Sunday, April 29, 2012

దుమ్ము లేపిన దమ్ము... కానీ నాకు డస్ట్ ఎలర్జీ !

దమ్ము...దామ్.దమ్ దమ్ దమ్.  దమ్మూ....!

యంగ్ టైగర్ NTR, మాస్ మాంత్రికుడు బోయపాటి శీను ల కలయికలో లవ్, ఏక్షన్, సెంటిమెంట్, కామెడీ కలిసి పేరుకు తగ్గట్టూ రూపుదిద్దుకున్న పవర్ ఫుల్ పొట్లాం. "దమ్ము"

బోయపాటి శ్రీను ఒకే రకం సినిమాలు తీసినా గానీ, ఆ జోనర్ లో మాంచి కమాండ్ ఉంది. మాస్ కి ఎక్కేలాగా ఏక్షన్ మూవీస్ తీయటం లో చెయ్యి తిరిగినోడు కాదు కాదు కండలు తిరిగినోడు అని చెప్పాలి.

ఒక యువకుడు రెండు వంశాల మధ్య, తరతరాలుగా జరుగుతున్న గొడవలని, పే...ద్ద గొడవ చేసి ఉన్న గొడవని చిన్నది చేసీ, భయం తోనూ, బాధలతోనూ, రాక్షసుల నీడలో  బ్రతుకుతున్న
ప్రజలకి ధైర్యాన్నిచ్చీ, అడ్డొచ్చిన వాణ్ణి తన దమ్ముతో అడ్డంగా నరికేసీ, చివరికి మిగిలిన వాళ్ళని మార్చీ శాంతి ని ఎలా నెలకొస్పాడు ?? అనేదే ఈ చిత్ర కధాంశం.

నాలోని క్లాసోడుః "ఆగు..  నాన్నా..ఆగు ! వంశాలూ, తరతరాలు గా గొడవలూ, మీసం తిప్పడాలూ, తొడ కొట్టుకోడాలూ నరకుడూ, చివర్లో శాంతి సందేశం.. ఇందులో కొత్తేముందీ?? నేను నిక్కర్లేసుకొని తిరిగినప్పటి నుండీ బొచ్చెడు సినిమాలు చూసేను ఇలాటియ్యి. తులసీ, సింహా కూడా దాదాపు ఇలాగే ఉంటాయ్ కదా?

నా లోని మాసోడుః నువ్వెవర్రా?

నా.క్లాః "నేనేరా.. నీలోని క్లాస్ ప్రేక్షకుడినీ, నీ లోని విమర్శకుడినీ, ఇంకా తెలుగులో మంచి మంచి గొప్ప గొప్ప సినిమాలు ఆశించే అమాయకుడినీ,ఆశావాదినీ... "

నా.మాః  అలా పక్కకెళ్ళి కూర్చో. మాస్ మసాలా దట్టించిన బిర్యానీ తినొచ్చిన ఫీలింగ్ లో ఉన్నానూ. మూడ్ చెడగొట్టమాకు. స్టోరీ కొత్తదా పాతదా? అని కాదు. మనక్కావల్సిన ఎంటర్టైన్మెంట్ దొరికిందా? లేదా?
విజిల్సేసి, అరిపులు అరిచి, చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేశామా? లేదా?ఇదే పాయింట్. నా వరకూ ఏంటంటే ఒక సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు ఆశించేవన్నీ ఉన్నాయ్ ఈ సినిమా లో. (నేను చూసినప్పుడు జనాలు సైలెంట్ గానే చూశారనుకో.. అది వేరే విషయం.)
ముఖ్యం గా కీరవాణి అందించిన పాటలూ, మరీ ముఖ్యం గా బ్యాక్ గ్రౌండ్ అత్యధ్భుతంగా ప్రేక్షకులకి పూనకం వచ్చేలాగా ఉంది.(చత్రపతీ, సీతయ్య, మగధీర సినిమాల రేంజ్ లో) రూలర్ పాట ఆడియో లో విన్నంత బాగోక పోయినా, వీడియో శక్తీ సినిమాని గుర్తు తెచ్చినా ,    ఫొటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, ఫస్టాఫ్ లో కామెడీ, క్లైమాక్స్ లో ట్విస్టులు అన్నీ అమోఘం.

నా.క్లాః "అలా అని  చూసిన కధలే మళ్ళీ మళ్ళీ చూసేస్తామా?"

నా.మాః నచ్చితే, నచ్చేలా తీస్తే ఎన్ని సార్లన్నా చూస్తాం. హిట్ చేస్తాం. ఏం...డాన్ సినిమాని కొంచెం మార్చి మళ్ళీ తీస్తే ఎగేసుకొని ఎల్లిపోయేవ్. మొన్నటికి మొన్న మాయాబజార్ కలర్లో మళ్ళీ తీస్తే అహో..కళాఖండం అన్నావ్?
నిన్నటికి నిన్న లవకుశ సినిమా ని రీమేక్ చేస్తే గొప్ప ప్రయత్నం అన్నావు? టైటానిక్ 3D అనగానే ఆరుకళ్ళెట్టు కొని చూసేశావ్.పాత పాటలు రీమిక్స్ చేస్తుంటే చచ్చినట్టూ వింటున్నావే?? వేరే దిక్కులేక ఎంజాయ్ చేస్తున్నావే??

నా.క్లాః "అమంగళం అదేదో అవుగాకా... ఓరీ.. పాపాత్ముడా.. మాయాబజార్ సినిమా తో పోలుస్తావా? పోతావ్రారేయ్.."

నా.మాః అదే మరీ..! నీకు నచ్చిన సినిమాని క్లాసిక్ అంటావు. జనం మెచ్చిన సినిమాని నాసిరకం అంటావు. జనాలు ఎదగలేదంటావు. సినిమాలు చూడటం రాదంటావు. అన్యాయం గా లేదూ?? ఎక్కువ మంది జనాలు మెచ్చేదీ, లాభాలు తెచ్చేదే గొప్ప సినిమా. అది గుర్తుంచుకో.
ఇక సినిమా విషయానికొస్తే NTR గురించి కొత్తగా చెప్పేదేముందీ? నటనా, ఫైట్లూ, డ్యాన్స్లులూ కుమ్మి అవతల పారేశాడు. ఎమోషనల్ సీన్స్ చెయ్యటం లో ఇప్పుడున్న కుర్రోళ్ల లో బుడ్డోడి తర్వాతే ఎవరయినా.
కోర మీసాల గెటప్ కూడా అరుపులు. డైలాగులు పిడుగులు.

నా.క్లాః "NTR టాలెంట్ కి తగిన సినిమాలు చెయ్యటం లేదు. మంచి ఆర్టిస్ట్ చేత చెత్తంతా చేయిస్తున్నారు. అతని టాలెంట్ వేస్ట్ చేస్తున్నారు పాపం"

నా.మాః ఆపరా సామీ..నీ ఓదార్పు యాత్ర.  ఇప్పటి వరకూ తను చేసిన క్యారెక్టర్లన్నీ ఇలాంటివే కదా. వాటిని చూసే కదా "టాలెంటెడ్ ఆర్టిస్ట్" అని తెలుసుకున్నావ్? మరి జనాలకి నచ్చిన ఇవి  కాకుండా కొత్తగా ఇంకేం చెయ్యాలని నీ ఎదవ గోలా?? సినిమా లో ఇద్దరు హీరోయిన్స్. త్రిష, కార్తీక. పిచ్చెక్కించార్లే. ఈ ఇద్దరి హీరోయిన్ల తోటీ ఐటెం సాంగ్స్ ఉంటాయ్ గురూఊఊఊఒ... కేకలే. ఒక పాటలో అయితే నలుగురు హీరోయిన్లూ. అది ఒక నాట్య విపరీతం అని చెప్పొచ్చు.హీరోయిన్ల కి ఏక్టింగ్ వస్తే ఏంటీ? చేస్తే ఏంటీ? పొట్టి బట్టలేసుకొని పాటల్లో గెంతారా? లేదా? అది చాలు.


నా.క్లాః "త్రిష, NTR పక్కన పెద్దదన్లా కనిపించ లేదూ?? మర్రి చెట్టు తాటి చెట్టంత ఎదిగిందా అన్నట్టుండే ఆ కార్తీకని ఎందుకు సెలక్ట్ చేసుకున్నారో అసలర్ధం కావట్లేదు. పైగా ఎవరో లేపి నించోబెట్టినట్టూ పైగా వంకర చూపులూ, తింగర చేష్టలూనూ. ఖాళీ టైం లో కుస్తీపోటీలకి వెళతాదేమో అనిపిస్తాది. పైగా ఇద్దరూ పెద్ద కలర్ కూడా కాదూ. అయినా ఆ జానా బెత్తెడు బట్టలేంటీ?? ఆ డబల్ మీనింగ్ బూతు డైలాగులేంటీ?? ఫ్యామిలీస్ రావాలా వద్దా సినిమాకి??"

నా.మాః అంటే ఏంట్రా నీ ఉద్దేశ్యం?. పెద్ద హీరోయిన్లు, పొడుగు హీరోయిన్లూ అంటున్నావ్??
మా హీరో చిన్నా చితాకా వాడనా?? తొక్కుతా ఏమనుకున్నావో.  కార్తీక బాలేదా? తెల్లగా తళ తళలాడీ పోడానికి తమన్నా అనుకున్నావా? డైరెక్టర్ ఏ పాత్రకి ఎవరు సరిపోతారో కొలతలేసి సరయిన మెజర్మెంట్స్ తో తీసుకున్నారంట ఆళ్ళని. అదే తమిళ్ ఆర్ట్ సినిమాల్లో హీరోయిన్లు జిడ్డు మొహాలేసుకొని, మొహానికి
మసి రాసుకొని, ముతక చీరలు కట్టుకుంటే అది రియలిస్టిక్ ఏక్షన్, నాచురల్ బ్యూటీ అంటావ్. అదేంట్రా నాయనా అని అడిగితే "హీరో, హీరోయిన్లు అందంగానే ఉండాలని రూలుందా?" అని కొచ్చెన్లేస్తావ్.
అక్కడ హీరోయిన్లని పొగుడుతావూ. ఇక్కడ మాత్రం ఈ హీరోయిన్లకి పొగెడుతున్నావ్?? అయినా A సెర్టిఫికేట్ సినిమాలకి డైరెక్టర్లకి నచ్చినట్టూ వేసుకుంటారు బట్టలు. నచ్చక పోతే అసలేస్కోరు. చూస్తే చూడూ లేకపోతే కళ్ళుమూస్కో. బూతు డైలాగులా ?? కోపమొస్తే ఆఫీస్ లో బాస్ ని బూతులు తిట్టుకోవా??. ఏ.... ఇంగ్లీష్/హిందీ సినిమాలు ఏమన్నా పవిత్రం గా ఉంటాయా?అందులో మాటకి పది బూతులున్నా చెవులు రిక్కించి వింటావ్." ఛీ..ఛీ ఏంటీ బూతులూ ??" అని ఏనాడయినా అన్నావా??అనవ్. పొరిగింటి పుల్లకూర రుసెక్కువలే. అసలీ సినిమాలో డైలాగ్స్ అరాచకం మచ్చుక్కి కొన్ని.

"వాడి నెత్తురు కి పోటెక్కువ. బొట్టు బొట్టూ చురకత్తే"
"ప్రజల గుండెల్లో ధైర్యాన్ని బతికించాలి. శత్రువుల గుండెల్లో భయాన్ని బతికించాలి. ఆ తల్లి గుండెల్లో ప్రేమని బతికించాలి. అందుకు ఈ నిజాన్ని చంపెయ్యాలి"
"ఒక్క సారి ఈ వంశం నాదీ, ఈ జనం నాదీ, జనం సమస్య నాదీ అనుకొని కొట్టానంటే.... నీ వంశం లో పది తరాల వరకూ మగపిల్లాడు పుట్టడానికి కూడా భయపడతాడ్రా"
"నాకు ఏదయినా కావాలనిపిస్తే దిగనూ. జనాలు రావాలని పిలిస్తే ఆగను"
"చరిత్ర సృష్టించే వాడెవడూ చెప్పిరాడూ. కానీ ఒంటరి గా వస్తాడు, నిలబడతాడు, మొదలెడతాడు. చరిత్ర సృష్టించే వెళతాడు"
"నీ కొడుకుని పోయీ ఓపిక ఉన్నప్పుడు రమ్మను. పదినిమిషాల తర్వాత అయినా పర్లేదు. పది రోజులయినా పర్లేదు. పది నెలలయినా, పది సంవత్సరాలయినా పర్లేదు. ఒక్క గంట ముందు ఫోన్ కొట్టు. నీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటాను"
"చరిత్రేమిట్రా చరిత్రా... గేటు దగ్గర మొదలెడితే గుమ్మం ముందు ముగిసిపోయింది నీ చరిత్రా... పదినిమిషాలే పట్టీంది నాకు"

"నా దారి తప్పని చెప్పూ.. మార్చుకుంటా. నా తప్పు చూపించూ..సరిదిద్దుకుంటా.. కానీ నాకు చావుని చూపించాలనుకోకూ" (సరిగా గుర్తు లేదు ;()

"బతకండీ బతకండీ అని చెప్పాను కదరా.. వినలేదూ.. కోత మొదలైందీ.. రాత రాసిన భగవంతుడు కూడా ఆపలేడూ"
"సౌండ్ తగ్గించుకో.. ఈ సారి కొట్టానంటే గొంతులోనుండి అరుపు రాడానికి ఐదేళ్ళు పడతాదీ"
ఇలాంటి సూపర్ డూపర్ డైలాగ్స్ ఉంటే ఇవన్నీ వదిలేసీ డబల్ మీనింగులూ, బూతులూ ఎక్కువయిపోయాయ్ అంటున్నారు సో కాల్డ్ విమర్శకులు..

ఒక మరదలు బావగారితో (హీరో) "బావగారూ.. విప్పండి కడుగుతా....అదే... షూస్" అని మర్యాద గా అంటాది.
ఇంకొక మరదలు, బట్టలు తడిచిన బావగారికి తువ్వాలు తెచ్చీ "బావగారూ.. మీరు తుడుచుకుంటారా? నన్ను తుడవమంటారా? " అని అడుగుతాది. ఇందులో డబల్ మీనింగ్ ఎక్కడుందో బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా
అర్ధం కావట్లేదు. నీలాగా సినిమా గురించి ఏం తెలీకుండా ప్రతీ ఒక్కడూ తెలుగు సినిమాని విమర్శించెయ్యటమే. రివ్యూలు రాసెయ్యటమే... హేమిటో కర్మ..

నా.క్లాః "రామ రామా.. హరి హరీ... ఏంటీ అశ్లీల భాషా సంభాషణలు... ఆ హింస ఏంటీ? వందల మంది నరకడం ఏంటీ? సెన్సార్ బోర్డ్ ఏం చేస్తుందసలూ.. ఆ ఫైట్లు మరీ దారుణం గాలేవూ? చేతిలు వెనక్కి మడుచుకొని భుజాలతో గుద్దెయ్యటం ఏందయ్యా? కొడితే కిందపడ్డోడు మళ్ళీ బంప్ లేచి పడటం ఏంటీ? విలన్లంతా గాల్లో ఎగిరే ఫైట్స్ ఆపరా??  హాలీవుడ్ సినిమాల్లో సూపర్ మేన్, స్పైడర్ మేన్, హీమాన్, hulk లాంటి సూపర్ హీరోస్ చేసే ఫైట్లు ఇక్కడ పెడితే ఎటకారం గా ఉండదా ??"

నా.మాః ఇదిగో దేని గురించన్నా మాట్లాడు గానీ ఫైట్స్ గురించి వాగావంటే బాగోదు.  ఒక్క మాటలో చెప్పాలంటే ఫైట్స్ తుక్కుతుక్కు చేసేశాడు. ఆ క్యారెక్టర్ కి తగినట్టూ పవర్ఫుల్ ఫైట్లు. ఇలన్లందర్నీ ఇరగదీస్తుంటే, రక్తం పారుతుంటే సామిరంగా నా ఒంట్లో కరెంట్ జెనరేట్ అయ్యింది. క్లైమాక్స్ లో హీరో చచ్చిపోయే తమిళ్ సినిమాలు చూసి హిట్ చేస్తాం కానీ మా హీరో చచ్చిపోతే మేం ఆ సినిమాఅని తన్నవతల పారేస్తాం.  మాకు మా హీరోలే సూపర్ హీరోస్.  సూపర్ మేనా? హీ మేనా? దమ్ముంటే రమ్మనూ... తొడ గొట్టి, మీస మెలేసి నరికి పారేస్తారు మా వాళ్ళు.
A సెర్టిఫికేట్ సినిమాకి చిన్న పిల్లలతో వచ్చీ,  హీరోయిన్ క్యారెక్టర్ బూతులు మాట్లాడుతుందీ, హీరో పోరంబోకు లా బిహేవ్ చేస్తున్నాడూ, లోకం పాడైపోతుందీ అని ఏడ్చే ప్రేక్షకులకీ, విమర్శకులకీ ఎన్ని చెప్పిన అర్ధం కావు వదిలెయ్.

నా.క్లాః "సరే.. ఫైట్స్ గురించి మాట్లాడనూ...ఆ క్లైమాక్స్ ఏంటీ బాబూ.? నమిలేసిన బబూల్ గమ్ సాగదీసినట్టూ.. హీరో చేతిలో దెబ్బలు తిన్నందుకు కన్న కొడుకునే చంపేసిన విలన్ హీరో క్లాస్ పీకితే మారి పోయి పొగడటం ఏంటీ?హీరో వాణ్ణి వదిలేయటమేంటీ? దానికన్నా ఇంటర్వెల్ కే సినిమా ఆపేస్తే సూపర్ గా ఉండేది కదా?"

నా.మాః హ్మ్మ్.. సెకండ్ హాఫ్ కొంచెం తగ్గిన మాట నిజమే. క్లైమాక్స్ సాగదీత మాటా నిజమే.  కానీ ఫస్టాఫ్ బాగుంది కదా?.
నా.క్లాః "ఆ.. ఫస్టాఫ్ బాగుందన్న సంగతి సెకండ్ హాఫ్ చూశాకే తెలిసింది నాకు"
నా.మాః అయితే ఇంకేముందీ? సినిమా బాగుందన్నావ్. హిట్.. హిట్.. బంపర్ హిట్.. కలెక్షన్ రికార్డులన్నీ మావే. మా ఫ్యాన్స్ అందరం పెద్ద పండగ చేసుకునే సినిమా ఇది. కొత్త రికార్డ్ సృష్టించేస్తాదీ సినిమా.. చూస్తూ ఉండూ.

నా.క్లాః "1200 ప్రింట్లంట కదా... మూడ్రోజులు కలెక్షన్స్ రాక ఏడుస్తాయా? చేస్కో రికార్డులు ఇరగ్గొట్టుకో.. ఇప్పుడు జై కొడుతున్నతక్కిన జనాలు ఛీ కొట్టే దాకా ఇలాంటి హిట్ సినిమాల చూస్తూ ఆ దుమ్ము లో దొర్లి ఎంజాయ్ చెయ్"

నా.మాః నీలాంటి తెలివైన వాళ్ళు Rs 40 కి సీడీ కొనుక్కొనో, ఫ్రీ టొరెంట్ డౌన్లోడ్ చేసో చూసి విమర్శిస్తున్నారనే, అన్ని సినిమాలూ ఇన్నేసి ప్రింట్లు రిలీజ్ చేస్తున్నారు. ఇదేరా "డాగ్ బైట్ కి స్లిప్పర్ స్లాప్" అంటే.

నా.క్లాః ఆ... ఇదే... దమ్ము తో దుమ్ము లేపడం అంటే కూడా ఇదే..  సినిమా మొత్తం ఒక కన్ను మూసుకొని ఉండే నాజర్ కళ్ళు తెరుచుకొని పీకిన క్లాస్ కి నేను కళ్ళు తేలెయ్యాల్సి వచ్చింది. సింహా సినిమా లాప్టాప్ లో మళ్ళీ చూసేస్తే పోయేది. సినిమా టికెట్ తో పాటూ జండూబామ్, సారిడన్ టాబ్లెట్లూ ఫ్రీ గా ఇస్తే బాగుండేది.
సినిమా బిగినింగ్ లో బోయపాటి శీను "సైలెన్స్.. రెడీ బాబూ... ఏక్షన్" అన్నప్పుడే వచ్చేస్తే ఇంకా బాగుండేది.

ఓ.. లెక్క ఉన్న తిక్క అన్నయ్యా.. రా..రా. ఈ వారం రోజులూ రెస్ట్ తీసుకుంటా... మళ్ళీ నువ్ కూడా కొట్టేద్దువూ గానీ.
ఇక ఈ సినిమా రివ్యూలు ఆపేద్దామనే గొప్ప నిర్ణయం తీసుకున్నా ఇందాకే.. "ఇక చాలూ"(చత్రపతి స్టైల్)

41 comments:

Varuna Srikanth said...

అబ్బో....ఏమన్నా రాసావా అసలు...కేవ్వ్వ్వవ్వ్వవ్వ్వ్...కేక అంతే ఇక...
అసలు ఆ టైటిల్ ఏంటి? దుమ్ము లేపిన దమ్ము...కానీ నాకు డస్ట్ ఆల్లేర్జి....బతికిన్చావ్ నాయనా...ఆ కళాఖండం చూసేకంటే హాయిగా నీ రివ్యూ చదువుకుని నవ్వుకోవటమే బావుంది.

Varuna Srikanth said...

అబ్బో....ఏమన్నా రాసావా అసలు...కేవ్వ్వ్వవ్వ్వవ్వ్వ్...కేక అంతే ఇక...
అసలు ఆ టైటిల్ ఏంటి? దుమ్ము లేపిన దమ్ము...కానీ నాకు డస్ట్ ఆల్లేర్జి....బతికిన్చావ్ నాయనా...ఆ కళాఖండం చూసేకంటే హాయిగా నీ రివ్యూ చదువుకుని నవ్వుకోవటమే బావుంది.

జలతారు వెన్నెల said...

LOL...నవ్వించారు చాలా..ఇప్పుడే చూసి వచ్చాను ఈ సినిమా...

Unknown said...

నిన్న నే వెళ్ళాను నేను కూడా....నీకు సినిమా నచ్చినదుకు థాంక్ యు రాజ్....:)
అని అంటాను అనుకున్నావా...

చెత్త నా సినిమా ఇది...వాళ్ళు తీస్తారు.మనం ఎగేసుకొని వెళ్ళటం.ఛీ నన్ను నేను ఎన్ని సార్లు తిట్టుకున్నానో సినిమా కి వెళ్ళినందుకు.
ఆఖరికి ఊళ్ళల్లో కూడా రచ్చ ది ఒకడు..దమ్ము ది ఒకడు పోస్టర్లు పెట్టి మాటలతో సవాళ్ళు చేసుకుంటున్నారు ..జనాలని రెచ్చకొట్టి ఎంత దిగాజరుస్తున్నారో ఈ అటు ఇటు కానీ కొడుకులని చుస్తే తెలుస్తుంది.కులాల మధ్య ఆజ్యం పోస్తూ బాగున్న జనాలని కూడా దూరం చేస్తున్నారని ఎప్పటికి తెలుసుకుంటారో ఆ పిచ్చి జనాలు.

మీకు ఇంకొక మాట రాజ్ గారు....అందరి పేర్లు చెప్పుకొని మన బుర్రలు పోగాట్టే ఇలాంటి వాళ్ళవి కాకుండా...మీరు ఈ మధ్య చుసిన మంచి సినిమాల రివ్యూ లు రాయొచ్చు కదా...

రసజ్ఞ said...

ఏంటండీ వేసవి సెలవులిచ్చేసారా? ఏ సినిమానీ వదలట్లేదనుకుంటా! అసలు ఇది రిలీజ్ అయినట్టు కూడా తెలియదు నాకు. పోన్లెండి మీరు బలయ్యి మమ్మల్ని బ్రతికిస్తున్నారు ;) "ఆ.. ఫస్టాఫ్ బాగుందన్న సంగతి సెకండ్ హాఫ్ చూశాకే తెలిసింది నాకు" హహహ! అంతేనండీ కొంతమందిని చూస్తే నాకు కూడా నేనింత గొప్పదాన్నా అనిపిస్తుంది ;)

Kala said...

మీ రివ్యూ ఇది వరకటి వాటిలాగ సరదాగ లేదు. ఎందుకు సినెమా చూసానా అని చాలా బాధ పడినట్లు అనిపించింది. Anyhow రివ్యూ రాసినందుకు థాంక్స్

కృష్ణప్రియ said...

నా.క్లాః "ఆ.. ఫస్టాఫ్ బాగుందన్న సంగతి సెకండ్ హాఫ్ చూశాకే తెలిసింది నాకు"
---- :) సూపర్! ఇది చాలు సినిమా గురించి చెప్పటానికి.

అన్నట్టు రచ్చ సినిమా చూడలేదా? మీ రివ్యూ చదవాలని ఉంది.

మేము రచ్చ చూసి మొన్ననే బలయ్యాం.
ఈ వంశాల డైలాగులు మెగా వంశానికి కూడా నార్మ్ అయినట్టుంది.. ఇంకా నయం.. ఈ ఆదివారం దుమ్ము చూద్దాం అనుకున్నాం.. (రెండు వంశాలకీ న్యాయం చేద్దామని)

చాలా ఆశ్చర్యం వేస్తోంది.. ఇంకా ఎంతకాలం... వాళ్లకి ఈ సినిమాలు చెత్తగా ఉన్నాయని చెప్పే మంచి స్నేహితులు ఉండరా? అని .

Unknown said...

@Krishna priya garu....kew :)

Anonymous said...

*వాళ్లకి ఈ సినిమాలు చెత్తగా ఉన్నాయని చెప్పే మంచి స్నేహితులు ఉండరా? అని*

కృష్ణ ప్రియ,
మీరు మరి అమాయకంగా అడిగిన ప్రశ్నను చదివి చాలా నవ్వుకొన్నాను. పాతసినేమా కన్యాశుల్కంలో షావుకారు జానాకి అంత అమాయకంగా మీరు నా కంటి ముందు కనిపించారు. ఆ సినేమాలు వారు తీసుకొనేదే వాళ్ల కులపిచ్చిని గ్లోరిఫై చేస్తూ జబ్బలు చరుచుకోవటానికి, ఎన్నిసార్లు పోటీ చేసినా ఎలెక్షన్లలో గెలవ లేకపోతున్నారు, బ్రాండ్ వాల్యు పడిపోయింది. ఇక బ్రాండ్ వాల్యును పెంచుకోవటానికి చివరి ప్రయత్నంగా సినేమాలను ఆశ్రయించారు. ఇక చేయవలసింది, మిగతా హీరోలు కెసియార్, జగన్ తరపున రంగంలోకి దిగి వారి వాణిని వినిపిస్తే, ఆ దెబ్బతో తెలుగు సినేమా చచ్చి ఊరుకొంట్టుంది. ప్రజలు బాగు పడతారు. ఒక పనైపోతుంది బాబు.

శశి కళ said...

బాబోయ్...ఏమి రివ్యు...దుమ్ము...దుమ్ము...ఎం.టి.ఆర్..దుమ్మె దుమ్ము...దులిపాడు అన్న మాట...

వేణూశ్రీకాంత్ said...

హహహహహ టైటిల్ అద్దుర్స్ రాజ్ :)))) నాక్కూడా బోలెడంత డస్ట్ అలర్జీ :)))

KumarN said...

Title is outstanding Raj :-)
ఇహ రెండుపక్కలా ఆర్గ్యుమెంట్సు కూడా బాగున్నాయి.

విష్వక్సేనుడు said...

హాహాహా....
దుమ్ములో అడుగెట్టా కానీ డస్ట్ నుంచి తప్పించుకున్నా..
సెకెండ్ హాఫ్ గురించి ఊహించి ఇంటర్వెల్ లోనే వెనుదిరిగా ...

Raviteja said...

as usual రివ్యూ బాగుంది :D నేను కూడా మన ఓ.. లెక్క ఉన్న తిక్క అన్నయ్యా కోసం ఎదురుచూస్తున్న......

SrinivaS said...

హాయ్ రాజ్

ముందు నువ్వు ఇన్సూరెన్స్ తీస్కో
అంటే కాపీ రైట్ చేసుకో బాబు
కెవ్వు కేక నీ రివ్యు.

శ్రీని

SrinivaS said...

హాయ్ రాజ్

ముందు నువ్వు ఇన్సూరెన్స్ తీస్కో
అంటే కాపీ రైట్ చేసుకో బాబు
కెవ్వు కేక నీ రివ్యు.

శ్రీని

SrinivaS said...

హాయ్ రాజ్

ముందు నువ్వు ఇన్సూరెన్స్ తీస్కో
అంటే కాపీ రైట్ చేసుకో బాబు
కెవ్వు కేక నీ రివ్యు.

శ్రీని

ఫోటాన్ said...

నైస్, రాజ్..:)

జ్యోతిర్మయి said...

మీ టైటిల్ సూపర్...కెవ్వ్..కెవ్వ్

కృష్ణప్రియ గారి సందేహామే నాది కూడా...మన ఇంట్లో ఎవరైనా చిన్న పొరపాటు చేస్తే ..నలుగురిలో బోలెడు ఫీల్ అవుతాము కదా...వాళ్ళ ఇళ్ళల్లో కూడా పిల్లా పీచు ఉంటారు..వాళ్ళు ఫీల్ అవ్వకుండా చుట్టూ మాయపొరలు కప్పుకుని తిరుగుతుంటారా...

జలతారు వెన్నెల said...

నాకు ఆశ్చర్యం కలిగించిన ఒక పాట lyrics..
"రాజు వచ్చినాడు ...ok..
చిన రాజు వచ్చినాడు ...ok
వస్తూ వస్తూ పండుగ తెచ్చినాడు..ok
ఊరు వాడ గడపల్లోనా పున్నమి పంచినాడు.. ok
శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి ..
"నువ్వు విసిలేస్తే అంధ్రా సోడా బుడ్డీ...??????"

The song lyrics were kind of okay but how could anyone think of writing the last line? It sounded so stupid and idiotic.

phaneendra said...

:)

రాజ్ కుమార్ said...

వరుణ శ్రీకాంత్ గారూ.. ధన్యవాదాలు

జలతారు వెన్నెల గారూ... ఓహో సినిమా చూసేశారా ఎలా అనిపిమ్చిందండీ?
నువ్వు విసిలేస్తే అంధ్రా సోడా బుడ్డీ...??????"
ఇది సింహాద్రి సినిమా లో సూపర్ హిట్ సాంగ్ అండీ. ప్రాస సరిపోయింది కదా.. సౌండ్ బాగుందని వాడుకున్నారు. ఎక్కువ గా ఆలోచించకండీ..;)
ధన్యవాదాలు;)

రాజ్ కుమార్ said...

శేఖర్.. హహహ.. నువ్ కూడా కొట్టించుకున్నావా?
మాస్ అమ్మా మాస్ అ టైప్ పోస్టర్లు రచ్చసినిమా టైం లో కొన్ని ఫోటోలు తీసాను. పంపిస్తాలే ;)
తెలుసుకుంటారు శేఖర్.. ఇంకో రెండు ఇలాంటి సినిమాలొస్తే.. బోర్ కొట్టి వదిలేస్తారు. ;) ;)

రసజ్ఞ గారూ.. వీకెండ్ కదండీ.. పైగా వేసవి.. సినిమాల పండగ అన్నమాట. ధన్యవాదాలు ః)

రాజ్ కుమార్ said...

unknown గారూ.. ఊరికే ఎప్పటీలాగానే తిట్టేద్దాం, కామెడీ చేసేద్దాం అని కాకుండా, కొంచెం కొత్తగా విశ్లేషిద్దాం అన్న ప్రయత్నం అండీ. థాంక్స్ ;)

కృష్ణప్రియ గారూ.. ఎవడి కంపు వాడికి ఇంపూ, పక్కోడు జంపు. అని వినలేదాండీ?? ;)
రచ్చ ఫ్యాన్స్ షో చూసి మరీ రాశానండీ ;)
మీరు రెండు వంశాలకీ న్యాయం చెయ్యాల్సిందే. లేకుంటే ఊరుకోను. ధన్యవాదాలండీ

ఓరినాయనోయ్ గారూ.. ః))))

రాజ్ కుమార్ said...

శశిగారూ... అవునండీ.. చేటా, చీపురూ పట్టుకెళ్ళండీ ;) ;) థాంక్యూ.

వేణూజీ.. అలా అనిఊరుకుంటారా? మనలాంటి మాస్ చెయ్యాల్సిన పని కాదు అదీ.. ;)

కుమార్ గారూ ధన్యవాదాలండీ

వినోద్ కుమార్ గారూ యు ఆర్ టూఊఊఊ ఇంటెలిజెంట్ అండీ ;)))))))

రాజ్ కుమార్ said...

రవితేజ గారూ.. హిహిహి నేను కూడా.. థాంక్యూ.

శ్రీనివాస్ గారూ..హహాహ. ట్రై చేద్దం లెండీ.. నెనర్లు ;)

ఫోటానూ.. థాంక్యూ..

జ్యోతిర్మయి గారూ.. నాకు తెలిసి వాళ్ళు చూడకుండా రిలీజ్ చేసేస్తారండీ ;) ధన్యవాదాలు

ఫణీంద్ర గారూ ;))))

Anonymous said...

*కృష్ణప్రియ గారి సందేహామే నాది కూడా ....వాళ్ళు ఫీల్ అవ్వకుండా చుట్టూ మాయపొరలు కప్పుకుని తిరుగుతుంటారా*

ఏందబ్బా జ్యోతిర్మయి అక్క యు యస్ పోయి చానాళ్లైనట్టున్నాది. సూడబోతే ప్రస్తుత ఆంధ్రా పరిస్థితితులు తెలవనట్లు ఉంది. ఆళ్లు సినేమా తీసేది పలుకుబడి పెంచుకొని, రాజకీయాలలో సొమ్ము చేసుకోవటానికని అర్థమవ్వట్లేదా? రాజకీయాలలో సినేమా వలన వారికి రిటర్న్ ఆఫ్ ఇన్వేస్ట్మెంట్ ఎక్కువగా వస్తుంది. సినేమా ద్వారా కులపిచ్చిని రగిల్చి, దానిని సంఘటితం చేసి,ఓట్లుగా మార్చటం వారు చేయవలసిన పని. అచ్చంగా సినేమా మీద వచ్చే లాభం ఏ పాటిది? ఆ లాభాల మీద వాళ్లు ఆధారపడి జీవించటానికి ఎమైనా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల? వారి దగ్గర డబ్బులు బాగా మూలుగుతున్నాయి, వాళ్ల డబ్బా వాళ్లుకొట్టుకొని సినేమాలు తీసుకొంటే రాజకీయలలో ప్రిఫెరెన్స్ ఉంట్టుంది గదా!

ఆ.సౌమ్య said...

సూపర్ గా రాసావు రాజ్. కొత్తగా ఉంది..ఈ స్టైల్ నచ్చింది నాకు. నేను కూడా తలవాయగొట్టించుకున్నాను సినిమా చూసి..చీ చీ ఆ బూతులేంటి, ఆ పాటలేంటి...దారుణం!

జూ.NTR కి ఎంత టేలెంట్ ఉందసలు! కొన్ని కొన్ని సీన్లలో ఎంతో బాగా చేసాడు కదా! ఏ చేస్తాం అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది.

Gowri Kirubanandan said...

"అక్కడ హీరోయిన్లని పొగుడుతావూ. ఇక్కడ మాత్రం ఈ హీరోయిన్లకి పొగెడుతున్నావ్?"
మంచి సటైర్ .
నాకు మాత్రం 'అదుర్స్' లో పిలక పంతులుగా జూనియర్ N T R నటన, డైలాగ్ డెలివరీ చాలా నచ్చింది.
మీ చిత్ర సమీక్ష లను చదివి సినిమావాళ్ళు తమ పంధాను మార్చుకునే ఉందేమో. ఎవరు చూడొచ్చారు?

Subramanya Shastry said...

"ఇక ఈ సినిమా రివ్యూలు ఆపేద్దామనే గొప్ప నిర్ణయం తీసుకున్నా ఇందాకే.. "ఇక చాలూ"(చత్రపతి స్టైల్)"

మీరు చివర్లో చెప్పినది తూచ్ అన్నమాట. రివ్యూలు ఆపితే ఒప్పుకునేది లేదు.

pulsar said...

అది ఒక నాట్య విపరీతం అని చెప్పొచ్చు!!

ROFL! దొర్లి దొర్లి నవ్వానండి బాబు. కేక!

MURALI said...

కేకెహె. స్టైల్ మార్చి ఇరగదీసావ్

pallavi said...

naaku mee blog lo chaala istham ayinavi reviews ye andi.. paata reviews ni malli chaduvukuntu untanu appudappudu..
pls.. dont stop wrting reviews..
besides, even i think NTR is a potential actor..
kani eeyana gariki entha sepu vamsanni poyyi meeda vedi chesi mana meeda poyyadame saripotundi ;)

రాజ్ కుమార్ said...

అ.సౌమ్య గారూ.. యెస్.
మరీ రొటీన్ అయిపోతుందని ట్రై చేశా ;) ధన్యవాదాలు

Gowri Kirubanandan గారూ మార్చుకుంటే, మంచి సినిమాలొస్తే అంతకన్నానా?
ధన్యవాదాలండీ

తెలుగు భావాలు ;) ;) చూద్దామండీ.. మనచేతిలో ఏదీ లేదు గా ;) థాంక్యూ

రాజ్ కుమార్ said...

pulsar గారూ, మురళీ.. థాంకులు ;)

పల్లవి గారూ.. నిజం. కరెక్ట్ గా చెప్పారు
ఏదయినా ఎక్కువయితే బోర్ కొడుతుందండీ. ధన్యవాదాలు ;)

SJ said...

సూపర్ మేనా? హీ మేనా? దమ్ముంటే రమ్మనూ... తొడ గొట్టి, మీస మెలేసి నరికి పారేస్తారు మా వాళ్ళు :)) super review...

నిజం said...

మీ రివ్యూ ఇది వరకటి వాటిలాగ సరదాగ లేదు. ఎందుకు సినెమా చూసానా అని చాలా బాధ పడినట్లు అనిపించింది. Anyhow రివ్యూ రాసినందుకు థాంక్స్

@Unknown గారు: సినిమా నే అలా ఏడిచింది అసలు టైమింగ్ లేని డైలాగ్ లు ....టైమింగ్ లేని పాటలు...... వామ్మో కార్తిక పాత్ర గురించి చెప్పలేను...బలి అయ్యాము cinemaki.

రాజ్ కుమార్ said...

sj గారూ ధన్యవాదాలండీ..
నిజం గారూ.. పేరు నిలబెట్టుకున్నారు. ;) థాంక్యూ

Swapna said...

creative presention... very funny :)
keep going...

Harsha said...

దమ్ము దుమ్ము దులిపిందో లేదో తెలిదు కాని మీరు మాత్రం చితక్కోట్టేసారు సర్,కేవ్వ్వ్ కేవ్వ్వ్ వ్వ్ వ్వ్వ్ వ్వ్వ్

రాజ్ కుమార్ said...

స్వప్న గారూ,maromahaprasthanam gaaroo ధన్యవాదాలు ;)