ఇదిగో టైటిల్ చూసి ఇదేదో సినిమా రివ్యూ అనుకునేరు.. కాదు కాదు.. ఆనందాన్ని పంచుకుంటే పెరుగుతుందంట, దుఃఖాన్ని పంచుకుంటే తరుగుతుందంటా..
చేసిన పాపం చెప్తే పూర్తిగా పోతుందంటా..ఏదో నా పాపాన్ని కడుక్కునే ప్రయత్నమన్న మాట.
రోజూ లేచే టైం కన్నా లేటగా లేవటం తో హడావిడిగా రెడీ అయ్యి, కబోర్డ్ లో ఉన్న అరడజన్ డియో స్ప్రే లలో ఒక స్ప్రే కంగారులో కాన్ఫిడెంట్ గా తీసి ఒళ్ళంతా
పస్స్స్స్స్స్స్స్..పస్స్స్స్స్స్ మని కొట్టాను. కొట్టిన స్ప్రే ఏదో తెలీదు గానీ వాసన మాత్రం చాలా ఘాటుగా వచ్చింది. కబోర్డ్ లో
డియో స్ప్రే లతో పాటూ రూమ్ ఫ్రెషనర్, నలుపు హిట్ కూడా కలిపున్నాయ్.
హ్మ్మ్... సర్లే.. మన వొంటి గంధం తో పోలిస్తే ఈ దుర్గంధం కూడా మంచి గంధమే అని సరిపెట్టుకొన్నాను.
"ఈరోజు ఈ పరిణామం దేనికి సూచన చెప్మా??" అని సందేహం మాత్రం కొడతానే ఉంది.
రచ్చ సినిమా చూశాక, మన తేజ గారి ఇంటర్వ్యూ లో రొటీన్ తెలుగు సినిమా కధల మీద ఇచ్చిన పంచ్ లు నచ్చీ, గుర్తొచ్చీ, నిజం,జై, ఒక విచిత్రం,కేక లాంటి సినిమాలు చూసి కూడా,
ఒక బలహీన క్షణంలో "నీకూ నాకూ డాష్ డాష్" అనే వీర వెరయిటీ సినిమా చూడ్డానికి పూనుకున్నాను.
ఇక్కడ ఒక లుక్కేసి రండీ.. చెప్తాను.
మా ఇన్నోవేటివ్ మల్టీప్లెక్స్ లో "బాబూ... డాష్ డాష్ సినిమాకి మూడు ఇవ్వు" అన్నాను లో వాయిస్ లో కొంచెం సిగ్గు పడుతూ.
"రచ్చ సినిమానే కదా?" అన్నాడాడు. ఓర్నాయనోయ్ వీడు కొంప ముంచేలా ఉన్నాడనుకోని
"నీకూ నాకూ డ్యాష్ డ్యాష్" అన్నాను పూర్తిగా సిగ్గొదిలేసి,కొంచెం కోపం తెచ్చుకొని.
రివ్యూలు రాయడానికి భయపడే సినిమాలు కూడా వస్తాయనీ, అవి నేను చూస్తాననీ,చూసి తట్టుకుంటాననీ అనుకోలేదేనాడూ. పంచాంగం లో ఈ సంవత్సరం నాకు బాలేదంటే తొక్కలే అనుకున్నా...
శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్ఞ గారూ.. సారీ అండీ.
ఇహ ఈ సినిమా గురించి చెప్పాలీ అంటే డైరెట్రు తేజా చెప్పినట్టూ ఇది లిక్కర్ మాఫియా నేపధ్యం లో భావోద్వేగాలతో పాకే పూర్తిస్థాయి వెరయిటీ ప్రేమకధా చిత్రం.
ఇంతకన్నా స్టోరీ చెప్తే బాగోదు కాబట్టీ చెప్పను. చాలా కొత్త కధండీ నిజంగానే.. "కేక సినిమా మీద ఒట్టు ఒక విచిత్రం సినిమా హిట్ట్లు అయినంత ఒట్టు.
వెరయిటీలు ఏంటీ??
1. మామూలు రొటీన్ సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ అయ్యాక పాట వస్తుంది కదా.. ఈ సినిమా లో పాట లో హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. (టైటిల్స్ అవ్వగానే పుసుక్కున పాట మొదలైపోయింది )
సాధారణం గా గ్రూప్ డ్యాన్స్ లో డ్యాన్సర్లని వదిలేసి హీరోని మాత్రమే చూస్తాం. కానీ ఇందులో హీరో ఎక్కడున్నాడొ ఎతుక్కుంటాం. హీరో ఎవరా?? అని ఉత్కంఠత తో ఎదురుచూస్తాం.
2.రొటీన్ సినిమా లో హీరోయిన్ (హీరో పెళ్ళాం) ఎక్స్పోజింగ్ చేస్తాది. ఇందులో విలని (విలన్ పెళ్ళాం) ఎక్స్పోజింగ్ చేస్తాది.
౩. రొటీన్ సినిమాల్లాగా బూతులు సెన్సార్ కట్ చెయ్యాల్సిన అవసరం రాలేదు. ఆల్రెడీ డ్యాష్ లు పెట్టేసి సెన్సారోళ్ళకి శ్రమ తగ్గించారు. అయినా గానీ పాపం A సెర్టిఫికేట్ ఇచ్చారు.. ;(((((((((
4. రొటీన్ గా ఇటెం గర్ల్ తో నాటు సాంగ్ లేదు. కానీ చిత్రం సినిమా టైప్ లో కేక లాంటి సాంగున్నాది.
5.జయం సినిమా లో తాడు కట్టుకొని హీరో, ఫ్రెండ్స్ సహాయం తో దిగుతాడు. కానీ ఇందులో హీరోయిన్ తాడు సెటప్ యూజ్ చేసుకుంటాది.
6.రెగ్యులర్ సినిమా లో హీరోలు అడ్వాంటేజ్ తీసుకొని సరసాలాడేస్తుంటారు హీరోయిన్లతో. ఇందులో హీరోయిన్ నా నోటితో చెప్పలేని చిత్రీ పనులన్నీ చేస్తాది.(వెరయిటీ.. వెరయిటీ)
హీరోః ప్రిన్స్ అంటా.. కొత్తబ్బాయ్. ధ్వజ స్థంభానికి చొక్కా, పేంట్ తొడిగినట్టూ పొడుగ్గా ఉన్నాడు. తేజా సినిమా లో హీరో లాగే ఉన్నాడు.
చాలా చాలా మంచి క్యారెక్టర్. (అంటే ఆ క్యారెక్టర్ చాలా మంచిదని అర్ధం.. అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని అపార్ధం చేసుకోకండీ)
హీరోయిన్ః ఎప్పటిలాగే తేజా బాగా కాన్సన్ట్రేట్ చేశాడు హీరోయిన్ మీద. చక్కని కళ్ళు, పొడుగైన రెండు జడలూ బాగుంది. బాగా చేసింది. కాకపోతే నానా చండాలం చేయించాడు, నానా దరిద్ద్రాలూ వాగించాడు ఈ పిల్ల చేత పాపం ;(((((( అదే బాధేసింది నాకు. పేరు నందిత అట.
మెచ్చుకోవల్సిందేమంటే అందరూ తెలుగోళ్ళే అని విన్నాను. గుడ్డో గుడ్డు.
గుడ్డంటే గుర్తొచ్చింది ఈ సినిమాలో సుమన్ శెట్టి ని చూసి "లవ్ స్టోరీ కాదూ హారర్ సినిమానా?" అనుకున్నా మొదట్లో ఓ పది నిమిషాలు. కాకుంటే తర్వాత తర్వాత అలవాటై పోయీ సుమన్ శెట్టి కామెడీ కి కూడా నవ్వేశాను.
ఏమండీ.. వీపు మీద వాత పెట్టించుకున్నాక దాని మీద కారం రాస్తే మాత్రం తెలుస్తాదా? గియ్యగా గియ్యగా గెడ్డం గరుగ్గా అవుతాదని వినలేదా ఎప్పుడూ?? ఇది కూడా అంతే [బాబోయ్...ఏమయ్యిందీ రోజు నాకు??]
విలన్స్ః బోల్డుమంది విలన్లండీ... మెయిన్ విలన్ మాత్రం అరగుండు తో, కోరమీసాల్తో భలే కామెడీ గా ఉంటాడు. కానీ విలన్ వాళ్ళావిడ ఇంకా పెద్ద విలన్. కత్తి లా ఉంటాదీ కత్తట్టుకొని తిరుగుతాది. నిజం సినిమాలో రాశి కన్నా పవర్ఫుల్ అన్నమాట.
మాటలుః అబ్బబ్బా.. తేజా పెన్ తో రాశాడో కత్తి తో రాశాడో గానీ కేకలు పెట్టించాడు. (చావు కేకలా?? అని అడిగితే నేనేం చెప్పలేను)
ద్వ్యంద్య్వార్ధాలతో సినిమాలు తీయటం చేతకాదనీ తేజా వారు సెలవిచ్చారు. సో అన్నీ సింగులు మీనింగులే అన్నమాట.
హీరోయిన్ హీరో తోః
"ఏరా డాష్ గా.. ఇలా రారా.. నేను నిన్ను డ్యాష్ చేస్తున్నాను. నువ్ నన్ను డ్యాష్ చేసే తీరాలి" (ప్చ్.. తప్పుగా అర్ధం చేసుకోకండీ ఇక్కడ డ్యాష్ ఆంటే లవ్ అండీ..)
"నన్ను లవ్ చేయకపోతే నీ డ్యాష్ పగిలిపోద్ది" (అదిగో మళ్ళీ... ఇక్కడ డ్యాష్ అంటే తల అని అర్ధం)
"ఏరా పొట్టి డ్యాష్ గా నా డ్యాష్ గాడేడీ??" (డ్యాష్ = లవరు)
"నేను ఇప్పుడే, ఇక్కడే నీతో డ్యాష్ చేస్తా.."
విలన్ తో : "నువ్ పోలీసోడివయ్యుండొచ్చు... కానీ నువ్ నన్ను కొట్టావని నా డ్యాష్ గాడికి తెలిసిందంటే.. నీ డ్యాష్ నీ చేతిలో పెట్టేస్తాడు" (అబ్బా... మిమ్మల్ని ఎడ్యుకేట్ చెయ్యటం నా వల్ల కాదు.)
విలన్ః "చిరిగిననోటూ, కాలిరిగిన కుర్చీ, సాక్షం లేని కేసూ చెల్లవు"
"పగ కత్తిని తీస్తుంది, ప్రేమ ప్రాణం తీస్తుంది"
లేడీ విలన్ హీరోయిన్ తోః వాంతి ఎందుకు వస్తుందే నీకు? కడుపులో ఏమీ పడకొస్తుందా? కడుపులో ఏదో పడొస్తుందా? (క్షమించాలి మిత్రులారా.. నేరం నాది కాదు)
ఇట్టాంటి కడుపులో అల్లకల్లోలం సృష్టించే పదునైన సంభాషణలు కో కొల్లలు.
కామెడీః ఏం కామెడీ ఏం కామెడీ.? సూపరో సూపరు కామెడీ. భలే కామెడీ..అబ్బ బా బ్బ... ధియేటర్ లో చూసేవాళ్ళు చాపలు పట్టుకు పోవటం బెటరు. కింద పరుచుకొని దొర్లి దొర్లి నవ్వడానికి అనువు గా ఉంటాది. గొడుగు కూడా పట్టుకెళ్ళాలి. హాస్యపు జల్లులో తడిసి ముద్దై పోతామంతే. వికటాట్టహాసాల దుమ్ము లో తుమ్ములొచ్చేస్తాయంతే.
ఫైట్లుః ఆ... రోప్స్ అవీ పెట్టి లాక్కుండా,కొంచేమ్ నేచురల్ గా ఉన్నాయ్. కాకపోతే తేజా మార్క్ టమాటా జామ్ ఫైట్లూ, హీరో హీరోయిన్లు అడవి లో దెబ్బలతో తిరగటం విలన్లు వెతుకుతా రావటం కామన్ అన్నమాట.
క్లైమాక్స్ లో హీరోయిన్నూ, లేడీ విలనూ కొట్టుకునే ఫైట్ అరాచకం అంతే... నరాలు తెగే భావోద్వేగం, గుండె పగిలే గగుర్పాటు, ఉరిమే ఉత్సాహం, పిచ్చిగా నవ్వాలనే కోరికా కలిగాయ్ నాకయితే.
ఫోటోగ్రఫీః ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు, ఇద్దరు కెమెరామెన్ లు వర్క్ చేసినట్టు. బాగుండక చస్తుందా?? రసూల్ రచ్చ చేశాడు. అదేదో గో..ప్ప కెమెరా తో ఏసియా లోనే మొదటి సారిగా ఏదో తీసారంటా..
అదే సీనో మాత్రం తెలియలేదు నాకు. తెలుసుకోవాలని కూడా లేదు. మీకు తెలిసినా నాకు చెప్పొద్దు ప్లీజ్.
ట్విస్ట్ లు ఉన్నాయా?? : బొచ్చెడున్నాయ్.. నా మోకాలు ట్విస్ట్ అయిపోతే తలుపు ఇరుకున పెట్టి సరి చేసుకున్నాను ఇందాకే.
పాటలుః
కలికాలం లో "రామా" అన్నా బూతయిపోయిందన్నట్టూ, నాకు ఏం విన్నా.. డాష్ గానే వినిపిస్తుందీ.
చివరగా చిన్న కర్ణ పరీక్షః
http://musicmazaa.com/MMaPlayer/playsongs/?id=51040&t=MusicMazaa-1334344944612
ఈ సాంగ్ పూర్తిగా విని, సినిమా లో చూసి ఎంజాయ్ చెయ్యగలిన వాళ్ల ఇంటికొచ్చి, నా తలనీలాలు సమర్పించుకొంటాను. డ్యాష్ మీద ప్రామిస్..
నా తోటి ప్రేక్షకుల అభిప్రాయాలుః
మనోజ్ గాడుః ఇదేంట్రా షాపింగ్ మాల్ సినిమా లాగా ఉందీ??(మొదటి అరగంట కి)
రెండో అరగంటకి... నా వైపు అదోరకం గా చూసేడు తప్పితే ఏం మాటాళ్ళేదు.
"రచ్చ సినిమా కి మళ్ళీ పోయినా బాగుండేదిరా" (సినిమా అయిపోయాక)
సుధాకర్ గాడుః
గ్రేటాంద్ర్హా వాడు 2.75 రేటింగిచ్చేసేడని చెప్పీ, డైరెక్ట్ గా ఆఫీస్ నుండి ధియేటర్ కి తీసుకొచ్చావ్ కదరా... @*#$#@$@#$(!__+_#)$
నేనుః
"ఇంత తట్టుకోలేని వెరయిటీ సినిమాలు రావటం వల్లే రచ్చ లాంటి రొట్ట సినిమాలు హిట్టవుతున్నయ్" అనుకుంటున్నారా? ప్చ్.. ఈ తెలుగు సినిమా ప్రేక్షకులతో ఇదే
ప్రోబ్లెం. హిట్టు సినిమాలిస్తుంటే కొత్తగా ఏమన్నా చెయ్యమటారు. కొత్తగా తీస్తే చెత్తగా ఉందంటారు. తమిళ్ సినిమాలు మాత్రం సూపరంటారు.
లాభం లేదు.. దాసరి వారితో చెప్పి ఈ సినిమాకి అవార్డ్ రప్పించాల్సిందే.
అవసరమయితే నేషనల్ అవార్డ్ కొట్టే సినిమా తీసి జనాల్ని చావగొట్టమని నేనే ఒక లేఖ రాస్తాను.ఆఅ.... రాస్తాను.
"ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో నిండిన సినిమాలూ, వెర్రెత్తించే వెరయిటీ సినిమాలూ ఎన్నెన్నో మరెన్నో తీయించేసీ, యంగ్ ఇండియా, పరమవీర చక్ర సినిమాలు రీమేక్ చేయించేసీ, తెలుగు సినిమా ఇండస్ట్రీని డాష్ డాష్ చేసేస్తాను... ఇదే నా శపధం.. "
31 comments:
:-)
So, పోష్టర్లను చూసినపుడు కలిగిన అనుమానాలు కరెక్టేనని - మీ రివ్యూ చదివితే తెలుస్తోంది. మాక్కుడా డాష్ బై డాష్ అవ్వకుండా హెచ్చరించినందుకు కృతఙ్ఞతలు...
>>>డియో స్ప్రే లతో పాటూ రూమ్ ఫ్రెషనర్, నలుపు హిట్ కూడా కలిపున్నాయ్.<<<
రోజూ డ్యాష్ (హిట్ డియో ) కొట్టుకొని ఆఫీసు కి వెళ్తున్నావా బాబు?
సినిమాని చూడమని గానీ, చూడద్దని గాని చెప్పకుండా డ్యాష్ పెట్టావ్ గా డ్యాష్.. :))
సినిమా చూసాకా బాగా కన్ఫ్యూజ్ అయినట్టు ఈ పోస్ట్ లో బాగా కనపడింది డ్యాష్... :))
పంచ్ లు కేక :))
ఇలాంటి ఒక డాష్ (సినిమా) ఉందని నాకు తెలియను కూడా తెలియదు. మీ ఈ డాష్ (పోస్ట్) వల్ల దీని ఉనికి తెలిసింది నాకు. అయినా మీరు ఇంత డాష్ గా (హాస్యంగా) రాసేస్తే ఎలా? మేము డాష్ (నవ్వు) కోవాలా వద్దా? ఇందాకా పొరపాటున మా డాష్ (కాలేజీ) లో చదివాను. ఈ టపా ఒక పెద్ద డాష్ (అద్భుతం). నేను డాషి డాషి (నవ్వి నవ్వి) బుగ్గలు డాష్ (నొప్పి) వచ్చాయి. అందరూ నా వంక డాష్ (వింత) గా చూశారు:):) వామ్మో! అసలేమన్నా వ్రాశారా? మీరు రివ్యూల ఎక్స్పెర్టు అయిపోతున్నారుగా ;) నాకు నచ్చిన లైన్స్ కాపీ చెయ్యాలంటే మొత్తం పోస్ట్ అంతా కాపీ చెయ్యాలి!
ఇలాంటి ఒక డాష్ (సినిమా) ఉందని నాకు తెలియను కూడా తెలియదు. మీ ఈ డాష్ (పోస్ట్) వల్ల దీని ఉనికి తెలిసింది నాకు. అయినా మీరు ఇంత డాష్ గా (హాస్యంగా) రాసేస్తే ఎలా? మేము డాష్ (నవ్వు) కోవాలా వద్దా? ఇందాకా పొరపాటున మా డాష్ (కాలేజీ) లో చదివాను. ఈ టపా ఒక పెద్ద డాష్ (అద్భుతం). నేను డాషి డాషి (నవ్వి నవ్వి) బుగ్గలు డాష్ (నొప్పి) వచ్చాయి. అందరూ నా వంక డాష్ (వింత) గా చూశారు:):) వామ్మో! అసలేమన్నా వ్రాశారా? మీరు రివ్యూల ఎక్స్పెర్టు అయిపోతున్నారుగా ;) నాకు నచ్చిన లైన్స్ కాపీ చెయ్యాలంటే మొత్తం పోస్ట్ అంతా కాపీ చెయ్యాలి!
రాజ్ కుమార్ గారూ ఈ సినిమా విషయంలో మీ ప్రాణాలడ్డేసి మా ప్రాణాలు కాపాడినందుకు మీకు డాష్..డాష్...డాష్..
డాష్ రివ్యూ బాగుంది డాష్ డాష్ రాజ్ ;)
పైన డాష్ డాష్ లో అంత మంచే అన్నాను అని అనుకోని డాష్ డాష్ లో చదువ్ రాజ్ బాబు
సూపర్ రివ్యూ! మీ డాష్ అదిరిపోయింది(అపార్థం చేసుకోమాకండి... ఇక్కడ డాష్ అంటే రివ్యూ అని). మీ మార్క్ డాష్ డైలాగుల గురించి చెప్పాలా!(పంచ్ అని.. ప్చ్) ఇలాంటి డాష్ సినిమా తీసి అలాంటి డాష్ టైటిల్ పెట్టిన తేజబాబుకి డాష్ డాష్ చేస్తే గానీ తెలుగు సినిమాలు బాగుపడవు. (ఇవి మాత్రం మీరే పూరించుకోండి.) ;))))))
NT లో వదిలిన వ్యాఖ్య:
:) ))) భలే రాసారండీ!
నేను పైన్నుంచి చదువుకుంటూ వచ్చి రాజ్‌కుమార్ రాసినట్లు ఉంది… మరి నవతరంగంలో చదువుతున్నానేంటీ? అనుకుంటూ చదివా. ఎప్పట్లాగే, ఇలాంటి సినిమాలకి మీ రివ్యూలు మాత్రం కేకలు పుట్టిస్తాయండీ. ముఖ్యంగా మీరిచ్చిన ఆ తేజా ఇంటర్వ్యూ చదివాక ఇదంతా చదివి…ఆ పాట విని (సగానికి మించి విన్లేకపోయా) చెవుల తుప్పు వదిలించుకుంటే బూతూ-గీతూ లేని క్లీన్ సినిమా అంటే ఏమిటో బాగా అర్థమవుతుంది.
ఇలా కోరుకోవడం కాస్త సాడిస్టిక్ కానీ …. మీరు ఇలాంటి రివ్యూలు మరిన్ని రాయాలని… అహ..అలా చూడకండి మరీ!!!
NT లో వదిలిన వ్యాఖ్య:
:) ))) భలే రాసారండీ!
నేను పైన్నుంచి చదువుకుంటూ వచ్చి రాజ్‌కుమార్ రాసినట్లు ఉంది… మరి నవతరంగంలో చదువుతున్నానేంటీ? అనుకుంటూ చదివా. ఎప్పట్లాగే, ఇలాంటి సినిమాలకి మీ రివ్యూలు మాత్రం కేకలు పుట్టిస్తాయండీ. ముఖ్యంగా మీరిచ్చిన ఆ తేజా ఇంటర్వ్యూ చదివాక ఇదంతా చదివి…ఆ పాట విని (సగానికి మించి విన్లేకపోయా) చెవుల తుప్పు వదిలించుకుంటే బూతూ-గీతూ లేని క్లీన్ సినిమా అంటే ఏమిటో బాగా అర్థమవుతుంది.
ఇలా కోరుకోవడం కాస్త సాడిస్టిక్ కానీ …. మీరు ఇలాంటి రివ్యూలు మరిన్ని రాయాలని… అహ..అలా చూడకండి మరీ!!!
నేను కూడా శ్రీ బుట్టే డాష్ డాష్ కి డాష్ చెప్తున్న.
మీరు డాష్ పడే సినిమాలు మరిన్ని రావాలని నేను దేవుడిని డాష్ డాష్. మీ డాష్ లు చదివి మేము డాష్ డాష్ పండించాలి కదా మరి.
మిమ్మల్ని పొగడాలన్నా మాకు పదాలు దొరకవు.
___ ____ :)
___ ____ :)
:)) మీరు ఈ డాష్ సినిమా ని చూసి మాకు మార్గ నిర్దేశనం చేసినందుకు మీకు మనః పూర్వక డాష్ డాష్!
కర్ణ పరీక్ష కి మాత్రం సిద్ధం గా లేను.. ఏమనుకోవద్దు బ్రదర్!
నేను మరీ అంత ప్రేక్షక డాష్ ని కాదుకాబట్టి ఈ డాష్ డాష్ తో డాష్ చేయించుకోకుండా తప్పించుకున్నా :-))) నీ రివ్యూమాత్రం పొలికేక అంతే :-))
వావ్, రాజ్‌కుమార్ గారు మీ మహాసామ్రాజ్యం నిండిపోయి, బ్రహ్మాండం బద్దల్స్ అన్ని డాష్ లండి. చాలా థాంక్సులు కూడా:)
aa movie yemo kani mi post super ga undhi...entha manchi post rastaru ante alanti movie lu ravali ani meeru chudali ani aa devudu ni vedukuntanu..
తెలుగు భావాలు గారూ పోస్టర్లు చూసినప్పుడూ, టైటిల్ తెలుసుకున్నప్పుడూ కలిగిన భావాలు కరస్ట్.. ;) ధన్యవాదాలు..
ఫోటానూ..రోజూ కాదయ్యా.. ఒక్కో సారి అలా అయిపోద్ది.. సినిమా చూడొద్దనీ, చూడమనీ చెప్పాలా?? చూస్తానంటే చూడు బాబూ నీ కర్మ ;) థాంకులు
రసజ్ఞ గారూ.. మీరేదో దూరదేశాలు పారిపోయి బతికిపోయారండీ.. మేమిలా డాషై పోయాం.. ఒక్కటి మాత్రం నిజమండీ.. మీ కమెంట్ కోసం ఎదురుచూడటం అలవాటయిపోయింది నాకు. నా బ్లాగ్ లో దెబ్బతిన్న పులులు చూశారా??
నెనర్లు ;)
జ్యోతిర్మయి గారూ.. నా ప్రాణాలు కాదండీ మోకాలడ్డేసి కాపాడాను ధన్యవాదాలు.
శేఖరూ.. నీ మంచి డాష్ లకి నా డాష్ లు. థాంక్యూ
చాణక్యా నా బ్లాగ్ లో ఇన్ని డాష్ లు ఉంటాయని తెలిస్తే
ఈ రివ్యూ రాయకపోయి ఉండేవాడినేమో?? హహహహహ్
థాంక్యూ చాణు.
సౌమ్య గారూ...హిహిహిహి ఫేస్బుక్ లో తెలుగు సినిమా పిచ్చోళ్ళూ గ్రూప్ లో లో పెడితే కత్తి మహేష్ కుమార్ గారు నవతరంగమ్ లో పబ్లిష్ చేసీ పుణ్యం కట్టుకున్నారు. ;)
అవునండీ ఆ పాట వీడియో చూస్తే మీ జీవితం ధ్న్యం అయిపోతుంది.
అందరూ కోరుకునేది ఇదే లెండీ. మంచి సినిమాల రివ్యూ రాసి చాలా కాలం అయ్యింది.
ధన్యవాదాలు
కృష్ణప్రియ గారూ " మనః పూర్వక డాష్ డాష్!" ఆహఓ.. ఏం ప్రయోగించారండీ?;) ;)
కర్ణపరీక్ష సంగతి పుణ్యమా అని నాకు ఇంకో అక్క దొరికారన్నమాట.
థాంకులు ;)
వేణూజీ నేను అయితే మీరయినట్టు కాదా?? అని అడుగుతున్నా.. ;) హిహిహి థాంక్యూ..
జయగారూ మా సామ్రజ్యం ఎక్కడుందండీ? పేద రాజు ని ;). థాంక్యూ..
Experience గారూ థాంక్యూ అండీ
అసలు మాములుగా నవ్వలేదు రాజ్ ఈ పోస్ట్ చదివి.. Extremely hilarious! :)))))))))
ఏమిటి బాబు...తల నీలాలా?మొన్ననే కదా తిరుపతి లో ఇచ్చావు...పెళ్లి రోజుకి ఇక వద్దా?అయినా నీ పుణ్యమా అని ఇలాంటి సినిమాల నుండి కాపాడ బడుతున్నాము...నీ బ్లాగ్ పుట్టినరోజుకి శుభాకాంక్షలు
మధురవాణి గారూ.. ధన్యవాదాలండీ ;)
శశిగారూ.. ఆ పాట విన్నారా? వీడియో కూడా చూశాక తలనీలాలు ఇచ్చేయొచ్చు తప్పు లేదు.. ;)
ధన్యవాదాలు..
Congrats అండి! milestone event అనుకోవచ్చండి..
రివ్యూలు రాయడంలో నువ్వు మహా గొప్ప డాష్. పోస్ట్ డాషోఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ....డాషు :)
ఇప్పుడే సినిమాని డాష్ (download) చేశా.. చూసి చెప్తా.. :)
రాజ్ గారు, ఈ సినిమాలో హీరోయిన్ ఎన్నిసార్లు డాష్...డాష్ అంటుందో లెక్క తేలాలి..:))
సూపర్ రీవ్యు.........నా కోరికేంటంటే ఈ రీవ్యుని తేజా చదవాలని...అప్పటికైనా సినిమాలు తీయడం మానాలని.....పగటి కలలు కంటున్నాను అంటారా....ఏదో ఒకటి నిజమైతే ఎంత బాగుండు....:))
ఓహ్ ఓహ్ సినిమా ఆ ఆ రేంజ్ లో వునాద. కాని టివి లో ఏదో పెద్ద కళా కాండం తీసేనటు తేజ కోతలు రాయుడు కుట్టింగ్స్ ఇస్తునాడు
:)))))))))) కొవ్వొత్తి తాను కరుగుతూ మనకు వెలుగునిస్తుంది ...........రివ్యూలు రాయడం రాజ్ వంతు....... సర్వేజనా సుఖినో భవంతు !
మీ చేత సమీక్షలు రాయించతానికయినా తేజలాంటివాళ్ళు సినిమాలు తియ్యల్సిందేనండి. బాగా నవ్వించారు.
తేజ సినిమాలు తియ్యతం ఆపేసి జనాల్ని రక్షించాడు అనుకున్నాం. మళ్ళీ తయారయిపోయాడన్నమాట. మీ మరియు మీ మిత్రబృందానికి వీరతాళ్ళండి!
అమ్మో.. ఏంటి ఈ డాష్‌ల గోల. నన్ను మాత్రం బ్రతికించావ్, సినిమా దరిదాపుల్లోకి కూడా పోకుండా. రివ్యూ మాత్రం... చెప్పడానికేముంది, ఎప్పటిలాగానే అదుర్స్ :)))
Post a Comment