Wednesday, June 1, 2011

బీరు వీరుడు...!

జీవితం అంటే వద్దు వద్దంటున్నా, వినమంటున్నా, వినమని తెలిసినా, వినిపించుకోకుండా  గంటల కొద్దీ పీకే క్లాసులూ, అటెండెన్స్,  ఇంటర్నల్స్, ల్యాబ్ లో కసిరేసే లెక్చరర్లూ, విసిరేయబడ్డ రికార్డ్లూ, సెమిస్టర్ ఎగ్జామ్లూ, రిజల్ట్సూ, బ్యాక్లాగ్స్ రిలీజయిన కొత్త సినిమాలూ మాత్రమే అనుకొని గుడ్డి గుఱం లాగా గమ్యం తెలీకుండా గడిపేస్తున్న రోజులు.

ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ అయిపోతుందనగా మా కాలేజ్ కి అంత సీన్ లేదు కాబట్టీ.., పక్క కాలేజీల్లో క్యాంపస్ సెలెక్షన్స్ జరుగుతున్నాయని తెలియగానే మూడడుగులున్న ఎస్వీ రంగారావు లాగా కనిపించే మా సీతయ్య (ప్రిన్సీ) మా కాలేజ్ బస్ అరేంజ్ చేసి,డ్రయివర్ కి డబ్బులు మమ్మల్నే ఇచ్చెయ్యమని ఆర్డరేసి, హోల్సేల్ గా సెలెక్ట్ అయిపొమ్మని కమాండ్ చేసీ, "నువ్ నాకు ఇవ్వాల్సిన పది లచ్చలూ ఇవ్వక్కర్లేదు.. మాఫీ చేశాను.పో.." అన్నట్టుగా ఒక లుక్కిచ్చి పొట్టకి ప్యాంట్ తొడుగుతున్నట్టూ ప్యాంట్ రెండంగుళాలు పైకి లాగి పర పరా కాళ్ళీడ్చుకుంటూ పోయాడు. ఆ.... ఇది ప్రతీ సారీ ఉండేదే కదా.. అనుకొనీ రేపు ఐటీ, సీ.యస్.సీ అమ్మాయిలు మాతోపాటూ వస్తారన్నఆనందం తో అలా అలా ఆలోచిస్తూ ఇంటికి పోయాం. ఇలా ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలకి అటు వైజాగో, ఇటు కాకినాడో, రాజమండ్రో వెళ్ళడం, రిటెన్ టెస్ట్ రాసేసీ, రిజల్ట్స్ వచ్చేలోపు టౌన్ కెళ్ళీ మాంచి హోటల్ చూస్కొని కుమ్మెయ్యటం, తిరిగొచ్చీ, ఫస్ట్ రౌండ్లోనే పల్టీ కొట్టేశాం అని కన్ఫ్రర్మ్ చేసుకొనీ, వచ్చిన బస్సు ఎక్కి కూర్చొనీ, అమ్మాయిలతో అంత్యాక్షరి ఆ(పా)డుకుంటూ, ఆవేశం తో అరుచుకుంటూ, అలిసిపోయి, ఎవరి ఊళ్లలో వాళ్ళు దిగిపోయి పీకల దాకా తినేసి పడుకోవటం ప్రతీసారీ జరిగేదే..మర్నాడు పొద్దున్నే నా స్టాప్ లో బస్సెక్కగానే, రంగు రంగులతో జిగేల్ జిగేల్ మంటూ ముందు వరసలన్నీ వెల వెలా వెలిగిపోతుండగా... "మా...మా.. ఎనక్కొచ్చెయ్యరా. " అన్నకేక వినపడగానే మధ్యలో కాలమతులు కొందరూ R.S agarval బుక్ ని ఆర్తీ అగర్వాల్ ముఖచిత్రం చూసినంత శ్రద్ద గా చూస్తున్నా, పట్టించు కోకుండా.. గుడుంబా శంకర్ బావుంటూందా?, బంగారం బావుంటుందా? జానీ జస్ట్ హిట్ గా మిగిలిపోడానికి గల కారణాలేమిటీ? అన్న చర్చ లో పీకల్లోతు మునిగిపోయి మధ్యలో గొడవొచ్చీ, కోపంతో రగిలిపోతున్న కుక్కల్లాగా కోట్లాడుకుంటూ ఉండగా కాలేజ్ వచ్చేయడం తో పళ్ళీకిలించుకుంటూదిగిపోయాం.

రిటెన్ టెస్ట్ కి ముందు అలా అలా బుక్స్ తిరగేసి వెళ్ళడం తో ప్రతీ ప్రశ్నా తెలిసినట్టే ఉందీ, మల్టిపుల్ చాయిస్ లో ప్రతీ ఆన్సర్ కరెక్టే అనిపించింది. అన్నీ కరెక్టే అయినప్పుడు ఏది టిక్ పెడితేనేం? అందుకని కళ్ళు మూసుకొని కస కసా రాసేసి
బయటకొచ్చేశా. కాసేపటీకి మా వాళ్లందరం సమావేశమయ్యాం.

శీనుమాయ : ఒరే.. రిజల్ట్ రావడానికి 2 అవర్స్ పడుతుందంట గానీ మనం పోయి తినొద్దాం
అప్పల్రాజు   : ఏటెహే తినేది? చుట్టుపక్కల ఒక్క హోటల్ కూడా లేదు. అన్ని కాలేజీలూ ఇలా ఊరు చివర కడతారేటీ తొక్కలాగా?

నేను        : ఆటోలున్నాయ్ గా.. హోటల్ పట్టుకోవటం ఎంతసేపెహే..
మనూ      :  ఊరు చివరయితే స్థలం చీప్ గా వస్తుందనీ. ప్రశాంత వాతావరణం అని చెప్పుకోవచ్చు. పైగా బస్ ప్రొవైడ్ చేసీ డబ్బులు దొబ్బెయ్యొచ్చు.
బుల్లిరాజా   : కాదెహే.. శ్మశానాలూ, ఇంజనీరింగ్ కాలేజ్ లూ ఊరు చివరనే ఉంటాయ్. అక్కడ శవాలు తగలడుతుంటాయ్. ఇక్కడ జీవితాలు తగలడుతుంటాయ్.
విలాస్      : నువ్ హరిశ్చంద్రుడి లాగా నిజాలే చెప్తావ్ రా!
సుధాకర్    : హరిశ్చంద్రుడి తో ఈడిని  పోల్చావా? ఇద్దరికీ శ్రీ కృష్ణుడికీ, నికృష్ణుడికీ ఉన్నంత తేడా ఉందీ. మాటలు తర్వాత..ముందు ఆటో ఆపండ్రా..

మెయిన్ రోడ్ కెళ్ళి మొత్తానికి ఒక ఆటో క్యాచ్ చేసాం. అరవైలో పోతుందీ ఆటో.. నూటిరవై కి రీచవుతుందీ మీటరు. ఏపక్క చూసినా ఒక్కహోటల్ కూడా కనిపించటం లేదు. అలా "వేడిగాలిలో... మండుటెండ లో ఆటోలో ప్రయాణం.... హోటలెక్కడో..లంచ్ ఏమిటో తెలియదు పాపం..తెలియదు పా..పమ్... " అని పాడుకుంటూ ఉండగా.. వై.వి.యస్ చౌదరి డైరెక్షన్ లో విజయ్ కాంత్ హీరో గా సినిమా వచ్చి హింసించినట్టూ,"xxxx బార్ & రెస్టారెంట్" కన్పించి కవ్వించింది. ఆటో ఆపించేసి దిగిపోయాం.
"బార్ కి తీస్కొచ్చారెట్రా? మా ఇంటా వంటా లేదు తెల్సా? " అన్నాన్నేను అమాయకంగా (నేను చా...లా.... అమాయకుడిని. నమ్మాలి మీరంతా)
"మరి మా ఇంట్లోవాళ్ళు మాత్రం రోజూ ఇక్కడికొచ్చి తింటారనుకున్నావా?? ఇది తప్ప వేరే దిక్కులేదు. మూస్కొని రా రా" అని శీనుమాయ చాలా మర్యాదగా చెప్పడంతో చెట్టాపట్టాలేసుకొని చలాకీ గా లోపలికెళ్ళాం.

నేను, సుధాకరూ, విలాస్ లాంటి లోకం తెలీని పసోళ్ళం అంతా ఒక పక్క కూర్చొని చికెన్ బిర్యానీ ఆర్డరిచ్చి లొట్టలేస్తుండగా... "డ్రింక్స్ ఏమన్నా కావాలా సర్?" అనడిగాడు వెయిటర్. మనూ గాడి మొహం లో ఎక్స్ప్రెషన్ మారింది. చటుక్కున తలతిప్పి చూడగా మిగిలినవాళ్ళ మొహం లోనూ అదే ఆనందం తాండవిచిందీ. మూకుమ్మడిగా సౌండ్ రాకుండా చిరునవ్వు నవ్వీ.. "YES" అని అరిచారు.

కట్ చేస్తే..
మా వైపు వేడి వేడి బిర్యానీ ప్లేట్లూ(చెప్పాను కదా మేము చిన్నపిల్లల బ్యాచ్ అనీ), అవతల వైపు చల్ల చల్లని బీరకాయలూ నించొని ఉన్నాయ్. అప్పల్రాజు మొహమాటం తో చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ లు ఇస్తూండటం తో "ఎందుకురా మా దగ్గర మొహమాటం? అయినా ఏం మనిషివిరా నువ్వూ? మందిలో ఉంటే మొహమాట పడతావ్.. ఒక్కడివీ ఉంటే కక్కుర్తి పడతావ్. నీకెంత వీలయితే అంతే తాగూ" అన్నాడు శీనుమాయ. అలా అందిన ఇసకరేణువంత ఎంకరేజ్మేంట్ ని అడ్వాంటేజ్ గా తీస్కొనీ, వాడి మగ్గే కాక అందరి మగ్గులూ ఎత్తి దించేసీ "తినగా తినగా వేపాకు తియ్యగా ఉంటూందీ, గియ్యగా గియ్యగా గెడ్డం గరుగ్గా అవుతుందీ..తాగగా తాగగా బీరు కూడా బావుంటుంది రా" అన్నాడు అప్పల్రాజు. ఇది అందరికీ ప్రెస్టేజ్ ఇష్యూ అయి కూర్చుంది ముఖ్యంగా శీనుమాయ కి. "బేరఱ్...టూ మోర్..." అన్నాడు.

కట్ చేస్తే... 30 నిమిషాల తర్వాత..

యుద్ధం అయిపోయాక మిగిలిన గ్రౌండ్ లాగా, మ్యాచ్ ముగిసిన స్టేడియమ్ లాగా, బ్యాచిలర్స్ రూమ్ లాగా చూడముచ్చట గా తయారయ్యింది మా ప్లేస్ మొత్తం. బిర్యానీ తినేసి, బిల్ పే చేసి బయటకొచ్చి, ఆటొ పట్టుకొని కాలేజ్ కి వెళూతుంటే
ఒట్టి బిర్యానీ తిన్న నాకే నిద్ర ఒక లెక్క లో ఊపేస్తుంది. వీళ్ళ సంగతి ఏమిటా? అని ఆలోచిస్తూ నిద్ర పోయాను. కాలేజ్ దగ్గర దిగుతుండగా శీను గాడి ఫోన్ రింగయ్యింది. 4 సెకన్ల తర్వాత "యా...హూ.. " అని అరుచుకుంటూ, గెంతుకుంటూ క్యాంపస్ లో కి పరిగెట్టాడు.
విషయం ఏంటంటే.. మా బ్యాచ్ లో ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యిన  ముగ్గురిలో వీడూ ఉన్నాడూ. ఇంకొద్ది సేపట్లో ఇంటర్వ్యూ.. మనోడి గెటప్ చూస్తే.. చెదిరిన జుట్టూ, మాసిన గెడ్డం, ఎండలో జిడ్డెక్కిన మొహం, కాళ్ళకి చెప్పులూ, కడుపులో రెండు బీరకాయలూ,కళ్ళల్లో వాటి ఎఫెక్టూ కొట్టొచ్చినట్టూ కనిపిస్తూ అదో రకమైన స్థితి లో ఉన్నాడు. ఒక్కొక్కడి దగ్గరా షర్ట్, షూ, బెల్టూ, దువ్వెనా అరువు తీసుకొనీ ఇంటర్వ్యూ కి రెడీ అవ్వబోతుండగా, నోరు తెరుచుకొని చూస్తున్న మా వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ.. "మ్మా..మా.. మామూలుగా కన్న్నా ఇప్పుడే కరెక్ట్ గా ఉంటాను చూడు... కాకి కి కలర్ ఫోటొ తీసినా కలర్ మారదు కదరా..ఇది కూడా అంతే" అని అర్ధం కానీ లాజిక్  చెప్పి లోపలికెళ్ళి పోయాడు.మిగిలిన వాళ్ళందరం ఏమాత్రం సిగ్గు పడకుండా ఇంటికేళ్ళిపోయాం.

మర్నాడు క్లాస్ లో మా లెక్చరర్ క్లాస్ పీకుతూ... నిన్న హాఫ్ క్యాంపస్ లో మనోళ్ళు ఎవరన్నా సెలెక్టయ్యారాండీ? అని అడిగారు.
అప్పుడే తెలిసిన వారు ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉండగా, అసలు విష్యం తెలిసిన వారు విరగబడి నవ్వుతూ ఉండగా.. సిగ్గు పడుతూ చిరునవ్వుతో స్లో మోషన్ లో లేచి నుంచున్నాడు మా "శీనుమాయ" అందరి చప్పట్ల మధ్య.....


25 comments:

మనసు పలికే said...

హహ్హహ్హా.. రాజ్ చమక్కులు కెవ్వు అసలు:)))
ఎన్నని కాపీ పేస్ట్ చేసేదీ, అందుకే నా పూర్తి కామెంటు కోసం మరోసారి నీ పోస్ట్ నువ్వే చదువుకో;) నాకు మాత్రమే ఒక సీక్రెట్ చెప్పవా:) అసలు నీకు ఇట్టాంటి డైలాగులు రాసే అయిడియాలు ఎలా వస్తాయి..?

శే.సా said...

అదరగొట్టేసారండి రాజ్ గారు. పంచ్లకి మీ బ్లాగు పుట్టిల్లా అన్నట్టుంది.

చిరుజల్లులు said...

రాజ్ కుమార్ గారు అదరగొట్టేసారు ఎప్పటిలానే ....కాని అప్పుడే అయిపోయిందా పోస్ట్ అనిపించింది ...ఈ సారి కొంచెం పెద్ద పోస్ట్ రాయండి


అపర్ణ ఆ సీక్రెట్ ఏదో నువ్వు తెలుసుకున్నాకా నాకు కూడా చెప్పు ...కేవలం నాకు మాత్రమె చెప్పు ........నేను ఓ రెండు పోస్ట్ లు రాసుకుంటా

శివరంజని said...

రాజ్ కుమార్ గారు ఆదరగోట్టేసారండి ఎప్పడిలానే ... కాని అప్పుడే అయిపోయిందా పోస్ట్ అని అనిపించింది ........ఈ సారి కొంచెం పెద్ద పోస్ట్ వేయండి .......


అపర్ణ ఆ సీక్రెట్ ఏదో నువ్వు తెలుసుకున్నాక నాకు మాత్రమె చెప్పమ్మా .నేను ఓ రెండు పోస్ట్ లు రాసుకుంటా

Sravya V said...

Lolz:)

ఆ.సౌమ్య said...

ఏం చెప్పలో, ఎలా చెప్పాలో అర్థంకావడం లేదు రాజ్....పోస్టు రాసిన ప్రతీసారి పిచ్చెక్కిస్తావనుకో నవ్వించి. అసలు ఆ బుర్ర ఏమిటి బాబోయ్...ఆ రాతలేమిటి, ఆ పంచ్ లేమిటి!...నీ బుర్ర అప్పు ఇవ్వమంటే ఇవ్వవు.

నాకు నచ్చినవి కాపీ చేద్దామనుకుంటే ఎక్కడా...మొత్తం పోస్ట్ వచ్చేలా ఉంది...కాబట్టి నాకు నచ్చిన చమక్కులు: నీ పోస్ట్ మొత్తం...నువ్వే ఇంకోసారి చదివేసుకో.

సూపరు సూఊఊఊఊఊపరు...కెవ్వు కేక అంతే.

kiran said...

హహహః..రాజ్ ...జాబు విషయం లో అస్సలు సిగ్గు పడకూడదు..:)..అదే చేసారు లెండి మీరు..
హైలైట్ చేసిన పంచ్ లు అన్ని కేక..
ఇక కింద లినే కి తిరుగు లేదు....:D..
>>>> కాకి కి కలర్ ఫోటొ తీసినా కలర్ మారదు కదరా
సూపరో సూపరు..

శశి కళ said...

yelagola shubaanni ,navvuni rappinchestaavu jenius vi kada.sasi

హరే కృష్ణ said...

హ హ్హ రచ్చ రాజ్
నా బీరో న భవిష్యత్ అని నొక్కి వక్కాణించి మరీ చెప్పావ్ కదా :)
పంచ లలో బాగా నచ్చినవి చెబుతా
ఆర్ ఎస్ అగర్వాల్ కేక :)
కృష్ణా నీ బేగనే బారో

ఇందు said...

రాజ్...మీరు ఏమన్నా త్రివిక్రం దగ్గర ట్రైనింగ్ గాని తీసుకున్నారా? లేదంటే....త్రివిక్రం మీ బ్లాగుకి ఘోస్ట్ రైటరా? ;) అసలు ఏం డైలాగ్స్ అండీ బాబూ!! కాకికి కలర్ ఫొటో తీసినా రంగు మారదా??? కెవ్వ్వ్!! పాపం కాకే దొరికిందా మీకు??? :))

>>వేడిగాలిలో... మండుటెండ లో ఆటోలో ప్రయాణం.... హోటలెక్కడో..లంచ్ ఏమిటో తెలియదు పాపం..తెలియదు పా..పమ్...

ఇది సూపరు అసలు :)))))))))

>>శ్మశానాలూ, ఇంజనీరింగ్ కాలేజ్ లూ ఊరు చివరనే ఉంటాయ్. అక్కడ శవాలు తగలడుతుంటాయ్. ఇక్కడ జీవితాలు తగలడుతుంటాయ్.

హ్హహ్హహ్హా! ఏం చెప్పారండీ....నేను వంద శాతం ఏకీభవిస్తున్నా మీతో! :)))

ఇంతకీ మీరు పసికూనల బాచా? లేక అప్పల్రాజుగారిలాగా మీరు మీ శీనుమాయతో చేరిపోయారా? ;)

SHANKAR.S said...

"చెదిరిన జుట్టూ, మాసిన గెడ్డం, ఎండలో జిడ్డెక్కిన మొహం, కాళ్ళకి చెప్పులూ, కడుపులో రెండు బీరకాయలూ,కళ్ళల్లో వాటి ఎఫెక్టూ కొట్టొచ్చినట్టూ కనిపిస్తూ "

మొత్తానికి మేడిన్ ఆంధ్రా స్టూడెంట్ అన్నమాట మీ శీనుమాయ

గిరీష్ said...

super..
డైలాగ్స్ కెవ్ రాజ్..
>>కాకి కి కలర్ ఫోటొ తీసినా కలర్ మారదు కదరా..>>
:P

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఒర్నాయనోయ్ ఇదేం టపా. నవ్వు ఆపుకోలేక చస్తున్నా ఇందాకటినించి. కెవ్వు, కేక, రచ్చ చాలవు.
ఇలాంటి పంచులు ఎలా వస్తాయండి మీకు. రాజ్ కుమార్ అంటే కామెడీ కింగ్ అంతే.

మురళి said...

:)))))))))))))

రాజ్ కుమార్ said...

మనసుపలికె గారూ.. మీ మాట ప్రకారం పోస్ట్ మళ్ళీ చదువుకున్నాను.. చెప్తే సీక్రెట్ ఎలా అవుతుందండీ?? ;);) ధన్యవాదాలు...

చై2 గారూ.. మీ కామెంట్ పంచ్ లకి చిన్నిల్లు లాగా ఉందీ. థాంక్యూ..థాంక్యూ..

రాజ్ కుమార్ said...

శివరంజని గారూ.. పెద్దపోస్టా? అప్పుడు బోర్ కొడతాదండీ.. పైగా నా కొచ్చినవే నాలుగు ముక్కలూ... హిహిహి..
ధన్యవాదాలు.

శ్రావ్య గారూ నెనర్లు..

రాజ్ కుమార్ said...

సౌమ్య..గారూ.. ఇప్పుడే చదివానండీ. మళ్లీ మళ్ళీ చదివాలంటే సిగ్గేస్తుంది. :p నా పోస్ట్ నచ్చీ, మెచ్చినందుకు నెనర్లు.. ;)

కిరణ్ గారూ థాంక్సో..ధాంక్సు... ధన్యవాదములు

Haritha said...

"ఇద్దరికీ శ్రీ కృష్ణుడికీ, నికృష్ణుడికీ ఉన్నంత తేడా ఉందీ"
chala bavundi and first time vinatam. copyrights tesesukondi e cinema lo nu vadakunda...

రాజ్ కుమార్ said...

శశిగారూ.. నేనేం రప్పించలేదండీ.. అలా జరిగిందంతే... ధన్యవాదాలు.

హరే.. "నా బీరో న భవిష్యత్ " కేకో..కేకా...
హహహహ్.. థాంక్యూ వెరీ మచ్.. ;)

రాజ్ కుమార్ said...

ఇందుగారూ... అంత సీన్ లేదులెండీ నాకు..ఏదో చేతికొచ్చింది రాసేస్తున్నా... హ్హిహిహి
ష్.. అలాంటి సీక్రెట్స్ చెప్పకూడదు.. ;)ధన్యవాదాలండీ

@శంకర్ గారూ.. సరిగ్గా చెప్పారు సుమండీ.. హిహిహిహి
నెనర్లు..

గిరీష్.. థాంక్యూ సో మచ్. ;)

రాజ్ కుమార్ said...

బులుసుగారూ.. ఏంటి నిజమేనా?? అంత బావుందా? లేకా కమ్మకడుతున్నారా? హహహహ్.. అంతా మీ ఆశీర్వాదం.
ధన్యవాదాలండీ.

మురళిగారూ.. నెనర్లు.

shiv said...

ha ha ha.....naaku mottam kallaki katti nattu undi....seenu maama ki syntel lo job vachindi kada rajkumar!!!!!!!!....:) baagundi...kanee koncham mohmaatapadinattunnav punch la vishyam lo..

రాజ్ కుమార్ said...

హరిత గారూ.. నాకు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు..
మొత్తం పోస్ట్ లో నేను ఎత్తుకొచ్చిన ఒకే ఒక్కలైన్ అదీ.. . కాపీకొట్టిన దానికి కాపీ రైట్స్ అడిగితే బాగోదండీ.. హిహిహిహి..

ధన్యవాదాలు..

శివా..ష్.... వాడికి చెప్పొద్దూ.. అప్పడప్పడ తాండ్రయిపోద్ది నాకు ;)థాంక్యూ.. ;)

వేణూశ్రీకాంత్ said...

రాజ్.. మళ్ళీ ఓ సారి చదువుకుని రిఫ్రెష్ అవుదామని వచ్చి ఇప్పుడే రియలైజ్ అయ్యా.. నేను కామెంటలేదు అని.. One of your best works :-) డైలాగ్ పాతదే ఐనా నాకు ఇదే వచ్చు కనుక ఇదే చెప్తున్నా “ఇంచు ఇంచుకే పంచులే గురూ..” అనిపించేశావ్.. పైన కామెంట్స్ లో కోట్ చేసినవి ముఖ్యంగా ఇందు కోట్ చేసిన లైన్స్ అసలు కేక అంతే :)

రాజ్ కుమార్ said...

హహహ థాంక్యూ వేణూజీ.. థాంక్యూ వెరీమచ్..
మీకు నచ్చలేదేమో అనుకున్నా.. హిహిహిహ్హ