Tuesday, April 19, 2011

तीनमार.... "నా" view


"తీన్ మార్"... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం లో అతి తక్కువ కాలం లో తయారయ్యి, అత్యధిక ప్రింట్లతో, అంతకన్నా ఎక్కువ అంచనాలతో రిలీజ్ అయ్యి, మొదటి రోజు నుండీ పాజిటివ్ టాక్ తో రన్ అవుతున్న సినిమా..


రిలీజ్ కు మూడు రోజుల ముందు నుండీ ట్రై చేస్తే రిలీజ్ అయిన మూడు రోజులకి దొరికాయి టికెట్లు.. అసలు నాలుగో రోజు కూడా 500 - 1000 బ్లాక్ అమ్ముతుందీ అంటే.. పవర్ స్టారా మజాకా నా? ఆ ఆ...ఆపేస్తున్నా.... సరే..సరే.. సోదాపి సంగతి చెప్తా...

మూడు ముక్కల్లో చెప్పుకుంటే " ఈ రోజుల్లో ప్రేమలకీ, ముప్పై యేళ్ళ కిందటి ప్రేమలకీ ఉన్నా తేడా ఏమిటీ? ఏది నిజమైన ప్రేమ?? ఏది గొప్ప?" ఇదీ స్టోరీ...

నాకు నచ్చినవీ...

పవన్ "మైఖేల్ వేళాయుధం" గా ఎప్పటిలాగానే ఎనర్జిటిక్ (కొన్ని కొన్ని సీన్లలో తట్టుకోలేనంతగా) గానూ, "అర్జున్ పాల్వాయ్" గా ఒక గంభీరమైన పాత్ర లోనూ ఇరగదీశాడు. ముఖ్యం గా అర్జున్ క్యారెక్టర్ కి డైలాగ్స్ చాలా స్పష్టం గా నెమ్మది గా పవర్ ఫుల్ల్ గా చెప్పాడు. పదేళ్ళ క్రితం ఎలా ఉన్నాడొ ఇప్పుడూ అంతే గ్లామర్ గా ఉన్నాడు కుర్రోడిలాగా.
ఒక రకంగా చెప్పాలీ అంటే ఈ కధ కి హీరో అర్జున్ పాల్వ్యాయ్ అయితే, విలన్ వేళాయుధం (కధ కే కాదు అప్పుడప్పుడూ చూసే వాళ్ళకి కూడా). అర్జున్ పాల్వాయ్, వసుమతి (కృతి) ల క్యారెక్టర్స్, లవ్ స్టోరీ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుందీ. నాకైతే ఈ క్యారెక్టర్స్ సినిమా అంతా ఉంటే బావుంటుంది కాదా అనిపించింది. కృతి ని చూసి సౌండ్ రాకుండా విజిల్స్ వెయ్యొచ్చు డీసెంట్ గా..మనసులో :). పాటలు బాగున్నాయి.. బాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతకన్నా బాగుంది. వయ్యారాలా, జగమేలు శివ శంకరా సాంగ్స్ కూడా ఈ క్యారెక్టర్స్ కి తగ్గట్టూ మాంచి పిక్చరైజేషన్ తో ఉన్నాయి. వయ్యారాలా పాటలో పవన్ వేసిన ఒక స్టెప్ కి నవ్వు రాక మానదు. తను సీరియస్ గా వేశాడో కామెడీకి వేశాడో..? :)
త్రివిక్రం రాసిన కొన్ని డైలాగ్స్ కేకలు పెట్టిన్చాయి. క్లైమాక్స్ లో మైఖేల్ రియలైజ్ అయినప్పుడు పవన్ డైలాగ్స్ సూపర్ గా ఉంటాయి. ఆలీ ఉన్నా కొద్ది నిమిషాలు సూపర్ కామెడీ గా ఉంటుందీ.

నచ్చనివీ & కొన్ని పనికి రాని పరిశీలనలు :

ఇక మైఖెల్ క్యారెక్టర్ పవన్ కి కొట్టిన పిండే. తొలిప్రేమ తరహా లో కొన్నిసీరియస్ సీన్స్ సూపర్ గా చేశాడు. కాక పోతే కొన్ని సీన్లలో ఓవర్ యాక్షన్ ఓవర్ టైం చేయటం వల్లా.. చిరాకేసి "ఇంక ఆపరా బాబూ.." అనాలనిపిస్తుందీ. పవన్ ఇటాలియన్ లో మాట్లాడే లెంగ్తీ సీన్లు, అది చూసి హీరోయిన్ పడిపోవడం కొందరికి కొత్తగానూ వింతగానూ , కొందరికీ చెత్తగానూ రోత గానూ ఉంటాయి. ఇంకా కొన్ని సీన్లు అనవసరమైన సాగదీత. త్రిష మాత్రం బాగా...మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్.:) :) పబ్ లో కలుసుకొన్న రోజే లవ్ లో పడిపోయి, సంవత్సరానికి బోర్ కొట్టేసి,విడీపోయి “నేను ఒకదాన్ని తగులు కున్నాను.. నువ్వెవడీని తగులు కున్నావ్? “ అని ఫోన్ లలో మాట్లాడుకునే ఈ విపరీతపు లవ్ స్టోరీని జనాలు డైజెస్ట్ చేసుకోవడమ్ కష్టం. ఇది బిగినింగ్ మాత్రమే... చెప్పాల్సిన చండాలం చాలా ఉంది. చెప్పను .. చెప్పలేను. నిజానికి అది ప్రేక్షకులకి నచ్చకూడదని, అది తప్పు అని చెప్పడమే కధ లో మెయిన్ పాయింట్ అనుకోండీ.:) :)

మామూలు గా పవన్ టచ్మీ నాట్ అన్నట్టూ ఉంటాడు గా హీరోయిన్ లతో.. ఈ సినిమా లో మాత్రం అవన్నీ పెట్టె లో పెట్టి పాతరేసేశాడు. మొదటి సాంగ్ చూడగానే అర్ధమయిపోతుందీ. పాపం ఆ డాన్సర్లకీ పావుమీటర్ గుడ్డ తో పది మందికి బట్టలు కుట్టించి గెంతించారు. త్రిష కూడా వీలైనంత తక్కువ బట్టలు వేసుకొని తిరుగుతుందీ (బడ్జెట్ తగ్గించొద్దూ?? ఎంతైనా గణేష్ బాబు తెలివే తెలివి). ఇక మిగిలిన పాటల విష్యానికొస్తే పవన్ ఎప్పటి లాగానే నడుస్తూ, ఎండాకాలం లో ఈగలు తోలినట్టూ, సుతిమెత్తగా దోమలు కొట్టుకున్నట్టూ చేతులు ఊపి సరిపెట్టేశాడు. మరీ జగపతి బాబు లాగా రిధమ్ లేని బాడీ కాదు గా.. కాస్త కష్టపడి కాళ్ళూ, చేతులూ ఊపితే సొమ్మేంపోయేదో?. ఎప్పుడొ నా స్కూల్ డేస్ లో వేశాడు డాన్స్. ఇంకెంత కాలం ఖుషీ తో పోల్చుకోవాలో? కాకుంటే గత సినిమాలతో పోల్చితే ఇందులో బాగానే వేశాడు డాన్స్. సెకండ్ హాఫ్ లో ఫైట్స్ అంతసేపు ఎందుకు సాగదీశాడో జయంత్ కే తెలియాలి. ఆ ఫైట్స్ పవన్ ఫైట్స్ లాగా పవర్ ఫుల్ గా లేవు.:( :( కొన్ని సీన్లకయితే ఫార్వార్డ్ చెయ్యడానికి నా చేతిలో రిమోట్ లేదని ఫీలయ్యాను.గాయత్రి భార్గవి పవన్ తో చెప్పే డైలాగ్స్ త్రివిక్రమ్ రాయలేదనిపిస్తుందీ. త్రివిక్రం గత సినిమాలతో పోల్చితే కామెడీ, తన మార్క్ పంచ్ లూ తక్కువ. హా.. మర్చిపోయా.. పాపం ఈసినిమాలో సొనూసూద్ ని చూస్తే జాలేస్తుందెవరికైనా. "పశుపతీ.. అఘోరాధిపతీ" అని అరిచి అదరగొట్టీనవాడిని ఆటలో అరిటి పండు చేసి ఆడుకుంటుంది త్రిష... ;)

కొన్ని అద్భుతమైన డైలాగ్స్ (ఇంచుమించు గా గుర్తున్నంతవరకూ) :


గీత దాటొద్దు... చెరిపేస్తాం. హక్కులు కాలరాయొద్దు.. తొక్కేస్తాం.

దేవుడు చాలా గొప్పోడు.. డిప్పకాయ మీద పీకి, ఏడ్చే లోపు చేతిలో చాకొలేట్ పెట్టేస్తాడు. (కెవ్వ్ ...కెవ్వ్ )

నచ్చిన అమ్మాయ్ ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళడానికి నేనేమన్నా హచ్ కుక్కపిల్లనా ?

అందంగా లేదని అమ్మనీ, కోపంగా ఉన్నాడని నాన్నని వదిలేస్తామా చెప్పు?

సంపాదిస్తే డబ్బొస్తుంది గానీ సంస్కారం రాదు.

యుద్దం లో గెలిచే యోధుడు ఓడిపోయే వాడికి ఎలా కనిపిస్తాడో అలా ఉంటాడు వాడు. (ఇక్కడ విజిల్స్... :) )

రోమియో-జూలీయట్, దేవదాస్ పార్వతి, లైల మజ్నూ లాంటీ గ్రేట్ లవర్స్ కావాలీ అనుకుంటే.. చచ్చిపోవాలా ? మనం మారుద్దాం.. బ్రతికున్న గ్రేట్ లవర్స్ అని నిరూపిద్దాం..
ఈరోజుల్లో మనదనుకున్న అమ్మాయి స్ట్రీట్ దాటితేనే గారంటీ లేదు. అలాంటిది సముద్రాలు దాటేల్లిపోతుంది.. ఇంకేం గారంటీ?

కారణం లేని కోపం.. గౌరవం లేని ఇష్టం.. బాధ్యత లేని యవ్వనం.. ఙ్ఞాపకంలేని వృద్ధాప్యం అనవసరం

హీరో , హీరొయిన్ తో : ఇకపై నీ వెంట పడను. నీ తో మాట్లాడను. నీ జోలికి రాను. నిన్ను డిస్టర్బ్ చెయ్యను.. చదువుకో.. బాగా చదువుకొని .ఎగ్జామ్స్ బాగా రాసి , పాసయ్యి వచ్చాక నిన్ను పెళ్ళి చేసుకుంటాను.. (విజిల్స్..)
ఎన్ని సార్లు కలిసినా, విడి పోయే ముందు చివరి సారి కలిసినప్పుడు ఎందుకో ప్రత్యేకం గా ఉంటుంది.

ఒకడు ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే పోనీలే బాధలో ఉన్నాడు అనుకుంటారు. అదే నవ్వుతున్నాడనుకో.. పిచ్చోడనుకుంటారు.. నా పరిస్తితి ఆ పిచ్చ కి దగ్గర గా ఉంది.. (కేకలు.. అరుపులు..)

ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే.. చచ్చేటప్పుడే వదిలేది.


క్షమించరాని తప్పులు మరియూ ధర్మ సందేహాలు :
పవన్ కళ్యాణ్ డబ్బీంగ్ చెప్పుకోలేదనుకుంటా.. మనోడికి లైవ్ రికార్దింగ్ మీద మోజో, లేకా డబ్బింగ్ చెప్పాలంటే బద్దకమో తెలీదు. చాలా సీన్ల లో వాయిస్ క్లారిటీ లేదు అండ్ లిప్ మూమెంట్ కూడా సరిగా సింక్ అవ్వదు. డైలాగ్స్ అర్ధం కావు. అర్దం కాని ఇటాలియన్ లో
ఐదు నిమిషాలు అనర్గళంగా మాట్లాడినా పర్లేదు.అసలు మాట్లాడేది ఏ భాషో కూడా తెలియకుండా ఉండేలా చేస్తే ఎలా?

లవ్ ఆజ్ కల్ సినిమా హిందీ కాబట్టీ ఓకే. తెలుగు సినిమా లో కూడా కాశీ అనీ, అలహాబాద్ అనీ నార్త్ బాక్ గ్రౌండ్ ఎందుకు తీసుకున్నారో తెలీదు. పోనీ అక్కడి వాళ్ళా అంటే అదీ కాదు. పేరు తప్పా కట్టూ, బొట్టూ, భాషా అన్నీ తెలుగు వాళ్ళవే.. A.P లోనే తీసుంటే కొంచెం మననేటివిటీ తో ఉండేది
కదా..!


ఆసలీ సినిమాకి "తీన్ మార్" అని టైటిల్ ఎందుకు పెట్టారు?? (ఐ డిమాండ్ యువరానర్..!)

( మామూలు గా చిన్న చిన్న తప్పుల్ని కూడా రివ్యు లలో ఏకి పారెస్తారు గా? పవన్ ఫాన్ అయిన నాకే ఇన్ని కనిపిస్తున్నాయి.. ఇవన్నీఏ రివ్యులోనూ ఎవ్వరూ చెప్పలేదూ అంటే ఇదేదో "ఊహూ...ఆహూ." ఎవ్వారం లాగా అనిపిస్తుందీ.)

ఇంతకీ సినిమా ఎలా ఉంది? అంటారా? "బాగా ఆకలి గా ఉన్నపుడూ , ఉడకని అన్నం లో ఉప్పులేని పప్పేసుకొని, కమ్మని నెయ్యి కలిపేసుకొని, చికెన్ జాయింట్ నంచుకు తిన్నట్టూ.. రక రకాలుగా ఉంది ".

ఫైనల్ చెప్పొచ్చేది ఏమిటంటే తప్పులు, తోటకూరలూ పక్కనెట్టేసి.. అభిమానులంతా పవన్ షో చూసి పండగ చేసుకోండి..
ఎందుకంటే..
పవన్ నవ్వాడు ... నవ్వించాడు...
ఏడ్చాడు.. ఏడిపించాడు..
అరిచాడు.. అరిపించాడు..
డాన్స్ వేసాడు.. డాన్స్ వేయించాడు..
ఊగాడు.. ఊపు తెచ్చాడు.
ఫైనల్ గా రాక్ చేసి .. షేక్ చేసాడు..

మిగిలిన వాళ్ళు వీలయితే పులి సినిమాతో పోల్చుకొని సహించండీ...
సినిమా బాగుందో లేదో, అసలు నాకు సినిమా చూడటం వచ్చో రాదో కూడా చెప్పలేని నా లాంటి పవన్ అభిమానులైతే భరించండీ..

జై హింద్.

23 comments:

మనసు పలికే said...

ఫస్ట్ కామెంట్ నాదేనా.????? టపా చదివి మళ్లీ వ్యాఖ్య పెడతా:)

మనసు పలికే said...

రాజ్..
భలే రాసావులే.. అచ్చంగా నేను అనుకున్న ప్రశ్నలే:) అర్జున పాత్ర నాకు బాగా నచ్చింది:)
ఇక మైక్ పాత్రం నోరు ఎప్పుడు మూస్తుందా అనిపించింది..;)
>> "పశుపతీ.. అఘోరాధిపతీ" అని అరిచి అదరగొట్టీనవాడిని ఆటలో అరిటి పండు చేసి ఆడుకుంటుంది త్రిష... ;)
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్
>>బాగా ఆకలి గా ఉన్నపుడూ , ఉడకని అన్నం లో ఉప్పులేని పప్పేసుకొని, కమ్మని నెయ్యి కలిపేసుకొని, చికెన్ జాయింట్ నంచుకు తిన్నట్టూ.. రక రకాలుగా ఉంది
దీనికి మామూలు కెవ్వు కాదు.. ఖండాలన్నీ అద్దిరిపోయేలా అరవాలని ఉంది..;)
టోటల్‌గా చాలా బాగా రాసావు రివ్యూ.:)))

హరే కృష్ణ said...

బాబోయ్ డైలాగులు మొత్తం రాసేసావ్ కదా :)

దేవుడు చాలా గొప్పోడు.. డిప్పకాయ మీద పీకి, ఏడ్చే లోపు చేతిలో చాకొలేట్ పెట్టేస్తాడు.

అందంగా లేదని అమ్మనీ, కోపంగా ఉన్నాడని నాన్నని వదిలేస్తామా చెప్పు?

సంపాదిస్తే డబ్బొస్తుంది గానీ సంస్కారం రాదు.

ఇవి నాకు బాగా నచ్చాయి
yes..trivikram made a difference

ఈ పాట చూసి తీన్ మార్ చూసా నచ్చ్సింది
పొరపాటున ఈరోజు మళ్ళీ లవ్ ఆజ్ కల సిస్టం లో చూసా
ఏదైనా ఒరిజినల్ ఒరిజినల్ నే..
సైఫ్ ఆలీ ఖాన్ తో కంపార్ చేయలేం కాని ఇద్దరు డిఫరెంట్ nativity artists తెలుగు లో మాత్రం పవన్ కాకుండా వేరే హీరో న్యాయం చెయ్యలేరు అనేది కాదనలేని నిజం

http://www.youtube.com/watch?v=GAfEZ6Ov2cc
ఇది చూసి తీన్ మార్ చూడాలంటే మళ్ళీ ఏదోలా ఉంది :)

Sravya V said...

వామ్మో రాజ్కుమార్ గారు లాభం లేదు , మీరు సినిమా లు చూడండి , మేము మీ reviews చదివి ఎంజాయ్ చేస్తాం అంతే :D

karthik said...

మైకెల్ రోల్ కొంతలో కొంత భరించగలిగామంటే దానికి కారణం త్రివిక్రం డయలాగులు ... ఇక పవన్ కల్యాణ్ యధావిధిగా స్క్రీన్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలాబావుంది.. మళ్ళీ ఖుషీ రోజులని గుర్తుకు తెచ్చాడు.. అర్జున్ గా వేసుకున్న కుర్తాలు/జీన్స్లు సూపర్ గా సెట్ అయ్యాయి.. నా వరకూ మైకెల్ పాత్ర అసలు నచ్చలేదు.. త్రివిక్రం కాకుండా ఇంకెవరైనా రాసుంటే నేను మొదటిభాగంలోనే బయటికి వచ్చేవాడిని కాబోలు (ఇప్పుడు క్లిమాక్స్ అప్పుడు లేచి వచ్చేశాం;))

త్రిష గురించి ఏం చెప్పకుండా రాయడం బాలేదు రాజ్, త్రిష డ్రస్సులు,మేకప్ అసలు సూట్ అవ్వలేదు.. ఇలానే ఇంకొక 2,3సినిమాల్లో చేస్తే త్రిషకు ఒంటి నిండా బట్టలు కప్పడానికి మనలాంటి వాళ్ళం చందాలు పోగు చెయ్యాల్సి వస్తుంది.. :D

Anonymous said...

చాలా బాగా రాసారు.మొత్తం సినిమాను బాగా విశ్లేషించారు .good

Unknown said...

ఇదిగో రాజకుమారు .. ౩౦ డాలర్లు వెస్ట్ అని వెళ్లకపోవడం మంచిది అయ్యిందేమో అని అనిపిస్తోంది ..

నీ రివ్యు మాత్రం కేకో కేక .. అసలు :) ఎం అంశాన్ని వదలకుండా చించి పీకి ఆరేసి పారేసావ్ పో ..

రకరకాలు గా ఉంది మాష్టారు అంపించే ఉపమానం చాలా బాగుంది .. :) అదే ఉడకని అన్నం లో పప్పేసి చారేసి పీటేసి నెయ్యేసి .. అది :)

స్త్రీలని గౌరవించడం ఆర్ టి సి బస్ ఎక్కి నేర్చుకోవాలి .. ఇంకా :) ..

ఒక్క ముక్కలో చెప్పాలంటే నువ్వు సూపరేహే

Anonymous said...

I hurt with Karthik comments, I want to talk to Nellore pedda reddy right now.

Trisha Fan

ఆ.సౌమ్య said...

కెవ్వు....బ్లాగు లోకపు త్రివిక్రం గా మళ్ళీ నిరూపించుకున్నావ్. చివరి వాక్యాల్లో పంచ్ లు అదిరాయి...ఈలలు, చప్పట్లు.

KumarN said...

"నిజానికి అది ప్రేక్షకులకి నచ్చకూడదని, అది తప్పు అని చెప్పడమే కధ లో మెయిన్ పాయింట్ అనుకోండీ.:) :)
"


"ఓవర్ యాక్షన్ ఓవర్ టైం చేయటం వల్లా"

"ఎండాకాలం లో ఈగలు తోలినట్టూ, సుతిమెత్తగా దోమలు కొట్టుకున్నట్టూ చేతులు ఊపి "

"సినిమా బాగుందో లేదో, అసలు నాకు సినిమా చూడటం వచ్చో రాదో కూడా చెప్పలేని నా లాంటి పవన్ అభిమానులైతే భరించండీ.."

You are awesome :-)

రాజ్ కుమార్ said...

మనసుపలికే గారు.. హా ఫస్ట్ కామెంట్ మీదే.. :)మీ అరుపు వినిపించిందండీ.. ధన్యవాదాలు.

@హరేకృష్ణ యెస్.. ఎన్తైనా త్రివిక్రం పంచ్ లే వేరు.. యెస్..పవన్ తో కంపేరిజన్ లేదు ఎవ్వరికీ.. పవన్ రాక్స్.

శ్రావ్య గారు.. అలాగేనండీ తప్పకుండా.. ధన్యవాదాలు.

కార్తీక్.. నాకయితే రెండూ నచ్చాయి. బట్ మైఖేల్ క్యారెక్టర్ కి కొన్ని చోట్ల చాలా ఓవర్ ఏక్షన్ చేశాడు.అదే నచ్చలేదు. త్రిష కోసం చందాలా?? సూపరు తమరి చందా ఎంతా??

అనానిమస్ గారు నెనర్లు అండీ..

రాజ్ కుమార్ said...

కావ్య గారు.. 30 డాలర్స్?? కొన్ని రోజులు ఆగండీ అందులో సగం మనీ తో ఒరిజినల్ డివిడి కొనుక్కొని చూసెయ్యండీ.

>>స్త్రీలని గౌరవించడం ఆర్ టి సి బస్ ఎక్కి నేర్చుకోవాలి>>

ఇది నేను చెప్పలేదు కదండీ..?. నా పోస్ట్ కన్నా మీ కమెంట్ కేక. thank you very much.

triSha faan gaaru peddaareDDy gaaru daarlo unnaaru... :) :)

సౌమ్యగారు అంతలేదు లెండీ. సినిమా చూస్తే మీకు కూడా బోల్డు కవిత్వం వచ్చేస్తుందీ.. నెనర్లు. ;)

కుమార్ గారు హహహహ్. ధన్యవాదాలండీ.. ః)

..nagarjuna.. said...

వయసు మీదపడుతుందిగా..., ఆ ఈగలు తోలడం కూడా నీరసంగా చేసాడు సినిమాలో.

>>పాల్వాయ్ అని పేరు పెట్టుకొని తెలుగు లో మాట్లాడేది ఒకడూ..

కొంపముంచావు కదయ్యా మగడా.... పాల్వాయ్ అనే ఊరొకటి గుంటురు జిల్లాలో ఉంది.
MLA పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి కూడా ఉన్నాడాయే.

Anonymous said...

You disabled Anon comments initially, I was so depressed that your readers will miss History of Japan, I am happy now, one fine day I can educate your blog readers about Japan.

Happy Blogging.

రాజ్ కుమార్ said...

అవునా నాగార్జునా? సౌండ్ నార్త్ టైప్ లో వినిపిస్తేనూ... అలా ఫిక్స్ అయిపోయా..తప్పయిపోయిందీ. అయినా సినిమా లో వాళ్ళు చేసిన తప్పులతో పోలిస్తే ఈ తప్పు ఓ తప్పే కాదు...
వయసయి పోయిందా?? ఎవరికీ? పవర్(న్) కి వయసయి పోతుందా?? నువ్ మరీ చెప్తావు.. :) ఇంకో పదేళ్ళయినా ఇలాగే ఉంటాడు.

రాజ్ కుమార్ said...

నాగార్జునా కొంపని తేల్చాను.. ఆ లైన్స్ తీసిపారేశా. చెప్పినందుకు చాలా థాంక్స్..:) :)

kiran said...

రాజ్..నేను సినిమా చూడకుండా మీ రివ్యూ చదివా..
అందులో నాకు నచ్చిన కొన్ని dialogues ..:)

కృతి ని చూసి సౌండ్ రాకుండా విజిల్స్ వెయ్యొచ్చు డీసెంట్ గా..మనసులో :) --- (హహహహ్హహ...ఎలా అనిపించిందండి ఇలా :D)

కొందరికి కొత్తగానూ వింతగానూ , కొందరికీ చెత్తగానూ రోత గానూ ఉంటాయి -- (kevvvvvvvvvvvvvvvvvv )

ఇంతకీ సినిమా ఎలా ఉంది? అంటారా? "బాగా ఆకలి గా ఉన్నపుడూ , ఉడకని అన్నం లో ఉప్పులేని పప్పేసుకొని, కమ్మని నెయ్యి కలిపేసుకొని, చికెన్ జాయింట్ నంచుకు తిన్నట్టూ.. రక రకాలుగా ఉంది ".
(ఇన్ని రకాలుగా ఉంటుందని తెల్సిన ఇప్పుడు నేను ఈ సినిమా కి వెల్లాల అనేది నా ధర్మ సందేహం.. :))

శ్రావ్య గారు చెప్పినట్లు మీరు ఇలాగె బోలెడు సినిమాలు చూసేసి రివ్యూ లు రాసేయండి...:)

వేణూశ్రీకాంత్ said...

రివ్యూ నీ స్టైల్లో అదరగొట్టేశావ్ రాజ్.. జస్ట్ ఉతికి ఆరేశావ్ అంతే :-)))
సినిమా గురించి చెప్పిన ఉడకని అన్నం లైన్ కేక..
డబ్బింగ్ విషయంలో నాక్కూడా అస్సలు నచ్చలేదు.. పంటికిందరాయిలా ఇబ్బందిపెడుతూనే ఉంది చివరిదాకా.. కారణాలేవైనా అది క్షమించరాని నేరం.. అదీ త్రివిక్రం డైలాగ్స్ రాసిన సినిమా విషయంలో అసలు క్షమించలేం..
ఇటాలియన్ మాట్లాడటం గురించి ఒకరిద్దరు రివ్యూలలో కూడా ఆక్షేపించారు.. నాకు సబబే అనిపించింది.. తమిళియన్ ఐనా.. ఉండేది ఆఫ్రికా అయినా.. అతను పని చేసేది ఇటాలియన్ రెస్టారెంట్ లో.. అక్కడి ఇటాలియన్ వంటవాళ్ళతోనే పవన్ ఇటాలియన్ మాట్లాడాడు.. అది చూసి పడిపోయిన హీరోయిన్ తో కూడా మాట్లాడాడు అంతే అందులో తప్పేం లేదు.
చివరి అరగంట డైలాగ్స్ మరియూ ఎమోషన్స్ యొక్క ఎఫెక్ట్ రివ్యూల మీద ఎక్కువ పడిందనిపించింది నాకు.. అందుకే 3.25 లు ఇచ్చి బోర్డర్ లో నిలబెట్టారేమో..

భాస్కర రామిరెడ్డి said...

ఓర్నీ ఇది తెలుగు సినిమానా??? నేను ఈ మధ్య బ్లాగుల్లో ఈ టైటిల్ చూస్తున్నా కానీ ఏదో హిందీ సినిమా సూపర్ వున్నట్టుందనుకొన్నానే కానీ తెలుగు సినిమా అని బల్బే వెలగలేదు ఈ టపా చదివేదాకా :-(

రాజ్ కుమార్ said...

కిరణ్ గారు.. ధన్యవాదాలు. అలాగే.. ప్రయత్నిస్తా..

వేణూజీ..థాంక్యూ..థాంక్యూ..

>> ఇటాలియన్ వంటవాళ్ళతోనే పవన్ ఇటాలియన్ మాట్లాడాడు.. అది చూసి పడిపోయిన హీరోయిన్ తో కూడా మాట్లాడాడు అంతే అందులో తప్పేం లేదు>>

అవునండీ తను ఇటాలియన్ లో మాట్లాడటం తప్పు కాదు కరెక్టె.. బట్ ఆ సీన్ ని అంతసేపు సాగదీయడం మాత్రం మింగుడు పడదు..

మీరు ఖుషి సినిమా లో చూస్తే అందులో కూడా హిందీ లోనూ, బెంగాలీ లోనూ మాట్లాడుతాడు చాలా సీన్ల లో
బట్ ఇలా లెంథీ సీన్లు ఉండవు.. అందుకే అక్కడ పండిన సీన్లు... ఇక్కడ పుచ్చి పోయాయి.. :) :)

అవును చివర అరగంట చాలా వరకూ సినిమాని పైకి లేపిందీ..
ధన్యవాదాలు.. ;) ;)

శివరంజని said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

అబ్బా ఇన్ని డైలాగులు ఎలా గుర్తుపెట్టుకున్నారండి ???చాలా బాగా రాసావు రివ్యూ.:)))

శ్రావ్యా గారు మనం సినిమాలు మానేసి రాజ్ కుమార్ గారి రివ్యూ లు చదివేద్దాం ... సినిమా ఎలాగు కళ్ళకి కట్టినట్టు చెబుతున్నారు కాబట్టి మనకి బోలెడు డబ్బులు కలిసివస్తాయి

Sai Praveen said...

సినిమా చూసాక నాకు ఎలా రకరకాలుగా అనిపించిందో సరిగ్గా అలాగే రాసావు నీ రివ్యూలో.
ఇక నీ పంచ్ ల గురించి మళ్లీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు :)

Sai Praveen said...

అన్నట్టు, నాకు సినిమా చూస్తుండగా రెండు సీన్లలో పిచ్చి పిచ్చిగా నవ్వొచ్చింది.
ఒకటి సినిమా మొదట్లో హీరో, హీరోఇన్లు పబ్ నుంచి బయటకి వచ్చాక కార్ దగ్గర జరిగే సీన్. నాకు హిందీ సినిమా స్టొరీ తెలీదు. 'లవ్ ఆజ్ కల్' అనే టైటిల్ ఉన్న సినిమాలో ఇలాంటి సీన్ ఉంటే పర్లేదు కాని , తీన్ మార్ అనే టైటిల్ చూసి, సినిమా ఎలా ఉంటుందో ఊహకి అందక బ్లాంక్ మైండ్ తో హాల్లో కూర్చున్న నాకు ఆ సీన్ కొంచెం వింతగా అనిపించి ఎందుకో కానీ విపరీతంగా నవ్వొచ్చింది :D
ఇక రెండోది త్రిష పెళ్లి తరవాత బయటకి వచ్చి పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి మాట్లాడే సీన్. అక్కడ త్రిష పరిస్థితి చూసి నాకు వెంటనే ఒక పాట గుర్తొచ్చింది. "కోడి బాయె లచ్చమ్మదీ.... కోడి పుంజు బాయె లచ్చమ్మదీ...." :)