Sunday, March 10, 2013

ఔను.. నేనొక గజ ఈతగాణ్ణి...!

"ఛీ... దీనెం....కమా....జీవితం..! ఒకప్పుడు బెంగళూరంటే మండుటెండ లో చిల్డ్ బీరు తాగినట్టుండేది..ఇప్పుడు
చెన్నైరోడ్లమీద చొక్కా విప్పుకు తిరిగినట్టుంది" రుస రుసలాడిపోతున్నాడు సుధాకర్ గాడు. ఐదు రోజుల పాటు పాటుపడేది ఏసీ జైల్ లో కాబట్టీ బయట ప్రళయమొచ్చినా తెలీదు గానీ వీకెండొచ్చినప్పుడు ఎండదెబ్బ కి ఇలా పద
విపరీతాలు తన్నుకొచ్చేస్తుంటాయ్. "జెమిని టీవీ లో సండే స్పెషల్ విజయేంద్రవర్మ సినిమా ఇస్తున్నాడు.. రా రా
చూద్దాం" అన్నాన్నేను. గతం మరిచిపోయిన బాలయ్య బాబు చొక్కా కాలర్ మీద "Bademiya Tailors
Hyderabad" అన్న స్టిక్కర్ చూసీ "నేను హైదరాబాద్ వెళ్ళాలి" అన్నాడు సీరియస్ గా.

"చొక్కా మీద pepe jeans london అని రాసుంటే లండనెళ్ళిపోయేవాడేమో.. చానల్ మార్చెహే" అంతకంటే సీరియస్
గా అన్నాడు సుధాకర్ గాడు. హారర్ సినిమాలకి సైంటిఫిక్ రీజనూ, బాలయ్య బాబు మేజిక్కులకి లాజిక్కులు
వెతక్కూడదురా... వాటిని ఫీలవ్వాలి అని, చానల్ మార్చే లోపున కరెంట్ పోయింది. ఫ్యాన్ ఆగిపోవటం తో మాకు
చిరాకుతో చిర్రెత్తి పోయింది.
సుధాకర్ః వీకెండ్స్ మనం ఏదయినా కొత్తగా నేర్చుకొంటే ఎలా ఉంటాది రా?
నేను : మన పర్స్ ఖాళీ అవుతాది. హ్మ్మ్మ్..... జిమ్ కెళ్ళి బాడీ బిల్డింగ్ చేద్దామా?
సుధాకర్ః . నిలువుగా పెరగడానికి ఏమైనా చెప్పరా... అడ్డంగా ఒళ్ళు పెంచడానికి డబ్బులు దండగ ఐడియాలు చెప్తావూ..
నేను : డ్రైవింగ్ నేర్చుకుందామా?
సుధాకర్ః కార్ లేకుండా నేర్చుకొని ఏం చేస్తావురా? నెలరోజుల్లో మరిచిపోవడం తప్ప?
నేను : ఏదయినా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే?
సుధాకర్ః అంత ఓపిక లేదు. పనికొచ్చేవి చెప్పరా.. పక్కోడి ప్రాణాలు తీసేవి కావు.
నేనుః పోనీ...... స్విమ్మింగ్ ???
సుధాకర్ః సూపర్.. రా... ఎక్సర్ సైజ్ చేసినట్టూ ఉంటాదీ... స్విమ్మింగ్ నేర్చుకున్నట్టూ ఉంటాదీ.. ఈ ఎండాకాలం చల్లగా ఉంటాది. కుమ్మేద్దాం.
"హమ్మయ్యా..." అని ముందనుకొని ఆ తర్వాత "యాఆఆఅ.హూఊఊ" అనుకున్నాను. అంత ఎగ్జైట్మెంట్ ఎందుకో తెలియాలంటే చిన్న ఫ్లాష్బాక్ చెప్పాలి మీకు.
*********************************************************************************************************************
ఇంజినీరింగ్ వెలగబెడుతున్న రోజుల్లో ఒకరోజు నేను, అప్పల్రాజుగాడూ,మా చిన్నమాయా కలిసి వీకెండ్ ఎంజాయ్ చెయ్యడానికి మా ఊరిదగ్గర్లోని బీచ్ కి వెళ్ళాం (మరిన్ని వివరలాకు ఇక్కడ చూడండి).
బోట్ మీద షికారు చేస్తుండగా "నీకు ఈతొచ్చేట్రా అప్పిగా?" అనడిగాను. "పోరా.. పిడతమొహం పకోడీ గా" అని నేను తిట్టినా ఫీలవ్వని అప్పిగాడు ఘోర అవమానం గా ఫీలయిపోయి మెరుపు వేగంతో షర్ట్ విప్పేసి నీట్లోకి దూకేసి బోట్ చుట్టూ చక్కర్లు కొట్టడం మొదలెట్టాడు. జరిగిన ఈ హఠాత్పరిణామానికి మేమంతా నోర్లు బార్లా తెరిచి చూస్తా ఉండిపోయాము. ఆ తర్వాత కొంచెం తేరుకొనీ "నీ సెల్ఫోనేదిరా అప్పిగా?" అనేసరికీ "ఓఱ్ఱ్ ఱ్ఱ్ఱ్ఱ్ఱ్ఱ్ఱ్.. ప్యాంట్ పాకెట్లోనే ఉందిరా..." అన్నాడు జేబులో చెయ్యెట్టి. "మరి నీ పర్సెక్కడ్రా...?" అనేసరికి " అయోఓఓఓఓఓఓ... అది ఈ జేబులో ఉందిరా.." అన్నాడు కంగారు తో కంపించిపోతూ...
నా ఈగో సాటిస్ఫై ఆయ్యి.. గర్వం తో కూడిన నవ్వు వెటకారాన్ని కలుపుకొని మెరిసింది.
నేనుః "హహహ... హ్హొహొహొహొ... కికికికి"
అప్పిః నవ్వావంటే నీ కాలట్టుకొని నీట్లోకి లాగేస్తానొరే
నేనుః దురదృష్ట ద్రష్టవిరా నువ్వు...
అప్పిః నీకు సంస్కృతం వచ్చని నాకు తెలుసుగానీ.... దానర్ధం ఏంట్రా?
నేనుః ఏమో...ఎవడికి తెల్సూ? నీకు సూటవుతాదనిపించి వాడేశాను. ఏరా..... ఫీలయ్యావా?
అప్పిః మ్మ్మ్మ్మ్మ్మ్మ్... .నువ్ తిట్టినందుకు కాదు. తిట్టు అర్ధం కానందుకు.
నేను : అయినా... ముందూ వెనకా చూడకుండా ఓఓఓఓఓఓఓఓ ఎగేసుకొని దూకెయ్యడం ఏంట్రా? పరిగెట్టి పాలు తాగుదాం అనుకుంటే ఇలాగే పల్టీ కొట్టేస్తావు. నాలాగా నిదానంగా ఆచి తూచి అడుగెయ్యాల్రా..గాడిదా" (బోట్లో కూర్చొని. తడిసిపోయిన మొబైల్, పర్స్ అందుకుంటూ)
అప్పిగాడు : కూర్చొని కబుర్లు చెప్పడం కాదురా.. నీ పర్సూ, ఫోనూ బోట్లో పడేసీ, ముందూ వెనకా చూసీ,నీట్లోకి దూకగలవా.. నిదా...నంగా..??
నాకు వెంటనే పౌరుషం పొడుచుకొచ్చింది కానీ దూకితే పొట్ట ఉబ్బుకొస్తాదేమోననీ నా ఈగో హర్టయినా గానీ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయాను తెలివిగా..!
*********************************************************************************************************************
ఆ రోజు అనుకున్నా.. ఎప్పటికైనా ఈత నేర్చుకోవాలని. ఆ మరసటి రోజే మరిచిపోయాననుకోండి.. అది వేరే విషయం.. కానీ ఆ కోరిక మెదడు పొరల్లో ఇరుక్కుపోయీ, అవకాశం రావడం తో ఇప్పుడు హఠాత్తుగా బైటకొచ్చింది.
మా ఏరియా లో స్విమ్మింగ్ పూల్స్ వెతికి పట్టుకొనీ, ఫైనల్ గా చూడ్డానికి నీట్ గా ఉన్న ఒక దాన్లో చేరడానికి ఫిక్సయిపోయాం. 25 క్లాసులన్నాడు, స్మిమ్మింగ్ డ్రెస్ కంపల్సరీ అన్నాడు, కళ్ళకి అద్దాలూ, నెత్తికి టోపీ కొనుక్కుంటే మంచిదన్నాడు, వాడిదగ్గరే కొనుక్కుంటే డిస్కౌంటిస్తానన్నాడు, మొత్తం డబ్బంతా అప్పుడే కట్టమన్నాడు మర్నాటి నుండీ పొద్దున్న ఆరింటికి రమ్మన్నాడు. మాకు రోజూ రావడానికి కుదరదు కాబట్టీ వీకెండ్స్ మాత్రమే వస్త్తామని చెప్పాం మేమూ మా సాటి సాఫ్టీలందరం.

మొదటి క్లాస్ లో అడుగు పెట్టేసరికి మా ట్రైనర్ కండలు లేని సల్మాన్ ఖాన్ లాగా చొక్కా విప్పుకొని ఎదురొచ్చాడు. వాడి ఇలియానా నడుము చూసి తొందర్లో మా ఫ్యామిలీ ప్యాకులు తరిగిపోయి, టైర్లు కూడా అరిగిపోయి ఇలియానాలా కాకపోయినా కనీసం నయనతార నడుమన్నా(విత్ ప్యాక్) వస్తాదని ముచ్చట పడిపోయాం. "ఈ రోజంతా వార్మప్.. చక్కగా రెండు గంటల సేపు నీట్లో ఆడుకోండి. బద్దకం తో బిగుతైపోయిన మీ శరీరాలు వదులవుతాయి" అనటం తో మేమంతా "జలకాలాటలలో....... ఐటెం సాంగులతోఓఓ.... ఏమి హాయిలే హలా..." అని పాటేసుకుంటూ పూల్ లోని నీళ్ళన్నీ కలియబెట్టాం.
మా ట్రైనర్ మీద కుదిరిన నమ్మకం వల్ల అనుకుంటా...నేను స్విమ్మింగ్ లో కింగ్ అయిపోయినట్టూ,మా ఊరి చేపల చెరువు లో జరిగిన ఈతలపోటీ లో ఫస్టొచ్చినట్టూ, బంగాళాఖాతం లో ఈదుకుంటూ అండమాన్ దీవులకి వలస పోయినట్టూ కలలొచ్చి కవ్వించాయి ఆ రోజు రాత్రి. పొద్దున్నకి మాత్రం జలుబు చేసి తుమ్ములొచ్చాయి, ఒంటికి నొప్పులొచ్చాయి.
ఐదు రోజుల గ్యాప్ తర్వాత ఒకానొక శనివారం నాడు తెల్లవారుఝామున ఆరున్నర కి లేచి, సరంజామా సర్దుకొని నిద్రమత్తులో ఊగుతూ జోగుతూ వెళ్ళాం. మా ట్రైనర్ కనపడలేదు గానీ బాన పొట్ట గల ఒక నల్ల మేఘశ్యాముడు పదినిమిషాలు లేట్ గా వచ్చినందుకు ఇ.తా.గీ ఎఫెక్ట్ లో (ఇనప రేకు తో తారు రోడ్డు మీద గీచిన ఎఫెక్ట్) అరిచి కేకలేస్తూ శబ్ద కాలుష్యం చేస్తున్నాడు.. "వీడెవడ్రా... కడుపుతో ఉన్న ఎలుగుబంటికి డ్రాయర్ తొడిగినట్టున్నాడూ?" అనడిగాడు సుధాకర్ గాడు భయంగా. "ఇంకా అర్ధం కాలేదా..? వాడు అవుట్.వీడు ఇన్. మనకి ఈత నేర్పేది ఈ కాండిడేటే.. పూర్వకాలం లో మిలట్రీ ఆఫీసరనుకుంటా.." అనేసీ డ్రెస్ చేంజ్ చేస్కొని పరిచయం చేస్కున్నాను.

ఎలుగుబంటి ట్రైనర్ర్ : ఇదే ఫస్ట్ క్లాస్ కదా..? హెడ్ బాత్ చేసొచ్చారా?
"ఓఓఓఓఓ... నిన్న నే చేసేశాం"
ఎ.ట్రైః నిన్న కాదు. పూల్ లోకి దిగేముందూ, బయటకొచ్చాకా హెడ్ బాత్ చెయ్యాలి. అది రూల్.
"సెలవు రోజుల్లో మేం స్నానాలు చెయ్యం. ఇది మా రూల్"
ఎ.ట్రైః అదేంటీ చండాలంగా? ఆఫీసులకి కూడా ఇలాగే వెళతారా దరిద్రంగా?
"మాటలు కరువైనప్పుడు పాటే గతి. నీళ్ళు రానప్పుడూ, ఒళ్ళు బరువైనప్పుడూ సెంటే గతి"
ఎ.ట్రైః హ్మ్మ్.. ఇప్పుడూ... నేనున్నాను కదా... నేను స్నానం చెయ్యకుండా పూల్ లోకి దిగిన నీట్లో మీకు ఈత నేర్పిస్తానంటే ఒప్పుకుంటారా?
"ఆఆఆఆఆఅ...ఇప్పుడు సివియారిటీ అర్ధమయ్యింది. గేదెలూ, గాడిదలూ దిగిన చెరువు లోకి మేం దిగం కదా. ఇప్పుడే చేసొస్తాం"
*********************************************************************************************************************
కుర్రోళ్ళందరం పూల్ లోకి దిగి వరసాగా నిలుచున్నాం.
ఎ. ట్రై : "అబ్బాయిలూ... ఇప్పుడు నేను బబుల్స్ ఎక్సర్ సైజ్ ఎలా చెయ్యాలో చెప్తాను. కన్నార్పకుండా చూసి కేర్ఫుల్ గా నేర్చుకోండి"

నేను : నువ్వేమన్నా బెల్లీ డ్యాన్స్ చేస్తున్నావా కన్నార్పకుండా చూడ్డానికి? (కుఱోళ్ళకి మాత్రమే వినపడేలా)

ఎ.ట్రైః గోడ వార గా ఉన్న ఈ రాడ్ పట్టుకోండి. తల మునిగేలా నీట్లో కూర్చొని... తల తొంబై డిగ్రీల కోణం లో పైకి పెట్ట్టి బుఱ్ఱ్ఱ్ఱ్ఱ్ఱ్ ఱ్ఱ్ ఱ్ఱ్ ఱ్ఱ్ ఱ్ ఱ్ ఱ్ఱ్....... అని బుడగలు తియ్యండి.
"ఈ మాయదారి మందునీళ్ళలో కళ్ళు మండిపోతున్నాయ్ బాబోయ్..."

ఎ.ట్రైః కళ్ళజోడు పెట్టుకో
"చెవుల్లోకి నీళ్ళు పోతున్నాయ్"
ఎ.ట్రైః ఇయర్ బడ్స్ పెట్టుకో
"ముక్కు లోకి కూడా నీళ్ళు పోతున్నాయ్"
ఎ.ట్రైః నీళ్ళు ముక్కులోకి వెళ్ళీనా పర్లేదు. ముక్కులోది నీట్లోకి రాకుండా చూస్కోండి.
ఇక లాభం లేదనుకొని అందరం సీరియస్ గా అలాగే బుడగలు తియ్యటం మొదలెట్టాం. "ఒరేయ్.. వాడిలా బుర్ ర్ ర్ ర్ మని అరక్కర్లేదు. నీట్లో కూర్చొని నోటితో గాలి వదిలితే ఆటోమేటిక్ గా సౌండ్ వచ్చేస్తుంది" ఎగ్జైంటింగ్ గా అన్నాడు సుధాకర్ గాడు రహస్యాన్ని కనిపెట్టినట్టు.
"ఒరేయ్ సుధా...నాకెందుకో తేడా కొడుతుందిరా... నిజంగా మనకి స్విమ్మింగ్ వస్తాదంటావా?"
"గుండు చేయించుకుంటే పోయేది అందమే గానీ... చుండ్రు కాదురా"
"అంటే........"
"మన జేబుల్లో డబ్బులకి మొప్ప లొచ్చీ.. నీట్లో ఈదుతున్నాయ్ కనిపించటం లేదా?? ఈ మిలట్రీ వోడి మీద నాకు నమ్మకం లేదు"
"కుక్కతోక పట్టుకొని గోదారి ఈదడం అంటే ఇదేనంటావా?"
"మరి? వాడు చూశావా ఎవడో కాల్చి వాత పెట్టినట్టు ఉండుండి ఎలా అరుస్తున్నాడో?? ఇంత వైల్డ్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడంటావ్?"
"తాగుబోతులు మందెయ్యడానికి రీజనుండాలా? గాడిదలు ఓండ్ర పెట్టడానికి అకేషన్ ఉండాలా? జాతి లక్షణం అంతే"
*************************************************************************************************************************
ఆ తర్వాత రెండ్రోజుల పాటు గోడని కాళ్ళతో తన్ని చేతులు కదపకుండా నీట్లో ఎలా ముందుకెళ్ళాలో నేర్పేడు. అప్పటి వరకూ బానే ఉంది. ఆ తరవాత సవాలచ్చ రూల్స్ పెట్టి చెడుగుడు ఆడుకున్నాడు. కాళ్ళు పైకీ కిందకీ ఊపాలంటా కానీ మోకాళ్ళు వంచకూడదంట. చేతులు సర్కిల్ షేప్ లో తిప్పాలంటా కానీ చెయ్యి నీట్లో దించేటప్పుడు ఏంగిల్ మార్చాలంట. చేతులు దించే ముందు తల పక్కకి తిప్పి ఊపిరి తీసుకోవాలంట. వామ్మో.. ఒకేసారి ఇన్ని పనులు కరెక్ట్ గా చెయ్యాలంటే కుదిరే పనా?? ఎలా చెయ్యాలో చెప్పమంటే గట్టెక్కి కథకళి చేసి చూపించేవాడు గానీ నీట్లోకి దిగి చెప్పేవాడు కాదు. పెపంచికం లో అన్నీంటికన్నా కష్టమైన పనులు బట్టలుతకడం, వాటిని ఇస్త్రీ చేసి మడతెట్టడం అనుకునేవాడిని. ఈ ఈత కొట్టడమనేది ఇంకా కష్టం అని అప్పుడే తెలిసింది. ఐదడుగులు కాళ్ళూ, చేతులూ ఆడించేసరికి శరీరం లోని శక్తంతా ఎవరో స్ట్రా పెట్టి తాగేసినట్టు అయిపోయేది. వారం రోజులు లంఖణాలు చేసినట్టూ నీరసమొచ్చేసేది. ఏదోలాగా బయటకొచ్చేసి గట్టుమీద శవాసనం వెయ్యాలన్న విపరీతమైన కోరిక కలిగేది. కానీ మా మిలిటరీ ఆఫీసరు ఊరుకునేవాడు కాదు. మాకు ఈత కాదు గానీ చిరాకూ, ఏడుపూ, ఒళ్ళునొప్పులూ వచ్చేవి. నీట్లోనే ఉండేవాళ్ళం కాబట్టీ ఏడుస్తున్నట్టు తెలిసేది కాదు. ఒళ్ళు నొప్పులకి మాత్రం జండూబామ్ వాడేవాళ్ళం.
వారానికి రెండు చొప్పున మేము ఓ పది క్లాసులు కంప్లీట్ చేసే టైం కి సమ్మర్ వెకేషన్ పేరు చెప్పి అప్పుడే నడవడం నేర్చుకున్న పిల్లకాయల నుండి ప్రోగ్రెస్ రిపోర్ట్ పారేసుకోవడం నేర్చుకున్న బుడ్డోళ్ళ వరకూ జాయినయ్యారు. మేమంతా లోతు లేని దగ్గర ఆడుకునే బ్యాచ్ కాబట్టీ మా చేత ఖాళీ చెయ్యించడానికి మాస్టర్ ప్లానేశాడు మా ఎలుగ్గొడ్డు ట్రైనరు.
మమ్మల్నందరినీ నిలువెత్తు లోతు ఉండే అవతలి ఎండ్ కి తీసుకెళ్ళి వరసాగా నిలబెట్టాడు.

ఎ.ట్రైః బాయ్స్... ఇప్పటికే మీరు బేసిక్ స్విమ్మింగ్ నేర్చేసుకున్నారు బ్రీతింగ్ తో సహా. ఎలా ఉంది నా ట్రెయినింగ్??
"ఎవడి పిర్రకి వాడే ఇంజెక్షన్ చేసుకొని అరిచినట్టుంది"
ఎ.ట్రైః వెరీ గుడ్.. ఇప్పుడు నేను వాఆఆఆన్.. టూఊఊఊఒ... థ్రీఈఈఈఈఈఈఈ అంటాను. మీరంతా ఒన్ బై ఒన్
దూకేసి ఈదుకుంటూ అవతలి ఎండ్ వరకూ వెళ్ళిపోవాలి. పటేల్... ఫస్ట్ నువ్వే.

పటేల్ః నేనా? ఇక్కడ నుండా? దూకాలా...? లోతెక్కువ కదా??
ఎ.ట్రై : ఈతొచ్చిన చేప పిల్లకి లోతు తో పనేముంది? చెంబులో పడేసినా సముద్రం లో పడేసినా ఈదుతుంది. నువ్వీ స్విమ్మింగ్ పూల్ ఈదలేవా? నేను ఉన్నానుగా.... దూకు.
పటేల్ః అది కాదు సా...ర్.. నా... నాకింకా పెళ్ళి కాలేదు.
ఎ.ట్రైః సో వాట్? నాకూ కాలేదు.
పటేల్ః ఇప్పుడు మీరు పెళ్ళి చేస్కొని ఎవరి ఉద్దరించాలి సార్? అవసరమా?? అసలు సాధ్యమా?? ముందు మీరు
 దూకండి. తర్వాత నేను.
ఎ.ట్రైః ఓ..కే.. బాయ్స్... నేనెలా జంపుతానో చూసి నేర్చుకోండి. ముందుకి వంగండి.. మోకాళ్ళు వంచండి. చేతులు పైకెత్తండీ. కళ్ళు మూస్కోండి... బలంగా.ఊపిరి పీల్చండి.......
నేనుః అద్దీ...సూపఱా సుధాకరూ. ఈ రోజు మనోడు నీట్లోకి దిగేలా ఉన్నాడు రా... ఆ ఎండ్ వరకూ వెళ్లగలడంటావా?
సుధాకర్ః వాడి మొహం లే. గ్యాస్ సిలిండర్ నిండుగా ఉన్నా నీట్లో తేలతాది చూశావా? అదే ఫార్ములా ఇక్కడ వర్కవ్వుద్ది. వీడూ.. వీడి పొట్టానూ..ఆ పొట్టనిండా గాలే. చక్కగా నీట్లో తేలతాడు. కావాలంటే చూడూ.. నాలుగడుగుల కన్నా ముందుకెళ్ళలేడు.

ఎ.ట్రైః  అన్నింటికన్నా ముఖ్యమైనది డ్రాయిర్ బిగించి కట్టుకోండి. ఎందుకన్నా మంచిది మొలతాడు బిగించండి.
ఒకసారి నేను దూకినప్పుడేమయ్యిందంటే........

"ఇప్పుడా దరిద్రపుగొట్టు ఫ్లాష్బాక్లు ఎందుకుసార్.. మాకు అర్ధమయ్యింది. "
మా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే మా ఎలుగుబంటోడు బండరాయిని బావి లో పడేసినట్టూ దూకాడు గానీ తను ఈతకొడితే చూసే భాగ్యాన్ని మాత్రం మాకు కలిగించలేదు. ఆ తర్వాత మమ్మల్నీ దూకమన్నాడు. మొదట భయమేసింది గానీ రాఘవేంద్రరావు సినిమా లో రమ్యకృష్ణ ని తలచుకొని ధైర్యే ...సాహసే విజయశాంతేఏఏఏఏఏఏఏఏఏఏఏఏ... అనుకొని దూకేశాం.
(ఈ ఫోటో కీ మా ఏరియా కీ, మాకూ ఎటువంటి సంబంధం లేదు.. కొంచేం అటు ఇటు గా ఇల్లాగే దూకేమ్ అని మాత్రం మనవి చేస్కుంటున్నా)

దూకిన ఫోర్స్ కి ఎలాగోలా కొంత దూరం వచ్చేసీ, కాళ్ళు నేలకి ఆనాక నడుచుకుంటా వచ్చేసేం.
ఈ ఆటేదో బావుందనిపించింది. ఇంకేముందీ... వాటర్ ప్రూఫ్ వాచ్ ల యాడ్స్ కి మోడెలింగ్ చేసెయ్యటమే నెక్స్ట్ అని సంబర పడిపోయాం.కానీ ఆ తర్వాత మా లాంటి లేత ఈతగాళ్ళూ, బాల ఈతగాళ్ళూ ఎక్కువైపోవటం తో స్విమ్మింగ్ పూల్ హెవీ ట్రాఫిక్ ఉన్న హైవే రోడ్ మీద కార్లకి అడ్డంగా పరిగెట్టే ఆడంగుల పరుగు లా తయారయ్యింది. అడ్డదిడ్డంగా ఎవడికొచ్చినట్టు వాడు ఈత కొట్టేస్తుండటం తో ఎక్కడ ఎవడి కాలు తగుల్తాదో, ఎవడి చెయ్యొచ్చి కొట్టి ఎవరి నోరు సారీ అంటాదో తెలియకపోయేది. గ్లాస్ పెద్దదయినప్పుడు పెగ్గు చిన్నదిగా కనిపించడం లో ఆశ్చర్యం లేదు కదా. థీరీ వరకూ వచ్చు కాబట్టీ ప్రాక్టికల్స్ తర్వాత చేసుకోవచ్చులే అన్న ధైర్యం తో ఓ రెండు వారాలు సెలవు ప్రకటించాం. మేము తిరిగొచ్చేసరికి మా కంటే లేట్ గా జాయినయిన పిల్లకాయలంతా చేప పిల్లల్లాగా నానారకాలుగా ఎడా పెడా ఈదేయ్యటం చూసి మా అహం దెబ్బతింది. ఆ తర్వాత ఆశ్చర్యమేసింది. పిల్లకాయలకి నేర్పించే ట్రైనర్ వేరే ఉన్నాడు. పక్కకి తిరిగే సరికి కుర్చీలో కూర్చొని సింహగర్జన లాగా గురక తీస్తూ నిద్రపోతున్నాడు మా ట్రైనరు. నిద్ర లేచే సూచనలు కనిపించడం తో వాడి కంట కనపడకుండా బయటకి వస్తుంటే మా ఆఫీస్ మేట్ కొబ్బరి కుమార్ (మలయాళీ) ఎదురయ్యాడు.
నేనుః "నువ్వేంట్రా ఇక్కడా?"
కొ.కు : "మా ఏరియా లో ఆరు నెలల్నుండీ నేర్చుకుంటున్నానూ... కానీ ఇంకా స్విమ్మింగ్ రాలేదు.. అందుకే ఇక్కడ జాయినవుతున్నాను.

నేనుః "ఒరే సుధాకరూ.. బెంగుళూర్ లో మనకంటే వరస్ట్ ఫెలోస్ ఉన్నారంటే.. నమ్మలేదు కదా... ఇప్పుడు చూడు వీడిని"
సుధాకర్ః నిజమే రా... అదిగోఓఓఓఓఓ...ఆ కుర్చీ లో కూర్చొని నిద్రపోతున్నాడు కదా... వాడిని మీటవ్వు... నీ పనయ్యిపోయినట్టే"
కొ.కు : ఇక్కడన్నా నాకు స్విమ్మింగ్ వస్తుందా? మీలాగా?

"మా లాగా?? " (మాకేమొచ్చురా బొచ్చు? బుడగలు తియ్యడం తప్ప?)

కొ.కు : ఇప్పుడే పే చేసేస్తాను.. అతను బానే నేర్పిస్తాడు కదా?

"అబ్బోఓఓఓఓఓఓఓ... సూపరసలు. పిచ్చి తగ్గించమని పశువుల డాక్టరు ని అడుక్కున్నట్టే... నువ్ పండగ చేస్కో"

57 comments:

వేణూశ్రీకాంత్ said...

హహహహ పోస్ట్ అదుర్స్ :-))
ఇలా కుదరదు గానీ వర్షాకాలం మొదలయ్యే లోపు ఎలాగోలా చెన్నైకి బదిలి చేయించుకో అక్కడ రోడ్లమీద నాలుగు సార్లు తిరిగావంటే ఆటోమాటిగ్గా స్విమ్మింగ్ వచ్చేస్తాది :-)))

మన్లో మనమాట ఇట్లాంటి ఫోటోలెట్టినపుడు ఎక్కడిదో కూతంత క్లారిటీ ఇయ్యాల లేదంటే మీ ఊర్లో ఈ స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందో అడేస్సిమ్మంటూ కుర్రకారు బేజారెత్తించేయగలరు :-P

వేణూశ్రీకాంత్ said...

"ఔను.. నేనొక గజ ఈతగాణ్ణి...!"

ఔనూ నాకు తెలవకడుగాతానూ.. గజ ఈత గాడంటే గజం దూరం మాత్రమే ఈదగలవాడని ఈ మద్దిన డిక్షనరీలో అర్ధంకానీ మార్చీసినారేటి :-P

జలతారు వెన్నెల said...

Raj , hilarious post.
నవ్వి నవ్వి ఇంక నవ్వలేక కామెంట్ రాస్తున్నాను.

రసజ్ఞ said...

"గుండు చేయించుకుంటే పోయేది అందమే గానీ... చుండ్రు కాదురా", "పిచ్చి తగ్గించమని పశువుల డాక్టరు ని అడుక్కున్నట్టే..." వంటి మీ మార్క్ పంచ్ లు ఎప్పటిలాగే చాలా బాగున్నాయి.
"శరీరం లోని శక్తంతా ఎవరో స్ట్రా పెట్టి తాగేసినట్టు అయిపోయేది" అదేదో యాడ్ (గ్లూకోస్ అనుకుంట), కొన్ని పద ప్రయోగాలు చదువుతున్నప్పుడు గౌతం గారు (తోటరాముడు) వ్రాసిన ఈదలేని గోదావరి గుర్తొచ్చాయి.
మీరు స్విమ్మింగ్లో నిజంగానే కింగ్ అయిపోయి ప్రపంచ దేశాల పర్యటన ఈదుకుంటూ చెయ్యాలని కోరుకుంటున్నాను :)

y.v.ramana said...

"తాగుబోతులు మందెయ్యడానికి రీజనుండాలా? గాడిదలు ఓండ్ర పెట్టడానికి అకేషన్ ఉండాలా? జాతి లక్షణం అంతే"

అద్భుతం. టపాలో ఇట్లాంటి సుభాషితాలు లెక్కకు మించి ఉన్నాయి. ఇవి రాయడం మీకు మాత్రమే సాధ్యం. గ్రేట్!

Padmarpita said...

"ఔను.. నేనొక గజ ఈతగాణ్ణి...!" super duper comedy.

Padmarpita said...

"ఔను.. నేనొక గజ ఈతగాణ్ణి...!" super duper comedy :-)

చాతకం said...

LOL. I got made in china tag on my stuff. Is the instructor's name Dinakar? ;)

సుభ/subha said...

మాకేమొచ్చురా బొచ్చు? బుడగలు తియ్యడం తప్ప? వామ్మో ఇంత ఘోరమైన కామెడీనా? నవ్వించి చంపేస్తారా ఏందీ :):):)
ఇందు మూలంగా రసజ్ఞ గారి కోరిక కూడా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను :)

శశి కళ said...

హ...హ...ముక్కులోది నీళ్ళలోకి రాకుండా చూసుకోండి :)))))))))))))) ఏమి వ్రాస్తావు రాజ్

రాజ్ కుమార్ said...

వేణూజీ.. నేను జన్మ లో మళ్ళీ చూడకూడదూ అనుకుంటున్న ప్లేస్ లలో చెన్నై ఫస్ట్ ప్లేస్ లో ఉందండీ ;)
నా డౌటేంటంటే చెన్నై లో వర్శాలు పడతాయా?? విడ్డూరం కాకపోతే ;) క్లారిటీ ఇచ్చానండీ.. థాంకులు
గజఈతగాడి మీనింగ్ సరిగ్గా కనిపెట్టేరు ;) ;)

జలతారువెన్నెల గారూ ధన్యవాదాలు ;)

రాజ్ కుమార్ said...

రసజ్ఞ గారూ.. హ్మ్మ్... తోటరాముడు గారు ఆ పోస్ట్ రాసినప్పుడు మేమూ భలే త్రిల్ అయ్యాం. ఆల్మోస్ట్ సేం ఎక్స్ప్పీరియన్స్ ;) కంటెంట్ లో పోలికలు ఉన్నాగానీ రాతల్లో పోలికలు ఉండవు లే అనుకున్నా.. ఈ రోజు మళ్ళీ చదివాను.. అనుకోని విధం గా చాలావి కలుస్తున్నాయ్.. వాఆఆఅ..వాఆఆఆఅ
ధన్యవాదాలు

రమణ గారూ థాంక్యూ వెరీ మచ్ అండీ

పద్మార్పిత గారూ థాంక్యూ అండీ

Sravya V said...

హ హ 30 రోజుల్లో ఈత కోర్సా :-)
ఇంతకీ గజఈతగాడు అంటే అర్ధం చెప్పి బ్రతికించారు వేణు గారు లేకపోతే మహ confuse అయ్యేదాన్ని :P

రాజ్ కుమార్ said...

చాతకం గారూ.. పేరు తెలీదండీ.. దినకర్ కాదు.. ష్యూర్ ;) థాంక్యూ

సుభ గారూ.. మరీ ప్రపంచ దేశాలన్నీ అంటే కష్టమేమో.. ;( థాంక్యూ

శశిగారూ... ధన్యవాదః

చాణక్య said...

చాల్రోజుల తర్వాత.. సూపర్! :)

..nagarjuna.. said...

చేపల చెరువులో ఈతలపోటీ, అండమాన్ దీవులకు వలస...

కెవ్వున్నర కెవ్వు

శ్రీనివాస్ said...

కేక

శ్రీనివాస్ పప్పు said...

"తాగుబోతులు మందెయ్యడానికి రీజనుండాలా? గాడిదలు ఓండ్ర పెట్టడానికి అకేషన్ ఉండాలా? జాతి లక్షణం అంతే"

వామ్మో క్రెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వూఊఊఊఊఊ రాజ్

Anonymous said...

Navvaleka chastunnaa babu, punch le punch lu... :))

--
Photon

Lakshmi Naresh said...

"ఒరేయ్ సుధా...నాకెందుకో తేడా కొడుతుందిరా... నిజంగా మనకి స్విమ్మింగ్ వస్తాదంటావా?"
"గుండు చేయించుకుంటే పోయేది అందమే గానీ... చుండ్రు కాదురా"
"అంటే........"
"మన జేబుల్లో డబ్బులకి మొప్ప లొచ్చీ.. నీట్లో ఈదుతున్నాయ్ కనిపించటం లేదా?? ఈ మిలట్రీ వోడి మీద నాకు నమ్మకం లేదు"
"కుక్కతోక పట్టుకొని గోదారి ఈదడం అంటే ఇదేనంటావా?"
"మరి? వాడు చూశావా ఎవడో కాల్చి వాత పెట్టినట్టు ఉండుండి ఎలా అరుస్తున్నాడో?? ఇంత వైల్డ్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడంటావ్?"
"తాగుబోతులు మందెయ్యడానికి రీజనుండాలా? గాడిదలు ఓండ్ర పెట్టడానికి అకేషన్ ఉండాలా? జాతి లక్షణం అంతే

ilaa chepthu pothe.prathi daanii navvukunnaa...

"ఎవడి పిర్రకి వాడే ఇంజెక్షన్ చేసుకొని అరిచినట్టుంది"

ధైర్యే ...సాహసే విజయశాంతేఏఏఏఏఏఏఏఏఏఏఏఏ... అనుకొని దూకేశాం.
హెవీ ట్రాఫిక్ ఉన్న హైవే రోడ్ మీద కార్లకి అడ్డంగా పరిగెట్టే ఆడంగుల పరుగు లా తయారయ్యింది.
"అబ్బోఓఓఓఓఓఓఓ... సూపరసలు. పిచ్చి తగ్గించమని పశువుల డాక్టరు ని అడుక్కున్నట్టే... నువ్ పండగ చేస్కో

nuvvu kekehee...

Anonymous said...

హమ్మా...నవ్వీ నవ్వీ కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయ్ రాజ్బాబు .

<>
ఇదేంటీ? అహ...ఇదేంటనడుగుతున్నా.....!!

బంతి said...

ha ha super :)

Raviteja said...

రాఘవేంద్రరావు సినిమా లో రమ్యకృష్ణ ని తలచుకొని :-P
హహహ హహహ హహహ సూపర్ పోస్ట్

రాజ్ కుమార్ said...

శ్రావ్య గారూ.. ముప్పై రోజుల్లో అని కాదు.. పాతిక క్లాసుల్లో... మేము రెండు నెలలు వెళ్ళాం ;)
వేణూజీ థాంకులు... లేకపోతే శ్రావ్యగారు కన్ఫ్యూజన్ లో ఎక్కువ కమెంట్లు పెట్టేసేవారు.. ;)

చాణక్యా.. ధన్యవాదః ఎలా ఉన్నావోయి? ;)

చారీ... ఏదో అండమాన్ మీద ఉన్న ప్రేమ తో అలా ;)
థాంకులు

రాజ్ కుమార్ said...

శీనన్నా... నీ కమెంటుకన్నా నీ పేరే పెద్దదిగా ఉన్నాదే.. ;) ధన్యవాదః

పప్పుసారూ.. థాంక్యూ వెరీమచ్..

ఏమయ్యా... ఫోటానూ యాడికి పోయావు? ఇలా అజ్ఞాతావతారం లో ఉన్నావేమి? థాంకులు

రాజ్ కుమార్ said...

థాంక్యూ వెరీ మచ్ నరేషా ;)

లలిత గారూ.. ఇంద రుమాలు.. కళ్ళు తుడుచుకోండి.. థాంక్యూ అండీ ;)


బంతీ, రవితేజా.. థాంక్యూ ;)

Chandu S said...



చాలా బాగా రాశారండీ. ఇంకోసారి మళ్ళీ చదవాలి

Jyothi Peddireddy said...

రాజ్ కుమార్ గారు సూపర్ గా రాసారండి... చదివినంత సేపు నవ్వుతూనే ఉన్నాను. చదివాకా కూడా నవ్వుతున్నాను :)

Sai Kiran said...

Raj Kumar garu,
Super Post andi...
hats off to you...

chubby said...

rajkuuuuu superga undi... last line super... :)

రాజ్ కుమార్ said...

శైలజ గారూ.. ధన్యవాదములు ;)

జ్యోతిరెడ్డి గారూ, సాయి కిరణ్ గారూ.. థాంక్యూ అండీ

థాంక్యూ వెరీ మచ్ కోటా

Priya said...

హహ్హహ్హ్హహ్హహ్హహ్హ... అమ్మా.. ఇంక నా వల్ల కాదు బాబు! ఏం రాస్తారండీ బాబు మీరు! నవ్వీ నవ్వీ కడుపునొప్పోస్తోంది. అన్నట్టూ ఎ.ట్రై ని మీరు వర్ణించిన తీరు చదివితే నా బర్త్ సర్టిఫికేట్ బాబాయ్ గుర్తొచ్చాడు :D

Naresh said...

nice.....one

రాజ్ కుమార్ said...

ప్రియ గారూ, నరేష్ గారూ ధన్యవాదాలు ః)

Gowri Kirubanandan said...

ఇంతకీ మీకూ, మీ స్నేహితులకి ఈదడం వచ్చిందా లేదా.
చాలా రోజుల తర్వాత రాసినా మంచి పోస్ట్. నిజంగా నవ్వి నవ్వీ కళ్ళంబట నీళ్ళు వచ్చేసాయి.

రాజ్ కుమార్ said...

Gowri Kirubanandan గారూ.. నాకు స్విమ్మింగ్ వచ్చిన రోజున "ఈతకొట్టడం ఎలా?"
అనే టైటిల్ తో పోస్ట్ రాసి మనవి చేసుకుంటానండీ.. ;)

ధన్య్దవాదాలు

Found In Folsom said...

మీ పొస్టులు ఆఫీస్ లొ చదవకూడదు అని ఎన్ని సార్లు అనుకున్నా బుద్ది రాదే...నవ్వు ఆపుకోలేక చచ్చిపోయాను. ఇంక నా వల్ల కాదు. ఇంటికి వేల్లాకే మిగతాది పూర్తి చేసేది. బై ద వె, మా ఫ్రెండ్స్ కి కూడా మీ బ్లాగు బాగా నచ్చింది. సరే మొత్తం చదివాకా, మళ్ళా కామెంట్ పెడతాను.

రాజ్ కుమార్ said...

Found in folsom గారూ థాంకులు థాంకులు..
ఒకటి టపా మెచ్చినందుకు.. ఇంకొకటి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసినందుకు ;)
అన్నట్టూ ఇంకా ఇంటికెళ్లలేదాండీ?

Found In Folsom said...

హమ్మా....ఇన్ని రోజులకి కుదిరింది...మీ పొస్ట్ మొత్తం చదవటానికి. సూపర్ అంటే సూపర్. నవ్వి నవ్వి పొట్ట నొప్పి పుడుతుంది అంటే నమ్మండి. మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వులు పంచుతూ ఉండాలి. బాగా దుఖం బాధ వేసినప్పుడు ఎక్కడకి రావలో అలొచించక్కర్లేదు.. :)

Karthik said...

మీ పోస్ట్ సూపర్ గా..చదువుతుంటే ఒకటే నవ్వు వచేస్సింది..ఎంతగా అంటే పొట్ట పగిలేలా..మీరిలాంటి రచనలు ఇంకా అందించాలని మనవీ!

రాజ్ కుమార్ said...

found in folsom గారూ, ఎగిసే అలలు గారూ హృదయపూర్వక ధన్యవాదాలండి ;)

రాజ్ కుమార్ said...

found in folsom గారూ, ఎగిసే అలలు గారూ హృదయపూర్వక ధన్యవాదాలండి ;)

ఆ.సౌమ్య said...

హహహహ మొత్తానికి గజం ఈత కూడా నేర్చుకోలేదన్నమాట....మనలో మనమాట ఆ ట్రైనరు పేరు దినకర్ ఏమో కనుక్కో! ;)

ప్రవీణ said...

హహ హ్హ్హ హ్హా.. అబ్బబ్బ నవ్వి నవ్వి కడుపునొప్పి వచ్చేసింది. ఇంతకూ ఈత వచ్చిందా? గజం దురమన్నా ఈద గలుగుతున్నారా?

Sirisha said...

ఎ.ట్రైః హ్మ్మ్.. ఇప్పుడూ... నేనున్నాను కదా... నేను స్నానం చెయ్యకుండా పూల్ లోకి దిగిన నీట్లో మీకు ఈత నేర్పిస్తానంటే ఒప్పుకుంటారా?
"ఆఆఆఆఆఅ...ఇప్పుడు సివియారిటీ అర్ధమయ్యింది. గేదెలూ, గాడిదలూ దిగిన చెరువు లోకి మేం దిగం కదా. ఇప్పుడే చేసొస్తాం"

this is excellent... chala rojulu ayyindi inta gattiga inta sepu navvi.... too good....

Unknown said...

Chamesarandi rajkumar garu...mi shadow the endo evaro twitter lo edithe..mi blog motham sadive bagyam kaligindi..._/\_

Raju Narayan said...

super ante superu anthe..
dialougues kummesav asalu...

సంతు (santu) said...

రచ్చ రంబోల...
కెవ్వు కేక... :)

రాజ్ కుమార్ said...

సౌమ్య గారు.. అంతె కదా మరీ.. పేరు ఏమిటో తెలీదండి ;)))

ప్రవీణ గారు రామాయణమ్ అంతా వినీ ఏదోఅడిగినట్టు ఉందండి ;) ధన్యవాద:

శిరీష గారూ హృదయపూర్వక ధన్యవాదాలు :)

DisIz RanDy గారొ.. ఎవరో పుణ్యం కట్టుకున్నారన్న మాట. థాంక్యూ వెరీ మచ్ అండీ

Raju Narayan గారు, సంతు గారో థాంకులు థాంకులు ;)

Deepthi said...

Enti Rajkumar sudhkar gaarini baga vadeskunara blog kosam....:P

Chala bavundi as usual..:)

masthan said...

Chala baagundi raaj.... nennu chusina tharvatha naaku edo oka incident meeda blog raayalani exciting vachindi....

masthan said...

Chala baagundi raaj.... nennu chusina tharvatha naaku edo oka incident meeda blog raayalani exciting vachindi....

రాజ్ కుమార్ said...

@దీప్తి.. తప్పట్లేదు మరి ;) థాంక్యూ
మస్తాన్ గా... కుమ్మెయ్యరా ;)థాంక్స్

Guruprasad B said...

Baboooyyyyy..... yevarandi babu meeru, asalu ila yela raseyyagalaru.
chala bagarastunnaru. super, i enjoyed alot.

Unknown said...

రాజ్ నవ్వి నవ్వి నా పొట్ట చెక్కలయింది .... నేను చెన్నై లొ ఈ మధ్యనే ఈత నెర్చొకోవటం మొదలె్ట్టా ... మీరు చెప్పిన సంఘటనలు అన్ని నాకు రోజూ జరుగుతున్నయి.... ముఖ్యంగా ఎలుగుబంటి ట్రైనర్ ఇక్కడా వున్నాడు ..
చాలా బాగా నవ్వించారు ....

ఢన్యవాదాలు ...
కిషొర్ బిట్రా.

రాజ్ కుమార్ said...

Guruprasad garu.. నేనేనండీ.. రాజ్ కుమార్ ని ;) థాంక్యూ.

కిషోర్ గారూ... చెన్నై లో వర్షం పడితే రోడ్ల మీదనే ఈత నేర్చుకోవచ్చట కదండీ ;).
ఎంతవరకూ వచ్చిందండీ ఈత? ఆల్ ది బెస్ట్ ;)

Unknown said...

మీరు పైన వ్రాసిన కామెంట్ ఇప్పుడు వున్న పరిస్తితి కి సరిగ్గా సరిపొతుంది.... ఇక నేను ఈత బాగా నేర్చుకున్నానండి, వేలచెరి స్విమ్మింగ్ పూల్ లో..