురుడుః తెలుసయ్యా.. కానీ మానలేకపోతున్నాను. పూర్వం పది డబ్బాలు వాడేవాడిని.ఇప్పుడు తగ్గించా.
మహేశ్ః నేను మాట్లాడేది మెంతోప్లస్ గురించి కాదండీ.
రావణాసురుడుః కొంపదీసి సీత గురించా? చూడు రామా... నువ్ ఇప్పుడొచ్చావ్.. నేను ఆల్రెడీ జటాయువు రెక్కలు తెగ్గొట్టోచ్చాను. అది తెలిస్తే మీ వాళ్ళకి హార్ట్ ఎటాక్ వస్తుందీ.. రామసేతు దగ్గర రెడీగా ఉండు
Super ichav anna keka asalu
chaalaa baavundi mee review :)) ...inta chettagaa vunnaa maa pillalu selavalaki intiki raagaane ide chustaarata pch ...Radhika (nani)
పోస్టుమార్టం అరాచకం అంతే :-)
ఈ సినిమాలో శ్రుతి హాసన్‌ని చూసి జాలేసింది.
చక్కగా డీసెంట్‌గా ఉండే అమ్మాయికి ఐటెం సాంగ్ ఖర్మేమిటో!
raamayanam ante gowravam ani 1 line lo cheppi 10 lines lo aa epic ni insult chestoo raasaaru!!!! lakshmanudito soorpanaka item song ee line ni chadivaaka meeru tidutunna mana telugu commercial cinemaalu 100% better anipinchaay.... asalu aagadu cinemani tittadaaniki raamayanaanne enduku vaadadam!!! mottam chadive uddesyamtone vacchaa kaani "soorpanakato lakshmanudi item song" ani meeru power full linokati pettesariki mottam chadiventa dairyam cheyyalekapoyaanu.... daya chesi manaku mana peddollu dwaara alavadina samskaaraanni saraina paddatilo upayoginchandi... chowkabaaru vyaakyalu viluvaina grandhaalanuddesinchi raayakandi ani maryaada poorvakamgaa vinnavinchukuntunnnaaa!!!!
Mee review chala bagundi... Cheppinavanni facts... Present tollywood prekshakulandari samasya idi.... Kani meeru ichina conclusion bagoledu..... Same review Andaru directors ki varthisthundi... Meeru vallani marandi marandi ante vallu maradaniki ready ga leru.... Be coz vallu maraleru.... Vallu Inka kothavi try chesi janalni entertain cheyadam kastamaina pani.... Deeniki solution okate kothollaki chance ivvali.... So meeru vallaki marandi anekante kothavallaki chance ivvandi ante baguntundi....
Regards,
Ajay Focus
anna merevarogani hatsafff.....
entanna adi cinemanaa 2 are 3 movies ni kalipi chavagottaru....seenayya neko dandammm ni cinemako dandam....
నేనింకా సిన్మా చూడ్లేదు...మీ రివ్యూ చదివాక చూడాలని లేదు....మీ రివ్యూ స్టైల్ వండర్ ఫుల్!!
ప్రస్తుతం వస్తున్న సిన్మాలన్నీ అలాగే తగలడ్డాయ్...ఈ రివ్యూ శ్రీనువైట్లతొ పాటు...మిగతా డైరక్టర్స్ తో కూడా చదివించాలి...అప్పుడైనా ప్రేక్షకులకు ఈ రొటీన్ హింస తప్పుతుంది...Well done.
అన్నయ్యా, మొత్తానికి ఒక వెయ్యి రూపాయలు మిగిలించుకునేలా చేసావు. మా ఘోరమంగళలో టిక్కెట్టు 800 పెట్టాడీ దరిద్రుడు!
శంఖూ
శంఖూ...
శంఖూఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఉ
One of the most entertaining review... Was expecting (V)Aagadu to be as entertaining as your review... You have given the true picture of feelings of a common movie lover... You must talk about fans killing movies and movie makers creativity... Nijam cheppandi mana heros and directors ilanti product ivvadaniki sagam "records" kosam paakulade fans ni satisfy cheyadanike kaadaa? India cinema will flourish when people treat movies as an elememt of entertainment... Please pick on this subject
Ekkada kuda like option unte bagundedi ...cha I missed it ...even though I like a review
అడుసు తొక్క నేల ? కాళ్ళు కడుగ నేల !!
జేకే !!
అయినా మీరు మళ్ళీ మళ్ళీ అడుసు తొక్కితే నే కదా మాకూ ఇట్లాంటి సెటైరు పంటలు పండేది !!
కాబట్టి, రాబోయే కాలం లో మీరు మరిన్ని అడుసులు తొక్కాలని అవన్నీ ఇట్లాంటి సూపెర్ డూపరు టపాలై మాకు ఆనందాన్ని ఇస్తాయని ఆశిస్తో ... మరో మారు వెయ్యిరూపాయలు ఆదా చేసి నందుకు ధన్యవాదాలతో
జిలేబి
చాలా కాలానికి మళ్ళా రివ్యూ రాసారు .... రివ్యూ అదరహో !!!!
Hilarious!!!! Super review!!
తెలుగు ప్రజల సామూహికంగా అనుభవించినా చిత్రవధకు అక్షర రూపమిచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు... శ్రీను వైట్ల చదివితే బాగుంటుంది. కానీ ఆత్మహత్య ప్రయత్నాలు గట్రా చేదుకునే ప్రమాదం లేక పోలేదు సుమీ
Awesome Review Sir ! I can see the pain in your writings..Meeru chepparu ..memu cheppukoledu..
I am not surprised if Sreenu Vaitla copies some dialogues from this blog ! Dhee to Dookudu..same routine story.
Superb review.:-)
Reviewer cinema critic lo padi our so called epic vadukovadam bagaleadu.... Veedu director script writer ayithe situation yenta bad ga vuntundo?????
Rajakumara..mottaniki PK ki credit icchesav Gudumba shankar story ni template chesi vaadestunnarannattu..nuvvu anatakumundu cinemalu chudaleda?? Gudumba shankar kuda copy ye..inka deep ga vellalantey Balakrishna movie Top Hero kuda alaney untadi..
Masteruuu.. Mee mega flower fans maarara? Yendukandi inta jealous verevallu paiki vastay?
అయ్యా... ఒరిజినల్ ఐడి తో కమెంట్ పెట్టే ధైర్యం లేక అనానిమస్ గా బూతులు తిడుతున్న వారికి, అవి నేను పబ్లిష్ చెయ్యటం లేదని మళ్ళీ మళ్ళీ కమెంట్స్ పెడుతున్న వారికీ చెప్తున్నదేమనగా,
మీరు మర్యాదగా మీ వ్యూ చెప్పి ఉంటే నేను పబ్లిష్ చేసి ఉండేవాడిని. నా మీద ఏంటీ మషేష్ ఫ్యాన్ గా ముద్ర వేసి తిడుతున్న వాళ్ళూ, పవన్/చరణ్/అల్లు అర్జున్ సినిమా లని ఇలాగే విమర్శిస్తూ ఎందుకు రివ్యూ రాయలేదు అనేవాళ్ళూ నా బ్లాగ్ లో పాత పోస్ట్ లు చూడండి.
అంత కన్నా ముందు దూకుడు సినిమా మీద రాసిన రివ్యూ చదవండి.
http://rajkumarneelam2.blogspot.in/2011/09/blog-post.html
నన్ను టార్చర్ పెట్టిన తీన్మార్,రచ్చ,బద్రీనాధ్ సినిమాల మీద రాసిన రివ్యూలు చదివి రండి.
నేను పవన్ ఫ్యాన్ ని అయినంత మాత్రాన వాళ్ళు తీసే ప్రతీ చెత్త సినిమానీ పొగిడేస్తాననీ, విడుదలైన ప్రతీ చరణ్ సినిమా చూసేస్తాననీ , మహేష్ బాబు సినిమా కి మాత్రం బ్యాడ్ పబ్లిసిటీ ఇస్తాననీ ఏవేవో ఊహించేసుకోకండి. నేను ఎంతో ఎక్స్పెక్టేషంస్ తో, నా డబ్బులు పెట్టి చూసిన, "సెలెక్టెడ్ సినిమా" నాకు అస్సలు నచ్చక పోతే నా బాధ బ్లాగులో రాసుకుంటా, ఆ సినిమా సూపర్ హిట్టయినా సరే, హీరో ఎవరైనా సరే.
మీకు సినిమా నచ్చితే మళ్ళీ మళ్ళీ చూసి, ఎంజాయ్ చేసి, ఇండస్ట్రీ హిట్ చెయ్యండి ఎవరు ఆపగలరు మిమ్మల్ని.ఇక ఈ దాడి ఆపండి. మీకు మళ్ళీ మళ్ళీ సమాధానాలిచ్చే తీరిక లేదు నాకు.
Super Review boss....
Cinema kanna mee review ke fans ekkuva vunnaru!!!
kathalo dammu lekapothe maa thaman anna music em kodataadu bhayya!!!
ITFA
(International Thaman Fans Association)
70 Rs/ పెట్టి సినిమా ను చూడలేనోడు OR 70 Rs/
లకే సినిమా చూసినోడు .ఏ అర్హత తొ విమర్ష చేస్తాడొ నాకు అర్థం కావడం ..నోటికి మాట చేతి కి పేన్ను, ఖర్చు లేనిబ్లాగు వుండగానే ఎలాపడితే అలా అనే స్వేశ్చ ( అదే బావ వక్తికరణ అంటారు లే ) ఓ Director ను విమర్షించడం ఫ్యాషన్ అయింది.
సినిమా కథ అంశం సమాజానికి హానీ/ కీడు చేసేది వుంటే ప్రస్నించడం తప్పు కాదు ..కానీ కథ ట్రిట్ మేంటు ను ఆడిగే అదికారం ఏవ్వరికి వుండదు. అది అతని స్వేశ్చ ..... విమర్ష రాసే ముందు ఓకసారి ..కథ స్రీన్ ప్లే అపాల్రాజు సినిమా చూడాండి
70 Rs/ పెట్టి సినిమా ను చూడలేనోడు OR 70 Rs/
లకే సినిమా చూసినోడు
ఏ అర్హత తో పొగిడితే ఉబ్బిపోతున్నారు .... అదే 70 Rs/ పెట్టి సినిమా ను చూడలేనోడు OR 70 Rs/ లకే సినిమా చూసినోడు ... అంతకు ముందే అదే సినిమా ని హాలీ వుడ్ లో చూసి .... మక్కికి మక్కి కాపీ కొడితే .... తన డెబ్బై రూపాయలు బూడిద లో పోసిన పన్నీరు కాదా ??
ఆ మాత్రం విమర్శ ని తీసుకోలేని జనాలు క్రియేటివ్ ఫీల్డ్ లో పనికి రారు
Rs 70 పెట్టినోడికే కాదు, Rs 10 పెట్టి సినిమా చూసే నేల టిక్కెటు ప్రేక్షకుడికైనా సరే, సినిమా బాగోకపోతే విమర్శించే హక్కు ఎందుకు ఉండదో శ్రవణ్ కుమార్‌గారు కాస్త వివరిస్తే బావుండేది.
కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నది ఈ పది,పరకలతో ప్రేక్షకులు కొనే టికెట్ల కోసమే అనే ప్రాధమిక విషయం నిజమయితే, ప్రతి ప్రేక్షకుడికి ఉతికి ఆరేసే హక్కు ఉంది.
@Sravankumar Veerlapati
మా డైరెక్టర్ అంత హిట్ ఇచ్చాడు.. మా హీరో అంత హిట్ ఇచ్చాడు అని చెప్పుకోవాలంటే ఈ 70 రూపాయల జనాలే గతి అని మర్చిపోకండి. ప్రేక్షకుల వల్ల దర్శకులు డబ్బులు సంపాదించుకుంటున్నారు తప్ప సినిమాల వల్ల ప్రేక్షకులకు వచ్చేది జేబుకి చిల్లు మాత్రమే..
సినిమా చూసిన తరువాత కలిగిన నా భావాలని అక్షరాల లొనికి మారిస్తే సేం టు సేం తొ ఇలాగీ ఉంటుంది.
100 % original review !
దూకుడుసింగ్ లు ఆగాలంటే ఇలాంటి రివ్యూలు అవసరం. శ్రీను వైట్ల - మహేష్ బాబు ఇద్దరికీ ఈ రివ్యూ పంపాలి. రిసీవ్ చేసుకుంటే బాగుపడతారు. ఆగడు అరాచకం భవిష్యత్తులో రిపీట్ కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. నాకు తెలిసినంతవరకూ రాజ్ కుమార్ రాతలలో దురభిమానం ఉండదు. సినిమా తీసినోడికి ప్రమోట్ చేసుకునే అవకాశం ఉన్నట్లే చూసినోడికి రివ్యూ వ్రాసుకునే అధికారం ఉంటుంది.
సర్, మీ రివ్యూ చాలా ఒరిజినల్ గా బాగుంది.
ఈ సినిమా పెద్ద సుత్తి అని ట్రైలర్ చూసినప్పుడే అర్ధం అవుతుంది. అన్ని విసువల్స్ గబ్బర్ సింగ్ ని తలపించాయి.
ముఖ్యంగా శ్రీను వైట్ల ఇంగ్లీష్ రైమింగ్ డైలాగ్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా రాద్దామనే తపనలో రాసి ఫెయిల్ అయినట్లు ఉంటాయి. ఇది నాకు దూకుడు చూసినప్పుడే అర్ధం అయింది.
లేకపోతే ఎంతమంది సగటు ప్రేక్షకులకు aversion అనే మాటకు అర్ధం తెలిసి ఉంటుంది?
"ఒంగడు,దాగడు,దగ్గడు, మింగడు,కక్కడు.." సూపర్
ఈ రోజుల్లో సినిమాలని డైరెక్ట్ గా రిలీజ్ అయిన వెంటనే థియేటర్ లో చూసే సాహసం చెయ్యట్లేదు. వాళ్ళ ప్రమోషన్ చూసి టెంప్ట్ అయ్యే పరిస్థితే లేదు.
నేనైతే ఆల్రెడీ చూసి రిస్క్ చేసిన వారి ఫీడ్ బ్యాక్ విన్న తర్వాతే చూస్తున్నా.అది చాలా బాగా పనిచేస్తోంది.
థాంక్ యు
మీరు ఏధైనా పోస్ట్ పెట్టరేమో నేను మిస్ అవుతానేమో అని రోజు ఒక్కసారైన తొంగి చూస్తాను మీ బ్లాగు లోకి ఆశగా. కానీ ప్రతీసారి నిరాశ తప్పడం లేదు.
నేను తెలుగు సినిమాలు ధియేటర్కెళ్ళి చూడడం మానేసి నాలుగేళ్ళయ్యింది. నాజేబులోని వెయ్యిరూపాయలనోటుకి స్వయంగా నేనే నిప్పంటించితే కలిగే బాధకన్నా, తెలుగు సినిమాలని తెలుగు సినిమా ప్రేక్షకులు అనే చెత్తవెధవల (వాళ్ళ మనోభావాలు గాయపడితే నేను చేయగలిగిందేమీ లేదు) మధ్య గంటైనా కూర్చోవడం నాకు ఎక్కువ బాధ కలిగిస్తుండడంవల్ల. తెలుగు సినిమా ప్రేక్షకుల బుధ్ద్ధిహీనతపైన ఆధారపడి దర్శకమ్మన్యులు సినిమాలు తీస్తున్నారని గట్టిగా డిసైడైపోయి అలాంటి బుధ్ధిహీనులనుండీ నన్నునేను distinguish చేసుకోవడానికిగానూ నేను తీసుకున్న నిర్ణయమది.
ఒకనెలక్రితం ఈ ఆగడు సినిమాని చూశాను. నేను తెలుగు native speakerను. నా తెలుగు ప్రబంధాల స్థాయిలోలేకున్నా a triffle below the excellence అని చెప్పగలను. అలాంటిది ఈ సినిమాలోని డైలాగులు sub titlesలేకుండా అర్ధం చేసుకోవడం నాకు కష్టమయిపోయింది. The movie is a pure sHIT. If that were to be regarded a hit, I feel I have a right to look upon the Telugites with condescence.
అన్నట్లు... ఈమధ్య A millioneer's First Love అన్న కొరియన్ సినిమాను చూశాక అది 'పిల్లజమీందార్' అన్న విషయం అర్ధమయ్యింది. పిల్లజమీందార్ నాకు నచ్చినాకూడా అలాంటి సున్నితమైన ప్రేమకధను తెరకెక్కించే స్థాయి, (తెలుగు ప్రేక్షకులకు ప్రేమ అనే పదార్ధం అర్ధమవుతుందన్న) confidence లేని దర్శకుడు దాన్ని కామెడీగా మార్చడం చూసి జాలీ అసహ్యం కలిగింది.
What a Review Guru I Like it.ThnQ SoooooooooooMuchhhhhhhh
Post a Comment