అది 2012..!!
యుగాంతం అయ్యేలోపు పెళ్ళి చేసేస్కోవాలని పాకెట్లో ప్రింటవుట్ తీసిన ప్రొఫైల్ పెట్టుకొని చేతికి తాయెత్తులు, కాలికి కే.పీ.జే వారి కడియాలూ కట్టుకొని తిరుగుతున్నా వర్కౌటవ్వని దరిద్రపు రోజులు. ఆ దరిద్రానికి తోడు శూన్యమాసం దాపురించడం తో ఆఫీస్ లో ఆన్సైట్ ట్రిప్ (ఎప్పటిలాగే సౌత్ కొరియా) కి ఓకే చెప్పేశాను. నేనూ, సుధాకర్ గాడూ వారం ఐదు రోజులూ ఆఫీసు లో కొట్టించుకుంటూ, శనాదివారాలు దేశం మీద పడితిరుగుతా కిమ్చీలు
చప్పరిస్తూ,సోజూ గుటకలేస్తా కొరియాని ఉద్దరిస్తూ ఉండేటోళ్ళం.
ఒకానొక ఆదివారం అదేదో దిక్కుమాలిన షాపింగ్ కాంప్లెక్స్ నుండి బయటకొస్తుంటే...మమ్మల్నే టార్గెట్ చేస్తూ ఇద్దరు కొరియన్ అమ్మాయిలూ, ఒక అంకులూ మేం నడుస్తున్న వైపే మా దారికి అడ్డంగా రావడం మొదలెట్టారు. వాళ్ళు మా వైపు ఎందుకొస్తున్నారో తెలుసు కాబట్టీ మేం నడకలో వేగాన్ని పెంచాం.
"నమస్కార్..ఆప్ కహా సే ఆయా?" అని అని స్వచ్చమైన హిందీ వినిపించడం తో ఆశ్చర్యంతో ఆగిపోయాం.
"నీ కక్కుర్తి తగలడ... అమ్మాయి కనిపిస్తే చాలు... నోరెళ్ళ బట్టి చూస్తా నుంచుండి పోవటమే?" అని అంతరాత్మ ఆక్రోశించింది. "నోర్ముయ్ ఎదవకానా...ఏనాడైనా ఏ పిల్లైనా పిలిచి నీతో మాటాడిందా ?? పుట్టి బుద్దెరిగాక ఒక అందమైన అమ్మాయి పిలుస్తుంటే ఆ మాత్రం స్పందించమా? పైగా కరువులో కటకటలాడతా ఉన్నాం" అని అంతరాత్మని కోప్పడీసేన్నేను.
"మేరా నామ్ ప్రియా.. ఆప్ కహా సే ఆయా???" ఈ సారి ఇంకా తియ్యగా అడిగింది.
"ఇండియా....!!"
"ఆఆఆఆఆఆఆఆఆ...యేయేయేఏఏఏఏఏఏఏఏఏఏ" అని కొరియన్ స్టైల్ లో ఆనందపడిపోయి చప్పట్లు కొట్టేసి ఆ బ్యాచ్ మొత్తం మమ్మల్ని చుట్టు ముట్టేశారు... (దానర్ధమ్... ఆ..... దొంగల్లారా.... దొరికేశారూఊఊఊఊఊఊ)
"హిందీ వచ్చా మీకూ?? "( ఆ పిల్ల హిందీ లోనే అడిగింది.. కానీ నాకు హిందీఎలర్జీ కదా ...హోమియోపతి వాడినా తగ్గలేదు. అందుకని తెలుగులో చెప్తున్నా)
నేనుః ఆ.... ఇదర్ ఆయియే..... యే మే రాజహా...యే మేరా ఘర్ మేరా ఆశియా... (జై పవన్ కళ్యాణ్)
కొ.అమ్మాయి నా వైపు అదోరకంగా చూసింది. నేను మా సుధాకర్ గాడిని చూపించి "మా ఓడు హిందీ కుమ్మేస్తాడు" అని చెప్పి "భలే బుక్ చేశాను కదా" అని లుక్కిచ్చా. ఫోకస్ వాడిమీదకి పోయి డిస్కషన్ మొదలైంది.
ఇదేంటీ ఈ కొరియా పిల్ల హిందీ లో పుట్టి పెరిగినట్టు ఇలా ఇరగదీసేస్తుందీ.. అన్న ఆశ్చర్యం లోంచి మేం తేరుకునే లోపే... "మీరు రోజూ భగవంతుడు కి ప్రార్ధన చేస్తారా?" అని అసలు పాయింట్ కి వచ్చేసింది.
"నాకు దేవుడి మీద నమ్మకం లేదు.. ఇదిగో ఈడు రోజూ చేస్తాడు" అని నన్ను చూపించి ప్రతీకారమ్ తీర్చుకున్నాడు సుధాకర్ గాడు.
ఇక మొదలైంది. మేమ్ దేవుని సేవకులం, మీ ఫోన్ నంబర్ ఇవ్వండీ, అడ్రెస్ ఇవ్వండీ, ఈ పాడు ప్రపంచానికి పోయే కాలం వచ్చేస్తుంది. కానీ మన కోసం పెద్ద పడవ వస్తాదీ, మనమందరం మీటవుదాం... వగైరా వగైరా...చాలా చెప్పుకుంటా పోతుంది.
కొ.అమ్మాయి మరీ అందంగా ఉండి ముద్దు ముద్దుగా మాటాడ్డం వల్ల అనుకుంటా...సూటిగా సుత్తి తో కొడుతున్నా సుతిమెత్త గా ఉండటం తో నేను తలూపడం ఆపలేదు.
"ఏంట్రా ఈళ్ళ గోలా?" అన్నాడు సుధాకరు.
"తొందర్లో ప్రళయం వస్తాదంటరా.... వీళ్ళు చెప్పినట్టూ వింటే వీళ్ళ షిప్ ఎక్కే చాన్స్ తో పాటూ బెర్త్ కన్ఫర్మ్ చేస్తారంట" అన్నాన్నేను.
"అది ఎక్కే షిప్పు కాదురా... ముంచేసే టైటానిక్ షిప్" అనేసి సుధాకర్ గాడు చెయ్యట్టుకొని లాక్కుపోతుండగా "మిసెస్ లీ... మేం ఇంట్లో పొయ్యి మీద పప్పు పెట్టొచ్చాం. అర్జెంట్ గా వెళ్ళీ పోపు పెట్టాలి. మళ్ళీ కలుద్దాం" అని వీడ్కోలు చెప్పాను.
"నా అసలు పేరు నీకెలా తెలుసూ ?" అంది. దానికి సమాధానం చెప్తే వినిపించేంత దూరం లో లేకపోవడం తో "మీ దేశం లో ఉన్నవే రెండు పేర్లు... 1. మిస్. లీ, 2. Mr. kim. ఓ రాయి వేస్తే తగిలింది" అని మనసులో అనుకుని ఇచ్చిన pamphlet చేత్తో పట్టుకొని వచ్చేశాను.
ఆ రకంగా అదృష్టం కొద్దీ ప్రియ నీ, రాని ప్రళయం లో లేని పడవ ప్రయాణాన్నీ మిస్సయ్యాను.
***************************************************************************************************************************************
2012 చివర్లో ప్రళయం రాలేదు గానీ 2013 మధ్య లో నాకు పెళ్ళయ్యింది. ఆ రెండూ ఒకటే అని ఆ తర్వాత తెలిసింది.
నాకు ఎన్ని రకాల వంటలొచ్చో, నేనెంత గొప్ప వంటగాడినో సైద్దాంతికంగానూ, ప్రయోగాత్మకం గానూ మా ఆవిడకి నిరూపిస్తూ నా గొయ్యి నేనే తవ్వుకుంటున్న అమాయకపు రోజులవి.
ఓ రోజు మా ఆవిడకి 31వ వ చెప్పుల జత కొనడానికి సెంట్రల్ మాల్ కి వెళ్ళాను ఆవిడని వెంటేసుకొని. ఎంట్రన్స్ లో చిన్న ఫార్మ్ ఇచ్చి మీ డీటెయిల్స్ ఫిల్ చెయ్యండి సార్.. లక్కీ డ్రా తీస్తాం అని మొహమాట పెట్టెయ్యడం తో చేసిచ్చాను. నా అదృష్టం ఏ లెక్క లో ఉంటాదో నాతో పాటూ మీ అందరికీ తెలుసు. కాబట్టీ నేను దానిగురించి అక్కడే మరిచిపోయాను. కానీ ఒక వారం తర్వాత "మీరు లక్కీ డ్రా లో విన్ అయ్యారు.. యు ఆర్ ది లక్కీయెస్ట్ కపుల్.. రేపు సాయత్రం మీరు తప్పకుండా జంటగా వచ్చి గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకోండి.. గుర్తుంచుకోండి జంటగానే రావాలి" అని
ఫోనొచ్చింది. ఎత్తున కట్టిన గంటని ఎగిరికొట్టినప్పుడు కలిగే ఆనందం తో నేను మా ఆవిడ వైపు ఆరాధన గా చూశాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చే లాటరీ టికెట్ కొని రిజల్ట్ వచ్చే ముందురోజు పారేసుకొనే నా జాతకానికి మంచిరోజులొచ్చాయని మూగగా పొంగిపోయాను.
సాయంత్రం అరగంట ముందే ఆఫీసు నుండి బయలుదేరి చెప్పిన అడ్రెస్ కి వెళ్ళాము. ఎంట్రన్స్ లోసెక్యూరిటీ మీసాలాయన మా వైపు జాలిగా చూశాడు. ఎప్పుడూ చరణ్ బాబు లా ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉండే సెక్యూరిటీ ఆయన కళ్ళల్లో కరుణరసం కనిపిస్తుందేంటా అని ఆలోచిస్తూ
లోపలకి వెళ్ళాను. నాకు దూరంగా ఎక్కడో... "మే.......మే....." అని లీలగా వినిపిస్తుంది.
రిసెప్షన్ లో "మేము... లక్కీ కపుల్. ఎక్కడ మా గిఫ్ట్స్?" అని ముఖం దాకంత చేస్కొని అడిగాను. ఒక హాల్ లోకి దారి చూపించింది. అందులో ఓ పాతిక టేబుల్స్.. ప్రతి టేబుల్ కి ఒక అభాగ్యపు జంట మరియు వారి పాలిట ఒక నక్షత్రుకుడు కూర్చొని ఉన్నారు. చెత్తకుప్పల దగ్గర ఈగల రొదలా గోల గోల గా ఉంది అంతా. మరునిమిషం లో మేమ్ కూడా మా పాలిట రక్తకింకరుడి తో ఒక టెబుల్ దగ్గర కూర్చున్నాం. వాడు ఏదో వల్లకాడు రిసార్ట్ తాలూక బుక్ ఓపెన్ చేసి..." టెంప్ట్ చేసే టూరిస్ట్ ప్యాకేజీలూ, దానికి మేం కట్టాల్సిన అమౌంట్,వాడిచ్చే ఫెసిలిటీస్, డిస్కౌంట్ల" గురించి
క్లాస్ పీకుతూ మాకు మాటాడే చాన్సివ్వకుండా అల్సేషియన్ కుక్కకి అర్నబ్ గోసామి పూనినట్టూ సోది ఆపకుండా సుత్తి కొట్టడం మొదలెట్టాడు . "సమ్మెట పోటు" కి స్పెల్లింగ్ రాశామంటే అది అతిశయోక్తి కాదు. చెవుల్లోంచి రక్తాలు ఏరులై పారుతుంటే తుడుచుకోడానికి కర్చీఫ్ ఇస్తున్నాడు తప్ప చలించలేదు ఆ చెక్కేసిన పనసకాయ మొహం వాడు. వాడు చెప్పేదానికి ఒప్పుకోక పోతే నేనొక అసమర్ధ పీనాసి భర్త ని అని లోకం కాకులై కూస్తుందనీ, గోహత్యా పాపం గోరుచుట్టులా చుట్టుకుంటుందనీ, ఆ ఆఫర్ మిస్ అవడం కన్నా ఏ మ్యాగీ నూడుల్సో తిని సచ్చిపోడం బెటరనీ మా బ్రెయిన్ ని రిన్ సబ్బు పెట్టి వాష్ చెయ్యడానికి వాడి సర్వశక్తులూ ఒడ్డి రాక్షస ప్రయత్నం చేశాడు. థ్రిల్లర్ మంజు రేంజ్ లో ఫైటింగ్ చేసి చంపెయ్యాలన్నంత విరక్తిగా ఉన్నాగానీ ఓపిక లేక ఊరుకుండి పోయాను. రెండు గంటల పాటు "రేయ్" సినిమా చూపించి, చివరాఖరున మా ఆవిడ నోటికి భయపడి ముంబై బజార్ లో టోకున కొన్న Rs99 ల గ్లాసుల సెట్టు గిఫ్ట్ గా ఇచ్చి పంపించాడు.
ఈ లక్కీ డ్రా ఒక అందమైన స్కెచ్ అనీ, మన డీటెయిల్స్ తీసుకొని మనకే స్పాట్ పెట్టి, గిఫ్ట్‌లు ఆశ చూపెట్టి, మొహమాట పెట్టి ఆపై మట్టి కొడతారనీ తెలుసుకున్నాను.
బెమ్మీగా ఉన్నా, కుటుంబరావునయినా నా సుడికి తిరుగు లేదనీ, మడమతిప్పడం నా ఐరెన్ లెగ్గుకి అలవాటులేని పని అని ఋజువు చేసుకున్నాను.

రెండు వారాల క్రితం నాకు మా కింది ఫ్లోర్ ఆయన పరిచయం అయ్యాడు. వారం గడిచేసరికి వాళ్ళావిడా, మా ఆవిడా ఫ్రెండ్స్ అయ్యారు. రాకపోకలు జరిగి మేం కొంచెం క్లోజ్ అయ్యాము.
మూడ్రోజుల కిందట ఆయన మా ఇంటికి వచ్చారు.
అప్పుడూ.........
"బిజీ గా ఉన్నారా రాజ్?"
"అవునండీ...!! ఇప్పటిదాకా నిద్రపోయి ఇప్పుడే లేచి టీవీ చూస్తూ ఉన్నాను"
"హ్మ్... మీ వైపోళ్ళకి బాగా వెటకారం కదా..!! సరేగానీ రాత్రి 8pm కి ఏమైనా ప్లాన్ ఉందా? లేకా ఇంట్లో ఏమైనా పనులున్నాయా?"
"ఇంట్లోనే ఉంటానండీ...పిచ్చ ఫ్రీ..ఏంటి సంగతి?"
"అలా బయటకి వెళ్ళొద్దామా??"
"సూపర్..ఇంట్లో నాకు బోర్ కొట్టేస్తుంది. నేను రెడీ" (ఏదో హోటల్ కెళ్ళి కుమ్మేసి, పార్సిల్ తెచ్చేస్తే.. ఈరోజుకి వంట-అంట్లు తప్పుతాయి అని నా ఎదవైడియా )
"దెన్..ఫైన్. ఒక "బిజినెస్ మీటింగ్" ఉంది. ఎనిమిదింటికి రెడీగా ఉండండీ. నా కార్ లోనే వెళ్ళొద్దాం."
"బిజినెస్ మీటింగ్?? ఈ పదాన్ని ఎక్కడో.... ఎప్పుడోఓఓఓఓ విన్నట్టుందే..!!" (నా అంతరాత్మ గాడు అలార్మ్ కొట్టి ఏదో చెప్పాలనుకుంటున్నాడు)
"ఎంత కాలం ఈ జాబ్స్ చేస్తాం రాజ్.. వి షుడ్ డూ సమ్ సేఫ్టీ బిజినెస్..దిస్ ఈజ్ ది రైట్ టైమ్..!! నెలకి లక్ష నుండీ 8 లక్షలు సంపాదించే పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయ్ తెలుసా మీకూ?? "
ఈ డైలాగు విని నా అంతరాత్మకి క్లోరోఫాం చుక్కలు ముక్కులో పోసి పడుకోబెట్టేశాను. వాడు నిద్రలోకి పోతూ పోతూ "పోతావ్‌రా రేయ్... దుం....ప నా...శ...న....మే" అన్నాడు.
ఫిగర్ కొంచెం టెంప్టింగ్ గా ఉంది గానీ ఈ పార్ట్ టైం జాబ్ కీ ఆ లకారాలకీ సింక్ అవ్వట్లేదు అనుకొని "ఇంతకీ ఏంటా మీటింగ్... ఎలా?? హౌ?? " అని అడిగాను.
"Amway గురించి విన్నారా...? Top products in the world... profit for users.. bla bla...jil jil jiga jiga"
ఆ ఐదక్షరాల పదం వినబడగానే నా గుండెల్లో హిమేష్ రెష్మియా విషాద గీతం పాడటం మొదలెట్టాడు. ఫ్రీగా ఉంటానని చెప్పేశా. వస్తానని ఆల్రెడీ కమిట్ అయిపోయాను.. ట్రాఫిక్ జామ్ లో మున్సిపాలిటీ చెత్త లారీ వెనకాల ఇరుక్కున్నట్టూ అయిపోయింది నా పరిస్థితి.
గతి లేని పరిస్థితుల్లో కార్లో ఆయనతో బయలుదేరాను. దార్లో నాలాంటి కాబోయే బిజినెస్‌మేన్ లని పికప్ చేస్కొని వెళ్ళాం.
అదో పెద్ద... ఆడిటోరియం. కొంతమంది మైకాసురులు మార్కర్ తో స్టాలిన్ సినిమా లో సిరంజీయిలా 'ట్రీ' బొమ్మలేసి మరీ ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారు. చాలా మంది తన్నుకొస్తున్న పొట్ట కనిపించకుండా సూట్లేసుకొని కూర్చున్నారు.
మరి కొంతమంది టైట్ అయిపోయిన సూట్లేసుకొని లోపల సిక్స్ ప్యాక్ ఉన్నట్టూ కటింగిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు.మధ్య మధ్య లో నాలాంటి ప్రాణులు బిక్క చూపులు చూస్తూ చెప్పింది వింటూ తలాడిస్తుండగా నాలాంటి వాళ్లని తీసుకొచ్చిన వాళ్ళు మేం పారిపోకుండా కాపలా కాస్తున్నారు.
రిటైల్ వ్యాపారులు మనల్ని ఎలా దోచుకుంటున్నారో, Amway ప్రాడక్ట్స్ ఎంత గొప్పగా ఉంటాయో, ఈ బిజినెస్ ఎలా చెయ్యాలో, ఎంత లాభం గడించొచ్చో కుళ్ళి జోకులతో కలిపి చెప్తూ కొందరు మెదడు మేతగాళ్ళు మేయడం మొదలెట్టారు. ఆ తర్వాత ప్లాటినమ్,గోల్డ్, డైమండ్, అనబడు వర్గాల ఆమ్ ప్రజలు...అనగా ఆ సూట్లు వేసుకున్న బాబాయిలూ, మేకప్ వేస్కొని దిగిపోయిన పిన్నిగార్లూ వచ్చి మైక్ పట్టుకొని వంతులు వంతులుగా కనికరం లేకుండా "కసి ప్రేలాపన" తో కుమ్మి వదిలారు.
ఇలాంటి మీటింగ్స్ కి బలయిన నా సాటి అభాగ్యులకి నా సానుభూతి తెలియజేస్తూ, ఇలాంటివాటికి బుక్ అవ్వకుండా తప్పించుకునేదుకు వీలుగా, వాళ్ళు చెప్పే సోదంతా బుల్లెట్ పాయింట్స్ లో ఇస్తున్నాను.
1. Amway చైన్ బిజినెస్ లా కనిపిస్తుంది గానీ ఇది చైన్ బిజినెస్ కాదు. చైన్ బిజినెస్ లో ఇనిషియల్ గా డబ్బులు కట్టాలి. ఇక్కడ అక్కర్లేదు. మీరు మా బెస్ట్ ప్రోడక్ట్స్ కొనండీ. వాడండి. నచ్చక పోతే తిరిగిచ్చెయ్యండీ. మీ డబ్బు మీకు వాపస్. సో ఇక్కడ రిస్క్ లేదు.
మీరు జాయిన్ అవ్వండి. వీలయినంత మందిని జాయిన్ చెయ్యండి.
[టీవీ లో శనిహనుమాన్ యంత్రాలు, గుప్తనిధులు ప్రవహింపజేసే ధనలక్ష్మి యంత్రాలూ, రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు. డబ్బు వాపస్.. అని. ఇది కూడా చైన్ బిజినెస్సే.. ఎందుకో పాయింట్ 3 చదవండి ]
2. మేమంతా IIT, IIM లలో చదివొచ్చిన వాళ్ళం, IT,banking fields లో పనిచేస్తున్న వాళ్లమూ. ఆమ్వే ఒక అద్భుత వ్యాపార విధానం. మొదట్లో మాకూ మీలాగే ఏమీ తెలీదు. అర్ధం కాలేదు కానీ రైట్ డిసిషన్ తీస్కొని ఎంటరయ్యాం. ఇప్పుడు మాకు జాబ్ చెయ్యాల్సిన అవసరమే లేదు.
[జనాలని అట్రాక్ట్ చెయ్యడానికి IIT,IIM లని వాడటమే కాక కన్ఫ్యూజన్ తో ఉన్న జనాలని లాగేసే ప్రయత్నమన్నమాట]
3. మొదట గా మీరు Rs10,000 ల ప్రాడక్త్స్ కొనండి. అన్ని రకాలూ... అది చాలా మంచిది మీ బిజినెస్ కి. నచ్చితే మీ సన్నిహితులకి రిఫర్ చెయ్యండి. మీ నెట్వర్క్ పెంచుకోండి. వాళ్ళనీ మన ఫ్యామిలీ లో కలపండి.. ఎంత మందిని జాయిన్ చేస్తే మీకు అంత లాభం.
[హాలీవుడ్ హారర్ సినిమాల్లో ఒక దెయ్యం/వైరస్ ఉన్నోడు ఇంకోకణ్ణీ కరిస్తే వాడూ దెయ్యమ్ అయిపోయి ఇంకొకణ్ణి కరుస్తాడు చూశారా.... డిట్టో అదే జరుగుద్ది ఇక్కడ.]
4.నేను ఆమ్వే ఫెయిర్‌నెస్ క్రీంస్ వాడటం మొదలెట్టగానే.. నా అందం త్రిబుల్ అయ్యింది. చూసిన అమ్మాయిలంతా పడిపోవడం మొదలెట్టారు. రియాల్లీ. ఆమ్వే ప్రొటీన్ పౌడర్ వాడాక
, నడవలేని స్థితిలో ఉన్న మా ఫ్రెండ్ మామ్మగారు లేచి నడవడం మొదలెట్టారు. ఇదొక అద్భుతం. మణిపాల్ హాస్పిటల్స్ లో మా ప్రాడక్ట్సే రికమెండ్ చేస్తారు..!
[ఈ టైప్ కతలు టీవీ లో పత్తివిత్తనాల యాడ్స్ వచ్చినట్టూ పుంఖానుపుంఖాలుగా వారి నోటి వెంట వస్తానే ఉంటాయి వినేవాళ్ళుంటే ( కొందరికి పని చేసి ఉండొచ్చు గాక) ]
4. మీకు తెలుసు.. IT jobs ఎప్పుడు పోతాయో తెలీదు. ఒక ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం వస్తుందన్న కాన్ఫిడెన్స్ మీకుండొచ్చు. ఉద్యోగం చేసే ఎబిలిటీ పోతే ఏం చెయ్యాలో మీకు తెలుసా?? అందుకే ఇందులో జాయిన్ కండి.
[లాజిక్ ఉంది .. అనిపిస్తుంది కదా..!! రేప్పొద్దున్న వీళ్ళు బోర్డ్ తిప్పేసి తూర్పుకి తిరగమంటే ఏం చేస్తారు? ముఖ్యంగా వీళ్ళందరి లోనూ సైకిక్ వైబ్రేషన్స్ కనిపిస్తాయి. వాళ్ళ మనసిక స్థితి లో "తేడా" బయటివాళ్ళకి వింతగా ఉంటాయి.
ఈ వ్యాపారమ్ కోసం పెంచుకొనే పరిచయాల్లో మాటల్లో నవ్వుల్లో స్వచ్చత ఉండదు. కష్టపడకుండా సంపాదించెయ్యాలనే ఆశతో ఒక రకమైన మానసిక రోగులవుతారు. వారి మాట వినని ఫ్రెండ్స్/పరిచయస్తులని దూరం పెడతారు. వీరి సోది తట్టుకోలేక పరిచయస్తులంతా వీళ్ళని చూసి దెయ్యాన్ని చూసినట్టూ పరిగెడతారు]
ఈ ప్రెజెంటేషన్స్ అయిపోయాక... కొత్తగా వచ్చిన నాలాంటి బకరాల చుట్టూ ఆ బకరాని తీస్కొచ్చినవారూ, ఇంకో ఇద్దరు సూట్ బాబులూ అన్వేషిత సీరియల్లో కరకింకర భక్తుల్లాగా చుట్టుముట్టీ, ఉద్యోగాన్ని నమ్ముకోడం ఎంత చేటో, ఈ బిజినెస్ వల్ల ఎంత లాభమో ఎంతో ప్రేమ,గౌరవం ఒలకబోస్తూ బిస్కెట్ నవ్వులు నవ్వుతూ బ్రెయిన్ వాష్ చేస్తారు.
నా అనుభవం ప్రకారం ఇదంతా "పిచ్చోళ్ల హడావిడి". పొరపాటున టెంప్ట్ అయ్యి ఈ బురద లోకి దిగామా.... ఊబి లోకి కూరుకుపోవడం... ఇంకొంత మందిని లాగి బురదంటించడం తప్ప ఇంకెం జరగదు.
"అయ్యో... నా క్లోజ్ ఫ్రెండ్ కదా... తన కోసం జాయిన్ అవ్వాలి అనుకుంటారేమో.... నెత్తి మీద రెట్టేసింది రాజహంసయినా తల స్నానం చెయ్యాల్సిందే కదా!! సో మొహమాట పడకుండా ఈ చైన్ బిజినెస్ దూరంగా ఉండండి."
పువ్వు మీద కాలేసి బాధపడొచ్చు.. పేడ మీద కాలేసి కడుక్కోవచ్చు. కానీ ముల్లు మీద కాలేసి తీస్కోవడం అంత తేలిక కాదు కదా..!
మీలో చాలామందికి ఇవన్నీ తెలిసే ఉండొచ్చు కానీ నా తరుపున చెప్తున్నా..!!
"జాగ్రత్త వహించండీ" (గార్నియర్)

35 comments:
:-)))
విషయం పాతదైనా నీ ప్రజంటేషన్ ఉంది చూశావూ ROFL :-)) ఈ ఆమ్వె బ్యాచ్ కీ "అనుకోకుండా ఒక రోజు" బ్యాచ్ కీ తేడా బహు స్వల్పం అని నాకనిపిస్తుంటుంది :-)
ఉన్నవి చాలక ఈ "అనుకోకుండా ఒక రోజు" బాచ్ ఏమిటి బాబు, వేణూశ్రీకాంత్ గారూ? ఏంలేదు, మా ముందుజాగ్రత్త కోసం అడుగుతున్నా.
రాజ్‌బాబు కుమ్మేసావు... ఈ గిఫ్ట్ మాకు కూడా వచ్చింది. నేను పోయి వాడికే చుక్కలు చూపించి వచ్చాను !!! తొక్కలో గ్లాసు కప్పులిచ్చాడు కప్పమొహం వాడు. ఈ amway వాడికి నేను కూడా నీలానే యిరుక్కున్ .... వాడికి కూడా చుక్కలు చూపించాను. మొహమాటం లేకుండా కడిగేశాను. ఇంతవరకు నా జోలికి రాలేదు !!!
హహహ నరసింహా రావు గారు నేనేదో సినిమాలో సీన్ రిఫర్ చేశానండి అది బయట తిరిగే బ్యాచ్ కాదు మీకేం ప్రమాదం లేదు :-) ఆ సినిమాలో మాకోసం కొత్త లోకాన్ని ఎప్పుడు సృష్టిస్తావ్ అని ఓ కొత్తదేవుడికి ప్రశ్నలు పంపుతూ కొందరు పిచ్చాళ్ళు తిరుగుతుంటారులెండి. వాళ్ళగురించి చెప్పాను. ఈ సీన్ చూస్తే మీక్కొంత అర్దమవచ్చు :-) https://www.youtube.com/watch?v=uDTRaYZVE18
ఇంకొన్ని మర్చిపోయీనట్టున్నారు రాజ్ కుమార్ ! రాబర్ట్ కియోసాకి, రిచ్ డ్యాడ్ పూర్ డ్యాడ్, మెక్ డొనాల్డ్. నాకు తెలిసినంత వరకూ ఈ పేర్లు వినపడకుండా Amway అయినా మరొక చైన్ మార్కెటింగ్ ఉపన్యాసమైనా పూర్తి అవదు. కొంత మంది పెద్దలు (అంటే ఆ ఫీల్డులో పెద్దలు, వయసులో చిన్నోల్లే అయ్యుండొచ్చు) ఈ అద్బుతమైన ట్రిక్కులు మనకు తెలీక పోవడం వల్ల మనం ఎంత వెనుకబడి ఉన్నామో తెలియజేస్తూ సింపతీ కూడా చూపిస్తారు ... ఆ సింపతిటిక్ టార్చర్‌ను మాటల్లో వర్ణించడం కష్టం.
నాకు ఇలాంటివి విన్న తరువాత కాస్త ఆలోచిస్తే తట్టింది, అందులో లాభాలు ఉన్నా, అవి కొంత వరకు మాత్రమే, కొంత మందికి మాత్రమే అని. ఈల్లు స్టాలిన్ సినిమాలో సిరంజీవిలా, ముగ్గురుకి సాయం సేయండి, వారిని మరో ముగ్గురికి సాయం చేస్యమండి అని ఓ పేద్ద "Tree Structure" గీసినట్టు మనకో Tree చూపిస్తారు. మనం ఎన్ని child nodesను కలిగి ఉంతే అంత లాభం మనకు అన్నట్టు! అంతా బాగానే ఉంది గానీ, ఆ Treeలోని lief nodes మాటేమిటి అని? complete binary tree తీసుకుంటే అందులో lief nodes ఎన్నుంటాయి, మిగిలిన నోడ్స్ ఎన్నుంటాయి అనేది సింపుల్ మేథమ్యాటిక్స్. ఈ Amway కంప్లీట్ బైనరీ ట్రీలా కాకపోయినా దానికన్నా ధరిద్రంగా మారేందుకే అవకాశాలే ఎక్కువ. అంటే చివరలో ఎవర్ని చేర్చుకోవడానికి వీలులేక దిక్క్కులు చూసే లీఫ్ నోడ్ బకరాలే ఎక్కువయ్యే చాన్సుంది.
ఈ Amway ప్రాడక్టుల్లో ఉన్న ధరిద్రమేమంటే .. వాటి కాస్ట్ చాలా ఎక్కువ. కానీ వీల్లు మనకు చెప్పేదేమిటంటే, కొకో కోల పది రూపాయలయితే, తయారుచేయడనికి రెండు రూపాయలే అని, మిగిలిన డబ్బంతా ప్రకఠనలకు ఖర్చు అవుతుంది అని, ఈ Amway ప్రాడక్టులు అలా ప్రకఠనల మీద ఆధార పడవ్ అని కాబట్టి బాగా చీప్ అని కబుర్లు చెబుతారా ... వాటిని కొన్న వాల్లు చెప్పేది ఏమంటే, అవేమీ చీప్ కాదు. costly అని.
సో, మల్లి మనం లీఫ్ నోడ్ బకరాల దగ్గరకు వస్తే, వీరు వేరే వారిని తమతో చేర్చుకోలేరు. అలా లీఫ్ నోడ్స్ గానే ఉండిపోతారు. కాబట్టి, వీరికి ఆదాయం రాదు. ఆదాయం రాకుండా Amwayవారి costly సరుకులు వీరు కొనలేరు. దానికితోడు.. చచ్చినట్టు ఆ ప్రాడక్టులే కొనాల్సి రావడముతో బోలెడన్ని లిమిటేషన్లు వారిని వెక్కిరిస్తాయి. దానితో వీరు ఒక్కోక్కరు ఆ చైన్ నుండి బయటకి వచ్చేస్తారు. అప్పుడు ఈ లీఫ్ నోడ్ బకరాల పై లెవెల్ లో ఉన్న వారు లీఫ్ నోడ్ బకరాలవుతారు. అలా అలా అందరూ ఏదో ఒకరోజు లీఫ్ నోడ్ బకరాలు అవుతారు.
వీటన్నింటికీ తోడు, ఈ బయంకరమైన ఫిలాసఫీని స్నేహితులకీ, పక్కింటోల్లకి చెప్పడం వారు వీల్లని ఓ హర్షద్ మెహతానూ, ఖేతన్ పరేఖ్నూ చూసినట్టు చూసేయడం మొదలెడతారు.
----------------------------
పక్కవాల్లని ఒప్పించడములో నా టాలెంటెంతో నాకు బాగా తెలుసుకాబట్టి ఇటువంటివాటిజోలికి పోలేదు. కానీ, కొంత మంది స్నేహితుల పుణ్యమా అని ఈ ఉపన్యాసాలకి బలైన బ్యాచ్చులో నేనూ ఉన్నా !!
ఆమ్వే వస్తువులు వాడడం కన్నా రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలోని బాబు మోహన్ అమ్మే చిరంజీవి బాలీఓ వెంకిఓ సబ్బులు వాడడం ఉత్తమం.ఇక్క ఈ నోవా ఆర్క్ బ్యాచ్ మహేష్ బాబు చెప్పినట్లు అదో రకం!!
sooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooper !
ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కు :)
2012 చివర్లో ప్రళయం రాలేదు గానీ 2013 మధ్య లో నాకు పెళ్ళయ్యింది. ఆ రెండూ ఒకటే అని ఆ తర్వాత తెలిసింది.:)
ఇక మిగిలిన బ్లాగర్లు కూడా బ్లాగు లోకానికి వచ్చేస్తారని ఆశిస్తా :)
జిలేబి
ఫస్ట్ ప్రైజ్ వచ్చే లాటరీ టికెట్ కొని రిజల్ట్ వచ్చే ముందురోజు పారేసుకొనే నా జాతకానికి మంచిరోజులొచ్చాయని మూగగా పొంగిపోయాను....
ilativi boledu, paiki scroll chesi anni copy cheyaleka ikkadito apesa.... you are as usually kumming anthe.... rayavayyaa ani eppati nuncho aduguthunte ciranjeevi 150 o cinema laa ippatiki vadilaav... we miss your movie reviews....
సినిమాలో సీనా, హమ్మయ్య :) మీరిచ్చిన లింక్ చూసాను, థాంక్స్ వేణూశ్రీకాంత్ గారు.
రాజ్ కుమార్ గారు, మీ శైలి inimitable. మీ రచనలు sharp wit తో బాగున్నాయి. తరచూ వ్రాస్తుండండి.
అమెరికలో ఉన్నరోజుల్లో వెబ్‌లోనే ఒకచోట ఒక మంచి మాట చదివాను.
" ....... AMWAY NOWAY ........"
అని ఒక స్లోగన్ టీషర్టుమీద ప్రింటు కొట్టించుకోండి ఈ AMWAY వాళ్ళ పీడనుండి తప్పించుకోవటానికి అని!
ఒక మిత్రుడు నాతో Amway సుత్తి వేసిన పిదప coolగా చెప్పాను, "ఎప్పుడూ నా దగ్గర ఈ ఆమ్వే సంగతి ఎత్తకండి - ఫ్రెండ్స్ గానే ఉందాం" అని. అంతే కాదు కొందరిని ఆమ్వేవాళ్ళ బుట్టలో పడకుండా వీరోచితంగా పోరాదిమరీ రక్షించేసాను కూడా!
Nice article. As you correctly pointed out... They say that they are from IITs and IIMs . "aithe enti" anaalanipistundi ! Common sense leni vadu ekkada chadivithe enti ? Thanks for sharing this.
చాలా రోజులకు:))))
<>
ఇంకాసిని నవ్వులుంటే బాగుండేది అనిపించింది:))వీల్ళు ఇంకా ఉన్నారా??(అదే ఆంవే వాళ్ళు.)ఆ పేరు చెబితే జనం భయపడి పారిపోతున్నారని ఇప్పుడు ఇంకేదో కొత్తగా ఇంకో చెయిన్ వచ్చిందన్నారు..క్విక్ .....సంథింగ్ పేరు మర్చిపోయాను...మేము సీనియర్లంకదా 2000 లోనే ఐపోయింది బలి....
ha ha...There is tupperware, oriflame and so many beauty, jewellary business modela exclusively for lady bakras. amway, tmc are classics. enjoyed ur post. u r back. welcome.
>>>మీ వైపోళ్ళకి బాగా వెటకారం కదా..!!<<<<
గోదారీ,కొబ్బరి చెట్లూ,పచ్చని చేలూ చూసి మోసపోయామండీ :(
మీరు దేవుడండీ ... నిజం ఒప్పుకున్నారు!!
దేవుళ్ళు, దేవతలు గోదారి ఒడ్డునే పుడతారండీ :)))
"అల్సేషియన్ కుక్కకి అర్నబ్ గోసామి పూనినట్టు"
ఇది చదివితే ఆయన ప్రైం టైములో టివి స్క్రీన్ మీద చూపించే మంటల్లో పడి ఆత్మహత్య చేసుకుంటాడు.
ROFL :)
బంపర్ గిఫ్టుల పేరిట లక్కీయెస్ట్ జంటల్ని ఊచకోత కోసే ప్రోగ్రాములకి, వారం తిరక్కుండానే బిలియనీర్ కావడమెలా? అనే కొన్ని తింగరి కాన్సెప్టులకి... ఇక్కడ హైదరాబాదులో అమృత కాజిల్, హోటల్ ఖత్రియా, కంట్రీక్లబ్ లాంటివి కొన్ని ప్రదేశాలు బాఘాఆఆఆ ఫేమస్!! ఇప్పటికీ ప్రతీ సండే అక్కడ... జనాల్ని బలిచ్చే మానవహనన కార్యక్రమం నిరవధికంగా జరుగుతూనే ఉంటుంది. ప్రశ్నించేవాడే లేకుండా పోయాడు, హ్మ్!! ;)
a problem from childhood:
a basket of fruits, doubles its fruits every minute. So at 60 minutes if it is full then how many fruits it will have at 59th min.
Ans: half of basket.
Here at any time the company stops, half of the people will be in loss in Multilevel marketing with 1x2 ratio. If one guy need to join 6 people loss would be to 85% of remaining people.
hahaahha...emanna cheppara? I absolutely agree with you on this.naku boledu mandi tagilaru...okkollani ela vidipinchukunnano cheppalenu...as always, thoroughly enjoyed the post and to reiterate, missed your blogs a lot. Please do keep writing often.
ఎప్పుడూ చరణ్ బాబు లా ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉండే సెక్యూరిటీ ఆయన కళ్ళల్లో కరుణరసం కనిపిస్తుందేంటా అని ఆలోచిస్తూ
లోపలకి వెళ్ళాను.
:)
ఆ లక్కీ డ్రా విన్ అయి గిఫ్ట్ కోసం కక్కుర్తిపడి, బలవంతంగా భరత్ ని వెంటబెట్టుకుని 1 అవర్ ట్రావెల్ చేసి మరీ ఓ గాజు గిన్నె తెచ్చుకున్నాను. ఇహ amway మీటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అబ్బో.. మాటల్లో వర్ణించలేనిది! మొత్తానికి మీ పోస్ట్ తో బాగా కనెక్ట్ అయిపోయాను. ఈ దరిద్రమైన అనుభవాలు మీక్కూడా కలగడం నాకు ఆనందంగా ఉంది రాజ్ గారు.. ;) :P
kummmesarandi raju garu. sadarana jananlni ituvanti batchla nundi rakshiche mee prayatnam bagundandi...
thank you very much.
శ్రీనివాస్ గారూ ధన్యవాదాలు.
వేణూశ్రీకాంత్ గారూ.. నిజమే సుమండీ.. రక రకాల తెగలు ః) థాంక్యూ
విన్నకోట నరసింహారావుగారూ ధన్యవాదాలు ;)
రహమానూ.. నేను నీ అంత గట్టిమనిషిని కాదు కదా.. మొహమాట పడి ఇలా బ్లాగ్ లో వాపోయాను ;) థాంక్యూ
శ్రీకాంత్... నా మనసులో మాటలు విపులంగా చెప్పారు. లెంగ్త్ ఎక్కువ అవుతుందని ఊరుకున్నానేను. థాంక్యూ;)
రవితేజా..హహహ చిరుయో, బాలియో.. వెంక్యో... హ్హిహి థాంక్యూ
జిలేబీ గారూ... ధన్యవాదాలు సార్ ;)
నరేషూ.. థాంక్సో... నీ వల్లే రాశాను బాబూ ;)
శ్యామలీయంగారూ.. హ్హిహిహ్ సూపరండీ ;) థాంక్యూ
రిషి గారూ... అదేకదా... ;) ధన్యవాదాలు ;)
మరీచిక గారూ... థాంక్యూ ;) వీళ్ళూ ఇంకా ఉన్నారని రీసెంట్ గానే తెలిసిందండీ ;)
సుజాత గారూ... వాటికి కూడా బలయ్యాను లెండీ.. చెప్పుకుంటా పోతే కోకొల్లలు. ;)
నీహారిక గారూ... ఉన్నమాట ఒప్పుకోవాలి కదండీ. (టెక్నికల్ గా నేను గోదారి కాదండీ. ఓ అరకిలోమీటర్ దూరం)
బోనగిరి రావు గారూ... పోనివ్వండి సార్ శని వదిలిపోద్ది ;)
నాగరాజా.. హా...నేను కూడ బలయ్యింది ఒకానొక క్లబ్ లోనే ;) థాంక్యూ
సాధారణ పౌరుడూ గారూ.. ఈ లెక్కలు ఆలోచించకుండా వాళ్ళు మెదడు చప్పరించేస్తారు కదండీ ;)
Found in folsom గారూ తెలివైన వాళ్లండీ ముందే తప్పించుకున్నారు. థాంక్యూ ;)
pradeep reddy గారూ ..:)))))))))) ;0
ప్రియ గారూ.. మీరూ ఉన్నారా...శుభం శుభం... నాక్కూడా ఆనందమే ;) థాంక్యూ
శివ గారూ థాంక్యూ థాంక్యూ
baboi, innaaltiki malli darshanm ichaavu raj kumaru...
Liked it. :)
Great, continue....
Malli kanisam 10 rojulaku oka postu rayakapoyavo, jagannayya, sharmilakka odarpu yatra manesinanta ottu.
chaalaa baavundhi raj,
okka mukkaloo cheppaalante, veyyi maatallo kuudaa cheppalenantha vishayam vundhi meeloo.
:)
Hello Raj garu.. Mogudu cinema review chaduvutunnaru mee blog Loki adugettanu. Aa roju navvi navvi kadupu noppi vachhindi....aa debba tho oka post kuda vadala bommali vadala ani anni chadivesanu. Ippatiki 3 to 4 times ayindi. Pls maa lanti vallakosam meeru frequency penchali.. Next post kosam eduru chustu...

మీ వ్యాసాన్ని కాపీ చేసి వాట్సాప్ లో చాలమందికి పంపి వాళ్లను కాపాడాలనుకుంటున్నాను...
Entandi idi...kopam aagatledu. Vindu bhojanam koddiga ruchi chupinchi inka levamannattundi. Chadivina postle malli malli chadivi kopam challarustunna...meeru next post eppudo Anna rayandi pls..
ఇప్పుడు టైమ్ అర్థరాత్రి 12:44... పైకి గట్టిగా నవ్వలేక వెక్కిళ్లు ఆపుకోలేక చచ్చా, గట్టిగా నవ్వితే మా ఆవిడ ఫోన్ లాక్కొని నిద్రపోమంటుంది. కేక పుట్టించారు 'య'మావే గురించి. మరో టపా కోసం వెయిటింగ్.
కిషోర్
Correct ga one year..No updates..:)
Post a Comment