మగధీర లాంటి బ్లాక్ బస్టర్ మళ్ళీ తీసేద్దాం.. భారీ గా బడ్జెట్ పెట్టేద్దాం అనీ, బాక్సాఫీస్ షేక్ చేసేద్దాం అనీ ఆల్రెడీ బన్నీ కి ఒక హిట్టీచ్చిన వినాయక్ ని డైరెట్రు గా పెట్టీ ఎక్కడా రాజీపడకుండా అంతా బాగానే సెట్ చేశాను అనుకున్నాడు బావ అరవిందు. కానీ క్రియేటివిటీ ని కేజీల్లెక్కన కుమ్మరించే "జీనియస్" రైటర్ చిన్నికృష్ణ గారిని, వారి గొప్ప కలగూర కధ నీ నమ్ముకోవటం అనేది కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదటం లాంటిదనీ
ఎందుకు తెలుసుకోలేక పోయాడో ఏమో..! ఫలితం గా సినిమాలోనూ, అది చూసే జనాల కళ్ళల్లోనూ రక్తం ఏరులై పారిందీ..కొన్ని సినిమాలకీ రిలీజ్ కి ముందే డైరెక్టరో, మ్యూజిక్ డైరెక్టరో మరొక సన్నాసో కొన్ని హింట్లు ఇస్తారూ.. "ప్రజలారా.. మిమ్మల్ని పీడించడానికి రాబోతున్నాం" అని. ఈ సినిమాకి చాలా ఇచ్చారు.
చిన్నికృష్ణ : ఈ సినిమా స్టోరీ.. ఒక అధ్బుతం. నేను చాలా యేళ్ళుగా నా దగ్గరే ఉంచుకున్నా.. (అనగా.. ఎవ్వరూ తీసుకోలేదు అని.. రీసెంట్ గా అరవింద్ బావ చెవిలో పుచ్చపువ్వు పెట్టుకొని కనిపించాడు ;))
వినాయక్ : ఈ సినిమా స్టోరీ ని అర్ధం చేసుకోడానికే నాకు చాలా టైం పట్టిందీ ( అర్ధం లేని స్టోరీ ని అర్ధం చేసుకోడానికి అంత టైం ఎందుకు పట్టిందో గానీ..?)
కీరవాణి : ఈయన మాటల్లో చెప్పలేదు. పాటల్లో వినిపించాడు. (నా ఉద్దేశ్యం లో ఈ సంవత్సరం వచ్చిన అన్ని ఆడియోల్లోనూ వరస్ట్ సాంగ్స్ ఇవే).
ఇవిగాక.. సినిమా సంతకెళ్ళ బోతుందీ అని చెప్పే 2 నిమిషాల ట్రైలర్.
ఇన్ని హింట్లు చెప్తున్నావ్.. సినిమాకి ఎందుకెళ్ళావ్? అంటారా? కేవలం అల్లు అర్జున్ డ్యాన్స్ కోసం & ఏదో ఒక మూల పిచ్చి ఆశ. సరే... ఇప్పుడు మీకు ఈ కహానీ ని 3D లో నేరేట్ చేస్తానూ.. ఎంజాయ్ చెయ్యండి.. (మీ కర్మ బర్న్ అయ్యింది ఈరోజు.)
"బద్రీనాద్" కి క్షేత్రపాలకుడిగా నియమిస్తాడు. బద్రీనాధ్ ఫైటీంగ్ లు బాగా నేర్చుకొనీ శక్తిమాన్ లాగా గాల్లో ఎగిరి పిచ్చి పిచ్చి గా కొఠేస్తుంటాడు అందరినీ. ఇంతలో దైవభక్తి గల ఒక బాగా బలిసున్న తాతగారూ, భక్తి లేకుండా ఆపాదమస్తకం బలుపుండీ,
చూడటానికి బక్క పలచగా ఉండే మనవరాలితో కలిసీ బద్రీనాధ్ వస్తాడు. చనిపోయిన హీరోయిన్ పేరెంట్స్ కి పిండం పెట్టీ హీరోయిన్ ని పడగొట్టీ, ఆవిడగారి కోసం ఫైటింగ్ లు చేస్తాడు హీరో (మరే.. "పిండం పెట్టిన ప్రేమికుడు" ;) ).
ఆవిడేమో ఒన్‌సైడ్ లవ్వులో మునిగిపోయీ ఫస్టాఫ్ లో రెండూ, సెకండ్ హాఫ్ లో మూడూ పాటలేసుకుంటాది. నాస్తికురాలు కాస్తా ఆస్తికురాలు అవుతాది. ఇదే టైం లో ప్ర.రా ఏమో హీరోని తన వారసుడిగా చేద్దాం అనుకుంటాడు.అందుకు నిబంధన గా
హీరో ప్రేమకీ, పెళ్ళీకీ,పప్పన్న్నానికీ దూరంగా ఉండాలనీ హీరో పేరెంట్స్ దగ్గర మాట తీసుకుంటాడు. ఇది తెలుసుకున్న హీరొయినూ కొంప మునిగేలా ఉందనీ బ్రహ్మకమలం సమర్పించీ దేవుడికి మొక్కుకునీ, ఆరునెలల తర్వాత బద్రీనాద్ వచ్చి దైవదర్శనం చేస్కుంటే తప్పకుండా కోరిక నెరవేరుతుందనీ హీరో ద్వారా తెలుసుకోనీ, తనే తన చేత దైవదర్శనం చేయించాలనీ వీరో దగ్గర మాట తీస్కుంటాది. ఈ లోగా దుర్మార్గులయిన ఒక అమ్మ, ఒక నాన్న, ఒక కొడుకూ హీరోని చంపీ(చంపాం అనుకొనీ), హీరోయిన్ ని బదరీనాధ్ లో కిడ్నాప్ చేసీ బల్లారి తీస్కెళ్లిపోయి, తాతగార్ని చంపేస్తారు. (దేశముదురు సినిమా లా అని పిస్తే నేనేం చెయ్యలేను.).
ఆరు నెలల తర్వాత హీరో హీరోయిన్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? లేకా గురువుకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? హీరోయిన్ కోరిక నెరవేరిందా? అనేది క్లైమాక్స్.
అయ్యా... క్లుప్తంగా ఇదీ స్టోరీ..
అల్లు అర్జున్ కొత్త హైర్ స్టైల్, కొత్త గెటప్, డ్రెస్సింగ్ అంతా ఓకే. ప్రతీ సీన్ లోనూ అయితే పరిగెడుతూనో, ఎగురుతూనో ఉంటాడు లేక పోతే కత్తి పట్టుకొనీ నరుకుతూ ఉంటాడు. క్యారెక్టర్ కి అవసరమయినంత వరకూ తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని చూపెట్టాడు.
చాలా సీన్ ల లో హింస ఎక్కువ అయిపోవటం వల్ల సెన్సార్ వాళ్ళు కత్త్రిరించేశారు. మాటీ మాటికీ స్క్రీన్ తెల్లబోతుందీ. బన్నీ డ్యాన్స్ లు మాత్రం ఇరగదీసాడు. ఆ పాటలు విన్నప్పుడు వికారం గా అనిపించాయ్ గానీ చూసేటపుడు తన డాన్స్ వల్ల పర్లేదు
అన్పించాయ్. ఓంకారేశ్వరి (భం భం బోలే సాంగ్ లా ఉంటాది) , ఇన్ ద నైట్, అంబదరీ, కన్ను మూస్తే బద్రీనాద్, పాటల్లో స్టెప్స్ ఉతికి ఆరేసి పాతరేశాడు. కానీ ఇంకా బాగా ప్రెజెంట్ చేసిఉండాల్సిందీ అన్పించిందీ. ఆర్య2 లో కన్నా గొప్ప స్టెప్స్ వేశాడు గానీ
అంత కిక్ ని ఇవ్వలేక పోయాయ్. తమన్నా ఎంట్రన్స్ చాలా సింపుల్ గా తీసేసాడు. ఎప్పటిలాగానే బిర్లా వైట్ సిమెంట్ కొట్టినట్టూ తళ తళా మెరిసిపోయిందీ. ఎంత తెల్లగా ఉన్నా ఆ తొక్క కప్పిన బక్క ఎముకలని చూడటం కష్టమే. బాగా సన్నబడిపోయింది ఎందుకో మరి (బొక్కు దవడలు, ఎత్తు పళ్ళూ కనిపిస్తున్నాయ్.) ;). చక్కనమ్మ చిక్కినా అందమే అనుకుంటే చూడచ్చు కానీ 100% లవ్ లోనే బావుందీ. వీలయినంత వరకూ చిన్నప్పటి చాలీ చాలని బట్టలేసుకొని వచ్చేసి సంతోష పెట్టింది ;) ;) ;).
విలన్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా లేదు. వాడు ఉండేదే నాలుగో, ఐదో సీన్లు. ఆటలో అరిటి పండన్నమాట. విలన్ వైఫ్ గా వేసిన నటీమణి ఎవరో తెలీదుగానీ. తెలుసుకోకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది.(శక్తి సినిమా గుర్తొస్తుంది తప్పని సరిగా). గొంతులో ఇసకేసుకుని అరిసినట్టూ , కంటికి కారం రాసుకొని ఏడిసినట్టూ రచ్చ రచ్చ చేస్తుంది.
మామూలుగా వినాయక్ సినిమాలో కామెడీ బావుంటుంది. ఈ సినిమాలో మాత్రం దాదాపు నిల్లు. ఇంద్రా సినిమా లో ఫస్టాఫ్ అరువు కామెడీ నే అవే క్యారెక్టర్ లతో అవే డైలాగులతో నస పెట్టి హింసించాడు. "బ్యాటీంగ్ బాబా 2000 ఇయర్స్" గా
బ్రహ్మీ ఎంట్రన్స్ అదుర్స్. ఏదో కొన్ని సెకన్లు నవ్విమ్చడానికి ట్రై చేశాడు.
సినిమా బిగినింగ్ లో ప్రకాష్ రాజ్ యుద్దవిద్యలు నేర్పించే ప్లేస్, సెట్స్, సూపర్ గా ఉంటాది. ప్ర.రా పొడిచెయ్యడానికి ఏమీ లేదు ఆ క్యారెక్టర్ లో. వసుధార సెట్ కూడా బానే ఉంటాది. హీరోయిన్ బ్రహ్మ కమలాన్ని కోసే సీన్ లో మగధీర సినిమా లోని
"బైరవ కోన" సెట్ నే ఆ శివుని విగ్రహం తీసేసి , మంచుతో మేకప్ చేసి వాడేసారు. ఓవరాల్ గా చూసుకుంటే ఆర్ట్ వర్క్ సూపరు. సినిమాటోగ్రఫీ కూడా అదుర్స్. దాదాపు ప్రతీసీనూ కంటీకింపుగానే కనిపిస్తుందీ. గంగానది ఒడ్డున, మంచి మంచి లోకేషన్స్ లో తీశారు.
కీరవాణి చేత బలవంతం గా చేయించారో తెలీదు, ఖర్చు కలిసొస్తుందనీ కీరవాణి పేరు మీద అల్లు అరవింద్ కంపోజ్ చేశాడో (కక్కురి ఎక్కువ అసలే) తెలీదు గానీ పాటలతో పాటూ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సో సో గానే ఉందీ.
ఏదో "కసకస బిసకస నసనస రుసరుస బద్రీనా.....ధ్" అని వస్తూ ఉంటాదీ బ్యాక్ గ్రౌండ్ లో... ప్చ్....!
డైలాగ్స్ కూడా అంతగా గుర్తుంచుకోదగినవి లేవు.. ;( బాగున్నవి చాలా తక్కువ.. నాకు గుర్తున్నవి ఇంకా తక్కువ.
1. ఇక్క్దడే ఆగిపోతే ఒక తల తోనే పోద్ది.. తెగించి ముందుకొస్తే తెగుతూనే ఉంటాయ్.
2.భ్రహ్మీః నేనే బ్రహ్మీ బాబా..2000 years. డైనోసర్లని చూడటం ఏమిటిరా వాటి గుడ్డుతో ఆమ్లెట్ వేసుకుతినేవాడిని.. "నాకు పెట్టవా..నాకు పెట్టవా" అని టిప్పు సుల్తాన్ అడిగేవాడూ.
బ్రహ్మీ గాందీని, మధర్ థెరీసా ని వాళ్ళ చిన్నప్పుడు ఎత్తుకుని తీయించుకున్న పోటోస్ కేక లాగా ఉంటాయ్.. సూపర్ అది మాత్రం ;)
౩. క్షేత్రపాలకుడు అంటే??? క్షేత్రం తో పాటూ, దాని పవిత్రతని కూడా కాపాడే వాడూ అని.
ఇప్పుడూ కొన్ని అధ్బుతమైన సీన్లు - డైరెట్రు గారి క్రియేటివిటీ + చిన్ని క్రిష్ణుని పైత్యం :
1.మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో హీరో "నేల మీదా, నీటి మీదా కాదు గురువుగారూ మీరు అనుమతిస్తే ఆకాశం లోకి తీస్కెళ్ళి కొడతాను" అని చెప్పేసి అపొనెంట్ తో సహా గాల్లోకి మాట్రిక్స్ సినిమాలో హీరో లాగా రాకెట్ ఎగిరినట్టూ ఎగిరి పోతాడూ. ఫైటింగ్ షురూ...!
2. బద్రీ........ అని పిలవగానే.. గాల్లో ఎగురు కుంటూ, జలపాతాల నుండి దూకేస్తూ (పులి సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా) ఎగ్జాట్ గా లొకేషన్ కి వచ్చేస్తాడు హీరో.
౩. ఇప్పుడొక అద్భుతమైన సీను చెప్తా.. ఇదే హైలైట్. అమర్నాధ్ యాత్రీకులని టెఱరిస్ట్లు కిడ్నాప్ చేస్తారు. పైగా టీవీ లో లైవ్ కూడా. అది ప్ర.రా చూసీ, లొకేషన్ కి వెళ్ళిపోయీ టెఱరిస్ట్ లని బెదిరించేస్తాడు. వాళ్ళు బెదరకపోయే సరికీ
వీరోగారు కత్తిపైట్ కాంతారావు లాగా టెఱరిస్ట్ లందర్నీ నరికేస్తాడూ. "ఏం వాళ్ళదగ్గర A.K 47 లు లేవా?" అంటారా? ఉంటాయ్. పాపం కాలుస్తారు కూడా. కానీ హీరో కత్తి గిఱున తిప్పీ బుల్లెట్స్ అన్నిటీనీ తిప్పి కొట్టేస్తాడు. ఒక్క బుల్లేట్ కూడా తగలదు. కొంతమంది గన్నులని కూడా కత్తితో సగానికి కట్ చేస్తాడు. (ఉన్నారా? ఢాం అని పడిపోయారా?)
వాళ్ళు మాత్రం మొత్తం మఠాష్. ఒక్క పోలీసు గానీ, ఆర్మీ వాళ్ళు గానీ ఉండరు అక్కడ. చుట్టూ చానల్స్ వాళ్ళు మాత్రం ఉంటారు. అదేం చిత్రమో? కలికాలం. బ్రమ్మం గారు ఆనాడే చెప్పారు ఇలాటి సినిమాలు వస్తాయ్ అనీ.
ఇలాంటి ప్రశ్నలడిగితే నేను చెప్పనంతే.. ఈ సినిమాలో పోలీసులు క్లైమాక్స్ లో కూడా రారు.
ఈ కాలం లో కత్తి ఫైటీంగ్ లేమిటో.. !
అతిగా తింటే పూతరేకులు కూడా మొహం మొత్తుతాయ్. ఈ సినిమా లో కత్తి ఫైటీంగ్ ల లాగా. ;( నిజానికి అర్జున్ చాలా కష్టపడ్డాడు ఫైట్స్ కోసం.. కానీ..ప్చ్... ఏదో వీడియో గేం ఆడినట్టూ అనిపిస్తుంది.
5. మధ్య మద్య లో సమయమ్ సంధర్బం లేకుండా హీరోయిన్ గారి ఊహల్లో పాటలూ, సో కాల్డ్ కామెడీ సీన్లూ వచ్చేస్తూ ఉంటాయ్. హేమిటో ఈ వినాయక్ కి పొట్ట పెరిగింది గానీ కపాలం లో ఖర్జూరం హరించుకుపోయింది.
6.హీరోయిన్ తాత కి హార్ట్ ఎటాక్ వస్తే మన బద్రీనాధ్ కొండ మీది మట్టి తెచ్చీ గుండెలకి రాస్తాడు. టక్కున తగ్గిపోద్ది. (ఏటీ నిజమే? ఇది గనక నిజమని నమ్మితే ఈ సినిమా చూసినోళ్ళంతా ఆ కొండ తవ్వి పారేస్తారేమో..)
7. వసుధార అని ఒక జలపాతం ఉంటాది. దాని కిందకి పాపాత్మ్లులు/ నాస్తికులు వెళితే జలపాతం పక్కకి జరిగి, ఆ తర్వాత వాటర్ ఆగిపోతుందీ. పుణ్యాత్ములు వెళితే మళ్లీ స్టార్ట్ అవుతాది. (ఎంత జలపాతం సెట్ వేస్తే మాత్రం... ఇంతకు తెగిస్తారా?)
అబ్బో... సినిమా అంతా ఇలాగే ఉంది జనులారా..! కాసేపు భక్తి చిత్రం అనుకున్నా... హీరోయిన్ ని చూసి రక్తి అనుకున్నా. కొన్ని సీన్లు చూసి ఇదేదో మంత్రాల సినిమా అన్కున్నా.. అంతలోనే ఫైటీంగ్స్... నవ్వించే ఏడుపులూ.. ఏడిపించే కామెడీ సీన్లూ ..... భగవంతుడా....!
మొత్తానికి మగధీర తీద్దామనుకొనీ కిచిడీ కాబడిన శక్తి సినిమాని మళ్ళీ తీశారు.... హ్మ్మ్... .
ముఖ్య గమనికః "జీనియస్" చిన్నికృష్ణా.. మామూలుగా నే నువ్వన్నా, కుక్కలన్నా నాకు పరమ చిరాకూ.. అసహ్యం తో కూడిన కోపం, కంపరం వగైరా..! నువ్ బెంగుళూర్ వస్తే గనకా వస్తే ఆ సంగతి నాకు తెలీనివ్వకు. నీ మంచికే చెప్తున్నా..! నీకు జంబో సర్కస్ లో జోకర్ వేషం వేసీ మా వీధి కుక్కలకి వనభోజనాలు ఏర్పాటు చేస్తా.. జాగ్రత్త.
43 comments:
ఇరగదీసారన్న సమీక్ష బాగుంది. ఒక సారి నా బ్లాగ్‌లో ఉన్న మెంటల్ ముఖ్యమంత్రిని సదివి సెప్పండన్న
సినిమా సంగతి ఎలా ఉన్నా మీ సమీక్ష చూస్తే చిన్నికృష్ణ, వినాయక్, అరవింద్ సామూహిక ఆత్మహత్యలు చేస్కోవడం గ్యారంటీ. అయినా మిమ్మలనాలి ప్లాటినం గొలుసు వేస్తే మాత్రం ఊరకుక్క ఆల్సేషియన్ అవుతుందా? భారీ బడ్జెట్ తో తీస్తే మాత్రం ఫ్లాప్ సినిమా హిట్ అవుతుందా? (పోలిక ఎక్కలేదా? హి..హి..హి అదంతే). అన్నట్టు మీరీ సినిమాలో ఏదో ఒక సీన్ లోనో, పాటలోనో తమన్నా ప్లేస్ లో "నిత్య" ని ఊహించుకుని ఉండాలే.....
హ హ హ అదేమిటో రాజ్.. నేను మరీ శాడిస్ట్ ని అని నువ్వు ఫిక్స్ అవ్వను అంటే ఒకమాట చెబుతా.. నువ్వు రాసే రివ్యూలు చదువుతుంటే నువ్వు చూసే సినిమాలు బాగాలేకపోతే బాగుండు మేం ఒక మంచి పంచ్ లతో నిండిన రివ్యూ చదువుకోవచ్చు అనిపిస్తుంది :) నీ రివ్యూ జస్ట్ కేకంతే.. కుమ్మి అవతలపారేశావ్..
బాగా రాశారు. ఈ సినిమాకి బలయిన బకరాలలో నేనొకడిని. నా రివ్యూ కూడా పెడతా. నాకయితే సినిమా మొత్తానికి మిల్క్ వైట్ బక్క పిల్ల తమన్నా ఒకతే నచ్చింది.
వామ్మో దీన్ని రివ్యూ అంటారా , మీరు రాసే ఇలాంటి రివ్యూల కోసమన్నా ఇలాంటి సినిమాలు వాళ్ళు తీయాలి , మీరు చూడాలి :)
అసలు ఆ గమనిక బాబోయ్ పొరపాటున ఆ చిన్నికృష్ణ గాని చూస్తె , అతను మనిషే ఐతే ఇట్టాంటి కథ తో మళ్ళీ రాడు :)
చిన్నికృష్ణ ఇంటర్వ్యూ చూడండి, ఎంత కామిడి గా ఉందో , తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తన కథలు తీసుకో పోవడం వలన 200 కోట్లు నష్టఫొయిందంట. బాబోయ్ వీడిని మనమే భరించలేకపోతున్నాం పాపం నిర్మాతలు , దర్శకులు ఎల భరిస్తున్నారో?
http://www.youtube.com/watch?v=H6JF8zMKosw
రివ్యూ బావుంది
చాల బాగా రాసారండి ...
చాల బాగా రాసారండి ...
సూపర్! డైరక్టర్, రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ హింట్స్ తోనే మీ సమీక్ష ఎలా ఉంటుందో మీరు హింట్ ఇచ్చేశారు. ఏమైనా హింట్స్ అదిరిపోయాయండి.
సమీక్షలో వ్యంగ్యం బాగుంది నాన్ జడ్జిమెంటల్ గా.
@ కీరవాణి పేరు మీద అల్లు అరవింద్ కంపోజ్ చేశాడో...
ఇదికూడా బాగుంది.
కీరవాణి చేత బలవంతం గా చేయించారో తెలీదు, ఖర్చు కలిసొస్తుందనీ కీరవాణి పేరు మీద అల్లు అరవింద్ కంపోజ్ చేశాడో (కక్కురి ఎక్కువ అసలే) తెలీదు గానీ పాటలతో పాటూ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సో సో గానే ఉందీ. :))))))))))))
ఒక జానపద పౌరాణిక సోషియో ఫాంటసీ సినిమా చూసేశారన్న మాట. చిన్ని కృష్ణ మీద మీకు ఉన్న అభిమానానికి మిమ్ము అభినందిస్తున్నాను. చూడగా చూడగా మీకు బన్నీ మీద కూడా బోలెడు అభిమానం ఉన్నట్టుంది. ఏమిటో ఈ కామెంటు ఏమిటో/? రివ్యూ చదివితేనే ఇల్లా అయిపోయాను. సినిమా చూస్తే ఎర్రగడ్డ లో ఒక బెడ్ బుక్ చేసుకోవాలేమో.
మీ టపా ఎప్పటి లాగానే మెరిసిపోతోంది.
మీరు రివ్యూ రాస్తే బాగుండనుకున్నాను,రాసి పారేసారుగా మీ ఇస్టైల్లో.
Super review.
హ్హహ్హ! రాజ్ ఎప్పటిలాగే...కేకోకేక!! మీరు కూడ అర్జున్ డాన్సుల్లాగానే...చింపి,ఉతికి ఆరేసారు రివ్యు! సింప్లీ సూపర్బ్!
>> క్రియేటివిటీ ని కేజీల్లెక్కన కుమ్మరించే "జీనియస్" రైటర్ చిన్నికృష్ణ
హ్హహ్హహ్హ! మీదగ్గర ఇలాంటి డైలాగ్స్ కోసం ట్రైనింగ్ తీసుకోవాలి! :))
>>పిండం పెట్టిన ప్రేమికుడు....ఇదేదో రాబోయే కాలంలో తీయబోయే తెలుగుసినిమా టైటిల్ లాగా ఉందే! ;)
>>ఎప్పటిలాగానే బిర్లా వైట్ సిమెంట్ కొట్టినట్టూ తళ తళా మెరిసిపోయిందీ. ఎంత తెల్లగా ఉన్నా ఆ తొక్క కప్పిన బక్క ఎముకలని చూడటం కష్టమే
ఇది గాని తమన్న చూస్తే...కిందపడి దొర్లి ఏడుస్తుంది పాపం :(
>>నవ్వించే ఏడుపులూ.. ఏడిపించే కామెడీ సీన్లూ ..... :))))
ఇక చివర్లో 'ముఖ్య గమనిక' పోస్టుకే హైలైట్! :))))))))))))
మొత్తం మీద అల్టిమేట్ ఉంది రాజ్! :)))))
రాజ్ - ఏదైనా సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే నేను తెగ సంతోషిస్తున్నా..మీ రివ్యూ కోసం ఎదురు చూస్తున్న..:))
kungfu panda పిక్ + ప్ర.ర పిక్ సూపరొ సూపరు .. :D
ఇంకా మీ శైలి తో మమ్మల్ని బాగా నవ్విన్చేసారు..కొన్ని కొన్ని లైన్స్ కేవ్వ్వ్వవ్వ్వ్
ఇలాంటివి సమీక్ష లని చూపిస్తే అన్నా భారీ budget + చెత్త సినిమాలు తీయకుండా ఉంటారేమో..
వేణు గారు - BINGO
సూ.......పర్ గా రాసావ్ బాసు....
కెవ్వు కేక.....
thanks babu badrinadh bullets nundi kaththulatho kaapaadavu ....
ha..ha..ha....super....
నన్నూ మీ అభిమానుల లిస్ట్‌లోకి చేర్చుకోండి
కేక. లండన్ లో షో కోసం ఆఫీసు ఎగ్గోటి సినిమా చూసిన వాళ్ళు వున్నారు. బొక్క కి బొక్క తిక్క కి తిక్క.
నేను ఈ రివ్యూ ని షేర్ చేసుకోవచ్చా
కేక. లండన్ లో షో కోసం ఆఫీసు ఎగ్గోటి సినిమా చూసిన వాళ్ళు వున్నారు. బొక్క కి బొక్క తిక్క కి తిక్క.
నేను ఈ రివ్యూ ని షేర్ చేసుకోవచ్చా
కేక!
రమణ గారూ.. ధన్యవాదాలండీ.. అలాగే తప్పకుండా..;)
శంకర్ గారూ.. మీ పోలిక పొలికేక.. నిత్యకీ తమన్నాకి పోలికేమిటండీ..? అస్సలు గుర్తురాలేదు..హిహిహిహ్
నెనర్లు..
కృష్ణగారూ.. అవునా..! సేం పీంచ్ అన్నమాటా.. రాసేయ్యండీ త్వరగా.. నా బ్లాగ్ కి స్వాగతం, థాంక్ యూ
వేణూగారూ...,శ్రావ్య గారూ.. తప్పులేదు లేండీ ఈ మాటవినటం నాకు ఇదే మొదటి సారి కాదు.. హిహిహిహి... నా రాత అలా ఏడుస్తుంది అయినా.. ఇలా బుక్ అయిపోతున్నా..
ధన్యవాదాలు..
అనానిమస్ గారూ మీరిచ్చిన వీడియో కేకా.. రెండవ పార్ట్ ఇంకా కామెడీగా ఉందీ.. థాంక్యూ అండీ..
ప్రసాద్ గారూ, రాజశేఖర్ గారూ ధనవాదాలండీ..
తేజస్వి గారు.. నా బ్లాగ్ కి స్వాగతం. నెనర్లు అండీ.. ;)
మురళీగారూ, రిషీ గారూ.. వినోద్ మరియూ, అనానిమస్ గరూ ధన్యవాదాలు..
కన్ఫ్యూజ్డ్ గారూ.. హహహ. ఎంచక్కా షేర్ చేసుకోండీ.. నా పర్మిషన్ ఎందుకూ.. ? ;) ;) ధన్యవాదాలు.
రాజ్...వేణూ మాటే నాది...నువ్వు చూసే సినిమాలు బాగుండకుండా ఉంటే బావుంటుంది అనిపిస్తుంది నీ రివ్యూలు చూస్తే...కేక అంతే.
ఫస్ట్ హాఫ్ వరకూ పర్లేదు లే రాజ్ కుమార్ నువ్వు మరీ టూమచ్ చేస్తావ్.. అల్లూ అర్జున్ వరకూ వాడు పడ్డ కష్టం కనిపించింది.. వాడి అభిమానుల వరకూ ఇది మంచి సినిమానే..
:-), ఈ సారి కొంచెం కోపంతో వ్రాశారు మీరు.. :P
సంగీతం కూడ మగధీరలో రామ్ గుర్రంముందు పరిగెత్తే టప్పుడు వచ్చేదే..
బాగుంది, మీరిలాగే పదికాలాల పాటు ఇలాంటి రివ్యూలు వ్రాయాలని నేను ఆ బద్రీనాధుని వేడుకుంటున్నా..
Keep It Up Raj
బాబోయ్..
రాజ్, నువ్వు మామూలోడివి కాదు. కపాలంలో ఖర్జూరం హరించుకుపోయిందా???? నీ పదప్రయోగాలు ఇలా పబ్లిగ్గా పెట్టేస్తే, వీటిని కొట్టేసి సినిమాల్లో వాడేసుకుంటారు..;)
బద్రినాథ్ చూసే ధైర్యం నేనైతే చెయ్యను కానీ, నీ టపా మాత్రం నీ భాషలో చెప్పాలంటే పొలికేక..
ఇక కొసమెరుపు ఉంది చూసావూ.. న భూతో న భవిష్యత్..;)
ఉతికి ఆరేసేసావ్
చిన్ని కృష్ణ ఇంటర్వ్యూ మళ్ళీ గుర్తొచ్చింది :)))
వెరీ గుడ్! రివ్యూ ఎప్పుడూ ఇలాగే పచ్చి నిజాలతో నిండి ఉండాలి. (ఈ నిజాలన్నింటినీ నేను అంగీకరిస్తున్నా...నేనూ బలే కాబట్టి)
చిన్ని కృష్ణకు పెట్టిన గమనిక కూడా కత్తిలా ఉంది.
ఇంకా ఏం చెప్పాలో తెలీడం లేదు రాజూ!
మీరు ప్రతి సినిమా చూసి ఇలాగే పచ్చి నిజాల రివ్యూలు రాస్తే బాగుంటుంది. నేను సినిమా చూడకముందే రాస్తే ఇంకా బాగుంటుంది. నాకు డబ్బులు మిగుల్తాయి
హ హ హ..సూపర్..
బద్రినాథ్ చూసారు పాపం అభాగ్యులు అనుకున్నా..ఇలా నవ్వించటానికే చూసినట్టు ఉన్నారు..
అసలు మాస్టర్ షిఫు పోలిక అదిరిపోయింది.. :))
దేవుడా ! ఓ మంచి దేవుడా! రాజ్ కుమారి గారిలా సూపర్ పంచ్ లతో పేరాగ్రాఫ్ లు పేరాగ్రాఫ్ లు పోస్ట్ లు పోస్ట్ లు రాసే టాలెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు .....
కనీసం ఈ బ్లాగ్ లో ఈ పోస్ట్ అంత అందం గా ఒకే ఒక్క లైన్ రాసి కామెంట్ గా పెట్టే టాలెంట్ ఇవ్వు తండ్రీ .....
బాబోయ్ బ్లాగ్ మొదలు పెట్టినప్పడి నుండి ఆగకుండా నవ్విస్తున్నారు రాజ్ కుమార్ గారు
asalu keww keka baaboi review.... brahmamgaaru mundhe cheppaaru, cinema kanna review lu baagunde rojulu vasthaayani.... adhi idhe kaabolu..... especially, edupultho navvinchi, naavultho edipinchi line keka...........
బులుసుగారూ.. బన్నీ అంటే నాకు అభిమానమేనండీ. తన పర్ఫార్మెన్స్ చూడటానికయితే మాత్రం వెళ్ళొచ్చు. ;) టపా మెచ్చినందుకు నెనర్లు
ఇందుగారూ... మీరు పెట్టే పేద్ద కమెంట్స్ (కాంప్లిమెంట్స్) చూడగానే కడుపునిండిపోతుందీ నాకు.. చాలా చాలా థాంక్స్ అండీ. ;)
కిరణ్.. హిహిహిహి.. మొత్తానికి నాకే ఎసరు పెడుతున్నారు గా..;( ధన్యవాదాలు..;)
శశిగారూ.. రక్షించడానికి నేనెవరండీ? ఒక సారి చూసెయ్యండీ.. ;);)హిహిహి మీకు బోలెడు థాంక్స్..
కొత్తపాళీగారూ..నెనర్లు. ;)
సౌమ్యగారూ.. గుర్ర్.ర్ .ర్.ర్ .ర్.. వాఆఆ...వాఆఆఅ...
ధన్యవాదాలండీ..
అవును కార్తీకూ.. అల్లు అర్జున్ తనవరకూ 100% ఎఫ్ఫోర్ట్ పెట్టాడు అన్ని రకాలుగా.. బట్ నాకు ఫస్ట్ హాఫ్ కూడ ఎక్కలేదు ఎందుకో మరి..(చిన్నిక్రిష్ణ మీద ఉన్న చిరాకు వల్లేమో ??)
నీకు నచ్చిన నాలుగు సీన్లు చెప్పు ఫస్ట్ హాఫ్ లో ఒకసారి ఆలోచిస్తా.. మళ్ళీ.. ;) థాంక్యూ..
గిరీషూ కోపంతో కాదయ్యా.. కడుపుమంట తో. హహహ..
మగధీర మ్యూజిక్ ని అబ్జర్వ్ చెయ్యలేకపోయాను.. అందరూ అంటున్నారు అదే మాట.(మామూలుగా మిస్ అవ్వను. బట్ సినిమా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్లా..బుఱ పనిచేయలేదు) థాంక్యూ.. ;)
మనసుపలికే గారూ.. మీ అభినందన కి నా ధన్యవాదాలండీ.. ;)
హరేకృష్ణా.. థాంక్యూ వెరీమచ్. ;)
సుజాత గారూ.. అంటే ఇప్పటివరకూ అబద్దాలు రాసానంటారా? ;);) నిజాలు చెప్పాలి అని కాదు గానీ సినిమా చూసాక నాకేమనిపిస్తే అదే రాస్తానండీ.(హీరో నా ఫేవరెట్ అయినా/కాకపోయినా). మీరే తొందరపడీ చూసేశారు. లేకపోతే డబ్బులు మిగిలుండేవండీ..;)
ధన్యవాదాలండీ..
అనుపమ గారూ చాలా థాంక్స్ అండీ (ప్ర.రా ని చూడగానే నాకు అదే గుర్తొచ్చింది హిహిహ్)
శివరంజని గారూ.. ఏంటీ నిజమే?? ఊరుకోండీ మీరు మరీ చెప్తారూ..! సీనియర్లు మీ ముందు నేను జుజూపి.
ధన్యవాదాలు.
అనానిమస్ గారూ..థాంక్యూ వెరీ మచ్ అండీ..;)
ఆపిల్ టామ్ చెప్పిన ఓ విడియో రివ్యూ
http://www.youtube.com/watch?v=eSqiPIPQ6XQ
ఈ సినిమా గురించి గాని, మీ రివ్యూ గురించి గాని మాట్లాడేందుకు ఏమీ లేవు కానీ, ఒక్క మాట చెప్తాను రాజ కుమారా! సినిమా రివ్యూయే కదా.. అదీ "బద్రినాధ్ ఢాం" అని రిలీజయిన రోజే నా ఇన్ బాక్స్ నిండిపోయేన్ని ఎస్ ఎం ఎస్ లు వచ్చాయ్ కనుక, అలా అలా 'మీరేం తిట్టారో' అని పైపైన చదువుతూ ఒక్క ఫొటో చూసి ధబ్బున కింద పడి గిల గిలా కొట్టుకొని కళ్ళ నీళ్ళు తుడుచుకొని డొక్కలో నొప్పి తట్టుకోలేక మళ్ళీ పడిపోయా..
ఆ ఫోటో ఏంటో చెప్పక్కర్లేదుగా! నూటెనిమిది వీరతాళ్ళు.. ఆ ఒక్క ఫోటో కే సుమా!
మళ్ళీ మళ్ళీ చదివిస్తుంది మీ రివ్యూ. మీలో ఉన్న టేలెంట్ మీకు సరిగా తెలీదేమో అని నా డౌట్.
కొత్తావకాయ గారూ ధన్యవాదాలండీ..
చందు గారూ.. నా బ్లాగ్ కి స్వాగతం.
హహహ ఏం అలా అన్నారూ? ;);). ధన్యవాదాలండీ..
అనానిమస్ గారూ ధన్యవాదాలు.. చూశాను ఆ వీడియో.. సూపరు..;)
Post a Comment