Saturday, April 23, 2011

Mr.Perfect … నాకు నచ్చేసింది.


నిన్నటి నుండీ వర్షం..ఓ ఓఓఓఓఓ కుమ్మేస్తుందీ. మా ఇంటి చుట్టూ జలమయం అయిపోయి ద్వీపకల్పం లాగా తయారయ్యింది.. మొన్ననగా అన్ని డబ్బులు తగలేసి టిక్కేట్లు బుక్ చేసుకున్నాక వెళ్లక తప్పుద్దా? సో పడవ లేక పోయినా గొడుగేసుకొనీ “గాలి వానలో..వాన నీటిలో పడవ ప్రయాణం..” అని గ్రూప్ సాంగ్ పాడుకుంటూ, తడుచుకుంటూ బయలుదేరాను “Mr.perfect” సినిమాకి మా ఫ్రెండ్స్ తో…ఆ…. వినపడింది… ఆపేస్తున్నా..


డార్లింగ్ లాంటి లవ్ స్టొరీ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సకుటుంబ సపరివార సమేతం గా చూడదగ్గ మరొక ప్రేమకధా చిత్రం.. “Mr.Perfect”. సినిమా ఎలా మొదలైందీ అంటే…..

మమ్ము కాచిన వా…..డు మా…. మనసు దోచిన వాడూ..ఊ..ఊ ఊ..ఊ ఊ..ఊ...

మంగళాకారుడు.. మా ఆ..ఆ.. శ్రీనివాసుడూ….

అలా తిట్టకండీ.. మరీ ఇంత డీటైల్డ్ గా చెప్తే మీరు డిప్రెస్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టీ. నా అభిప్రాయం మాత్రం చెప్తా టూకీగా.. :) :)

పెళ్ళి చేసుకోడానికి మనసులు కలవాలా? అభిప్రాయాలు కలిస్తే చాలా?(రెండూ ఒకటి కాదు అంట) మనం ఇష్టపడే వాళ్ళ కోసం, మనల్ని ఇష్టపడే వాళ్ళ కోసం ,మన ఇష్టాల విషయం లో కాంప్రమైజ్ అవ్వాలా?? ఒకరి గురించి మనం మారిపోతే మన జీవితం మనకే బోర్ కొట్టదా?. జీవితంలో మనకి నచ్చినట్టూ ఉంటే కలిగే ఆనందం గొప్పా? అందరికీ నచ్చినట్టూ ఉంటే కలిగే ఆనందం గొప్పా? ” అనే థీం మీద తీసిన సినిమా. ఈ విషయాలని ఏ కన్ఫ్యుజన్స్ లేకుండా, బోర్ కొట్టకుండా దశరధ్ తీసాడు అనిపించింది నాకైతే.

తనకి నచ్చింది చేస్తేనే అది ఆనందం అనీ, ఎవరి కోసమూ దేనినీ త్యాగం చెయ్యకూడదని నమ్మి ఆచరించే క్యారెక్టర్ లో ప్రబాస్, తనకి నచ్చిన వారి కోసం తన ఇష్టాలని త్యాగం చేసి ప్రేమికుడి ఇష్టమే తన ఇష్టంగా మార్చుకున్న అమ్మాయిగా కాజల్ బాగా చేశారు

ఫస్టావ్ మొత్తం మాంచి కామేడీ తో, సూపర్ సాంగ్స్ తో, వాటికి తగ్గా పిక్చరైజేషన్ తో సరదా సరదాగా సాగిపోతుంది బోర్ కొట్టకుండా. నాకొచ్చిన భాషలో చెప్పాలి అంటే “పొలికేక”. డైలాగ్స్ చాలా వరకూ బాగా పేలాయి. కామెడీ అంటే విరగబడి నవ్వేలా పంచ్ డైలాగ్స్ కామెడీ కాదు గానీ, సరయిన టైమింగ్ తో కామెడీ సీన్లు చాలా ఉన్నాయి. హీరో ఇంట్రడక్షన్ కి వచ్చిన రెస్పాన్స్ కి పది రెట్లు ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది “జల్సా కిషోర్” గా బ్రహ్మీ ఎంట్రీ కి. బ్రహ్మీ ఎంట్రన్స్ అతడు సినిమా ని గుర్తుకు తెస్తుంది. కాకపొతే అంతగా చెప్పుకోడానికి లేదు(జస్ట్ ఓకే అన్నమాట).

హీరో విష్యానికి వస్తే ప్రభాస్ ఇంకో రెండంగుళాలు పెరిగినట్టున్నాడు. కొత్త హైర్ స్టైల్ డిప్పకటింగ్ తో (నెత్తిమీద నాలుగెకరాలు పోయినట్టుందీ J ) కనిపించాడు. కాజల్ సూపరో సూపరు.చీరల్లో చాలా పద్దతి గా అందంగా అదరహో.. కొన్ని సీన్లలో అదోరకమైన విగ్గులు పెట్టి చెడగొట్టారు గానీ, ఫస్టాఫ్ మొత్తం మ్యాజిక్ చేసేసింది. సాంగ్స్ అన్నీ సరైన టైమ్ లో వస్తూ, కరుణాకరణ్ తీశాడా? అనిపించేటట్టు, పల్లెటూరి నేపధ్యంలో(మొదటి సాంగ్ మినహా) చక్కని సినిమాటొగ్రఫీ తో సూపర్ గా ఉన్నాయి. ముఖ్యం గా “చలి చలిగా అల్లిందీ, నింగి జారిపడ్డ,అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల” పాటలు విండానికి ఎంత బాగున్నాయో చూడ్డానికీ అంతకన్నా బాగున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ పాటలే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కుమ్మేశాడు. ఫైట్స్ కూడా ఓకే.

సెకండ్ హాఫ్ లో “తాప్సీ” ఎంట్రన్స్. పిచ్చిక గూడు లాంటీ జుత్తేసుకుని, హాట్ హాట్ గా అరుపులు అరిపించిందీ. ఓన్ డబ్బింగ్ అనుకుంటా. గొంతులో గసగసాలు వేసుకొని మాట్లాడినట్టూ, వినేవాళ్లకి చెవుల్లో ఇసకేసినట్టూ గర్ గర్ గర్ మంటుందీ. కాకపోతే క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది కాబట్టీ కాంప్రమైజ్ అయిపోవచ్చు. ఒక పాటలో కాజల్, తాప్సీ పక్క పక్కనే నించొని డాన్సేస్తుంటే, “గుళ్ళొ పెట్టిన పులిహారనీ, బవార్చీ లో కొన్న బిర్యానీ ని ” పక్క పక్కనే పెట్టినట్టూ, ఏం సెలక్ట్ చేసుకోవాలో, ఎవర్ని చూడాలో తెలియనట్టూ ఉంటుంది. రఘుబాబు కామెడీ ముందు కొంచెం చికాకు తెప్పించినా, తరవాత బాగానే పండింది. కె.విశ్వనాధ్ ఎప్పడూ చేసే హెడ్ మాస్టార్ (రూల్స్ రామానుజం లాంటి ఇంటి పెద్ద ) పాత్రనే చేసారు. సెకండ్ హాఫ్ ఫుల్ ఫామిలీ డ్రామా (ముఖ్యంగా క్లైమాక్స్) అవ్వడం వల్ల అందరికీ నచ్చక పోవచ్చు. బట్ ఫస్టాఫ్ చూడ్డానికే మళ్ళీ వెళ్ళొచ్చు J J .

గుర్తున్న కొన్ని డైలాగ్స్ (కొంచెం అటూ ఇటు గా) :

1. నీకు నచ్చిందే చేసావనుకో.. ఇంతే ఆనందం.. నలుగురికీ నచ్చింది చేశావనుకో “ఇంత” ఆనందం.

2. హీరోః

(i)ఇద్దరూ కొట్టుకుంటేనే అది ఫైట్.. ఒక్కడే కొడుతుంటే అది ఫైటెలా అవుతుందిరా?

(ii) పెర్ఫ్యూమ్ బావుందిరా.. మీ ఆవిడ సెలెక్ట్ చేసిందా? మగాళ్ళదయితే ఇంకా బావుండేది.

(iii). (గోల్ఫ్ గురించి) అయినా ఇదేం గేం? ఇంత బంతిని అంత పెద్ద గ్రౌండ్ లో కొట్టి, మళ్ళా దాన్ని వెతకాడానికి జీపేసుకొని బయలుదేరడమా?

(iv) దేవుడు మనలాగా సైకో కాదమ్మా.. గుడికి రాకపోతే కార్ టైర్ బరస్ట్ చెయ్యడానికీ..

(v) తెలివైన వాణ్ణీ బలంతో కొట్టాలి.. తెలివి తక్కువ వాణ్ణి తెలివి తో కొట్టాలి. నీ లాంటి వాణ్ణి ఎలా పడితే అలా కొట్టోచ్చు.

(vi) ఇష్టపడ్డ వాళ్ళకోసమ్ ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి ? అనుకునే వాడిని. ప్రేమ ఉన్నప్పుడూ అడ్జస్ట్ మెంట్లే ఉండవని అర్దం అయ్యింది.

3. బ్రహ్మీ : ప్రేమలోనే కాదు రా.. పగలో కూడా మనసులు మాట్లాడుకుంటాయి.

దున్నపోతుకు బట్టలేసినట్టున్నావ్.. పందిపిల్ల లాగా దొర్లుతూ ఉంటే.. బండనాయలా అనకుండా..తింగరినాయాలా అంటారా? బండ నాయాలా..

4. హీరోయిన్ః నువ్వంటే ఎందుకిష్టమో చెప్పలేను.. ఎలానో చూపించలేను.. కానీ నా గుండె కొట్టుకున్నంత వరకూ నిన్నే ఇష్టపడతాను.

5. హీరో తండ్ర్తి, హీరో తో : నీకిష్టమైన అమ్మాయిని నువ్వు సెలక్ట్ చేసుకున్నావ్.. నిన్నిష్టపడ్డ అమ్మాయిని నేను సెలక్ట్ చేశాను.

6. ప్రకాష్ రాజ్ : ఆరున్నర లక్షల మంది లో మేము మాత్రమే సెలక్టయ్యామని వీళ్ళంటున్నారు. వీళ్ళని వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ రిజక్ట్ చేశారని నేనంటున్నాను.

ప్రేమించుకోవటం అంటే ఇద్దరూ ఒకే బ్రాండ్ కాఫీ తాగటం కాదు. ఇద్దరూ కలిపి ఒకే కాఫీ తయారు చేసుకుకోవడం. మీకా ఓపిక లేదు.

7. వీడెవడో తెలుసా? హనుమాన్ జిమ్ ఓనరు.. మా వూరి వరల్డ్ ఫేమస్.

8. దేవుడా.. ఈ పెళ్ళి కుదిరితే.. మా అయన్ని మోకాళ్ళతో నీ కొండకి తీస్కొచ్చి, గుండు కొట్టిస్తా తండ్రీ..

విలన్ లు లేని ఈ సినిమా చూస్తుంటే ఒకానొక దశ లో ఆరెంజ్ సినిమా(ఆస్ట్రెలియా బాక్డ్రాప్, హీరో క్యారెక్టర్ చూసి) గుర్తొచ్చింది J J . సినిమ అయిపోయాక ఆరెంజ్, బృందావనం, బొమ్మరిల్లు, ఇంకా కొన్ని సినిమాలను మసాలా వేసి మిక్సీ లో వేసి మిక్స్ చేసినట్టూ అనిపించింది. బట్ ఫైనల్ చెప్పొచ్చేదెంటంటే “ఫామిలీ ఎంటర్టైనర్ విత్ కామెడీ”.

కొన్ని సెంటిమెంటు సీన్లు కొంచేం ఓవర్ అయి బోర్ కొట్టీంచాయి గానీ.. ఓవరాల్ గా చూస్తే ఈ మద్య కాలం లో నాకు తలనొప్పి తెప్పించని సినిమా.

17 comments:

..nagarjuna.. said...

నావరకైతే రచ్చ డైలాగు మరోటివుంది [కొంచెం అటుఇటుగా]
"ప్రేమించుకొవడం అంటే ఇద్దరికి ఒకే కాఫీ నచ్చడం కాదు, ఇద్దరూ కలిసి మంచి కాఫి తాగడం......."

kiran said...

>>>“గుళ్ళొ పెట్టిన పులిహారనీ, బవార్చీ లో కొన్న బిర్యానీ ని ” పక్క పక్కనే పెట్టినట్టూ, ఏం సెలక్ట్ చేసుకోవాలో, ఎవర్ని చూడాలో తెలియనట్టూ ఉంటుంది
హహహః ..సూపరు...ఇంత confusion అయితే ఎలా అండి..:):)
అవును..సినిమా నాకు కూడా చాలా బాగా నచ్చేసింది..:)...పాటలు అదరహో..నైస్ రివ్యూ..అన్ని dialogues భలే గుర్తు pettukunTare మీరు :)

రాజ్ కుమార్ said...

నాగార్జునా.. ఈ డవిలాగు మర్చిపోయాను.గుర్తు చేసినందుకు ధాంక్స్. ఇది కూడా పెట్టేశా.. హహహః :)

కిరణ్ గారు.. అలా ఉంటే కన్ఫ్యుజ్ అవ్వకుండా ఉండటం కష్టం కదండీ. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

Unknown said...

chalaa bagundabbayi :)

naaku ee cinema chudalani undi .

pulihara biryani .. ee dialog keka ..
brahmi peru super undi jalsa kishore ..

:( maa ullo release avaledu ....

Sravya V said...

సినిమా చూడటం , అప్పుడే రివ్యూ రాయటం కూడా :) మొత్తానికి చాలా రోజులకి మీకు కొద్దిగా మంచి సినిమా వచ్చిందంటారు ! ఇక మీ రివ్యూ చెప్పేదేముంది అదుర్స్ .

కిరణ్ నచ్చేసిందా సినిమా , నచ్చటానికి కారణం నాకు తెలుసు :D

..nagarjuna.. said...

అలసు సంగతి ఏంటంటే నేనింకా సినిమా సూడలేదు.....ట్రెయిలర్ చూస్తే నచ్చిన డైలాగ్ అది :D

హరే కృష్ణ said...

హ హ్హ :))
సూపర్ !

వేణూశ్రీకాంత్ said...

రివ్యూ బాగుంది.. కోట్ చేసిన సినిమాలోని డైలాగులు బాగున్నాయ్..

Sai Praveen said...

అసలు నీకు డైలాగులన్నీ ఇంత బాగా ఎలా గుర్తుంటాయి :)
"గుళ్ళొ పెట్టిన పులిహారనీ, బవార్చీ లో కొన్న బిర్యానీ ని ” పక్క పక్కనే పెట్టినట్టూ, ఏం సెలక్ట్ చేసుకోవాలో, ఎవర్ని చూడాలో తెలియనట్టూ ". ఇది కేక :)

ఆ.సౌమ్య said...

వార్నీ, నువ్వు ఒక్క సినిమా కూడా వదలవే :)

చెవుల్లో ఇసకేసినట్టు గరగరలాడండం, గుళ్ళో పులిహోర-బావర్చీ బిర్యానీ....నీ పంచ్ లు అదరహో!
అయితే మొత్తానికి సినిమా చూసేలా ఉందంటావ్! నాకు పాటలు నచ్చలేదు, అందుకే సినిమా కూడా పెద్దగా బావుండదేమోలే అనుకున్నా...హ్మ్ అయితే చూడొచ్చన్నమాట.

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>ప్రేమించుకోవటం అంటే ఇద్దరూ ఒకే బ్రాండ్ కాఫీ తాగటం కాదు. ఇద్దరూ కలిపి ఒకే కాఫీ తయారు చేసుకుకోవడం.

ఆ కాఫీ తాగలేకపోవడం అని కూడా ఉంటే బాగుంటుందేమో.

హాలు కెళ్ళి సినిమా లు చూసే అలవాటు తప్పిపోయింది. ఈ సినిమా టి‌వి లో ఎప్పుడొస్తుందో కదా. మీ రివ్యూ చదివితే సినిమా చూసినట్టే ఉంది .

రాజ్ కుమార్ said...

కావ్య గారు థాంక్యూ..థాంక్యూ... కొద్దికాలం ఓపిక పట్టండీ డీవీడీ కొనేసుకుందురు.. :)

శ్రావ్య గారూ.. మనమస్సలు తగ్గం కదా.. హహహ్హ
ధన్యవాదాలండీ..

నాగార్జునా నువ్ కేక బాసూ..సెబాసూ..

రాజ్ కుమార్ said...

హరే... థాంక్సో. థాంక్స్..

వేణూగారు అవునండీ డైలాగ్స్ బాగున్నాయి. thank you very munch.

సౌమ్య గారూ.. ఫామిలీ డ్రామా లు చూడగలిగే వారికి తప్పకుండ నచ్చుతుందండీ. నాలుగు పాటలు బాగా నచ్చాయి నాకు. సినిమా చూశాక మీకు కూడ నచ్చుతాయేమో మరి..;) ధన్యవదాలండీ.

రాజ్ కుమార్ said...

సాయీ.. నా కళ్ళు స్క్రీన్ కీ, చెవులు స్పీకర్ లకీ అప్పగించేసి, ఏకాగ్రత తో, ఒక యజ్ఞం చేసినట్టూ చూస్తాను సినిమాని.. హిహిహిహిహి..:) :)

బులుసు సుబ్రహ్మణ్య గారూ మీరు అనటమూ... బాగోకపోవటమూ నా? హహహ.

చూశారా? మీకు బోల్డు ఖర్చు తగ్గించేశాను. వచ్చేస్తుంది లెండి త్వరలో..టీవీ లో.
కామెంటీనందుకు ధన్యవాదాలండీ.

మనసు పలికే said...

నేనింకా సినిమా చూడలేదు... వా వా..:'(
నాలుగు పాటలు మాతం చాలా నచ్చాయి నాకు:)

టపా చాలా చాలా బాగుందోచ్...:))))

ప్రసాదం said...

ఈ సినిమా నేను మొదటి రోజు చూశాను. మీకు ఇంతగా నచ్చింది అని చదివి నా మీద నాకు ఒక అనుమానం కలిగింది.
నాకు మరీ అంతగా నచ్చలేదు. సినిమా చూసే కొణాన్ని నేను కోల్పోయానా? పాటలు చెత్తగా అనిపించాయి. సినిమా తెగ లాగినట్టు ఉంది.
మూవీ తొందరగా అయిపోయింది అని అనిపిస్తే అది కచ్చితంగా రెండో సారి చూసేలా చేస్తుంది. నాకైతే రెండోసారి చూసే అంత సీన్ కనబడలేదు. పిక్చరైజేషన్ బావుంది.
కాజల్ బాగా నటించడం అంటే కించపరిచినట్టు అవుతుంది. మంత్రముగ్ధం అద్భుతం ఇంకా ఇలాంటి పదాలు వంద చెప్పాలి. ప్రభాస్ భేష్. నా అభిమాన హీరోల్లో తనూ ఉన్నాడు. ఇక తాప్సీ ఎందుకోగానీ ఇరిటేటింగ్ అనిపిస్తుంది. జెమిని టీవీలో వచ్చే రెడ్ ఎఫ్ ఎం ప్రకటనలో కూడా...
కామెడీ ఆశించిన స్థాయిలో లేదు. తేలిపోయింది. ప్రభాస్ తన ఉనికిని చెప్పడానికి పెళ్ళిలో వాడిన సీన్లు పరమ చెత్తగా ఉన్నాయి. పాట ( ఇక్కడ దశరథ్ ను సంతోషం సినిమా పూనింది ), షిండేను కాపాడ్డం వగైరాలు... మరీ పరిణతి లేని దర్శకుడు తీసినట్లు ఉంది.
ఇప్పుడు చెప్పండి నిజంగా నేను సినిమా చూసే స్పృహ కోల్పోయానా? అవును అనేట్లు అయితే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా.

రాజ్ కుమార్ said...

ప్రసాద్ గారూ.. మీరేమీ కోల్పోలేదండీ.. నాకు తెలిసీ మీరు ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలేవీ చూడలేదనుకుంటా.. ముఖ్యంగా శక్తి,తీన్మార్.;);)

పాటల సంగతి అంటారా? కొన్ని పాటలు ముందు నచ్చేసి సినిమాలో తేలిపోతాయి. కొన్ని సినిమా చూసాక నచ్చుతాయి. కొన్ని ముందే బాగా విని ఉండటం వల్లా,లిరిక్స్ ని బట్టీ పిక్చరైజేషన్, సంధర్భం ఇదీ అని ఊహించుకుంటాం. సినిమాలో అలాగే కనిపిస్తే.. నచ్చేస్తాయి.

అవును.. కొన్ని సీన్లు తెగ (తెగేదాకా)లాగారు. ;)
తాప్సీ క్యారెక్టర్ నచ్చకపోవటమే కావాలండీ కధ కీ.. "గంటసేపు మనమే భరించలేకపోయాం.. హీరో తాప్సీ ని చేసుకుంటే వాడి పరిస్థితి ఏమిటీ?" అని అనిపించాలని దశరద్ ఉద్దేశ్యం.. హహహ.
సెమీఫైనల్ గా చెప్పేది ఏమిటంటే పెర్ఫెక్ట్ సినిమా కాకపోవచ్చు కానీ ఒక సారి చూడొచ్చు.

ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే అందరి టేస్ట్లూ ఒకలా ఉండవ్ కాబట్టీ మీకు నచ్చకపోతే అది మీ తప్పు కాదు.
(సమయానికి కుండ లేదు గానీ ఉంటే బద్దలుకొట్టీ చెప్పేవాడీని.)