Thursday, February 2, 2012

నేను - అప్పల్రాజు - పోలీస్ స్టేషను

ముందుగా అప్పిగాడి ఆగడాలు2 చదివొచ్చెయ్యండీ..!

తెల్ల చొక్కా వేసుకొని వైజాగెల్లే ఎక్స్ ప్రెస్ ని లిఫ్ట్ అడుగుతున్న  అబ్బిస్టేషన్ ముందాగిన మా బస్సునీదిగొస్తున్న జనాల్నీ చూసి "ఏంటీ విషయం?" అనడిగేడు డ్రయివర్ నివిషయం చెప్పాక "పదండి సార్ స్టేషన్ లో కెళ్ళి 
మాట్లాడుకుందాం అని"  చాలా మర్యాదగా లోపలకి దారితీశాడు.  వాడు మఫ్టీ లో ఉన్న S.I అనీమేము 
వెళుతున్నది పూలపల్లకి లాగా కనిపించే పులి బోన్ లోకనీ తెలీని పిల్లకాయలంతా ఉరిమే ఉత్సాహం తో
ఉరకలేస్తున్నారుమా శివగాడు మాత్రం వాళ్ళ మావయ్య పిలుస్తున్నారని స్టేషన్ గేట్ దగ్గర నుండే జంపయ్యి 
పోయాడుస్టేషన్ ముందున్న మెట్లెక్కి వరండా లో కెళుతుండగా "సీతయ్య సినిమా చూశావా?" అనడిగేడు నా
 పక్కనే నడుస్తున్న కనిస్టేబుల్లేదన్నాను. "ఏం పర్లేదు.. లోపలికి పదా.. చూద్దువూ గానిఅన్నాడు. నా గుండె 
కొట్టుకోడం మానేసీ చలిజ్వరమొచ్చినట్టూ వణకడం మొదలెట్టింది.ముందు అప్పల్రాజూవాడి ఎదురుగా S.I, పక్కనే 
ఎర్రబాబువాడి వెనక నేనూనా వెనక మిగిలిన స్టూడేంట్సూప్యాసింజర్స్మా చుట్టూ కానిస్టేబుల్సూ.. ఇలా 
పద్మవ్యూహం లాగా ఉంది. 



"ఏంటమ్మా ప్రోబ్లెం?" అన్నాడు ఎస్సై చాలా సౌమ్యంగాఅప్పిగాడిని వెనక్కి తోసేసి ముందుకొచ్చిన ఎర్రబాబు.. 

"ఎందుకు మా బస్ పాస్లు ఎలో చెయ్యటం లేదూవెటకారమాకండకావరమాస్టూడేంట్స్ తలచుకుంటే రాజ్యాలే 
కూలిపోతాయ్ఆఫ్ట్రాల్ మీరెంతానొప్పిస్తే నరికేస్తాం.. తేడాలొస్తే తొక్కేస్తాంతలచుకుంటే తల తీస్తాం"అని ఆన్ లో 
ఉన్న లౌడ్ స్పీకర్ మింగేసినోడిలాగా రంకెలేశాడు. వాడు చేసిన శబ్దకాలుష్యానికి నాకే భయమేసింది. అందరూ 
అవాక్కయ్యారు. అక్కడ కొద్ది సెకన్లు నిశ్శబ్దం రూల్ చేసిందిఅది ఉయ్యాలలో పడుకున్న చంటి పిల్లోడు నిద్రలేవక 
ముందుండే ప్రశాంతత అని  తెలుసుకోడానికి అట్టే సమయం పట్టలేదు మాకు.అప్పటి వరకూ సుమన్ బాబు లాగా 
చిరునవ్వులు రువ్విన ఎస్సై ఒక్క ముక్క కూడా మాట్ల్లడ కుండా ఎర్రబాబు గాణ్ణి గ్యాప్ లేకుండా కుమ్మడం 
మొదలెట్టాడుచొక్కా మీదకి లాగి బాదేస్తున్నాడుజుత్తు పట్టుకొని గోడకి దాపెట్టి దవడల మీద దరువేసేస్తున్నాడు. 
అనువు గా ఉన్న చోట పిడి గుద్దులు గుద్దేస్తున్నాడు.  కింద పడేసి ఫుట్ బాల్ ఆడేస్తున్నాడు 
మా నాన్న కూడా ఎప్పుడూ అలా కొట్టలేదు నన్ను. "అమ్మోయ్.. బాబోయ్" అని అరవడానిక్కూడా గ్యాప్ 
లేకపోవటంతో  ఎర్రబాబుగాడు కామ్ గా తినేస్తున్నాడు. చాలా కాలం బట్టీ ఎవణ్ణీ కొట్టే చాన్స్ రాలేదనుకుంటా 
కానిస్టేబుళ్ళందరూ "ఒక్క చాన్సు.. ఒకే ఒక్క చాన్సు" అని గొణుక్కుంటూ లాఠీలు పిసికేస్తున్నారు. అది చూసి 
వరండా పై మెట్టు మీదున్న నేనునాకు తెలీకుండానే చివరి మెట్టుకొచ్చేశాను.(నిజ్జంగా నిజం). 
సినిమాల్లో పోలీసులు "మీరు ఒకసారి స్టేషన్ కి రావలసి ఉంటుంది" అనెందుకంటారో అర్ధమయ్యింది.

"మొసలికి నీట్లో బలం 
బాలయ్య బాబుకి కుడి తొడ లో బలం 
పోలీసోడికి స్టేషన్ లో బలంఅనీ తెలుసుకున్నాను.

ఒంటి మీద సబ్బు పెడితే నురగొచ్చేలాగా అందరికీ బాడీలు తడిచిపోయాయి సిచ్చువేషన్ లో… ఆ భీభత్సకర 
వాతావరణం లో, అప్పల్రాజు గాడు మా వైపు తిరిగి వాడి ట్రేడ్మార్క్ నవ్వు నవ్వటం మొదలెట్టేడు. పోలీసోడు 
కొడతాడేమో అన్న భయం కన్నావీడెందుకు నవ్వుతున్నాడో తెలియట్లేదన్నటెన్షన్ 
ఎక్కువయ్యిపోయింది నాకు.



"ఏరా.. ఎవడితో మాటాడుతున్నావో తెలుసాఎక్కడ నిలబడ్డావో తెలుసాపోలీస్ స్టేషన్ కొచ్చి అరుస్తావాఎస్సైని 
నా మీద కేక లేస్తావాఉతికిపిండేస్తా.. పిండి ఆరేస్తా..." అని తన కొట్టుడు వ్రతానికీమౌన వ్రతానికీ కంబైండ్ గా 
బ్రేకిచ్చాడు పోలీసోడు.




ఇంకేముందీతర్వాత అప్పిగాడు తింటాడూ తర్వాత నేనే.. అని ఫిక్సయిపోయాన్నేను. "ఏం చేద్దాం రా కిరణ్
గా?" అన్నాను. రిప్లై రాలేదేంటా అని చూస్తే నా పక్కనే ఉన్నాడనుకున్న కిరణ్ రాజ్ గాడు ఎప్పుడో లగెత్తేసేడన్న
పాచి నిజం ఫ్రెష్ గా తెలిసింది నాకు. [కానిస్టేబుల్,వాడూ ఫ్రెండ్స్ అంట]. నేను కూడా నాలోకి పీ.టీ ఉషనో, అశ్వనీ 
నాచప్ప నో, కనీసం వెంటతరుముతున్న కుక్కనో ఆవాహన చేద్దాం అనుకున్నా.కానీ అప్పిగాణ్ణి వదిలేసి వెళ్ళడానికి
మనసొప్పలేదు.

అక్కడున్న పాసింజర్స్నీ అదే బస్ లో పంపేసీ, మా స్టూడెంట్స్ అందర్నీ వాడి రూం కి తీసుకెళ్ళాడు . వాడి 
సింహాసనం మీద కూర్చొనిమమ్మల్ని చుట్టూ నిలబెట్టి తేరగా తగిలేం కదా అని బూతుల్లేని తిట్లు స్పష్టంగా తిట్టడం 
మొదలెట్టాడు సంస్కారం గల ఆ ఎస్సై.
[బ్యాక్ గ్రౌండ్ లో ఉచ్వాశమతని వికారం... నిశ్వాసమతని ధిక్కారం అని పాట వినిపిస్తుంది నాకు]
ఎర్రబాబు గాడు  "సర్.. నా మీద చెయ్యి చేసుకోవటం ఏమ్ బాలేదు.. మీరు చాలా పెద్ద తప్పు చే..." అనబోయేంత లో 
ఇంకోసారి ఫైటింగ్ చేసీ(ఫైటింగ్ కాదది కోటింగ్) వాణ్ణి పక్క రూం లో కూర్చో బెట్టాడు.[అన్ని తిన్నా బుద్ధి రాలేదు 
ఎదవకి]
ఎస్సైః “కాలేజ్ కెళ్ళండ్రా అని ఇంట్లోవాళ్ళు క్యారేజీలు చేతికిచ్చి పంపితే, అచ్చోసిన ఆంబోతుల్లాగా అరుస్తూ, కు.ని 
చేసొదిలేసిన కుక్కల్లాగా రోడ్లమీద తిరుగుతారా? తొక్కి నార దీస్తా.
నేనుః స..ర్…  మ…కు ఈ..రొజు.. స్…సో. .సొ..రీ స..ర్ అసలేం… జ..రి..గిందం..టే
ఎస్సైః ఏంట్రా.. ఏడుస్తున్న కుక్క ని కడుపులో గుద్దినట్టూ ఆగాగి వాగుతున్నావ్?
[తప్పో..ఒప్పో ఏదో ఒకటి వాగి పరిస్థితిని చక్కదిద్దుదాం అనుకున్నా. మూడంకె వేసుకొని నిద్రపోతున్న నాలోని 
నటుణ్ణి కితకితలెట్టి నిద్ర లేపాను]
నేనుః "సర్.. మాకీ రోజు ఎగ్జాం ఉంది సార్మధ్యాహ్నం లాబ్ కూడా నండీ.. అటెండ్ అవ్వకపోతే ఇయర్ 
వేస్టవుతుంది
సో.... సోరీ సార్ రోజు నుండి ఆటో ఎక్కే ముందు కూడా బస్ టికెట్ తీసుకుంటాంమీరు సీతయ్య సినిమాలో 
హరికృష్ణ లాగా ఎవ్వరిమాటా వినరనీ, సుస్వాగతం సినిమా లో ప్రకాష్ రాజ్ లాగా మోనార్క్ అనీమీకు శివమణి 
సినిమా లో నాగార్జున లాగా మెంటలనీ తెలీక వచ్చాంమమ్మల్ని ఒదిలెయ్యండి బాబయ్యా"
అని ఆస్కార్ రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చానునా నటనకి నించొని క్లాప్స్ కొట్టీమెచ్చి మేకతోలు కాకపోయినా కనీసం  
వాడు వాడేసిన తువ్వాలన్న్నా కప్పుతాడనుకున్నాను.
ఎస్సైః ఏరాఎగ్జాం ఉందాల్యాబ్ కూడా ఉందావెళ్లక పోతే ఇయర్ వేస్టవ్వుద్దామరి బస్ లో గొడవ చేసినప్పుడు 
ఇవేం గుర్తు రాలేదామీ బస్ లో హాస్పిటల్ కి వెళ్ళేవాళ్ళూఆఫీస్ లకి పోయేవాళ్ళూ  ఉన్నారు కదాకనీసం 
ఆలోచించారాఅప్పుడీ బుద్ధి బందరెల్లిందా? లేకా బుర్ర బ్యాగుల్లో పెట్టుకుని కాలేజ్ కెళుతున్నారాహ్మ్మ్.... ఏం 
చదువుతున్నావ్?
నేనుః బీ.టెక్ సర్
ఎస్సైః  కాలేజ్?
నేనుః *(&$%(# ఇంజినీరింగ్ కాలేజ్ సర్   
ఎస్సైః *(&$%(# అంటే శుక్రవారం సెలవిచ్చీఆదివారం క్లాస్ లు పెట్టే  తలతిక్కల కాలేజేనా?
నేనుః అవును సార్
ఎస్సైః మున్సిపాలిటీ కుక్కల బస్స్ లు సెకండ్స్ లో కొనీ పసుపు రంగేసీకిరోసిన్ లో నీళ్ళు కలిపికాలేజ్ బస్సుల్లా 
తిప్పుతారూ..  కాలేజే నా?
నేనుః యెస్సర్.. అదే.. అదే
పాపం మా మీద జాలి కలిగినట్టుందీ. " సారికి వదిలేస్తున్నా.. మళ్ళీ రిపీటయ్యిందోసెల్ లో సీన్ సితారయ్యి పోద్ది
అని నార్మల్ వాయిస్ లో వార్ణింగ్ ఇచ్చాడుహమ్మయ్యా అనుకున్నాం అందరం. ("శభాష్ రా వేణూరాం ఎవ్రిథింగ్ 
ఈజ్ అండర్ కంట్రోల్" అన్నాడు నా ఆత్మారాం) 

కానీ ఇక్కడే సీన్ ఇంకో మలుపు తిరిగిందిఅప్పటి దాకా పొద్దున్న తిన్న ఇడ్లీ నెమరు వేసుకుంటా బిజీ గా ఉన్న 
అప్పిగాడు తన ఉనికిని కోల్పోయాడన్న కసి తోనోలేకా క్రెడిట్ మొత్తం నాకు పోతుందన్న బాధ తోనో నోరిప్పాడు 
క్లోజ్ చేసేసిన క్రిటికల్ ఇష్యూని రీఓపెన్ చేసినట్టు.

అప్పల్రాజుః ఏక్చువల్లీ.. ఏం జరిగిందంటే సార్నేను మర్యాదగా Service regester చూపించమన్నాను సార్  
కండక్టర్ నిఆయన వెంటనే చూపించి ఉంటే మేము  గోలా చేసే వాళ్లమూ కాదూమేటర్ మీ దగ్గరకొచ్చేదీ కాదు.  
ఇందులో మా తప్పేం లేదు.
 ఒక్క డవిలాగ్ కీ కూల్ అయ్యాడనుకున్న ఎస్సై  కళ్ళు ఎర్రబడ్డాయ్ముక్కు రంద్రాలు వ్యాకోచించాయ్
దవడకండరం బిగుసుకుంది. నెత్తిమీదున్న నాలుగు వెంట్రుకలూ లేచి నించున్నాయ్. పొట్ట చుట్టుకొలత పాతిక 
సెంటీమీటర్లు పెరిగిపోయింది. ఒంట్లోంచి వస్తున్న సెగలకి వాతావరణం వేడెక్కింది. 
ఎస్సైః వార్నీ... అసల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ని S.R చూపించమని అడగడానికి మీరెవరు రా? ఎంత కొవ్వెక్కి 
కొట్టుకోకపోతే అలా అడుగుతావూ? ఏదో కాలేజీ కుర్రోళ్ళూ.... వదిలేద్దాం అనుకున్నామీరు పేద్ద కిలాడీలు రా.
మిమ్మల్నొదిలేస్తే” బాలయ్య బాబు సినిమాని పోసాని కృష్ణమురళి డైరెక్ట్ చేసినంత ప్రమాదం”, 
"చిన్నికృష్ణ కి పద్మశ్రీ ఇచ్చినంత పాపం". నిజం చెప్పూ... ఇందాక తన్నులు తిన్నోడి ప్రేలాపన కి నువ్వేకదా ప్రేరణా?

అప్పల్రాజూ: అబ్బెబ్బే లేదు సార్. పిచ్చోడి చేతికి పాశుపతాస్త్రం ఇచ్చినట్టూ వాడికి మాట్లాడే చాన్సిచ్చాం అంతే.
ఎస్సైః  ఏయ్ 203.. వీళ్ల మీద FIR రాసి పట్రా చెప్తాను.నోటితో చెప్తే అర్ధం కాదు ఈళ్లకి. 
"ఓరీ.. దురద పురుష దుర్యోధనా...! మాని పోతున్న పుండు మీద పిన్నీసెట్టి కెలికావ్ కదరా.. అప్పిగా!
  సిచువేషన్ ని హ్యాండిల్ చెయ్యలేనుఅనీ ఏడుస్తున్న లాఫింగ్ బుద్ధా లాగా చేతులు పైకెత్తేశాను.
అప్పిగాడి వైపు చూసి అందరం మూకుమ్మడిగా తోక తెగిన మూగ గాడిద ల్లాగా అరిచాం
 సౌండ్ అప్పిగాడికి తప్ప ఎవ్వరికీ వినిపించక పోవటం గమనార్హం.



అప్పిగాడు (నా చెవిదగ్గర నోరెట్టి: 302 అంటే తెలుసురా... కానీ 203 అంటున్నాడేంటీకొంపదీసి కాళ్ళకి తాడు కట్టీ 

తలకిందులుగా వేలాడేసి బాదేస్తాడా?
నేను (పళ్ళు బిగబెట్టి పెదాలు కదలకుండా: గట్టిగా అనకు రా గాడిదా.. ఆడికి లేని పోని ఐడియాలివ్వమాకు.

 ఇంట్లో ఓపిగ్గా వండిపెడితే, తీరిగ్గా తినేసీ, తాపీగా పడుకొనీ, ఘోరంగా గురకపెట్టే మీ విలువయిన సమయాన్ని 
వేస్ట్ చేశాం. ఈ ఒక్కసారికీ క్షమించెయ్యండి సార్" అని ప్రార్ధనల పరంపర మళ్ళీ మొదలెట్టాం అందరమూ. ఆ 
అభ్యర్ధనల పర్వం పూర్తయ్యాక, మా అందరి అడ్రస్ లూ, కాలేజ్ వివరాలూ, నోట్ చేసుకొన్నాక ఫైనల్ వార్ణింగ్ ఇచ్చి 
పొమ్మన్నాడు. బతికుంటే బాలయ్య బాబు సినిమాలు చూసి బతకొచ్చు అనుకొని బయటకొచ్చి ఆగిన బస్సెక్కి, 
దొరికిన సీట్ల లో కూర్చున్నాం.
అప్పల్రాజుః ఏదో బెదిరించడానికి అరిసేహేను గానీ, ఆ బస్సోడు నిజంగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడని అస్సలనుకోలేదు.  నువ్వేం బాధపడొద్దు రా.. ఈ ఎస్సై గాడు ఎలక్షన్ టైం లో మా వూరొచ్చినప్పుడు మనుషుల్ని పెట్టించి ముసుగేసి కొట్టించక పోతే నా పేరు….. 
నేనుః వద్దురా.. చాలు రా…ఆపరా ఇంకా. చొక్కా జేబులో సిరా కక్కేసిన ఇంకు పెన్ను లాగా కంగాళి కంగాళీ 
చేసేశావు. ఎర్రబాబు గాడు ఇంకా స్టేషన్ లోనే ఉన్నాడు పాపం. మంగళ్ పాండే లాంటి మనిషిని పురెక్కించి పూనమ్ 
పాండేని చేసేశావ్.
అప్పల్రాజుః నేను క్వార్టరే ఎక్కించాను. వాడికి ఫుల్లెక్కేసింది నన్నేం చెయ్యమంటావ్? హిహిహి
నేనుః  ఆ తింగరోడి ఓవరాక్షన్ వల్లే ఫోకస్ వాడి మీదకి పోయింది. మనం మిస్సయిపోయాం, వాడు 
బుక్కయ్యిపోయాడు.
అప్పల్రాజుః దాన్నే విధంటారు. నాకు సపోర్ట్ చెయ్యరా అంటే, నన్ను పక్కకి తోసేసి వాడు హీరో అయిపోదాం 
అనుకున్నాడు. ఎవడి కర్మకి వాడే బాధ్యుడు రా. బుర్ర హీటెక్కిపోయిందెహే.. సినిమా కి పోదాం. 
నేనుః నువ్ తామర లాంటోడివి రా. నీట్లో ఉంటే బురద, ఒంటి మీదుంటే దురద, అందరికీ తీర్చేస్తావ్ సరదా. ఈ 
సంగతి మా ఇంట్లో తెలిస్తే నాకు ఆకు బయటేసేస్తారు. ఈ పాటికి కాలేజ్ బస్ పోయే ఉంటాది. నీవల్ల టైం beep
ఎగ్జాం beep. ల్యాబ్…beep. కాలేజ్ beep. కొంచేం లో మిస్సయిపోయాం గానీ... అందరి లైఫ్ లూ  
బీఈఈఈఈఈఈఈప్ అయ్యుండేవి.
అప్పిగాడుః  అడ్డమయిన ఎదవ చేతా తిట్లు తిండానికి నాకేమన్నా సరదానా? కాదే? ఇలాంటి థ్రిల్ అందరికీ 
వస్తాదా? రాదే? సెమిస్టర్ కి రెండేసి సబ్జెక్ట్లు ఉండిపోతున్నాయనీ, క్లాసులెగ్గొట్టి హాస్టల్లో పేకాటాడుతున్నామనీ 
ఇంట్లో చెప్తున్నామా? లేదే? ఇది కూడా అంతేరా నువ్ చెప్తే నే తెలుస్తాది. అదంతా ఓకేగానీ ఇంతకీ "ఆకు 
బయటెయ్యటం" అంటే ఏంట్రా?
నేనుః చెప్తా.. చెప్తా.. ఇంటర్ ఫస్టియర్ లో పెన్ కొనుక్కుంటానని హాస్టల్ నుండి బయటకొచ్చీ, చెప్పాబెట్టకుండా నువ్ 
మీ ఊరెళ్ళే బస్సెక్కి ఇంటికి పారిపోతే, మళ్ళీ కాలేజ్ లో కాలెడితే కాళ్ళు విరిచేస్తాని మన ప్రిన్సిపల్ A.S Rao 
నిన్ను...
అప్పిగాడుః ఆపెయ్యి.. గుర్తొచ్చింది… అర్ధమయ్యింది. ఇప్పుడేంటీ? ఎగ్జాం మిస్సవ్వకూడదు అంతే కదా. దానికెందుకీ 
ఏడుపూ? సెంటర్లో దిగుతాం, ఆటో మాటాడుకుంటాం. కరెక్ట్ టైం కి కాలేజ్ లో ఉంటాం. నేను ప్లాన్ చేస్తాగా.
ఆటోలో హుటాహుటీన బయలుదేరాం. మధ్యలో రైల్ గేట్ పడటం, ఆటోలో పెట్రోలయిపోవటం వంటి దరిద్రాలు 
జరగటం వల్ల  కొండల్లో నెలకొన్న మా కాలేజీకి 5min లో ఎగ్జాం అయిపోతుందనగా చేరాం. చేసేదేమీ లేదనీ రెస్ట్ 
రూం లో అందాలకి మెరుగులు దిద్దుకుంటున్నాం నేనూ, కిరణ్ గాడూ. మీరిక్కడే ఉండండి.. పరిస్థితి ఎలా ఉందో 
చూసొస్తా నని బయటకెళ్ళాడు అప్పిగాడు. 2 నిమిషాల సెకన్లు గడిచాయి. వీడింకా రాలేదేంటబ్బా.. అని 
ఆలోచిస్తుంటే, వెనకాల నుండి ఎవరో కొత్తెం మీద పీకినట్టనిపించింది. వెంటనే మోకాలి ఎముకల మధ్య లో ట్యూబ్ 
లైట్ వెలిగింది.  హాల్ కి పరిగెట్టాను. ఇన్విజిరేటర్ నా వైపు చిరాగ్గా చూసీ కళ్ళతోటే గెటవుట్ అన్నాడు. ట్రింగ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్.. 
మని బెల్ మోగింది. చివరాఖరు వరసలో కూర్చొని, సీరియస్ గా ఎగ్జాం రాసేస్తూ [ఏ, బీ,సీ,డీ లు బరికేస్తూ]  నా 
వైపు చూసి ట్రేడ్ మార్క్ స్మైలిస్తా ఉన్నాడు అప్పిగాడు.
నెత్తికి రాసుకోవాల్సిన జండూబామ్ నాలిక్కి రాసుకున్న ఫీలింగ్ నాకు.
ఆ మర్నాడు..ఈనాడు పేపర్ జిల్లా ఎడిషన్ లో ఎర్రని అక్షరాల్లో...
బస్ కండక్టర్ తో కాలేజ్ విద్యార్ధుల వాగ్వివాదం – మందలించి పంపేసిన పోలీస్ లు
****************************************************************************
ఇక్కడ చెప్పిన ఆగడాలు కొన్నే.. అన్నీ చెప్పాలంటే ఎన్ని పోస్టులు రాయాలో? ఎందుకంటే నిక్కర్లేసుకు తిరిగిన 
రోజుల నుండీ, నిన్నా మొన్నటి వరకూ అప్పల్రాజు నా వెంటే ఉన్నాడు నీడ గా, తోడుగా. చిన్నప్పటి నుండీ నేను
 పొద్దున్నే మొదట హాయ్ చెప్పేదీ, రాత్రి చివరిగా బై చెప్పేదీ వాడికే.  ఒకటా రెండా? 16 సం॥ ల స్నేహం మాది.
 ఒక్కటి మాత్రం నిజం. వాడు లేక పోతే నా జీవితం కారం లేని కూర లాగా చప్పగా ఉండేది. ఎవడయినా గానీ, అది
 ఎవరయినా గానీ తన జోలికొస్తే కాలర్ పట్టుకునే అప్పిగాడు, నేనెన్ని మాటలన్నా, తిట్టినా, జోకులేసినా
"నా చైల్డ్ హుడ్ ఫ్రెండు రా వాడూ..వాడు కాకపోతే ఇంకెవరంటారు నన్నూ?" అని నవ్వేసే అప్పల్రాజు ఈ రోజు బెమ్మీ
 జీవితానికి బై బై చెప్పేసీ కుటుంబరావు ఐపోతున్నాడు.

ప్చ్.. వాడి పెళ్ళి కళ్ళారా చూసేలా రాసి పెట్టి లేదు. ;(

తనెల్లప్పుడూ నవ్వుతూ, సుఖ సంతోషాలతో ఉండాలనీ, తన వైవాహిక జీవితం ట్రాఫిక్ లేని హైవే రోడ్
మీద వాల్వో బస్ ప్రయాణం లాగా సాఫీగా సాగిపోవాలనీ కోరుకుంటూ,

అప్పలరాజు కి వివాహ మహోత్సవ శుభాకాంక్షలతో...

రాజ్ కుమార్.

46 comments:

SHANKAR.S said...

మీ అప్పిగాడి పెళ్లి జరుగుతోందన్న ఆనంద కన్నీళ్ళలో అనుకుంటా ఈ పోస్ట్ లో పంచులు చించేశావు. ఒక దాన్ని మించి ఒకటి.

పాపం మీ ఎర్రబాబు పరిస్థితి సోనియా గాంధీని తొక్కేసి పైకొచ్చేయాలనుకున్న జగన్ బాబులా అయిపోయిందన్న మాట.

సింహం లాంటి మీ అప్పిగాడు పిల్లిలా మారబోతున్న ఈ శుభతరుణంలో నా తరపున కూడా తనకి శుభాకాంక్షలు. ఇక నుంచీ నువ్వు ఒక కొత్త అప్పల్రాజుని చూస్తావని గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే ఇక నుంచి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఏదీ మీవాడి చేతిలో ఉండవు కనుక. :)))

sarma said...

very good narration. quite interesting.

రసజ్ఞ said...

హహహ! కేవ్వవ్వ్వ్వ్ బాబోయ్ సూపరు అసలు! కానీ అప్పిగాణ్ణి వదిలేసి వెళ్ళడానికిమనసొప్పలేదు ఎంత నిస్వార్థపరులండీ మీరు;) టపా అంతా చాలా బాగుంది! మీరు చెప్పే విధానం బాగుంటుంది. మాని పోతున్న పుండు మీద పిన్నీసెట్టి కెలికావ్ బాబోయ్ అసలెలా వస్తాయి మీకీ ఆలోచనలు???? ఇంతకాలం పరోక్షంగా (మీ వ్రాతల ద్వారా) నవ్వించిన అప్పలరాజు గారికి హృదయపూర్వక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు! ఇలానే ఆనందంగా, చక్కగా వారి వైవాహిక జీవితం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Anonymous said...

awesome post...
**నిక్కర్లేసుకు తిరిగిన రోజుల నుండీ...."నా చైల్డ్ హుడ్ ఫ్రెండు రా వాడూ..వాడు కాకపోతే ఇంకెవరంటారు నన్నూ?"

నాలుగు వాక్యాల్లో మీ స్నేహం గురించి చెప్పకనే చెప్పారు.
Wish him all the best.

బులుసు సుబ్రహ్మణ్యం said...

అమ్మో మీ కాలేజీ కి ఇంత కధ ఉందా?

>>> "చిన్నికృష్ణ కి పద్మశ్రీ ఇచ్చినంత పాపం"...

ఇది హై లైట్. టపా సూపర్.

మీ అప్పల్రాజు గారికి శుభాకాంక్షలు చెప్పండి మా తరఫున.

SHANKAR.S said...

అవునూ ఇంతకీ ఈ "*(&$%(# ఇంజినీరింగ్ కాలేజ్" కాలేజ్ ఎక్కడుంది? నెట్లో ఈ పేరుతొ ఎంత వెతికినా దొరకలేదు :)))

రాజ్ కుమార్ said...

శంకర్ గారూ.. బోలెడన్ని థాంకులు, నా తరుపునా అప్పు తరుపునా ;)

మరే..ఎర్రబాబు అలా బుక్కయ్యిపోయాడు.! చూద్దామండీ మనోడు పులిగా వెలుగుతాడో, పిల్లై మూలుగుతాడో ;)
కాలేజ్ పేరు భయపడి దాయలేదండీ. సిగ్గుపడి రాయలేదు ;)

రాజ్ కుమార్ said...

శర్మ గారూ థాంక్యూ సో మచ్ ;)

రసజ్ఞ గారూ.. నిస్వార్ధం కాదండీ. మా అప్పిగాడే కదా అని స్వార్ధం ;)మీ వ్యాఖ్యలు చాలా ప్రోత్స్సాహ కరంగా ఉంటాయండీ. ధన్యవాదాలు. ;)
మీ విషెస్ మా వాడికి అందజేస్తాను.

@Sree thank you very much. i'll convery ur wishes ;)

రాజ్ కుమార్ said...

బులుసుగారండీ.. కాలేజీ కి కధ ఉందీ. కాలేజ్ లోనూ చాలా కధలున్నాయ్. ;) ;)
ధన్యవాదాలండీ. తప్పకుండా చెప్తాను.

www.apuroopam.blogspot.com said...

బాగుందండీ- చాలా బాగుంది.హ్యూమరసం చిప్పిలింది.మరిన్ని విషయాలు వినాలనుంది.

ఆ.సౌమ్య said...

మీ అప్పిగాడు నాకు తెగ నచ్చేసాడు...అందరికీ ఎంత హాస్యాన్ని పంచుతున్నాడు! మొత్తనికి అప్పారావు భలే కేండిడేట్. లాస్ట్ పోస్ట్లోనూ, ఈ పొస్ట్ లోనూ పంచులు కేక...ఇది అని ప్రత్యేకంగా చెప్పలేను...వేటికవే సాటి. ఇప్పటినుండీ నిన్ను పంచుల రాజ్ అని పిలవాలేమో!

మీ అప్పారావు మాయ కి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు! రాబోయే రోజుల్లో వాళ్ళావిడ ఇంకెన్ని చెబుతుందో!

ఆ.సౌమ్య said...

నా పై కామెంటులో అప్పారావు అని అప్పుతచ్చు పడినది...అదే మీ అప్పల్రాజు మాయ కి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు! :)

Sravya V said...

బాబోయ్ రాజ్ ఐతే నిజం గానే పోలీస్ స్టేషన్ కి వెళ్లి బుక్కయ్యరా ? పోస్ట్ సూపర్బ్ , తొందర గా మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ కూడా రాయండి :)))
మీ ఫ్రెండ్ కి శుభాకాంక్షలు !

చిలమకూరు విజయమోహన్ said...

:) అప్పలరాజు గారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు!

వేణూశ్రీకాంత్ said...

మీ అప్పల్రాజు కి వివాహమహోత్సవ శుభాకాంక్షలు రాజ్. శంకర్ గారు చెప్పినట్లు ఈ టపాలో పంచ్ లు మరీ కుమ్మేశావ్.. ప్రతి లైను ఆహా ఓహో అనుకునేట్లు ఉంది. సూపరంతే...

శ్రీనివాస్ పప్పు said...

నీ చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అప్పి కి పెళ్ళి శుభాకాంక్షలు.పోస్ట్ యధావిధిగా రచ్చ రచ్చ అంతే.

రాజ్ కుమార్ said...

పంతుల గోపాల కృష్ణ గారూ ధన్యవాదాలండీ..
మీ బ్లాగ్ చూశానండీ చాలా బాగుమ్ది.;)

అ.సౌమ్యగారూ..ధన్యవాదాలు..అంత లో కొంత మీ చలవే కదా ;) మా అప్పల్రాజు ని అప్పారావు అంటారా? సరిచేశారు కాబట్టీ వదిలేస్తున్నా ఆ.... ;)

రాజ్ కుమార్ said...

శ్రావ్య గారూ.. మరేమనుకున్నారూ? హిహిహి
ఇంట్లోవాళ్ళు పెద్దేం అనలేదు లెండీ..;) ఎస్సై నా మాట వినడానికి కారణం వేరే ఉమ్దీ. అదే కారణం చెప్పారు మా పితృదేవులు..;) థాంక్యూ..

విజయ్ మోహన్ గారూ.. థాంక్యూ అండీ మీ విషెస్ తెలియజేస్తాను.

రాజ్ కుమార్ said...

వేణూజీ థాంక్యూ..థాంక్యూ...క్రెడిట్ గోస్ టూ అప్పు ఓన్లీ ;)

పప్పుసారూ.. ధన్యవాదాలండీ.. నా తరుపునా, మా ఫ్రెండ్ తరుపునా ;)

గిరీష్ said...

:))... కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు సినెమా లాగనే సీరియస్సుగ జరిగినవన్నీ ఇప్పుడు తలచుకుంటే నవ్వుకునేంత మంచి జ్ఞాపకాలు. Excellent Narration అబ్బాయ్.. నిజమే అలాంటోడు జీవితంలో లేకపోతే మనలోని ఇంకో కోణం చూడలేము..

"నా చైల్డ్ హుడ్ ఫ్రెండు రా వాడూ..వాడు కాకపోతే ఇంకెవరంటారు నన్నూ?" - top line of the story.

Happy Married Life to your friend.. and u r lucky to have such a friend.

ఫోటాన్ said...

రాజ్.. నువ్వు మాములోడివి కాదబ్బాయ్... పంచ్ల రాజ్ వి... :)))

ముందు చెప్పినట్టుగానే... ఈ పోస్ట్ కూడా కెవ్వ్... :))

అప్పు గారికి శుభాకాంక్షలు..

హరే కృష్ణ said...

Awesome Raj!

Happy married Life to your best buddy :)

Zilebi said...

రాజ్కుమార్ గారు,

మరో మారు 'చీర్' కొట్టి చెబుత
తారాజువ్వ లాంటి అప్పలరాజు మీకు
'తారుమారు' ఫ్రెండు అవడం మీ
పూర్వ జన్మ సుకృతం !!

చీర్స్
జిలేబి.

Raviteja said...

మిమ్మల్నొదిలేస్తే” బాలయ్య బాబు సినిమాని పోసాని కృష్ణమురళి డైరెక్ట్ చేసినంత ప్రమాదం”,
"చిన్నికృష్ణ కి పద్మశ్రీ ఇచ్చినంత పాపం" Sopaerrruu post. Happy Married Life to your friend Appalaraju :)

PALERU said...

Hey Raj,

I hate you....ante..naakante baaga raastunnav...i hate you :):)

రాజ్ కుమార్ said...

గిరీషూ.. యెస్.. ఇప్పటికీ నవ్వొస్తుంది. ఇవన్నీ తలచుకుంటే. ఎప్పటికీ కొత్తగానే ఉంటాయ్. ఈ ఇన్సిడెంట్ మాత్రం అస్సల్ మరిచిపోలేను.
థాంక్యూ.. ;)


ఫోటాన్.. థాంక్యూ.. క్రెడిట్ గోస్ టూ రాజు ;)
అప్పల్రాజు తరుపున ధన్యవాదాలు ;)

రాజ్ కుమార్ said...

హరే.. థాంక్యూ సోమచ్.

జిలేబీ గారూ.. అవునండీ.. నేనూ అదే మాట బల్ల గుద్ది చెప్తా.. ;) ధన్యవాదాలు

చీర్స్
రాజ్ కుమార్

రాజ్ కుమార్ said...

రవితేజ గారూ చాల చాలా థాంక్స్ అండీ..

@raf raafsun.. ఏదో మీ అభిమానం.. థాంక్యూ అండీ

మనసు పలికే said...

అసలు నీ ప్రొఫైల్ పిక్‌కీ, నువ్వు రాసే టపాలకీ సంబంధం ఏమన్నా ఉందా అంట?? నోట్లో వేలెట్టినా కొరకలేని అమాయకత్వపు ఫోటో ఒకటి పెట్టి ఇలా మమ్మల్ని కడుపు నొప్పొచ్చేలా నవ్వించడం దారుణం:))))
నిజంగా ఆ సంఘటన జరిగినప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలీదు కానీ, నీ రాతల్లో చూస్తుంటే మాత్రం ఒక మంచి ఆరోగ్యకరమైన కామెడీ సినిమా చూస్తున్నట్టుగా ఉంది:) నీ ట్రేడ్ మార్కు పంచులతో టపాని పండించేశావ్..

ఆగాగు, ఇంకా వ్యాఖ్య పూర్తవ్వలేదు:) అసలు ఇంతటి నవ్వులకి కారణమైన అప్పిగాడికి, ఆయన అర్థాంగికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు చెప్పకపోతే ఎలా? నా తరపున కూడా శుభాకాంక్షలు అందించు:):)

మధురవాణి said...

హమ్మయ్యా.. మొత్తానికి పోలీసు స్టేషనులో కథ సుఖాంతమయ్యిందన్నమాట.. బాగున్నాయి.. మీ స్నేహితులిద్దరూ పంచిన నవ్వులు.. :))
మీ అప్పిగాడు గారి దంపతులకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. :)

Chandu S said...

అబ్బాయ్ రాజ్ కుమార్, అప్పారావు పేరు చెప్పి మూడు పోస్టులు రాసి, ఓ నూట యాభై కామెంట్లు( సుమారుగా అనుకో) తెచ్చుకున్నావు. ఇంతకూ పెళ్ళికెందు కెళ్ళలేదూ? కారణం చెప్పగలిగేదయితే చెప్పు.

అప్పారావుకి శుభాకాంక్షలు అందజేయి.

రాజ్ కుమార్ said...

@మనసుపలికే గారూ.. అదేంటండీ? అది నా కుఠోనే చిన్నప్పటిది. సంబంధం లేకపోవటం ఏమిటీ?
హ్మ్మ్.. ఆ సంఘటన ని మరిచిపోలేను. పంచ్ లు అవీ మనకి తెలీవుగానీ, ఆ టైం లో, సిచ్చువెషన్ డిమాండ్ చెయ్యటం వల్ల పుట్టిన ఫీలింగ్స్ అంతే..;)

ధన్యవాదాలు ;)

రాజ్ కుమార్ said...

మధురవాణిగారూ... అవునండీ పోలీస్ స్టేషన్ లో మా
సుఖం అంతమయ్యింది. కూసింతలో తప్పించుకున్నాం గానీ మేము కూడా అంతమయ్యుండేవాళ్ళం. ;)

నా తరుపునా, అప్పల్రాజు తరుపునా ధన్యవాదాలు మీకు ;)

రాజ్ కుమార్ said...

మధురవాణిగారూ... అవునండీ పోలీస్ స్టేషన్ లో మా
సుఖం అంతమయ్యింది. కూసింతలో తప్పించుకున్నాం గానీ మేము కూడా అంతమయ్యుండేవాళ్ళం. ;)

నా తరుపునా, అప్పల్రాజు తరుపునా ధన్యవాదాలు మీకు ;)

రాజ్ కుమార్ said...

శైలజ గారూ.. మరే.. అయినా అప్పల్రాజు లేకుండా ఉన్న నా మెమొరీస్ చాలా తక్కువండీ. హైస్కూల్ కి వచ్చినప్పటి నుండీ జాబ్స్ వచ్చేంట వరకూ కలిసే ఉన్నాం ;)
నా తరుపునా, అప్పిగాడి తరుపునా ధన్యవాదాలు మీకు.

శేఖర్ (Sekhar) said...

కడుపుబ్బా నవ్వించేసావ్ రాజ్...మీ అప్పలరాజు కి happy married life.. :-)

రాజ్ కుమార్ said...

థాంక్యూ శేఖరూ ;)

Found In Folsom said...

Potta chekkalayyela navvinchaaru....indaka maa vaadu reading practice....paiki navvithe, endukamma navvutunnav ani choppadande prasnalu vesi visigistadani sag am lo aapesaa....padukune mundu chadavakunda ela...:) hilarious to the core...hayiga padukovachu....chakkaga navvukuni...btw, mee Peru laage mee blog ni kooda oka 20 diff combinations tho try chesi final ga follow list lo add chesukunna easy access kosam....:)

మహమ్మద్ షఫి said...

కేకో...కేక......ఇంచ ఇంచ కి ఏం పంచులిచావ్ బాస్.... మీ పోస్ట్ చదువుతుంటే ఖదీర్ బాబు రాసిన ''పోలేరమ్మబండకతలు'' గుర్తుకు వచ్చాయంటే నమ్ము....

మహమ్మద్ షఫి said...

కేకో...కేక......ఇంచ ఇంచ కి ఏం పంచులిచావ్ బాస్.... మీ పోస్ట్ చదువుతుంటే ఖదీర్ బాబు రాసిన ''పోలేరమ్మబండకతలు'' గుర్తుకు వచ్చాయంటే నమ్ము....

రాజ్ కుమార్ said...

షఫీ గారూ.. వామ్మో.. చాలా పెద్ద కాంప్లిమెంట్ అండీ.. ధన్యవాదాలు ః)

రాజ్ కుమార్ said...

@Found In Folsom
thank you so much.. sorry for my late reply madam ;))))))

sriharichowdarychava said...

కాలేజ్ పేరు భయపడి దాయలేదండీ. సిగ్గుపడి రాయలేదు ;)

no said...

rajkumar garu, namastae. mee blog articles chaalaa baagunnaayi. eppudayina maa sunday andhrajyothi magazine lo punar - mudranaki anumathi ivvagalara pl. - Gorusu, sub editor

రాజ్ కుమార్ said...

no గారూ.. నమస్తే.. ముద్రించే ముందు అడిగినందుకు ధన్యవాదాలు. క్రెడిట్స్ నాకూ,బ్లాగ్ కీ ఇచ్చి వేసుకోగలరు ః)

no said...

sir, namastae. mee article 16.8.15 sunday andrajyothi book lo vasthondi.