జీవితం లోని వెల లేని విలువైన గొప్ప రోజులని బాధాకరమయిన భయంకరమయిన రోజులని భ్రమపడుతూ, అవి గడిచిపోయాయని సంబరపడుతూన్న రోజులు.
టెంత్ క్లాస్ రిజల్ట్స్ చూసుకొని స్కూల్ ఫస్ట్ నేనే అని తొడకొట్టి తాండవం చేస్తున్న రోజులు.
పెణం లోనుండి పొయ్యిలో పడే రోజులు త్వరలో తరుముకు రాబోతున్నాయని తెలీక, స్విచ్ ఆన్ చేసి, ప్లగ్ లో వేలెట్టి , కరెంట్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నట్టూ కాలేజ్ కెళ్ళే మొదటి రోజు కోసం ఎదురు చూస్తున్న రోజులు.
"ఓరేయ్.. గాడిదా..! ఏం పాటడిపోతున్నావ్ లోపలా?" అన్న పిలుపు కి స్వాతీ వీక్లీ లో సీరియస్ గా సెంటర్ పేజ్ చదువుతున్న నేను ఉలిక్కి పడి పేజీలు తిప్పేసీ "ఏమీ లేదు..ఏమీ లేదు" అని "ఏదో.. ఉందీ" అనేట్టు గా ఎదవేక్షన్ చేస్తూ ఎదురెళ్ళాను వాకిట్లోకి.
"ఏరా.. ఏనాడయినా నేను చెప్పకుండా నీ అంతట నువ్వు పుస్తకం తీసి పేరా అయినా చదివావా?"
నేను : మరగబెట్టిన మజ్జిగ సాసర్ లో పోసుకొనీ ఉఫ్ఫూ..ఉఫ్ఫూమని ఊదుకుంటా తాగేవాడిలాగా ఫేస్ పెట్టీ ఐమూల గా షెడ్ లో కట్టేసిన మా టైసన్ గాడిని (మా కుక్క పిల్ల) చూస్తూ
{మనసులో.. పరీక్షలయిపోయి రిజల్ట్స్ వచ్చేశాక కూడా ఏం చదవాలి నా బొందా?}
మా నాన్నః "నేనిక్కడ మాట్లాడుతుంటే ఆ నేల చూపులేంటీ? నేల చూపులు చూసేవాళ్ళనీ నమ్మకూడదంటారు."
నేను : చటుక్కున తలయెత్తి మా ఇంటి మీద పెంకులు లెక్క పెడుతూ..
మా నాన్నః "ఇలాగే ఉంటే మీ మాయల్లాగా తయారయ్యి ఎందుకూ పనికి రాకుండా పోతావ్"
నన్ను తిడుతున్నంత సేపూ, బోరు దగ్గర తిట్లు వింటూ ప్రశాంతం గా అంట్లు తోముకుంటున్న మా అమ్మ, ఎండబెట్టిన గింజలు తింటానికొచ్చిన పక్కింటి నారాయణమ్మ గారి కోడి మీదకి చేతిలో ఉన్న గరిట విసిరేసీ "మధ్య లో మా తమ్ముళ్ళేం చేశారూ?" అని కళ్ళెర్రజేసింగ్స్.
"ఆ... చాలా గొప్ప తమ్ముళ్ళు. ఇంటికొస్తే నాకేనాడయినా కాళ్ళు కడుక్కోమని చెంబుడు నీళ్ళిచ్చారా? గొంతులో పోసుకోమని గ్లాసుడు మజ్జిగిచ్చారా? అయినా మీ నాన్న పెంపకం అలాంటిదీ."
మా అమ్మః ఇంకా ఆ మాట అన్లేదేమిటా అనుకుంటున్నాను.
మా నాన్నః అనకుండా ఎలా ఉంటానూ? ఆ టార్చరెలా మరిచిపోతానూ? అయినా.. అల్లుళ్లని కూడా చూడకుండా, అన్నం కూడా తిన్నీయకుండా అర్ధరాత్రి దాకా "నేనెందుకు గ్రేటూ? మా ఫ్యామిలీ ఎంత నీటూ? మావల్లే మారింది నీ ఫేటూ" అని పిప్పరమెంట్ బిళ్లలు చప్పరించినట్టూ అల్లుళ్ళ మెదళ్ళు చప్పరించెయ్యడానికి మనసెలా ఒప్పుతాదీ మీ నాన్న కీ? మీ సోది అందరూ వినాలిగానీ, పక్కోళ్ల ప్రోబ్లెమ్ గురించి పట్టించుకోరుగా మీ ఫ్యామిలీ మొత్తం?
మా అమ్మః కోపం లో తోమేసిన అంట్లు మళ్ళీ తోమేస్తూ..
మా నాన్నః ఒరేయ్.. రేప్పొద్దున్న వైజాగెళుతున్నాం. నువ్ స్కూల్ ఫస్టొచ్చినందుకూ గిఫ్ట్ గా నీకు వాచ్ కొంటున్నాను.
మా అమ్మః ఎందుకిప్పుడూ? అనవసరంగా? ఆల్రెడీ మా చిన్న చెల్లెలిచ్చిన వాచ్ ఉందాడికి. నా వాచ్ వాడి లక్కీ వాచ్ కూడాను. అదీ గాక వాడి పరీక్షలన్నిటికీ అదే పెట్టుకెళ్ళేడు.
నేను: ఏదీ? పిన్ని వాడిచ్చేసిన ఆ వంద రూపాయల వాచ్చా? నాకొద్దది. హ్మ్మ్..... అయినా నీ వాచ్ ఎగ్జామ్స్ కి మాత్రమే. నాకు కొత్త వాచ్ కావాలి.
నాన్న వెళ్ళిపోయాకా.. కుక్కర్ లో పడేసిన కందిపప్పులాగా కుత కుతా ఉడికిపోతున్న నన్ను చెవట్టుకొని దగ్గరకి లాగీ.. " దురదేసినప్పుడు గోక్కోవాలి, సరదా వేసినప్పుడు తీర్చుకోవాలి. మీ నాన్న వాచ్ కొనివ్వాలని సరదా పడుతున్నారుగా. నీకు నచ్చినది కొనిపించుకో. నేనలా అన్నాను కాబట్టీ..మీ నాన్న కచ్చితంగా కాస్ట్లీ వాచ్ కొంటారు"
అని మాస్టర్ ప్లాన్ ని రివీల్ చేసిందీ మా మాతృదేవత. (ఎంతయినా అమ్మ అమ్మే కదా..!) అరెరే... పెరుగువడ లాంటి మృదువయిన మా అమ్మ మనసుని చెరుకుగడ లాగా కరుకు అనుకున్నానే అని రియలైజ్ అయ్యాను. ****************************** ****************************** *****************
మర్నాడు మా బజాజ్ బాక్సర్ బండి మీద మా ఇసాపట్నం బయలెల్లాం. టైటన్ షో రూం లో లైటేసి చూపిస్తున్న ప్రతీ మోడల్ నచ్చేస్తుందీ నాకు. నా టేస్టు గానీ, అక్కడున్న ఏ ఒక్క మోడల్ కాస్ట్ గానీ నచ్చట్లేదు నాన్నారికి. చతురస్రాకారం లో పేద్ద డయల్ ఉన్న ఒక చెయిన్ మోడల్ సెలెక్ట్ చేసీ తన చేతికి పెట్టుకొని చూసుకునీ "ఇది బావుంది కదా" అన్నారు. మా నాన్నగారు కూడా వాచ్ తీసుకుంటున్నారేమో అనుకొని "ఆ... బానే ఉంది నాన్నా" అన్నాను.
"అయితే ప్యాక్ చేయించెయ్యనా?"
"ఏమిటీ..? అది నాకా" అని అవాక్కయ్యి.. స్లో మోషన్ లో షడెన్ బ్రేక్ వేసినట్టూ షాక్ కి గురయ్యాను.
"ఫాస్ట్ ట్రాక్ లో తీస్కుంటాన్నాన్నా.. సూపర్ గా ఉంటాయ్, పైగా స్పెషల్ ఆఫర్ కూడానూ" అని చూపించేను. "ఇవేం వాచీలు రా? ఏమిటీ ఒక పద్దతీ పాడూ, ఆకారం ప్రాకారం లేకుండా, అడ్డదిడ్డంగా పిచ్చి పిచ్చిగా... ఛీ..ఛీ.. " అని ఛీకొట్టేశారు.
"అది కాదు నాన్నా.. అవి లేటెస్ట్ మోడల్స్. పెట్టుకుంటే సూపర్ లుక్ ఉంటాయ్. ఆ ఫినిషింగ్ చూడూ ఎలా మెరిసిపోతున్నయో?"
"ఆరిపోయే దీపానికి వెలుగూ, రాలిపోయే జుత్తుకు మెరుపూ, మానిపోయే పుండుకు సలుపూ ఎక్కువ గానే ఉంటాయ్ అలా అని అవి గొప్పవయిపోతాయా?" అనేసీ పక్కనే ఉన్న సొనాటా షోరూమ్ కి తీసుకెళ్ళీ పన్నేండొందలెట్టీ ఆయనకి నచ్చిన సో కాల్డ్ సూపర్ వాచ్ ఒకటి తీసీ నా చేతికి ఒకసారి పెట్టేసీ "సూపర్ గా ఉందిరా.. చాలా డిగ్నిఫైడ్ గా ఉందీ. పెర్ఫెక్ట్ " అనేసీ ప్యాక్ చేయించేసీ గర్వంగా ఒక లుక్కిచ్చేరు.
నేనుః "అది పెద్ద బా లే.." వినిపించీ వినిపించనట్టుగా..
మా నాన్నః ఆ...? ఎంట్రా నసుగుతున్నావ్? ఎదవ నాటు తుపాకీ లో వాడేసిన తూటా వాటం నువ్వూనూ. అవతల చాలా పనులున్నాయ్... పదా..!
"అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వటం లోని ఆనందం మీకు తెలుసు... కోరుకున్నది దక్కకపోతే కలిగే బాధ మీకు తెలీదు"... ఈ హిడెన్ డైలాగ్ నాదే. అప్పుడు నేను వాడాను. తర్వాత సినిమాలో వాడుకున్నారు.
ఇంటికొచ్చాక గెలవేసిన అరిటిచెట్టు లాగా వేలాడేసిన మొహం తో ఉన్న నన్ను చూసి "ఏరా వాచ్ కొనలేదా?" అన్నాది మాతృదేవత. "కొనక పోయినా బాగుండేదమ్మా.. నాన్న నాలిక్కి రాసుకునే టేస్ట్ లే నాకు నచ్చవ్. అలాంటిది చేతికి రాసేరు చూడు. ఎప్పుడో రాక్షస బల్లుల కాలం నాటి మోడల్ ఇది" అని వాచిన ఎడమ చెయ్యి చూపించి, ఖాళీగా ఉన్న కుడిచేత్తో మొహం దాచుకున్నాను.
"అసలు కాలేజీకెళ్ళే కుర్రాడికి కొనాల్సిన వాచ్చేనా అదీ? అన్నీ ఇలాగే తగలేస్తారు.. మూర్ఖత్వం. ఆ మాత్రం దానికి వాడిని తీసుకెళ్ళడం ఎందుకూ?" అని అమ్మ మైక్ లేకుండా సువార్త సభల్లో స్పీచిస్తున్నట్టూ హైపిచ్ లో ప్రైవేట్ చెప్పడం మొదలెట్టిందీ.
నా కడుపుమంట కూసింత చల్లారింది గానీ, నాకేం కావాలో ఎప్పుడు కావాలో అడక్కుండానే కొనిపెట్టే మా నాన్న ఆ తర్వాత ఏదీ కొనిపెట్ట లేదు. ఒక వేళ ఏమన్నా కొనమని అమ్మ అడిగినా గానీ "నేను కొన్నవి వాడికి నచ్చవ్.. వాణ్ణే కొనుక్కోమను" అనేసేవారు.
ఇంజినీరింగ్ చదూతున్నప్పుడు కాలేజ్ ఎగ్గొట్టి మరీ బొమ్మరిల్లు సినిమా రెండు సార్లు చూసేసీ, సినిమా లో బాగా ఇన్ వాల్వ్ అయిపోయాను. మా నాన్నారికి ఎలా అయినా ఆ సినిమా చూపించాలనుకున్నాను. తమ్ముడు, నేనూ "ఈ సినిమా లో ప్రకాష్రాజ్ సేం నాన్న టైపే" అని అమ్మకి గోరింటాకు నూరినట్టూ బాగా నూరిపోసెయ్యటం తో అన్నమయ్య సినిమా తర్వాత సినిమానే చూడని మా వాళ్ళిద్దరూ బొమ్మరిల్లు సినిమా చూశారు. సినిమా చూస్తున్నంత సేపూ నేనూ, మా తమ్ముడూ మా ఫాదర్ వైపూ, ప్రకాష్ రాజ్ వైపూ మార్చి మార్చి చూసేం. ;) ;)
అయిపోయాక "సినిమా బావుంది కదా నాన్నా" అన్నాను అక్కడికేదో ఆయనకి జ్ఞాన జ్యోతి వెలిగించేనన్న ఫీలింగ్ తో.
ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చి "నాకు నచ్చలేదు" అన్నారు.
"న..చ్చ.. లే దా? ఏం నచ్చ లేదూ? "
"ఆ సినిమా లో హీరోకున్న కష్టాలేమిట్రా? వాడి బాధ లో అర్ధమే లేదు.. పీకలదాకా తిండి పెట్టీ, ఏ లోటూ రాకుండా కంటికి రెప్ప లాగా చూసుకుంటుంటే ఏం తెగులు వాడికి? వాడి సంగతి వదిలెయ్యి. వాణ్ణి సపోర్ట్ చేస్తున్న నీకు చెప్తున్నాను. విను
మీ స్కూల్ లో......హాస్టల్ కి సెలవులిస్తే ఇంటికెళితే మూడు పూట్లా తిండి ఉండదని బాధ పడే నీ క్లాస్మేట్స్ గురించి తెలుసా నీకూ? ఒక టీచర్ గా నాకు తెలుసు
పిల్లల్ని పనిలోకి పంపితే గానీ పూట గడవని ఫ్యామిలీస్ గురిమ్చి తెలుసా నీకూ?
చదువవసరం లేదనీ, చదివిస్తే తన మాట వినరనీ, నన్ను మాత్రమే చదివించీ, నా తర్వాత పుట్టిన మీ చిన్నాన్నని పొలానికి పంపించిన మీ తాతయ్య మూర్ఖత్వం గురించి తెలీదు నీకు.
కొడుకేం చదువుతున్నాడో, అసలేం చదువుతున్నాడో కూడా పట్టించుకోని మా నాన్న నిర్లక్ష్యం గురించీ, గవర్నమెంట్ హాస్టల్ లో చదివే పిల్లల బాధల గురించీ, అలాంటి హాస్టల్స్ నేను తిన్న తిండి గురించీ ఏమీ తెలీదు. అసలు లోటు అనే మాటే తెలీదు మీకు. నేను పడ్డ కష్టాలేవీ నా పిల్లలు పడకూడదనీ,
కనీసం తెలియకూడదనీ నా తాపత్రయం. మా నాన్న నన్ను చదివించటం మీ అదృష్టం. మీకేం రా? లోకం లోని చాలా మంది కన్నా నీ జీవితం ఎన్నో రెట్లు మేలు. చక్కగా అన్నీ అమర్చిపెట్టీ, చదువుకోమని పంపిస్తే... ఏం రోగం మీకూ? ఇప్పటి వరకూ ఇన్ని చేసిన మాకు మా పిల్లల గురించి ఆలోచించే బాధ్యత ఉండదా?, నిర్ణయం తీసుకునే హక్కుండదా? "
ఆ రోజు అడిగిన ఆ ప్రశ్నలని ఎదురు చెప్పే సమాధానం లేదు ఊకొట్టి, తలాడించటం తప్ప.
ఎదిరించే ధైర్యం లేదు అప్పటీకీ, ఇప్పటికీ.
వారిని బాధ పెట్టే ఆలోచన రాదు ఎప్పటికీ.
హ్మ్మ్... నిజమే.. నా జీవితం పూలబాటే. నాకే కష్టాలూ లేవు. నాకున్న కష్టాలు అసలు కష్టాలే కావు. నాకోసం పరితపించే మా అమ్మా, నాన్నా ఉండగా నాకు కష్టాలే రావు.
[ఇటీవల ఇల్లు మారుతున్నప్పుడూ, అన్నీ సర్దుతూ ఉంటే సూట్ కేస్ లో మా నాన్న కొనిచ్చిన వాచ్ కనిపించీ ఈ జ్ఞాపకాల్ని తట్టి లేపిందీ]
56 comments:
wonder andee....
I am speechless.....
Wonderful andee....
I am speechless.........
హహహ చాలా బాగుందండీ మంచి ముగింపు. మనకి నచ్చినది చేయకపోతేనే కష్టాలోచ్చాయి అనుకుంటాం మనం. కానీ ఎంతో మందికన్నా ఉన్నతంగా ఆనందంగా బ్రతుకుతున్నామన్న విషయాన్ని గమనించం. అద్భుతం అండి మాటలు లేవు!
చాలా బాగా రాసారు ఎప్పటిలాగే.
కాకపోతే పంటికింద రాయిల్లాగా కొన్ని అచ్చుతప్పులు ఉన్నాయి..కుదిరినప్పుడు సరిచెయ్యండి!
superb..andi..
okkate maata.
mee naannagarki naa pranaamam..
vasantham.
ఔను చాలా బాగా వ్రాసారు.
మీ నాన్నగారు చెప్పినది అక్షరాల నిజం.
రాజ్.. సరదాగా మొదలు పెట్టి చివరికి కంట తడి పెట్టించావ్.
ఎప్పటిలాగానే పంచులు అదిరిపోయాయి. కాపీ చేద్దామంటే చాలా పేద్ద కామెంటు అయిపోద్దని ఊరుకుంటున్నా. నేల చూపులు చూసేవాళ్లని నమ్మొద్దు అంటే పెంకులకేసి చూసిన నీ తెలివితేతలకి నా జోహార్లు ;)
కామెడీయే కాదు, దేన్నైనా నీ రాతలలో చదువరులని నిమగ్నమయిపోయేలా చెయ్యగలవని మరోసారి ఋజువు చేశావు. ముగింపు అద్భుతం అంతే. మాటల్లేవ్..
>సాసర్లొ మజ్జిగ ఊఫ్..ఆని తాగె మొహం...ఏక్కడ
చూదలెదె...ఆ మొహం..మళ్ళా హిడన్ డవిలాగులు..
...ఇంకా..మీ పుత్రులతొ వచ్చిన బాధ ఇదె నాయనా..
ఉదయం నివాస్ అమ్మమ్మ గారి ఊరికి పొతూ
యెదొ ఐ పాడ్ కొంటానని రెక్వెస్ట్ చెసి పొయాడు..
ఈ ముక్క ఈయన చెవులొ వెయాలి..యెలాగా అని
అలొచిస్తున్నా...హు...అందరి అమ్మల కస్టాలు
ఇంతెనా...కదనం...superrrrrr...raj
Wonderful!
"ఆరిపోయే దీపానికి వెలుగూ, రాలిపోయే జుత్తుకు మెరుపూ, మానిపోయే పుండుకు సలుపూ ఎక్కువ గానే ఉంటాయ్"
"ఎదవ నాటు తుపాకీ లో వాడేసిన తూటా వాటం నువ్వూనూ. "....హహహహ :)
Wonderful
Wonderful
<<
ఎప్పుడో రాక్షస బల్లుల కాలం నాటి మోడల్ ఇది" అని వాచిన ఎడమ చెయ్యి చూపించి, ఖాళీగా ఉన్న కుడిచేత్తో మొహం దాచుకున్నాను.
>>
నైస్ పోస్ట్ రాజ్..
సో నీకు ఒక టికెట్‌కి రెండు సినెమాలన్నమాట..
(మీ నాన్నగారికి నువ్వు బొమ్మరిల్లు చూపిస్తే, నీకు మీ నాన్నగారు జల్సా చూపించారు.. :))
coming to reality,
తరం మారుతున్న కొద్దీ కష్టాలు తగ్గి, సుఖాలకు బానిసవ్వడం మామూలే..ఒక విధంగ అవికూడ కష్టాలే..:)
మీ నాన్న గారు చెప్పింది నిజం. U are Lucky... :-)
నిజం చెప్పారు...
నాన్న కనిపించడు,
అమ్మ కనిపిస్తుంది,
కానీ, ఇద్దరూ గొప్ప వారే.... బాగా రాశారు.
ఇంతకు మీ పిల్లల మాట ఏమిటి ?
anand.
>>>ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చి "నాకు నచ్చలేదు" అన్నారు>>
mee naannagaaru cheppindi aksharasatyam.
సినిమా గురించిన ఒపీనియన్ దగ్గరనుండి మీ నాన్నగారు చెప్పినదంతా అక్షరసత్యం.
యధాప్రకారం చాలా బాగుంది.
రాజ్..నీ పిల్లలు అంట ఆనంద్ గారు అదుగుతున్నారు...యెన్దుకొచ్చిన బాధ..ప్రొఫిల్
లొ పెళ్ళి కాలెదు అని వ్రాసుకొ
కావాల్సినంత కామెడీ ఇచ్చి అర్ధవంతంగా ముగించావ్ :D
మీ పంచ్‌లు జతచేసి ఇంతటి మంచి విషయాన్ని హాస్యంతో పంచుకున్నారు.
ఐతే బొమ్మరిల్లు నాన్నే నయమంటారు!
రాజ్ గారు.,..!!
పంచ్ లు అదిరాయి..
చాలా బాగుంది ఈ పోస్ట్ కూడా....
మీ పంచ్‌లు జతచేసి ఇంతటి మంచి విషయాన్ని హాస్యంతో పంచుకున్నారు.
ఐతే బొమ్మరిల్లు నాన్నే నయమంటారు!
Orey Rajku....simple Ga Chithagottav...Navvukunnanu Baaaga...Neekantu oka style create Chesukunnav...START to END .. Simply Super!!
Good!
baaga raasaru!
Good one Raj! :))))
మా తమ్ముడు మా డాడీని బొమ్మరిల్లు సినిమాకి తీస్కెళ్ళాడంట. గుర్తొచ్చినప్పుడల్లా ఇద్దరూ పోట్లాడుకుంటారు.. నేనలా చేస్తానా అంటే నేనలా చేస్తానా అని.. :D
సినిమా హాల్లో అన్నమయ్య తర్వాత ఇదే సినిమా మా వాళ్ళు చూసింది కూడా! ;)
ఆరిపోయే దీపానికి వెలుగూ, రాలిపోయే జుత్తుకు మెరుపూ, మానిపోయే పుండుకు సలుపూ ఎక్కువ గానే ఉంటాయ్ >>
నాన్న నాలిక్కి రాసుకునే టేస్ట్ లే నాకు నచ్చవ్. అలాంటిది చేతికి రాసేరు చూడు. ఎప్పుడో రాక్షస బల్లుల కాలం నాటి మోడల్ ఇది"
ఇలాంటివి పంచులు మీకెలా తడతాయి రాజ్ గారు...
టపా బాగుంది...నవ్విస్తూ చివరకి వచ్చేసరికి...
హ్మ్మ్మ్...ఇక్కడ మీ నాన్నగారు అన్నారు..
నాకు మా అమ్మ నాన్న ఇద్దరూ కలిపి కొట్టారు...
నిజమే ఏం చెప్తాము...తలాడించి అక్కడనుంచి వచ్చేయ్యడం తప్ప....
చాలా చాలా బావుంది. మీ నాన్నారికీ జోహార్లు.
"ఆ సినిమా లో హీరోకున్న కష్టాలేమిట్రా? వాడి బాధ లో అర్ధమే లేదు.. పీకలదాకా తిండి పెట్టీ, ఏ లోటూ రాకుండా కంటికి రెప్ప లాగా చూసుకుంటుంటే ఏం తెగులు వాడికి? వాడి సంగతి వదిలెయ్యి. వాణ్ణి సపోర్ట్ చేస్తున్న నీకు చెప్తున్నాను. విను
మీ స్కూల్ లో......హాస్టల్ కి సెలవులిస్తే ఇంటికెళితే మూడు పూట్లా తిండి ఉండదని బాధ పడే నీ క్లాస్మేట్స్ గురించి తెలుసా నీకూ? ఒక టీచర్ గా నాకు తెలుసు
పిల్లల్ని పనిలోకి పంపితే గానీ పూట గడవని ఫ్యామిలీస్ గురిమ్చి తెలుసా నీకూ?
చదువవసరం లేదనీ, చదివిస్తే తన మాట వినరనీ, నన్ను మాత్రమే చదివించీ, నా తర్వాత పుట్టిన మీ చిన్నాన్నని పొలానికి పంపించిన మీ తాతయ్య మూర్ఖత్వం గురించి తెలీదు నీకు.
కొడుకేం చదువుతున్నాడో, అసలేం చదువుతున్నాడో కూడా పట్టించుకోని మా నాన్న నిర్లక్ష్యం గురించీ, గవర్నమెంట్ హాస్టల్ లో చదివే పిల్లల బాధల గురించీ, అలాంటి హాస్టల్స్ నేను తిన్న తిండి గురించీ ఏమీ తెలీదు. అసలు లోటు అనే మాటే తెలీదు మీకు. నేను పడ్డ కష్టాలేవీ నా పిల్లలు పడకూడదనీ,
కనీసం తెలియకూడదనీ నా తాపత్రయం. మా నాన్న నన్ను చదివించటం మీ అదృష్టం. మీకేం రా? లోకం లోని చాలా మంది కన్నా నీ జీవితం ఎన్నో రెట్లు మేలు. చక్కగా అన్నీ అమర్చిపెట్టీ, చదువుకోమని పంపిస్తే... ఏం రోగం మీకూ? ఇప్పటి వరకూ ఇన్ని చేసిన మాకు మా పిల్లల గురించి ఆలోచించే బాధ్యత ఉండదా?, నిర్ణయం తీసుకునే హక్కుండదా? "
బొమ్మరిల్లు సినిమా చూసాక నాకు కూడా ఇవే సందేహాలు వచ్చాయి
మీ నాన్నగారు అన్నది నిజం.
నా నమస్కారాలు తెలియచేయండి.
మీ నాన్న గారు గొప్ప గా చెప్పారు ...
ఏదైనా మీ గోదావరి జిల్లా ల టాలెంట్ ఏ టాలెంట్ అయ్యా :)
సరదాగా నవ్విస్తూనే ఆలోచింప చేసారు. మీ నాన్నగారు చెప్పినవి అక్షరాలా నిజం..
"లోకం లోని చాలా మంది కన్నా నీ జీవితం ఎన్నో రెట్లు మేలు. చక్కగా అన్నీ అమర్చిపెట్టీ, చదువుకోమని పంపిస్తే... ఏం రోగం మీకూ? ఇప్పటి వరకూ ఇన్ని చేసిన మాకు మా పిల్లల గురించి ఆలోచించే బాధ్యత ఉండదా?, నిర్ణయం తీసుకునే హక్కుండదా? " ..
నిజమే కదా మరి. బాగా చెప్పారు.
చాలా బాగా రాసి చాలా సార్లు చదివించారు. మేము కూడా చాలా కండిషన్ ల మధ్యన పెరిగాము. తిండి తినటం దగ్గిరనుంచి బట్టలు వేసుకునే పధ్ధతి దాకా, అన్నిటికీ మా ఇష్టాలతో పనిలేకుండా పెరిగాము. ఇప్పటికీ మా అమ్మ పెట్టే రూల్సుకి ఎదురు చెప్పలేక అప్పుడప్పుడు అయినా మేమూ పెద్దవాళ్ళం ఐనామని గుర్తుచేసుకుంటూ మా పిల్లలను కేకలేస్తూ ఉంటాము. మా అమ్మ ని ఇప్పటికీ ఎదిరించము మీ ఎట్లా పెరిగామో తెలుసా అంటూ క్లాసు పీకుతుంటాను. మా వాడు పూర్తిగా వినకుండానే నువ్వు విన్నావు నేను నీలా నచ్చని పని నచ్చినట్టుగా చెయ్యలేను అనేస్తాడు. కానీ ఒక్కోసారి చిన్న చిన్న అనుభూతులు కూడా మిస్ అయ్యాము అనిపిస్తుంది. ఏమో మరి ఆనాడు అలా ఉండబట్టే ఈనాడిలా వుండగాలిగామేమో. ఇదీ మా బొమ్మరిల్లు అమ్మగారి కథ.
Maddy గారూ ధన్యవాదాలు
రసజ్ఞ గారూ చాలా థాంక్స్ అండీ
అనుపమ గారూ నాకు తెలిసినంతవరకూ ఏమీ తప్పులురాయలేదండీ.. మీకు ఎక్కడ అనిపించాయో చెప్తారా? ధన్యవాదాలండీ
వసంతంగారూ థాంక్యూ వెరీమచ్..
రాజేష్ గారూ,బులుసుగారూ థాంక్యూ అండీ
మనసుపలికే హహహ మనకి ఆ అతి తెలివితేటలే ఉన్నాయ్ మరి . థాంక్యూ
వసంతంగారూ థాంక్యూ వెరీమచ్..
రాజేష్ గారూ,బులుసుగారూ థాంక్యూ అండీ
మనసుపలికే హహహ మనకి ఆ అతి తెలివితేటలే ఉన్నాయ్ మరి . థాంక్యూ
శశిగారూ... అదేంటీ నా పిక్ చూశారుగా ;) ఏదో ఒకటీ చేసీ నివాస్ సంగతేంటో చూడండీ మరీ ;)
సౌమ్యగారూ, రమ్యగ్గారూ థాంకుల్..థాంకుల్
గిరీషూ సరిగ్గా చెప్పావ్ ;) ;) హ్మ్మ్...అవునులే సో కాల్డ్ కష్టాలు
మురళిగారూ నెనర్లు
ఆనంద్ గారూ..థాంక్యూ..
ఆలూ లేదూ..చూలూ లేదూ అనీ.. హిహిహిహి ;)
సునీత గారూ.. అవునండీ 200% నిజం
శశిగారూ..హిహిహిహి అలాగే మారుస్తాను ;) ;)
మురళీ, హర్షగారూ ధన్యవాధః
జేబీ గారూ అవునండీ ;) నెనర్లు
శ్రీధర్ గారూ థాంక్యూ
థాంక్యూరా శివా ;)
మధురగారూ అవునా..? సేం పించ్ అయితే హిహిహి థాంక్స్ అండీ
స్నిగ్ధగారూ ఓహో మీకు డబల్ కోటీంగ్ నా? ఇక పంచ్ లు అంటారా? ఏవో అలా కలిసొచ్చాయ్. నెనర్లు అండీ
సుజాతగారూ థాంక్యూ అండీ
శైలుగారూ ధన్యవాదాలండీ
శేఖర్ .థాంక్యూ థాంక్యూ.. హిహిహి మాది ఇసాపట్నం ;)
సిరిసిరిమువ్వ గారూ చాలా థాంక్స్ అండీ
తొలకరి గారూ మీదీ కూడా బొమ్మరిల్లు స్టోరీనా? ;) నాది మరీ అంత స్ట్రిక్ట్ స్టోరీ కాదు లెండీ..;) ;) ధన్యవాదాలు
ఈ పోస్ట్ ఎంత బాగుందంటే ...... నీకులా అరాచకాలు ఆక్రందనలు అని పదాలు పుట్టించలేను బాబు
థాంక్యూ వెరీమచ్ నేస్తం అక్కా. పోనీ నేను ఇంకో పదం చెప్పనాండీ? సూపర్, డూపర్,లాంటి ఇంకో పదం?
"నేస్తం" ;)
ఎప్పటి లాగే పంచులు అదుర్స్. మీ నాన్న గారి మాట విన్నాక ఏమి మాట్లాడాలో తెలియట్లేదు.
నాకు మాత్రం ప్రతి విషయంలోనూ సలహాలిచ్చినా నిర్ణయం నా ఇష్టానికే వదిలేసే తల్లి తండ్రులు రావడం నా అదృష్టం. నీ వాచ్ కథ విని నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది.
ఒక సారి మా నాన్న గారు "నా పుట్టిన రోజుకి ఏదైనా ఖరీదైన గిఫ్ట్ తీసుకోమని మీ అమ్మా, మావయ్య బలవంతపెడితే ఈ వాచ్ కొన్నాము. నేను ఎలాగో ఇంత ఖరీదైనది వాడను, నువ్వే వాడుకో, ఇది నీ కోసమే సెలెక్ట్ చేసాను." అని నాకు ఒక వాచ్ చూపిస్తే, నాకు నాన్నతో ఉన్న చనువుతో " ఇది పెద్ద వాళ్ళు వాడే మోడల్ నాన్నా. నాకు నచ్చలేదు. నువ్వే పెట్టుకో." అని చెప్పేసినా వెంటనే అర్ధం చేసుకున్నారు.
ముందు మీ మమ్మీ డాడీలకి ఒక స్వీట్ విషెస్
రాజ్ గారు పోస్ట్ చాలా బాగుంది ఇన్నాళ్ళు మీ పోస్ట్ కామెడీ పోస్ట్ లు చూసాను కాని ఈ పోస్ట్ లో కామెడీ కంటే సెంటిమెంట్ నచ్చింది .
నా జీవితం పూలబాటే. నాకే కష్టాలూ లేవు. నాకున్న కష్టాలు అసలు కష్టాలే కావు. నాకోసం పరితపించే మా అమ్మా, నాన్నా ఉండగా నాకు కష్టాలే రావు.>>>>>>>>>>.
మరి మీ అమ్మ నాన్న గారు కూడా మా అబ్బాయి ఉండగా మాకు కష్టాలే రావు అనుకునేలా ఎప్పుడూ మసులుకోండి
నాకు మాత్రం ప్రతి విషయంలోనూ సలహాలిచ్చినా నిర్ణయం నా ఇష్టానికే వదిలేసే తల్లి తండ్రులు రావడం నా అదృష్టం>>>>
ఎగ్జాట్లీ.. బింగో...సాయీ ఆ వాచ్ ఇన్సిడెంట్ తర్వాత నా ఇష్టం లేకుండా ఎప్పుడూ ఏం చెయ్యలేదు సాయీ. ప్రతీదీ నా(మా) ఇష్టమే మా ఇంట్లో. సలహాలు మాత్రం ఉంటాయి.
హ్మ్మ్... మొత్తానికీ నీకూ ఒక వాచ్ ఇన్సిడెంట్ ఉందన్నమాట ;)
హ్మ్మ్..తప్పకుండా శివరంజని గారూ నా మీద ఆ నమ్మకం వాళ్ళకెప్పుడూనూ.
ఇకపోతే ఏదో సెంటిమెంట్ రాద్దాం అనేం అనుకోలేదండీ. కామెడీ పోస్ట్ గానే మొదలెట్టాను. బట్ పోస్ట్ రాస్తున్నప్పుడూ గతమంతా గుర్తొచ్చీ,నన్ను నేను ఆత్మ విమర్శ చేసుకొనీ నాకు తెలీకుండా అలా రాసేశాను ;)
థాంక్యూ వెరీమచ్ అండీ.
ఎడమ చెయ్యి చూపించి, ఖాళీగా ఉన్న కుడిచేత్తో
"ఆరిపోయే దీపానికి వెలుగూ, రాలిపోయే జుత్తుకు మెరుపూ, మానిపోయే పుండుకు సలుపూ ఎక్కువ గానే ఉంటాయ్
>>>>>>>>>ఆ సినిమా లో హీరోకున్న కష్టాలేమిట్రా?
kevvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv :ద
మీ బ్లాగ్ కూడా ఆఫీసు లో చదవకూడద ????..కష్టం..
కేకో కేక :D
మీ వాచీ బాగుంది..ఓ తాడు కట్టేసి మీ id కార్డు కి తగిలించండి...బాగుంటాది..:)
థాంక్యూ కిరణ్ గారూ ;)
ఓ తాడు కట్టేసి మీ id కార్డు కి తగిలించండి...బాగుంటాది>>
వావ్ గ్రేట్ అవిడియా మీకిలాంటి అవిడియాలు ఎలా వస్తయండీ?
గాంధీ గారిలాగా నడానికి తగిలించుకుంటే ఇంకా సూపరేమొ?
చాలా బాగున్నాయి మీ వాచీ ఙ్నాపకాలు. ఒక చిన్న చెక్క ముక్కలో ఆ వాచీని తాపడం చేసి "L" షేపులో ఒక పర్సనల్ డెస్క్ వాచీగా చెయ్యండి.
ధన్యవాదాలు చాతకం గారూ.. అలాగే. మంచి ఐడియా..ప్రయత్నిస్తాను
చాలా మంచి టపా.
కామెడీనీ పండించటం మీకు నల్లేరు మీద నడకలా ఉంది.నవ్వించటమే కాకుండా పాటూ ఆలోచింపజేశారు
Superb!!!!
బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్,Swanvesh గారూ ధన్యవాదాలండీ
ఎవరండి మీరు? నా ఫ్రెండ్ Venumadhav,Bglr నుండి తీస్కున్నా ఈ Blog link! కేక సార్!
చాలా బాగున్నాయ్ మీ మాటలు! అసలు ఆ dialogues లో ప్రాస,comparision, త్రివిక్రం సినిమా చూసినట్టుంది నాకు.
ఓక్కటి చదివి వెంటనే Join అయిపొయను member గా..
కెవ్వు కేక !!
Satya M Prakash: @FB
ఎవరండి మీరు? నా ఫ్రెండ్ Venumadhav,Bglr నుండి తీస్కున్నా ఈ Blog link! కేక సార్!
చాలా బాగున్నాయ్ మీ మాటలు! అసలు ఆ dialogues లో ప్రాస,comparision, త్రివిక్రం సినిమా చూసినట్టుంది నాకు.
ఓక్కటి చదివి వెంటనే Join అయిపొయను member గా..
కెవ్వు కేక !!
Satya
నేను చేసిన తప్పు, ఆఫీస్ లో వున్నప్పుడు ఈ బ్లాగ్ పోస్ట్ చదవటం. నాకు నవ్వు, ఏడుపు ఒకసారె వచ్చాయి. అంత బాగుంది. "అమ్మ మైక్ లేకుండా సువార్త సభల్లో స్పీచిస్తున్నట్టూ హైపిచ్ లో ప్రైవేట్ చెప్పడం మొదలెట్టిందీ." ఇది సూపర్, డాడీ డైలాగ్స్ కేక..
కేకే గారూ ధన్యవాదాలండీ!
Nachiketha గారూ.. చాలా చాలా థాంక్స్ అండీ(కొంచేం ఆలస్యంగా)
Good one!!
Post a Comment