Monday, May 16, 2011

శునక చరిత్ర..


మయం : సాయంత్రం 5 అనుకుంటా..
సంధర్భం  : బయటికెళ్ల డానికి తలుపుతియ్యగా.. ఒక శాల్తీ నిలబడి సెల్యూట్ పెట్టి, చేతులు నులుపుకుంటూ, కాలిబొటన వేలితో ముగ్గేస్తూ, సిగ్గుపడుతూ నిల్చుంది.

నేనుః  ఎవరు నాన్నా నువ్వూ?
శాల్తీః గూర్ఖా సార్.
నేనుః అవునా? ఏ వీధి కీ? ఆరు నెలల నుండీ ఇక్కడే ఉంటూన్నా.. ఎప్పుడూ కన్పించలేదు.??
గూర్ఖాః ఈ ఏరియా నే.. హిహిహిహ్.. ఇక్కడే.. హిహిహిహిహ్ సార్... గూర్ఖా సార్.. హిహిహిహిహి.
నేనుః "అవునా?? మరి మొన్న రాత్రి నేను ఆఫీస్ నుండీ వస్తుంటే కుక్క్కలు వెంటబడ్డాయి..ఒకటీ రెండూ కాదురా... పిక్కలు పట్టి పీకేసి ఉంటే ఒక్కోదానికీ తులం ముక్క కూడా దక్కేది కాదు... అన్ని ఉన్నాయ్.. ఏం పీకుతున్నావాటైం లో?? నీకు కూడా  కుక్కలంటే భయ్యమా??" అని అడగాలని మనసంతా పీకినా... "ఒరేయ్..వెంకీ...... ఎవరో వచ్చారు చూడు నీకోసం" అని కేకేసి సెల్ఫొన్ చెవి దగ్గర పెట్టుకొని బయటకి పోయాను.

అలా మొబైల్ పట్టుకొని మేడెక్కాక... "నాకు కుక్కలంటే భయం" అన్నసంగతి గుర్తొచ్చీ.. "ఎప్పటి నుండి చెప్మా.....?" అని మోకాలు మసాజ్ చేసుకుంటూ మెదడు మధించాను.. 
["అమ్మో... కొంపదీసి కుక్కల పురాణం మొదలు పెడుతావా?" అని అనుకుంటున్నారు కదూ?
అవును.. సరిగ్గా గెస్ చేసారు.. అయినా గతంలో గొప్ప గొప్ప బ్లాగర్లందరూ కుక్కల మీద పోస్ట్లు రాసి అరిపించారనీ (కుక్కల చేత కాదు.. చదివి కామెంట్లు పెట్టిన వాళ్ళచేత) బ్లాగ్ చరిత్ర గెంతి మరీ చెబుతుంది.]

నా శునక చరిత మొదలెడతా కాస్కోండీ.. ఉస్కో..ఉస్కో అంటూ ఎంకరేంజ్ చెయ్యండి.


అక్కడ..ఇక్కడ ఎక్కడికక్కడ కనపడ్డ కాలుకి కోత పెడతా... 
(కోరస్ః ఒకటే కాటుకి గాటు పెడతా.. ఉరుకు ఉరుకు ఉరకరో....)
కాటుకు అబ్బని గుర్తుకు తెస్తా... నెత్తుటి ధారనే పారిస్తా.
(కోరస్ః పంటికి కండనే ఎరగ వేస్తా..ఉరుకు ఉరుకు ఉరకరో...)
కచ్చ కట్టినంటే నేనె మొరగకుండ ఉండనంతే
మొరగకుండ ఉంటినంటే.. కరవకుండ ఉండనంతే..
నిన్ను నిన్ను నిన్నుకరిచి నీ ముక్కల తోటే రాస్తా... శునక చరిత శునక చరిత శునక చరిత శునక చరిత శునక చరిత
a bark of night a sleep of day
a dream of watching a free way
hit me once.. chase you twice
hit me more.. I bite you at sight..

you better keep running if you want to survive
because every "day" I dream I am wanting you bite... 
దొరికితే చస్తావూ.. దొరికితే చస్తావూ.. ఉరుకు..ఉరుకు..ఉరుకు..ఉరుకు..పాటయ్యి పోగానే ....

1991 ... మే నెలలో నా కర్మ కాలిన  ఒకానొక దినాన.

నాకు ఊహ తెలిసాకా వచ్చిన ఒక వేసవి లో స్కూల్ కి సెలవులిచ్చాకా అమ్మమ్మా వాళ్ళింట్లో ఆనందతాండవం చేస్తున్న బంగారు కాదు కాదు ప్లాటీనం రోజులు. 
ఒకరోజేమో.. అమ్మమ్మ ఆర్డర్ మేరకూ సంచి పట్టుకొని వెళ్ళి రొట్టెల బాబూరావు కొట్లో రొట్లు కొనుక్కొని నా ఫేవరెట్ కొబ్బరి రొట్టి ని మాత్రం కాకులు ఎత్తుకు పోకుండా చొక్కా కప్పి, వస్తూ ఉండగా... మా ఇంటి దగ్గరలో ఒక బక్కచిక్కిన నల్ల కుక్క చూసింది.
నేను కూడా దానివైపు చూసాను. అది ఒక కోపంగా ఒక నవ్వు నవ్వీ  గుర్ ర్ ర్ ర్ ర్ అంది. నేను నా నడక కి ప్రమోషన్ ఇచ్చి పరుగు గా మార్చాను. అది హఠాత్తుగా యువరాజ్ సింగ్ లాగా డైవ్ చేసి నా వెనకనుండి తొడ ని క్యాచ్ చేసి దోరజాంకాయ లోకి దించినట్టూ దారుగా పళ్ళు దించేసిందీ. అప్పటీవరకూ  తోకూపుతాయని మాత్రమే తెలిసిన నాకు, కుక్కలు కరుస్తాయనీ... అవి కరిస్తే మనం అరుస్తామనీ ఆ నాడే తెలిసింది. సరిగ్గా అదే టైమ్ లో వాకిలి ఊడుస్తున్న మా అచ్చీరత్నం పెద్దమ్మ చీపురు కట్ట తిరగేసి వీపుమీద బాదడం తో (నన్ను కాదు మహా జనులారా...కుక్కని) గజేమోక్షం కధ లో విష్ణుమూర్తి దెబ్బకి ఏనుగు కాలొదిలేసిన మొసలి లాగా, నా కాలు వదిలేసి, ముక్క లాగకుండా, మూతి నాక్కుంటూ (అబ్బబ్బా.. నాది కాదండీ.. దానిదే) వెళ్ళిపోయింది. 
ఇది నాకు కలిగిన మొదటి దిగ్భ్రాంతి.  First psychic vibration.


అప్పటి నుండీ కుక్కల్ని చూడగానే నాలోని భయస్థుడు బిక్కు బిక్కు మంటూ తొంగి చూడటం మొదలెట్టాడు. 


1996 .. సమయం ..ప్చ్.... గుర్తులేదు.. 

ఇది నేను ఆరో తరగతి చదివేటప్పుడూ అనుకుంటా. మా ఫ్రెండ్ వాళ్ళింట్లో ఒక తెల్లని బొచ్చుకుక్క ఉండేది. ఒక రోజు వాడూ, అదీ వాళ్ళ అరుగు మీద పక్కపక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. దాన్ని చూశాక నాకు భలే నచ్చేసింది. ఒకపక్క భయపడుతూనే వెళ్ళి పక్కనే కూర్చొన్నా.. ఏమీ అనలేదు.. హా....య్.. అని దాని నెత్తి మీద చెయ్యేసి నిమరబోయా.. అంతే.. అమీర్ఖాన్ లాగా పొట్టిగా ఉన్నా బొచ్చుకుక్క, పిచ్చెక్కిన అమ్రిష్ పురి లాగా అరుస్తూ నా మీద పడీంది. ఇంతలో మా వాడు ఆపి, "ఎవడైనా నెత్తి మీద చెయ్యేస్తే నచ్చదురా దానికీ.." అని చెప్పి దాన్ని బలవంతంగా లాక్కెళ్ళి పోయాడు. మృత్యువు మొహం మీదకొచ్చి, మూడ్ లేదని సైడయిపోయినట్టయ్యింది నాకు.  ఇది రెండవ దిగ్భ్రాంతి. Second psychic vibration.

అది రెండు వేల ఒకటవ సంవత్సరం..ఫిబ్రవరి ఇరవై నాల్గవ తేదీ.. (కీ.శే. శ్రీ నూతన ప్రసాద్ గారి స్టైల్ )

ఈ ఇన్సిడేంట్ ని మాత్రం నేనెప్పుడూ మరిచిపోలేను. కుక్కల్ని కౄర మృగాల జాబితా లోకి చేర్చాలని డిసైడ్ అయిన రోజు. నేను టెంత్ లో ఉన్నప్పుడన్నమాట. మురారీ సినిమా సెకండ్ షో చూసి, ఆ టైం లో బస్సులు ఉండవ్ కాబట్టీ.. మా పిన్నీ వాళ్ళింటీకి లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ పోతున్నా.. సరిగ్గా ఆ కాలనీ కి ఎంటర్ అయ్యేసరికీ.. ఆ వీధి మధ్యలో సుమారు ఇరవై గ్రామసింహాలతో కూడిన శునక సామ్రాజ్యాన్ని చూసి అవాక్కయ్యాను. నాకు తెలుసు.. అక్కడే నిలబడీతే అరవటం మొదలెడతాయని.. పరిగెడితే వెంట పడతాయనీ, ఇంటికి వెళ్ళ లేననీ. సో పరిగెట్ట కూడదు, ధైర్యంగా చంద్రబాబులా ముందుకి పోవాలని దారుణంగా డిసైడ్ అయ్యి నడవటం మొదలెట్టాను.. నెమ్మదిగా కొన్ని గు గుర్ ర్ ర్ ర్ ర్ మంటూ కవ్వించడం మొదలెట్టాయి. అయినా నేను అదే అ"ధైర్యం" తో నడుస్తున్నాను.. పద్మవ్యూహం లాంటి ఆ గ్రామసింహాల గుంపు లోకి వెళ్ళాను. దాదాపుగా బయటకి వచ్చే టైం లో ఒక కుక్క నా వెనకాలే అనుమానంగా అరుస్తూ రావటం మొదలెట్టీంది. పరిగెట్ట కూడదని నా తలకాయకి తెలుసు కానీ,కాళ్ల కి తెలీదు గా .. అవి పరిగెట్టాయ్.. అంతే.. మొత్తం మందంతా AXE body spray యాడ్ లో అమ్మాయిలు హీరోని తరిమినట్టూ.. తరిమాయ్.. నేను నా లోని మిల్ఖాసింగ్ ని మేల్కొలిపీ, పోకిరి లో మహేష్ బాబులాగా  పరిగెడుతూ ఎదురుగా కనిపించిన ఇంట్లో కి పర్మిషన్ అడక్కుండా దూరేసి చివరి సెకన్ లో తప్పించుకున్నాను. This is third psychic vibration. మూడవ దిగ్భ్రాంతి. అప్పటి నుండీ కుక్కలంటే కోపం, అసహ్యం, పగ, భయం,వణుకు ఇంకా చాలా... చాలా.. హ్మ్..

కాబట్టీ ప్రజలారా.. ఈ శునకరాజాల విష్యం లో ఈ కింది సూచనలు మనసులో పెట్టుకోండి.

శునకాలూ - సత్యాలు - సూచనలుః
1. నక్క తోక తొక్కితే లక్కొస్తుందో లేదో తెలీదు గానీ, కుక్క తోక తొక్కితే ముందు గాట్లు తరవాత కుట్లూ పడటం ఖాయం.
2. కుక్కల పక్కగా వెళుతున్నప్పుడూ... నడకని తలపించే పరుగుతో (ఇది చాలా కష్టం... ప్రాక్టీస్ చెయ్యాలి..) ఎదురుగా ఉన్న బిల్డీంగ్ పై పెట్టీన నిత్యామీనన్ కటౌట్ ని చూస్తూ (లేకపోయినా ఊహించుకోని) మారు మాట్లాడకుండా వెళ్ళాలి..
3. కుక్కల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వాటికి కాలుద్ది. ఎప్పుడూ చూడమాకండి. (కంటి చూపుతో కుక్కల మనసు మార్చెయ్యడానికి మనం నరసింహ నాయుడు  సినిమా లో  బాలయ్యబాబులం కాము కదా .)

4. పడుకున్న కుక్కల తోకపట్టుకు లాగడం, చెవిలో నీళ్ళెయ్యడం, ఊరుకున్న కుక్క ని రాయిచ్చి కొట్టడం లాటీ తింగరి చిన్నెలు చెయ్యకూడదు.
5. (ఇది బెంగళూర్ వాసులకి) అర్ధరాత్రుళ్ళు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేటపుడు, " ఆ సందులోకి అంత దూరం బండీ పోదూ..ఇది డెడ్ ఎండ్ సార్... కార్ యూ టర్న్ తీసుకోడానికి అవ్వదూ..ప్లీజ్ అండర్ స్టాండ్" అని క్యాబ్ డ్రైవర్ కాళ్లా వేళ్ళా పడీ కన్నీళ్ళెట్టుకున్నా,కన్నడా లో బూతులు తిట్టుకున్నా, గెడ్డం పట్టుకొని బతిమాలుకున్నా.. ముక్కు చీది మూలుగుతున్నా, కరిగిపోయో , భయపడీపోయో.. దిగి నడిచి వెళ్ళడానికి సిద్దపడీతే.. కాసేపయ్యాక అదే రూట్లో ఆంబులెన్స్ లో పడుకొని వెళతారు. గుర్తుంచుకోండీ.  

ఇక్కడికొచ్చిన కొత్తలో  పెద్దలు చెప్పగా విన్నాను (బ్లాగుల్లో చదివాను అనుకుంటా..) ..." బెంగుళూర్ లో  కళ్ళు మూసుకొని ఒక రాయి విసిరితే అది ఖచ్చితంగా కుక్క కి కానీ, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి కానీ తగులుతుంది " అనీ. అది నిజమే. ప్రపంచం లో కుక్కలు ఎక్కువగా ఉన్న నగరం ఏది? అంటే "Bangalore" అని బల్లగుద్దీ మరీ బుకాయించేస్తాను. నడిచే వాళ్లవెనుకా, పరిగెట్టే వాళ్ళవెనుకా పడే కుక్కల్ని మా వూళ్ళో చూసాను గానీ...  టూ వీలర్ లనీ, కార్లనీ చేజ్ చేసి జాతర చేసుకునే జాగిలాలని ఇక్కడ మాత్రమే చూశాను.
పగలంతా చక్క్గగా నిద్రపోయి, ఆంధ్రా స్టైల్ హొటళ్ళ దగ్గర మూడు పూట్లా మెక్కీ, తిన్నదరక్క నిశీధివేళ లో నిత్యం నికృష్టం గా అరుస్తూ, అంతర్ కాలనీ శునకాల యుద్ధం లో అలుపెరగ కుండా అరిచి మన నిద్ర చెడగొట్టే ఈ కుత్తే ల కౌంట్ తగ్గించడాన్ని  వ్యతిరేకించే... నీచ్, కమీనే, కుత్తేగాళ్ళని కుదిర్తే కొత్తేం మీద పీకి, వీలయితే వాటిచేత కరిపించీ బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్ లు చెయ్యించాలని డిమాండ్ చేస్తున్నా. 
ఎందుకంటే రోజూ నా పరిస్థితి ఇలా ఉంది.. ;( 


రక్త సిక్త వర్ణమైన  తరతరాల శునక చరిత్రా.... శునక..శునక..శునక శునక శునక  
ఆధిపత్య పోరు కొరకు సాగుతున్న శునక చరిత్రా...శునక..శునక..శునక శునక శునక 
తుది లేనిది ఈ సమరం.. చీకటీ పడితే చావుభయం..
బతికేందుకు ఈ సమరం .. వెనకాలే ఓ సైన్యమ్..ఇంతే సంగతులు,
చిత్తగించవలెను.

48 comments:

Unknown said...

నీ శునక చరిత్ర బాగున్ది .. బెంగులూరు లొ కుక్కలు .. కొకొల్లలు .. కాని నీ సైకిక్ వైబ్రెశన్స్ కెకలు అరుపులు ః)
సూపర్ ఉన్ది .. కాని నెను నిత్యా మీనన్ మొహమ్ గుర్తు పెత్తుకొకుడదు కదా ఎలా ??

sivaprasad said...

frist comment nade , super ga undi , last lines r super , raj nuv ala dates chepthe ni age telusthandi kada, intha chinna logic ela miss ayyavo mari

ramya said...

Sooooooper

karthik said...

నీ కుక్కల గోల సరే గానీ నిత్యామీనన్ ఏ సినిమాలో ఉంది.. ఇప్పటిదాకా చూడలేదు.. :D

గిరీష్ said...

బాగుంది..
లాస్ట్ లైన్స్ బాగున్నాయ్..
keep it up రాజ్

బులుసు సుబ్రహ్మణ్యం said...

శునక పురాణం బాగుంది. కానీ శునకాలే కాదు శునక ప్రియులు కూడా మీ వెనక్కాల పరిగెత్తుతారేమో చూసుకోండి.

jojo said...

అదిరింది మీ శునక చరిత్ర. రామ్ గోపాలవర్మకు మెయిల్ చెయ్యండి

ఆ.సౌమ్య said...

నాకు కూడా కుక్కలంటే బలే బయ్యం రాజ్. మా అమ్మ ఓసారి సరదాపడి ఓ కుక్కపిల్లని ఇంటికి తెస్తే నీకు నేను కావాలో, ఆ కుక్కపిల్ల కావాలో తేల్చుకో అని ఖరాఖండిగా చెప్పేసాను.

గత పదేళ్లలో వచ్చిన సినిమాలలో నా ఫేవరెట్ డవిలాగు ఏమిటో తెలుసా?
"ఓహ్ కుక్కలా, అబ్బే కుక్కలైతే మనవల్లకాదండీ, కుక్కలకి మనకి లాంగ్వేజ్ ప్రోబ్లెం. పోనీ పారిపోదామనుకుంటే వాటికి నాలుగు, మనకి రెండు - కాళ్ళు. గబుక్కున దొరికిపోయి పిక్కగిక్క పట్టుకున్నాయనుకోండి, కుక్కచావేగా. కుక్కచావు అంటే మనం కుక్కని చంపడం కాదు, కుక్కచేతిలో మనం చావడం" - జల్సా (పవన్ డైలాగులు).

ఏం చెప్పాడు కదా, నాదీ సేమ్ ఫీలింగ్. :D

నీ చెమక్కులు మెరిసాయి. "మృత్యువు మొహం మీదకొచ్చి, మూడ్ లేదని సైడయిపోయినట్టయ్యింది నాకు."...ఇది బెస్ట్. నూతనప్రసాద్ గారిలా చెప్పిన ఎపిసోడ్...అక్షరం అక్షరానికి పగలబడి నవ్వాను. రెండు పాటలూ కేక.

వేణూశ్రీకాంత్ said...

Wonderful :)

ఆ.సౌమ్య said...

నిన్నటి ఈనాడు పేపర్లో మూడో పేజీ చూడు. "కుక్కకాటుకి మరో ఇద్దరు బలి" అన్న వార్త వచ్చింది :(

ఆ.సౌమ్య said...

"మేం కరుస్తాం అంతే" అని ఇంకో వార్త వచ్చింది అదీ చూడు...అదే మూడో పేజీ, నిన్నటి ఈనాడు.నీలాంటి, నాలాంటి బాధితులు ఎందరో!

శశి కళ said...

super keko keka kadanam adurs sasi

మనసు పలికే said...

హిహ్హిహ్హీఇ
హుహ్హుహ్హూ
హహ్హహ్హా
హొహ్హొహ్హో...
నీ టపా చదివి ఇన్ని రకాలుగా నవ్వాను రాజ్..;);) నీ శునక చరిత కేవ్వూ కేకంతే;) ఆ సైకిక్ వైబ్రేషన్ అయిడియా సూపరు:) మొత్తంగా టపా అద్భుతం. పాట అత్యద్భుతం;)

రాజ్ కుమార్ said...

కావ్యగారూ..ధన్యవాదాలు. నిత్యామీనన్ మొహమ్ గుర్తు పెత్తుకొకుడదని రూల్ ఏమ్ లేదుగా? మీకు అభ్యంతరం అయితే యే ప్రభాస్ నో, మహేష్బాబు నో ఊహించుకోటమే.. ;) ;)

శివా నీది కాదు కదా..! ;) విష్యం ఏంటంటే నా ఏజ్ అలా ఇండైరెక్ట్ గా చెప్పానన్న మాట.. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ ?? ;) ;)

రమ్యగారూ నెనర్లు అండీ..

రాజ్ కుమార్ said...

కార్తీకూ.. నిత్యా మీనన్ ఎవరా?? హతవిధీ.. ఎప్పుడో గులేబకావళి కధ చూసీ, మళ్ళీ రీసెంట్ గా మిస్టర్ పెర్ఫెక్ట్ మాత్రమే చూసినట్టూన్నావ్..;);)
సినిమాల విష్యం లో నిన్ను ఎఢ్యుకేట్ చెయ్యటం నావల్ల కాదయ్యా.. సరే.. ఆ అమ్మాయ్ "అలా.. మొదలైంది"
హీరోయిన్.. మాంచి సింగర్ కూడా..

గిరీష్.. థాంక్యూ వెరీ మచ్..

రాజ్ కుమార్ said...

బులుసు గారూ ధన్యవాదాలండీ..అవునండీ ఈ శునకాల కన్నా, శునక ప్రియులతోనే ఎక్కువ ప్రాబ్లం... ఏ పిచ్చిశునక రాజమో కరిస్తే కానీ తెలిసిరాదు ;);)

వెన్నెలరాజ్యం గారూ... వద్దులెండీ.. వాడికి నచ్చేసి కెమేరా వాడకుండా కుక్కల మీద సినిమా తీస్తానూ అని ప్రకటీస్తే.. ఆ పాపం నాకు తగులుతుంది. ;) ;)
ధన్యవాదాలండీ..

kiran said...

రాజ్ గారు ...అదరహో ..:D
మీ కాబ్ డ్రైవర్ కి ఈ టపా చూపించండి.....జాలి పడి రూం లోపల వరకు కాబ్ పోనిస్తాడు..:)
శునక చరిత్ర..శునక చరిత్ర...ఇది same స్టైల్ లో మనం అంత కలిసి పాడితే భలే ఉంటుంది...కదా..
టపా మాత్రం kevvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv (మీకు bowwwwwwwwwwwwwwwwwwwwwwww లా వినిపిస్తోంది కదా..:P )

Sravya V said...

అరె నిత్య మీనన్ పెటా మెంబెర్ అట , అందులోను పప్పీలంటే మహా ఇష్టం కూడా అట , మరి ఇప్పుడెలా :)

Anonymous said...

నిత్యా మీనన్ ఎవరా? what r u talking?

ఇందు said...

హ్హహ్హహ్హా! రాజ్ గారు...మీరు చెప్పినది బెంగుళురు విషయంలో కరెష్ట్. మా చందుని అడిగితే..ఇలాగే చెబుతారు...ఒకసారి మీలాంటి ఇన్సిడెంటే జరిగిందట.కుక్కలు,సాఫ్ట్వెర్ ఇంజినీర్లు ఎక్కువ ఉండెది బీటియంలోనే! ;)

నేను బెంగులురులో ఉన్నప్పుడు...మా వీధిలో నాకోసం ఒకటి కాదు మూడు జాతి కుక్కలు(అందులో ఒకదానికి తోక కూడ లేదు) ఇంకా ఒక నాలుగైదు వీధి కుక్కలు....మరీ దారుణం మా ఇంటి డోర్ ముందు పడ్య్కుండేవి...అదిలిస్తే..పళ్ళు చూపించేవి! అప్పుడు పక్కింటి ఆంటి హెల్ప్ తీసుకుని మెల్లగా వెల్లేదాన్ని :)))

నాకు కుక్కలమీద(వీధి)మీలాంటి అభిప్రయమే! కాని పెంపుడు కుక్కలంటే భలే ఇష్టం :) ఎస్పెషల్లి జిమ్మిగాడు....అదే జెర్మన్ షెపర్డ్ :)

రాజ్ కుమార్ said...

సౌమ్య గారూ.. మాంచి భలే డవిలాగ్ గుర్తు చేశారు.. సూపరు అది మాత్రం..
చమక్కులని మెచ్చుకున్నందుకు థాంక్సో ధాంక్స్.. ;)

హా నేనూ చూశానండీ..ఈరోజు ఈనాడు లో.. కుక్క కాటువల్లా గతవారం లో ఏడుగురో ఎంతమందో బలి అటా.. నా కోపం అస్సలు తప్పే కాదనిపించింది..

రాజ్ కుమార్ said...

వేణూశ్రీకాంత్ గారూ, శశి గారూ ధన్యవాదాలండీ..

మనసు పలికే గారూ.. అన్ని రకాలు గా నవ్వరా? (ఏముందని నవ్వాలీ అని నవ్వారా కొంపదీసీ??)
హిహిహిహిహి.. ధన్యవాదాలండీ..

Haritha said...

superooo super
"అయినా నేను అదే అ"ధైర్యం" తో నడుస్తున్నాను.."

:)

హరే కృష్ణ said...

:D :D

కొత్త పాళీ said...

brilliant

బంతి said...

super raj :)

రాజ్ కుమార్ said...

కిరణ్ గారూ.. హిహిహి.. ప్రింటవుట్ తీయించి చూపించాలా? గ్రూప్ సాంగ్ పాడితే అద్దిరిపోతుంది..ధన్యవాదాలు.

శ్రావ్య గారూ.. అవునా..?????????????

భవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్...

మరే ఇప్పుడేలా? ఒకసారి కుక్కచేత కరిపీంచేస్తే..దారిలో పడీపోతుందిలేండీ. హిహిహిహి.. ధన్యవాదాలు.

రాజ్ కుమార్ said...

హరిత గారూ.., కొత్తపాళీ గారూ, నా బ్లాగ్ కి స్వాగతం ధన్యవాదాలండి..

అనానిమస్ గారూ.. ఎవర్ని అడుగుతున్నారూ?? ;)

హరే, బంతీ.. థాంకులు..థాంకులు.. ;) ;)

రాజ్ కుమార్ said...

ఇందుగారూ.. ఎవరు చెప్పారండీ.. BTM లో మాత్రమే ఎక్కువ అనీ..? ప్రతీ చోటా ఇదే తంతు. కుక్కలెక్కువయ్యాయని కంప్లయింట్ ఇస్తే.. ఒక ప్లేస్ లో పట్టి ఇంకో ప్లేస్ లొ వదిలేస్తారూ..ఇక అప్పుడు ఉంటాది చూడండీ.. ఊర కుక్కల వీధి పోరాటం.. భలే టైం పాస్స్ ;)

>>.అదిలిస్తే..పళ్ళు చూపించేవి!>>>
నవ్వడానికా? కరవడానికాండీ? (జోకు..;))

మీ జిమ్మీ గాడిని అడిగానని చెప్పండి.
ధన్యవాదాలు.

SHANKAR.S said...

అయితే మీ బెంగుళూరు ఎంట్రన్స్ లో "WELCOME TO BENGALURU" & "BEWARE OF DOGS" అని బోర్డు పెట్టేయచ్చు. అయినా ఐటి ప్రొఫెషనల్స్ సంగతేమో గానీ కుక్కలు మాత్రం గల్లీ నాయకులలా ఎందెందు వెదకి చూచినా అందందే కలవు అన్నట్టు అన్ని ఊర్లలోనూ ఉన్నాయి. నేను హైదరాబాద్లో మా వీధిలో అఖిల పక్ష సమావేశం పెట్టుకుంటున్న కుక్కలని చూస్తే ఎవరో ఒకరికి ఫోన్ చేసి (ఎవరూ దొరక్కపోతే కస్టమర్ కేర్ వాడికైనా సరే) వాళ్ళతో గట్టిగా మాట్లాడుతూ భయాన్ని దిగమింగి, కాళ్ళు భయం తో వణుకుతున్నాయని వాటికి తెలియకుండా, అసలు వాటిని పట్టించుకునేంత తీరిక నాకు లేనట్టు బిల్డప్ ఇచ్చి ఫాస్ట్ గా మా వీధి దాటేస్తాను. ఈ టెక్నిక్ నాకు చాలా సార్లు వర్కవుట్ అయింది. ట్రై చేయండి.

jeevani said...

hahaha
raj, narration adirindi

శశి కళ said...

raj i want some help mail me
sasithanneeru2010@gmail.com

రాజ్ కుమార్ said...

శంకర్ గారూ.. ముందుగా నా బ్లాగ్ కి స్వాగతం..
అవునండీ.. సరిగ్గా చెప్పారు.. బోర్డ్ పెట్టేయొచ్చు.. ;) హహహ ఎవరూ తోడూ లేక పోతే.. నేను కూడా సేం మెథడ్ ఫాలో అవుతానండీ..
సెల్ ఫోన్ చెవిలో పెట్టుకొనీ, 60 డిగ్రీ యాంగిల్ లో చూస్తూ దాటెయ్యడమే.. హిహిహిహి..
ధన్యవాదాలు.

జీవని గారూ.. థాంక్యూ..థాంక్యూ..

Sai Praveen said...

ఇదిగో.. ఇన్ని సార్లు నేను పొగడలేను కానీ, నీ పోస్ట్ పడినప్పుడల్లా నా పేరు మీద 'కెవ్వు కేక' అని ఒక కామెంట్ పడేటట్టు ఏమైనా ఆటోమేషన్ కుదురుతుందేమో చూడు.

Sai Praveen said...

వార్నాయనో... ఈ కాన్సెప్ట్లేంటో.... ఆ డైలాగులేంటో..... బ్లాగు మొదలుపెట్టమని ఎంకరేజ్ చేసి తప్పు చేసినట్టున్నాను. మరీ ఇంత బాగా రాసేస్తే ఎలాగబ్బాయ్ ???

శివరంజని said...

ఈ పోస్ట్ కి ఇంకో 34కామెంట్స్ పెట్టిన తక్కువే ...చాలా చాల బాగా రాసారు రాజ్ కుమార్ గారు ...కొన్ని పంచ్ లు అయితే కేక .............Wonderful :)

రాజ్ కుమార్ said...

హిహిహి.. సాయీ.. థాంక్సో.. థాంక్స్.. నేను ఎలా రాసినా.. నీ కామెంట్ ఇలాగే ఉంటూంది లే..;) ;)

శివరంజని గారూ..లేట్ గా కమెంట్‍ పెట్టీనా... మీ స్టైల్ లో మునగచెట్టు ఎక్కించేస్తారు.. ధన్యవాదాలు..;)

Anudeep said...

మీ పోస్ట్ అంతా చదివాక నా అనలసిస్ ప్రకారం, మీకు ప్రతి ఐదు సంవత్సరాలకీ కుక్కల గండం ఉందని అర్థం అయింది (1991-1996-2001--????)
నా అనుమానం ఈ సంవత్సరం మీకు ఉన్న నెల గ్యాప్ లో మరొక కుక్కల గండం రావచ్చు;) మళ్లీ 2016 లో కూడా ఉండొచ్చు.
అంత వరకూ మీరు సంతోషంగా కుక్కల భయం లేకుండా ఉందొచ్చని జాతకాలు ఘోషిస్తున్నాయి :):):)

P.S. అలా అని కుక్కల తోకలు తొక్కి మరీ జాతకాలు తప్పని ప్రూవ్ చెయ్యకండి

రాజ్ కుమార్ said...

అనుదీప్ గారూ అలాఏం లేదండీ... ఉన్న భయానక జ్నాపకాల్లో కొన్ని రాశానంతే.. ఇలాంటీ గండాలు చాలా ఉన్నాయ్ అని నేనూ ఘోషిస్తున్నాను. ;)

ధన్యవాదాలు

గీతిక బి said...

హహ... నాదీ సేం.. సేం.. సేం.. భయ్యం...
చాలా బా వ్రాశారు.

//"ఓహ్ కుక్కలా, అబ్బే కుక్కలైతే మనవల్లకాదండీ, కుక్కలకి మనకి లాంగ్వేజ్ ప్రోబ్లెం. పోనీ పారిపోదామనుకుంటే వాటికి నాలుగు, మనకి రెండు - కాళ్ళు. గబుక్కున దొరికిపోయి పిక్కగిక్క పట్టుకున్నాయనుకోండి, కుక్కచావేగా. కుక్కచావు అంటే మనం కుక్కని చంపడం కాదు, కుక్కచేతిలో మనం చావడం" - జల్సా (పవన్ డైలాగులు).
గత పదేళ్లలో వచ్చిన సినిమాలలో నా ఫేవరెట్ డవిలాగు ఏమిటో తెలుసా?//

అవునా సౌమ్యగారూ...! ఈ డైలాగ్ ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట.

Unknown said...

papam kukkalani anavasaram ga ennenni matalu annaru.. By the way..

ee post ki mire inspiration

http://swathirocks.blogspot.in/2012/03/silent-bark.html :)

రాజ్ కుమార్ said...

స్వాతి గారూ అనవసరం గా అనలేదండీ. సిచువేషన్ అలా డిమాండ్ చేసింది ;).
మీ పోస్ట్ చూశానండీ. చాలా బాగుంది.
ధన్యవాదాలు

Lakshmi Naresh said...

నేను నవ్వుతుంటే జనాలు ఏందీ ఏందీ అని ఎగబడుతున్నారు.... కుక్క కరిస్తే కరిచింది కాని కుమ్మేసావు పో

రాజ్ కుమార్ said...

ఏంటి నరేషా... పాత పోస్టు తవ్వి తీశావు? ;) ఏకుక్కయినా ఎంట పడిందా?
థాంక్యూ ;)

Srujana said...

meru chala baga rastaru.. wow.. asalu nenu chadivinanta sepu navvutune unnanu.. Facebook lo edo me shadow review link chusa.. inka adi chusi fan aipoya..each and every article chadavadam start chesa.. chala chala native ga rastunnaru.. hatsoff...

Raj said...

It has been 7 months after coming to bangalore. I had confronted many dog batches those tried to rag me during late nights. I don't understand these bangalore guys who never get rid of these dog batches. God save bangalore software employees from dogs.

రాజ్ కుమార్ said...

srujana గారూ.. ధన్యవాదాలండీ కొంచెం చా లా ఆలస్యంగా ;)

@Raj hahah take care sir ;) thank you :)

Rekha Jithendra said...

Hysterically Funny :-p