Monday, April 15, 2013

సంగతేటంటే...!


ఏహే..ఏహే.. ఓహో..ఓహో...

ఏమిరా నీ అంబర చుంబిత అకాల వికార వికృత అనన్య సామాన్య  స్వీయఘోషా విలాస కేళీ??


అంతరాత్మగాడివి అట్టర్ ఫ్లాపిచ్చిన స్టార్ హీరోలా సైలెంట్ గా ఉండాలి గానీ అర్ధంకాని తిట్లు తిడతావేట్రా?

"వద్దురా.. వద్దురా" అని మొత్తుకున్నా మొన్న బాద్షా సినిమా చూపించావు అప్పట్నించీ ఇలా..! అంతగా ఎగురుతున్నావు ఇంతకీ మేటరేంటీ?

చెప్తా.. చెప్తా...రెండు సంవత్సరాలు, 46 పోస్ట్లు, 56603 హిట్లు, 1500 కమెంట్లు, 98 మంది....

ఆపరా బాబూ నీ తొక్కలో లెక్కలు.. ఏ బ్లాగు బర్త్ డే చూసినా ఏమున్నది గర్వకారణం? పోస్టు సమస్తం నిందా స్తుతి ముసుగు లో సొంతడబ్బాల నాదం..! ఆ పోస్టుల్లో ఐదో ఆరో  పేరాగ్రాఫంత టైటిలూ ఫుల్ స్టాపంత మేటరూనూ. ఆ హిట్లూ, కమెంట్లలో సగం నీవే ఉంటాయి. 

సన్నాయికి కన్నాలున్నాయని వెక్కిరించాడంట నీలాంటోడే...

ఆ... నీ వాడేసిన విస్తరాకు మొహానికి సామెతలొకటీ.. ఫ్లాపు సినిమాల ఆర్తనాదాలూ, అరాయించుకున్న దోశలూ, తోమాల్సిన అంట్లూ, తిన్న తిట్లూ, తన్నించుకున్న తాపులూ, టోటల్ గా నువ్వూ-నీ దరిద్రం తప్ప ఇంకేమన్నా ఉన్నాయా నీ బ్లాగులో?


ఆ మధ్య చరిత్ర మీద సీరియస్ పోస్ట్లు రాసేను చదివి ఏడవరా  చెదపురుగు నాలుకున్నోడా...!

మనం నిజాలు మాటాడుకుందామా..? చరిత్ర పుస్తకాల్లో ఉంటాది. ఆ పుస్తకాలు ఉన్నోడు, చదివినోడూ ఎవడన్నా చూసి ఎక్కించేస్తాడు. అందులో నువ్ చేసిందేమిటి ప్రాసకోసం పిల్లిమొగ్గలెయ్యటం తప్ప?
ఏనాడైనా జ్ఞానాన్ని పంచే విషయాలు, భావుకత్వపు కవితలు, హత్తుకునే కధలు రాసిన, అట్ లీస్ట్ ట్రై చేసిన మొహమేనా నీదీ?




అంటే ఇప్పుడు ఏటంటావ్రా?


నీ పనికిమాలిన ఆరాటం, అనవసరపు ఆర్భాటం తప్ప అరచి గెంతాల్సిన పని లేదంటాను.
ఓ..కే. నువ్వింతగా చెప్పాక కాదంటానా...

"అమ్మలాలా.. అయ్యలాలా..ఈయాల్టి రోజున నా బ్లాగుకి రెండో పుట్టినరోజు... రెండేళ్ళు నా బ్లాగుని నడిపించిన బ్లాగ్లోక జనులకి సవాలచ్చ దండాలు. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉంటే వచ్చే ఏడాది కూడా ఇలాంటి పోస్టేస్తాను"




----ఇతి వార్తాః  ----




55 comments:

బంతి said...

అభినందనలు రాజ్ గారు మీ బ్లాగు ప్రయాణం ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటు....

..nagarjuna.. said...

Congrats :)

మొత్తం సదివేసి మళ్లొచ్చి కామెంటుతాను

వనజ తాతినేని/VanajaTatineni said...

రాజ్ గారు.. బ్లాగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు . హాయిగే మీ శైలి లో రాసుకుపోండి . మా లాంటి వాళ్ళ దారికి అడ్డు రాకండి బాబూ ! మా బ్లాగ్ చదివే వాళ్ళని కూడా ఎత్తుకుపోకుండా :):)

ఫోటాన్ said...

కంగ్రాట్స్ రాజ్!
నీ ప్రతి పోస్ట్ ఎంజాయ్ చేసాను, థాంక్ యు సో ముచ్ అండ్ కీప్ రైటింగ్ :))

ఆ.సౌమ్య said...

హహహ ఇక్కడ కూడా నీ మార్క్ వదలవేం! పనిలో పని చురకలు బాగానే అంటించావ్ ;)
దీర్ఘాయురస్తు బ్లాగుకి :))

Priya said...

కంగ్రాట్స్ రాజ్ గారు!
మీ బ్లాగ్ ఇంకా ఎన్నో.................. పుట్టిన రోజులు జరుపుకోవాలని, మీ చేతులు పెద్దగా రెస్ట్ తీసుకోకుండా ఇంకా బోలెడు పోస్ట్స్ రాయాలని.. బ్లాగ్ లోకంలో మీ బ్లాగ్ మరింతగా వెలగాలని మనసారా కోరుకుంటున్నాను :)

Anonymous said...

అంతరాత్మ ఉపదేశాలు వింటే బ్లాగులేకాదు కామెంట్లు కూడా రాయలేవయ్యా రాజ్బాబు .
నువ్వు అనవసరంగా కథలు కాకరకాయల జోలికి పోకు . నువ్వు కితకితలు పెట్టుకుని కులాసాగా ఏడుస్తుంటే అది చూసి మేం భోరు భోరున నవ్వేసుకుంటాం . ఎందుకు చెపుతున్నానో విను .... ఇలాగే కంటిన్యూ అయిపో

Sravya V said...

Good going ! Keep rocking Raj !

జలతారు వెన్నెల said...

Congratulations!!

బులుసు సుబ్రహ్మణ్యం said...

రెండేళ్లు నిండిన మీ బ్లాగు కి బోలెడు శుభాకాంక్షలు. మీరు ఇలాగే నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తుండాలి అని కోరుకుంటున్నాను.

రాస్తూనే ఉండండి.

జయ said...

అదేదో దానికి ఎక్కువ కాకుండా, ఇంకోటేదో దానికి తక్కువ కాకుండా...చక్కగా సమపాళ్ళల్లో చాలా బాగుంది:) బోల్డు అభినందనలతో, ప్రతి రోజు కావాల్సినన్ని నవ్వుల పువ్వులు పూయించేయాలి అని కోరుకుంటున్నాను.

తృష్ణ said...

congrats! keep going..all the best :-)

Padmarpita said...

many more happy returns to your blog.

Anonymous said...

many more returns to your blog.

చాతకం said...

Congratulations & best wishes!

సుజాత వేల్పూరి said...

"థర్టీ యియర్స్ ఇండస్ట్రీ ఇక్కడ" అని చెప్పుకునే రోజూ త్వరలోనే రావాలని కోరుకుంటూ..శుభాకాంక్షలబ్బాయ్ :-))

శశి కళ said...

హ....హ....సూపర్.ఎంత టెన్షన్ ఉన్నా నీ బ్లాగ్ చూస్తె పరార్.నవ్వి నవ్వి....ఏమి వ్రాస్తావు రాజ్ :))))నీ బ్లాగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు .
అవును కొత్త లాగు గట్రా కొనిపెట్టావా లేదా బ్లాగ్ కి ?

గిరీష్ said...

Congratulations Raj... Be happy and make others happy with ur words. All the best!

Raviteja said...

మీ బ్లాగ్ కీ పుట్టిన రోజు శుభాకాంక్షలు. :D తెలుగు టీవీ కళాకారులుకు దాసరి మద్దతు ఇచ్చినట్లు మీ బ్లాగ్ కీ నా ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉంతుంది :D

Sujata M said...

hahaha పచ్చ్హీస్ సాల్ సె హం భి బైఠె హై చార్మీనార్ పె. ఆయినా నా బ్లాగ్ లో కూడా హిట్లూ, కామెంట్లలో సగానికి పైగా నావే ఉంటాయి. Same story. Btw, "నో కా బ్లా స" అని ఒక సంఘం పెట్టాను. చేరతారా ? ఈ పోస్టు కి చాలా కామెంట్లొస్తాయనుకోండి. హాపీ బర్థ్ డే !

మాలా కుమార్ said...

Congratulations.

Karthik said...

మీ బ్లాగ్ కు పుట్టిన రోజు శుభాకంక్షాలు... ఇంకా ఇలాంటి పుట్టిన రొజులు జరుపుకొని మమ్మల్ని కడుపుబ్బా నవ్వించగలరు....

శిశిర said...

Congratulations. :)

Unknown said...

congraatulations.mee blog padi kaalaala paatu ellagay konasaagaale.

Unknown said...

congratulations.

చాణక్య said...

'జ్ఞానాన్ని పంచే విషయాలు, భావుకత్వపు కవితలు, హత్తుకునే కధలు....' గూగుల్ ఫ్రీగా స్పేస్ ఇచ్చిందని ప్రతివాడూ రాసేస్తున్నాడు. అట్టాంటి కవులు, రచయితలు బ్లాగుకొకడున్నాడు. మీలాంటి వాళ్లే కరవు బాబూ! రాయండి.. రాయండి.. రాస్తూనే ఉండండి.. లిఖ్తే రహో! :)

రాజ్ కుమార్ said...

బంతి గారూ.. చిత్తం.. అలాగే.. ;) థాంక్స్

నాగార్జునా.. మొత్తం చదివేసి మళ్ళా వచ్చేంత మేటర్ లేదులే.. ఇంకా చదూతున్నావా? మంగిడీలు

వనజవనమాలి గారూ హిహిహి నాకంత సీన్ లేదండీ. ;) థాంకులు

రాజ్ కుమార్ said...


ఫోటానూ.. థాంకులు అబ్బాయా ;)

అ.సౌమ్య గారూ అటులనే అంతా తమ ఆశీర్వాదః

ప్రియగారూ మీ కోరిక నెరవేరాలని నేను భీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలండీ

రాజ్ కుమార్ said...



లలితా మిస్సూ.. ఏదో రాయాలని రాస్తాంగానీ.. అంతరాత్మ మాట వినడానికి నేనేమైనా పిచ్చోడ్నా? ;) మీరు చెప్పినట్టే చేస్తాను
థాంకులతో ;)

శ్రావ్య గారూ, జలతారు వెన్నెల గారూ, ధన్యవాదములు.

బులుసు గారూ మీ ఆశీర్వాద బలము చేత ఇలా రాస్తూ ముందుకు పోతా.. థాంకులు

రాజ్ కుమార్ said...

జయ గారూ.. దేనికి ఎక్కువ? దేనికి తక్కువ? నాకు గ్యాంగ్ లీడర్ సినిమాలో రావుగోపాలరావు గుర్తొస్తున్నాడు సుమండీ ;) థాంక్యు ;)

పద్మార్పిత గారూ, అనానిమస్ గారూ, చాతకం గారూ ధన్యవాదాలండీ

సుజాత గారూ.. బాగా ఎక్కువైపోతాదేమో నండీ ;) థాంక్యూ.

రాజ్ కుమార్ said...



శశికళ గారూ థాంక్యూ, కొత్త లాగూ వేస్తే గుర్తు పట్టరేమోననీ వెయ్యలేదు ;)

థాంక్యూ గిరీశా.. ;)

రవితేజా నీ దాసరి ఎంకరేజ్మెంట్ కి నాకు కళ్లల్లో రక్తం కారుతుందయ్యా.. ;) ;)

రాజ్ కుమార్ said...




సజాత గారూ అవునా... అయినా మన బ్లాగు లో మనిష్టమొచ్చినన్ని పెట్టుకుంటామండీ.. మనిష్టం ;)
ఇంతకీ నో.కా.బ్లా.సా అంటే ఏంటండీ? దాని ఎజెండా ఏమిటో చెప్తే జాయినయ్యిపోతా.. ధన్యవాదముల్స్

మాలా కుమారు గారూ, శిశిర గారూ, సాంబు గారు హృదయపూర్వక ధన్యవాదాలండీ

చాణక్యా.. అలా అంటావా.. అలాగే చేద్దారి.. ;) థాంక్సో

నిషిగంధ said...

అభినందనలు :)

"ఏమిరా నీ అంబర చుంబిత అకాల వికార వికృత అనన్య సామాన్య స్వీయఘోషా విలాస కేళీ??"

ఇంత సంక్లిష్ట సమాస పదకేళిని మీరు మాత్రమే సృష్టించగలరండీ! :))

It's always pleasure to read your posts.. Keep going!



Found In Folsom said...

ayyo...identi meeru cinema review rastunnaru anukunnanu....:)Anyway, congratulations on the Blog Anniversary. May you keep blogging for many years to come and spread many more smiles on our faces...:)

మనసు పలికే said...

నీ తొక్కలో అంతరాత్మ ఈ రకంగా కూడా ఆడేసుకుంటుందా? దాన్నిటు పంపించు, రెండు వాతలు పెట్టి పంపిస్తా ;)

టపా సూఊఊఊఊఊపరు.. హ్యాపీ బర్త్ డే "ఔను నేను బ్లాగ్ మొదలు పెట్టాను"

ప్రియ said...

మీ భలే భలే బ్లాగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు రాజ్ గారు :)

జ్యోతిర్మయి said...

రాజ్ గారూ మీబ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు.మీ స్టైలే వేరు. మీరిలాగే సరదాగా నవ్విస్తూ కంటిన్యూ అయిపోండి అభినందనలు.

వేణూశ్రీకాంత్ said...

బ్లాగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు నీకు అభినందనలు రాజ్. నీ బ్లాగ్ కి వస్తే ఎర్రటి ఎండల్లో తిరిగి ఇంటికొచ్చి వట్టివేళ్ళ తడికల చల్లదనాన్ని అనుభవిస్తూ ఆ కమ్మటి వాసన పీలుస్తూ, మట్టి కుండలోని చల్లటి నీళ్ళు తనివితీరా తాగినట్లు అధ్బుతమైన ఫీలింగ్ వస్తుంటుంది రాజ్. ఇలాగే చక్కని టపాలు రాస్తూ నీ విజయయాత్రని అప్రతిహతంగా కొనసాగించు.

రాజ్ కుమార్ said...

నిషిగారూ.. సంక్లిష్టం, సమాసం అని మీరు చెప్పేదాకా తెలియలేదండీ.. ఏదో ఫ్లో లో రాసేశా ;)
థాంక్యూ ;)

found in folsom గారూ ఈ మధ్య సినిమాలేం లేవు కదండీ.. పెద్దగా చూడలేదు.
పరిస్థితులు అనుకూలిస్తే మీ కోరిక ప్రకారమే కొనసాగిస్తానండీ.. ధన్యవాదాలు.

మనసుపలికే అలాగే.. ;) పంపిస్తా ;) విషెస్ కి నో థాంక్స్..

రాజ్ కుమార్ said...



ప్రియగారూ మీకు భలే భలే థాంకులు

జ్యోతిర్మయిగారూ ధన్యవాదాలండీ.. ;)

వేణూజీ.. ఏం సెప్తిరీ ఏం సెప్తిరీ... ;) థాంక్యూ సో మచ్ ;)

kiran said...

ఏనాడైనా జ్ఞానాన్ని పంచే విషయాలు, భావుకత్వపు కవితలు, హత్తుకునే కధలు రాసిన, అట్ లీస్ట్ ట్రై చేసిన మొహమేనా నీదీ?

ఇదే గనక నువ్వు చేసుంటే ....40 కాదు 04 commentlu కూడా వచ్చి ఉండేవి కాదు...

ఇంత మంది అభిమానం దొరక్క పోయేది...

ఎందుకొచ్చిన గోల మనకి..ఈ రూటే బాగుంది...మార్చకు... :)

Hearty Congratulations..!!!! :)

రాజ్ కుమార్ said...

ఏదో అన్నాను గానీ మనకంత సీనుందా కిర్నా ;)
బోలెడు థాంకులు ;) ;)

మధురవాణి said...

కాస్త ఆలస్యంగా.. Congratulations! :)

సంతు (santu) said...

ఇంకాస్త ఆలస్యంగా..... పుట్టిన రోజు శుభాకాంక్షలు to "ఔను.. నేను బ్లాగ్ మొదలుపెట్టాను"........... :) :)

http://2.bp.blogspot.com/-p7UuAHbZfFA/ULuKITGq4cI/AAAAAAAAAdM/wWe72w8qhFE/s1600/congratulations+%281%29.gif

Anupama said...

Berry big Congratulations :)

రాజ్ కుమార్ said...

@madhura garu, santhu garu, anupama garu thank you very much :)

Kottapali said...

వానాకాలంలో కొట్టుకొచ్చిన మబ్బన్నా కురవకుండా వెళ్ళిపోతుందేవోగాని, మీ బ్లాగుపోస్టు పడితే మాత్రం నవ్వుల వాన కురిపించకుండా పోదు. నూరేళ్ళు ఇలాగే మూడు పోస్టులూ మూడొందల కామెంట్లుగా వర్ధిల్లాలి

Rupakula Ravikumar said...

very fine. and congratulations

Rupakula Ravikumar said...

very well blog and congrats

Unknown said...

బొమ్మ సూడ బోతే బుల్లి అబ్బాఇ లాగ ఉంటివే?
కాని రాతలు చూస్తే పదాలికి పైత్యం తెప్పించి
వరసలు మార్ఫింగ్ చేసి ఆడితిరే?

ఏదైతే ఎమిలే బాబు, ఇలా రాస్తూ, మాకు అనందం కలుగ చేయాలని కోరుకుంటూ...
Rajasekhar

Unknown said...

hmm hmm, why you are not posting my comments?
I have posted your blog in my facebook? You are hurting me dear...

రాజ్ కుమార్ said...

నారాయణస్వామి గారూ.. మీ ఆశీస్సులకి ధన్యవాదాలండీ ;)

Rupakula Ravi Kumar gaaroo ధన్యవాదాలు ;)

Raja Sekhar Bandreddy గారూ.. ధాంక్యూ వెరీ మచ్ ;)
అలా అపార్ధం చేసుకోకండీ. మీరు కమెంటిన రోజున నేను జర్నీ లో ఉన్నాను తూర్పుకి పోయే రైలు లో..
ఫోన్ కి నెట్ ఫెసిలిటి ఉందిగానీ సిగ్నల్ కూడా ఉండాలిగా.. అందుకే ఆ ఆలస్యం. ;)

Srujana said...

congratulations Raj garu.. me blog lo posts anni follow avuthunta.. bhale rastarandi meru.. very nice.

paddu said...

ఓ బొజ్జ గణపయ్యా.. మా రాజ్ ఎప్పుడు ఇలానే అందరని తనదైన స్తైల్ లో కడుపుబ్బ నవ్వించాలని మనసారా కోరుకొంటూ...వినాయక చవితిశుభాకాంక్షల తో ...

paddu said...

ఓ బొజ్జ గణపయ్యా.. మా రాజ్ ఎప్పుడు ఇలానే అందరని తనదైన స్తైల్ లో కడుపుబ్బ నవ్వించాలని మనసారా కోరుకొంటూ...వినాయక చవితిశుభాకాంక్షల తో ...