"తిరుమల కొండలు ఏడయినా ఆ కొండల రాయుడు ఒక్కడే.. తెలుగున పదములు ఎన్నున్నా ఆ
తియ్యందనమూ ఒక్కటే... అందరి దారులు వేరయినా ఆ స్పందన తెలిపే మార్గం ఒక్కటే... ఎప్పుడయినా, ఎక్కడయినా AIRTEL..... ఒక్కటేఏఏఏఏఏఏ" అని ఎయిర్ టెల్ వాడు ఊరిస్తున్నాడు.
నేను ఊకొట్టి ఊరుకున్నాను.
"98..ఓ..ఓ...441..25" అని ఐడియా వాడు సందడి చేస్తూ కవ్విస్తున్నాడు. నేను కన్నేశాను కానీ కామ్ గా ఉండిపోయేను.
"సాగుతుందీ సా....గుతుందీ.. ఇండికాం సాగుతుందీ.. రెండేళ్ళూ సాగుతుందీ.." అని టాటా వాడు
"టాటా టూ టాటా" ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని జనాల్ని ఊదరగొట్టేస్తున్నాడు. అందులో "ఫ్రీ" అనే సంయుక్తాక్షరం రెక్కల పురుగుల్ని స్ట్రీట్ లైట్ ఆకర్షించినట్టూ ఆకర్శించింది ప్రజానీకాన్ని. అ ప్రజానీకం లో నేనూ మమేకమయ్యాను.
అప్పటి వరకూ బలిసున్నోళ్ళకి విలాసం గా ఉన్న సెల్ ఫోన్ ని దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నవాళ్ళకి కూడా కనీస
అవసరం అవ్వటానికీ, ఎగువన ఉన్నోళ్ళు బానిసలవ్వటానికీ పునాదులు పడుతున్న తరుణమది.
కాలేజ్ కాంపౌండ్ లో స్టూడెంట్స్ ఎవరూ మొబైల్స్ వాడకూడదని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాగానీ, మేము మాత్రం మా కాలేజ్
ఏరియాలో సిగ్నల్ సరిగా రాని టాటా ఫోన్స్ ని కాల్ వచ్చినప్పుడు చెవి కీ, రానప్పుడు చేతికీ అంటించేసుకొనీ, గేమ్స్
ఆడుకుంటూ బా...గా జలుబు చేసినప్పుడు ముక్కు చీదుకుంటే వచ్చే తాత్కాలిక ఆనందాన్ని తేరగా
అనుభవించేవాళ్ళం.
"ఫ్రీ యే గానీ మీ నెట్వర్క్ కి సిగ్నలే ఉండదెహే..!" అని ఒకళ్ళు గేలి చేస్తే... "ఔట్ గోయింగ్ కి నిమిషాలు
లెక్కెట్టుకుంటూ, ఫోన్ కి కూడా తెలీకుండా మిస్డ్ కాల్స్ ఇచ్చే మీరేట్రా మమ్మల్ననేదీ?" అని మరొకళ్ళూ.. ఇలా
నెట్వర్కుల వారీ గా విడిపోయి తిట్టుకుంటూ మూడు కాల్స్, ఆరు ఎస్సెమ్మెస్ లతో కాలాన్ని కుంటిస్తుండగా ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లీకయ్యి మా చెవిన పడింది. ఏమిటంటే C.S.E డిపార్ట్మెంట్ లో రైడింగ్ జరిగిందంటా. దొరికిన సెల్‌ఫోన్స్ అన్నీ మూటకట్టి ప్రిన్సీ బీరువాలో పెట్టి తాళం వేసేశాడంటా.
నెక్స్ట్ మా డిపార్ట్మెంట్ మీద కూడా కన్ఫర్మ్ గా రైడింగ్ జరగబోతుంది అంట. ఇది విన్నాక మాలో కొందరికి మోకాళ్ళు
మండటం మొదలెట్టాయ్. మరి కొందరికి అరికాళ్ళు దురదలెయ్యటం మొదలెట్టాయ్. క్లాస్ లో అందరి ఫోన్లూ కలెక్ట్
చేసి మూటకట్టేశాం. కానీ ఎక్కడ దాయాలీ? ఖాళీ చేసిన లంచ్ బాక్స్ లతో సహా వెతుకుతున్నారని సమాచారం రావటం తో అందరి మొహాల్లోనూ ఆలోచనలతో కూడిన ఆందోళన తాండవించింది. "ఒక్క ఐడియ జీవితాన్నే మార్చేస్తుందంటా.. ఆఫ్ట్రాల్ మొబైల్స్ దాయలేదా?"
"ఐడియా... మొబైల్స్ అన్నీ బయట నా బైక్ బాక్స్ లో పడేద్దాం" అన్నాడు సునీల్ గాడు. "వాటెన్ ఐడియా సర్జీ?"
అనుకొని ఇంప్లిమెంట్ చేసి ఇకిలించాం. ప్చ్... ఆరోజు రైడ్ జరగలేదు. ఏ విషయంలోనయినా అతి జాగ్రత్త అధిక
మోతాదు లో తీసుకునే నేను నా డబ్బా మొబైల్ ని "కావాలనే ఇంట్లో మరిచిపోయి" కాలేజ్ కెళ్ళిపోయాను
మర్నాడు.అప్పుడప్పుడూ "నేను కూడా లక్కీ ఫెలో నే" అని ఫీలయ్యే సంఘటనలు జరుగుతుంటాయ్ నాకు. ఆ రోజు ఎర్లీ అవర్ లోనే C.S.E హెచ్.ఓ.డీ ముగ్గురు ల్యాబ్ అసిస్టెంట్ లని వెంటేసుకొని, జేమ్స్ బాండ్ రేంజ్ లో మా క్లాస్ కొచ్చి "స్టాట్యూ" అనరిచేడు. పిల్లకాయలంతా తత్తరపాటు తో బిత్తరచూపులు చూస్తా అతి తెలివి ఉపయోగించి సీక్రెట్ ప్లేసుల్లో ఫోన్లు దాచేశారు.బ్యాగ్సూ, బుక్సూ, లంచ్ బాక్సూ, షూసూ, పోకెట్సూ, బైక్స్ (ఈ ఇన్ఫో ఎలా లీకయ్యిందో??) ఏదీ వదలకుండా, ఎవ్వర్నీ విడవ కుండా చెక్ చేసి, దొరికిన ఫోన్లన్నీ పట్టుకుపోయారు.
ఫోన్ నిండా "వైరస్ తో కూడిన వీడియోలు" ఉన్న మా దీప్ సాగర్ గాడి ఫోన్ తప్ప. వాడికి ఎక్కడ దాయాలో తెలీక
సింపుల్ గా వాడి డస్క్ లో పెట్టాడంటా. :-) :-) సుడిగాడు సుమండీ..!
తన ఫోన్ పోయినందుకు కాకుండా, తక్కిన వాళ్ళు ఫోన్లు తేవడం మరిచిపోయి నందుకు వెక్కి వెక్కి ఏడవటం
మొదలెట్టాడు "గోల శివరాం" గాడు. జరిగిన ఈ దుర్ఘటన మా మనసుల్లో దాచుకోలేని దుఃఖాన్నీ, భరించ రాని బాధ
నీ మిగిల్చింది. పరాయి H.O.D చేతిలో కలిగిన పరాభవం కడుపు మంట ని రగిల్చింది.
"ఏంట్రా ఇదీ..?? వాటీజ్ దిస్ దౌర్జన్యకాండా? మనం కాబోయే గ్రాడ్యుయేట్సా? కిండర్ గార్డెన్ కిడ్సా?? " ఆవేశం గా
అన్నాడు కుమార్ గాడు.
"లాభం లేదురా..ఏదో ఒకటి చెయ్యాలి... రేపు క్లాస్ మొత్తం మూకుమ్మడి గా బంక్ కొట్టేసి సీరియస్ గా స్ట్రైక్ చేద్దాం"
---విలాస్ గాడు.
"ఇదేమన్నా కార్మిక వర్గ పోరాటమా? స్ట్రైకులు చెయ్యడానికీ? క్లాస్ లు ఎగ్గొట్టీ ఎక్కడికయినా టూర్ ప్లాన్ చేద్దాం.
ఇండస్ట్రియల్ టూర్ కాదు. ఎంటర్టయిన్ మెంట్ టూర్..." --- సత్తి మాయ.
"అద్దీ.. మామా... మొన్నటికి మొన్న EEE వాళ్ళు పాపికొండలు టూరేసుకొచ్చేర్రా.... అమ్మాయిల్ని వెంటేసుకొనీ... మనం కూడా అలాంటిది చెయ్యకపోతే ECE పరువుండదెహే..!" --- ఓ మోతాదు ఇంటెన్సిటీ తో అన్నాడు మస్తాన్ గాడు.
"సూపర్ రా...టూర్ కి వచ్చినోళ్ళకి గిఫ్ట్ లు కూడా ఇద్దాం.. .అమ్మాయిలకి స్టిక్కరు బొట్లూ..
అబ్బాయిలకి లిక్కరు బొట్లూ"--- శ్రీధర్ గాడు.
"ఆడ పటాలాన్ని వెంటేసుకొని టూర్ కెళ్ళేరా?? ఈ ఎలక్ట్రికల్స్ వాళ్లకి మోటార్లే గానీ మెదళ్ళుండవ్ రా..."
వెటకారం గా అన్నాడు విజయ్ బాబు.
అందరూ ఆశ్చర్యం గా అదోరకం గా చూసేం విజయ్ గాడి వైపు. వాడు జ్ఞానోపదేశం మొదలెట్టాడు..
"మనలో మూడు రకాల మొగోళ్ళున్నారు.
1. "బంగారం.. బంగారం.. బువ్వ తిన్నావా బంగారం?...కోల్డ్ వాటర్ తాగకు బంగారం.. కోల్డ్ చేస్తుందీ. వేణ్ణీళ్ళు
తాగొద్దు... వేడి చేస్తుందీ..ఊపిరి తీయొద్దు బంగారం నా శనొదిలి పోతుందీ " అని నంగ పెడుతూ తిరుగుతూ వాళ్ళ
గురించి వాళ్ళే మరిచిపోయి, ప్రపంచాన్ని పట్టించుకో(లే)ని, ఫ్రీడం లేని వాళ్ళు.
2.ఆర్కుట్ లో Status: Commited అని బలవంతం మీద పెట్టుకొనీ, లవర్ గా పిలవ బడే లంఖినీలని ఎదిరించే
ధైర్యం లేకా, ఏడ్చే తీరిక లేకా, ఓదార్చే తోడు లేకా, వైరాగ్యపు నవ్వులు నవ్వే పీడిత జనులు.
3. పై రెండు క్యాటగిరీ లనీ చూసీ "ఛీ... మా జీవితం.. ఎన్నాళ్ళూ..? ఎన్నేళ్ళు ఇలా తాడు లేని బొంగరం లాగా, తల
లేని అగ్గిపుల్ల లాగా, వాల్యూ లెస్ గా.. ఒంటరిగా ?" అని ఏడ్చే లక్కీ ఫెలోస్.
అయినా మన క్లాస్ లో కండపుష్టి ఉన్న తిండిబోతులే గానీ, అందగత్తెలయిన అమ్మాయిలెక్కడ రా?
సో.. ఈ ఆడ లేడీస్ ని ఫిల్టర్ చేసేస్తే.. మనమంతా ఒకటే క్యాటగిరీ..."we are just boys..!" అప్పు....డూ
ఎంజాయ్‌మెంటూ.... అదేరా ఎంజాయ్‌మెంటూ.."
మేమంతా అవునన్నట్టూ అడ్డదిడ్డం గా తలఊపేసీ, మ్యాటర్ చెవ్వుల్లోంచి డైరెక్ట్ గా చిన్న మెదడుకి చొచ్చుకొని
పోయి సెటిలవ్వటం తో అందరం ఏకగ్రీవం గా ఆమోదించాం.
"పాపం వాళ్ళకో మాట చెప్పి వెళదాం రా.. ఫీలవుతారు లేకుంటే" అని జాలిపడ్డాడు శశికాంత్.
"ఒరే.... మంచితనం ఎక్కువయితే దాన్ని అతిమంచితనం అనర్రా... తింగరితనం అంటారు. ఏం అక్కర్లేదూ...నువ్ అర్జెంట్ గా సైలెంట్ ఐపో.." అనేసేడు సుధాకర్ గాడు.
" ఎక్కడికెళదాం?" అన్న కొచ్చెన్ రాగానే.... "మా ఊరికి దగ్గర్లో సాగర సంగమం (మరిన్ని వివరాలకి ఇక్కడ చూడండీ)
ఉందనీ, అద్భుతం గా ఉంటాదనీ" చెప్పేను. మా శివగాడు అవునవునని వంత పాడాడు. కత్తి లాంటి క్వశ్చన్స్ కి
సూది లాంటి సమాధానాలు చెప్పే ప్రసాద్ మామ ఎప్పటిలాగే ఆర్గనైజ్ చెయ్యడానికి ముందుకొచ్చాడు.
అప్పల్రాజుః "అయితే మామా ... బీర్లు ఏరులా పారిద్ధాం"
"మైక్" ప్రసాదుః ఆ ప్రోగ్రాం పెట్టుకుంటే టూర్ డిస్టర్బ్ అవుతుందిరా.. వద్దు.
అప్పల్రాజుః "అమ్మాయిలు రారంటా.. చుట్టూ ఉప్పు నీరంటా.. తాగడానికి నో బీరంటా... ఇదొక ఔటింగూ.. దానికి
మళ్ళీ మీటింగూ..ఛత్.."
"మైక్" ప్రసాదుః నువ్ జోకులు బాగా ఏస్తావ్ రా రాజు గా...!
అప్పల్రాజుః నన్ను జోకర్ అంటావా? అవున్రా నేను జోకర్‌నే... కానీ నీ లాగా సర్కస్ లో ఆటవిడుపుకి వచ్చే జోకర్ న
కాదురా నేనూ. ఆటని మలుపు తిప్పే పేకాట లో జోకర్ ని. ఈ తొక్కలో టూర్ కన్నా శ్రీ లక్ష్మి ధియేటర్ లో సినిమాకి
పోవటం బెటరు. ఏడు రూపాయల్ టిక్కెట్టూ, మూడు రూపాయలు సిగరెట్టూ, పది రూపాయలు బడ్జెట్టూ. అదీ
ఎంజాయ్మెంట్ అంటే.....
"మైక్" ప్రసాదుః తాగుబోతులు అడుగేసిన చోట మడిగట్టుకొని తడి గుడ్డ పెట్టే వంశం రా మాదీ.. ఇష్టమయితే రండీ
కష్టమయితే పొండీ.
అప్పల్రాజుః అయితే రేపట్నించి కాలేజ్ క్లీనింగ్ సెక్షన్ లో చేరిపో రా.. అంటూ అప్పిగాడు ఆవేశం గా వాకవుట్ చేశాడు.
బీరు లేని పార్టీ కారం లేని కూర లాంటిదని లైట్ గా హర్ట్ చేసినా డీప్ గా ఫీలయ్యిపోయే కొంత మంది ఆక్రోశించేసీ,
మేము ప్రతిఘటించేసరికీ అలిగేసీ, "మేము రాము" అని తెగేసి చెప్పేశారు.
అది టూరిస్ట్ ప్లేస్ కాదు గాబట్టీ ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవనీ, తిండానికీ (బిర్యానీ), తాగడానికి (మంచి
నీళ్ళు..నిజమే... నమ్మాలి తమరు) తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం.
*******************************************************************
రెగ్యులర్ విజిటర్ని అయిన నేను రూటు చెప్తుండగా ఆటోల్లో అంత్యాక్షరి ఆడుకుంటూ చేరిపోయాం. ఆటోలు దిగీ,
లగేజ్ పట్టుకొని సాగర తీరం వైపు నీరసం గా నడుస్త్తున్న మా వాళ్ళకి కనుచూపు మేర లో కనిపిస్తున్న అందమయిన లొకేషన్, కొంత దూరం నడిచాక పడవ ఎక్కి వెళ్ళబోతున్నమన్న ఆనందం, కొబ్బరి చిప్ప దొరికినప్పుడు కోతికి కలిగే కపిలానందాన్నీ, కోడి కూర వాసనేసినప్పుడూ కుక్కకి కలిగే శునకానందాన్నీ కలిగించాయ్.
అది మార్నింగ్ టైం కావడం తో నది లోని నీరంతా మెల్లి మెల్లిగా సముద్రం లోకి వస్తుంది. విడతలు విడతలుగా
పడవెక్కి వెళ్ళి మూడు వైపులా నీరూ, ఒక వైపు కొండ గుహ ఉన్న అధ్బుతమయిన ప్రదేశానికి చేరుకున్నాం
సాయంత్రం వేళ వరకూ పిట్ట మనిషుండడు ఆ ప్రదేశం లో. (చేపల వేటకెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళుంటారు సాయంత్రం)
సాగర తీరం పక్కన, అందమయిన లొకేషన్ లో "ప్రపంచం మమ్మల్ని పట్టించుకోవటం లేదు" అని తెలిసిన
మనుషులు ఎంత అల్లరి చేయగలరో అంతా చేశాం. రాళ్ళూ, రప్పలూ , నీళ్ళూ కాదేదీ మా ఆటలకనర్హం అన్నట్టూ
కెరటాలకి ఎదురెళ్ళి కేరింతలు కొడుతున్నాం.
మా టూర్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మా చినమాయ మమ్మల్ని మోడల్స్ గా పెట్టి "బీచ్ ఫోటోగ్రఫీ" ఇరగదీస్తున్నాడు.
గంటలు గడిచాయ్.
సాయంత్రమవుతున్న టైం లో మాకో షాకింగ్ న్యూస్ తెలిసింది. ఏంటంటే సముద్రం లో కొంచెం లోపలికెళితే
అక్కడక్కడా పెద్ద పెద్ద రాళ్ళున్నాయ్(రాళ్ళుంటే అది షాకింగ్ న్యూసేమిటి నీ మొహం?? అనుకుంటున్నారా?).
మధ్యాహ్నం నుండీ కొందరు ఫ్రెండ్స్ ఆ రాళ్ళ వరకూ వెళ్ళి ఆడుకుంటున్నారు. వద్దని వారించినా కూడా.
అయితే ఒక బేసిక్ పాయింట్ ని అందరమూ మరిచిపోయాం. నదీ, సముద్రం కలిసే చోట వాటర్ లెవెల్ అన్ని సమయాల్లోనూ ఒకేలా ఉండదు. సాయంత్రం అయ్యేకొద్దీ సముద్రం లోని నీరు నదిలోకి వస్తూ నీటి మట్టం పెరుగిపోతుందీ. సో నీటిమట్టంతక్కువ ఉన్నప్పుడు రాళ్ళ వరకూ వెళ్ళిన ఫ్రెండ్స్
(మస్తాన్ గాడూ, పిల్ల రవి గాడూ) తిరిగి రాలేక అక్కడే చిక్కుపడిపోయారు. అప్పటికి అరగంట నుండీ వాళ్ళు
ప్రాణాలకోసం పోరాడుతున్నారన్న సంగతి మాకెవ్వరికీ తెలియ లేదు. గజ ఈతగాళ్ళలా లోపలి వరకూ వెళ్ళిపోయి
ఇరుక్కుపోయిన వాళ్ళకూ, ఒడ్డున నిల్చుని చోద్యం చూస్తున్న మాకూ, ఈత ని ఇంగ్లీష్ లో స్విమ్మింగ్ అంటారని తెలుసుగానీ ఎవ్వరికీ అది ఎలా చెయ్యాలో తెలీదు.
ధైర్యం చేసిన మస్తాన్ గాడు ఎలాగోలా ఒడ్డుకొచ్చేశాడు. నీటి తాకిడికి కరిగిన పదునైన రాళ్ళ వల్ల శరీరం
మొత్తం గాయాలు వాడికి. మా అరుపులు వినడానికి ఒక్క మనిషీ లేడు. మొబైల్ చేత్తో పట్టుకొనీ "ప్రపంచం మా
గుప్పెట్లో ఉంది" అని విర్రవీగిన మా అందరినీ చూసి సిగ్నల్ లేని మా ఫోన్లు వికటాట్టహాసం చేశాయ్. అన్ని దార్లూ
మూసుకుపోయాయ్ అనిపించింది. మా అందర్లోకీ పొడుగున్న" మైక్" ప్రసాద్ మామ గాడు రవి గాణ్ణి
తీసుకురాడానికి వెళ్ళాడు. తిరిగొద్దామనే సరికీ నీటి ఉధృతికి ఎక్కవయ్యి, కాళ్ళు అందక వీడూ రాలేక పోయాడు. నిమిషాలు గడుస్తున్నాయ్.మాకు కాళ్ళు వణికేస్తున్నాయ్. ఇంతలో పే...ద్ద కెరటం... ఇద్దర్నీ ముంచేసింది. ఇద్దరూ కనిపించ లేదు. పొద్దున్న కరిగిపోయిన కొండల్లాగ కనిపించిన రాళ్ళూ కనిపించలేదు. సెకన్లు గడుస్తున్నాయ్. అందరకీ బుర్రలు బ్లాంక్ అయిపోయాయ్. గుండెలాగిపోయాయ్. కొద్దిసేపు తర్వాత ఇద్దరూ రాళ్లని అతికష్టం మీద అంటిపెట్టుకొని ఉండటం చూసి కొంచెం మామూలయ్యాం. మా అదృష్టం.. ఒక పొడుగాటి కర్ర కనిపించింది. కానీ దాని లెంగ్త్ సరిపోలేదు. అందరమూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చెయిన్ ఫార్మ్ చేసి నీట్లోకి వెళ్ళాం. చివర్న ఉన్న
శివగాడు కర్ర అందించాడు. నెక్స్ట్ కెరటం వచ్చేవరకూ వెయిట్ చేసీ, దానితో పాటే ఒడ్డుకి లాగేసీ
హమ్మయ్యాఆఆ.. అనుకున్నాం.
అంతవరకూ అద్భుతం గా కనిపించిన ఆ ప్లేస్ ఒక్కసారిగా భయంకరం గా కన్పించింది. అప్పటివరకూ మేమాడుకున్నచోటంతా చూస్తుండగానే మునిగిపోతుంది. ఒక్కనిమిషం కూడా ఉండకుండా వెంటనే బయల్దేరి వచ్చేశాం.అసలు ఇలాంటి ప్లేస్ ని సెలెక్ట్ చేసిందెవ్వర్రా? అని ప్రశ్నలు సంధించారు రోజంతా ఎంజాయ్ చేసిన కుర్రోళ్ళు
కొంతమంది. "మా పిఠాపురాన్న దీనత్త లాటి ప్లేసులు బొచ్చెడున్నాయాయ్ " అని పొట్ట రుద్దుకుంటూ అన్నాడు
పిఠాపురం పిల్ల జమిందారయిన క్రిష్ణబాబు. "ఈత రాకుండా పోటు గాళ్ల లాగా అంత లోపలికెందుకెళ్ళార్రా...
(*$&*%((*&*ల్లారా??" అని గిభీ..గిభీ గుద్దేసీ తన పెద్దరికాన్ని చాటుకున్నాడు విజయ్ బాబు.
"వీళ్ళు రెండు బీరకాయలు బిగించి నీట్లోకి దిగుంటే ఏమయ్యుండేదా?" అని ఆలోచిస్తూ వణికిపోతున్న నాకు ఆమాటలు పెద్దగా వినిపించలేదు.
ఆ విధంగా చేదు జ్ఞాపకం గా బాధ పెట్టాల్సిన ఆ ట్రిప్, ఇప్పటికీ మా కాలేజ్ ఫ్రెండ్స్ కలిస్తే మిస్సవకుండా మాట్లాడుకునే హాట్ టాపిక్ గా మిగిలిపోయింది.

. సాయంత్రం వేళ వరకూ పిట్ట మనిషుండడు ఆ ప్రదేశం లో. (చేపల వేటకెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళుంటారు సాయంత్రం)

29 comments:
బారాశావబ్బాయ్!
వామ్మో...నిజంగానే భయంకరమైన అనుభవం! చదువుతుంటే ఆమధ్యన చూసిన ఒక వీడియో గుర్తొచ్చింది. ఇండోర్ లో ఇలాగే నీళ్ళు ఉధృతమయ్యి నలుగురు కొట్టుకుపోయారు కదా అది గుర్తొచ్చి ఒళ్ళు జలదరించింది.
ఇలాంటి సాహసాలు చెయ్యకండి నాయనలారా!
అమ్మాయిలకు స్టిక్కరు బొట్లు, అబ్బాయిలకు లిక్కరు బొట్లూ...ఇదీ రాజ్ పంచ్ అంటే! :)
హమ్..చివర్లో భలే భయపెట్టేసారండి.పేపరులో చదువుతూ ఉంటాం ఇలాంటి సంఘటనలు...అవి చదువుతుంటూనే ఏదోలా ఉంటుంది..అలాంటిది మీ కళ్ళెదుటే జరిగితే ఆ క్షణంలో మీ పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో చెప్పక్కర్లేదు..ఏమయితేనేం వాళ్ళు క్షేమంగా బయటపడ్డారు.
ఇంతకీ అప్పల్రాజొచ్చాడా లేక అలిగి హాండిచ్చాడా?
మీక్కూడా ఉందా ఇలాంటి అనుభవం! ఎంత టెన్షన్ పడి ఉంటారో కదా! పోన్లెండి అందరూ క్షేమంగా ఉన్నారు.
"స్టిక్కర్ బొట్లూ.. లిక్కర్ బొట్లూ.." రాజ్ కుమార్ మార్క్ పంచ్! హ్హహ్హహా..
ముందంతా హాస్యం, తరువాతంతా భయానకం మిళితమయిన మీ టపా ఎప్పటిలాగానే బాగుంది! నేను డిగ్రీ చదివేటప్పుడు కూడా ఇదే బాధ మొబైల్స్ తీసేసుకునేవారు దొరికితే (వెతికితే!) మీ సునీల్ కి వచ్చినట్టుగానే మేము కూడా స్కూటీ పెప్ డిక్కీలో పెడితే ఆ రోజు వెతకనే లేదు మరుసటి రోజు వచ్చి వెతికారు కాని నేను మీలాగా ఇంట్లో పెట్టి వెళ్ళలేదు. నా బాగులోనే ఉన్నా వాళ్ళని చూసి మా మాష్టారు గారికి ఇచ్చేసా ఆయన కోపరేట్ చేశారు కనుక సరిప్పోయింది!
అమ్మో చాలా భయం వేస్తుంది కదా ఆ క్షణంలో! ఒకసారి మేము ఇలా వెళ్ళినప్పుడు పట్టిసీమ గోదావరిలో దొంగ ఊబిలో ఒకళ్ళు ఇరుక్కుపోయారు.
¨కోల్డ్ వాటర్ తాగకు బంగారం.. కోల్డ్ చేస్తుందీ. వేణ్ణీళ్ళు తాగొద్దు... వేడి చేస్తుందీ..ఊపిరి తీయొద్దు బంగారం నా శనొదిలి పోతుందీ, వాటీజ్ దిస్ దౌర్జన్యకాండా? మనం కాబోయే గ్రాడ్యుయేట్సా? కిండర్ గార్డెన్ కిడ్సా??, అమ్మాయిలకి స్టిక్కరు బొట్లూ అబ్బాయిలకి లిక్కరు బొట్లూ" కేవ్వ్వ్వ్
డాక్టర్ గారూ... ధన్యవాదాలు... ;)
ఇదొక అద్భుతం గా తోస్తుంది నాకు ;)
సౌమ్యగారూ.. మాకు సాగరతీరం 5km దూరమేనండీ.. ప్రతీ సంవత్సరం పిక్నిక్ కి వచ్చినవాళ్ళు ఇలా పోవటం రెగ్యులర్ గా పేపర్లో చదివే న్యూస్.ఆ సమయం లో మా న్యూస్ కూడా వస్తాది అనుకున్నా.
ధన్యవాదాలు.
సిరిసిరి మువ్వ గారూ.. అవునండీ రెగ్యులర్ గా చదివి, వదిలేసే న్యూస్.. ఆ పరిస్థితి లో ఎలా ఉంటుందో అనుభవమయ్యింది. క్షేమంగా బయటపడ్డారు కాబట్టీ సరిపోయింది. మా అదృష్టం లెండి ;)ధన్యవాదాలు
తెలుగు భావాలు గారూ.. అప్పల్రాజు వస్తే మాకు ఏ టెన్షన్ లేకపోనండీ. వాడు రాకే అన్ని తంటాలు పడ్డాం. ;) ధన్యవాదాలు
కొత్తావకాయ గారూ.. అవునండీ అంతా క్షేమం.
థాంక్యూ అండీ
రసజ్ఞ గారూ అందుకే, ముందు చూపూ, అతి జాగ్రత్తా ఉండాలి నాలాగా ;). అందరికీ మీకు లాగా సపోర్ట్ చేసే సార్ రావొద్దూ.. "టాక్ టౖమ్ వాడేసుకుంటారేమో" అని తెగ టెన్షన్ పడ్డారు మా వాళ్ళూ. ;) థాంక్యూ ;)
ఓహ్హ్.. ఊబి లో ఇరుక్కుపోయారా? ఎలా కాపాడారు మరీ??
ఫస్టాఫ్ అందమైన అనుభవం.. సెకండ్ హాఫ్ భయంకరమైన అనుభవం. రెండూ బాగా రాశారు. అక్కడక్కడా మీ స్టైల్ పంచ్‌లు అదిరాయి.
"...కోల్డ్ వాటర్ తాగకు బంగారం.. కోల్డ్ చేస్తుందీ. వేణ్ణీళ్ళు తాగొద్దు... వేడి చేస్తుందీ..ఊపిరి తీయొద్దు బంగారం నా శనొదిలి పోతుందీ "
rofl. :) :)
chaduvtunnanta sepu metho paatu akkade vunnama ane feeling vochidni.. antha bhayam kuda vesindi 2nd half lo...
mee mark punches quote cheyalante adoka full-length post ayela vundi.. superb narration!!
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ రాజ్ నీ ఇష్టైల్లోనే ఉంది మేటర్.పంచ్ లు కేకంతే.
"Things that were hard to bear are sweet to remember."
apt tilte...good narration !
హ్మ్ ! చాలా భయపెట్టారండి :((
చదవటానికే భయంకరంగా ఉందండి. అప్పటి వరకు నవ్వుతున్న నా మొహం ఎలా బిగించుకు పోయిందో!!! ఎంతైనా, ఇలాంటి పనులు కాస్త ఆలోచించి చేయండి బాబూ!!! హోళీకి వేరే ఎడారి ఏదో సెలెక్ట్ చేసుకోలేదుకదా...కొంపతీసి:)
చాణక్యా.. థాంక్యూ.. ;)
శ్రీ గారూ ధన్యవాదాలండీ.. హ్మ్మ్.. మేము అనుభవించిన భయం లో 10% కూడా ఇక్కడ రాయలేకపోయానని అనుకుంటున్నానండీ.
thanks for ur compliment :)
పప్పుసారు.. థాంకులు థాంకులు.. ;)
తృష్ణ గారూ..yeah.. true :)
thanQ
శ్రావ్యగారూ.. మామూలుగా ఆనందాన్నీ, బాధనీ పంచుకుంటారు. నేను భయాన్ని "పంచ్"కున్నానన్న మాట;) ధన్యవాదః
జయగారూ.. ;)))))
హోలీ ఆఫీస్ లోనే ప్లాన్ చేశాం లెండీ. బెంగుళూర్ లో ఎడారి సెట్ వెయ్యాలంటే బడ్జెట్ బరస్టైపోద్ది. ధన్యవాదాలండీ
ఫోన్ కి కూడా తెలీకుండా మిస్డ్ కాల్స్ ఇచ్చే మీరేట్రా మమ్మల్ననేదీ?
పంచ్‌లు బాగున్నై...climax బయపెట్టావ్ ... ఇలాంటి నీళ్ళ experience లు అందరికి ఉంటై అనుకుంట..నా ఇంటర్ టైం లో మా ఫ్రెండ్స్ నలుగురు...బాపట్ల బీచ్ కి వెళ్లి తిరిగి రాలేదు..నాకు కుదరక అప్పుడు వెళ్ళే లేకపోయాను..h2o is dangerous sometimes :(
బా...గా జలుబు చేసినప్పుడు ముక్కు చీదుకుంటే వచ్చే తాత్కాలిక ఆనందాన్ని తేరగా
అనుభవించేవాళ్ళం......మొదట ఇలానె మొదలెడతారు...హ..హ...ానుకుంటాము.
చివర్లొ ....అంతె బయం బయం గా కళ్ళు తెరకు
అంటించెసి....రాజా కధ లొకి లాక్కెళ్ళి ...
ఇంకా సాహసాలు ఉన్నాయ బాబు....
as usual mee blog post adhripoinde .e lantie locations ke vele napudu chuse enjoy chaile kane kore pramadlu tachikodudu. BTW e location maa voru Yelamanchili ke dagraaa :)
శేఖర్.... అవునా.? ప్చ్.. ;(
నువ్ మిస్సయ్యావూ... అంటే అదృష్టం కాక మరేమనాలి?
శశిగారూ.. హహహ.. ఉన్నాయండీ... ఇంకో సాహసం ఉందీ ఇలాంటిదే తర్వాత చెప్తా.. ;)
ధన్యవాదాలండీ.. ;)
రవితేజ గారూ... అలాంటి సమయాల్లో చూస్తూ ఎంజాయ్ చెయ్యలేమండీ. ఆటోమేటిక్ గా స్టెప్ పడిపోతుంది. ఎంజాయ్ చేసినంతవరకూ ఆ ఆలోచనే రాదు. ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు మన చేతుల్లో ఏం ఉండదు.
మీది యలమంచిలా?? కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ ;) ;)
ధన్యవాదాలు
Very well written!
happens :(
Hmmm....roju choostunna ee pagan...chadavataniki avvatalledu....starting enta saradaga start chesaru...last lo ant he bhayapettesaru...bavundi mothaniki...:)
hare &
Found In Folsom.. thank you very much ;)
hii.. Nice Post Great job. Thanks for sharing.
Best Regarding.
More Entertainment
me next post eppudu chestharandi babu waiting ikkada ...
తాగుబోతులు అడుగేసిన చోట మడిగట్టుకొని తడి గుడ్డ పెట్టే వంశం రా మాదీ... good one
భలే ఎంజాయ్ చేసాను..మీ సాహస యాత్ర ని..నీళ్ళు చాలా ఆకర్షణ..కానీ, చాల అపాయం కూడా..
అపాయాలు వేపే పరుగెడుతుంది పాడు మనసు..యువత కి.
బీర్లు, అమ్మాయిలు లేక పోయినా ,థ్రిల్ మిగిల్చింది, ఒక మరచి పోలేని జ్ఞాపకం మిగిల్చింది..
వసంతం..
రాజ్ కుమార్ గారు,
"తిరుమల కొండలు ఏడయినా ఆ కొండల రాయుడు ఒక్కడే.. తెలుగున పదములు ఎన్నున్నా ఆ
తియ్యందనమూ ఒక్కటే... అందరి దారులు వేరయినా ఆ స్పందన తెలిపే మార్గం ఒక్కటే... ఎప్పుడయినా, ఎక్కడయినా AIRTEL..... ఒక్కటేఏఏఏఏఏఏ"
ఈ పోస్ట్ నేను చదివేలా చేసింది ఈ పాట తో నాకున్న అనుబంధం. చదువుతున్నంత సేపూ ఎంతో సరదాగా అనిపించింది. కానీ చివరిలో అంతే అలజడి. బాగా రాసారు.
Post a Comment