Sunday, April 15, 2012

ఔను.. నేను బ్లాగ్ మొదలెట్టాను.. ఏడాది క్రితం.


కూడలి లో కనిపించిన పోస్టులన్నీ చదివేసీ కమెంట్లు పెట్టడానికి కూడా భయపడేవాణ్ణి నాలుగేళ్ళ క్రితం.
నచ్చిన బ్లాగులు మాత్రమే చదువుతూ... బా..గాఆఆ నచ్చిన ఒకే ఒక్క బ్లాగ్ లో కమెంట్లు పెట్టేవాణ్ణి
మూడేళ్ళ క్రితం.

అడ్డమయిన సినిమాలూ చూసొచ్చి నాకనిపించిన  నాలుగు ముక్కలు గూగుల్ బజ్ లో రివ్యూ రాసేవాణ్ణి రెండేళ్ళ క్రితం.

బ్లాగు స్నేహితుల ప్రోత్సాహం తోటీ, బ్లాగ్ మొదలెట్టకపోతే "బాగోదు" అనే వార్ణింగ్ ల తోటీ, "బ్లాగ్ మొదలెడితే లాభాలేంటీ??" అనే విషయం మీద క్లాస్ లతోటీ, బెదిరింపుల తోటీ బ్లాగు మొదలెట్టాను..  సంవత్సరం క్రితం. 

 మొదలెట్టి "ఏం చేసేవు కుర్రోడా?" అంటే...  డైరీ లు గట్రా రాసే అలవాటు లేని  నేను నా జ్ఞాపకాలని, నా అనుభవాలనీ, నాకు నచ్చిన రీతిలో నాకొచ్చిన భాష లో రాసుకున్నాను.

నా ఫేవరెట్ బ్లాగర్లూ, గొప్ప గొప్ప రైటర్లూ, సీనియర్లూ ఇక్కడకి వస్తే ఎగిరి గంతులేశాను.
వాళ్ళు మెచ్చుకుంటే మురిసిపోయాను.
బాగుందని పొగుడుతుంటే పొంగిపోయాను.
ఫైనల్ గా "మనకింత సీనుందా ?" అని సిగ్గు పడీపోయాను.

సో ప్రజలారా... నేన్ చెప్పేదేంటంటే...

1 year ఇండస్ట్రీ.. 


నా చేత బ్లాగ్ మొదలెట్టించినోళ్ళకీ, కెవ్వ్.. కెవ్వ్వ్ మని కమెంట్లు పెట్టి, కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేసి రాయించినోళ్ళకీ, "బాలేదురా అబ్బాయా..." అని చురకలేసినోళ్ళకీ, నాకు బ్లాగిచ్చినోళ్ళకీ, దానికి పేరెట్టినోళ్ళకీ, పేరెట్టిన బ్లాగు కి పేరు తెచ్చినోళ్ళకీ

అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ.. మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని ఆశిస్తూ..
 
 
రాజ్ కుమార్
 


54 comments:

Palla Kondala Rao said...

అలాగే నంబర్ వన్ గా కూడా ఉండాలి వచ్చే ఏడాదికల్లా!

Unknown said...

మీ బ్లాగుకు పుట్టిన రోజు శుభాకాంక్షలండీ...ఆయ్.

♥ Balubestdeals ♥ said...

Blog bagundi. Reviewslo paunchlu bagunyee. All the best.

వనజ తాతినేని said...

బ్లాగు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మంచి మంచి టపాలతో అందరిని అలరించి,ఆలోచింపజేయాలని ఆకాంక్షిస్తూ..

Raj said...

congrats Raj...

మీ బ్లాగు దిన దిన ప్రవర్ధమనంగా వెలిగిపోవాలి అని కోరుకుంటూ..

మీ అభిమాని.

జ్యోతిర్మయి said...

మీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలండీ..

Sravya V said...

రాజ్ అభినందలు , శుభాకాంక్షలు ఇంకా అవీ ఇవీ అన్న మాట :))
Happy blogging !

చిలమకూరు విజయమోహన్ said...

శుభాకాంక్షలు రాజ్!

చాతకం said...

Best wishes.

శేఖర్ (Sekhar) said...

:))

రసజ్ఞ said...

మెచ్చుకుంటే మురిసిపోయాను.
బాగుందని పొగుడుతుంటే పొంగిపోయాను.
ఫైనల్ గా "మనకింత సీనుందా ?" అని సిగ్గు పడీపోయాను. ఇవి మీకే కాదేమో అందరికీ ఇదే భావనేమో! మీరు మా సీనియర్ అన్నమాట ;) (రాగింగు గట్రా చేయకండే!!! ;))
మీ బ్లాగు ఇప్పటికే ఎంతో మంది అభిమానాన్ని పొందింది. ఎంత పని ఉన్నా ఇటు వైపు వస్తే, మీ టపా కనిపిస్తే వెంటనే చదివేస్తాను. మీరిలానే ఎన్నో ఎన్నో మంచి టపాలు వ్రాసి ఎంతో ఉన్నత స్థానాన్ని పొంది మరెంతో మంది అభిమానాన్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బ్లాగుకి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు!

Unknown said...

మీ బ్లాగు పుట్టిన రోజు శుభాకాంక్షలండీ

Zilebi said...

శుభాకాంక్షలు రాజ కుమార్ గారు!

భూమి గుండ్రముగా ఉండును !


చీర్స్
జిలేబి.

గిరీష్ said...

Happy b'day to raj blog :)

సన్నజాజి said...

మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తిచేసినందుకు అభినందనలు! మా లాంటి ఇప్పుడే మొదలెట్టిన వాళ్ళకి ఉత్సాహాన్నిచ్చారు. ఇలాగే మమ్మల్ల్ని నవ్విస్తూ చాల చాల బ్లాగులు రాసెయ్యాలని మా ఆకాంక్ష.

సుజాత said...

ఏవిటో నిన్న గాక మొన్న పుట్టినట్టుంది నువ్వు! నెమ్మదిగా పాకుతూ, తవాత దోగాడుతూ,తప్పటడుగులు వేస్తూ, ఆపైన నడక అందుకుంటావులే అనుకుంటే..నువ్వేమో పుట్టి ఏడాది కాకుండానే పరుగులు పెట్టేసి, అందర్నీ దాటేసి అలా అలా ముందుకెళ్ళి పోయావు. నువ్వు ఇలాగే ఎప్పుడూ రన్నింగ్ లో ఉంటూ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అలిసి పోయి, ఆటవిడుపుగా నీ బ్లాగు దగ్గర ఆగిన వాళ్ళకి చల్లని హాస్యం అందిస్తూ, అలుపు తీరుస్తావని......!

(మన్లో మన మాట..ఎక్కువ కాలేదుగా)

You are always one and only..Raj!

MURALI said...

intintai, vaTuDintai ani nI blAgu edigi edigi, ekkaDa dAkA edagAlO nE ceppAlA? andarikI telusu :)

MURALI said...

ఇంతింతై, వటుడింతై అని నీ బ్లాగు ఎదిగి ఎదిగి, ఎక్కడ దాకా ఎదగాలో నే చెప్పాలా? అందరికీ తెలుసు :D

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఓ అప్పుడే ఏడాది అయిపోయిందా. ఒక ఏడాదిలో ఇంత పాపులర్ అయిన బ్లాగు మీది ఒక్కటే .
ఎన్నిమాట్లు ఎంతలా నవ్వుకున్నామో.

శుభాభినందనలు. గాడ్ బ్లెస్ యు.

phaneendra said...

happy birth day

Raviteja said...

మీ బ్లాగుకు 1 వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు,నా కేక్ ముక్క ఎక్కడ ఉంది :D

ఆ.సౌమ్య said...

Congratulations రాజ్!
ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగిపోయావ్..ఎక్కడికో వెళ్ళిపోయావ్..నీ బ్లాగులో ఎప్పుడెప్పుడు పోస్ట్ పడుతుందా అని ఆశగా ఎదురుచూసేలా మమ్మల్ని తయారుచేసావ్.

ఇలా దినదినప్రవర్థమానమై నువ్వు నవ్వుతూ, మమ్మల్ని నవ్విస్తూ...30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే స్థాయికి ఎదగాలి :))

మధురవాణి said...

అప్పుడే ఏడాది గడిచిందా!
అభినందనలు రాజ్.. చూసావా ఒక్క ఏడాదిలో నీ బ్లాగులో ఎన్ని నవ్వులు పంచావో, ఎన్ని జ్ఞాపకాలు అక్షరాల్లో పోగేసుకున్నావో! :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

అభినందనలు రాజ్.
సంవత్సరం రోజుల్లో ముప్ప నవ్వులపువ్వుల హారాలల్లడం సామన్యమైన పనికాదు రాజ్.

మురళి అన్నట్టు ఇంతింతై, వటుడింతై అని నీ బ్లాగు ఎదిగి ఎదిగి తెలుగు హాస్య బ్లాగ్ లోకపు ఆకాశంలో నెంబర్ వన్ స్థానం సంపాయించుకోవాలి :-)

కృష్ణప్రియ said...

కంగ్రాట్స్.. సంవత్సరకాలం లో చాలా చక్కని ఎంటర్ టేయినింగ్ బ్లాగ్ రచయితగా ఖ్యాతి గడించారు. ఇంకా ఇంకా గొప్ప గా రాయాలని కోరుకుంటూ..

chicha.in said...

hii.. Nice Post Great job.

Thanks for sharing.

సిరిసిరిమువ్వ said...

మీ బ్లాగుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
మీ బ్లాగింగ్ ఇలానే మూడు సినిమాలు ఆరు రివ్యూలతో నిత్య నూతనంగా వర్ధిల్లాలని కోరుకుంటూ.....అభినందనలతో.

శశి కళ said...

happy anniversary to ur blog...baboy ante naa blog puttinaroju koodaa daggare undi....))

రాజ్ కుమార్ said...

కొండలరావ్ గారూ.. థాంక్యూ సార్. నంబర్ వన్ నా? అంత లేదులెండీ. వచ్చేఏడాది ఇలాగే పుట్టినరోజు చేసేలా ఉంటే చాలు ;)

మామిడికాయ గారూ.. చాల చాలా థాంక్సండీ ఆయ్... ;)

Balubestdeals garu. thanQ so much ;)

రాజ్ కుమార్ said...

వనజవనమాలి గారూ..ధన్యవాదాలండీ.. తప్పకుండా.. మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని ఆశిస్తూ.. ;)


రాజేంద్రా.. థాంక్యూ ;)

జ్యోతిర్మయి గారూ ధన్యవాదాలండీ..

శ్రావ్య్ గారూ.. మీకు ధన్యవాదాలు, నెనర్లు, థాంక్స్లులు ఇంకా చాలా అన్నమాట ;)

రాజ్ కుమార్ said...

విజయ్ మోహన్ గారు, చాతకం గారూ, శేఖర్.. .థాంక్యూ సో మచ్ ;)

శైలాబాల గారూ , జిలేబీ గారూ (యెస్సార్.. భూమి గుండ్రం గా ఉండును. అది తిరుగుతుండును) ధన్యవాదాలండీ..

సన్నజాజి గారూ.. థాంక్యూ అండీ.. విష్ యూ ద సేం ;)

రసజ్ఞ గారూ.. హహహ అవునండీ సీనియర్ మోస్ట్ రీడర్ ని. రీడర్ గా నా ఎక్స్పీరియన్స్ లెక్కేసుకుంటే మాత్రమే సుమా...
మీకోరిక తీరాలని నేనూ కోరుకుంటూన్నానండీ.. ధన్యవాదాలు ;)

రాజ్ కుమార్ said...

సుజాత గారూ.. మరి నా సీనియర్ల ట్రయినింగ్ అలాంటిదీ... నిజం చెప్పాలంటే మొదటి పోస్ట్ వేసే టైం కి నాకు ఏమ్ రాయాలో తెలీదండీ. నెగటివ్ గానో, పాజిటివ్ గానో ఏదో ఒకటి,
పోస్ట్ ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పి ఎంకరేజ్ చేసినోళ్లదే ఈ సెలబ్రేషన్ పుణ్యమంతా. ;)

<<(మన్లో మన మాట..ఎక్కువ కాలేదుగా) >>
మనలోమాట.. కొంచెం... ః)))))))) హిహిహిహి

మురళీ... అలాగలాగే.. అంతా నీ చేతిలోనే ఉందీ.. ఒక్క చాన్సు.. ఒకే ఒక్క చాన్సు.. అడ్వాన్స్ గా థాంకులు ;)

బులుసుగారండీ అంతా మీ ఆశీర్వాద బలం.. ;) ధన్యవాదాలండీ..

రాజ్ కుమార్ said...

ఫణీంద్ర గారూ.. థాంక్యూ ;)

రవితేజ గారూ.. హహహ్.. .మా ఇంటికొచ్చేయండీ... కేక్ ఏం కర్మా?? ఏది కావలిస్తే అదీ ఇరగదీద్దం ;) థాంక్యూ

అ.సౌమ్య గారూ... అలాగలాగే... అయితే ఒకడౌట్... 30 years అని చెప్పుకోవాలంటే..అది ఎదగడం కాదు.. ముసలోణ్ణవటం ఏమో అని ;) ;) హిహిహి ధన్యవాదాలు ః౦

మధురవాణి గారూ.. మరే... ఈ కుట్ర లో సాయి ప్రవీణ్,సెగట్రీ, కిరణ్ లతో పాటూ మీకూ భాగస్వమ్యం ఉందీ ;) నెనర్లు ;౦

రాజ్ కుమార్ said...

భాస్కర్ గారూ.. మీ ఆశీర్వాదానికి హృదయపూర్వక ధన్యవాదాలండీ.. ;)

కృష్ణప్రియగారూ... థాంక్యూ సో మచ్ అండీ ;)

చిన్న.ఎన్ గారూ నెనర్లు ;)

సిరిసిరి మువ్వ గారూ... అబ్బా... మీరెంత మంచోరో... బోల్డు థాంక్సు ;)

శశికళ గారూ... అంతే కదా మరీ.. తొందరపడండి మరీ.. ;) థాంక్యూ.. ;)

జయ said...

మీ బ్లాగ్ కలకాలం వర్ధిల్లాలి. పుట్టిన రోజు జేజేలు. అందరితో పొగిడించుకోటమేన! అయిసుఫ్రూటులు, స్వీటులు, కేకుముక్కలు గట్రా ఇచ్చేది ఏమి లేదా!!! రోజూ ఉప్మా డబ్బాలు డబ్బాలు తీసుకుపోయేదేనా, ఏమన్న ఇచ్చేదుందా అని మహేశ్ బాబు అంటాడే ఆ డవిలాగన్నమాట. మీకు సినిమా రివ్యూ భాషలోనే నా విషెస్:)

శివరంజని said...

రాజ్ కుమార్ గారు మీ బ్లాగ్ బర్త్ డే అని ఉదయం అనగా ఓ బొకే పట్టుకుని విషెస్ చెప్పడానికి లైన్ లో నిలబడి నిలబడీ కళ్ళు తిరిగి పడీపోయి ఇదిగో ఇప్పుడే లేచి అందరిని తోసుకుంటూ వచ్చి మరి విషెశ్ చెబుతున్నా .............

సంవత్సరం లోనే ఇన్ని నవ్వులు పంచారు ...ఇంతమంది అభిమానులని సంపాంధించారు ...... మీ బ్లాగ్లో ఫ్లోటింగ్ చూస్తుంటేను మీరు ఎంత మంచి కామెడీ పోస్ట్ లు రాసారో అర్ధమవుతుంది .....

కామెంట్లు పెట్టే వారి సౌకర్యార్ధం *క్యూ కాంప్లెక్స్* లు కట్టించాలని మనవి చేసుకుంటున్నా ....*క్యూ కాంప్లెక్స్* కట్టిస్తే కామెంట్ లు పెట్టడానికి మాకు ఈ తొక్కిసలాట ఉండదు కదా ..

HAPPY HAPPY BLOG BIRTHDAY :)))))
ఇలాంటి కామెడీ టపాలు మరిన్ని వ్రాసి మరెంతో మంది అభిమానాన్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బ్లాగుకి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు!

ఇందు said...

Wow!! Happy Blog Birthday Raj garu!! Meeru reviews yee anukunnaa... ilaanti posts koodaa bhale funny ga raastarandi ;) 1yr industry :)))))))))

Anywayz congrats for 1yr of industry expr :D

KumarN said...

You are the ONE OF THE BEST ones out there Raj:) Clean comedy, no vekili tanam, certainly not slapstick comedy, and not inhuman comedy that we see in some movies, making disabled people as butt of jokes etc.,

I always love to read yours.

Keep going.
Kumar N

మాలా కుమార్ said...

happy birthday

వేణూశ్రీకాంత్ said...

సుజాతగారి కామెంట్ చాలానచ్చింది రాజ్. నా తరఫున కూడా ఆకామెంట్ మళ్ళీ ఓసారిచదువుకో.. నిన్న మొన్న మొదలుపెట్టినట్లు అనిపిస్తుంది నిజంగా అప్పుడే ఏడాదైందా అని ఆశ్చర్యంగా ఉంది.
చక్కనైన హాస్యానికి చెరగని చిరునామాగా మారిన నీ బ్లాగ్ అంటే నాకూ బోలెడంత ఇష్టం ఏర్పడిపోయింది. అపుడపుడు ఎపుడు సేదదీరాలనిపించినా వచ్చి పాత టపాలు చదూకోడం అలవాటైపోయింది. ఇలాగే నువు నిరంతరాయంగా ఎన్నోమంచి టపాలతో ఎప్పుడూ అలరిస్తూ ఉండాలనీ.. మురళి చెప్పినట్లు మరిన్ని ఉన్నతమైన లక్ష్యాలను అవలీలగా అందుకోవాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఫోటాన్ said...

బ్లాగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
కంగ్రాట్స్ రాజ్...
మీ కామెడీ పోస్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం, :)

నేస్తం said...

కొంచెం లేట్ గా చూసాను..అసలు నీ బ్లాగ్ మొదలు పెట్టి సంవత్సరం అయిందని గుర్తేలేదు.. ...సారీలు గట్రాలు చెప్పదల్చుకోలేదు..లాస్ట్ కామెంట్ పెట్టడంలో కూడా సంతోషం ఉంటుంది అని ఈ రోజు అర్ధం అయ్యింది..అసలు ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా నీ హిట్ కౌంటెర్ ని ఫాలోవర్స్ని చూస్తున్నా.... ఏమన్నా గుర్తొస్తుందా :)

నేస్తం said...

కొంచెం లేట్ గా చూసాను..అసలు నీ బ్లాగ్ మొదలు పెట్టి సంవత్సరం అయిందని గుర్తేలేదు.. ...సారీలు గట్రాలు చెప్పదల్చుకోలేదు..లాస్ట్ కామెంట్ పెట్టడంలో కూడా సంతోషం ఉంటుంది అని ఈ రోజు అర్ధం అయ్యింది..అసలు ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా నీ హిట్ కౌంటెర్ ని ఫాలోవర్స్ని చూస్తున్నా.... ఏమన్నా గుర్తొస్తుందా :)

నేస్తం said...

కొంచెం లేట్ గా చూసాను..అసలు నీ బ్లాగ్ మొదలు పెట్టి సంవత్సరం అయిందని గుర్తేలేదు.. ...సారీలు గట్రాలు చెప్పదల్చుకోలేదు..లాస్ట్ కామెంట్ పెట్టడంలో కూడా సంతోషం ఉంటుంది అని ఈ రోజు అర్ధం అయ్యింది..అసలు ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా నీ హిట్ కౌంటెర్ ని ఫాలోవర్స్ని చూస్తున్నా.... ఏమన్నా గుర్తొస్తుందా :)

నేస్తం said...

కొంచెం లేట్ గా చూసాను..అసలు నీ బ్లాగ్ మొదలు పెట్టి సంవత్సరం అయిందని గుర్తేలేదు.. ...సారీలు గట్రాలు చెప్పదల్చుకోలేదు..లాస్ట్ కామెంట్ పెట్టడంలో కూడా సంతోషం ఉంటుంది అని ఈ రోజు అర్ధం అయ్యింది..అసలు ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా నీ హిట్ కౌంటెర్ ని ఫాలోవర్స్ని చూస్తున్నా.... ఏమన్నా గుర్తొస్తుందా :)

నిషిగంధ said...

శుభాభినందనలు, రాజ్..
అప్పు...డే సంవత్సరమైపోయిందా!! రెగ్యులర్‌గా కామెంట్స్ రాయకపోయినా మీ ప్రతి పోస్ట్ చదువుతాను... ముఖ్యంగా రివ్యూస్ అయితే ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటాను కూడా.. మా నవ్వులన్నీ మీకు దీవెనలై ఇంకా బోల్డన్ని సంవత్సరాలు ఈ బ్లాగ్ ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను :-)

రాజ్ కుమార్ said...

జయగారూ... అయ్యో.. భలేవారే... ఏమేం కావాలో చెప్పండీ.. పంపిస్తాను మెయిల్ లో.. ;))))
ధన్యవాదాలండీ..

శివరంజని గారూ.. ధన్యవాదాలండీ.. ఫండ్స్ కూడా పంపండీ క్యూ కంప్లెక్స్ కట్టించడానికి ;))))))

ఇందుగారూ..,మాలా కుమార్ గారూ, థాంక్యూ సో మచ్ ః)

రాజ్ కుమార్ said...

కుమార్.N గారూ thank you very very much sir..:)))))))

వేణూజీ.. హ్మ్మ్. నాకు కూడానండీ... ;) మీ కోరిక తీరాలని నేనూ కోరుకుంటున్నానండీ. ;))) హృదయపూర్వక ధన్యవాదాలు ;)

ఫోటాన్... థాంక్యూ వెఱీ మచ్.. నాకూ భీ నీ సీమ పోస్ట్స్ అంటే మక్కువ ఎక్కువ హై ;)

నిషిగంధ గారూ.. అవునండీ చాలా సింపుల్ గా అయిపోయింది హహహ్. ;)
మీ దీవెనలూ, పోత్సాహమే నడిపిస్తాయ్.. ధన్యవాదాలు..;)

మహీధర రెడ్డి said...

రాజ్ కుమార్ గారు !! ముందుగా అభినందనలు... మీ ఏడాది బ్లాగు ప్రస్థానం అదిరింది ...మీ స్టైల్ లో చెప్పాలంటే రభస రచ్చ కేక ..చించేసారు దున్నేశారు ....మీరు ఏ మాత్రం తగ్గకుండా ఇదే లెవెల్ మెయిన్ టైన్ చెయ్యండి ....మీరు చేస్తారని మాకు తెలుసు...ఎందుకంటే మీరు రాజ కుమారు కదా....రాజు (ఇంచు మించుగా రాజ కుమారు ) తలచుకుంటే కొదవేముంది. ...

మహీధర రెడ్డి said...
This comment has been removed by the author.
S said...

అయితే, పరిశ్రమలో మొదటి ఏడాది పూర్తి చేస్కున్నారు అనమాట. అభినందనలు :-)

మనసు పలికే said...

కాస్త ఆలస్యంగా, బ్లాగు మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు :))

ఇందరు ఇన్ని వ్యాఖ్యల ద్వారా చెప్పిన తరువాత కూడా ఇంక ఏం మిగిలి ఉందంట, నేను చెప్పడానికి ;) అందరి వ్యాఖ్యలనీ మరోసారి చదువుకో..:D శుభాభినందనలు రాజ్..

రాజ్ కుమార్ said...

మహీధర్ గారూ, సౌమ్య గారూ, మనసుపలికే గారూ.. ధన్యవాదాలండీ ;) {కొంచెం ఆలస్యంగా ;)}

మహమ్మద్ షఫి said...

భయ్యా..!!
2015 నుండి మీరు ఎటువంటి పోస్టులు పెట్టలేదు..
ఇది మరీ అన్యాయం...మీ పోస్ట్ కోసం ఎదురు చూచి..చూచి..మా కళ్ళు కాయలు కాసి కోసేవాళ్ళు లేక పండు మాగి రాలికూడా పోతున్నాయి..దయచేసి మాలాంటి అభిమానుల కోసం మళ్ళీ కీ పాడ్ చేబూనగలరని మనవి... లేని పక్షంలో మీ fb లింక్ సెండ్ చెయ్యగలరు...!!😢😢😢😢