ఫిజిక్స్ లో గుడ్ కండక్టరూ, బాడ్ కండక్టరూ, సెమీ కండక్టరూ అని చదువుకున్నాంగా? అలాగే బస్ కండక్టర్ లలో కూడా ఈ రకాలు కనిపిస్తారు పరిస్థితులని బట్టీ. బస్సు రష్ గా ఉన్నప్పుడూ కండక్టర్ టికెట్లు కొట్టొచ్చే లోపు అతని సీట్ ఆక్రమించి సేద తీరేవారినీ,పక్కనే కూర్చొని మచ్చిక చేసుకొనీ స్టాప్ లేకపోయినా కావల్సిన దగ్గర బస్సు ఆపించుకుని దిగే వాళ్లనీ, "మావయ్య ఒళ్ళో కూర్చోరా నాన్నా కాసేపు" అని పిల్లోణ్ణి కండక్టర్ మామయ్య కి తగిలించే లౌక్యం తెలిసిన అమ్మలనీ చూసే ఉంటాం.
ఇలాంటివి గాక నాకు బాగా గుర్తుండిపోయి, తలచుకున్నప్పుడు నవ్వొచ్చేవీ, నొచ్చుకునేవీ కొన్ని అనుభవాలు.
"తొందరగా పద నాన్నా.. లేటయితే హెడ్ మాస్టారు నిన్ను కొట్టేస్తారూ" అని నాన్న చెయ్యి పట్టుకొని బుద్దిగా స్కూల్ కి వెళ్ళేరోజులు. (క్లాస్ లో మాస్టారు పిల్లల్ని కొట్టినట్టే, స్టాఫ్ రూం లో హెడ్ మాస్టారు, మాస్టర్లని కొట్టేస్తారని మన ఫీలిన్గు)
ఒకసారి నేనూ, మా తమ్ముడూ అమ్మమ్మ తో కలిసి ఊరెళుతున్నాం. నన్ను పక్కన కూర్చోబెట్టుకొనీ, తమ్ముణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొనీ, "వైజాగ్ ఒక ఫుల్లూ, ఒకా ఆఫూ" అంది. "అమ్మమ్మా.. నాకో టికటూ?" అన్నాడు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి మా తమ్మి. కండక్టర్ కూడా అదే ఎక్స్ప్రెషన్ పెట్టీ కళ్ళెగరేశాడు.
అమ్మమ్మ : ఇంకా మూడే యేడు నిండలేదు బాబూ.
తమ్ముడూ : అమ్మమ్మా నాకు మొన్నే నాలుగేళ్ళు నిండిపోయాయి. కావలిస్తే అన్నయ్యనడుగు. ఎందుకు అబద్దం చెప్తావ్?
అమ్మమ్మ : నువ్ నోర్ముయ్యరా ఎదవ కానా.. ఎలకపిల్లంత బరువుండడండీ వాడికీనా?
" మూడేళ్ళు దాటితే తియ్యాలమ్మా...పిల్లోడు చెప్తున్నాడుగా " అని టికెట్ చించి చేతిలో పెట్టాడు. కండక్టర్ చేసింది కరెక్టే అయినా "దొంగ సచ్చినోడు"అని వినపడేటట్టు తిట్టింది అమ్మమ్మ ఎందుకోమరి. :) :)
------------------------------------xxxx-----------------------------------------------------------------
జేబులో రెండు రూపాయలుంటే వాటికి ఎన్ని "ఆశ" చాక్లెట్ళొస్తాయీ? ఎన్ని ఊరేసిన ఉసిరికాయలొస్తాయీ? ఎన్ని ఆరేసిన మామిడి తాండ్ర ముక్కలొస్తాయీ?" అని లెక్కలేసే రోజులు అవి.
ఫుల్ టికెట్ తెసుకునే వయసొచ్చేసినా, భూమికి బెత్తెడుండీ, నుదుట ఆంజనేయస్వామి బొట్టెట్టుకోనీ , నెత్తికి నూనె రాసుకొని, నలిగి పోయిన నిక్కరేసుకొని, "అమాయకుడు" అనే బోర్డ్ మెళ్ళో వేసినట్టూ ఉండే నేను ఎప్పుడు బస్సెక్కినా కండక్టర్ తో "హాఫ్ టికెట్" అని గర్వం గా చెప్పేసి దర్జాగా కూర్చునే వాడిని , మిగిల్చిన డబ్బులు అమ్మ చేతిలో పెట్టీ, "నువ్వే దాచుకో" అనే మాట వినపడగానే జీళ్ళుమామ్మ కొట్ళో వెరైటీలన్ని స్లో మోషన్ లో స్క్రోల్ అవుతుంటే మెరిసేవి నా కళ్ళు. కానీ అన్ని రోజులూ నావి కావనీ, అందరు కండక్టర్లూ ఒకలా ఉండరని అర్ధమయ్యిందో రోజు.ఆ రోజు ఎప్పటీ లాగానే బస్సెక్కి "హాఫ్ టికెట్" అన్నాను. కండక్టర్ నా వైపు చూసి "ఏమ్ చదువుతున్నావ్?" అన్నాడు. ఊహించని ఆ ప్రశ్న కి అదిరిపడీ రెండు క్లాస్ లు తగ్గించి చెప్పా. "నిజం చెప్పు.. నువ్ మా అబ్బాయితోనే గా చదువుతున్నావ్? మనూళ్ళో నన్నెప్పుడూ చూడలేదా? ఫుల్ టికెట్ తీస్కోవాలి గా?" అని అడిగేసరికీ చికెన్ షాప్ లో బ్రాయిలర్ కోడి దొరికినట్టూ దొరికేసానని అర్దమయిపోయిందీ. అలా నాకు హాఫ్ టికెట్ నుండి ఫుల్ టికెట్ కి ప్రొమోషన్, నా పాకెట్ కి డిమోషన్ వచ్చిందన్నమాట. నాకు నచ్చక పోయినా మంచి కండక్టరే కదా? :)
--------------------------------------------xxxx---------------------------------------------------
ఇంట్లో ఏమీ ఎరగనట్టో బ్యాగ్ భుజానేసుకొని బయల్దేరిపోయి కాలేజ్ సెలవు ప్రకటించేసి, " ఏ సిన్మాకెళదాం" అని బస్సెక్కాక డిసైడయ్యే రోజులవి.
కానీ అందరు కండక్టర్లూ కూడబలుక్కున్నట్టూ టికేట్ అనగానే బస్ పాస్ లు చూపించే మాపై కత్తి కట్టినట్టూ, మమ్మల్ని సీట్లలోంచి లేపేసి టికేట్లు తీసుకున్న పాసింజర్స్ని కూర్చోపెట్టేవారు. ఎంత దారుణం?? ఏమిటీ అన్యాయం? ఎన్నాళ్ళూ?? ఎన్నేళ్ళూ?? నాలోని విప్లవ కారుడు నిద్రలేచి, పళ్ళు తోముకొని, క్లోజప్ ఆడ్ లో మోడల్ లాగా "హ....హా" అనుకొని, నా తోటి ఉద్యమకారుల్తో ఆ బ్యాడ్ కండక్టర్ తో గొడవెట్టుకున్నాడు.
నేను : ఏం పాసింజర్స్ వస్తే మేం ఎందుకు నించోవాలి? మమ్మల్ని ఫ్రీ గా తీసుకెళ్తున్నారా? మా బస్ పాస్ లు ఫ్రీ గా ఇస్తున్నారా? డబ్బులిచ్చే పాస్ లు తీసుకుంటూన్నాం. మాకు హక్కుందీ.. హక్కుల్ని కాలరాయొద్దు.. (తీన్ మార్ లో అర్జున పాల్వాయ్ టైప్ లో.)
కండక్టర్ : అవును.. డబ్బులిస్తున్నారు. ఎంతా? పదికి మూడు రూపాయలు. స్టూడెంట్స్ కి దాదాపు 7౦% రాయితీ ఇస్తుందీ ప్రభుత్వం. యేటా కోట్లు నష్టం మీకిచ్చే డిస్కోంట్ వల్ల A.P.S R.T.C కి. ఇప్పటికే ప్రతీ అడ్డమైన గొడవకీ తేరగా దొరికేవి ఈ ఎర్ర బస్సులే.మీరు ఎక్కినా ఎక్కక పోయినా మాకు ఒరిగేది లేదు. ఎవడూ పట్టించుకోడు. అలా అని మిమ్మల్ని ఎక్కొద్దూ అనటం లేదుకదా?. టికెట్ తీసుకునే పాసింజర్స్ కి సీట్ లేకుంటే బస్సెక్కరు. ఆటొలు ఫుల్లు.. మా కలెక్షన్ నిల్లు. కలెక్శన్ నిల్లయితే మీ రూట్లొ సర్వీసులు తగ్గించేస్తారు. నష్టపోయేది మీరే కాదు, జనాలు కూడా. ఎప్పుడూ మీ స్వార్ధమే చూసుకోవద్దు.
నేను : స్టాలిన్ సినిమాలో చిరంజీవీ, పెదరాయుడు సినిమాలో మోహన్ బాబూ, గణేష్ సినిమా లో వెంకటేష్ బాబూ కలిసొచ్చి క్లాస్ పీకుతుంటే, మెడ వాల్చేసి , నోరు తెరిచేసి , కళ్ళు తేలేసిన క్యాండిడేట్ లా మొహం పెట్టి.........
ఆరోజు కండక్టర్ పీకిన క్లాస్ విన్నట్టూ , క్లాస్ లో లెస్సన్స్ వినుంటే ఈ పాటికి నేను ఐన్ స్టీన్ అంత గొప్పోణ్ణి అయ్యి అమెరికా లో సెటిల్ అయ్యేవాడిని.హ్మ్మ్.. ఇతనూ గుడ్ కండక్టరే..
----------------------------------------------xxxx------------------------------------------------------
డబ్బులు నీళ్ళలా ఖర్చు పెట్టడం కాదు.. నీళ్ళకోసం రోజూ డబ్బులు ఖర్చుపెడుతున్న రోజులివి..
బెంగుళూరు బీ.ఏమ్.టీ.సీ కండెక్టర్ల గురించి ఒక్కమాట లో చెప్పాలీ అంటే, వీళ్ళు ప్లగ్ లో వేలెట్టీ స్విచ్ ఆన్ చేసినా షాక్ కొట్టదు. అంత బ్యాడ్ కండక్త్గర్లు. :) :) (అవును ఇది అతిశయోక్తి నే. అందరూ కాదు... చాలా మంది.)
బస్సెక్కీ మినిమం చార్జ్ కూడ ఇవ్వకుండా నెక్స్ట్ స్టాప్ అని నమ్మకం గా చెప్పీ, రెండ్రూపాయలు చేతిలో పెడితే చాలు. మన మొహం ఒకసారి చూసి డబ్బులు జేబులో వేస్కొని పోతారు.ఇంకొంత మంది ఉంటారు. నెక్స్ట్ స్టాప్ అని పది రూపాయల నోట్ చేతిలో పెడితే టికెట్ ఇవ్వకుండా చేతికందిన చిల్లర రూపాయలు మర్యాదగా చేతిలో పెట్టేస్తారు మహానుభావులు. ఇది మామూలు కక్కుర్తి. వీళ్ళవల్ల లాభాలే కానీ సాధారణంగా పెద్ద ప్రోబ్లంస్ ఏవీ ఉండవ్ ఎప్పుడైనా స్క్వాడ్ వస్తే తప్ప. అప్పుడు సుబ్బరం గా తిట్లు తినేసి, చక్కగా ఫైన్ గా కట్టేసుకోవచ్చు :) :)
కానీ ఇంకొంత మంది ఉంటారు పది రూపాయల టికెట్ కి Rs100 నోట్ ఇస్తే, వాడి దగ్గర చిల్లరున్నా సరే Rs90 కి చీటీ రాసిస్తాడు. మనం దిగిపోయేటప్పుడు అడిగితే విసుక్కుంటూ జేబులో సెపరేట్ గా పెట్టిన డబ్బులు లెక్క కూడా పెట్టకుండా ఇస్తాడు. మరిచిపోతే అంతే సంగతులు చిత్తగించవలేను. పొద్దున్న ట్రిప్ కి అయితే చిల్లర లేదని సరి పెట్టుకోవచ్చు , రోజులో ఆఖరి ట్రిప్ అయినా చిల్లర (ఇక్కడ చిల్లర అంటే Rs50 పైన అయినా సరే ) లేదంటారు, చీటీ రాసిస్తారు. "ఫైవ్ రుపీస్ ఇల్లా సార్" అంటారు దిగిపోయేముందు అడిగితే. ప్రతీ రోజూ ఇదే తంతు. వాల్వో బస్సుల్లోనూ ఇదే గోల. తిరిగి డబ్బులివ్వాలంటే తిమ్మిరెక్కి పోతాయి చేతులు. అ టైం లో జ్వరమొచ్చినట్టూ వళ్ళు మండిపోయీ, నాటు సారా మరిగినట్టూ రక్తం మరిగిపోయీ, కళ్లకలగలొచ్చినట్టూ కళ్ళు ఎర్రబడిపోయీ,బఠాణీలు కొరుకుతున్నట్టూ పళ్ళు పట పటా కొరికేసి "ఎవడి సొమ్మని దోచేస్తార్రా? ఒక్కరూపాయి తక్కువిస్తే నువ్ టికెట్ ఇస్తావా? "అని అరవాలనిపిస్తుందీ. ఎన్ని సార్లు, ఎన్ని ఐదులు, ఎన్ని పదులు నావీ, నాలాంటి ఎంతమందివి ఎగిరిపోయాయో? దిగిపోయేటపుడు హడావిడీ, ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళ మధ్య గుర్తుండదు కదా.. ప్చ్.. ఇది కక్కుర్తి కాదు. దోపిడీ. గడిచిన మూడు సంవత్సరాలలో వీలైనంతా వేసేద్దాం అనే కండక్టర్ లని వందల మందిని చూస్తే, చిల్లర లేదని తన రూపాయిని వదులుకోడానికి సిద్దపడ్డ కండక్టర్ ని ఒకే ఒక్కణ్ణి చూశాను. హ్మ్మ్....
(పోయిన వారం శ్రీ రమణ గారు రాసిన "గుత్తొంకాయ కూర - మానవ సంబంధాలు" పుస్త్సకం మొదలెట్టాను. రోజూ జరిగే విషయాలను, చుట్టూ ఉండే రక రకాల మనుషులతో, వస్తువులతో మన సంబంధాలని ఎంత బాగా రాశారో కదా అనిపించిందీ. పుస్తకం సగం చదివాక ఇవన్నీ గుర్తొచ్చాయి. బరకడానికి బ్లాగుందీ.. పబ్లిసిటీ ఇవ్వడానికి అగ్రిగేటర్లున్నాయి. చదివి అక్షింతలు వెయ్యడానికి చదువరులున్నారు కదా అనీ... ఇలా పోస్ట్ పెట్టానన్న మాట :))
36 comments:
1 st comment..??????
రాజ్‌కుమారూ.. కెవ్వు కెవ్వు.. చాలా బాగా రాసావు. చాలా చాలా రాయాలని ఉంది వ్యాఖ్యలో. నాకు కూడా కొన్ని ఙ్ఞాపకాలు ఉన్నాయిలే. తీరిగ్గా రాస్తాను ఇంకో కామెంటులో..
kummesav raj..
బరకడానికి బ్లాగుందీ.. పబ్లిసిటీ ఇవ్వడానికి అగ్రిగేటర్లున్నాయి. చదివి అక్షింతలు వెయ్యడానికి చదువరులున్నారు కదా అనీ
ROFL.. taggaddu asalu :D
Wow ! too good !
Excellent topic and amazing narration! Really good!
great narration raj
entra bagundoooo..happy ga anipinchindi.
Good narration :-)
తోటరాముడు, గలగలా గోదారి, బులుసుగారు, శివరంజని, రాజ్ కుమార్.......
ఇంకా ఏమైనా మిస్సయ్యానా ?
చాలా బావుంది రాజ్...ఎంత బావుందో చెప్పలేను...అద్భుతంగా రాసావు. ఇంత టేలెంట్ పెట్టుకుని ఇన్నాళ్ళు బ్లాగు పెట్టకుండా దాక్కుని తిరిగావు. నువ్వు రాసిన విధానం, ఈ టాపిక్ అన్నీ బావున్నాయి. నీ చెమక్కులు సరే సరి...చెప్పక్కర్లేదు, బ్రహ్మాండంగా పేలాయి.
ఇలాగే ఇంకా ఇంకా బాగా రాస్తూ ముందుకి సాగిపో.
వహ్వా రాజ్ కుమార్ శభాష్.
నాగార్జున గారి లిస్ట్ లో నా లాంటి వాళ్ళు బ్లాగు మూసేసుకోని ఇంటికి వెళ్లిపోవాలను కుంటాను, మీరింత బాగా వ్రాసేస్తుంటే.
అసలు physics ఏ బాడు..అందులో మళ్ళి ఈ రక రకాల కండుక్టర్లు..ఏమిటో..
మిమ్మల్ని హాఫ్ టికెట్ గా గుర్తించలేదని మీరు ఫీల్ అయ్యారు..నేను నన్ను ఫుల్ టికెట్ గా గురించట్లేదని ఫీల్ అయ్యాను..:D
ఇక బెంగుళూరు బస్సులు..కండుక్టర్ ల గురించి same ఫీలింగ్..నేను ఒక 2 డ్రెస్ లు కొనుక్కునే దాన్నేమో..:)..బస్సులు ఎక్కక పోయుంటే..:)
మనసుపలికే గారూ హా మీదే..హహహ. మీకు థాంకులు,థాంకులు. తొందరగా రాసెయ్యండి మరి.;)
అలాగే కార్తీక్.. అస్సలు తగ్గను.. అట్లీస్ట్ ట్రై చేస్తాను.
Sravya gaaroo.. thank you very much..
సుజాతగారూ ధన్యవాదాలండీ.. మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందీ.
@శివ thanQ.. ;D
ప్రణీతగారూ, శ్రీ కాంత్ గారూ నా బ్లాగు స్వాగతం. ధన్యవాదాలండీ..
నాగార్జునా.. హహహ్హ.. అంతలేదులే. నెనర్లు..
సౌమ్యగారొ..నెనర్లు..నెనర్లు.. అలాగే..చంద్రబాబు టైప్ లో ముందుకు పోతాను.
బులుసుగారూ.. మీరు అలా అనకూడదండీ నాకు పాపం తగుల్తుందీ. మీ మొదటీలైన్ మాత్రమే స్వీకరిస్తున్నా. మీ రేంజ్ లో రాసెయ్య గలగాలని ఆశీర్వదించండి చాలు :) :) :)
కిరణ్ గారూ.. హహ అవునండీ ఎవరి రిక్వైర్మెంట్ళు వాళ్ళవీ..ఏమ్ చేస్తాం? రెండు డ్రెస్ లా? నేను రెండూ ఆటోలు కొనుక్కునే వాడిని ః) ః) ధన్యవాదాలండీ.
బారాశావు రాజ్ కుమారూ! ఇంతకీ ఇక్కడ బ్లాగులో వేణూరాం అని పిలవాలా, రాజ్ కుమారనా....ః)....
nice narration and framing....
బాగుంది రాజ్ :) కుమ్మేస్తున్నావ్ పోస్ట్లు :)
హ హ్హ :)
కేవ్వ్వ్!
నా భావాలు ఇక్కడ.
http://pureti.blogspot.com/p/blog-page_4643.html
మీ పోస్ట్ ఎంత బాగుందంటే మీ బ్లాగ్ లో కామెంట్ పెడదామని వచ్చానా............. వీళ్ళందరూ నేను కామెంట్ ఇస్తానంటే నేను కామెంట్ ఇస్తానని.......... నన్ను వెనక్కి తోసేసారు ..
ఆ అప్పు పిల్ల ఉంది చూసారు రాక్షసి ........ తనే ఫస్ట్ కామెంట్ పెట్టాలని నన్ను తోసేసి ముందుకు వెళ్ళిపోయింది
మీ బ్లాగ్ లో కామెంట్ పెట్టడానికి ఇన్ని రోజుల నుండి క్యూలో నిలబడ్డాను ... ఈ రోజుకి ఆ అవకాశం దొరికింది
సూపర్ గా రాసారు ...ఇక రోజు రోజు కి ఈ క్యూ పెద్దది అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
నాగార్జున గారు ఆ లిస్టు లో నన్ను చూసుకుని స్పృహ కోల్పోయాను ...ఇప్పుడెలా ??????
కౌటిల్య గారు.. ధన్యవాదాలు.. మీ ఇష్టం..ఎలా పిలిచినా పలుకుతా.. :) :)
హరే.. థాంక్యు.. వెరీ మచ్ ;)
Venhu గారు.. బావుందండీ మీ పోస్ట్. నాకు మీ టెంప్లేట్ లో అక్షరాలు కనిపించటం లేదండీ. సెలక్ట్ చేసుకోవలసి వస్తుంది.కామేంట్ బాక్స్ కూడా కనిపించటం లేదు.. :( :( ధన్యవాదాలు.
శివరంజని గారూ.. అవునాండీ.. హిహిహిహి
క్యూ నా?అంత సీన్ లేదులేండీ.. మీరు లేట్ గా వచ్చారంతే.. కానీ బాగా కవర్ చేసుకుంటున్నారు..
>..ఇక రోజు రోజు కి ఈ క్యూ పెద్దది అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను>
అలాగే..కోరుకోండీ కోరుకోండీ. ;)
ధన్యవాదాలండీ..
చాలా బాగా రాసావు రాజ్. నేరేషన్ చాలా బావుంది. ఇక నీ పంచ్ లు మాములే :)
నిన్ను ఇంత inspire చేసిన పుస్తకం చదవాలని ఉంది. ఇండియా వచ్చాక కొని చదువుతాను.
రాజ్ కుమార్, నీకోటి చెప్పనా, నువ్వు టపా ఓ మాదిరిగా ఎప్పుడు రాశావో అని తెలుసుకోవాలి అంటే దానికి మొద్దు గుర్తు నీ చుట్టూ ఉండే నీ బ్లాగు రెగ్యులర్ పాఠకులు కాకుండా కాకుండా బయటివాళ్ళు ఎప్పుడైతే కామెంట్ పెడతారో అదిగో అదే గుర్తు, అప్పటివరకూ నీ టపాలు సూపరు, డుపరు కేక, కెవ్వు అని వచ్చిన కామెంట్లు అన్నీ ఉత్తినే తూచ్ కేసులు.
నాకు ఈ టపా బొత్తిగా నచ్చలేదు అక్కడక్కడ నీ మార్క్ చెణుకులు తగిలినా.
కండక్టర్ల గురించి మీరు పరిశీలించిన విషయాలు బాగున్నాయి. ఎలాంటి విషయమైనా మీ స్టైల్లో నవ్విస్తూ చెప్పడంలో మీకు మీరే సాటి!
అక్కకి తగ్గ తమ్ముడు మీరు.. :))
బావుందండీ . మీ బ్లాగ్ చదవటం ఇదే మొదటిసారి అనుకుంటా !
సాయీ.. థాంక్యూ వెరీ మచ్.. తప్పకుండా చదువు. ;)
మధురవాణి గారు హహహ ఎక్కువగా చెప్పేస్తున్నారు. ధన్యవాదాలండీ..
లలిత గారు నా బ్లాగు కి స్వాగతం.. మీకు నచ్చినందుకు, నన్ను మెచ్చినందుకూ ధన్యవాదాలు
Who is your sister sir?
Too good narration with excellent punches.
raj bavundi:)
ఈ పోస్టు నేను మిస్ అయ్యాను .. ఎందుకు ఏమిటి ఎలా ..
నువ్వే నాకు సమాధానం చెప్పాలి ఫస్టు
సెకండు ... రజనీకాంత్ బొమ్మ పెట్టావా .. నేనిక సూపర్ స్టార్ గురించి రాస్తావని ప్రేపరే అయిపోయాను ..
కాని నువ్వు టాపిక్ మార్చేసావ .. - దీనికి సమాధానం చెప్పు
తర్డు - నీ కష్టాలు కన్నీళ్ళు చదువుతూ .. గట్టిగ నవ్వేసి .. గాజు గ్లాసు కింద పడేసాను ..
ఇప్పుడు నాకు కొత్త గ్లాస్ ఎవరు కొనిపెడతారు - దీనికి సమాధానం చెప్పు ..
నా ప్రస్నాలన్నింటికి సమాధానం చెప్పాకే మల్లి పోస్ట్ రాయాలి ఆ
క్లోసే అప్ యాడ్ లో లాగానా ?? కుషి లో పవన్ కళ్యాణ్ లాగానా ?? హ హ అన్నది :D
రిషి గారు, జీవనిగారు ధన్యవాదాలండీ..
కావ్య గారు.
౧.ఏమో నాకు తెలీదు.. తప్పు మీదే
౨. వేరే ఏమ్ దొరకలేదు
౩. మీరే పడేసారు కాబట్టే మీరే కొనుక్కోవాలి.
హహహ.. ధన్యవాదాలండీ.. ;)
భయ్యా......కొత్త సినిమాల మీద రివ్యూ రాయకుంటే చాలా రోజుల అయ్యింది ఒకసారి ఆ వైపు కూడా ఓ లుక్కెయి...
భయ్యా......కొత్త సినిమాల మీద రివ్యూ రాయకుంటే చాలా రోజుల అయ్యింది ఒకసారి ఆ వైపు కూడా ఓ లుక్కెయి...
Hi raaj,
i really enjoy a lot to read ur blog.
Will u plz tell me where can i get గుత్తొంకాయ కూర - మానవ సంబంధాలు by sree Ramana
Post a Comment