నేను.. నా రాక్షసి.
పూరీ జగన్నాద్ డైరెక్షన్ లో ఆలీ, ముమైత్ ఖాన్ హీరో హీరోయిన్లు గా , సుబ్బరాజు సైడ్ హీరో గా, ఇలియానా విలన్ గా, రానా కమెడియన్ గా చేయగా సాధారణ ప్రేక్షకులని పిచ్చోళ్ళు గా చేసే వెరైటీ మరియు సందేహాత్మక సందేశాత్మక ప్రేమ కధా చిత్రం. ఏమిటీ తేడా తేడా మాట్లాడుతున్నాడనుకుంటున్నారా? ఇప్పుడే చూసొచ్చాను కదా.. కొంచెం తిక్క తిక్క గా ఉంది.అయినా పైన చెప్పిన లైన్ లో కొంత వరకూ నిజం లేక పోలేదు. :)
"Is a suicide permanent solution..for a temporary problem.????? " ఆత్మహత్య నేరమా? అది అర్ధం లేని పనా? లేకా ఆ పరిస్థితుల్లో వారి మానసిక పరిస్తితిని, సంఘర్షణ ని వేదన ని దృష్టిలో పెట్టుకుంటే తప్పు కాదేమో? ఆవేశం లో తొందరపాటుతో చేసుకునే ఆత్మహత్యలకీ, ఆలోచించీ ఎప్పుడు ఎలా చావాలో డిసైడ్ అయ్యి చేసుకునే ఆత్మహత్యలకీ తేడా ఏమిటి? ఆత్మహత్యలు అర్ధరహితం కాదు. ప్రతీ బలవన్మరణం వెనకాలా ఒక బలమైన కారణం ఉంటుంది. బలవంతం గా చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి. మరి అదే ధైర్యం బ్రతకడానికి ఎందుకు వాడరు? ఈ సినిమా తీయబడింది ఈ పాయింట్స్ మీదనే..!
ఈ సినిమా కి
"చావగొట్టి చచ్చిపో... "
"చావు.. చంపు",
"నేన్ చచ్చిపోతా.",
" నీ చావు చూస్తా... అందరికీ చూపిస్తా.."
"చచ్చిపో....."
ఈ టైటిల్స్ లో ఏదైనా పెడితే సరిగ్గా ఉండేదని నా ఫీలింగ్.
"కధ తెలుసుకోమూ.. మేము సినిమా చూస్తాం" అని అనుకున్న వాళ్ళు ఈ పేరా చదవొద్దని సవినయం గా మనవి చేసుకుంటున్నా..
కాళ్ళొచ్చిన కుతుబ్ మినార్ కళ్ళద్దాలు పెట్టుకొని నడిచోచ్చినట్టూ ఉండే మన హీరో "రానా" అతడు సినిమా లో మహేష్ బాబు లాగా కాకుండా చీప్ & బెస్ట్ గా మర్డర్లు చేస్తూ పొట్ట పోసుకుంటూ ఉంటాడు. మనోడు గన్ షూటింగ్ లో ఒలంపిక్స్ కి సెలెక్ట్ అవుతాడు. ఆ ఎక్స్పీరియన్స్ ఇలా వాడుకుంటూ ఉంటాడు. మన మెరుపు తీగ ఇలియానా ఖాళీగా ఉన్నప్పుడు కేఫ్ లో పనిచేసుకుంటూ.. మిగిలిన టైం లో ఆత్మ హత్యలు చేసుకునే వాళ్ళ వీడియోలు తీసి యుట్యూబ్ లో పెట్టి పండగ చేసుకుంటూ ఉంటుంది. ముఖానికి ముసుగేసుకొని వెళ్లి, చనిపోయే ముందు వాళ్ళెందుకు చనిపోతున్నారు? ఎలా చనిపోవాలనుకున్టున్నారు ? లాంటి ప్రశ్నలేసి ఏదీ మిస్సవ్వ కుండా వీడియో తీస్తుంది (బాగా తేడా కాండిడేట్).సో ఇద్దరికీ "షూటింగ్" అంటే ఇష్టం అన్నమాట. కానీ ఈ సంగతి తెలీక కేఫ్ లో చూసి లవ్ చేస్తాడు హీరో. ఒకానొక దశ లో హీరో కి తొక్కలో జీవితం అని ఫీలయ్యి చచ్చిపోదాం అని డిసైడ్ అయ్యి, నెట్లో హీరోయిన్ కి ఇంటిమేట్ చేసి, పొడుచుకు చచ్చిపోడానికి పక్కాగా ప్లాన్ చేసుకొంటాడు. లైవ్ కవరేజ్ చెయ్యడానికి హీరొయిన్ ముసుగేసుకొని వెళ్తాది. ఇంటర్వ్యూ అయిపోయాక, ఆత్మహత్యా ప్రయత్నం చేసాక కాసేపటి లో పోతున్నాను అనే టైం లో , హీరొయిన్ మొహం చూసి అవాక్కయ్యి , తన కోసమన్నా బ్రతకాలనుకుంటాడు. అదే విష్యం చెప్తే..(నన్ను హాస్పిటల్ కి తీస్కేళ్ళూ.. .బతికిన్చూ.. అని బతిమాలుకుంటాడు పాపం )." నా పని షూటింగ్ తియ్యడమే..నిన్ను కాపాడడం కాదు.. అయినా నేను చావమంటే చస్తున్నవా? " అని చావు కబురు చల్ల గా చెప్పి మెల్లగా జారుకుంటాది. అసలు వీడెందుకు జనాలని చంపుతున్నాడు? ఎందుకు చావాలనుకున్నాడు? అదెందుకు చావులు షూట్ చేస్తూ సైకో లాగా తిరుగుతుంది? తనుకూడా ఎందుకు చావాలనుకుంటుంది? ఇద్దరూ కలిపి మనల్నెందుకు చంపుతున్నారు? సమాధానం ఇంటర్వల్ లో వచ్చేయ్యకుండా ఉంటే... క్లైమాక్స్ లో తెలుస్తుంది. మూడు ముక్కల్లో చెప్తే అదీ కథ.
రానా యాక్షన్ ఓకే. పూరీ సినిమాలో హీరో ఎలా ఉంటాడో అలాగే ఉండటానికి ట్రై చేసాడు. తన వాయిస్ బావుటుందని లీడర్ సినిమా లో నే తెలిసింది గా.. ఇందులో కూడా డైలాగ్స్ బాగా చెప్పాడు. కానీ పాటల్లో మాత్రం పవన్ కళ్యాన్ ని ఆదర్శం గా తీసుకొని హీరొయిన్ ఎనకాల నడుస్తూ బండి లాగించేసాడు. ఒక పాటలో డాన్స్ లాంటిది వేసి సూపర్ స్టార్ కృష్ణ ని , ఫ్యామిలీ స్టార్ జగపతి బాబు ని, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నీ గుర్తుకు తెచ్చాడు.
ఇలియానా సూపరు. కిక్ సినిమా లో ఎలా ఉందో దాదాపు అలా ఉంది. మొదటి రెండు పాటల్లో రచ్చ రచ్చ అంతే. తనవరకూ బాగానే చేసింది కూడా. అందం గా చూపించాడు ఇలియానాని మన పూరీ. :) :)
పోలిస్ ఆఫీసర్ గా సుబ్బరాజు రొటీన్ గా ఓకే. సుబ్బరాజు కూతురు గా చేసిన చిన్న పిల్ల భలే ముద్దుగా ఉంటుంది. ఆ అమ్మాయి ఉన్న సీన్లు, తన డైలాగ్స్ బాగుంటాయి. ఇక "ఆలీ- ముమైత్ ఖాన్ " జంట చేసే కామెడీ ట్రాక్ పరిశుద్దమైన కల్తీ లేని చెత్త. భయంకరమైన బూతు కామెడీ. సినిమా మొదటి నుండీ చివరిదాకా మధ్య మధ్య లో వచ్చి చిరాకు, కంపరం,కోపం, వగైరా వగైరా పెడతారు (నరకం చూపెడతారు ). పూరీ సినిమాల్లో ఈ ఆలీ సెంటిమెంట్ మూలంగా బాగున్న కొంచెం సినిమా కూడా భ్రష్టు పట్టి పోతుంది. ఎప్పటికి ఆపుతాడో ఏమో.. :(. "రక్త చరిత్ర " బుక్కారెడ్డి ఈ సినిమాలో పరమ భయంకరమైన పార్ట్ టైం విలన్. రొటీన్ గా క్లైమాక్స్ లో హీరో చంపేసి పగ తీర్చుకుంటాడు.
గుర్తున్న కొన్ని డవిలాగులుః
౧. ఆడది ప్రేమిస్తున్నా అని చెప్పినంత కాలం మగాడు మోసం చేస్తూనే ఉంటాడు.
౨. నువ్వెవ్వడివో నాకు తెలీదు. నా సంగతి నీకస్సలు తెలీదు.. దొబ్బెయ్ .
౩ "ఐ లవ్ యు " ఆంటే అదొక పాకేజ్. అందులోనే ఇష్టాలు, కష్టాలు, సుఖాలు, షాపింగ్ లు , ఇదీ, అదీ అన్నీ ఉంటాయి.
౪. ఏనుగు కి , దోమ కి తేడా ఏమిటి? దోమెళ్ళి ఏనుగు మీద వాలుతుందీ కానీ ఏనుగొచ్చి దోమ మీద వాలలేదు.
౫. ఆత్మహత్యలు షూట్ చేసిన నిన్ను లోపల పెట్టారు.. మనుషుల్ని షూట్ చేసిన నేనేమో బయట తిరుగుతున్నాను.
సినిమాలో కామెడీ తక్కువ. ఫైట్స్ ఓకే. ఫస్ట్ హాఫ్ కొన్ని ఆసక్తికరమైన సీన్ లతో, కొంచేం కామెడీ తో, కొత్తగా బాగానే ఉన్నట్టు అనిపిస్తుందీ.పడితినమ్మో(ఈ పాట సూపర్ గా ఉందీ. FYI.. ట్యూన్ కొట్టుకొచ్చారు. :)) , మళ్ళీ మళ్ళీ మెరుపులా, సాంగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఇలియానా ఇరగ. :) మామూలుగా సెకండ్ హాఫ్ బ్యాంకాక్ లో ప్లాన్ చేస్తాడు గా మన పూరీ జన్నాధం ?? ఈ సినిమా కి వీనస్ కి మార్చాడు. కొత్తగా ఆలోచించాడు కదూ.. ! అది పక్కనెడితే సెకండ్ మాత్రం సినిమాని సాగదీసి, చూసేటోళ్ళని చావగొట్టాడు. కానీ ఇదే సినిమాని ఈ చెత్త కామెడీ, అనవసరపు పాటలూ, ఫైట్లూ తీసి పారేసి, నిడివి తగ్గించి తీసుంటే ఒక ప్రయోగాత్మక చిత్రం గా బావుండేదేమో అనిపించింది నాకయితే. క్లైమాక్స్ లో హీరోయిన్ ఆత్మహత్య చేసుకోవటం, దాన్ని హీరో షూట్ చెయ్యడం, అది చస్తుంటే, తట్టుకోలేక వీడు కూడా ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యటం, దాన్నిమళ్ళీ షూట్ చెయ్యటం, ఇవన్నీ చూసీ అసలు డైరెక్టర్ గారి ఉద్దేశ్యం ఏంటో బోధపడలేదు నాకు. ఫైనల్ గా చెప్పేదేమిటి? ఆత్మహత్యలు చేసుకోవటం తప్పనా? లేక పర్లేదు సిచువేషన్ డిమాండ్ చేస్తే చేస్కోవచ్చనా?
ఫైనల్ గా ఏం అనిపించిందంటే.. "ఎంత పని చేసావురా జగన్నాధం... చావగొట్టి చెవులు ముయ్యకుండా గూబ గుయ్యిమనిపిస్తావా?.. హ్మ్మ్..!"
సర్వం జగన్నాధం..!
27 comments:
బాబోయ్ ఆ కాన్సెప్ట్ ఏంటి ..
చదివితేనే కడుపులో దేవింది .. నీకెన్ని సార్లు చెప్పిన ఇలాగే చేస్తావ్ ..
ఆరోగ్యం పాడయిపోదు .. :)
సుత్తిలో సినిమా .. పూరి జగన్నాధ్ అంటే ఉన్న కొద్ది ఇంటరెస్ట్ కూడా పోయింది .. దీనికంటే గోలీమార్ ఏ కాస్త బెటర్ అనుకుంట .. :)
నీ రివ్యు కేకో కేక :)
కాళ్లోచ్చిన, వీనస్ కి మార్చాడు.
How abt "చచ్చిపోదాం రా!"?
:D :D
soooper review... keep it up
మొదటి లైను అదరహో..!! :)..నేను మూడు సార్లు చదివి కిందకి వచ్చాను..:)
>>>కామెడీ ట్రాక్ పరిశుద్దమైన కల్తీ లేని చెత్త.--- :D
పాపం మీరు dilalogulu కూడా బాగా వెతికి వెతికి రాయల్సోచ్చినట్లుంది :)
మీరు వెళ్ళే ప్రతి సినిమా ఇలాగె ఉండాలని...మీ రివ్యూ ల అభిమానిగా కోరుకుంటున్నా.. :P
హ హ సినిమా ఏమో కానీ నీ రివ్యూ కేక :) కాళ్ళొచ్చిన డైలాగ్ అదుర్స్ :)
:))
హ హ మీ review బావుందండి ! మీరు చెప్పినదాని ప్రకారం స్టొరీ line బానే ఉన్నట్లుంది .
డైరెక్టర్ గారి ఉద్దేశ్యం ఏంటో బోధపడలేదు నాకు. ఫైనల్ గా చెప్పేదేమిటి? ఆత్మహత్యలు చేసుకోవటం తప్పనా? లేక పర్లేదు సిచువేషన్ డిమాండ్ చేస్తే చేస్కోవచ్చనా?
----------------------------
హ హ ఇది రాంగోపాల్ వర్మ దగ్గరి నుంచి కాపీ కొట్టాదేమో , ఎవరు ఎలా తీసుకుంటే అలా అని :D
కావ్యగారు.. కాన్స్పెప్ట్ బాగానే ఉందండీ.. కొన్ని సీన్లు బాగానే తీసాడు. కానీ చెడగొట్టాడు అనిపించింది నాకయితే..
అనానిమస్ గారు.. అర్దంకాలేదు.. ;) ;)
Indian Minerva గారు.. మీ టైటిల్ సూపరు.. హహ్హహ.. నా బ్లాగ్ కి స్వాగతం. ధన్యవాదాలు..
లాహిరిగారు.. ధన్యవాదాలండీ.. ;)
కిరణ్ గారు..
>>>మీరు వెళ్ళే ప్రతి సినిమా ఇలాగె ఉండాలని..>>>
తప్పుకదండీ..? నేనేం పాపం చేశాను? హిహిహిహి
నెనర్లు..
వేణూజీ.. థాంకులు..థాంకులు..
శ్రావ్య గారు.. అవునండీ..
కానీ ఎంతయినా ఆ గురువు కి శిష్యుడే కదా? మీరు చెప్పింది కొంత వరకూ కరెక్ట్... ఈ సినిమాకి పబ్లిసిటీ డిజైనర్ "రామ్ గోపాల్ వర్మ" అంట. ;) ;)
నెనర్లు.
శరత్ గారూ.. నా బ్లాగ్ కి స్వాగతం.. ధన్యవాదాలు
రివ్యూ బాగా రాశారు. నేను వరుసగా రెండువారాలు శక్తి, తీన్మార్ లకు బలయ్యాను కాబట్టి ఆత్మహత్యలపర్వం బావున్నట్టే అనిపించింది. అదియును ఆలీ ట్రాక్ దక్క.
కొన్ని కామెంట్లు.
విలన్ అభ్మన్యుసింగ్: ఇదివరకు రక్తచరిత్రకు పాచ్ వర్షన్.
రానా వాయిస్ : చావుబతుకుల్లో ఉన్న మిత్రుణ్ణి పరామర్శిస్తున్నట్టుగా ఉంది. చిలిపి సన్నివేశాల్లో కూడా.
సుబ్బరాజు: తీరూతెన్నూ చూసి నూకరాజువనుకున్నా.వీర్రాజువటోయ్ సుబ్బరాజూ!
రానా డాన్సు: నేననుకున్నదే చెప్పారు. కృష్ణ + గజపతిబాబు + రాజశేఖర్ మూడు పార్శ్వాలను చూపెట్టాడు.
ఇలియానా డికృజ్: నడుము మీద కాన్సంట్రేట్ చేయాలో నటనను చూడాలో ప్రేక్షకుడికి కాస్త కన్ ఫ్యూజన్. నేను నటనకే ఫిక్సయ్యా.
పాటలు: చాలా కాలం తర్వాత ’తెలుగు’ వినిపించింది. తమిళ మహదేవన్ గొంతులో. అయినా పర్లేదు. ఓకే.
మ్యూజిక్: బేక్ గ్రవుండ్ మ్యూజిక్ సుర్రు సిమ్మైపోయింది. అంటే సూపరో సూపర్ అని. పాటలు రెండు మూడు సూపర్.
కథ: కొత్తప్రయోగం. వెల్కమిద్దాం.
కథనం: హిందీ సినిమా ముక్కలు, ఇదివరకు వచ్చిన సినిమా ముక్కలు కలిపి రుబ్బలేదు. సంతోషించాలి.
రవి గారు... ముందుగ నా బ్లాగ్ కి స్వాగతం..
మీ కామెంట్ కేకండీ. నా రివ్యూ ని మీ కామెంట్ డామినేట్ చేసేసిందీ..
పది లైన్ లలో సినిమా రివ్యు రాసి పడేశారుగా..!అరుపులు.. హహహహ్...
ధన్యవాదాలండీ...
>>కాళ్ళొచ్చిన కుతుబ్ మినార్ కళ్ళద్దాలు పెట్టుకొని నడిచోచ్చినట్టూ ఉండే మన హీరో "రానా"
ఇది సూపరు. మీ రివ్యూ చదివిన తరువాత ఆ సినిమా చూసే ధైర్యం చేయను. చూస్తే నేను ఆత్మహత్య చేసుకోవాలేమో.
:))
we are safe
no release here :)
Your unique style of writing reviews, is not just creative but also extremely entertaining.
Thank you and keep writing more
నేను..నా శాడిస్ట్
ఇదెలా ఉంది.. (హీరో ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఇల్లూ చెప్పిన మాటలకి నాకనిపించిన టైటిల్)
ముందుగా నేను చెప్పొచ్చేదేమిటంటే, నేనింకా సినిమా చూడలేదు కాబట్టి,ఈ సినిమా గురించి ఎటువంటి వ్యాఖ్యలు చెయ్యబోను:))
బాబూ రాజ్‌కుమార్.., ఇక నీ రివ్యూ విషయానికొస్తే.. ఆహా.. ఓహో.. ఏమి కంపారిజన్లు. "కాళ్ళొచ్చిన కుతుబ్ మినార్ కళ్ళద్దాలు" ఈ పోలిక చూస్తే రానా అక్కడికక్కడ తన కాళ్లు అడ్డంగా నరికేసుకుంటాడేమో..;) హిహ్హిహ్హీ..
ముసుగు ముసుగు అంటున్నావు..? కొంపతీసి నువ్వు పెట్టిన ఫోటోలో ముసుగులేనా అవి..? ఆ ముసుగులకే జనాలు ఎవరో తెలీకుండా పోతారా..?
ఇలియానా డైలాగు "నా పని షూటింగ్ తియ్యడమే..నిన్ను కాపాడడం కాదు" ఉంది చూసావూ.. ఆహా అద్భుతం..;)
"కామెడీ ట్రాక్ పరిశుద్దమైన కల్తీ లేని చెత్త" హిహ్హిహ్హీ.. కెవ్వు కెవ్వు...
మొత్తంగా నీ రివ్యూ కేకో కేక..:D
:) బాగుంది.. పైన చెప్పినట్టు నేను 'తీన్ మార్, శక్తి ' చూసి ఉన్నందున, అంత కన్నా కష్టపడమేమో చూద్దాం.. అనుకున్నా కానీ.. మీ రివ్యూ చూసాక అభిప్రాయం మార్చుకున్నా..
అసలు నీ టేలెంట్ ని నేను ఊహించలేకపోతున్నా రాజ్...కెవ్వు కేక అంతే. సూపరుగా రాసావు.
"పూరీ జగన్నాద్ డైరెక్షన్ లో ఆలీ, ముమైత్ ఖాన్ హీరో హీరోయిన్లు గా , సుబ్బరాజు సైడ్ హీరో గా, ఇలియానా విలన్ గా, రానా కమెడియన్ గా చేయగా"....ఇది నాకు బలే నచ్చేసింది. రాత్రి పూట తేజ లో ఫిల్మ్ న్యూస్ వస్తుంది, వాళ్ళు ఇలాగే చెబుతారు... ఫుల్స్టాప్ లేకుండా ఒట్టి కామాలాతో ఓ అరగంట చెబుతారు.
కాళ్ళొచ్చిన కుతుబ్ మినార్...హహహ్హ...
నువ్వు సూచించిన మిగతా టైటిల్స్ చాలా బావున్నాయి.
చివరి ముగింపు వాక్యం....చింపేసావు పో.
నీ స్టైల్ మాత్రం నిజంగానే unique, keep it up!
gooooooooooood review, oka roju mundu rayakudu, naaku money migilevi chudakunda
రాజ్ గారు,
రివ్యూ అదిరిపోయింది....
నేనొకటే డిసైడయ్యా...మీ రివ్యూ చూడకుండా కొత్త సైన్మ చూడనంతే....
బులుసు గారు... హహహ.. చేసుకోనక్కర్లేదండీ.. జస్ట్ వెళితే చాలు... ;) నెనర్లు..
హరే.. బ్రతికిపోయావ్..హహ్హా.. ;)
కుమార్ గారూ.. నా బ్లాగ్ కి స్వాగతం.. ధన్యవాదాలండీ..
గిరీష్ గారూ.. సూపరండీ..
"నేను..నా శాడిస్ట్" కేకా... థాంక్యూ... ;)
మనసుపలికే గారూ..
హా.. ఆ ఫొటొలో పెట్టిన ముసుగులే... ఇంకా అలాంటి వింతలు శానా ఉన్నాయి..హిహిహిహిహ్
ధన్యవాదాలండీ..
బీకే గారూ... నా బ్లాగ్ కి స్వాగతం.
కొత్తస్టొరీ ని ప్రోత్సహిద్దాం అనుకుంటే ఒకసారి చూడండీ.. థీం అయితే బాగానే ఉందీ.. బట్ చెడగొట్టాడు అనిపించిందీ..
థాంక్యూ అండీ.
హహ్హ శివగారూ.. ఏం చేస్తాం పరిస్ఠితుల ప్రభావం వల్లా ఒకరోజు లేట్ అయ్యాను.. థాంక్యూ...
సుధా గారు.. అయ్యో.. అలా అనెయ్యకండీ.. నేనేమీ పరిశుద్ద ప్రేక్షకుడిని కాదు కదా. నాకు నచ్చనివి కొందరికి నచ్చవచ్చు.. నా మాట విని ఒక కొత్తరకమైన సినిమా అనుకొని చూసెయ్యండీ.. ;)ః)
ధన్యవాదాలు.
సౌమ్యగారూ.. హిహిహిహి ఏదో మీ అభిమానం... ;) ;) ఆ తేజా టీవీ యాంకర్ ని దృష్టి లో పెట్టుకునే రాసాను.. సరిగ్గా క్యాచ్ చేసారు మీరు.
నెనర్లు అండీ..
nayana bayamkaram poori cinima ani pothe appadamchesesadu.youth ki mind lo yemi pettalanukunnadu bahusa atmahatyalu yela chesukovalaa ani anukunta.review meeru rasi naku srama thagginchaaru.
కాన్సెప్ట్ వింటే interesting గానే ఉంది. కాని చెడగోట్టాడు అన్నావు కదా. హ్మ్మం
పూరి కొన్ని విషయాల్లో నాకు నచ్చుతాడు. కాని చాలా విషయాల్లో చిరాకు తెప్పిస్తాడు.
నీ రివ్యూ మాత్రం ఎప్పటి లాగే కేక!!
సినిమా ఇప్పుడే చూసాను. అవ్వగానే ఎందుకో నీ రివ్యూ గుర్తొచ్చి ఇలా వచ్చాను :)
అలీ , ముమైత్ ఖాన్ స్క్రీన్ మీద కనిపించగానే పరమ చెత్త సీన్లు చూడాలి అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను కాబట్టి భరించగాలిగాను :) నిజం చెప్పాలంటే ఏక్ నిరంజన్ చూసినప్పుడు వచ్చినంత చిరాకు రాలేదు. [ నేను ఇంకా దారుణమైన దిగజారుడు కామెడీకి ఫిక్స్ అయిపోయానులే. ఏక్ నిరంజన్ ఎఫెక్ట్ :) ]. ఒక్క చోటైనా ఆత్మ హత్య తప్పు అన్నట్టు చూపిస్తాడేమో అని చూసాను. ఎక్కడా లేదు. ఎంత సేపు దాని వెనక బలమైన కారణం ఉంటుంది అన్నట్టే చూపించాడు కానీ బలహీనమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు చిన్న చిన్న కారణాలకు కూడా ఆత్మ హత్య ప్రయత్నించవచ్చు అన్న విషయం దర్శక మహాశయులకు తెలియదో తెలిసి వదిలేసారో మరి.
ఏదేమైనా కొత్త ప్రయోగం. నువ్వన్నట్టు చెత్త కలపకుండా దీన్ని గంటన్నర సినిమాగా తీసి ఉంటే ఇంకా బావుండేది.
నేను ఇప్పుడే కాసేపు గోలీమార్ అన్న సినిమా చూసి, ఇంక పీ.జగన్నాథ్ సినిమాలన్నీ చూసి తీరాలని తీర్మానించుకున్నాను. ఈ విషయం గురించి, నా తెగువ గురించి ఒక ప్రెండుతో మాట్లాడుతూండగా మీ బ్లాగు గుర్తువచ్చి ఇక్కడికి వచ్చాను. మీరు మళ్ళీ ఇక్కడ కెవ్యూలు రాయాలని, మాబోటి ప్రవాసాంధ్రులను ఉద్దరించాలని కోరుకుంటూన్నాను!!
Post a Comment