Monday, November 7, 2011

కృష్ణవంశీ.. ది మొగుడు.

నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరూ? అంటే రెండో మాట లేకుండా కృష్ణవంశీ అని చెప్పుకునేవాడిని. సింధూరం సినిమా తో మొదలయ్యిన ఇష్టం, ఖడ్గం సినిమా తో పిచ్చి గా మారిపోయిందీ.
 ఒకప్పుడు రెండున్నర గంటల సినిమాలో  రెండు గంటల సినిమా నచ్చేసేది.  అతని టేకింగ్ అంతా అద్భుతం గా అనిపించేది. తర్వాత తర్వాత కొన్ని కొన్ని సీన్లు అద్భుతంగానూ చాలా సీన్ లు అతి దరిద్రం గానూ అనిపించడం మొదలయ్యిందీ. అయినా గానీ కృష్ణవంశీ సినిమా అంటే కలిగే ఆసక్తి, ఇష్టం తగ్గలేదు.  బాగుండే ఆ ఇరవై నిమిషాల సినిమా కోసం భరించడానికి బరితెగించేవాడిని. కానీ కృష్ణవంశీ కి తనకున్న క్రియేటివిటీ కన్నా "నేను క్రియేటివ్ డైరెక్టర్నీ" అన్న ఫీలింగ్ ఎక్కువయ్యిపోయిందీ. గత కొన్ని సంవత్సరాలుగా కేవీ సార్ తీసిన మహత్తర కళాఖండాలు మిస్సవ్వకుండా చూస్తున్న కారణం గా నా అసహనం ఈ రోజు ఆగ్రహం గా మారిపోయిందీ.

హిట్టు కోసం మొహం వాచిన గోపీచందూ, అదే హిట్టుకోసం వొళ్ళంతా వాచిన సో కాల్డ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, హింటిస్తే టాలెంట్ చూపించి చెలరేగిపోడానికి తహతహలాడిపోయే తాప్సీల కాంబినేషన్ లో చూసిన జనాలని చావగొట్టడానికి దాపురించిన చిత్రరాజం "మొగుడు".

అహో.. ఈ సినిమా గురించి ఏం చెప్పాలీ? ఆడియో లో "మొగుడు మొగుడూ" అని పాట వినగానే ఆల్బం మొత్తం డిలీట్ చేసెయ్యాలనిపించిందీ. ట్రెయిలర్ చూశాక సినిమా శివకాశీకెళ్ళబోతూందని అర్ధం అయిపోయిందీ. మరెందుకు చూశావూ? అంటే నా కర్మ అలా తగలడింది కాబట్టి.

హీరో : నాకు గోపీచంద్ అంటే ప్రత్యేకమయిన అభిమానం. ఇప్పటి వరకూ తన కెరియర్ లో చెత్త సినిమాలు రెండో మూడో ఉంటాయ్. ఇది మాత్రం అత్యంత చెత్త సినిమా. ఈ సినిమాలో గోపీచంద్ ఈటీవీ సుమన్ బాబు సినిమాల్లో హీరో అంత మంచోడు.
కత్తి పట్టి కళ్ళు పెద్దవి చేసి "రండ్రా.. నా క్కొడకల్లారా" అని అరిచే గోపీచంద్ చేత మొహమాటపు నవ్వు మొహాన వేయించీ,  కంకఱోడ్డు మీద చెప్పుల్లేని కాలినడక లాగా ఉన్న కెరియర్ ని కకావికలం చేశాడు కేవీ.

హీరోయిన్స్ః గ్యాస్ సిలిండర్ కి సున్నమేసీ చీరకట్టినట్టూ ఉండే తాప్సీ ఇందులో "నటన" అనేదేదో వెలగబెట్టిందని టాక్. సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పింది. అది ఎలా ఉందీ? అని మాత్రం అడగొద్దు. యాక్షన్,  తెలుగూ రెండూ రాని హీరోయిన్ చేత ఓవరాక్షన్ చేయించీ, తెలుగులో డబ్బింగ్ చెప్పిస్తే ఎలా ఉంటాదో  మీ ఊహలకే వదిలేస్తున్నా.
 సినిమా అంతా క్లోజప్ షాట్ లలో నవ్వుతూ, అరుస్తూ, ఏడుస్తూ ఉంటాది.
ఇంకో హీరోయిన్ శ్రద్ధాదాస్. ఈవిడకి ఓ వంద రూపాయల్ ఎక్శ్ట్రా ఇప్పించుంటాడు కేవీ.  మొత్తం కాస్ట్యూమ్స్ అన్నీటికీ పావు మీటర్ గుడ్డముక్క మించి అయ్యుండదు. శ్రధ్దాదాస్ అంటే గుర్తొచ్చిందీ నాకెందుకో వీళ్ళిద్దరూ అన్నాదమ్ములు అనిపిస్తుందీ.


స్టోరీ :  కేవీ సార్ యొక్క దరిద్రం, వాడి వల్లకాడూనూ.
రాజేంద్రప్రసాద్ది ఉమ్మడి కుటుంబం అన్నమాట. ఒక కొడుకు , ముగ్గురు కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళతో కళకళలాడి పోతా ఉంటాది అందరి మూకుమ్మడి ఓవరాక్షన్ తో. స్క్రీన్ మొత్తం జనాలు హడావిడిగా పరిగెడుతూ ఉంటారు. ఆ కొడుకే గోపీచంద్. ఎంపీ అయిన రౌడీ స్టార్ రోజా, సెంటిమెంట్ స్టార్ నరేష్ ల కూతురు తాప్సీ.  రొటీన్ లవ్ స్టోరీ సక్సెస్ అయ్యి పెళ్ళి అవుతుంది కృష్ణవంశీ స్టైల్ లో.

అప్పగింతల టైం లో మాటా మాటా తేడా వచ్చీ రోజా, రాజేంద్రప్రసాద్ గారి చిన్నళ్ళుణ్ణి కొడుతుందీ.
"మా అల్లుణ్ణి కొడతావా?" అని వియ్యపురాలు అని కూడా చూడకుండా రోజాని కొడతాడు రా.ప్ర
"నన్నే కొడతావా?" అని రోజా చెప్పుతీస్కొని రా.ప్ర ని కొడుతుందీ.
"మా నాన్ననే కొడతావా?" అని గోపీచంద్ రోజా ని కొడతాడు.
"మా అమ్మనే కొడతావా?" అని తాప్సీ గోపీచంద్ ని కొట్టీ తాళి తెంచి మొహాన కొట్టేస్తూందీ. 
------------------------------------------INTERVEL------------------------------------------
ఈ "క్రియేటివ్" సీన్ చూసీ టికెట్ కొని సినిమా చూస్తున్న దౌర్భాగ్యులంతా ఎవరి చెప్పుతో వాళ్ళు కొట్టుకున్నారు లెండీ ఇంటర్వెల్ టైం లో.

ఇక ఇంటర్వెల్ తర్వాత ఉంటాదీ నా సామిరంగా... చెప్పటంకాదు చూసి ఆనుభవించాల్సిందే. హీరో, హీరోయిన్నూ ముందు కొట్టుకున్నాగానీ తర్వాత కలిసిపోతారు. ఎలా అంటారా? హీరో మీద ఇష్టం తో హీరోయిన్ విషం తాగేస్తాది. హీరో ఫ్లాట్. హీరోయిన్ సేఫ్. హమ్మయ్యా సినిమా అయిపోయిందిరా బాబూ అనుకునే టైమ్ లో  ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరు. రోజా ఫ్యామిలీ లో ఇద్దరు తప్ప అందరూ మంచోళ్ళే. రా.ప్ర ఫ్యామిలీ మొత్తం మంచోళ్ళే. కానీ అందరూ తింగర తింగరగా బిహేవ్ చేస్తుంటారు.
నిన్నే పెళ్ళాడతా సెకండ్ హాఫ్ ని రీమిక్స్ చేసి సెకండ్ రిలీజ్ చేసినట్టూ ఉంటాది ఇక్కణ్ణుంచి. చివరగా అరగంటకి పైగ సాఆఆఆఆగిన ఆ క్లైమాక్స్ లో డైలీ సీరియల్ లో కన్నా అద్వాన్నంగా, మితిమీరిన నాటకీయత తో, ఏక్టర్ల ఏడుపులూ పెడబొబ్బలతో, , వొళ్ళంతా టమాటా సాస్ పులుముకొనీ హీరో చెప్తున్న సెంటిమెంట్
డవిలాగులతో రక్తి కట్టగా, ప్రేక్షకుల ఆర్తనాదాలతో, చంటిపిల్లల ఏడుపులతో, నాలాంటి సినిమా పిచ్చోళ్ళ పిచ్చి పిచ్చి నవ్వులతో ధియేటర్ దద్దరిల్లిందీ. ఈ సినిమా అయ్యేట్టు కనిపించటం లేదనీ కొంతమందీ వాపోయి విరక్తి తో వెళ్ళిపోయేరు.

పాటలు-సాహిత్యం: సిరివెన్నెల గారు రాసినట్టూ చెప్పబడుతున్న ఒక పాట కొంచెం బాగుమ్దీ. పెళ్ళిపాటలు తియ్యటం లో కే.వీ టాలెంట్ గురించి చెప్పక్కర్లేదు. దీపాలూ, పువ్వులూ, పట్టుబట్టలూ పెట్టి రచ్చ చేశాడు. మిగిలిన పాటలన్నిటిలోనూ హీరోయిన్ ఒంటిమీద చీర ఉండదూ, హీరో ఒంటిమీద చొక్కా ఉండదూ.
శ్రద్ధాదాస్ ఒంటిమీద దాదాపు ఏమీ ఉండదూ.సుద్దాల అశోక్ తేజ గారు రాసిన మొగుడు టైటిల్ సాంగ్ ఒక ఫిలాంత్రపకిడీ.

మాటలుః  ఒకటో రెండో తప్పా మిగిలినవన్నీ పక్కా బూతు డవిలాగులే.
అవి ఇక్కడ రాస్తే టైప్ చేసిన నా చేతులు డెట్టాల్ తో కడుక్కొనీ, కీబోర్డ్ మీద పసుపు నీళ్ళు చల్లుకోవాలి. అవి చదివిన మీరు కళ్ళళ్ళో ఐ డ్రాప్స్ వేసుకొనీ నోట్లో తులసాకులు వేస్కొని నమలాలి. అప్పటికి గానీ చుట్టుకున్న పాపం చట్టబండలు కాదు.

సంస్కృతీ, సాంప్రదాయం, కుటుంబ విలువులూ అనీ పబ్లిసిటీ ఇచ్చీ, వినిపించే మాటల్లోనూ, చూపించే పాటల్లోనూ బూతు రంగరించిన ఒక చెత్త సినిమాని జనాలమీదకి వదిలిన
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నేటి యంగ్ డైరెక్టర్లందరికీ మార్గదర్శకుడు అనటం లో సందేహం లేదు. ఈ సినిమా కి Harley Davidson వాడు ఎంత పెట్టుబడి పెట్టాడో తెలీదు గానీ సినిమా మొదటీ నుండీ క్లైమాక్స్ దాకా వీలయిన ప్రతీఫ్రేం లోనూ బైక్/జర్కిన్ కనిపిస్తానే ఉంటాది. ఒక బైక్ కి రెండున్నర గంటలు టార్చర్ పెట్టే యాడ్ ఉండటం  గ్రేట్ కదా..!

ఫైనల్ గా సినిమా ఎలా ఉందీ?? : వొళ్ళంతా దురదగుండాకు పూసుకొనీ, నోట్లో జాలిన్ లోషన్ పోసుకున్నట్టూ చాలా సమ్మగా ఉందీ.

గౌరవనీయులయిన  కృష్ణవంశీ గారికీ,

నేను ఇక్కడ క్షేమంగా లేను. మీకు ఆల్రెడీ సగం పిచ్చనీ, మీ గురువు గారికి పూర్తి పిచ్చనీ తెలుసు. కానీ మీ పిచ్చి పీక్ కి వెళ్ళిందనీ నిన్ననే తెలిసిందీ. బాబ్బాబూ.. మీరు ఇంక సినిమాలు తియ్యటం మానేసీ మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాం లో టెలీకాస్ట్ చేసుకోడానికి పాటలు తీసుకోవటమో, సినిమా యాక్ట్రర్ల చేత జెమినీ టీవీలో సెంటిమెంట్ సీరియళ్ళు తియ్యటమో చేస్తే  బాగుంటుందని నా అభిప్రాయం. సీరియళ్ళయితే ఎంతకావలిస్తే అంతసేపు సాఆఆఆఆఅగదీయొచ్చు.సెన్సార్ కట్ ల ప్రోబ్లెం ఉండదు కాబట్తీ మీకు నచ్చిన బూతు డవిలాగులు విరివిగా వాడుకోవచ్చు.

ఈటీవీ లో సుమన్ బాబు నెలకోసారి రిలీజ్ చేసే కొత్త కొత్త సినిమాలు చూసి బతికి బట్టకట్టొచ్చుగానీ, మీ సినిమాలు భరించడం మా వల్ల కాదు. తొందర్లోనే మీరు వైవీయెస్ చౌదరీ, పోసాని కృష్ణమురళీ ల సరసన నిలబడీ తెలుగు సినిమాని సర్వనాశనం చెయ్యగలరని ఆశిస్తూ..

ఇంతే సంగతులు
చిత్తగించవలెను.
ఇట్లు
ఒకప్పటి అభిమాని మరియు ఇప్పటి బాధితుడు.  

83 comments:

Tejaswi said...

As usual, అదిరిపోయింది మీ రివ్యూ.

kiran said...

>> ఈ "క్రియేటివ్" సీన్ చూసీ టికెట్ కొని సినిమా చూస్తున్న దౌర్భాగ్యులంతా ఎవరి చెప్పుతో వాళ్ళు కొట్టుకున్నారు లెండీ ఇంటర్వెల్ టైం లో.
lol

>> అవి ఇక్కడ రాస్తే టైప్ చేసిన నా చేతులు డెట్టాల్ తో కడుక్కొనీ, కీబోర్డ్ మీద పుసుపు నీళ్ళు చల్లుకోవాలి
kevv
>>ఫైనల్ గా సినిమా ఎలా ఉందీ?? : వొళ్ళంతా దురదగుండాకు పూసుకొనీ, నోట్లో జాలిన్ లోషన్ పోసుకున్నట్టూ చాలా సమ్మగా ఉందీ.
హిహిహి...

చూసావా.....ఇలాంటి సినిమాల వల్ల...నీకు సుమన్ బాబు సినిమాలు నచేస్తున్నాయి...:ద
బా తిట్టావు అందరిని నీ స్టైల్ లో :D


--
-- కిరణ్ :)

9thhouse.org said...

రాజ్ కుమార్ గారు,

చూసేశారా? కంగ్రాట్స్. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి ఓమారు పరామర్శించాలని ఉందండీ...

Chandu S said...

మళ్ళీ అనిపిస్తుంది. మీ టాలెంట్ మీకు తెలియదేమోనని నా అనుమానం

Indian Minerva said...

తస్సాదియ్యా యెళితే ఇలాటి సినిమాకే యెళ్ళాల. ఓ నలుగుర్నేసుకొని పోయి సినిమా జూసొస్తే రచ్చరచ్చేగదా.

Thanks for the review చచ్చేట్టు నవ్వాను.

కృష్ణప్రియ said...

:)) సినిమా చూడకుండా రివ్యూ చూసి ఇంత నవ్వుకోవటం ఇదే మొదటి సారి..

sunita said...

hahaha!baagaa raaSaaru.Kiran comment copy paste antae!1

Sravya V said...

హ హ నాకెందుకో మీరు రాసే ఇలాంటి రివ్యూలకోసం మీరు చూసే సినిమాలు అన్నీ గొప్ప డిజాస్టర్లు కావాలిని అని కోరుకునే వాళ్ళ ప్రార్ధనలు తెగ ఫలిస్తున్నాయి అనిపిస్తుందండీ :)))

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీరు ఈ సినిమా ఇంకో రెండు మాట్లు చూసి ఇంకో రివ్యూ వ్రాస్తే ఇంకెంతగా నవ్వుకోవచ్చో మేము.

రివ్యూ పొ.ప.న

Venu Madhav said...

ha ha ha .....trailer chustene cinema yela untundo artham ayindi..mee varnana adurs...

జేబి - JB said...

అదిరిందండి‌. నేనూ బాదించుకున్నానండి.

పెళ్ళి పాటంటే గుర్తొచ్చింది‌ - అందులో‌ వరుడినేంటో పూర్తి‌ గులాబీ‌(పింక్‌) సల్వార్‌లో‌చూపిస్తాడు‌. తెలంగాణావాదులని‌ తృప్తిపరచడానికేమో ;-)

కొత్తావకాయ said...

ఈ సినిమా టైటిల్ చూసి కృష్ణ వంశీ అని అస్సలు అనుకోలేదు సుమీ! ఇంకా ముక్కున వేసుకున్న వేలు తియ్యలేక ఒంటి చేత్తో టైప్ చేస్తున్నా.. హాచ్చెర్యం, కృష్ణ వంశీ యా? నిజమే!! నిఝం గానా??

రివ్యూ కి మణి పూస శ్రధ్ధా దాస్ ఫోటో! మీకిలాంటి మెరుపులు ఎలా మెరుస్తాయో అని నా కొచ్చెను. :)

వేణూశ్రీకాంత్ said...

హహహహ రాజ్ పాపం నీ అవస్థ తలుచుకుంటే జాలేసింది కానీ రివ్యూ చదివి మాత్రం పొట్టచెక్కలయ్యింది. ఈ మధ్య ఈ రేంజ్ రివ్యూపడికూడా చాన్నాళైంది కదా :-) చివర్లో లెటర్ కేక అసలు...
నేను ఇక ఆ థియేటర్ పరిసరాలకి వెళ్ళే ఆలోచనని కూడా విరమించుకుంటున్నా నా ప్రాణాలకు నీ ప్రాణాలను అడ్డేసి మరీ కాపాడినందుకు థ్యాంక్స్ :-P

రసజ్ఞ said...

హహహ నవ్వలేకపోతున్నా! అసలు ఎప్పుడూ onlinelo రివ్యూ చదివే నేను ఏంటో ఈ మధ్య చదవటం మానేసాను! మీ రివ్యూ మాత్రం అదరహో అనేలా ఉంది! కళ్ళ నించి నీళ్ళు కూడా కారుతున్నాయి (నవ్వి నవ్వి) సినిమా చూస్తే బాధతో కారతాయేమో అనిపిస్తోంది!

స్నిగ్ధ said...

రాజ్ గారు,మొన్నే అనుకున్నాను ఈ సినిమా కి వెళదామని..లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యా...మంచి పని చేసానన్న మాట....
బాబోయ్ ఏం రివ్యూ అండి...చితక్కొట్టారు...:)
ఏంటో ఈ మధ్య అన్ని సినిమాలు ఇలా తగలెడుతున్నాయి...పంచ్లు అదిరాయి...

Ruth said...

Super duper likes ! n joyed each n every line ! sharing it with friends....

Anonymous said...

సారీ రాజ్బాబు . పరామర్సించాల్సిన టైం లో పడీ పడీ నవ్వాను . కొన్నాళ్ళు కోమాలొకెళ్ళిపోండి అంతా సర్దుకుంటుంది .

..nagarjuna.. said...

సాటి కృష్ణవంశీ అభిమానిగా నీ బాధ అర్ధం చేసుకోగలను రాజ్ . వీడినుండి ఓ మంచి సినిమాకోసం శ్రీ అంజనేయం నుండి ఎదురుచూస్తున్నా-కళ్ళల్లో కర్పూరం వెలింగించుకొని మరీ. రిలీజైన సినిమాలు చూసి ఒళ్ళు మండుతుందికాని సినిమా పండదు :(

తాప్సిని పెట్టి కుటుంబకథా చిత్రం తిస్తున్నాడంటేనే అనుకున్నా ఎక్కడో తేడాగా ఉందని. అంతకన్నా తేడాగ ఉందని నిన్న ఓ వెబ్సైట్ చూసాక తెలిసింది.

శేఖర్ (Sekhar) said...

రాజ్ ఎంత బాధ పడితే ఇంత భీబత్సమైన తెలుగు వాడావ్...
చాల షార్ప్ గ ఉంది.......
రచ్చ రచ్చ చేసేసావ్...

ఫోన్ లో అసలు చూడొద్దు ...చెత్త ...అంటే ఏంటో అనుకున్న...
నీకు జోహార్లు బాబు... :(

Ravitheja said...

ఈ "క్రియేటివ్" సీన్ చూసీ టికెట్ కొని సినిమా చూస్తున్న దౌర్భాగ్యులంతా ఎవరి చెప్పుతో వాళ్ళు కొట్టుకున్నారు లెండీ ఇంటర్వెల్ టైం లో.

ఒకటో రెండో తప్పా మిగిలినవన్నీ పక్కా బూతు డవిలాగులే. అవి ఇక్కడ రాస్తే టైప్ చేసిన నా చేతులు డెట్టాల్ తో కడుక్కొనీ, కీబోర్డ్ మీద పసుపు నీళ్ళు చల్లుకోవాలి. అవి చదివిన మీరు కళ్ళళ్ళో ఐ డ్రాప్స్ వేసుకొనీ నోట్లో తులసాకులు వేస్కొని నమలాలి. అప్పటికి గానీ చుట్టుకున్న పాపం చట్టబండలు కాదు.

వొళ్ళంతా దురదగుండాకు పూసుకొనీ, నోట్లో జాలిన్ లోషన్ పోసుకున్నట్టూ చాలా సమ్మగా ఉందీ.
---------------------

బతికించారు సినిమాహాలు దగ్గరే కదా అని వీక్ డే ఐనా ఈరోజే వెళ్దామని అనుకున్నాను
ఒక 200 వృదా అవ్వకుండా కాపాడారు

రివ్యూ మాత్రం కేక నవ్వుకోలేక చచ్చాను

శశి కళ said...

ఈ "క్రియేటివ్" సీన్ చూసీ టికెట్ కొని సినిమా చూస్తున్న దౌర్భాగ్యులంతా ఎవరి చెప్పుతో వాళ్ళు కొట్టుకున్నారు లెండీ ఇంటర్వెల్ టైం లో.
kekaaaaaaaaaaaaa....inkemi cinimaa
choostaamu...mari yendu simhaala
paata anta daani goorchi vraayaledu...

Unknown said...

నేను చెప్పాల్సింది ఏమి లేదు. రెండు నిముషాలు మౌనం పాటిస్తున్నా మీ కోసం..

lalithag said...

ఏడిపించారు :))))) నవ్వి నవ్వి ఏడుపు రావడం అనుభవంలోకి వచ్చింది. అయ్యబాబోయ్! మన సినిమాలు, సీరియళ్ళూ బ్లాగుల ద్వారా వినోదం కల్పించడానికి మార్గాలు అనుకునే దాన్ని. ఇప్పుడు ఆ వినోదం కూడా తట్టుకోలేని స్థితికొచ్చాను. నవ్వించారు. కానీ ఉన్న దుస్థితిని కళ్ళకు కట్టినట్టు చెప్పి బాధ పెట్టారు.

రాజ్ కుమార్ said...

తేజస్వి గారూ థాంక్యూ అండీ
కిరణూ.. ఎంతయినా సుమన్ బాబుకి ఫ్యాన్స్ కదా ;) ;) హిహిహి థాంకుల్

నాగమురళి గారూ.. కర్మ కాలి చూసేశానండీ. మీరు నన్నూ, నన్ను మీరూ ఓదార్చుకుందాం. ఓదార్పు యాత్ర షురూ చేయండీ

రాజ్ కుమార్ said...

చందూ గారూ.. ఏమో నాలో మీరేం చూశారో.. నాకర్ధం కావట్లేదు తిట్టారో పొగిడారో. ;) ;) ఈ సారి కొంచెం వివరంగా చెప్పండీ. థాంక్యూ

ఇండియన్ మినర్వా గారూ.. యెస్సో ఇలాంటి సినిమాలు ఎంజాయ్ చెయ్యటం అదో రకమయిన ఎంజాయ్మెంటూ... క్షేమంగా వెళ్ళి రండీ.


కృష్నప్రియగారూ సినిమా చూస్తే నవ్వరు లెండీ.ః) ధన్యవాదాలు

రాజ్ కుమార్ said...

సునీతగారూ థాంక్యూ అండీ
శ్రావ్యగారూ నాకూ అదే అనిపిస్తుందీ.. దెబ్బకి సినిమాలు చూడటం కూడా తగ్గించేశాను ;)

గురువు గారూ ఇంకో రెండు సార్లా? వామ్మో... మీకెందుకు నా మీద అంత కచ్చ? ;) థాంకులు

రాజ్ కుమార్ said...

వేణూమాధవ్ గారూ ఒక్క అన్నం మెతుకు చాలు కదండీ ఉడికిందో లేదో చూడ్డానికీ.. ;) ధన్యవాదాలు.

జేబీ గారూ అయ్యుండొచ్చు.. పైగా శుభలేఖ కూడా తెలంగాణా యాస లో చదివించాడూగా.
మీకు కూడా నా సానుభూతిని తెలియజేస్తున్నాను;)

రాజ్ కుమార్ said...

కొత్తావకాయ గారూ.. అవునండీ నిజ్జంగా మన కృ.వం నే. ఈ మధ్యకాలం లో అయ్యవారి సినిమాలు మీరు చూడలేదనుకుంటా.. ఇలా కొట్టిమ్చుకోటం అలవాటయిపోయింది లెండీ

వేణూజీ.. ఏమో మీకు నచ్చుతాదేమో ఒక ట్రైల్ వేసి చూడండీ.. హిహిహిహి

రసజ్ఞ గారూ థాంక్యూ.. అవునండీ రక్తకన్నీరు గ్యారెంటీ ;)

రాజ్ కుమార్ said...

స్నిగ్ధ గారూ థాంక్యూ వెరీమచ్ అండీ

రూత్ గారూ ధన్యవాదాలండీ..

లలితాగారూ.. కోమాలోంచి వచ్చాకే రివ్యూ రాశానండీ హిహిహి

"రిలీజైన సినిమాలు చూసి ఒళ్ళు మండుతుందికాని సినిమా పండదు :(
"
సరిగ్గా చెప్పావ్ నాగార్జునా. బింగో.. థాంక్యూ

రాజ్ కుమార్ said...

శేఖర్ గారూ థాంక్యూ.. ;)

రవితేజ గారూ.. ఒక సారి వెళ్ళి కొట్టించుకోవలసిందండీ..పోతే పోయినియ్యి రెండొందలూ..అంతగొప్ప కిక్ మళ్ళీ మళ్ళీ రాదండీ ;)

శశిగారూ సింహాల పాట గురించి చెప్పేదేం ఉందండీ.. హీరో/హీరోయిన్ లని చూసి పారిపోతుంటే బాధేసిందీ ;)

రాజ్ కుమార్ said...

శైలు గారూ థాంక్యూ వెరీ మచ్.

అయ్యో లలితగారూ లైట్ తీస్కొని నవ్వుకోండీ..సినిమా చూస్తే ఎలాగా ఏడవాలి ;౦ ;)

Unknown said...

Can't stop laughing

VLS MURTHY said...

మన(????)కృష్ణ వంశి

ఏంటో ఆనందంగా
మా తమ్ముడి 20 వ పెళ్లి రోజు అని మన గోదావరి,మన గోంగూర,మన వంకాయ ఇంకా సరే ఎర్రటి మన ఆవకాయ మన ఘంటసాల గారు ,మన మాయాబజార్ తో సరి తూగే మన creative
కృష్ణ వంశి!!{ పాపమూ సమించు గాక) అనిమొగుడు సినిమాకి వెళ్ళాము

కానిఎందుకు వెళ్లమో తెలెయని ఒక అర్ధం కాని పిచ్చిమానసికస్థితికి లోను అయ్యి మేము మా చెప్పు తో మమ్మల్ని కొట్టుకొని లెంపలేసుకున్నాము ఇంకా జీవితం లో కృష్ణ వంశి సినిమాకి రాకూడదని ఒక
ఘోరమైన శపధం చేసుకున్నాము


తెలుగుతనం ,సంప్రదాయం. అంటూ ఆడియో ఫంక్షన్ రోజునమొగుడు అంటే అంటూ చాల పెద్ద మాటలు చెప్పిన
మన(????)కృష్ణ వంశి! అది లేదు కదా క్యాలెండరు గిరల్స్ సంప్రదాయనికి మాత్రం చాఆఆఆఆఆఆఆఆఆఆల
న్యాయం చేకూర్చాడు.రోజా,రాజేంద్రప్రసాద్,నరేష్ వీళ్ళుకూడా మన(????)కృష్ణ వంశి తమ
తమనెలవులు తప్పారు


దేవుడా ఎందుకు ఎందుకు ఎందుకు మనతెలుగు సినిమా మంచి డైరెక్టర్ లు అందరు తమ పేరు ని,
అస్తిత్వం కోల్పోతున్నారు? మొన్న బాపుగారు,నిన్న విశ్వనాధ్ గారు ఈ రోజు కృష్ణ వంశి

అమ్మతెలుగు సినిమా తల్లి నీకు గతించిన వైభవం మళ్ళి వచ్చేనా?


ఇదినిజం గ తెలుగు చిత్రసీమ మొత్తం ఆలోచించదగ్గ విషయం

Ujwal said...

brother, inthaki "oosaravelli" ane movie gurinchi emi rayaleedu. Inthaki aa cinema kaneesam blog lo rayataaniki kuda arhata ledani nee uddeshama?

Ujwal said...

inthaki oosaravelli ane movie gurinchi enduku rayaleedu. Pls do postmortem that movie for us. or do u think that it doesn't even deserve to be reviewed? Even though u feel so, can you please write a review for oosaravelli

Mr.DePrEsSo said...

sir..nenu inthaga navvi chaala rojulu ayyindi..suman movie review chadavadaaniki ganta pattindi....awesome sir!waiting for our next review;)

Mr.DePrEsSo said...

kekaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa!!!!

Chandu S said...

Please don't publish this comment.

I din't see you email ID in your profile.

I don't know your profession. I sincerely feel you can try script writing .
Write your own story, script and you can try as director. you have shades of EVV and Jandhyaala. please don't limit yourself to casual blog writings only.

Kishore said...

Coooolio

కొత్త పాళీ said...

మిత్రుడా, నేనీసంగతి (కృవం సినిమాలు తియ్యడం మానేస్తే మంచిదన్న సంగతి) చందమామ అప్పుడే చెప్పా. ఇప్పుడు నీ బాధచూసి గుడ్లనీళ్ళు కుక్కుకోవడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నా .. నన్ను మన్నించు రాజ్ కుమార్ మన్నించు .. నా పాపానికీ నిస్సహాయతకీ నిష్కృతి లేదు .. హు హు హూఊ (భోరున ఏడుపు).
రివ్యూ మాత్రం రచ్చ కేక .. చించేశారు! ఇక్కడ కిం.నే.దొ.న.

Disp Name said...

How dare you write such degrading review for Krishna vamsee movie? What a great movie that is and you write such incorrect review? - జేకే- Thank god I did not see the movie- ఇంతకీ ఈ కృష్ణ వంశీ ఎవరండీ బాబు ? అంత గొప్ప డైరెక్ట రా ? ఏమిటో జిలేబి కి సినిమా సంగతులు మాయా బజార్ తో నే అంతరించి పోయినట్టు ఉంది. ఎవడో గాని ఇంత బ్రహ్మాండమైన మోవీ తీసాడు - అక్కడ నాగ మురళీ గారు కూడా ఈ చిత్రం గురించి గొప్పగా రివ్యూ రాసారు మరి ? )

ఇందు said...

రాజ్ గారు మీమీద చాలాకోపంగా ఉందండీ.... మీ పోస్టు నా ఖర్మకాలి ఆఫీసులో దొంగతనంగా ఓపెన్ చేసి చదివి... మీరు రాసిన పంచ్ డైలాగ్స్ కి తట్టుకోలేక పెద్దగా నవ్వేసా! అందరూ వింతగా చూసారు! హుహ్!! ఎలా వస్తాయండీ మీకిలాంటి అవిడియాలూ????? :))))) మొత్తానికి కృష్ణవంశీని ఏకిపడేసారుగా! నేను ఇదివరకు పిచ్చ ఫ్యాన్ ని. కృష్ణవంశి కోసం చక్రం సినిమా ఫ్లాప్ అని తెల్సినా చూసా! ఇప్పుడు మొగుడు అసలెప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలీదు :))) మీ రివ్యు ఎప్పటిలాగే కేకస్య :)

Kathi Mahesh Kumar said...

:) :) :) :) :)
ఇంత వరకూ నేను ఎవరికీ ఐదు స్మైలీ రేటింగ్ ఇచ్చినట్టు గుర్తులేదు...

g2 said...

Kummaru mastaru...

Telugu cinema parisrama meeda naaku elaago nireekshana poyindi.. kaneesam ilaanti reviews marenno raasi mammalni navvisthaaru ani aasisthu...

--
g2

నేస్తం said...

రాజు రాజు రాజు రాజు రాజు రాజు ఇలా టైప్ చేయాలనే ఉంది..అంత బాగా రాసావ్..అసలు ఎంత నవ్వానంటే... ఇంక వద్దులే ...దిష్టి తగులుతుంది

RamGopal said...

సుద్దాల అశోక్ తేజ గారు రాసిన మొగుడు టైటిల్ సాంగ్ ఒక ఫిలాంత్రపకిడీ.

"ఫిలాంత్రపకిడీ" hahaha ante enti mastaru?

మనసు పలికే said...

బాబూ రాజూ....;)
చాలారోజుల తర్వాత బ్లాగుల్లోకి వచ్చి దారుణాతిదారుణంగా నవ్వాను నీ టపా చదివి. ఏంటో.. అలాంటి చిత్రరాజానికి బలయ్యావని జాలి పడాలో మా అందరికీ నవ్వుల పండగ అందించినందుకు నిన్ను పొగడాలో కూడా అర్థం కాకుండా ఉంది. మొత్తానికి ఈ టపా ఒక మాస్టర్ పీస్. కె.వి. మొగుడు దేనికీ పనికిరాదు అనుకునే అందరికీ ఈ టపా చూపించాలి. కె.వి. గారు ఆ చిత్రాన్ని ఒక మహత్తర ప్రయోజనాన్ని ఆశించి తీశారని అర్థం అవుతుంది. కాదా మరి, ఆ మహానుభావుడు ఆ చిత్రాన్నే గనక తియ్యకపోతే నీ నుండి ఇంత అద్భుతమైన టపా పడేదా???????????? మేమంతా ఇలా కళ్లలో నీళ్లొచ్చి, కడుపులో నొప్పొచ్చేదాకా నవ్వేవాళ్లమా??????

Vamshi said...

please post reviews for "shakthi", oosaravelli, 7th Sense, Ra-one, dhada, ala modalaindi

రాజ్ కుమార్ said...

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ గారూ ధన్యవాదాలండీ.

VLS MURTHY గారూ మీరు చాలా డీప్ గా హర్టయినట్టున్నారండీ.. ఏం చేస్తామండీ బలయ్యి ఇలా గోల బాధపడటం తప్ప. ;) థాంక్యూ

ఉజ్వల్ గారూ ఊసరవెల్లి చూడలేదండీ నేను. ఈ మధ్య ఖాళీ ఉండటం లేదండీ. ;) థాంక్యూ అండీ

రాజ్ కుమార్ said...

Mr.DePrEsSo & kiShore thank you very much friends :)

కొత్తపాళీ గారూ అంతా నా తలరాత లెండీ. మీరేం చెయ్యగలరండీ? ;) రివ్యూ మెచ్చినందుకు ధన్యవాదాలు

జిలేబీ గారూ అయ్యో.. ఎంత మాట అనేసారూ? కృష్ణవంశీ ఎవరూ? అంటారా? ఇప్పటీ కుఱ డైరెక్టర్లు అందరూ మాకు మీరే ఇన్స్పిరేషన్ అని ఎత్తేస్తూ ఉంటారు.
ఒకప్పుడు మంచి సినిమాలు తీశాడు. మీరు వీలైతే "ఖడ్గం" చూడండీ. ;)

రాజ్ కుమార్ said...

ఇందూ గారూ బింగో. నేనూ కేవీ కి ఫ్యాన్ నే. మీరు చక్రం మాత్రమే చూశారు. నేను శశిరేఖాపరిణయం నచ్చకపోయినా బాగున్న కొన్ని సీన్ల కోసం ఒక పదిహేను సార్లు చూసి ఉంటాను. నేనేమై పోవాలండీ? హిహిహిహి

కత్తి మహేష్ కుమార్ గారూ ధన్యవాదాలండీ. థాంక్యూ వెరీ మచ్

@g2 thnQ very much

రాజ్ కుమార్ said...

నేస్తం అక్కా హిహిహి థాంక్యూ వెరీ మచ్ ;) ;)

రాజ్ కుమార్ said...

రాం గోపాల్ గారూ "ఫిలాంత్రపకిడీ" అంటే అర్దం కావాలా?
ఒకసారి ఆ పాట వినండీ ఆటోమేటిక్ గా అర్ధమ్ అయిపొద్ది ;)

మనసుపలికే.. ఇది చాలా దారుణం ఖండిస్తున్నను. హిహిహి థాంక్యూ.

వంశీ గారూ మన రివ్యూ లకి అంత సీనుందా? అయినా అక్కడ ఇంత ఫ్రీగా రాయలేం కదండీ ;)thnQ very much 4 ur suggestion

Bharat JKumar said...

Boss....vinadaniki bagunna this is not good..krishna vamsi ki pedda fan antunnavu..how come you can scold him like that..evarni aiyina criticize cheyadam chala easy....

I agree that cinema is very bad but mari ila adiposukovadam baledu..thats wat i felt...sorry if i hurt you

Bharat JKumar said...

Boss....vinadaniki bagunna this is not good..krishna vamsi ki pedda fan antunnavu..how come you can scold him like that..evarni aiyina criticize cheyadam chala easy....

I agree that cinema is very bad but mari ila adiposukovadam baledu..thats wat i felt...sorry if i hurt you

Sharada said...

"ఫిలాంత్రపకిడీ" అంటే ఏమిటి?అదో రకం పకోడీనా? మధ్యలో రెండూ ఫోటోల్లో వున్న అమ్మాయిలెవరు? చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను!
By the way, fantastic review !!
శారద

Anupama said...

baboi..navvaleka chachchipotunna.
ilanti cinemalu madya madyalo anna vachchi potoo undalani nenu devunni korukuntanu :)

Unknown said...

Great review, Idi chadivi velli unte 300rs migili undevi.. :(

SHIVA said...

Hammayyya... inkaa nayam ee movie ki veldam anukunna thanks

చాణక్య said...

హహహ్హహ్హహిహిహీహ్హిహూహ్హుహ్హూ.... పోతే పోయిందిగానండీ ఎదవ సినిమా మీ రివ్యూ మాత్రం కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.......

మీకిదే నా ఓదార్పు.. త్వరలోనే మొగుడు బాధితుల కోసం జగన్ ఓదార్పుయాత్ర చేపట్టాలని నేను బీభత్సంగా డిమాండ్ చేస్తున్నాను. :))))

Laxmi said...

baboi, ee madhya kaalam lo intha navvukoni chala rojulu aindi. movie choosi yediche kante mee review chadivi navvukovadam chala baagundi. Chala thanks andi, meeru maaku mottam oka 45 dollars save chesaru.

Unknown said...

మీరు ఆ సినిమా చూసి ఇలా ఈ రివ్యో రాసి మా చేత నవ్వించడానికే తీసుంటారు గౌరవనీయులు కృష్ణ వంశీ గారు .. మీ బాధ నేను పూర్తిగా అర్థంచేసుకున్నాను..నేనూ నిన్ననే ఆ సినిమా చూసాను

Madhava Reddy Revuri said...

office lo kurchoni ne blogs chadivi baga enjoy chesa ...asalu evaru nuvvu ani thelusukovalani undi.

రాజ్ కుమార్ said...

శారద గారూ... మీరు అర్జెంట్ గా మొగుడు టైటీల్ సాంగ్ వినండీ. ;) మింగుడు పడని పకోడీ ;) థాంక్యూ అండీ

అనుపమగారూ ధన్యవాదాలు

స్వాతి గారూ. తప్పు అన్నారు. ఇది చదివి వెళ్ళకుండా ఉండి ఉంటే మూడొందలు మిగిలెవి. హిహిహి.. థాంక్యూ అండీ

రాజ్ కుమార్ said...

శివగారూ..ఒకసారి వెళ్ళిరండి సారు అదో రకమయిన ఎంటర్టైన్మెంటూ ;)

చాణక్య గారూ మొగుడు బాధితుల కోసం కేవీ విజయయాత్ర మొదలు పెడతాడు లెండి ;) ధన్యవ్వాధః

లక్ష్మిగారూ..థాంక్యూ వెరీమచ్ ఆండీ..

అంతర్ముఖుడు గారూ.. ఓహో మీరూ బలయ్యారా? అయితే మీకు ఇంకా బాగా అర్ధమ్ అయ్యి ఉంటాది.. థాంక్యూ అండీ

రాజ్ కుమార్ said...
This comment has been removed by the author.
రాజ్ కుమార్ said...

భరత్ కుమార్ గారూ.. అవునండీ కృష్ణవంశీ కి ఫ్యాన్ ని కాబట్టే ఇలా తిడుతున్నాను. ఏ బీ.గోపాల్ నో, దాసరి నారాయణరావో, రాఘవేంద్రరావ్ B.A నో పోసాని కృష్నమురళో ఈ సినిమా తీసి ఉంటే అసల్ పట్టించుకునే వాడిని కాను. వాళ్ళరేంజ్ ఏంటో తెలుసు
కాబట్టీ.

కె.వి సినిమా హిట్టయినా ఫట్టయినా ఫస్ట్ డే నే పరిగెట్టుకు పారిపోయి, నచ్చని సీన్లు వదిలేసి నచ్చే సీన్ల కోసం మళ్ళీ మళ్ళీ చూసిన వాడిని నేను.
కుటుంబ కధా చిత్రాలైతే నేమీ, లవ్ స్టోరీలయితేనేమీ, సెంటిమెంట్, దేశభక్తి, నక్సలిజం ఇలా అన్ని కేటగిరీలలోనూ సినిమాలు తీసి మెప్పించిన మేటి దర్శకుడేనా ఇలా దిగజారి సినిమాలు తీసున్నదీ? అన్న బాధ అంతే.

నిజమే క్రిటీసైజ్ చెయ్యటం ఈజీనే. నన్ను సినిమా తియ్యమంటే తియ్యలేను. కానీ టికెట్ కొనుక్కొని వెళ్ళే వాడికోసం 100% పెర్ఫెక్ట్ సినిమా తియ్యమనటం లేదు. సినిమా మొత్తం ప్రేక్షకుడి ని కట్టిపడేసేలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చెయ్యటం లేదు.
సూపర్ హిట్ తీసి రికార్డ్ బ్రేక్ చెయ్యనక్కర్లేదు. తను చెప్పాలనుకున్న విషయాన్ని ఎంటర్టైన్ మెంట్ మిస్సవ్వకుండా తీయటంలో చేయితిరిగిన డైరెక్టరేగా? ఇప్పుడెందుకు ఇలా తయారయ్యాడూ అనే బాధని ఇలా వెళ్ళగక్కాను
అంతే. మీరన్న దానిలో ఏం తప్పులేదులెండీ. మీ సారీ ని రిజెక్ట్ చేస్తున్నా ;) ;)

జేబి - JB said...

ఇవాళ‌ వాచ్‌మన్‌ మేనల్లుడు‌ లిఫ్ట్‌ అడిగితే బండెక్కించుకున్నా. 'మొగుడు‌' హాలుముందునుండీ‌ వెళ్ళుతుంటే మీరు‌ సినిమాలు‌ చూడరా అన్నా? అని‌ అడిగాడు‌.

ఎందుకు‌ చూడం నాయనా, ఈ 'మొగుడు‌' మొన్ననే బాదించుకున్నాగా అన్నా.

'నేనూ చూశానన్నా, మూడు‌ సార్లు‌'
'అవునా!!!!'
'అవునన్నా! గోపీచంద్‌ ఫ్యానుని‌'
నడుపుతున్న‌ బండీ అప్పటికే‌ అటూఇటూ ఊగుతుంది‌.
'నేను‌ కృష్ణవంశీ అభిమానినిలే'
'హిహ్హీహీ! మొన్న‌ హాల్లో ముందు‌ సీటోడు‌ కృష్ణవంశీ ఫ్యానంటే‌ నవ్వొచ్చింది‌, వాడికీ ఫ్యానులుంటారా' అ.ని

వెంటనే బండి‌ ఆపి‌ వాడిని‌ దిగమన్నా.

జేబి - JB said...

మీరు‌ మొగుడు‌పై నా స్పందన‌ చూసినట్లు‌ లేరు‌ - http://jb-jeevanayanam.blogspot.com/2011/11/blog-post.html

Unknown said...

మరీ అంత బావుంది అన్నమాట సినిమా. కృష్ణవంశీ గురించి మీరు చెప్పింది అక్షరాలా నిజం.. సినిమా మాట ఎలా ఉన్నా మీ రివ్యూ మాత్రం అదిరింది..ఇప్పుడీ సినిమా టీ.వీ లొ ఊరికే చూపించినా సరేకూడా చూడదానికి ధైర్యం లేదు నాకు.. అది వేరే సంగతి..

Ennela said...

//అవి ఇక్కడ రాస్తే టైప్ చేసిన నా చేతులు డెట్టాల్ తో కడుక్కొనీ, కీబోర్డ్ మీద పసుపు నీళ్ళు చల్లుకోవాలి. అవి చదివిన మీరు కళ్ళళ్ళో ఐ డ్రాప్స్ వేసుకొనీ నోట్లో తులసాకులు వేస్కొని నమలాలి. అప్పటికి గానీ చుట్టుకున్న పాపం చట్టబండలు కాదు.// hahaha...super

Raviteja said...

fantastic mind blowing unbelievable review :D

రాజ్ కుమార్ said...

జేబీ గారూ చూశానండీ.. హిహిహిహి మీకు నా సానుభూతి ప్రకటిస్తున్నా.. ;)

ప్రసీద గారూ.. అయ్యయ్యో టీవీలో మిస్సవ్వద్దు ;) మధ్య మధ్యలో ఆడ్స్ వస్తాయి కాబట్టీ సింపుల్ గా చూసెయ్యొచ్చు. థాంక్యూ అండీ.

ఎన్నెల గారూ ధన్యవాదాలు

@raviTej thanQ very much ;)

ఆ.సౌమ్య said...

"ఒక బైక్ కి రెండున్నర గంటలు టార్చర్ పెట్టే యాడ్ ఉండటం గ్రేట్ కదా..!"

"వొళ్ళంతా దురదగుండాకు పూసుకొనీ, నోట్లో జాలిన్ లోషన్ పోసుకున్నట్టూ చాలా సమ్మగా ఉందీ."

హహహహ బలే నవ్వించావు. ఆ శ్రద్ధా దాస్ కంపేరిజన్ ఏమిటి బాబూ...చచ్చిపోయాను నవ్వలేక. నీకు ఇలాంటి అవిడియాలు ఎలా వస్తాయసలు?

కెవీ కి లేఖ అదుర్స్.

నేను కూడా శ్రీ ఆంజనేయం దగ్గరనుండీ వైట్ చేస్తున్నా మంచి సినిమా కోసం. నీలాగే ఎంత కంపుగా ఉన్నా శశిరేఖా పరిణయం లాంటి సినిమాలు కూడా కొన్ని కొన్ని సీన్ల కోసం చూసా.

ఇప్పుడు నీ రివ్యూ చదివాక ఇంక కెవీ నుండి మంచి సినిమా కోసం వైట్ చెయ్యడం అనవసరమేమో! తనేం చేస్తున్నాడో తనకే తెలీడంలేదు గాబోలు! అసలు తాప్సీ అనగానే నేను దూరం పెట్టేసాని సినిమాని.

తెలుగు సినిమా పరిశ్రమకి ఎంత నష్టం వచ్చినా సరే నీ చేత ఇలాంటి రివ్యూలు రాయించడం కోసం ఇలాంటి కంపు సినిమాలు ఇంకా ఇంకా వస్తుండాలని ఆకాంక్షిస్తున్నా.

srinivas reddy said...

రాజ్ గారు, నమస్కారమ్. మీ బ్లాగ్ చాలా రొజుల ను0డి చదువుతున్నాన0డి, ఇదే నా మొదటి కామ్మె0ట్ అ0డి. ఇలా బ్లాగ్ ద్వారా హాస్యాన్ని, జ్నానాన్ని, తెలుగు ని ప0చ్'తున్న మీకు దన్యవాదాలు. మీ ను0డి మరిన్ని పొస్ట్ లు రావాలని కొరుకు0టూ మీ అభిమాని.

రాజ్ కుమార్ said...

srinivas reddy గారూ.. .. ధన్యవాదాలు.. ;)

రాజ్ కుమార్ said...

సౌమ్యగారూ... అయ్తె ఇలాంటి కంపు సినిమాలకి నేను బలయ్యిపోవలసిందేనా? హహహహ్... ధన్యవాదాలండీ

S said...

నేనిలా అంటే నన్ను తంతారేమో కానీ, ఈయన గారికి డబల్ మీనింగులూ అవీ ఎక్కువవుతున్నాయని శ్రీఆంజనేయం టైముకే జోరుగా అనిపించి, చూడ్డం మానేశా తక్కిన సినిమాలు. తరువాత వచ్చిన వాటిలో "చందమామ" ఒక్కటే చూశా అనుకుంటా....అది కూడా కొంతవరకూ బానే ఉంది కానీ, సినిమాగా పెద్ద నచ్చలేదు నాకు. :) అదేమిటో, ముందు బానే ఉండేవాడు... ఖడ్గం దాకా... ఇలా అయిపోయాడేంటో!

ఏమైనా, మీ రివ్యూ మాత్రం భలే ఉందండీ!

సుజాత said...

బహుశా సినిమా చూసుంటే ఇంత కామెడీని ఎంజాయ్ చేసే దాన్ని కాదు! కోట్ చేయాల్సివ్ అస్తే ప్రతి వాక్యాన్నీ కోట్ చేయాల్సి వచ్చేట్టుంది మీ రివ్యూ

కొత్తావకాయ మాటే నాదీను! మణిపూస ఫోటో! అంటే తిడతారని ఊరుకునా కానీ ఈ డౌట్ నాకు ఎప్పటి నుంచో ఉంది తెల్సా!

ఈ "క్రియేటివ్" సీన్ చూసీ టికెట్ కొని సినిమా చూస్తున్న దౌర్భాగ్యులంతా ఎవరి చెప్పుతో వాళ్ళు కొట్టుకున్నారు లెండీ ఇంటర్వెల్ టైం లో.
వొళ్ళంతా దురదగుండాకు పూసుకొనీ, నోట్లో జాలిన్ లోషన్ పోసుకున్నట్టూ చాలా సమ్మగా ఉందీ.

ఏమిటో, మీ విషాదం నుంచి మాకు ఇంత హ్యూమర్ ని పంచి త్యాగధనులయ్యారు!:-((
అసలు నాకు ఆ నిన్నే పెళ్ళాడతా సినిమాయే సగం చూడగానే "ఈ సినిమా అయ్యేట్టు లేదిహ" అనిపించింది. కెవ్వున కేకలూ..ఏవిటో ఆ గోల!

ఏమైనా పెళ్ళయ్యాక కృష్ణ వంశీ ఒక్కటంటే ఒక్క మంచి సినిమా కూడా తీయలేదు. ఎవరి మీద కోపమో మన మీద చూపిస్తే మనమేం చేస్తాం?

S said...

అంటే ఇప్పుడూ - కర్మనేది ఒకటుంది. ఎంతటివారైనా, ఎంత ముందస్తు హెచ్చరికలు అందుకున్నా, కర్మ ఫలం అనుభవించక తప్పదు. ఈ ముక్క మరొకసారి నిరూపితమైంది ఇవాళ. అప్పట్లోనే ఈ టపా చదివాను. ఇవ్వాళ మొగుడు సినిమా మొదలబెట్టబోతూ కూడా అనుకున్నా ఈ టపా గురించి. ఐనప్పటికీ ముప్పావుగంట సినిమా చూశా. ఇంకా నిజానికి మీరు హైలైట్ చేసినవేవీ జరగలేదు (కనీసం రౌడీ రోజా ఎంట్రీ కూడా)... ఇప్పటికే నాకేమిటో భవిష్యత్తు తల్చుకుంటే భయమేసీ, ఎందుకన్నా మంచిది మరొక్కసారి మీ కెవ్యూ చదువుదామని ఇటొచ్చా. కర్మ చక్రాన్ని దాటుకుని మోక్షాన్ని పొందబోతున్నానిక!

chaitanya said...

చాలా బాగుంది సర్ రివ్యూ,

నేను ఈ రోజే ఈ రివ్యూ చూశాను,

డైరెక్టర్ లు వాళ్ళ చట్రాలనుండి బయటకు రాకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మనల్ని ఇరికిద్దామని వాళ్ళు ఇరుక్కుపోతారు.

సినిమా వరస్ట్, మీ రివ్యూ బెస్ట్

Lalitha said...

ఈ మొగుడి దెబ్బకి మా పిల్లలు ఇప్పటివరకు తెలుగు సినిమా మళ్లీ చూడలేదు - మీ రివ్యూ అద్భుతం!

Siva kumar said...

Review Chala bagundi andi.