Thursday, August 18, 2011

బీరు వీరుడు...! రీలోడెడ్


నల్ని విజయం వరిస్తే గర్వం తో కూడిన చిరునవ్వు.
మనతో పాటూ మన స్నేహితుడికీ సక్సెస్ వస్తే ఆనందం తో కూడిన  నవ్వు.  
మన స్నేహితుడికి విజయం వచ్చీ, మనకి అనుభవం మాత్రమే వస్తే  ఏడవలేక నవ్వు.
 
 మా శీనుమాయ గాడు జాక్ పాట్ కొట్టినట్టూ జాబ్ కొట్టడం తో మొహమాటపు నవ్వు నవ్వేసీ చేతికి చలిజ్వర మొచ్చిందా? అన్నట్టూ  షేక్ హ్యాండిచ్చేసీ, దేవుడేటీ మాకిలా హ్యాండిచ్చాడూ అని ఫీలవుతూ, కడుపులో రగులుతున్న కుంపటి మంట ని చల్లార్చుకోడానికి క్యాంటీన్ లో కోకా కోలా తాగుతూ ఫీలవుతున్న వేళ....  

పెసరట్టు తిరగేసినట్టూ నా వీపు మీద ఒక చెయ్యి పడిందీ. ఇంత మోటు గా మ్యాన్ హాండ్లింగ్ చేశాడంటే... ఇంకెవడూ? ఆడు అప్పల్రాజుగాడే..  అనుకొని "ఏటేహే.." అన్నాను చిరాగ్గా. ముందుకొచ్చి కూర్చొనీ "ఏట్రా ఈ మజ్జిని కొంచేం ఒళ్ళు చేస్తున్నావూ? బీరు గానీ కొట్టేత్తున్నావా?" అన్నాడు.
"మొన్న మీరు బీరేస్తుంటే స్మ్లెల్ చూసేడు కదరా.. దాని ఎఫెక్టేమో" అన్నాడు పక్కనున్న విలాస్ గాడు. 
"స్మెల్ చూసిన నేనే ఇంత ఒళ్ళుజేస్తే.. లీటర్ల లెక్కన వాటర్ లాగా తాగేసిన ఈడేమయిపోవాలీ?" అనేసి తిట్టేసీ, ప్రిన్సీ మీటింగ్ ఉందంటేనూ అందరం కలిసి సెమినార్ హాల్ కెళ్ళాం.

ప్లేస్ మెంట్స్  అనేవి ఒళ్ళు కొవ్వెక్కిన్ కాలేజీలు మాత్రమే చేసే పనికిమాలిన పని అని ఫిక్సయిపోయీ,క్యాంపస్ సెలక్షన్స్ కి స్పెల్లింగ్ కూడా తెలీకుండా ఆరేళ్ళ బట్టీ ఇంజినీరింగ్ కాలేజ్ నడుపుతున్న మా కరెస్పాండేంట్ ని,  చెప్పినదానికి ఒప్పుకోక పోతే హాస్టల్ మెస్ లో సాంబార్ మొత్తం తాగేస్తానని బెదిరించి ఒప్పించిన  మా ప్లేస్మెంట్ ఆఫీసరూ రెక్వెస్ట్ లాగా అనిపించే కమాండ్ ఇచ్చాడు మా అందరికీ.
అదేంటంటే రిలయన్స్ వాళ్ళకీ జావామీద రిక్వైర్ మెంట్ ఉందంటా, చచ్చీ చెడీ బతిమాలీ,  ఆదివారం క్లాస్ లు పెట్టీ శుక్రవారం సెలవిచ్చే మా తింగరి కాలేజీకి రిక్రూట్ మెంట్ కి రప్పిస్తున్నాడంటా. గుడ్డిలో మెల్ల లాంటి నాలాటి  కొందరిని సెలక్ట్ చేసీ సెమిస్టర్ హాలిడేస్ లో ఫుడ్డూ , బెడ్డూ, జావా కోచింగూ ఫ్రీ గా ఇచ్చీ మమ్మల్ని రెడీ చేస్తారంటా. కలా? నిజమా? అనుకొనీ హాలీడేస్ మొదలవ్వగానే, సూట్ కేస్ నిండా బట్టలూ, సంచుల నిండా స్వీట్లూ, హాట్లూ  సర్ధుకొనీ తయారయిపోయాను ఎక్కడో కొండల్లో, జనజీవన స్రవంతి కి దూరంగా వెలసిన మా హాస్టల్ కి.

మొదటి రోజూ కొత్తగా కోచింగ్ ఇవ్వడానికొచ్చిన ఆ ట్రెయినర్ "వాటీజ్ OOPs"? అన్నాడు. లైబ్రరీ లో కూడా లౌడ్ స్పీకర్ ఆన్ చేసి పక్కోడి కాలర్ ట్యూన్ లు వినే మా గ్యాంగ్ అంతా రాజీవ్ గాంధీ చనిపోయినందుకు మౌనం పాటించడం మొదలెట్టారు. మా చెవుల్లో విత్తనాలేస్తే చెట్లు మొలుస్తాయని తెలియడానికి అట్టే సమయం పట్టలేదాయనకీ. ఈ దెబ్బతో మా కర్మ భోగి మంటలో పాత సామాను లాగా కాలీ ట్రెయినింగ్ ఇంకో రెండు గంటలు పెంచారు.పొద్దున్నే ఆరుగంటలకి మొదలెట్టీ, రాత్రి ఎనిమిది వరకూ రెండే రెండు బ్రేక్ లు ఇచ్చీ మిగిలిన టైం లో కమ్యునికేషన్ స్కిల్స్ అనీ, జీడీ లనీ, జావాలని మమ్మల్ని బ్రేక్ చేసేవారు. రెండో రోజు నుండీ నా కెందుకో క్లాస్ మొదలవ్వ గానే నిద్ర రావటం మొదలెట్టీందీ. నిద్ర అంటే అంటే అలాటిలాటీ నిద్ర గాదు. దారుణమయిన నిద్ర. పొద్దున్న ఐదు గంటలకి చలి లో చన్నీటి స్నానం చేసీ ఆరుగంటలకి క్లాస్ లో కూర్చుంటే.. ఐదు నిమిషాలు గడిచేసరికీ కునికి పాట్లు పడుతూ, ఎప్పుడు రూమ్ కి వెళతానా? ఎప్పుడు నిద్ర పోతానా అని ఆలోచించేవాడిని. మరో రెండు రోజులు గడిచేసరికీ హాస్టల్ నుండీ కాలేజ్ కి నడుస్తుంటే ఆ అర కిలోమీటర్ దూరానికి అయాసం, కాళ్ళూ, వొళ్ళూ నొప్పులూ.  త్వరలో ఇంజినీరింగ్ అయిపోయీ టాటా గుడ్ బై చెప్పేసుకునే టైం లో చుట్టూ చెట్లూ, పుట్లతో ప్రశాంత వాతావరణం, హాలీడేస్ కావటం తో మా రెగ్యులర్ లెక్చరర్ లు, స్టూడెంట్స్ ఎవరూ లేరూ. పిల్లకాయలు  గ్రద్దా - రాబందుల్లాగా, గబ్బిలం-గుడ్లగూబల్లాగా జంటలు కట్టీ క్యాంపస్ అంతా కలతిరుగుతూ పండగ చేస్తున్నారంటా ;).  నేను నిద్రమత్తులో ఇవేం పెద్దగా పట్టీంచు కోకుండా మెస్స్ లో మూడు పూట్లా తినేసీ పగలంతా రాత్రి నిద్రపోవటం గురించీ కలలు కంటూ, మెలకువ వచ్చినప్పుడు ఊడిపోతున్న జుత్తు చూస్కొని బాధపడుతూ గడిపేసేవాడిని.
ఇంకో రెండు రోజుల తర్వాత నా ఫేవరేట్ జీన్ ప్యాంట్ వేసుకున్నాక చాలా ఇబ్బందిగా అనిపిమ్చిందీ. చిత్రంగా నా ప్యాంట్ పట్టేసిందీ. వార్నీ హాస్టల్ ఫుడ్ బాగా వంటబడుతుంది మనకి అనుకున్నాను.
ఈ లోగా కాకినాడ KIET కాలేజీ లో సత్యం క్యాంపస్ సెలెక్షన్స్ జరుగుతున్నాయని తెలిసిందీ. ఎప్పటి లాగా నే మా బ్యాచ్ అందరం బస్సేసుకొని బయల్దేరాం. బాలభారతం సినిమా లో పిల్ల భీముడి లాగా తయారయిన నేను స్పెషల్ అట్రాక్షన్. బస్ లో నా పక్కనే కూర్చున్న మా ప్లేస్ మెంట్స్ ఆఫీసరూ "ఏటి రాజ్.. మొహమ్ ఉబ్బినట్టూ ఉందీ.. కాల్చేసిన అగ్గిపుల్ల లాగా ఉండే వాడివీ. కండపట్టిన కోతి పిల్ల లాగా తయారయ్యావ్. కొంపదీసి ఉబ్బు కామెర్లా?" అన్నాడు. కళ్ళద్దాలెట్టుకొనీ, జుత్తు చేత్తో ఎగదోసీ, నుదుట ఆంజనేయస్వామి కుంకుమ పెట్టుకొని బయటకళ్ళి పోటమే తప్పా అద్దం లో చూసుకొనే అల్వాటు పెద్దగా లేదు నాకు. అతనలా అనేసరికీ భయమేసీ ఇంటర్వ్యూ అయిపోయాకా డాక్టర్ దగ్గరకి వెళదాం అనుకున్నా. కైట్ కాలేజ్ భలే నచ్చేసింది నాకు. పిచ్చ కలరింగ్ తో కళ కళ లాడి పోతుందీ. ;) . లక్కీగా నా రిటెన్ టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ డే గ్రూప్ డిస్కషన్, & ఇంటర్వ్యూ అనటం తో నేను ఆ రోజు రాత్రి భానుగుడి సెంటర్లో ఉంటున్న మా బ్యాచిలర్ బాబాయ్ రూమ్కెళ్ళిపోయాను. రాత్రి బువ్వ తినేసీ, బాబాయ్ తో నా బాధ చెప్పుకొనీ హాస్పిటల్ కి బయల్దేరాను. ఆ పేద్ద డాక్టర్ గారేమో "ప్రకృతి పిలుపులు" ఎలా ఉన్నాయీ? ఏం గడ్డి తింటున్నావ్? నీ అలవాట్లేమిటీ? బీర్ ఎక్కువగా తాగేస్తున్నావా?( భగమంతుడా ఏటీ పరీక్ష నాకూ??) అని నానారకాలు కొచ్చెన్లూ వేసీ బెడ్ మీద పడుకోమని చెప్పీ చెక్ చెయ్యటం మొదలెట్టాడు.


డాక్టర్ :  ఇక్కడ నొప్పుందా?
నేను  :   లేదు.
డాక్టర్ : ఇక్క్డడా? 
నేను  :   లేదు.
డాక్టర్ :  ఆ హా... ఇక్కడో??

నేను  : ఆ.. ఉందీ..
డాక్టర్ : ఇక్కడో??
నేను  : ఆఆఆఅ.ఆఆఆఆఅ ఉందీ..
డాక్టర్ : మరి ఇక్కడో??
నేను  :  ఆఆఆఅ.ఆఆఆఆఅ అయ్య బాబోయ్..  ఉందీ..
డాక్టర్ :  ఏంటయ్యా? నీకు వొళ్ళంతా నొప్పులేనా? (బుఱ గోక్కుంటూ)
నేను  : మెత్తగా ఉందిగదా అని చపాతీ పిండి పిసికినట్టూ పిసికేస్తుంటే నొప్పెట్టదా? మరీ?

"ఏం లేదబ్బాయ్.. అంతా నార్మల్ గానే ఉన్నాది" అని అనేసీ వెయిటింగ్ మిషన్ మీద నించోమన్నాడు. పది రోజుల కిమ్దట 52కే.జి ఉండేవాడిని 62 కే.జి ఉన్నాను. నేను షాకయ్యి ఆ ముక్కే చెప్తే "అంతా నీ భ్రమ.. that is impossible. you are perfectly alright" అని  బై బై చెప్పేశాడు.

**********************************************
మర్నాడు గ్రూప్ డిస్కషన్ అన్నమాట. మా గ్రూప్ లో ఇద్దరు కాకినాడ అమ్మాయిలు (ఆ కాలేజ్ లో సీట్ రానందుకు చాలా ఫీలయ్యాను ఆళ్లని చూశాక ). కుంచేం పరిచయాలయ్యాక చెరోపక్కా చేరీ ఎలా మాటాడాలీ? ఏంటీ అని నన్ను తెగ సలహాలడిగేశారు.పిచ్చెదవని కదా.. బోల్డు టిప్స్ ఊదేశాను@ ఫ్రీ ఆఫ్ కాస్ట్. జీ.డి బాగానే జరిగిందీ. "పక్కనే యానాం పోదాంరా బీరు డెడ్డు చీపురా"  అన్నారు మా బ్యాచ్ లో కోతిగాళ్ళు. "ఒక్కసారి వాసన చూసినందుకే మహాబలుడు సినిమా లో సూపర్ స్టార్ కృష్ణ లాగా అయిపోయేనూ... వద్దురా బాబూ" అనేసేసీ  ఎప్పటి లాగానే మాంచి హోటల్ చూసుకొని కుమ్మేసీ కాలేజి కి వచ్చాను. 


మా గ్రూప్ లో ఆ కాకినాడ అమ్మాయిల్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అప్పటి వరకూ నాతో తెగ మాహాడేసినోళ్ళు  నా వైపు చూసీ చూడనట్టూ చూసీ అదోరకం గా నవ్వుకుంటా ఎల్లిపోయేరు.

ఇవతల మా కాలేజ్ వాళ్ళు కూడా అమ్మాయిలందరూ ఫైనల్ రౌండ్ కి సెలెక్ట్ అయిపోయారు. "ఈ సత్యమోడు ఇంతేరా.. అమ్మాయిల్ని మాత్రమే తీసుకుంటాడూ *&#$%*(&(*" అని తిట్టేసుకొనీ, సరిపెట్టేసుకొనీ బస్సెక్కి  సొల్లు కబుర్లు చెప్పుకుంటా రాత్రి ఎనిమిది దాకా వెయిట్ చేసేమ్.
ఇంతలో రెక్కలు లేని హాలీవుడ్ దేవకన్యల్లాగా మెరిసిపోతూ జాబ్ కొట్టిన ఆనందం తో గర్వంతో మా కాలేజమ్మాయిలు బస్సెక్కారు. మధ్యాహ్నం వరకూ చాలా ఫ్రెండ్లీగా నార్మల్ గా ఉన్నాళ్ళంతా మంచులక్శ్మి లాగా తెలుగులో ధారాళం గా మహాడేస్తూ మమ్మల్ని అంటరానివాళ్ళ లాగా చూడ్డం మొదలెట్టేరు. ఆ.... మరిచిపోయేను  ఒనీడా టీవీ యాడ్ లో రాక్షసుడు ఆడవేషం వేసుకున్నట్టూ వాళ్ళ నెత్తిమీద కొమ్మ్పులు కనిపించేయ్ నాకు. చిత్రంగా ఎవడయినా కంగ్రాట్స్ చెప్తే చాలు అవి అంగుళం పొడవు పెరిగిపోతున్నాయ్. 

జీ.....వితమ్.........! ఇష్టం గా కసకసా నమిలూసేసిన కారా కిళ్ళీ బతుకయిపోయిందీ.
మమ్మల్ని ఇంత క్షోభ పెట్టిన ఆ రామలింగరాజుని తెగ తిట్టేము. మా నాలుకలకున్న పవర్ రెండేళ్ళు పోయాక తెలిసిందీ. హిహిహిహిహి హుహుఉహుహు హహ్హహ..హ్హ

**********************************************
ఆ రోజు రాత్రి మా ఇంటికెళ్ళి పోయేను హాస్టల్ కి వెళ్లకుండా. బట్టలేసుకున్న భల్లూకం లాగా ఉన్న నన్ను చూసిన మా మాతృదేవత కంగారు పడిపోయీ మా ఫ్యామిలి డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళారు.
"సాధారణం గా పెళ్ళయినోళ్ళు ఇలా లావవుతారు. నీకు ఇంకా కాలేదు కదా..?" అన్నాడు మా డాట్రు.
 మా అమ్మేమో అనుమానం గా నా వైపు చూసేసరికీ నేను కంగారు పడీ "అయ్యయ్యో... రామ..రామా.. సింహరాశి సినిమా లో రాజశేఖర్ లాంటోడిని. నన్ను అనుమాస్తావా?" అని లెంపలేసుకుంటూ జాలిగా చూశాను.
కాకినాడ డాక్టర్ అడిగిన కొచ్చేన్లే మళ్ళీ అడిగీ, అడ్డమయిన టెస్ట్లూ చేయించేసీ, నిలబెట్టి ఎక్స్ రేలూ తీయిమ్చేసీ ఫైనల్ గా నా బరువు చెక్ చేశాడు. రెండు రోజుల క్రితం 62Kg ఉన్నవాడిని 65kg కి వచ్చేశాను.
 "రిపోర్ట్స్ ని బట్టీ.. చూస్తే ప్రాబ్లెం ఏం లేదమ్మా ఒంట్లో వాటర్ ఎక్కువయ్యిందంతే..పోడానికి టాబ్లెట్స్ ఇస్తున్నాను. ప్రధమ ప్రకృతి భీభత్స కాండ పదే పదే జరిగుతుందీ కంగారు పడకండీ." అని పంపేశాడు. నాకు రజినీకాంత్ సినిమా జపనీస్ డబ్బింగ్ లో చూసినట్టూ అయోమయంగా అనిపించిందీ.

**********************************************

అంతకు ముందు కొన్ని నెలల క్రితం ఇలాగే  మా చిన్నాన్న గారు హఠాత్తుగా లావయ్యి పోయీ, చాలా సీరియస్ అయిందనీ మా నాన్నగారు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన కి కాల్ చేసి విషయం చెప్పాను.
ఆయన నన్నడిగిన మొదటి ప్రశ్న "నీకు నిద్ర బాగా వస్తుందా?" అని. అంతకు ముందు ఏ డాక్టరూ అడగని ప్రశ్న అది. నాకు దిమ్మతిరిగింది. సింహగర్జన లాంటి భయంకరమయిన గురక తో కూడిన నిద్ర దారుణమ్ గా వస్తుందనీ, ట్రెయినింగ్ నుండి పారిపోయొచ్చిన సుమో ఫైటర్ లాగా అయిపోయాననీ అని చెప్పాను.


లేట్ చెయ్యకుండా వైజాగ్  అపోలో లో కార్డియాలజిస్ట్ పాణిగ్రాహి అపాయింట్ మెంట్ తీసుకొని వెళ్లి కలవమన్నారు. నా బట్టలు సరిపోకా మా నాన్నారి బట్లేసుకొని మర్నాడే వెళ్ళాను. ఇలా పది రోజుల్లో పది కిలోలు పెరిగిపోయాను అనగానే  "నీ వాయిస్ చాలా ముద్దగా వస్తుందీ అబ్జర్వ్ చేశావా?" అన్నాడు. లేదన్నాను. వెంటనే చెప్పేశాడు ఆయన "This is typical Hypothyroidism" అని. కన్ఫర్మేషన్ కోసం టెస్ట్ లని, స్కానింగ్స్ అనీ చెప్పీ నా జేబులోని డబ్బులన్నీ దబాయించీ లాగేసుకొనీ, బాలెన్స్ కోసం నా ఉంగరాల వైపు చూశారు. అదో పెద్ద స్టోరీ లెండీ.
రిపోర్ట్స్ వచ్చాకా డాక్టర్ చెప్తూ ఉంటే అప్పుడర్ధమయ్యిందీ ఒక్కో సంగతీ.

శరీరం లో థైరాయిడ్ హార్మోన్స్ (T3,T4,TSH)సమతుల్యత దెబ్బతినటమ్ వల్ల వచ్చిన పాట్లివి. నాకు అన్నీ లిమిట్ దాటి గేట్లెత్తేసిన గోదారిలాగా ప్రవహిస్తుండటం తో అవి నా బ్రెయిన్ మీద ప్రభావం చూపడం వల్ల  నిద్ర ఎక్కువొస్తుందీ. ఇంకొంత కాలం ఆగి ఉంటే కోమా లోకి పోయేవాడినట. హఠాత్తుగా లావవ్వటం, జుట్టూడిపోవటం, గొంతు వాచి గురక రావటం  కూడా దాని ఎఫెక్ట్ నే. హఠాత్తుగా బరువు పెరగటం తొ నా బరువు నేను మోసుకోలేక ఆయాసం, వొళ్ళునొప్పులూనూ. హ్మ్మ్..  వేలకి వేలు టెస్ట్ ల కోసం లాగేసీ, 30 రూపాయల అయొడిన్ మాత్రలు రాసిచ్చీ రోజుకొకటి వేసుకో.. పండగ చేస్కో అన్నాడు ఆ వైధ్యో నారాయణో హరీ...!

ఇప్పుడంతా ఓకే గానీ ఆ పది రోజులూ నేను ఎప్పటికీ మరిచి పోలేని విచిత్రమయిన రోజులు.

[ఈ మధ్య కాలం లో చాలా ఎక్కువ అయ్యాయట ఈ కేస్ లు. ఇదే ప్రోబ్లెమ్ తో ఆఫీస్ లో పనిమానేసీ కీబోర్డ్ మీద తలపెట్టీ, గురకెట్టి పడుకున్న ఒక కొలీగ్ నీ, వెంటనే గుర్తించక పోవటం వల్లా చాలా సీరియస్ అయ్యీ ప్రాణాల మీదకి వచ్చిన ఇంకో ఫ్రెండ్ నీ చూశాకా చెప్పాలని పించిందీ...కాబట్టీ ప్రజలారా.. జాగ్రత్త] 

23 comments:

SHANKAR.S said...

హెల్త్ జాగ్రత్త రాజ్. అప్పట్లో ఒక ఫోటో తీసుకుని ఉంచుకోవాల్సింది :)).


(అన్నట్టు ఈ పోస్ట్ లో మీరు నాలుగుసార్లు "కాకినాడ" పేరు వాడారు. పోస్ట్ మొత్తం మీద అది బాగా నచ్చేసింది నాకు :)))))))) )

ఇందు said...

వామ్మో! ఒక కొత్త విషయం చెప్పారుగా! ఇప్పటిదాకా ఇలాంటిది ఒకటుందని నాకు తెలీదు. ఇకనించి జాగ్రత్తగా ఉండాలి :) థాంక్స్. మంచి విషయం సరదాగా అయినా బాగా చెప్పారు :)కానీ రోజురోజుకీ మీ డైలాగ్స్ బాగా పదునెక్కుతునాయ్ రాజ్ గారు :)) ముఖ్యంగా.... 'కండపట్టిన కోతి పిల్ల లాగా తయారయ్యావ్',' బట్టలేసుకున్న భల్లూకం లాగా'.....ఈ రెండు అల్టిమేట్! :)))

Sravya V said...

వామ్మో ఇలా కూడా అవుతుందా అదీ కేవలం కొన్ని రోజుల్లోనే :(((

SJ said...

nice post,take care of health...

రవికిరణ్ పంచాగ్నుల said...

నవ్వులాటగా చెప్పినా కాస్త భయపెట్టారు సార్!. Quite Informative.

మనసు పలికే said...

అమ్మో రాజ్.. పాపం నీకు థైరాయిడ్ వచ్చిందా? దాన్ని ఇంత కామెడీగా ఎలా చెబుతున్నావు? ఏంటో చివరికొచ్చేసరికి నీ హాస్య గుళికలన్నీ నవ్వించడం మానేశాయి థైరాయిడ్ అని తెలియగానే :((
ఇప్పుడు అంతా బానే ఉంది కదా? జాగ్రత్త..

ఆ.సౌమ్య said...

అవును రాజ్ నేనూ విన్నాను థైరాయిడ్ సమస్యలు ఎక్కువవుతున్నాయి. నాక్కూడా వీరీపమైన నిద్ర వస్తుంది కానీ నాకు చిన్నప్పటినుండీ వస్తుంది ఇలాగ...నాకు నిద్రంటే ప్రాణం అసలు...అంటే నాకు చిన్నతనంలోనే థైరాయిడ్ వచ్చేసిందంటావా? :D

జోకులు పక్కనపెడితే మంచి పొస్ట్...మంచి విషయం.

ఇంక పంచులు

"మన స్నేహితుడికి విజయం వచ్చీ, మనకి అనుభవం మాత్రమే వస్తే ఏడవలేక నవ్వు."

"లైబ్రరీ లో కూడా లౌడ్ స్పీకర్ ఆన్ చేసి పక్కోడి కాలర్ ట్యూన్ లు వినే మా గ్యాంగ్ అంతా రాజీవ్ గాంధీ చనిపోయినందుకు మౌనం పాటించడం మొదలెట్టారు."

"ఒనీడా టీవీ యాడ్ లో రాక్షసుడు ఆడవేషం వేసుకున్నట్టూ వాళ్ళ నెత్తిమీద కొమ్మ్పులు కనిపించేయ్ నాకు. చిత్రంగా ఎవడయినా కంగ్రాట్స్ చెప్తే చాలు అవి అంగుళం పొడవు పెరిగిపోతున్నాయ్."
.........
కేకో కేక :D

శ్రీనివాస్ పప్పు said...

మంచి పోస్ట్ రాజ్. పంచుకు సౌమ్య చెప్పినవే + ఇది కూడా
మా గ్రూప్ లో ఇద్దరు కాకినాడ అమ్మాయిలు (ఆ కాలేజ్ లో సీట్ రానందుకు చాలా ఫీలయ్యాను ఆళ్లని చూశాక ). కుంచేం పరిచయాలయ్యాక చెరోపక్కా చేరీ ఎలా మాటాడాలీ? ఏంటీ అని నన్ను తెగ సలహాలడిగేశారు.పిచ్చెదవని కదా.. బోల్డు టిప్స్ ఊదేశాను@ ఫ్రీ ఆఫ్ కాస్ట్.

ఇకపోతే శంకర్ గారోఓఓఓఓ కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కాకినాడ 4 సార్లు వచ్చింది కాబట్టి నచ్చినందుకు

మనసు పలికే said...

హహ్హహ్హా రాజ్. నీ పంచుల పవర్ మరో సారి రుచి చూపించావు:) కేకో కేకస్య కేకః :))
మొత్తానికి కథ సుఖాంతమయినందుకు సంతోషం.
"సాధారణం గా పెళ్ళయినోళ్ళు ఇలా లావవుతారు. నీకు ఇంకా కాలేదు కదా..?" అన్నాడు మా డాట్రు.
మా అమ్మేమో అనుమానం గా నా వైపు చూసేసరికీ"
కిక్కిక్కి..;) ఎంత నమ్మకం ఎంత నమ్మకం..

టపా మాత్రం సుపరు రాజ్:))

శశి కళ said...

హ...హ...నాయనా...కస్టాన్ని కూడ కామెడి చెస్తావు.సింహ రాసిలొ రాజ్ కుమార్ వె బాబు...
నీ కొచ్చింది యెవరికి రాకూడదని ...మంచి వాడీవి.

హరే కృష్ణ said...

నవ్వుతూ చివరకి వచ్చేసరికి
బాబోయ్ ఇంత దారుణమా అనిపించింది
సాటి చిరు ఫాన్స్ గా అపోలో ని మాత్రం వదలలేదు కదా :))

kiran said...

కాల్చేసిన అగ్గిపుల్ల లాగా ఉండే వాడివీ. కండపట్టిన కోతి పిల్ల లాగా తయారయ్యావ్. -:D
అయ్యయ్యో... రామ..రామా.. సింహరాశి సినిమా లో రాజశేఖర్ లాంటోడిని. - :D :D
నా బట్టలు సరిపోకా మా నాన్నారి బట్లేసుకొని మర్నాడే వెళ్ళాను :P
గేట్లెత్తేసిన గోదారిలాగా ప్రవహిస్తుండటం తో - :))))

నవ్వొస్తోంది..వెంటనే బాధ గా కూడా అనిపిస్తోంది...!!
పైన dialogues దగ్గర గట్టి గట్టిగా నవ్వేసా..:)
ఏమిటో కొత్త కొత్త రోగాలు..:(...thanks fr sharing this !!

Sharada said...

నవ్వులాటగానే చెప్పుతూ చాలా విలువైన సమాచారాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
Hope you have recovered fully now.
శారద

Sujata said...

మంచి పోస్ట్ ! అయితే మీరు చెప్పిన సమస్య ప్రాణాంతకం అని నాకింతవరకూ తెలియదు. మంచి సమాచారం. ఇంక ఏదొచ్చినా లైతు గా తీస్కోకూడదన్నమాట !

రాజ్ కుమార్ said...

శంకర్ గారూ... అనుకోకుండా కొన్ని ఫోటోలు తీసుకున్నాలెండీ.. నాకే భయమేస్తుందీ అవి చూస్తే...;)
కాకినాడ గురించీ చెప్పాలంటే నండీ బీచ్ రోడ్ లో కెరటాలు రోడ్ మీదకి వస్తూ ఉంటే బైక్ మీద వెళుతూ ఉంటే... అలా వెళుతూనే ఉండాలనిపిస్తాది. ;) థాంక్యూ

ఇందుగారూ ధన్యవాదాలు. హ్మ్మ్ అవునండీ. చాలా మంది డాక్టర్స్ కి కూడా తెలీదు. ;(

రాజ్ కుమార్ said...

శ్రావ్య గారూ.. యెస్సో.. ;) థాంకులూ.

సాయిగారూ, రవి కిరణ్ గారూ ధన్యవాదాలు

రాజ్ కుమార్ said...

హహహ సౌమ్యగారూ చిన్నప్పుడే వస్తే.. మీరు పెద్దయ్యి ఉండేవారు కారు లెండీ.
అయినా మీకు తెలిసి పోతుందీ ఏదో తేడా చేసిందీ అని.
కాబట్టీ చక్కగా నిద్రపొండీ..;)

పప్పుసారూ, సౌమ్యగారూ మీకు నచ్చినందుకు,, మెచ్చినందుకూ ధన్యవాదః

రాజ్ కుమార్ said...

మనసుపలికే,శశిగారూ, హరే, కిరణ్..ధన్యవాదాలు..

హరే.. మన అపోలో.. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ ;)

Chandu S said...

Hypothyroidism వాళ్ళు ఇంత sharp గా ఉండరే?

రాజ్ కుమార్ said...

సుజాతగారూ.. అవునండీ ముదిరితే ప్రమాదమే.. ;)
ధన్యవాదాలు.

శారద గారూ ధన్యవాదాలండీ..

రాజ్ కుమార్ said...

Chandu S గారూ
నాకు అర్ధం కాలేదండీ..ఇది ఇప్పటి సంగతి కాదండీ నాలుగేళ్ల క్రితం ;)

స్నిగ్ధ said...

కామెంటడానికి చాలా ఆలశ్యమయ్యింది, సారి రాజ్ గారు..

బాబోయ్ ఏం నవ్వించారండి...అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటున్నాను...

పంచులన్నీ అదిరాయి...

ఇప్పుడు మీ హెల్త్ బానే ఉంది కదండీ..

మర్చిపోయా చెప్పను..మీ దూకుడు రివ్యూ సూపరు...:)

రాజ్ కుమార్ said...

స్నిగ్ధ గారూ.. థాంక్యూ వెరీమచ్ అండీ. హా ఇప్పుడు చక్కగా దిట్టం గా ఉన్నానండీ ;)

దూకుడు రివ్యూ మెచ్చినందుకు థాంకులు