ఇంతకీ ఏ వూరో తెలుసా?
గత 150 సంవత్సరాలుగా తెలుగువారి సంస్కృతి లో భాగమయ్యి, ఆంధ్రదేశపు హస్త కళావైభవాన్ని చాటి చెప్తున్న లక్కబొమ్మల పరిశ్రమ నెలకొన్న ఊరు. ఎందరో గొప్ప కళాకారుల పుట్టినిల్లు.. విశాఖజిల్లా లోని "ఏటికొప్పాక".
వరహానది ఒడ్డున వెలసిన ఊరు... ఆ ఊరికి ఒక వైపు గ్రామ దేవత బండితల్లీ, మరో వైపు నూకాలమ్మ తల్లి ఆలయాలుంటాయి. వచ్చే వాళ్ల మీద పోయే వాళ్ల మీద ఒక కన్నేసి చూస్తుంటారు ఈ అక్కా చెల్లెళ్ళు. ఊరి విస్తీర్ణం తక్కువేగానీ, ఇళ్ళూ, జనాలూ చాలా
ఎక్కువ. ఊరిని చుట్టేస్తూ ఒకే ఒక్క్క రహదారి ఉంటాది. మిగిలినవన్నీ ఇరుగ్గా ఉండే సందులూ గొందులే ;). అయితేనేం? మా వూరి జనాల మనసులు ఇరుకు కాదు. వారి సృజనాత్మకతా, నైపుణ్యాలకి కొలత లేదు.
"ఏంటంటా వారి టాలెంటూ?" అంటారా? చెప్తా గానీ.. మీలో ఎంతమందికి లక్కబొమ్మల గురించి తెలుసో చేతులెత్తండీ? చిన్నప్పుడూ ఎంతమంది లక్క పిడతలతో ఆడుకున్నారో చెప్పండీ...? హ్మ్మ్.. ఈ రోజుల్లో చాలా మందికి తెలిసుండకపోవచ్చు.
అందుకేగా బోలెడు స్టఫ్ తో వచ్చానూ..! ఈ రోజుల్లో హస్తకళలని పెద్దగా ఎవరూ పట్టించుకోవటం లేదు గానీ, నా చిన్నప్పుడు ఊళ్ళొ టీనేజ్ కొచ్చిన ప్రతీ కుఱాడూ ఈ బొమ్మల తయారీ నేర్చుకునేవాడు. సరే పాయింట్ కి వచ్చేస్తున్నా.
లక్కబొమ్మలు అంటే లక్క (Lac) రంగులు అద్దిన చెక్క బొమ్మలు." లక్క అంటే ఏంటీ?" అంటారా?
"లక్క" అనే కీటాకాలు ఉన్న కొమ్మలను విరిచి, వాటికున్న లక్కను (అవి స్రవించే ఒక పదార్దం) గీకి తీస్తారు. ఈ విధంగా లభించిన ముడి లక్కను 'స్టిక్ లాక్' (Sticklac) అంటారు. ఈ ముడిలక్కను కరిగించి శుద్ధిచేసి బిళ్ళలుగాను, కడ్డీలుగాను అచ్చులు పోస్తారు. శుద్ధి చేసిన ఈ లక్కను 'షెల్లాక్' (Shellac) అంటారు.
ఏజన్సీల్లో ఫారెస్ట్ డెపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకూ పనికి రాని పిచ్చి మొక్క గా పరిగణించీ, తీసుకెళ్లడానికి మాత్రం పెర్మిషన్ ఇవ్వని "అంకుడు చెట్టు" కలపని ఉపయోగిస్తారు వీటి కోసం. (ఈ కఱ చాలా మెత్తగా ఉండటం వల్ల ఎందులోనూ వాడరు.)
ఈ అంకుడు కఱ ని అందమయిన బొమ్మలుగానూ, గృహాలంకరణ వస్తువులుగానూ మార్చి దేశ విదేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటారు. (మనకి పొరిగింటి పుల్ల కూర రుచి కాబట్టీ పెద్దగా పట్టీంచుకోమనుకోండీ).
పసుపు కొమ్ములూ, కరక్కాయలూ మరియూ కూరగాయల నుండీ తయారు చేసిన రంగులని లక్కతో కలిపి, ఈ చెక్క తో చేయబడ్డ బొమ్మలకి పూస్తారు. ఈ బొమ్మలకి మెరుగు దిద్దటం లో "మొగలి రేకు "ది కూడా ముఖ్య పాత్ర.
ఇవన్నీ ఎటువంటి కెమికల్స్ కానీ,ప్లాస్టిక్ గానీ వాడకుండా ప్రకృతిసిద్దమయిన వాటిచేతనే చేయబడతాయి. చిన్నపిల్లలొ నోట్లో పెట్టుకోవటం వల్ల గానీ, మనం ఉపయోగిస్తున్నప్పుడూ వంటికి తగలడం వల్లగానీ ఎటువంటి హానీ జరిగేఅవకాశం లేదు..
వీటి గురించిన మరిన్ని వివరాలూ, ఇక్కడి కళాకారుల ఘనత ని చాటే గొప్పగొప్ప కళా ఖండాల గురించీ.., తెలుగువాడి సృజనాత్మకతనీ, పట్టుదలనీ ఎలుగెత్తి చాటిన సంఘటనల గురించీ త్వరలో వివరంగా చెప్తాను.
మచ్చుక్కి కొన్ని బొమ్మల పోటోలు.. వీళ్ళ క్రియేటివిటీ కి అవధులు ఉండవ్. చిన్న్నపిల్లల గిలిగిచ్చి కాయలను మొదలుకోనీ.. పశు పక్షాదులూ, మనుషులూ, దేవుళ్ళూ.. ఒకటేమిటీ.. ఆడపిల్లల గాజులూ, చెవిరింగులూ, హారాలూ, జడక్లిప్పులతో సహా అన్నిటినీ చెక్కతో చేసి మెరిపించి మురిపిస్తారు.
బుజ్జి గణేశుడు.. వీటిలో అరచేతిలో ఇమిడి పోయే సైజ్ నుండీ రక రకాల మోడల్స్ లో, వేరు వేరు సైజుల్లో దొరుకుతాయి.
ఇదేంటీ అనుకుంటున్నారా? సెల్ ఫోన్ స్టాండ్ అండీ.. వీటిలో కూడా చాలా రకాలుంటాయ్.
అద్దీ.... ఈ వంట సెట్ట్లు. చాలా పాపులర్ అయిన ఐటెం. ఒకప్పుడూ.. ఆడపిల్ల ఉండే ప్రతీ ఇంట్లోనూ ఆడుకోడానికి ఇచ్చే కిట్ అన్నమాట. మొన్న అడిగితే.. ఈరోజుల్లొ ఎవరూ కొనటం లేదండీ. తయారీ ఆపేశాం అన్నాడు షాపతను. నేనూరుకుంటానా?
తయారు చేసే కళాకారుల ఇంటికెళ్ళి మరీ చేయించా..
పక్కనా ఆ తాటాకు బుట్ట ఏమిటీ అని చూస్తున్నారా? అది కూడా ఏటికొప్పాక లక్క బొమ్మల సంస్కృతి లో ఒక భాగమే.. ఈ బొమ్మలు ఆ బుట్టలో పెట్టి ప్యాక్ చేస్తారు.
ఈ బొంగరాలు మీ లో చాలా మందికి తెలిసే ఉంటాయ్..చిన్నప్పుడు తెగ ట్రై చేసేవాడిని తాడు తో ఆ బొంగరం తిప్పడానికి..ప్చ్.. వచ్చేది కాదు.. (ఇప్పుడూ రాదు అనుకోండీ.. ఒక వేళ తిప్పినా తిరగేసి తిరుగుతుందీ..)
ఈ బొంగరాలు ఎలా తయారు చేస్తారో చూడాలని ఉందా.. అయితే ఈ వీడియో మిస్సవ్వద్దూ..
ఈ వీడియో కనిపించే ఆర్టిస్ట్ పేరు చిన్నయాచారి గారు. అబ్దుల్ కలాం చేతుల మీదుగా జాతీయ అవార్డ్ తీసుకున్న వ్యక్తి. ఈయన చేతిలో రూపు దిద్దుకున్న కళాఖండాలని తర్వాత పోస్ట్ లలో చూపిస్తాను.
ఇవి చిన్న పిల్లలు ఆడుకునే కొన్ని బొమ్మలు...
ఈ వీడియో చూడండీ..
http://www.youtube.com/watch?v=nhRwz8JEmJk
ఎడ్లబండీ.. (ఎడ్లు మేతకెళ్ళాయి)
ఇది పూర్వకాలం నుండీ వస్తున్న ఐటెమ్. ఇందులో బొమ్మనీ రెండు గా విడగొట్టీ.. మిగిలినవన్నీ ఒకదానిలో ఒకటి పెట్టేయొచ్చూ..
మనం దాడి ఆట ఆడేవాళ్ళం కదా.. అదీ ఇది.. చెస్ బోర్డ్ కూడా చాలా ఫేమస్. రాజూ, మంత్రీ, గుఱం అన్నీ చెక్కతో చేయబడి ఉంటాయ్. వాటితో ఆడితే ఆ మజానే వేరు. మా ఇంట్లో ఒక సెట్ ఉట్టుందీ..
విజిలేయించే కీ చెయిన్లు..
ప్రస్తుత రోజుల్లో.. వీటికీ, వీటిని తయారు చేసేవారికీ పెద్దగా విలువ లేకుండా పోయిందీ. వీటికి ఉపయోగించే కలప లభించకపోవటం వల్ల రేట్ పెరిగీ కొనకపోవటం ఒక కారణమయితే... ప్లాస్టిక్ బొమ్మలూ, వీడియో గేమ్స్, ఎలక్ట్రానిక్ టాయ్స్ ల తాకిడికి తట్టుకొని నిలబడలేకపోవటం మరోకారణమయితే.... మన కళలనీ కాపాడుకోలేని నిర్లక్ష్యం, మనమే ప్రోత్సహించక పోవటం అసలు కారణం. ఆర్ట్ ఎగ్జిబిషన్ లో వీటిని చూసి వచ్చేసే మనం, ఏ షాపింగ్ మాల్ లోనో కాస్ట్లీ గా ప్యాక్ చేస్తే ఇరవై రూపాయల ఐటెమ్ ని Rs.299 only (Hand made wooden toy) అని రాస్తే మాత్రం కొంటాం.
చూసారు కదా. ఎక్కడో మీ బాల్య స్మృతుల్ని నిద్ర లేపిన ఈ బొమ్మల్ని. నిజంగా ఎంత మంది ఈ కళాసంపద మన తరంతోనే ఆగిపోతుంది అంటే కించిత్ బాధ కూడా పడకుండా చాలా మామూలుగా తీసుకోగలరు? మన మట్టికి, మన సంస్కృతికి తెలిసో తెలియకో ద్రోహం చేస్తున్న భావన ఎక్కడో మనల్ని గుచ్చుతుంది కదా. చివరికి మన దేశ సంపద, మన కళలు ఎవరో బయటి వ్యక్తులు వచ్చి తెలియజేస్తే గానీ తెలుసుకోలేని దుస్థితిలోకి వెళ్లే రోజు ఎంతో దూరం లేదేమో అని భయంగా ఉంది. మన సొంత మనుషుల్ని, వాళ్ల చేతిలోని అద్భుతమైన కళల్ని ప్రోత్సహించని మనం, మనది కాని సంస్కృతిని మనవి కాని వస్తువుల్ని ఆరాధించడం నిజంగా సిగ్గుచేటు కాదంటారా? ముందు మన పునాదిని గట్టిగా నిర్మిద్దాం, తరాలు మారినా చెదరని పునాదిని. అదెలా ఉండాలంటే, పైన ఎన్ని రంగులు హంగులతో కొత్త వాసనలు తొంగి చూస్తున్నా, వాటిని మనం ఆస్వాదిస్తున్నా, మన పునాదిని మాత్రం ఎప్పుడూ గుండెల్లో భద్రంగా దాచుకునే విధంగా.. దానికి మన వంతు కృషి మనం చేద్దాం, తరువాత తరాన్ని వారసుల్ని చేద్దాం. నేను అందుకు సిద్ధం.. మరి మీరేమంటారు..!!!!
మరిన్ని బొమ్మలకోసం చూస్తూనే ఉండండీ.. చిత్రం..The Picture
58 comments:
సూపర్బ్ రాజ్‌కుమార్ గారు , ఆ లాస్ట్ పేరా మాత్రం అక్షరాలా నిజం !
Soooooooooper like. Naaku ee bommalu ante enta ishtamo. Naa daggara kooda unnayi.
Sooooper like .. Naaku ee bommalu ante enta ishtamo. Naa daggara kooda e bommalu unnayi
chala bagunnayamdi bommalu. Moreover these all are environment friendly.miru matram bongaram tippadam ippatikaina nerchukoka tappadu.
ఏటి కొప్పాక గురించి ఈ మధ్యనే అంటే గత ఆర్నెల్లలో ఎక్కడో చదివాను. మీరు ఇంకెక్కడైనా వ్రాసారా.
మా చిన్నప్పుడు లక్కబొమ్మలు, లక్కపిడతలు అనేవాళ్లం అందరి ఇళ్లలోనూ ఉండేవి. ఎన్ని వంటలు చేసామో వాటిలో. బొంగరాలు మా అందరి జేబుల్లోనూ ఉండేవి. తాడు,బొంగరం లేని వాడు అంటే ఎందుకూ పనికి రాని వాడు అని అర్ధం. పందాలు కాసి బొంగరాల ఆట ఆడేవాళ్లం. దానికి తాడు చుట్టడం, విసరడం ఒక కళ. అప్పుడు నేను ఎక్స్పెర్ట్ ని. ఇప్పుడు, ఏమో ఒకమాటు ప్రయత్నించాలి.
ఇప్పుడు అన్నీ మారుతున్నాయి. అభిరుచులు మారుతున్నాయి. ఇవి దైనందిన జీవితం లోంచి తప్పుకొని కళా రూపాలుగానే మిగిలిపోయాయి. ప్లాస్టిక్ కిచెన్ సెట్స్, బిల్డింగ్ బ్లాక్స్, ఇలాంటివి వాటిని మరుగున పడేసాయి.
మనలో కనీసం ఒక 10-15 శాతం మంది పిల్లలకి, పుట్టినరోజు న బహుమానం గా లక్కబొమ్మలే ఇద్దాం అనుకుంటే కొంతలో కొంత ప్రోత్సాహం ఇచ్చినట్టే.
మంచి టపా. మిగతావి కూడా త్వరగా పోస్ట్ చేయండి.
{మన కళలను మనం నిర్లక్ష్యం} ఈ వాక్యముతో నూటికి నూరుపాళ్ళూ ఏకీభవిస్తాను.
నా దగ్గర ఇప్పటికీ కొన్ని కుందేళ్ళ బొమ్మలున్నాయి. చిన్ననాటి ఙ్ఞాపకముగా దాచిపెట్టుకున్నాను.
very well written raj
ఇప్పుడు అన్నీ మారుతున్నాయి. అభిరుచులు మారుతున్నాయి. ఇవి దైనందిన జీవితం లోంచి తప్పుకొని కళా రూపాలుగానే మిగిలిపోయాయి. ప్లాస్టిక్ కిచెన్ సెట్స్, బిల్డింగ్ బ్లాక్స్, ఇలాంటివి వాటిని మరుగున పడేసాయి.
మనలో కనీసం ఒక 10-15 శాతం మంది పిల్లలకి, పుట్టినరోజు న బహుమానం గా లక్కబొమ్మలే ఇద్దాం అనుకుంటే కొంతలో కొంత ప్రోత్సాహం ఇచ్చినట్టే.
Excellent!
ఏటికొప్పాక పక్కనే మా అమ్మమ్మ గారి ఊరు. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊరు వెళ్లినప్పుడల్లా కొప్పాక వెళ్లి బొమ్మలు కొనుక్కోవడం నాకు బాగా గుర్తు. మా నాన్న గారు వృత్తి రీత్యా జర్నలిస్ట్ కావడంతో ఆయన అన్ని వివరాలు అడిగి తెలుసుకునేవారు. వాళ్లు బొమ్మలు తయారుచేసే నైపుణ్యం చూసి నాకు ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ల చేతుల్లో ఎంత కళ దాగుందో అని ఆశ్చర్యపోయేవాడిని. కానీ ఒక ముసలాయన తమ కళ నిరాదరణకి గురవుతోందని, తరాలుగా నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక, దాన్ని నమ్ముకుని కుటుంబాలను పోషించలేక కష్టాలు పడుతున్నామని కన్నీళ్లు పెట్టుకోవడం నాకింకా కళ్లముందు కదులుతోంది.
చాలా బాగా రాసావ్ రాజ్.క్రితం సారి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న ఆ గణేష్ బొమ్మ మా ఇంట్లో ఉంది, చాలా బాగుంటుంది.
ఆ చివరి పేరా మాత్రం అద్భుతం గా రాసావ్ నిజంగానే అన్నీ కోల్పోతున్నాం మనం, మనని కోల్పోడమే మిగిలి ఉందేమో అనిపిస్తోంది నాకు.ఎన్నో కళారీతులు రూపాలు అవసానదశలో ఉన్నాయి దారిచూపేనాధులు లేక.
>>తయారు చేసే కళాకారుల ఇంటికెళ్ళి మరీ చేయించా..
:) :)
మంచి టపా. బాగా రాసారు.ఈ లక్క పిడతలతో చిన్నప్పుడు నేనూ ఆడుకున్నాను, ఆబొంగరంతో సహా. మా పిల్లలకూ కొనిచ్చాను. మా చిన్నదానికి కొన్న సెట్లో కొన్ని పీసెస్ ఇంకా షికాగోలొ మా సామాన్లలో భద్రంగా స్టోరేజిలో పెట్టబడి ఉన్నాయి.
చాల బావున్నాయి బొమ్మలు, వస్తువులు .
వీటికి మళ్లీ ప్రాచుర్యం కల్పి౦చడానికి మీరు ఏమైనా చేస్తున్నారా.. హైదరాబాద్ లో స్టాల్స్ పెట్టినపుడు (ఈ - తెలుగు స్టాల్స్ కాదు, డ్వాక్రా అని ఇ౦కేవో ఉ౦టు౦టాయి :)) , వీటిని ప్రదర్శిస్తే తప్పకు౦డా ప్రోత్శాహం ఉ౦టు౦ది.
మనం అభివృద్ది పేరుతో ఎన్నింటిని కోల్పోతున్నామో? ప్రభుత్వం ఏం చేసినా అన్నీ తూ తూ మంత్రంగానే ఉంటాయి. మన సంస్కృతిని నిజంగా కాపాడుకోవాలంటే ఒక ఉద్యమం మొదలవ్వాలి రాజ్. మనలా తెలుగు మూలాలు ఇష్టపడే వాళ్లంతా ఒక్కటవ్వాలి. ప్రపంచంలో సంస్కృతిని కాపాడుకుంతున్న దేశాలనుండి పాఠాలు నేర్చుకోవాలి. ఇది అసాధ్యం కాదు కానీ నిబద్దత అనేదే పెద్ద ప్రశ్న.
నిజమే రాజ్ చైనా తయారి బొమ్మలు నొట్లొ పెట్టుకుంటే పిల్లల మెదడుకు మంచిదికాదు అని కొందరు ,ప్లాస్టిక్ బొమ్మలు పిల్లలకు ఇవ్వద్దని ఇంకొందరు ఎన్ని అన్నా వాటివైపే మొగ్గుతున్నాం..ఇవేమో చక్కని బొమ్మలు హానిలేని బొమ్మలు .. ఎంతా బాగున్నాయో ఆ బుల్లి బుల్లి గాజులు ... సరేగాని నాకు బొమ్మలో బొమ్మలు ఉంటాయిగా అవి షోకేస్‌లోకి ఇంకా నా కూతురికి ఒక గాజుల జత ..ఇంకా రెండురకాలా పిల్లలు ఆడుకునే బొమ్మలు తీసి పక్కన పెట్టు ...నేను తీసుకుంటా :) మొత్తం పోస్ట్ చాలా బాగుంది లాస్ట్ పేరా మరీను :)
బొంగరం తీసుకుని గుమ్మా కొట్టటం భలే మజాగా ఉండేది, రెండు గిరులు ఆట ఆడేప్పుడు. మా విజయవాడలో, రామకోటి మైదానం పక్కనే (సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ ఎదురుగా) ఒకే ఒక్కడు ఈ బొమ్గరాలు చేసి ఆయన ఉండేవాడు. వెళ్లి మాకు కావలిసిన రంగులు వేయించుకుని మరీ తెచ్చుకునే వాళ్ళం. గుభేల్ పేటలో బొమ్గారానికి ములుకు వేసే ఆటను ఉండేవాడు (కొలిమి ములకు అనే వాళ్ళు) అది చాలా స్పెషల్. ఈ రెండు పన్లు చేసి మమ్చి జాలీ (తాడు) కొని బొంగరం వేస్తె ఝుం అని ధ్వని చేస్తూ భలే తిరిగేవి.
మంచి జ్ఞాపకాలను తలపించారు. భేష్.
రాజ్.. Superb post and amazing videos! నేనప్పటికైనా సరే మీ ఊరొస్తాను.. :)))
అబ్బ...ఆ బొమ్మలు చూస్తుంటేనే కడుపు నిండిపోతోందీ...నాకు ఆ సెల్‌ఫోన్ స్టాండ్ బాగా నచ్చింది :) నాదగ్గర ఆ తాటాకు బుట్తలు...చిన్ని రోలు...గిన్నెలు...పొయ్యి...లాంటి బొమ్మలు...ఇంకా 10 వరుస క్రమంలో ఉండే..చేతులు లేని అమ్మాయి బొమ్మలు ఉండేవి...అవన్ని ఒక్కసారు గుర్తుచేసారు రాజ్! ఇన్నాళ్టికి మీ ఊరిమీద దయకలిగి టపా రాసారన్నమాట :) చాలా బాగుంది :)
మేము ఏటికొప్పాక దగ్గర ఉన్న రాయవరంలొ ఉందగ ఈ బొమ్మల తో మొదటి పరిచయం. నా బొమ్మల కొలువు లో చాల ఉండెవి. ఈప్పటికీ ఎక్కడ ఈ బొమ్మలు చుసినా, చాలా ఆనందంగా నా బల్యాన్ని గుర్తు తెచ్హుకుంటాను .
మేము ఏటికొప్పాక దగ్గర ఉన్న రాయవరంలొ ఉందగ ఈ బొమ్మల తో మొదటి పరిచయం. నా బొమ్మల కొలువు లో చాల ఉండెవి. ఈప్పటికీ ఎక్కడ ఈ బొమ్మలు చుసినా, చాలా ఆనందంగా నా బల్యాన్ని గుర్తు తెచ్హుకుంటాను .
లక్క పిడతలు, తాటాకు బుట్ట... ఎప్పుడో చిన్నప్పుడు మా చెల్లికి ఎవరో ఒక సెట్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు చూసాను. ఆ బొంగరం నేను మొదటి సారి చూసింది హై స్కూల్ లో ఉన్నప్పుడు. ఏదో పని మీద మా నాన్నగారు ఒక పల్లెటూరు వెళ్ళినప్పుడు తెచ్చారు. దాన్ని తిప్పడానికి నానా తంటాలు పడ్డాను. ఒకే ఒక సారి తిరిగింది. తలక్రిందులుగా :D
ఆఖరి పేరా లో రాసింది పూర్తిగా నిజం. మన భాష, మన కళలు, మన సంస్కృతీ మొత్తం మరిచిపోయి ఇంకేదో గొప్ప అనుకుంటున్నాం. బులుసు గారు చెప్పినట్టు మనకి దగ్గర వాళ్ళ పిల్లలకి లక్కపిదతలే బహుమానంగా ఇద్దాం.
ఇక ఫ్లాషుబ్యాకులు ఆపుతారా? వినీ వినీ విసిగిపోయాం.
Meeru cheppindi chala nijam Raj, Chinnappudu naa daggara kooda VANTA SET okati vundedi aa taataku buttatho, enka chinna thiragali vundevi..nenu 2 months back india vellinappudu ee bommalu na SON ki konipedam ani chusaa hyderabad and guntur lo..but correct gaa find cheyalekha poya ekkada konalo :)
Koncham ekkada dorukuthayo cheppagalaraa hyderabad lo? :)
nenu okasari mee ooriki vachhi naa son ki ee bommalu anni koni pettali nai decide iyya :)
మా ఊరికి(అనకాపల్లి) చాలా దగ్గర ఏటికొప్పాక. నేను ఒకసారి వెళ్ళాను మా అప్పరావుకి వున్న ఆశక్తి వల్ల. కాని అక్కడకు వెళ్ళాక ఎంతగానో సంతోషించాను వెళ్ళినందుకు. మేము కూడా మీలాగే, బొమ్మలు చేసేవాళ్ళ దగ్గరకు వెళ్ళి అప్పుడప్పుడే తయారైన వేడి వేడి (చక్రంలో తిప్పేటప్పుడు వేడవుతాయి కదా) గాజులు కొనుక్కున్నాం. నేను ఒకగాజు ఒకవైపే లక్క పూసింది, మిగతా సగం చెక్క కనిపిస్తూ ఉన్నది తీసుకున్నాను గుర్తుగా ఉంటుందని.
మొన్న మా పాప పుట్టినరోజు కి రిటర్న్ గిఫ్ట్స్ గా ఈ లక్క పిడతల సెట్ ఇద్దామని శిల్పారామంలో ట్రై చేస్తే దొరకలేదు. కాని మీరు పెట్టిన బొమ్మల్లో ఉన్న వస్తువులన్నీ మాత్రం అక్కడ తప్పకుండా దొరుకుతాయి (ఎవరైనా వాటిని కొనాలనుకుంటే).
ఇంకో విషయం, ఏటికొప్పక అనగానే గుర్తొచ్చేది, ఏటికొప్పక షుగర్ ఫేక్టరీ. మేము NH5 నుంచి కొప్పాక రోడ్డు తిరిగినప్పటినుంచీ, కొప్పాక చేరే వరకూ దారంతా చెరకు తీసుకెడుతున్న ఎడ్లబళ్ళే. ఒకదగ్గర ఆగి వాళ్ళని చెరకు అడీగితే ఇచ్చారు గాని డబ్బులిస్తే తీసుకోలేదు. అసలు చాలా ఫీల్ అయ్యారు డబ్బులు ఇవ్వజూపామని. నాదగ్గర ఫొటొలు ఉండాలి. ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను.
ఇంకో విషయం, ఏటికొప్పక అనగానే గుర్తొచ్చేది, ఏటికొప్పక షుగర్ ఫేక్టరీ. మేము NH5 నుంచి కొప్పాక రోడ్డు తిరిగినప్పటినుంచీ, కొప్పాక చేరే వరకూ దారంతా చెరకు తీసుకెడుతున్న ఎడ్లబళ్ళే. ఒకదగ్గర ఆగి వాళ్ళని చెరకు అడీగితే ఇచ్చారు గాని డబ్బులిస్తే తీసుకోలేదు. అసలు చాలా ఫీల్ అయ్యారు డబ్బులు ఇవ్వజూపామని. నాదగ్గర ఫొటొలు ఉండాలి. ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను
బాగా రాసావు రాజ్...ఆ లక్కపిడతలు ఇప్పటికీ జ్ఞాపకమే...ఒక రుబ్బురోలు మా ఇంట్లో చాలారోజులవరకూ ఉండేది.
ఆ వినాయకుడి బొమ్మ నేను హైదరాబాదులో కొని అమ్మకి ఇచ్చాను.
ఈసారి మా ఇజీనారం వచ్చినప్పుడూ మీ ఊరివైపు ఓ షైరు కొట్టాలి...ఏటికొప్పాక వెళ్ళి చూసి రావాలి.
మాటలు లేవు రాజ్. అద్భుతమైన టపా..
ఆ బొమ్మలు, ఆ వీడియోలు నన్ను నా చిన్న తనానికి తీస్కెళ్లాయి. ఎంత అందంగా ఉండేవి ఆ రోజులు. అభివృద్ధి అంటూ మనం ఎటు పోతున్నామో అర్థం కావడం లేదు. మన ముందు తరాలు ఎన్ని మిస్ అయిపోతారో అని భయమేస్తూ ఉంటుంది.
బులుసు గారన్నట్లు మన కళల్ని, సంస్కృతిని ఇలాంటి వాటిని బహుమతులుగా ఇచ్చి కాపాడుకుందాం.
మన ఘనతను మనమే గుర్తించలేకపోవటం నిజంగా దురదృష్టకరం.
మీరు ఫోటోలో పెట్టినలాంటి తాటాకు బాక్సులో లక్కపిడతలు చాలా ఏళ్ళు పదిలంగా దాచుకున్నానండి.మా అమ్మాయికి కూడా కొన్నాను. కానీ ఇప్పుడు లేవు..:( మరీ చిన్న వయసులో కొనటం వల్ల చాలా పారేసుకుంది. మీరు విడియోలో చూపెట్టిన గిరగిర తిరిగేది కూడా కొన్నా.
చాలా మంచి టపా పెట్టారు.అభినందనలు.
చాలా విలువైన వివరాలందించారు. మీరు వీటిని పరిచయం చేసిన విధానం చాలా చాలా బాగుంది. చివరి పేరా చదివిన వారి మనసులని కదిలించేలా, ఆలోచింపచేసేలా రాసారు.
శ్రావ్య గారూ.. ధన్యవాదాలండీ.
శివరంజని గారూ. అవునా.. ఇప్పటీకీ ఆడుకుంటున్నారా? హహహహ్.. ధన్యవాదాలు
వజ్రం గారూ.. నిజమండీ environment friendly. హహహ.. నేర్చుకోవాలండీ.ట్రై చేస్తున్నా... నెనర్లు..
బులుసుగారూ... అవునండీ ఆ మద్య నేనే బజ్ లో రాశాను. మీ జ్నాపకాలన్నీ మాతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండీ
"మనలో కనీసం ఒక 10-15 శాతం మంది పిల్లలకి, పుట్టినరోజు న బహుమానం గా లక్కబొమ్మలే ఇద్దాం అనుకుంటే కొంతలో కొంత ప్రోత్సాహం ఇచ్చినట్టే. "
సరయిన మాట చెప్పారు. నెనర్లు.
ఆచంగ గారూ. మీ దగ్గర కుందేళ్ళ బొమ్మలున్నాయా..? ప్చ్.. నాకు ఆ బొమ్మ్లన్నీ పోటోలు తియ్యడానికి కుదరలేదండీ.. ప్చ్...
నా బ్లాగ్ కి స్వాగతం.. ధన్యవాదాలు.
హరే..యెస్.. నాకూ ఆ మాటలు చాలా నచ్చాయి.. థాంక్యూ..
చాణక్యగారూ.. నిజమా? ఏవూరండీ? ;)
అవునండీ.. తయారు చేసేవన్నీ విదేశాలకి ఎగుమతి అవ్వటం తప్పితే.. ఇక్కడ ఎవ్వరం పట్టీంచుకోవటం లేదు.
వాళ్ల చేతుల్లో ఎంత కళ దాగుందో అని ఆశ్చర్యపోయేవాడిని>>> నిజంగా. ఎవ్వరయినా ఆశ్చర్య పోవలసిందే.. నా బ్లాగ్ కి స్వాగతమండీ
పప్పుసార్.. ధన్యవాదాలు. నేను ఈ లక్కబొమ్మల గురించీ, ప్రస్తుత పరిస్థితినీ చెప్పినప్పుడు నా ఫ్రెండ్ పడిన బాధకీ, అన్నమాటలకి అక్షర రూపమే ఆ పేరా అండీ.
నాగార్జునా.. హహ్హ.. ;) ;)
సునీత గారూ.. అవునాండీ..! నాకు హ్యాపీ గా అనిపించిందీ మీ కమెంట్ చదివాక. ధన్యవాదాలండీ..
మౌళి గారూ అవకాశమున్న ప్రతీ చోట్లా వీరి స్టాల్స్ ఉంటాయండీ.. నా వరకూ వీటిని కొనీ, గిఫ్ట్ లు గా ఇచ్చీ అందరికీ పరిచయం చేస్తున్నా.. ;) ;)
ధన్యవాదాలు.
మురళిగారు... హ్మ్మ్.. అసాధ్యం కాదు గానీ.. అందరం కలసి కట్టుగా చేయాలి కానీ ఎలా?
అవును నేస్తం అక్కా.. వీటితో ఎటువంటీ ప్రమాదం లేకపోయినా, ఖరీదు పెద్దగా తేడా లేక పోయినా.. మనకి ఆ బ్రాండెడ్ బొమ్మలే ముద్దు..;)
అహహహ. తీసి పక్కన పెట్టడం కాదు.. ఏమేం కావాలో ఆర్ధర్ చెప్పండీ.. షాప్ మొత్తాన్నీ మీ గుమ్మం లో పెట్టేస్తాను.. హిహిహి
శివప్రసాద్ గారూ మీ జ్నాపకాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండీ.. నేను కూడా కావలిసిన రంగుల్లో దగ్గరుండి చేయించుకునే వాడిగిన్
గానీ తిప్పడమ్ మాత్రం రాలేదు.. ;( "జాలీ" అనే మాటని చాలా సంవత్సరాల తర్వాత విన్నానండీ... ధన్యవదాలండీ
మధురగారూ.. తప్పకుండా రావాలండీ.. థాంక్యూ వెరీ మచ్..
తరంగం గారూ..ధన్యవాదాలండీ.. మీది ఎస్. రాయవరమా? హహహ సూపరు.. ;)
ఇందు గారూ ... మీ దగ్గర చాలా ఉన్నాయండీ.. ఊరి మీద దయ కలగటం కాదండీ.. కొన్ని నెలల క్రిందటే దీనిపై పోస్ట్ వేద్దామనుకున్నా
కానీ పోటోలు లేకపోవటమ్ వల్లా ఆగిపోయాను. మొన్న ఇంటీకెళ్ళినప్పుడూ, ఆ పోటోలూ, వీడియోలూ తీశా అన్నమాట.
నెనర్లు.. ః)
సాయి..నీకు కూడా బొంగరాల ఎక్స్పీరియన్స్ ఉందన్నమాటా.. నేను కూడా మొన్న మళ్ళీ ట్రై చేసాను.. అది మళ్ళీ తిరగబడి తిరిగిందీ.. ;) నేను మాగ్జిమమ్ ఇవే గిఫ్ట్‌లు ఇస్తాను ఇంటికెళ్ళినప్పుడూ
కొని పెట్టుకొనీ.. ;) థాంక్యూ..
విరబోణి గారూ.. ధన్యవాదాలండీ.. హైదరాబాద్ లో శిల్పారామం లో దొరుకుతాయ్ అని విన్నాను. ఎక్కడయినా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెడితే తప్పని సరిగా వీరి స్టాల్ ఉంటాది. నేను కనుక్కొని చెప్తానండీ.
మీ నిర్ణయం కేక.. ;)
Ruth గారూ.. మీది అనకాపల్లా? భలే భలే.. ;) వేడి వేడి గాజులు కొన్నారన్నమాట. షుగర్ ఫ్యాక్టరీ గురించీ , చెరకు పంట గురించీ కావాలనే చెప్పలేదండీ.. విషయం పక్కదోవ పడుతుందనీ
దాని మీద మరో పోస్ట్ వెయ్యొచ్చేమో..? ;).మీరు చెప్పిన విష్యం కూడా బాగా నచ్చిందండీ. నాకూ గుర్తొచ్చిందీ.. చిన్నప్పుడూ ఆ బళ్ళ వెనక పడీ చెరకు గెడలు లాగటం, రాకపోతే బండతన్ని అడగటం..
థాంక్యూ వేరీ మచ్. అండీ. మీ ముద్దమందారం బ్లాగ్ చూశానండీ చాలా బావుందీ. మీ పోటోల కోసం ఎదురు చూస్తున్నాను
సౌమ్యగారూ... థాంక్యూ.. తప్పకుండా రండీ మావూరు. మీ ఇజీనారం వెళ్ళినప్పుడూ.. నేనూ మా ఇసాపట్నం వస్తే గనకా తప్పకుండా నేనే అన్నీ స్వయంగా చూపిస్తాను మీకు..
మనసు పలికేగారూ.. ధన్యవాదాలు.. యెస్ నిజం చెప్పారు.
తృష్ణగారూ..
>>తాటాకు బాక్సులో లక్కపిడతలు చాలా ఏళ్ళు పదిలంగా దాచుకున్నానండి>>
ప్రతీ ఒక్కరూ దాదాపు గా ఇదే మాట అన్నారు..చాలా హ్యాపీగా ఉందండీ.. నా పోస్ట్ ఇంతమందికి బాల్యాన్ని, జ్నాపకాల్నీ గురుతు చేసిందంటే అంతకంటే వేరే ఆనందం లేదు నాకు.
ధన్యవాదాలండీ..
శిశిరగారూ.. థాంక్యూ వెరీమచ్ అండీ.. ;)
ఆహా....రాజ్...అలా చిన్న తనం లోకి తీసుకేల్లిపోయారు..:)
సూఊపెర్ పోస్ట్...
నాకు బొమ్మలన్నీ కావాలి..ఇచ్చేస్తారా??......
ఏ షాపింగ్ మాల్ లోనో కాస్ట్లీ గా ప్యాక్ చేస్తే ఇరవై రూపాయల ఐటెమ్ ని Rs.299 only (Hand made wooden toy) అని రాస్తే మాత్రం కొంటాం. -- ఇది చాలా నిజ్జం...!!
మరి మీరేమంటారు..!!!! -- వాకే అంటాను :)
చిన్నప్పుడు తాటాకు బుట్టలో లక్కపిడతలు కొనిస్తే ఆడుకున్నది జ్ఞాపకమే:) కొండపల్లి బొమ్మలు కూడా ఒకమోస్తరుగా ఇలాగే ఉంటాయి.
మీ టేంప్లేట్ చాలా బాగుంది.
రాజ్ కుమార్ గారూ, చాలా బాగా రాసారు. నా చిన్నప్పుడు అలాంటి బుట్టలో ఉన్న వంట సామానుల సెట్లు ఒకటి కాదు , ఎన్ని వాడానో, వీధిలో ఆది ఒకటి వదిలేసి రావటం, మళ్లీ రెండు రోజులకి ఇంకో సెట్ కొనటం. :-)) మాకు ఎటికోప్పాకలో చుట్టాలు ఉండేవారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా, యేవో ఒక బొమ్మలు తెస్తూనే ఉండేవారు. వీణ, రంగు ద్రవంతో ఉండి అటూ ఇటూ తూగే పక్షులు .....ఇంటి నిండా అవే బొమ్మలు.
కొన్నేల్లనుంచి ఇండియా వెళ్లి వచ్చినప్పుడల్లా ఇక్కడ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్ కి, పిల్లల టీచర్స్ కి ఇవే బొమ్మలు బహుమతిగా తీసుకు వస్తున్నాము. బొమ్మలో బొమ్మ ఉండే అమ్మాయి, అబ్బాయిల సెట్లు అయితే హాట్ ఫేవరెట్స్ ఇక్కడ అందరికీ. క్రిందటి సంవత్సరం నేను ఈ బొమ్మలు సికిందరాబాద్ లోని లేపాక్షి లో తీసుకున్నాను.
అబ్బో....మీదగ్గర ఇన్ని బొమ్మలున్నాయని తెలియలేదు చూసారా !
రాజ్ గారు మేం తరచూ విసాఖపట్నం వెళుతుంటాం . హైవేనుంచీ లోపలికి ఎంతదూరం వెళ్ళలీ . ఏ రూట్లో వెళితే దగ్గరో చెప్పండి.
మా అమ్మమ్మ గారిది చినగుమ్ములూరు అని అక్కడే. కరెక్ట్‌గా చెప్పాలంటే నర్సీపట్నం రోడ్ రైల్వేస్టేషన్ ఆ ఊరిలోనే ఉంది. ట్రైన్లో వెళితే మా అమ్మమ్మ గారి ఊరిలోనే దిగి కొప్పాక వెళ్లాలి.
కిరణ్.... బొమ్మలన్నీ కావాలంటే నాదగ్గర స్టాక్ లేదండీ.. మా వూరొచ్చేయండీ.. ధన్యవాదాలు..
జయగారూ..ధన్యవాదాలండీ.. ఈ బొమ్మలని కొండపల్లి బొమ్మలు అని చాలా మంది అపోహపడుతూ ఉంటారండీ..
పద్మగారూ.. నేను మరిచిపోయిన వాటిని కూడా గుర్తు చేసారు.. మీ కామెంట్ చదివాక చాలా హ్యాపీ అనిపించిందండీ.ధన్యవాదాలు.
లలితగారూ.. హహహ.. అన్నీ లేవండీ జస్ట్ పోటోలు తీశాను అంతే.. విశాఖపట్నం వెళ్ళే రూట్ లో
1. "అడ్డరోడ్" దగ్గర నుండి ఎడమచేతి వైపుకి (నర్సీపట్నం రోడ్) సుమారు 12 km ఉంటూందండీ.. ఒక 2 km దూరం మాత్రం రోడ్ అస్సలు బాగోదు.
2.అడ్డరోడ్ దాటాక వచ్చే "పులపర్తి" నుండి వెళితే 6km మాత్రమే నండీ. రూట్ కూడా బాగుంటుందీ.
ధన్యవాదాలండీ..
చాణక్య గారూ.. చినగుమ్ములూరా? వావ్. ;) తెలుసండీ.. చిన్నప్పటీ నుండీ తిరిగిన దారే కదా. ;)
ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారండీ.. వీడియోలూ, ఫోటోలతో కళ్ళకి కట్టినట్లుగా చెప్పారు.. మీకు అభినందనలు..
చాలాబాగా రాశారండి . నేను సంవత్సరం క్రితం కొండపల్లి వెళ్ళి మా పిల్లలకు బోలెడు బొమ్మలు కొనుకొచ్చాను . ప్రతిసంవత్సరమూ సంక్రాంతి సమయం లో నల్లకుంటలో ఫుట్‌పాత్ మీద ఈ బొమ్మలు పెట్టి అమ్ముతుంటారు . అప్పుడు తప్పకుండా ఒక బొమ్మైనా కొంటాను .
its a rajkuMARK.. as usually very nice.. your dear brother
its a rajkuMARK us usually verry nice. your dear brother
మాలాకుమార్ గారూ.. అవునాండీ..! మా వూళ్ళో తప్ప ఇంకెక్కడ అమ్ముతారో తెలీదండీ నాకూ.. ;(
ధన్యవాదాలండీ..
చందు గారూ థాంక్యూ వెరీ మచ్ అండీ.. ;)
Very nice and interesting article. Mee article anta Chadivaka, kudirithe ee sari mee voori nundi maa pillalaki bommalu techi pettaroo ani adagalanipinchindi....:-)
Sad, but true...wish our govt did something to protect these arts..
what a coincidence. mee post chadivi rendu rojulu kooda kaledu..ivala eenadu sunday edition (last week) lo mee voori gurinche kadaa vesaru? Etikoppaka ani choosina ventane ekkado vinnane eee madya ne ani alochistunte takkuna tattindi...will read that too :)
namaskaram raj garu..anukokunda mee blog chudatam jarigindi..mee post lanni chaala bagunnai...mukyanga ee post varsham padinappudu vochhe matti vasanala....andamaina balyanni gurtuchesindi...
namaskaram raj garu..anukokunda mee blog chudatam jarigindi..mee post lanni chaala bagunnai...mukyanga ee post varsham padinappudu vochhe matti vasanala....andamaina balyanni gurtuchesindi...
అనకాపల్లి దగ్గర ఉండి తెలుసుకోలేకపోయాను... చాలా సంతోషం...
అనకాపల్లి దగ్గర ఉండి తెలుసుకోలేకపోయాను... చాలా సంతోషం...
Chala baga rasaarandee
Post a Comment