Thursday, July 28, 2011

మావయ్యల లీలలు..!


ప్రతీ మనిషికీ ఊహ తెలియక ముందు అమ్మా, నాన్న మొదటి స్నేహితులయినా, ఊహ తెలిసాక బయట నుండి ఎంత మంది మంచి స్నేహితులు వచ్చినా, అమ్మ తోబుట్టువుల తో ఉండే అనుబంధం, స్నేహం, ప్రేమా ప్రత్యేకంగా ఉంటుందీ. 
మా ఫ్యామిలీ లో మొదటీ చంటి పిల్లోడిని నేనే గనుకా నా మీద ఆ ప్రేమ మరింత గా ఉండేది అందరికీనూ. మా ఇద్దరు పిన్నులూ, ఇద్దరు మావయ్యలూ నేనంటే అబ్బో.. భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి ఎగ్జాంపుల్ లాగా  ఉండే నా బొజ్జనీ నేనే మోసుకోలేనేమో అన్నట్టూ నన్ను భూమి మీద నిలబడనిచ్చేవారు కాదు. మా పెద్ద పిన్ని అయితే మిగిలిన వాళ్ళందర్నీ పక్షపాతం చూపకుండా పడేసి తన్నేసి మరీ నన్నెత్తుకునేదంట. ;) తను పెళ్లి చేసుకొని వెళ్ళి పోయాకా మా చిన్న పిన్ని కూడా అంతే.. రోజూ కాలేజ్ నుండీ వచ్చేటపుడూ తను తెచ్చే సాల్ట్ బిస్కట్స్ కోసమో, చాక్లెట్ల కోసమో తెగ ఎదురు చూసేవాడిని. 

ఆ.. ఇప్పుడు కధానాయకుల విషయానికి వద్దాం.. అదే మా మాయలు (మావయ్యలు) ఇద్దరూ చెరొక టైపూనూ (అంటే ఒక్కొక్కళ్ళూ ఒక్కో టైపనీ). 
చెయ్యి పెడితే తిరిగిరానంత దట్టమయిన ఉంగరాల జుత్తూ,తను చాచిపెట్టి కొడితే తిరిగి లేవనంత దిట్టమయిన  పెర్సనాలిటీతో, ఇంచుమించు ఎం.టీ.ఆర్ కి డూప్ లాగా ఉండే మా పెదమాయ కీ కుక్కలన్నా, క్రికెట్టన్నా ప్రాణం. సినిమాలన్నా, సినిమాల్లో చిరంజీవన్నా పిచ్చీ. వంట చేసీ, వండింది ఒక్కడే తినేయడం, తేడా వస్తే ఒంగేబెట్టీ వాయించేయడం హాబీలు.
తను బొంగరాలాటకీ బయటకెళ్ళి ఇంటీకొస్తుంటే ఊళ్ళో ఊరకుక్కలన్నీ వెనకాల తోకూపుకుంటూ, మూతి నాక్కుంటూ వచ్చేవంటా. భోజనం చేసేటప్పుడూ కుడి వైపు కుక్కనీ, ఎడమవైపు పిల్లినీ కూర్చోపెట్టేవాడు. అదిచూసీ చిఱెత్తిన మా అమ్మమ్మ, కంచం లో పెట్టేవాటితో పాటూ, తిట్టే తిట్లు కూడా ఆ రెండు జీవాలతోనూ కలిసి తినేవాడు.  (ఆయన ఎంత జంతు ప్రేమికుడంటే మా  బ్రౌణీ ని(పెట్ డాగ్)ఏదయినా  అడిగితే, అది కూడా అదే ఫ్రీక్వెంసీ  లో  రిప్లై ఇచ్చేదీ. పిలిస్తే పలికేది.)  సైకిల్ మీద నన్ను ఊరంతా తిప్పుతూండేవాడు. ఊళ్ళెళ్ళినప్పుడూ నాకోసం వేసుకోడానికీ బూట్లూ, ఆడుకోడానికి క్రికెట్ బ్యాట్లూ గట్రా తీసుకొచ్చేవాడు. 


అయితే ఇంట్ళొ చాలా  ఎక్కువ  కాలం‌ కలిసి ఉండటం వల్లా, వయసు వ్యత్యాసం తక్కువ  అవ్వటంవల్లా  పెదమాయ కంటే చినమాయ (చిన్న మావయ్య) తో  నాకు అటాచ్ మెంట్ ఎక్కువ ఉండేది.

అప్పట్లో చీపురు పుల్లకి చొక్కా, ప్యాంట్ తొడిగినట్టూ ఉండీ, కళ్ళ్లల్లో పడే జుత్తు కత్తిరించుకోడానికి పది రూపాయలూ, కారుతున్న ముక్కు తుడుచుకోడానికి ఐదు రూపాయలూ అమ్మమ్మ ని లంచం అడిగే మా చిన్నమాయ కీ కావిడిబద్దంత క్రియేటివిటీ,కొలబద్దంత తిక్కానూ. తనకి నచ్చింది జరక్కపోతే ఇంట్లో దేవుడి గదికీ, పెద్దగదికీ మధ్య దార్లోఅడ్డంగా పడుకొనీ, మనిషన్న వాడు భరించలేని శృతి లో ఆనందభైరవి రాగం లో దొర్లి దొర్లీ ఏడ్చేవాడు.  మడిచేసిన విస్తరాకుకీ, మడతెట్టిన పూతరేకు కీ తేడా తెలీ చిన్న పిల్లోణ్ణి నేనే ఎప్పుడూ ఏడవలేదూ.. ఇలాగా.. వీడేంటీ అసయ్యం గా అనుకునేవాడిని :) :) 
తన గది లోకి ఎవరయినా ఎంటరయితే కుక్క దూరిందనుకొనీ కర్ర   పట్టుకు బాదేసే మా మామ్మ (అమ్మ గారి నానమ్మ) గారి మంచం కింద ఒక ఇనపరేకు పెట్టె ఉండేది. అందులో తేదీ దాటిపోయిన ట్రెయిన్ టిక్కేట్లూ , కలర్ పేపర్లూ, ఖాళీ ఇంజక్షన్ సీసాలూ, వాడేసిన అగ్గి పెట్టెలూ, అయిపోయిన బ్యాటరీలూ లాంటి  కలెక్షన్  ఉండేది చినమాయకి. రంగు కాగితాలని  తిరిగే చక్రానికి అతికీంచీ వాటివెనకాల టార్చ్ లైట్ వేసి తిప్పుతూ సినిమా వేసేవాడు. అట్టపెట్టెలతో ట్రాక్టర్ బొమ్మలూ, కార్ లూ, బ్యాటరీలతో నడిచే బళ్ళూ, చెక్కతో పొడుగాటి తుపాకీ మోడల్స్ తయారు చేసేవాడు. ఆ తుపాకీ ఎడమ చేత్తో కాకులకి గురిపెట్టీ, ఇంట్లో ఉండే అశోక చెట్టు కాయలు కుడి చేత్తో గురితప్ప కుండా విసిరేసీ "డిష్కూ" అనేవాడు. ఖాళీ ఇంజక్షన్ సీసాలని అందమయిన ఆకృతుల్లో అతికించీ కింద బల్బ్ పెట్టీ నా చేత చప్పట్లు కొట్టించేవాడు. అయితే ఇవన్నీ చూడ్డానికి మాత్రమే నాకు పర్మిషన్.  ఆడుకోడానికి ఇమ్మంటే  అవి నాకివ్వడం అడుక్కుతినేవాడికి  అమెరికా  ప్రెసిడేంట్ ఆటోగ్రాఫ్ ఇవ్వడం‌లాంటిదనీ ఫీలయ్యేవాడో ఏమో ఒక్క సారి కూడా ముట్టుకోనిచ్చేవాడు కాదు. :( :(   

ఒకసారేం జరిగిందంటే... మా మేడమీదా అన్నంమెతుకులూ, తెల్లకాగితాలతో కుస్తీ పడుతూ చిన్నమాయా,ఆ కుస్తీని చూస్తా నేనూ చాలా బిజీ గా ఉన్నాం.. తర్వాత ఆ కాగితానికి దానికి దారం కట్టీ గాల్లోకెగరేశాడు. అప్పుడే తెలిసింది నాకు దాన్ని గాలిపటం అంటారనీ.  దాని  తోక మిగిలిన గాలి పటాల్లాగా కాకుండా రింగులు రింగులు గా భలే ఉన్నాది. 



మా మేడకి చాలా దూరం లో ఇంకో మేడ మీద ఎవరో అమ్మాయ్ చెయ్యూపుతా ఉన్నాదీ. మాయ నన్ను భుజాల మీదకెక్కీంచుకొనీ చేతులు ఖాళీగా లేవని అనుకూంటా.. "ఒరే.. బుజ్జిగా నువ్వ్ కూడా చెయ్యూపరా" అన్నాడు.
ఎంతయినా నాకు కాబోయి, కాకుండా పోయిన ఒకానొక అత్త కదా.. చేతులు పీకేవరకూ, కా.పో అత్త వెళ్ళిపోయే వరకూ తెగ ఊపేసాను. ఇంతలో కింద నుండీ అమ్రీష్ పురీ రేంజ్ లో ఒక అరుపు వినిపించిందీ.. 
"ఒరేయ్...*#(&$%$(#% అవి హాఫ్ ఇయర్లీ ఎగ్జాం పేపర్లు రా.. ఇంకా కరెక్షన్ కూడా చెయ్యలేదూ..నువ్ గాలిపటాలెగరేసేస్తున్నావా?  " అనీ. మాయ నా వైపు చూశాడు. నేను చినమాయ కళ్లల్లో భయం చూశాను.  ఆ తర్వాత కింద అరుస్తున్న తాతయ్య గారి కళ్ళల్లో కోపం చూసాను. డాబా మెట్లెక్కీ, తగువేసుకున్న వీధిలో వాళ్లనీ బూతులు తిట్టడం లో డిప్లొమా చేసిన మా తాతయ్య గారూ కటకటాల రుద్రయ్య సినిమా లో క్రిష్ణంరాజు లాగా బలంగా అడుగులేస్తూ, ఆగ్రహంతో ఊగిపోతూ మేడ మీది కొస్తున్నారు. 
ప్రమాదాన్ని పసిగట్టిన మావయ్యేమో గాలిపటాన్ని గాలికొదిలేసీ, సిగ్నల్ రాని దూర్ దర్శన్ కోసం పెట్టిన 18 అడుగుల  టీవీ యాంటెన్నా పైపు పట్టుకొనీ కిందకి దిగేశాడు. 

డాబా మీదికొచ్చిన తాతయ్య, మావయ్య లేకపోవటం తో అవాక్కయ్యీ , రోడ్ రోలర్ ని రిక్షాకి కట్టి లాగే వాడిలాగా ఒక  ఎక్స్ప్రెషన్ పెట్టీ, ఆకాశం లో ఎగురుతున్నా ఆఫ్ఇయర్లీ  ఆన్సర్ పేపర్లవైపు అయోమయం గా చూస్తూ, సభ్యసమాజం సిగ్గుపడుతూ, చెవులు మూసుకొని తలదించుకునేలాగా బూతులు తిడుతూ కిందికెళ్ళిపోయారు. (అలా చూడకండీ.. మా ఇంటి ముందుండే ఆకుల అప్పయ్యమ్మ గారు తిట్టడం మొదలెడితే మా తాతయ్యే చెవులు మూసుకునేవారు. ఆవిడ పీ.హెచ్.డీ చేసిందిలేండీ  తిట్ల మీద ;)) 

ఇది చూడండీ.. ! :)    


 కిందకొచ్చి చూసేసరికీ చినమాయా, పెద్ద మాయ వీర లెవల్లో కొట్టుకుంటున్నారు కారణం తెలీదు నాకు. వాలీ సుగ్రీవులు కొట్టుకున్నారంటే నమ్మలేదు వీళ్లని చూసేవరకూ. విడదీయడానికి మధ్య లోకేళితే ఇద్దరూ కలిసి మనల్ని కొడతారనీ అందరూ ఎవ్వరి పనివాళ్ళు చేసుకుంటున్నారూ. కన్నడ యాక్షన్ సినిమా చూస్తున్నట్టూ, ముష్టియుద్దాల పోటీ లైవ్ చూస్తున్నట్టూ, మల్ల యోధులకి ఆయుధాలిచ్చి కొట్టుకోమన్నట్టూ ఉంది సిచ్చువేషన్.  పెదమాయ వీధిలోకి పరిగెట్టాడు. వెనకాల చినమాయ కూడా పరిగెట్టాడు. చిన్నమాయకి మా గోడ పక్క పేర్చున్న ఇటుకలు దొరికాయ్. పెద్దమాయ కి ఒక మోస్తరు కర్ర  దొరికీందీ. ఈ చివర ఈయన రాళ్ళిసరడం మొదలెట్టాడు. ఆ చివర ఆయన వాటిని కర్ర తో కొట్టడం మొదలెట్టాడు.
నేను మధ్యలో అరుగు మీద కూర్చొని చూస్తున్నాను ఇంట్రస్టీంగా ఉందనీ.  రసవత్తరం గా  సాగుతోంది మ్యాచ్. అప్పటివరకూ అరుగు మీద సోది కబుర్లు చెప్పుకుంటున్న  పక్కింటి పాపా, చివరింటి నల్లమరీ  గార్లూ "ఇదేటమ్మా మాయదారి గుంట్లూ..!" అనుకొని తిట్టుకొనీ వీళ్లకి నీతులు చెప్పడం  "పిచ్చి కుక్కలకి పళ్ళుతోముకోమని పెప్సొడెంట్ ఇవ్వటం‌లాంటిదనీ" డిసైడయ్యీ లోపలికి పారిపోయేరు.
ఓ నాలుగు రాళ్ళయ్యాకా "ఇంకోంచేం పెద్ద రాళ్ళిసర్రా" అన్నాడు పెదమాయ. అప్పటి వరకూ పిచ్చోడి చేతిలో రాయి లాగా పవర్ఫుల్ గా విసిరిన చిన్నమాయ పక్కా క్రికెటర్ లా పెర్ఫెక్ట్ బౌలింగ్ యాక్శన్ తో ఫుల్ టాస్ లు వెయ్యటం మొదలెట్టాడు. ఇంకో నాలుగు రాళ్ళేసాకా ఇద్దరికీ  జ్ఞాన జ్యోతి కంబైండ్ గా వెలిగీ, బాలూ, బ్యాటూ పట్టుకొనీ చెరో సైకిలూ వేసుకొనీ ఏటి ఒడ్డున క్రికేట్ ఆడ్డానికి బయలుదేరారు గొడవ మరిచిపోయి. (వీళ్ల క్రికెట్ పిచ్చి కాకులెత్తుకెళ్ళా.. అనుకొనీ నేనూ సైకిలెక్కేను)

ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అన్నమాట. మధ్యాహ్నం టైం లో అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో ఇంట్లో పనిచేసే "మెంటల్ శీను" పరిగెట్టుకుంటూ వచ్చీ మా అమ్మమ్మ గారితో 
"బాప్పా..బాప్పా.... ఊరు తగలడిపోతుందే" అన్నాడు ఆందోళన గా. వెంటనే అందరూ మా పెరటి గుమ్మం వైపు పరిగెట్టారు. వెనకాల నేనూ వెళ్ళాను. ఒక్కసారిగా భయం వేసిందీ. మా పక్కన ఉన్న తాటి కమ్మలిల్లు కాలిపోతుందీ. అందరూ అరుపులూ...అంతా ఒకటే గోలా. "ఒక ఇల్లే కదా తగలడుతుందీ? ఊరు తగల బడుతుందంటారేంటీ?" అని ధర్మ సందేహం అడిగాను అమ్మనీ. "ఇది ఆర్పక పోతే మంటలు పెరిగీ అందరి ఇళ్ళూ కాలిపోతాయ్ రా" అని అనటం తో అర్ధమయ్యిందీ. 
చినమాయ మా హ్యాండ్ బోర్ లో నీళ్ళు కొడుతూ ఉంటే, అమ్మా వాళ్ళూ బిందెలతో అందిస్తుంటే, పెద్దమాయ ప్రహారీ గోడేక్కీ  ఆ నీళ్ళు, కాలుతున్న ఇంటి మీద పోయటం మొదలెట్టారు. పెదమాయ కాలు వేసిన గోడ కూలిపోయీ లోపల పడబోయి తృటి లో తప్పించుకున్నాడు.


మంటల వేడికి చుట్టుపక్కలంతా వేడిగా అయ్యిపోయిందీ. ఎటు చూసినా పొగా. అక్కడ ఉండటమే కష్టం గా ఉందీ. అయినా గానీ అక్కడే ఉండీ ఫైరింజన్ వచ్చేలోపు మంటలు ఆర్పేశారు దిగ్విజయం గా.. అందరూ ఊపిరి  పీల్చుకున్నారు.   
(క్లైమాక్ష్ ఫైట్ అయిపోయిన తరువాత పోలీసు లోచ్చినట్టూ, దొంగలు పడ్డ  ఆర్నెల్లకి  కుక్కలు మొరిగినట్టూ  మంటలు మొత్తం ఆరిపోయిన తరువాత తాపీగా ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళదేం  తప్పు  లేదు  లెండీ.. మా వూరి  రోడ్ అలాంటిదీ)

అప్పటి వరకూ  నన్నేడిపించే  మావయ్యలూ, నా బొజ్జని వెక్కిరించే మావయ్యలూ,  చిన్న పిల్లల్లాగా  గొడవాడుకుంటారనీ నేను నవ్వుకునే మావయ్యలూ  హీరో ల్లాగా కనిపించారు నా కంటికీ.....!

35 comments:

వేణూశ్రీకాంత్ said...

ఎప్పటిలాగే చక్కగా రాశావ్ రాజ్ :-) నిజమే మావయ్యలతో అనుబంధం మర్చిపోలేనిది.

కొత్త పాళీ said...

Beautiful

విరిబోణి said...

good, bavundi ..mee mavayya la tho mudivesukunna sarada sangatanalu maku kooada saradaaga anipinchelaa raasaru :)

Anonymous said...

krishnamraju photos super :)

Saahitya Abhimaani said...

బాగా వ్రాశారు మీ జ్ఞాపకాలు. చదవటానికి మంచి సరదాగా ఉండి, చిన్నతనంలో చూసిన విశేషాలు గుర్తుకు తెచ్చినాయి.

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>>> మడిచేసిన విస్తరాకుకీ, మడతెట్టిన పూతరేకు కీ తేడా తెలీ చిన్న పిల్లోణ్ణి నేనే.....

ఇది అరాచకం. రెండు కెవ్వులు.
మేనమామలతో అనుబంధం చాలా ఎక్కువగా ఉంటుంది.ఇప్పటికీ తలుచుకుంటే ఎన్నో మధుర స్మృతులు. చాలా బాగున్నాయి, మీరు అంత సరదాగా వ్రాసిన మీ జ్నాపకాలు.

SHANKAR.S said...

ఊరికే అంటారేంటి బ్లాగ్లోక త్రివిక్రమ్ అని. ఈ పోస్ట్ లో పంచ్ లు అదిరాయి రాజ్. నిజమే.. మామయ్యలతో అనుబంధం ప్రత్యేకమైనది. నాకూ ఇద్దరే మామయ్యలు. కానీ నాకు ఊహ తెలిసేనాటికే మా PM, CM లు ఉద్యోగాల్లో సెటిలయిపోయి, పెళ్లిళ్ళు అయిపోవడంతో మీ తరహా బాల్యం నాకు దొరకలేదు. కానీ వాళ్ళు ఇంటికి ఎప్పుడొచ్చినా, మేము వాళ్ళ ఊరు ఎప్పుడెళ్లినా కావలసినవన్నీ కొనిపించుకోవడం మాత్రం ఖాయంగా జరిగేది. అయినా మేనల్లుడు గారంగా మారం చేస్తే ఏ మేనమామ మాత్రం అడిగింది ఇవ్వడు చెప్పండి.

ఆ.సౌమ్య said...

"కావిడిబద్దంత క్రియేటివిటీ,కొలబద్దంత తిక్కానూ"

"మడిచేసిన విస్తరాకుకీ, మడతెట్టిన పూతరేకు కీ తేడా తెలీ చిన్న పిల్లోణ్ణి"
............

వావ్ వావ్..పంచులు అదిరాయి...భలే రాసావ్...ఒక కథలా చక్కగా ఉంది. రవణ గారిలా ఆపకుండా చదివించేటంత క్రియేటివిటీ ఉంది నీ రాతల్లో...సూపర్

కృష్ణప్రియ said...

:) పూతరేకు డైలాగు కి..

మీ కథనం ఒక ఎత్తైతే.. కృష్ణంరాజు బొమ్మలు భలే ఉన్నాయి ఎలా సంపాదించారు?

మనసు పలికే said...

రాజ్,
నీ పంచులకి నవ్వలేక కడుపునొప్పొస్తే ఆ పాపం(పుణ్యం మొత్తం) నీదే ;);)
భలే రాసావులే. కొన్ని పంచులైతే నిజంగా చాలా నవ్వించాయి. ఇంక మీ మామయ్యల లీలలు సూపరు;) ముఖ్యంగా మీ చినమాయ తన బదులు నీ చెయ్యి ఊపించారు చూడు కెవ్వు అసలు;)
లాస్ట్‌లో అయితే నిజంగానే హీరోలయిపోయారమాట. చాలా బాగుంది టపా:))

శ్రీనివాస్ పప్పు said...

కావిడిబద్దంత క్రియేటివిటీ,కొలబద్దంత తిక్కానూ.
రోడ్ రోలర్ ని రిక్షాకి కట్టి లాగే వాడిలాగా.
"ఇదేటమ్మా మాయదారి గుంట్లూ..!

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ రాజ్ నిన్ను బ్లాగ్/బజ్ త్రివిక్రం అనడంలో మేము ఏ పొరపాటూ చెయ్యలేదు

S said...

భలే రాసారండీ! :))))
ఇంతకీ, మీ స్కూల్ రోజుల ఫ్లాష్బ్యాక్ రాసారా??

..nagarjuna.. said...

పోస్ట్ పోస్టుకు పొగడలేము రాజ్ (ఉపమానాలు అన్నీ ఐపోయాయి మరి) పోస్ట్ కింద 'బాగుంది', ' చాలా బాగుంది', 'చాలా చాలా బాగుంది' అని మూడు రేటింగులు పెట్టు. మేము అడ్జస్ట్ అవుతాం

శశి కళ said...

మీ ఊర్లొ కుక్కలకు పెస్ట్ ఇవ్వరు అన్న మాట.
వాళ్ళెమొ ఆనంద బైరవి....నువ్వెమొ యెమి తెలీని
అమా......ఆహా....raj is raj

Unknown said...

నవ్వలేక నానా అవస్థలు పడి ఎలాగో అల చదివాను ఏమి రాసారండి రాజ్ గారు
మీకు ఒక వంద వీరతాళ్ళు ...

Sravya V said...

బావుంది బాగా రాసారు రాజ్ కుమార్ గారు , చివర పేరా సూపర్ :)
మీకు మడిచిన విస్తరాకు కి , పూతరేకు కి తేడా తెలియదా :)))))

రాజ్ కుమార్ said...

వేణూజీ.. అవునండీ.. చెప్పుకుంటూ పోతే చాలా పోస్ట్ లు వస్తాయి.. థాంక్యూ..
కొత్తపాళీ గారూ ధన్యవాదాలండీ..
విరబోణి గారూ ధన్యవాదాలు..!

రాజ్ కుమార్ said...

శ్రావణ్ గారూ.. హహహ.. గ్రేట్ కలెక్షన్ కదండీ.. నా బ్లాగ్ కి స్వాగతం, థాంక్యూ అండీ

శివరామప్రసాద్ గారూ ధన్యవాదాలండీ..

బులుసుగారూ.. అవునండీ.. అయితే తొందర్లో మేముకూడా మీ నుండీ ఒక పోస్ట్ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా?? ;) ధన్యవాదాలండీ..

రాజ్ కుమార్ said...

శంకర్ గారూ.. హహ్హహ.. అయితే నేన్ చాలా లక్కీ అన్నమాట. ;)
>>మేనల్లుడు గారంగా మారం చేస్తే ఏ మేనమామ మాత్రం అడిగింది ఇవ్వడు చెప్పండి.>> .. నిజం.. మావయ్యలతో బయటకెళితే... ఐస్ క్రీమ్స్ తినకూడదూ, కూల్డ్రింక్స్ తాగకూడదూ లాంటి రూల్స్ ఉండవ్.. కుమ్మెయ్యటమే.. ఇప్పటికీ నేను ఇంటికెళ్ళినప్పుడూ మా మాయా, నేనూ బైక్ మీద బలాదూర్ తిరుగుతూ, కనిపించిన హోటల్లో కి దూరి కుమ్మేస్తూ ఉంటాం.. ;)

రాజ్ కుమార్ said...

సౌమ్యగారూ.. అంతా మీ ప్రోత్సాహమే.. ధన్యవాదాలండీ... ;)

కృష్ణప్రియగారూ. నా బ్లాగ్ కి స్వాగతమండీ.. ఆ కలెక్షన్ సంవత్సరం క్రితం అనుకోకుండా దొరికిందండీ...దాచి పెట్టుకున్నా..
ధన్యవాదాలండీ..

రాజ్ కుమార్ said...

మనసు పలికె గారూ..అలాంటి స్టోరీలు చాలా ఉన్నాయ్. హిహిహిహ్ థాంక్యూ వెరీ మచ్..

పప్పుసార్..హహహ అలా ములగచెట్టెక్కీంచొద్దు సార్ పడిపోతానూ.. థాంక్యూ అండీ...

S గారూ.. ధన్యవాదాలండీ.. రాశానండీ..
http://rajkumarneelam2.blogspot.com/2011/05/blog-post_10.html

కుదిరితే ఇది చూడండీ..

రాజ్ కుమార్ said...

నాగార్జునా.. ఊరుకో బాసూ నువ్ మరీనూ.. ;)
థాంక్యూ వెరీమచ్.

శశిగారూ... ఇవ్వమండీ.. మేమే వాడుకుంటాం..;) ;)
ధన్యవాదాలూ..

శైలు గారూ.. అన్ని అవస్థలు ఎందుకు పడ్డారండీ? ;
థాంక్యూ వెరీమచ్.. ;)


శ్రావ్యగారూ.. చాలా థాంక్స్ అండీ.. అంటే అప్పట్లో, ఆరోజుల్లో, చిన్నపిల్లోణ్ణీ కదండీ.. తెలీలేదు.హిహిహిహి..

హరే కృష్ణ said...

కెవ్వ్ రాజ్ :)
Awesome!

Sai Praveen said...

చదువుతున్నంత సేపు పగలబడి నవ్వుతూనే ఉన్నాను. చదవడం పూర్తయ్యాక ఒక చిరునవ్వు చాలాసేపు అలా ఉండిపోయింది.
మావయ్యల మీద ప్రేమ + చిన్న నాటి జ్ఞాపకాలు + నీ స్టైల్ పంచ్ డైలాగులు = ఈ పోస్ట్
ఒక వంద కెవ్వులు :)

Anonymous said...

>>>> మడిచేసిన విస్తరాకుకీ, మడతెట్టిన పూతరేకు కీ తేడా తెలీ చిన్న పిల్లోణ్ణి నేనే.....

meeku blogloka Trivikram tho batu "Blogloka Veturi" ane birudu kooda ivvochemo!

బంతి said...

రాజ్ పంచ్ లు సూపరు

>>మావయ్యలూ హీరో ల్లాగా కనిపించారు
నిజమే 'మావయ్యలు' ఎప్పుడు హీరోలే :)

Anonymous said...

>>>> మడిచేసిన విస్తరాకుకీ, మడతెట్టిన పూతరేకు కీ తేడా తెలీ చిన్న పిల్లోణ్ణి నేనే.....

meeku blogloka Trivikram tho batu "Blogloka Veturi" ane birudu kooda ivvochemo! Veturi gari la mee matalaku kooda aneka ardhalu vethukkovachu!!Paatalaku ayana Veturi, Matalaku meeru VETURI!

SJ said...

GOOD POST...

రాజ్ కుమార్ said...

హరే.. థాంక్యూ..!
సాయీ... అంతా నీ దయ... ;) హహహ థాంక్యూ..
బంతీ...యెస్ మాయలు హీరోలు.. థాంక్యూ..
సాయి గారూ ధన్యవాదాలు..

రవికిరణ్ పంచాగ్నుల said...

నాది కాస్త వెరైటీ స్టొరీ అనుకుంటానండీ..

వేసవి సెలవులకి అమ్మమ్మవాళ్లింటికెళ్తే, పొద్దున్నే లేపేసి ఇంటి చుట్టూరా ఉన్న ఆవరణలో తోటపని చేయమని పిల్లలందరికీ పురమాయించేవాడు మా చిన్నమావయ్య. మేమందరం చెమటోడుస్తుంటే, మావయ్య చిన్న కలుపుమొక్క తీద్దామని ఒంగునేసరికి ఇంట్లోంచి అమ్మమ్మ "ఓరేయ్! చిన్నాయ్..!" అని కేకేసేది. అంతే ఈయన జంపు..

:(

కొత్తావకాయ said...

బాగా రాసారు. కృష్ణం రాజు ఎక్కువ మార్కులు కొట్టేసాడు. మీ పోస్టులో ఫోటో కోసమే ముందు వెతుకుతాను నేనయితే. :)

రాజ్ కుమార్ said...

రవి కిరణ్ గారూ.. హహహ అవునా... నాకూ కూడా ఆ టైపు చాకిరీ ఉండేది లెండీ..అప్పట్లో నా పరిస్తితి బాలకార్మికుడి లాగా ఉండేదీ. ;)
ధన్యవాదాలు..


కొత్తావకాయ్ గారూ.హిహిహిహ్ థాంక్యూ అండీ..

స్నిగ్ధ said...

రాజ్ గారు మమ్మల్ని ఆఫిస్ లో పని చేసుకొనీరా...
ఇలా ఎంతకనీ నవ్వు కంట్రోల్ చేసుకుంటాము చెప్పండి(ఆఫిస్లో ...

సూపరసలు..పంచులన్నీ అదిరాయి...:)

రాజ్ కుమార్ said...

స్నిగ్ధ గారూ మీ పుణ్యమా అనీ, నా పోస్టులన్నీ నేనే చదివేసుకున్నా ఒకసారి ;)

మీకు నచ్చినందుకు సంతోషంగా ఉందండీ ధన్యవాదాలు

Unknown said...

very nice bagunnade my dear