Thursday, April 5, 2012

రచ్చ : ఒక "రొటీన్ రొట్ట మాస్ మసాలా" తెలుగు చిత్రం


రెంజ్ లాంటి రొటీన్ కి భిన్నమయిన సినిమా ఫ్లాప్ టాక్ తో మొదలయ్యి, మిక్స్డ్ టాక్ తెచ్చుకునే లోగా  కొంచెం

అర్ధవంతమయిన సినిమాలు తీయగల భాస్కర్ లాంటి దర్శకుడిని అడ్డమయిన తిట్లూతిట్టీ దాన్ని పాతరేసి పారేసిన మా మెగా బ్రదర్స్ ఈ సారి హిట్టయ్యే సినిమా యే కానీ, తలనొప్పి రప్పించని సినిమా తీయకూడదని ఎంచుకున్న సినిమానే రచ్చ.

"ఈ సినిమాని ఓకే చేసిందీ, నాకు పునర్జన్మనిచ్చిందీ మెగాస్టార్ చిరంజీవే..." అని ఒళ్ళు పులకరించి పులిసిపోయేట్టు, పూనకమొచ్చినట్టు డైరెక్టర్ చెప్పినప్పుడే అర్ధమయిపోయింది ఎలా ఉంటుందో. మణిశర్మ కూడా అందుకు తగ్గట్టూ
ఒక్కసారి వినగానే డిలీట్ చేసిపారెయ్యాలనిపించే పాటలు అందించాడు.

ఇహ స్టోరీ విషయానికొస్తే............ ఏంటీ స్టోరీ కావాలా??

"ఆది" సినిమా చూశారా?? బన్నీ??? వర్షం??? దేవదాసు?? బద్రీనాధ్?? చిరుత?? అతనొక్కడే?? ఊసరవెల్లి???  ఈ సినిమాలన్నీ కలిపి కిచిడీ చేస్తే అదే కధ. (ఒక్కో సినిమా నుండీ ఒక్కో సీన్ గుర్తు రాకపోతే నన్నడగండి)

హమ్మయ్యా...సింగిల్ లైన్ లో కధ చెప్పేసేను. డైరెట్రు సంపత్ నందికి నా లాల్ సలాం.

రామ్ చరణ్ ఎలా చేశాడూ??

పెద్ద పీకడానికేం లేదు సినిమాలో. అరివీర భయంకరంగా నవరసాలూ మిక్స్ చేసి మిల్క్ షేక్ చేయాల్సిన పని లేదు. ఆ అవసరమూ లేదు, అవకాశమూ లేదు. తన క్యారెక్టర్ మేరకు బాగానే చేశాడు.
కధానుగుణం గా ఫార్ములా ప్రకారం వచ్చే పాటల్లో డాన్సులేశాడు.సీరియస్ గా మూతి బిగించి ఫైట్స్ చేశాడు. మిగిలిన చోట్ల పంచ్ డైలాగులు, పవర్ఫుల్ గా చిరంజీవి ని తలిపించేట్టూ చెప్పేడు.
పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఆడియో రిలీజ్ కి ముందే అఫిషియల్ గా లీకయ్యి హిట్టయిన "రచ్చ" టైటిల్ సాంగ్ లో పెద్దగా డ్యాన్స్ లేకపోవటం. జల్సా టైటిల్ సాంగ్ లో పవన్ లాగా పాటంతా
వాకింగ్ చేస్తా ఉంటాడు. రెండే రెండు స్టెప్ లు. అవి చూసి మా ఫ్యాన్స్ అంతా "ఊఊఊఊఊఊఊఒ..ఆఆఆఆఆఆఆఅ... ఏఏఏఏఏఏఏఏఏఏఏ" అని కేకలేసుకున్నాం. (కాలికి దెబ్బ తగిలిందండీ.అయినా మా ఓడు అదేం లెక్క చెయ్యకుండా ఒక తపస్సులాగా, ఒక యజ్ఞం లాగా నడిచీ, కాళ్ళూ చేతులూ కదిపి పాటలు పూర్తి చేశాడు. అర్ధం చేసుకోరూ..)
పెద్ద పాజిటివ్ పాయింటేమిటంటే... "డిల్లకు డిల్లకు డిల్లా" సాంగ్ లో డ్యాన్స్... సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే.. టాప్ లేపేశాడు. ఇరగదీసి, అరగదీసి, వాయగొట్టి వడ్డించాడు. (ఈ పాటకే కాలు డ్యామేజ్ అయిపోయుంటాది.)

తమన్నా....

అహో.. నాకు చాలా ఇంట్రస్ట్ గా ఉంది తమన్నా గురించి చెప్పడం. రిన్ సబ్బెట్టి ఉతికీ, నీలి మందులో ముంచి తీసినట్టూ.. ఒళ్ళంతా ఫెవికాల్ పట్టేసినట్టూ... తెల్ల తెల్లగా..సూపర్ గా ఉంది.
అవసరమయినంతా అవసరమయినవన్నీ చేసీ, చూపించీ టికెట్ డబ్బులు కిట్టించింది. నటనే కాదు డ్యాన్స్ కూడా బా చేసింది. వానా వానా వెల్లూవాయి పాటలో రచ్చ చేసింది నిజంగానే... !  ష్..ష్... ఈ కింద చూడండీ..ఫైట్స్...

అబ్బో కేక.. హీరో ఎగిరి తంతాడు. దెబ్బకి ఇలన్లు ఎగిరెగిరి అల్లంత దూరన పడిపోవాల్సిందే... ఈ కత్తిచ్చుకు పొడిస్తే కుట్లు పడాల్సిందే... గొడ్డలిపట్టుకు నరుకుతా ఉంటే.. నా సామిరంగా రక్తం చిందాల. చేతులెగిరిపోవాల. అంతేనండీ..అంతే.. మేము తెలుగు సినిమా ఆడియన్స్... మాకిలాగే ఇష్టం... ఆ మూర్ఖుడు పవన్ కళ్యాణ్  నేచురాలిటీ అని చెప్పి ఇంకా పాతకాలపు ఫైటింగ్లు చేస్తా ఉన్నాడు. ఎప్పుడు మారతాడో ఏమో.

పాటల్స్....

మెలోడీ బ్రహ్మ మణిశర్మ... కాదు కాదు ఈ సినిమా నుండీ "మాస్ బ్రహ్మ". "పెంట"స్టిక్ మ్యూజిక్కండీ. మా బాస్ హిట్ సాంగ్... "వానా వానా వెల్లువాయ్" పాటని రిమిక్స్ చేశాడూ... ఇని సచ్చిపోయినా పాపం లేదు.
డైరెక్ట్ గా స్వర్గానికి పోతాం. మళ్ళీ నరకానికి పోవాల్సిన పనిలేదు.

వానా వానా వెలూవాయె. వాయె.. వాయే... కొండా కోనా కుళ్ళీ పోయే.. పోయే.. పోయే..

ఇహ  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గిటార్ల తీగలు తెంచేశాడు.... డ్రమ్ముల దుమ్ము దులిపేసేడు. "హి ఈజ్ ది మిస్టర్ తీస్ మార్ఖాన్ రచ్చా..." (కంగారు పడకండి ఇది తెలుగు పాటే)

కామెడీ....

కామెడీ ఉందో లేదో క్లారిటీ తో చెప్పలేను  గానీ.... స్టార్ కమెడియన్లు ఉన్నారండీ.. బ్రహ్మీ, ఆలీ, రవిబాబు.. ఎమ్మెస్ నారాయణ.(వాళ్ళు కనిపించగానే నవ్వుతాం కదా కారణం లేకపోయినా)
ఒకటీ, రెండు సార్లు నవ్వేం లెండీ. మరీ ఎక్కువ నవ్వితే పిచ్చోళ్లనుకోరూ???

స్క్రీన్ ప్లే...

ఇదిగో.. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మహాడ్డం నా వల్ల కాదు. ఒకటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్  వీక్ గా అనిపిస్తాదండీ. అలా ఎందుకుందో సెకండ్ హాఫ్ లో తెలుస్తాది. అర్ధం కాకపోతే సినిమా చూడండి పోయి.

డైలాగ్స్....

ఆ.... ఇదీ అసలు పాయింటూ.. మా ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయే పాయింటూ.. నిజంగానే బా రాశారు. కంచాలు కిందపడేసినట్టూ... పంచులూ...పంచర్లు పడిపోయేలాగా అంచుల దాకా తీసుకెళ్ళొదిలాడు.
దాదాపు కుదిరినప్పుడల్లా... మెగాస్టార్, మా నాన్న, నా జీన్స్, నా రక్తం..., గెలుపూ, నా వెనక ఫ్యాన్స్ లాంటి డవిలాగులతో హాలంతా రచ్చ రచ్చే...
సెకండ్ హాఫ్ లో జనాల్ని రంజింప చేసిన సీన్లు ఉన్నాయీ అంటే... వాటికి సంపత్/(పరిచూరి బ్రదర్స్??) రాసిన డైలాగ్స్ వల్లే. క్లైమాక్స్ లో పరిచూరి వెంకటేశ్వర్లు, తమన్నా లు చెప్పే డైలాగ్స్ కి ఫ్యాన్స్ కి పూనకం వచ్చేస్తుంది. (మాస్ హిస్టీరియా అంటే ఇదే అన్నమాట)
నాకు కొన్ని డవిలాగులే కొంచెం కొంచెం గుర్తున్నాయ్...  ఫస్ట్ డే ఫస్ట్ షో అవ్వటం తో మిగిలినవన్నీ గాల్లో, కేకల్లో కలిసిపోయాయ్...

1.నాకు గెలుపిష్టం.. గెలుపులో బలుపిష్టం
2.కత్తిలోని పదును, బుల్లెట్ లోని స్పీడు, లావాలోని వేడీ ఉన్న మగాడి కోసం చూశాం.
౩.తాటిచెట్టంత పొడుగూ, పాపికొండంత బాడీ  ఉంటే సరిపోదురా.. కళ్ళళ్ళో పొగరుండాలీ, గుండెల్లో దమ్ముండాలి.
4.మా వాడు వచ్చిందే రికార్డ్స్ క్రియేట్ చెయ్యడానికి... (హీరో ఇంట్రడక్షను)
5. నువ్వరిస్తే అరుపులే.. నేనరిస్తే మెఱుపులే...
6.నన్ను పెంచిన తండ్రి కోసం నా ప్రాణాలే తీసుకోబోయాను. నా కన్నతండ్రి ఆశయం కోసం ఎందరి ప్రాణాలయినా తీస్తాను.
7.వెనక చూసుకొని తొడలు కొట్టే టైప్ కాదు రా నేనూ....(*&$$$$$$$$$&**)@@---------------------------- (ఆ తర్వాతి ముక్కలు గోలలో వినిపించలేద్ద్ద్ద్ద్ద్...)
8.రికార్డులు కొట్టడానికి వయసుతో పనేముందీ??
9.యుద్ధం లో మొదట చచ్చిపోయేది సైనికుడే నాన్నా అని చెప్పి మరీ పోయాడ్రా నా కొడుకూ..
10. బెట్టా?? బస్తీ వెర్సస్ మస్తీ... చమట వెర్సస్ సెంటూ.
12. గెలిచే అలవాటు నాకు బై బర్త్ వచ్చింది.

సెమీ ఫైనల్గా చెప్పేదేంటీ??? సినిమా చూడొచ్చా ?? బాగుందా?? బాలేదా???

అది చెప్పడానికి నేనెవర్నీ?? నే వెళ్ళొద్దని చెప్తే మానేస్తారా? చూడమని చెప్తే వెళ్ళీ చూసేస్తారా? ఎవరికి వారు వెళ్ళి అనుభవం మీద తెలుసుకోవాలి.
అయినా నాకు నచ్చిన సినిమాలన్నీ హిట్టయ్యాయా? నచ్చనివన్నీ ఫ్లాపయ్యాయా?
"లోకో భిన్న రుచీ" అన్నారు. అంటే లోకం లో బోల్డు రకాల రుచులున్నాయీ.. అన్నీ అందరికీ నచ్చవ్ అని అర్ధం.

ఫైనల్ గా చెప్పేదేమంటే... ఇదొక రొటీన్, మాస్ మసాలా చిత్రం. మా ఊళ్ళో ఇరగ ఆడేసే అవకాశాలున్నాయ్. మల్టీప్లెక్స్ జనాలు చూడరు. కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళూ, ముఖ్యంగా ఫ్యాన్స్, పండగ చేసుకోవచ్చు.
టాక్ అయితే సూపరో సూపరు అని ఉంది ప్రస్తుతానికి.
చరణ్ నుండి ఇక అన్నీ ఇలాంటి ఫార్ములా సినిమాలే చూడాలేమో కర్మ... అని ఫీలవుతున్నా.. ;( ;( ;( [ఫ్లాపయినా పర్లేదు.. ఆరెంజ్, వేదం, రంగం లాంటి సినిమాలు చెయ్యాలనీ కనీసం తనలోని నటుణ్ణీ, డాన్సర్ నీ పూర్తిగా చూపించే సినిమా చెయ్యాలని ఒక మెగాభిమానిగా నా కోరిక]

ఆడియో ఫంక్షన్ లో మా అన్నయ్య సిరంజీవి "ఆరెంజ్ లో మిస్సయినవన్నీ ఇందులో ఉంటాయన్నాడు"నిజంగా సత్య హరిచ్చంద్రుడే... అవును...
ఇందులో నాటు బీటు పాటలున్నాయ్, ఫైటింగులున్నాయ్, సెన్సార్ కట్టయిన డైలాగులున్నాయ్, వాన పాటలున్నాయ్, ఆ పాటలకి "సింగరేణుందీ..బొగ్గే నిండిందీ.." లాంటి గొప్ప సాహిత్యం ఉందీ.
అరడజను ఇలన్లున్నారు. హీరో చేత నరికించుకోడానికి వందలమంది జనాలున్నారు.ఆఆఅ.. మరిచిపోయాను.. U/A సెర్టిఫికేట్ కూడా ఉంది.


ఇంకేం కావాలీ?? మేం కోరుకునేవి ఇయ్యే... మేము తెలుగు సినిమా ప్రేక్షకులం.. పిచ్చోళ్లం...

హిట్.. హిట్.. సూపర్ హిట్.... బంపర్ హిట్...  హండ్రెడ్ డేస్ పక్కా....
రచ్చ..  మొదటి రోజు కలెక్షన్లు...  ఇన్ని కోట్లు...
మొదటి వారం కలెక్షన్లు.... అన్ని కోట్లు...
నాలుగు వారాల టోటల్ గ్రాస్... అప్ప్పుడు చెప్తాలెండి.  అప్పటిదాకా ఉంటే.


మా నెక్స్ట్ ప్రోజెక్ట్స్... ట్రయిలర్స్....

దమ్ము..... ప్రచండ చండ మార్తాండ తేజా.. రాజాధి రాజాధి రాజా....

ఈగ... గుయ్.య్ య్య్య్య్య్య్య్య్య్య్.... 1 నిన్ను చంపటం.. 2 నిన్ను చంపటం.. 3..4..5.....9 నిన్ను చంపటం.

గబ్బర్ సింగ్... నాక్కొంచెం తిక్కుందీ... కానీ దానికో లెక్కుందీ..

ఈ ఎండాకాలం ఇరగదీసుడే.....!

32 comments:

ఫోటాన్ said...

అదన్న మాటా సంగతి...
తమన్నా బాగుందని చెప్పావు గా... సూడక తప్పుతుందా . :)

సూపర్ గా వుంది రివ్యు,,
నువ్వు రాస్తే అరుపేలే :)))

Sri Kanth said...

ఇదిగో అబ్బాయ్ రాజ్ కుమారూ.. రివ్యూ రాసే పద్దతి ఇదేనా? అహా.. ఇదేనా అంటా. సినిమాటోగ్రఫీ గురించి చెప్పావా? ఎడిటింగ్ గురించి చెప్పావా? స్క్రిప్టు గురించి అయితే .. డైరక్టుగానే తెల్వదనేస్తివి..!! పోనీ ఇంటర్వల్ లో బిగ్ బ్యాంగుందా? కథలో ట్విస్టుందా? ఇందులో హీరో నీకు ప్యాసివ్ గా అనిపించాడా, యాక్టివ్ గా అనిపించాడా? అసలు మన తమిల సినిమాలలో ఉన్న ఆర్టు ఇందులో ఉందా.. ఆ డైరక్ట్ర్లకున్న కళా తృష్ణ ఈ డైరక్టరుకు ఉందా.. నాలుగైదు సీన్లన్నా మరుగు దొడ్లలో తీసినవి ఉన్నాయా.. జిడ్డుగారే మొహాలతో ఉండే ఆర్టిస్టులు ఎంత మంది? కనీసం ఒక్క సామాజిక కోనాన్నైనా హత్తుకున్నారా? పోనీ కనీసం స్పృషించారా? వీటి గురించి వివరాలేమీ రాయకుండా.. రివ్యూ రాసేత్తే.. మేమేమనుకోవాలా?

కాకపోతే.. ఇవేమీ రాయకపోయినా ఎందుకో బాగానే రాశావని పిస్తాంది.. :-)

సిరిసిరిమువ్వ said...

ఫస్టు డే ఫస్టు షో చూసేసారన్నమాట! చాలా క్విక్ రివ్యూ వ్రాసేసారే! ఈ సినిమా ఇలానే ఉంటుందని ఎక్స్పెక్టు చేసా!

ఆ.సౌమ్య said...

రచ్చ రచ్చ చేసావ్ రాజ్ :))))

శివరంజని said...

రచ్చ- రాజ్- రివ్యూ ..కాదు కాదు రాజ్- రివ్యూ- రచ్చ

హరే కృష్ణ said...

:))))))))

చిలమకూరు విజయమోహన్ said...

నాది కూడా సౌమ్య,శివరంజని గార్ల మాటే రచ్చ రచ్చే :)

ఇందు said...

హహ సూపర్ రాసారు రాజ్ :) పైన హర్ష చెప్పినట్టు మీరు రివ్య్ రాస్తే అరుపులే ;) మీకు తమన్నా అంటే ఎందుకండీ అంత కచ్చా??? బిర్ల వైటు సిమెంటులొ ముంచినట్టూ, ఫెవికాల్ రాసినట్టు... అని అలా వర్ణిస్తారు?? :)) పాపం :))))

శశి కళ said...

హమ్మయ్య చూడొచ్చు....నువ్వు వ్రాసావు అనంగానే ఏమి వ్రాస్తావో అని చూసేసా....డిలిట్ చేసే పాట్లలు...
గాల్లో కేగిరే ఫైట్లు ....విజిల్ వేసే డైలాగ్లు ..చూసేస్తాము....ఏమైనా నీ రివ్యు కేక...

రాజ్ కుమార్ said...

అవునయ్యా ఫోటానూ..మన తమన్నా రచ్చ ;) థాంక్యూ
రివ్యూ రాసే పద్దతి ఇదేనా? అహా.. ఇదేనా అంటా?>>>

శ్రీకాంత్ గారో.. "రివ్యూ ఇలాగే రాయాలని బుక్కేమన్నా రాశారాండీ?"(వజ్రోత్సవాల్లో మోహన్ బాబు ఇస్టైల్)
అయినా విమర్శించెయ్యడానికీ, రేటింగులివ్వటానికీ, మనమేమన్నా దిగొచ్చిన విమర్శకులమా?? టికెట్ కొని కొట్టించుకునే ప్రేక్షకులం. నచ్చిందా? ఏది నచ్చిందీ? ఎందుకు నచ్చిందీ?
నచ్చలేదా? *&$@%&*# అని తిట్టుకొని ఏడుస్తాం అంతే ;)

>>సినిమాటోగ్రఫీ గురించి చెప్పావా? ఎడిటింగ్ గురించి చెప్పావా? స్క్రిప్టు గురించి అయితే .. డైరక్టుగానే తెల్వదనేస్తివి..!!
పోనీ ఇంటర్వల్ లో బిగ్ బ్యాంగుందా? కథలో ట్విస్టుందా?
>>
కెమేరామెన్ సమీర్ అధ్బుతమయిన పనితనాన్ని కనబరిచాడు. ఆఖరికీ మా రాంచరణ్ కూడా అందంగా ఉన్నాడు. ఎడిటింగ్ లో జర్కులు గట్రా లేవండే. స్క్రిప్టా?? దాన్ని కలగూర అంటారు ;)
ఇంటర్వెల్ లో బ్యాంగుందండీ. కార్లు గాల్లోకి లేస్తయ్. కధ లో కేక ట్విస్ట్ ఉందీ ;)

>>ఇందులో హీరో నీకు ప్యాసివ్ గా అనిపించాడా, యాక్టివ్ గా అనిపించాడా?>>>
ఏక్టివ్ హీరో ప్యాసివ్ గా మారిపోయినట్టూ కనిపించాడు ;)

>>అసలు మన తమిల సినిమాలలో ఉన్న ఆర్టు ఇందులో ఉందా.. ఆ డైరక్ట్ర్లకున్న కళా తృష్ణ ఈ డైరక్టరుకు ఉందా>>>

తమిళ సినిమాల మీద పడి ఏడవమంటే ఏడుస్తామండీ. ఆ డైరెక్టర్ల ఆర్టూ, కళా తొక్కా,తోటకూరా మాకెందుకండీ??

>>నాలుగైదు సీన్లన్నా మరుగు దొడ్లలో తీసినవి ఉన్నాయా.. జిడ్డుగారే మొహాలతో ఉండే ఆర్టిస్టులు ఎంత మంది>>>
భలేవారే.. అప్పుడూ సినిమా కి సెంట్ బాటిల్స్ పట్టుకెళ్ళాల ;). మా ప్రొడ్యూసర్ బాగా రిచ్చండీ. చక్కా అందరికీ అంగుళూన్నర మందాన మేకప్ కొట్టాడు ;)

కనీసం ఒక్క సామాజిక కోనాన్నైనా హత్తుకున్నారా?>>>
సామాజికవర్గాన్ని హత్తుకున్నామండే.. ;))))))

థాంకులు.. ;))))))

రాజ్ కుమార్ said...

సిరిసిరిమువ్వగారో.. యెస్స్... ఫ్యాన్స్ షో అండీ.. అందరమూ అదే అనుకున్నాం ;) థాంకులు

సౌమ్యగారూ, శివ్వరంజని గారు, హరే, విజయ్ మోహన్ గారూ థాంక్యూ ;)

రాజ్ కుమార్ said...

ఇందుగారూ.. భలేవారే తమన్నా.. మన తమన్నా అంటే నాకు కచ్చ అంటారా? తళ తళ లాడే తెలుపు...ని మెచ్చుకోవటం అన్నమాట ;)

శశికళ గారూ... మీకు ఎలా అర్ధమయ్యిందో నాకు తెలియట్లేదు.. కన్ఫ్యూజన్ లో మళ్ళీ చూసేశాలా ఉన్నాను ;)

గిరీష్ said...

>>మూర్ఖుడు పవన్ కళ్యాణ్>>

objection your honor..

మధ్యలో పవ ఏం చేశాడయ్యా రాజ్.. :)

nice review as usual in ur style..

గిరీష్ said...

ఇంకో డయిలాగ్..
విలను ఎవడ్రా నువ్వు, నీ కేరాఫ్ ఏంటి అని అడిగితే..
మనోడు, బలుపు కేరాఫ్ గెలుపు అంటాడు.. :)

Raviteja said...

HAHAHAHA ఒళ్ళంతా ఫెవికాల్ పట్టేసినట్టూ... తెల్ల తెల్లగా..సూపర్ గా ఉంది superrrrrrrrr :D

బులుసు సుబ్రహ్మణ్యం said...

నాకర్ధం అయిందేమంటే తమన్నా కోసమే సినిమా చూడాలి అని.
రివ్యూ గురించి చెప్పేదేముంది. మీ ఇస్టేయిల్ లో కేకే.

రాజ్ కుమార్ said...

యెస్.. గిరీష్.. పవన్ మూర్ఖుడు.. ఎవ్వడి మాటా వినడు కాబట్టే.... తనకంటూ ఒక స్టైల్నీ, ఫ్యాన్స్ నీ క్రియేట్ చేసుకున్నాడు.
కొత్తగా ట్రై చేస్తూ, ఒక మూస లో పోకుండా హిట్టొచ్చినా, ఫ్లాపొచ్చినా తనకి నచ్చిన
సినిమాలు చేస్తున్నాడు. హిట్ కోసం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీయటం లేదు. అర్ధం చేసుకోవూ... ;)

రవితేజ గారూ.. ;))))))

బులుసుగారో... మీ లిస్ట్ లో ఇలియానా ని తీసేసి తమన్నాని పెట్టేస్తారు.. థాంక్యూ ;)

vasantham said...

ఒక రొటీన్ మసాల సినిమా ని కళ్ళ ముందు కన్పించేసారు..
ఇంక ఓ వంద మిగిలింది..సినిమా టికెట్ ఖర్చు, ఎలాగు మన 'మా ' టీ వి. మామ లున్నారు కదా..
తప్పించుకోలేం.. ముందు ముందు..సూపర్ గా ఉంది.. మీ రివ్యూ.థాంక్స్..ఫర్ ది అలెర్ట్..
వసంతం.

Zilebi said...

ఒక 'రాటన్' రోటీ మాంసం మసాలా !

చీర్స్
జిలేబి.

rangaraju said...

రొటీన్ సోది సినిమా. రాంచరణ్ డైలాగ్ మాడ్యులేషేన్ బాలేదు. పవర్‌ఫుల్ సన్నివేశాలలో డవిలాగులు పట్టి పట్టి చెప్పాడు.జూనియర్ మా తాత, మా బాబయ్ అంటే వంశం సోది అని దులపరించుకున్న మెగా అభిమానులు ఈ సినిమాలో వినిపించిన డైలాగ్స్‌కి ఏమంటారు ? బిజినెస్‌మ్యాన్‌లో ఉన్నట్లే ఈ సినిమాలోనూ బీప్‌లే బీప్‌లు. ఆఖరికి ఝాన్సి చేత ఈ కుర్రాడిని చూస్తే నాకే వేసెయ్యాలని ఉంది అనిపించారు.హతోస్మి.పవన్‌కల్యాణ్ కొత్తగా ట్రై చేసిన సినిమాలు ఏమితో వివరిస్తారా?

రాజ్ కుమార్ said...

వసంతం గారూ.. థన్యవాదాలండీ ;)))))

జిలేబీ గారూ... అర్ధం కాలేదండీ... నెనర్లు ;)

rangaraju గారూ... నా వరకూ చరణ్ డైలాగ్ మాడ్యులేషన్.. పరవాలేదు. బాగానే చెప్పాడు.
యెస్... పదే పదే మా వంశం, తొడలు కొట్టే టైప్>>> ఫ్యామిలీ డైలాగ్స్ నాకూ ఇబ్బందనిపించింది
ఇప్పటి వరకూ ఇలాంటి వాటికి దూరంగా, మర్యాదగా ఉన్నారు చిరు/పవన్/చరణ్.. ఈ సినిమాకి
ఎందుకు పెట్టారో మరి. ;(

సెన్సార్ స్ట్రిక్ట్ అయ్యింది కదండీ.. బీప్ లు కామన్. లేకపోతే బీప్ లకి బదులు బూతులే వినబడి ఉండేవి ;)
బాలు/పంజా ల పోలికలని పక్కన పెడితే.. పవన్ చేసిన ప్రతీ సినిమా డిఫరెంట్ సబ్జెక్ట్సే.
అఫ్కోర్స్.. అందులో అట్టర్ ఫ్లాప్స్ ఉన్నాయనుకోండి. వివరించాలంటే కమెంట్ కాదండీ పోస్ట్ రాయాల్సొస్తాదేమో ;))))))

రసజ్ఞ said...

అబ్బబ్బ ఏం వ్రాశారండీ? ఒక రేంజిలో ఉందిగా! మొన్ననే అనుకున్నాను ఈ మధ్య మీరు సినిమా రివ్యూలేమీ వ్రాయటం లేదేమిటా! అని. హమ్మయ్యా నా కోరిక తీర్చేసారు. సినిమా మీకు అత్యద్భుతంగా నచ్చేసి ఆ ఆనందాక్కసుని పది మందితో పంచుకుని వారికైనా మనశ్శాంతి కలగాలి అనుకున్నప్పుడే మీరు రివ్యూలు వ్రాస్తారనమాట ;)

rangaraju said...

రాజ్‌కుమార్ గారు, రెండు వాక్యాలతో మీతో విబేధించదలచుకున్నాను.

>>ఇప్పటి వరకూ ఇలాంటి వాటికి దూరంగా, మర్యాదగా ఉన్నారు చిరు/పవన్/చరణ్.

చెప్పుకోవడానికి చిరంజీవి కుటుంబంలో ఎన్‌టియార్ లా ఒక లెజెండ్ లేడు. అల్లు రామలింగయ్య ఉన్నా ఆయన కమెడియన్. కాబట్టి ఆయన చెప్పుకోలేదు. పవన్,చరణ్ చెప్పుకుంటూనే ఉన్నారు.

పవన్ అనగానే చిరంజీవి రెఫెరెన్సు ఉన్న సినిమాలు నాకు గుర్తున్నవి తన మొదటి సినిమా, ఖుషి, జానీ,
బంగారం ( చిరు ఫోటో ఉన్న టీ షర్ట్ వేసుకోని చేసే ఫైటింగ్లు),అన్నవరం (మెగాస్టార్ బిస్కెట్స్),లేటెస్టుగా పంజా . చరణ్ మొదటి సినిమాలో తండ్రిని గుర్తు చేసే డైలాగులు బోలెడు. ఇన్స్పిరేషనే తండ్రి సినిమా. రెండవ సినిమాలో ఏకంగా తండ్రి పాట పెట్టి ఆయనతో నటించాడు. మూడవది ఆరంజ్.అందులో ఏం లేదు. నాల్గవది రచ్చ. ఇందులో ఎన్ని వున్నాయో మీకు తెలుసు. చేసిన నాల్గు సినిమాల్లో మూడు సినిమాల్లో తండ్రి రెఫెరెన్సు ఉంది. ఇక అల్లు అర్జున్ అంటే వెంటనే గుర్తోచ్చేవి గంగోత్రి (మావయ్యది మొగల్తూరు), హ్యాపీ (తొలిప్రేమ సన్నివేశాలు,పవన్‌కల్యాణ్ రెఫెరెన్సు ), దేశముదురు (ఖైదీ సన్నివేశాలు).ఇవి నాకు గుర్తున్నవి మాత్రమే. ఇన్ని సినిమాలు పెట్టుకుని ఎప్పుడూ ఏమీ చెయ్యనట్లు నందమూరి వంశం మీద విమర్శలు దేనికి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లే ఉంది.

>>పవన్ చేసిన ప్రతీ సినిమా డిఫరెంట్ సబ్జెక్ట్సే.

ఒక్క జానీ తప్ప డిఫెరెంట్ అనిపించే పవన్ మూవీ ఏదీ లేదు. మిగతా సినిమాలు దాదాపు ప్రతి హీరో చేస్తున్నాడు. అభిమానులు కాబట్టి మీకు ఆయనొక సత్యజిత్‌రే లా, ఆయన సినిమాలు పథేర్‌పాంచాలి లా కనిపిస్తే ఆశ్చర్యం లేదు. అందుకే అందరివాడు, స్టాలిన్, బంగారం, పులి ,బద్రినాథ్, రచ్చ సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాలు మీకు హాస్యాస్పదంగా కనిపించవు. ఇవే సన్నివేశాలు నందమూరి సినిమాల్లో ఉంటే మాత్రం ఆనిమేటడ్ జిఫ్ పెట్టి, ఆ హీరోలను కించపరుస్తూ కుళ్ళు జోకులతో నిండిన రెండు పేజీల వ్యాసం రెడీ..భేషో భేషు.

మీరీ కామెంటును ప్రచురిస్తారనే అనుకుంటాను

రాజ్ కుమార్ said...

rangaraju gaaroo.

మీరు అపార్ధం చేసుకున్నారు..
నిజానికి నేనే కొంచెం క్లారిటీ తో చెప్పలేదు అనుకుంటున్నా ఇప్ప్పుడు.

>>>ఫ్యామిలీ డైలాగ్స్ నాకూ ఇబ్బందనిపించింది
ఇప్పటి వరకూ ఇలాంటి వాటికి దూరంగా, మర్యాదగా ఉన్నారు చిరు/పవన్/చరణ్.. >>>

ఇక్కడ "ఫ్యామిలీ డైలాగ్స్, వంశం, తొడలు కొట్టే టైప్" అంటే అంటే వాళ్ళ సొంత ఫేమిలీ మీద గొప్పగా రాసుకున్నవాటి గురించి కాదు. అవతలి వాళ్ళని టార్గెట్ చేసి రాసినవి
ఈ సినిమా లో "తొడలు కొట్టే టైప్ కాదురా నేనూ అనే డైలాగ్, ఒకరిని ఉద్దేశించి రాసినది. దీని గురించి చెప్పాను. ఇది నాకు ఇబ్బంది ని కలిగించిందని.
మీకు క్లియర్ అయిందనే అనుకుంటున్నా.

ఇలా టార్గెట్ చేసి రాసిన డైలాగ్స్ మెగా ఫ్యామిలీ నుండీ ఇప్పటీ వరకూ లేవు అని అనుకుంటున్నా. (ఉంటే చెప్పండీ తెలుసుకుంటాను. నా అభిప్రాయం మార్చుకుంటాను)

వారసులు గా వచ్చాక పెద్దోళ్ల పేర్లు చెప్పుకోవటం తప్పని నేననుకోవటం లేదు. ఎందుకంటే వారసుల సినిమాకి వెళ్ళేదే వాళ్ళ నాన్న, తాత, అన్న మొదలైన వాళ్ళని చూసి చాలా
వరకూ. ఏదయినా ఒక లిమిట్ దాటితే ఎవరికయినా బోర్ కొడుతుందీ. ప్రస్తుతానికి నాలుగు సినిమాలే కదా...అయ్యాయి. ఫ్యూచర్ లో ఇక్కడ కూడా ఈ టైప్ కమెంట్స్ వస్తయేమో..

>>>ఇన్ని సినిమాలు పెట్టుకుని ఎప్పుడూ ఏమీ చెయ్యనట్లు నందమూరి వంశం మీద విమర్శలు దేనికి>>>

ఈ రివ్యూ లో నేను టచ్ చెయ్యని పాయింటిదీ.ఇక్కడ నేను ఏ వంశం మీదా విమర్శలు చెయ్యలేదు. చేసే వాళ్ళని అడగండీ.

ఒక్క జానీ తప్ప డిఫెరెంట్ అనిపించే పవన్ మూవీ ఏదీ లేదు. మిగతా సినిమాలు దాదాపు ప్రతి హీరో చేస్తున్నాడు.>>>>

ఇది మీ ఉద్దేశ్యం.. డిఫరెంట్ సబ్జెక్ట్ చేస్తాడని నా ఉద్దేశ్యం. మిమ్మల్ని మార్చుకోమనీ, మీది తప్పనీ నేను చెప్పటమ్ లేదు. మీరు వివరించమని అడీగారు కాబట్టీ నా ఉద్దేశ్యం చెప్పాను.


>>>అందుకే అందరివాడు, స్టాలిన్, బంగారం, పులి ,బద్రినాథ్, రచ్చ సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాలు మీకు హాస్యాస్పదంగా కనిపించవు.>>>>>

హహాహ్... నేను చిరు/పవన్ ల అభిమానినే అండీ. కానటం లేదు. అలా అని వాళ్ల సినిమాలన్నీ నాకు నచ్చేస్తాయనీ, వాళ్ళూ తీసిన చెత్త సినిమాలకి కూడా జై కొట్టే టైప్ అనీ కాదు.
ఈ అందరివాడూ, పులీ, సినిమాలు రిలీజయ్యేనాటికి నేను రివ్యూలు రాయటం మొదలెట్టలేదు.
ఏది ఏమయినా టికెట్ పెట్టి చూసిన నాకు సినిమా నచ్చాలి ముందు. నచ్చకపోతే ఎవరయినా ఒకటే...తిట్టుకుంటాను. నచ్చితే ఏ హీరోయినా మళ్ళీ మళ్ళీ చూస్తాను.

మీకు డౌటుంటే నా బ్లాగ్ లో తీన్మార్, బద్రీనాధ్ ల రివ్యూలు చూడండీ ఒకసారి. మీకు ఒక క్లారిటీ రావొచ్చు.

నేనే మనుకుంటున్నాన్ంటే నా రివ్యూ ని కంప్లీట్ ఆపోజిట్ గా అర్ధం చేసుకున్నట్టున్నారు మీరు. అందుకే ఇంత డిస్కస్ చేసుకోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఒక సారి మళ్ళీ చదవండీ. ఒక రొటీన్ మాస్ మసాలా అని వ్యంగ్యం గా, సెటైర్స్ వేస్తూ రాసిన రివ్యూ. అది ముందు అర్ధం చేసుకోండీ.

ధన్యవాదాలు.

Found In Folsom said...

India lo unna....super busy schedule...ainaa mee review chadavakunda undagalamaa....idi Raj Kumar Rachchaa....lol....as usual hilarious...

రాజ్ కుమార్ said...

రసజ్ఞ గారూ.. హిహిహ్ ఈ మధ్య పెద్దగా సినిమాలు చూడలేదు లెండీ..
హహహ్ మరే ఆనందాక్కసు తో కాకుండా ఆనందంగా తప్పకుండా చూడండయ్యా అని రాస్తుంటే... మొహం మీదే చెప్పేస్తున్నారు.. పోస్ట్ చప్పగా
బాలేదని ;))))

ధన్యవాదాలండీ

@Found In Folsom గారూ... థాంక్యూ సో మచ్.. ఇండియా వచ్చారా... బాగా ఎంజాయ్ చెయ్యండీ..;) ;)

రాజ్ కుమార్ said...

రసజ్ఞ గారూ.. హిహిహ్ ఈ మధ్య పెద్దగా సినిమాలు చూడలేదు లెండీ..
హహహ్ మరే ఆనందాక్కసు తో కాకుండా ఆనందంగా తప్పకుండా చూడండయ్యా అని రాస్తుంటే... మొహం మీదే చెప్పేస్తున్నారు.. పోస్ట్ చప్పగా
బాలేదని ;))))

ధన్యవాదాలండీ

@Found In Folsom గారూ... థాంక్యూ సో మచ్.. ఇండియా వచ్చారా... బాగా ఎంజాయ్ చెయ్యండీ..;) ;)

రాజ్ కుమార్ said...

రసజ్ఞ గారూ.. హిహిహ్ ఈ మధ్య పెద్దగా సినిమాలు చూడలేదు లెండీ..
హహహ్ మరే ఆనందాక్కసు తో కాకుండా ఆనందంగా తప్పకుండా చూడండయ్యా అని రాస్తుంటే... మొహం మీదే చెప్పేస్తున్నారు.. పోస్ట్ చప్పగా
బాలేదని ;))))

ధన్యవాదాలండీ

@Found In Folsom గారూ... థాంక్యూ సో మచ్.. ఇండియా వచ్చారా... బాగా ఎంజాయ్ చెయ్యండీ..;) ;)

మనసు పలికే said...

అదేంటో రాజ్.. నీ రివ్యూ కోసమైనా వచ్చే సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్‌లు కావాలి అనిపిస్తూ ఉంటుంది ;) మరి అలాంటి సినిమాలకే కదా నువ్వు రివ్యూ ఇరగదీసేసేది :P

ఇక రచ్చ విషయానికొస్తే, నువ్వింతలా నచ్చింది మాకిదే కావాలి అని చెప్పిన తర్వాత కూడా నేవెళ్లి చూస్తే నువ్వు బాధ పడతావు. మరో చెత్త సినిమా నీ కంట పడే రోజు కోసం ఎదురు చూస్తూ......

రాజ్ కుమార్ said...

@మనసుపలికే.. వద్దూ.. వద్దూ..వద్దూ... ప్లీజ్
తెలుసు సినిమా ఇండస్ట్రీ ని పచ్చగా ఉండనివ్వండీ. మీ కోసం, మీ తాత్కాలిక ఆనంద్ం కోసం నన్నూ, ఇండస్ట్రీనీ బాధ పెట్టకండీ.. ;))))))))

థాంక్యూ ;)

Pradeep Reddy said...

Raj Kumar garu, mi review Racha ke Racha puttinche la vundi... hilarious...enjoyed your critics :)

Siva kumar said...

tom yom goong ( గజ బలుడు) లో లాస్ట్ ఫైట్ రచ్చలో లాస్ట్ ఫైట్ same to same పక్కా కాపి