Wednesday, January 18, 2012

అప్పిగాడి ఆగడాలు!

సినిమా పోస్టర్ కి మైదా పిండి లాగా, చిరిగిన కాగితానికి తుమ్మ జిగురు లాగా , చితికిన నా జీవితాన్ని చిత్తడి చేయడానికి నన్ను అతుక్కున్న అప్పలరాజు గాడూ, వాడి లీలలూ చెప్తానన్నానుగా... అన్నీ కాదు. కొన్ని వదులుతానూ.. ఊకొట్టండీ..!

ది 2008. ప్రధమార్ధం..!

కార్పొరేషన్ సర్కిల్  లో నేనూ, సుధాకర్ గాడూ, శివ గాడూ, అప్పల్రాజు గాణ్ణి వెంటేసుకొనీ కావలసిన అడ్రస్ కోసం కలతిరిగేస్తున్నాం.  పొద్దున్న తిన్న పులియోగరే అరిగిపోయిందనుకుంటా కళ్ళు తిరుగుతున్నాయ్, కాళ్ళు మా వల్ల కాదనేస్తున్నాయ్.  ఒక Y జంక్షన్ దగ్గర ఆగిపోయి ఎటువెళ్లాలా అని ఆలోచిస్తూ ఎవణ్ణడగాలా అని చూస్తున్నాం.
అప్పల్రాజుగాడు "ఎటువెళ్ళినా ఒకటే రా.. లెఫ్ట్ తీసుకోండీ" అనేసీ యుద్ధం లోంచి పారిపోయొచ్చిన వీరసైనికుడిలాగా కవాతు చెయ్యటం మొదలెట్టాడు. మేమంతా అనుమానంగా ఫాలో అయ్యాం. ఒక అరగంట నడక తర్వాత మా ఎదురుగా నిలువెత్తు గోడ అడ్డంగా నిల్చొనుంది.

మేమంతా అనుమానానికి అసహ్యాన్ని యాడ్ చేసి మా వాడి వైపు కౄరంగా చూసేసరికి "అంటే కాకినాడ లో కూడా ఇలాగే Y జంక్షన్ ఉంటాది రా.. ఏ రోడ్ తీసుకున్నా ఒకే ప్లేస్ కి వెళ్తాది. ఇది కూడా అలాగే అనుకున్నాను" అన్నాడు.
శివగాడుః ఏంట్రా... కాకినాడ లో ఇలాంటి రోడ్డే చూశావా? బెంగుళూర్ లో అదే లాజిక్ అప్లై చేశావా? యూ ఇడియట్, స్టుపిడ్ ఆంత్రాక్స్, మ్యాట్రిక్స్ ఇన్సెప్షన్*&$@)*)%#_#((@+౬౦౪౫౬౨

సుధాకర్: ----------------- [ఈడికి కోపమొస్తే... ఇలాగే సైలెంట్ గా ఉంటాడు కానీ కదిపితే కింగ్ కాంగే]

"వ్యాకరణానికీ, గ్రామకరణానికీ తేడా తెలీని ఘనుడివి కదరా నువ్వూ. ఆ ముక్క తెలిసీ నీ వెనకాల నడిచాం చూశావా..! మా పేర్లు అప్పల్రాజు అని మార్చుకోవాలి" అని మనసులో అనుకొనీ, ఈ టార్చర్ నాకెప్పుడు మొదలయ్యిందా అని ఆలోచిస్తూ, ముందుకి అడుగులు వేస్తూ కొన్నేళ్ళు వెనక్కి నడిచాను.
**********************************************************************************

మోకాళ్ల మీద వరకూ నిక్కరేసుకొనీ, ఊడిపోయిన చొక్కా బొత్తాల ప్లేస్లో పిన్నీసు పెట్టుకొనీ, జామెట్రీ బాక్సు జేబులో పెట్టుకొనీ, చెక్క స్కేలు చేత్తో పట్టుకొనీ, తెలివైన తింగరి అవతారానికి కలర్ జెరాక్స్ లాగా ఉండే నేను, ఖాళీ టైమ్ లో క్లాస్ ని శాసిస్తున్న రోజులవి.

ఈ టీచర్లున్నారు చూశారూ.. ఎవడయినా కూసింత చురుగ్గా ఉండీ, అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే చాలు వాడికి లీడర్ పదవి కట్టబెట్టేస్తారు. పోష్ గా C.P.L అని కూడా పిలుస్తారు. ఇంటికి పెద్ద కొడుకుగా పుట్టినోడికి ఎన్ని కష్టాలుంటాయో, క్లాస్ కి లీడర్ గా పెట్టబడ్డోడికీ అన్నే కష్టాలుంటాయ్. పాయింట్ల వారీగా చెప్తానూ పద్ధతిగా వినండీ.

1. లీడర్ అనేవాడు అల్లరి చేయటం అనే కనీస హక్కుని అడుగు గొయ్యి తీసి కప్పెట్టెయ్యాలి. [బాధ్యతల్ని ఏకరువు పెట్టీ హక్కుల్ని తొక్కిపట్టడం అనేదీ బాగా ఆకలేసిన రోజున ఉపవాసం చేయించడం లాంటిది.అది అనుభవిస్తేనే తెలుస్తాది ]

2. ఖాళీ పిరియడ్ లో క్లాసంతా కూర్చుంటే లీడర్ మాత్రం కదులుతున్న శిలావిగ్రహం లాగా నించొనీ, గోల చేసేవాళ్ల పేర్లు రామకోటి రాసినంత శ్రద్ధ గా రాయాలి.
3. కొంతమంది క్లాస్మేట్స్ మాష్టారి చేతిలో తాపులు తిండానికన్నా రెడీ గా ఉంటారు గానీ C.P.L మాట వినేటప్పుడు సీతయ్యలుగా మారిపోతారు. అలాంటప్పుడు పీకేదేమీ లేదని బాధపడకుండా గంభీరమయిన ఎక్స్ప్రెషన్ ని మైంటైన్ చెయ్యాలి.
4. యూనీఫార్మ్ వేసుకురానోళ్ళ దగ్గర ఫైన్ కలెక్ట్ చేసీ, ఆ డబ్బుల్తో చాక్ పీస్ లూ, డస్టర్లూ, చార్ట్ లూ కొనాలి.
5. ప్రతీ రోజూ బ్లాక్ బోర్డ్ మీద డేట్ మార్చాలి. క్లాస్ అయ్యాక్ బోర్డ్ క్లీన్ చెయ్యాలి.
6. మేష్టారో మేడమ్ గారో చెప్పిన పనులన్నీ చెయ్యడానికి పక్కోడికి చాన్స్ ఇవ్వకుండా పరిగెత్తుకెళ్లాలి.
7. షరా మామూలుగా క్లాస్ ఫస్ట్ రావాలీ, అందరికీ ఆదర్శం గా ఉండాలి.


అలా పైన పేర్కొన్నవన్నీ పద్దతిగా చేసుకుంటూ, బాలకార్మిక వ్యవస్థకి ప్రతీక గా నిలబడుతూ, కాళ్ళుపీకినప్పుడు కూర్చుంటూ కాలాన్ని వెళ్లదీస్తూ కృంగి కృశిస్తున్న రోజులు.

నేనుః ఒరే.. సత్తిబాబూ, వెంకటేషూ యూనిఫార్మ్ ఏసుకురాలేదేం? ఫైన్ కట్టండి అద్దద్దిరూపాయ్.(అర్ధ రూపాయ్ + అర్ధ రూపాయ్ = అద్దద్దిరూపాయ్. నా తలకాయ్ సంధి)

సత్తి(జేబులు తడుముకుంటూ) : ఏదీ? నా రూపాయేదీ? నా డబ్బులెక్కడో పడిపోయేయ్ బాబోయ్. ఒరే దాసూ.. నా రూపాయ్ పడిపోయింది ఎక్కడైనా చూహేవా?
[ఆ రోజు నేను చాలా సేపు వెతికాను. ప్చ్.. కనిపించలేదు. అలా నేను ఫైనడిగిన ప్రతీ సారీ పారేసుకునేవాడు పాపం. ప్రతీసారీ నేనే వెతికేవాడిని. ఒక్కసారీ కనిపించలేదు :-(  ]

వెంకటేష్: అదేంట్రా.. నేనే కదా నిన్న నీకు ఐసిప్పించేనూ..? ఫ్రెండ్షిప్ కి వేల్యూ లేదురా..
[నేను ఫ్రెండ్శిప్ కోసం ఫైనొదిలేసే మనిషిని అని వాడికి తెలుసని నాకు తెలీదు అప్పటిదాకా]

నేనుః ఓయ్.. రాజేశ్వరీ.. యూనీఫార్మ్ ఏసుకురాలేదేం?
రాజేశ్వరిః ఈ రోజు నా బర్త్ డే.
నేనుః ఎన్ని సార్లు చేసుకుంటావ్? ఈ నెలలో ఇది మూడోసారి.
రాజేశ్వరిః మరి రెండోసారే ఎందుకు అడగలేదూ? చేతిలో చాక్లెట్ పెడితే తొక్క తీసి తినుకుంటా పోతావేం?
నేనుః  ఇదిగో అదంతా నాకనవసరం.. ఫైన్ కడతావా కట్టవా?
రాజేశ్వరిః ఫైనా? మీ తాతొచ్చి కడతాడు ఎల్లెహే..!
నాగమణిః పాపం ఆడికో అద్దిరూపాయ్ ఇచ్చీవే రాజేస్రీ.. లేకపోతే ఇక్కడే ఏడుపు మొదలెడతాడు.
రాజేశ్వరిః  ఆడికేనా నోరుందీ? లక్ష్మీ మేడమ్ దగ్గరకెళ్ళి లీడరు నా జడట్టుకు లాగాడని నేనూ ఏడుత్తాను.
నేనుః ................ ??? [ఇది అన్నంత పనీ చేసే రకమే]
రాజేశ్వరిః ఏరా ఎల్లిపోతున్నావ్? ఫైనొద్దా?
ఇంకా ఏవో చాలా చాలా అడిగింది కానీ నాకేమ్ వినిపించ లేదు.
అప్పుడే కొన్న సెవనోక్లాక్ బ్లేడ్ తో పెన్సిల్ చెక్కేటప్పుడున్నంత జాగ్రత్తగా అమ్మాయిల్తో ఉండాలని అర్ధమయ్యిమ్ది..

ఇంతలో చింతచెట్టు నీడన సైకిల్ స్టాండేసీ, స్టైల్ గా తలదువ్వుకొనీ, టిఫిన్ బాక్స్ లోంచి ఏదో తీసీ, ఎవరికీ పెట్టకుండా తినేసీ, సెన్స్ లెస్ స్మైలిస్తూ క్లాస్ లోకి ఎంటరయ్యాడు అప్పల్రాజుగాడు. నేనడిగే లోపలే ఐదురూపాయలు నా జేబులో పెట్టీ, "వచ్చే వారం కూడా యూనిఫార్మ్ లో రాను" అనేసెళ్ళి కూర్చున్నాడు.
డ్రెస్ కోడ్ కంపల్సరీ అయిన ఆగస్ట్ 15 న అందరూ తెల్లచొక్కా, నీలం నిక్కరూ వేసుకొస్తే (మా బళ్ళో అదే డ్రెస్కోడ్) అప్పిగాడు మాత్రం బ్లూ జీన్సూ, వైట్ టీషర్ట్  లతో వచ్చి రేంజ్ చూపించే రాజు....అప్పల్రాజు.
వినడానికీ, అనడానికీ ఆడ్ గా ఉంటాది గానీ అప్పిగాడి మనసు మంచిదీ, గుణం గుడ్డిదీనూ. నోటితో అడిగితే చేత్తో చెప్పేటైపు. ఎవడి జోలికీ వెళ్ళేవాడు కాదు. వాడి జోలికొస్తే వెనకా ముందూ చూడకుండా బాదేసేవాడు. ఈ మోటు సరసం వల్లా, ఒక మోస్తరు బలుపు వల్లా అందరితోనూ కలిసేవాడు కాదు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx------xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
ఆ రోజు మా స్కూల్లో గెడ్డం బాబు గారి పుణ్యమా అని "పచ్చదనం - పరిశుభ్రత" లో భాగంగా మా చేత బలవంతం గా
"శ్రమదానం" చేయిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో "తరలుదాము రండి మనం జన్మభూమికీ..ఆ..ఆ..ఆ" అని
వందేమాతరం శ్రీనివాస్ గోళ్ళు గిల్లుకుంటూ, గొంతు చించుకుంటూ అరుస్తున్నాడు.
అమ్మాయిలందరూ చెట్టుకింద చింతబొట్టలేరుకుంటూ, రాత్రి ఈటీవీ లో చూసిన "ఇంటింటీ భాగోతం" సినిమా స్టోరీ చెప్పుకుంటుంటే, మేము మాత్రం మా హెడ్మాస్టర్ "వెంకట్రావ్" మాష్టారి పర్యవేక్షణ లో పచ్చని పిచ్చిమొక్కలు పీకి
స్కూలంతా శుభ్రం చేస్తూ, గెడ్డంబాబు గారిని ఎవడికొచ్చిన తిట్లు వాడు పక్కోడికి వినిపించకుండా తిట్టుకుంటున్నాం. అప్పల్రాజు గాడు మాత్రం నాకు వినపడేలా.. "ఏటాయ్ ఈ ఎదవ గోల? మా ఇంటి దగ్గర నేను సైకిల్ దిగితే స్టాండెయ్యడానికి కూడా మా పాలికాపు ని పిలుస్తాను. నా చేత ఇక్కడ నానా చాకిరీ చేయిస్తున్నారు.చేతులు చూడు ఎలా అయిపోయాయో... నేనెళ్ళిపోతున్నా" అన్నాడు.

"దేనికన్నా తెలివుండాల్రా అప్పిగా.. నన్ను చూడు ఒకే మొక్క పీకీ, దాన్ని చేతిలోనే ఉంచుకొనీ గంట నుండీ ఏక్ట్ చేస్తున్నా"... అని నవ్వుతా అటు పక్కకి తిరిగి చూసేసరికీ, మా సర్ నా వైపే సీరియస్ గా చూస్తూ, నడుచుకుంటా వస్తున్నారు. ఇటు పక్క అప్పల్రాజు గాడు లేడు.

అటు చూస్తే ఆయన వేగం పెంచి కడుపుతో ఉన్న పెద్దపులి లాగా పరిగెత్తుకొస్తున్నారు. "ఈ రోజు నాకు అప్పడప్పడ తాండ్రే" అనుకొని కళ్ళు మూసుకున్నా. నేను కళ్ళు తెరిచి  చూసే సరికీ అప్పిగాడికీ, సార్ కీ రన్నింగ్ రేస్ జరుగుతా ఉంది.  తారాజువ్వ వీపుకి కట్టుకున్నాడేమో అన్నట్టూ అప్పల్రాజు గాడూ, వాడి వెనకాల రోడ్ రోలర్  కి రాకెట్ ఇంజన్ బిగించారేమో  అన్నట్టూ మా సారూ పరిగెడుతున్నారు.



విషయం ఏంటంటే మా వాడు గోడ దూకి పారిపోబోతుంటే, సార్ చూసేశారు.
కంగార్లో ఎటు దూకాలో తెలియక  మళ్ళీ స్కూల్ కాంపౌండ్ లోకి దూకేశాడు.... ప్రపంచం చాలా చిన్నది కదా... అందులో మా ప్లేగ్రౌండ్ ఇంకా చిన్నది. అప్పిగాడికి ఆయాసం ఎక్కువ, మా సార్ కి స్టామినా ఎక్కువ.
ఫైనల్ గా ఏం జరిగిందో నేను చెప్పక్కరలేదు కదా..
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx------xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

బోరు బావి లో బతికున్న కప్పలాంటి నేను ఇంటర్మీడియట్ చదువు వెలగబెట్టడానికి &)౧ *&$*@ కార్పొరేట్ కాలేజ్ లో కాలెట్టాను. నాతో పాటూ అప్పిగాడూ అడుగెట్టాడు. మహేష్ బాబు %& పోయించడానికి ముంబై వెళ్ళినట్టే, పిల్లకాయల చేత పోయించడానికి మా ఫిజిక్స్ సార్ రోజూ కాలేజ్ కి వచ్చేవారు.
ఆయన కాంచన సినిమా త్రీడీలో చూపించేసే టైపని తెలియని మేమూ, మొదటి రోజు ఆయన క్లాస్ చెప్తుంటే.....

అప్పిః ఈడేంట్రా.. చేతబడులు చేసేవాడు సివిల్ డ్రెస్ లో వచ్చి, మలయాళ మంత్రాలు చదువినట్టూ ఇలా వాయించేస్తున్నాడూ?ఎప్పుడువదులుతాడూ?

నేనుః గట్టిగా అనకురోయ్... ఇతను చాలా స్ట్రిక్ట్ అంటా.
అప్పిః తొక్కలేరా.. అటుపక్కో లుక్కెయ్యి. మన పక్క రో లో అమ్మాయి కేకెహే..
[ఆ అమ్మాయ్ కి వినపడిందో ఏమో ఒక సారి చిరాగ్గా చూసీ, చటుక్కున కోడి తిప్పినట్టూ తల తిప్పేసుకుంది.]
అప్పిః ఎంత పొగర్రా? బాబు బలిసినోడయితే కూతురికి కొవ్వెక్కక ఉంటాదా? తోలు తెల్లగా ఉంటే తిక్క తలకెక్కకుంటాదా?[కొంచెం ఆవేశంగా]

నేనుః నువ్వీరోజు ముంచేసేలా ఉన్నావొరేయ్. కంప్లైంటిచ్చిందంటే......
అప్పిః ఎహే ఆడేం చేస్తాడూ? మనం ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్. నాకు నిన్న రాత్రే కొమ్ములు మొలిచినట్టూ కలొచ్చింది కూడా. నీకింకా పిల్లబుద్ధులు పోలేదు. ఇదిగో నా జేబు లో చూడు.
నేనుః ఎందుకురా ఇంత డబ్బు జేబులో పెట్టుకొచ్చావూ?
అప్పిః  ఓట్లు పడని పార్టీ, తిట్లు రాని పొలిటీషియన్,హిట్లు లేని బ్లాగూ, నోట్లు లేని పాకెట్టూ ఉన్నా ఒకటే పోయినా ఒకటేరా. మ్యాటరేంటంటే నాకు రిజిస్ట్రేషన్ పనొకటుందీ. బెల్ కొట్టగానే ఇమ్మీడియట్ గా బ్యాగట్టుకొని పద.

నేను సరే..అనే లోపల లాంగ్ బెల్.. గణ గణ గణ గణ మంది. సర్ సీరియస్ గా గోడకి లెస్సన్ చెప్తుండగా, స్టూడెంట్స్ గతి లేక వింటుండగా, నేనూ, అప్పిగాడూ వారం క్రితం తిరుపతి లో కొట్టీంచిన గుళ్ళ మీద క్యాప్ లు పెట్టీ నిలుచొని చెప్పులేసుకుంటున్నాం.
ఆశ్చర్యం..! అవతల బెల్ రింగవుతున్నా.. క్లాస్ లో అందరూ సౌండ్ ఇంజినీర్ల లాగా, శ్రద్దగా వినేస్తున్నారు. సర్ వెనక్కి తిరిగేరు.
హైస్కూల్ లో ఉన్నప్పుడు ఎడారి లో ఆముదం చెట్లలాంటి మేము, ఇక్కడ తులసివనం లో గంజాయ్ మొక్కల్లాగా నిలబడిపోయిన మేము,  కృష్ణవంశీ కి ప్రొడ్యూసర్లు దొరికినట్టూ దొరికేశాం. విధి ఆడిన వింతనాటకానికి నా జీవితం ఒక రంగస్థలమయ్యిందనీ, అప్పల్రాజు గాడే డైరెక్టరనీ అర్ధమయ్యింది.



"క్లాస్ అయిపోయాక మీరిద్దరూ బయట వెయిట్ చెయ్యండ్రా" అనేసీ, మరో అవర్ నాన్ స్టాప్ గా నమిలేసీ, మేము స్కూల్ నుండి జైల్ కొచ్చామన్న సంగతి అర్ధమయ్యేట్టూ వార్ణింగ్లూ, ఆర్డర్లూ, కమాండ్లూ, ఇంకా చాలా ఇచ్చారు. అన్నీ చెప్పేస్తారేటండీ?
ఇదేమన్నా కోర్టా?
నేనేమన్నా బోన్ లో నిలబడి ఉన్నానా?
******************************************************************************
నడుస్తున్నాను. మేమ్ వెతుకుతున్న ధియేటర్ వచ్చేసిందీ...! టికెట్స్ ఉన్నాయో లేదో..!
మరిన్ని విశేషాలు మరొక పోస్ట్ లో...!

56 comments:

కృష్ణప్రియ said...

:))) What an interesting writeup!

SHANKAR.S said...

మీ అప్పల్రాజు కాకినాడ అన్నప్పుడు అక్కడ ఆగిపోయా రాజ్.ఇంట్రో సీన్ లోనే సెంటిమెంట్ మీద కొట్టాడు మీ వాడు. ఫస్ట్ కుసింత సేపు ఆ లైన్ తనివితీరా చూసి ఆ తర్వాత మిగిలింది చదివి మళ్ళీ కామెంట్ పెడతా :)

జేబి - JB said...

బాగుంది :D

రసజ్ఞ said...

టపా ఎప్పటిలాగా అద్భుతం! తెలివైన తింగరి అవతారానికి కలర్ జెరాక్స్, అద్దద్దిరూపాయ్. నా తలకాయ్ సంధి, హహహ! అప్పుడే కొన్న సెవనోక్లాక్ బ్లేడ్ తో పెన్సిల్ చెక్కేటప్పుడున్నంత జాగ్రత్తగా అమ్మాయిల్తో ఉండాలని అర్ధమయ్యిమ్ది.. చిన్న వయసులోనే ఎంత జ్ఞానం ;)

వేణూశ్రీకాంత్ said...

హహహ సూపర్ రాజ్ ఎప్పటిలానే బోలెడు నవ్వులు పూయించావ్ :-))))

నిషిగంధ said...

'అద్దద్దిరూపాయ్. నా తలకాయ్ సంధి'

అప్పుడు వరకూ ఏదో abs చేస్తున్నట్టు నవ్వంతా లోలోపలే కుక్కేసుకున్నా కానీ ఇక్కడకొచ్చేసరికి మాత్రం నావల్ల కాలేదు :)))))

హిలేరియస్ యాజ్ యూజువల్... మరీ నెలకొకటిలా కాకుండా వారానికొకటన్నా రాయొచ్చు కదా, రాజ్! :))

Zilebi said...

తారాజువ్వ లాంటి అప్పలరాజు మీకు
'తారుమారు' ఫ్రెండు అవడం మీ
పూర్వ జన్మ సుకృతం !!

చీర్స్
జిలేబి.

Sravya V said...

హ హ బాబోయ్ రాజ్ సూపర్బ్ పోస్టు అసలు :-)))

ఎటువెళ్ళినా ఒకటే రా.. లెఫ్ట్ తీసుకోండీ"
----------------------------------------
ఈ టైపు లో బోలెడు సార్లు రిస్క్ తీసుకుంటా నేను, కాకపొతే ఇదుగో మీలాగా పరువు తీసి బ్లాగులో పెట్టె ఫ్రెండ్స్ పక్కన లేకుండా జాగ్రత్త పడతా అలాంటి రిస్క్ తెస్సుకునేటప్పుడు :)))

గిరీష్ said...

చిన్న పిల్లల సంధి(నీ తలకాయ్ సంధి) సూపరెహె.. :)
As usual Keka..

Sateesh said...

తలకాయ్ సంధి బాగుంది బాబాయ్ :)

శేఖర్ (Sekhar) said...

చక్కని చిక్కని గోదారి కతెహ !
గోదారి పరిగెడుతున్నట్లు అక్షరాలెంట కళ్ళని ఉరికిన్చావ్ ...
సూపర్ అబ్బాయ్....

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>> అప్పుడే కొన్న సెవనోక్లాక్ బ్లేడ్ తో పెన్సిల్ చెక్కేటప్పుడున్నంత జాగ్రత్తగా అమ్మాయిల్తో ఉండాలని అర్ధమయ్యిమ్ది..
>>> తలకాయ సంధి.

కేక, కెవ్వు, టపా అదిరింది. ఇలాంటి ఐడియా లు ఎలా వస్తాయో ఒక టపా వేసి చెప్పకూడడా మాకు.

రాజేష్ మారం... said...

:)

సూపర్ హిట్. .. :))

నాకు నవ్వు రాని లైన్ లేదు. .. అద్బుతం .

:)))

శశి కళ said...

వ్యాకరణానికీ, గ్రామకరణానికీ తేడా తెలీని ఘనుడివి కదరా నువ్వూ. )))))))))))....padi nimishaalu non stop navving.....naayanaa yemi vraastaavu....comments dheera....

హరేఫల said...

ప్రతీ లైనూ నవ్వులపంటే... సూపర్.. సూపర్...సూపర్....

హరేఫల said...

ప్రతీ లైనూ నవ్వులపంటే... సూపర్.. సూపర్...సూపర్....

సుజాత వేల్పూరి said...

క్లాసు లీడర్ కష్టాలు నాకు తెలుసు బాబోయ్! SPL కష్టాలు కూడా!

Rest of the post..:-)))
ROFL

jeevani said...

రాజ్ మీ శైలి చూస్తే ముచ్చటేస్తుంది. చాలా బాగా రాశారు.

jeevani said...

రాజ్ మీ శైలి చూస్తే ముచ్చటేస్తుంది. చాలా బాగా రాశారు.

Sharada said...

Raj Kumar,
You are back in your elements! :)
Very nice.
Sharada

పానీపూరి123 said...

> నన్ను చూడు ఒకే మొక్క పీకీ, దాన్ని చేతిలోనే ఉంచుకొనీ గంట నుండీ ఏక్ట్ చేస్తున్నా
:-)
Excellent post...

రాజ్ కుమార్ said...

కృష్ణప్రియ గారూ ధన్యవాదాలండీ..

శంకర్ గారూ.. కదా..! ముందే అనుకున్నా.. ఇంకా కాకినాడ లో ఉండిపోయినట్టున్నారూ? మిగిలింది చదివి చెప్పండి మరి ;)

జేబి గారూ ధన్యవాదాలండి.

రాజ్ కుమార్ said...

రసజ్ఞ గారూ..అవునండీ పగబట్టిన పరిస్థితులు నేర్పిన పాఠాలు ;) థాంక్యూ వెరీ మచ్

వేణూజీ ధన్యవాదాలు ః)

నిషిగంధ గారూ.. నాకూ బాగా నచ్చింది ఆ లైన్ ;) వారానికొక పోస్ట్ నా? మీలాగా రైటర్ ని అనుకున్నారా? నేను ఈ నాలుగు ముక్కలూ రాయటమే గొప్ప ;) థాంక్యూ అండీ

రాజ్ కుమార్ said...

జిలేబీ గారూ.. అవునండీ నా అదృష్టమే. నెక్స్ట్ పోస్ట్ లో మాంచి యాక్షన్ ఎపిసోడ్ ఉన్నాది ;)థాంక్యూ అండీ

శ్రావ్యగారూ.. వామ్మో మీరు కూడానా.. మీకు నా లాంటి ఫ్రెండ్ ప్రాప్తిరస్తు ;) నెనర్లు ;)

గిరీషూ.. సందులో సంధి.. ;) థాంక్యూ.

రాజ్ కుమార్ said...

సతీష్.. థాంక్స్ అబ్బాయ్ ;)

శేఖర్.. థాంక్యూ వెరీమచ్ ;)[మాది గోదావరి బోర్డర్ కానీ పూర్తిగా కాదు ;)]

బులుసుగారూ.. ధన్యవాదాలండీ.. మీకు నేను చెప్పటమా? భలే భలే..

రాజ్ కుమార్ said...

రాజేష్ గారూ థాంకులు ;)

శశిగారూ.. నెనర్లు. కొత్తగా బిరుదులేం వద్దులెండి ;)

హరేఫల గారూ.. ధన్యవాదాలండీ..

సుజాత గారూ.. ఓహో మీరు S.P.L gaa కూడా చేశారా? హిహిహి.. థాంక్యూ అండీ

రాజ్ కుమార్ said...

జీవని గారూ.. నాకు పోకిరి గుర్తొస్తుంది మీ కమేంట్ చూస్తుంటే.. థాంక్యూ సర్

శారద గారూ.. ధన్యవాదాలండీ

పానీపూరీ గారూ నెనర్లు అండీ.

sagittarianblogger said...

very interesting n enjoyed as every time !!

sagittarianblogger said...

very intrstng n njyed alot reading this , as every time :):)

SHANKAR.S said...

మీ అప్పిగాడు బెంగుళూరు చేత ........పోయించడానికి వచ్చాడు అనిపించింది :))

ఈ పోస్ట్ కి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, వీరో అన్నీ అప్పల్రాజే. అసలు ఆ ఫస్ట్ డైలాగ్ తోనే ఫ్లాట్ చేస్సేడు.

"అప్పుడే కొన్న సెవనోక్లాక్ బ్లేడ్ తో పెన్సిల్ చెక్కేటప్పుడున్నంత జాగ్రత్తగా అమ్మాయిల్తో ఉండాలని అర్ధమయ్యిమ్ది.."

ఆ రాజేస్రీ ఎవరో గానీ చిన్నప్పుడే నీకు జ్ఞానోదయం కలిగించింది రాజ్.

శ్రీనివాస్ పప్పు said...

పోస్ట్ సూపరెహే అద్దరగొట్టేహావంతే రచ్చ రచ్చ

John said...

/అర్ధ రూపాయ్ + అర్ధ రూపాయ్ = అద్దద్దిరూపాయ్. నా తలకాయ్ సంధి/
ROFL

సందులూ..గొందులూ అవలీలగా కనిపెట్టేస్తున్నారు..అదరహో...

ఫోటాన్ said...

బాగుంది రాజ్... నువ్వు సామన్యుడివి కాదబ్బీ.. చూడటానికి అప్పల్రజులా కనిపిస్తావ్ కానీ,... నువ్వు పెన్ చేత పట్టుకుంటే మేము పొట్ట చేత పట్టుకోవాలి నవ్వడానికి.... :)))

Anonymous said...

చాలా బావుంది ఎప్పటిలానే .

సిరిసిరిమువ్వ said...

సూపర్ అన్న మాట చాలా చిన్నది..very good show!

కొంచం పని ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ టపా మంచి రిలాక్సేషన్ రాజ్!

హరే కృష్ణ said...

బాబోయ్ రచ్చ కదా అసలు
లీడర్ :)))

Chandu S said...

మీ బ్లాగులో ఆగడాలకు ప్రతిగా నా పోస్ట్ ఒక దానిలో మీ పేరు వాడుకోవడం జరిగింది మీ పర్మిషన్ లేకుండా( ఏమీ అనుకోరనే ఆశిస్తూ )

Raviteja said...

కడుపుతో ఉన్న పెద్దపులి ROFL word. mee Appalaraju Katha Screenplay Darsakatvam bagunadie. if you don't mind share your twitter id i want to follow you everyday sir.

kiran said...

అప్పుడే కొన్న సెవనోక్లాక్ బ్లేడ్ తో పెన్సిల్ చెక్కేటప్పుడున్నంత జాగ్రత్తగా అమ్మాయిల్తో ఉండాలని అర్ధమయ్యిమ్ది. --- kevvvvv
అప్పిగాడి మనసు మంచిదీ, గుణం గుడ్డిదీనూ-:))))
ఓట్లు పడని పార్టీ, తిట్లు రాని పొలిటీషియన్,హిట్లు లేని బ్లాగూ, నోట్లు లేని పాకెట్టూ ఉన్నా ఒకటే పోయినా ఒకటేరా.
keka
బాబ్బాబు ....మా మగేష్ బాబు సినిమా కి నువ్వైనా స్క్రిప్ట్ రాయి బాబు....
చచ్చిపోయాను ..బాధ తో ఆ సినిమా ఆ చెత్త డవిలోగులతో చూడలేక :(

మధురవాణి said...

హహ్హహ్హా... ROFL రాజ్.. చాలా నవ్వించేసావ్.. ఎప్పట్లాగే! Will wait for the sequel.. :D

రాజ్ కుమార్ said...

@sagittarian. thank you very much.:)

శంకర్ గారూ... కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్... ఆ పనిలో దాదాపు సక్సెస్ అయ్యాడు లెండీ ;). ఇక రాజేశ్వరి అంటారా.. ఆ రోజుల్లోనే బాగా రెబల్ క్యాండిడేట్. రచ్చ రచ్చ చేసేది ;)

పప్పుసారూ.. .థాంకులు సార్ ;)

రాజ్ కుమార్ said...

john గారూ.. పరిస్థితుల ప్రభావంతో అలా పుట్టుకొచ్చేస్తూ ఉంటాయండీ.. ధన్యవాదాలు

బాబూ..ఫోటానూ తిట్టేవా? పొగిడేవా? ;) థాంకులు ;)

లలిత గారూ ధన్యవాదాలు.

సిరిసిరిమువ్వ గారూ..నా మొహం పూరీలా పొంగిపోఇందండీ మీ కమెంట్ కి ;) ధన్యవాదాలండీ..

రాజ్ కుమార్ said...

హరే.. థాంక్యూ ;)

శైలజ గారూ.. అనుకోవటమా? మీరు మరీనూ.. అది చూసి బ్రేక్ డ్యాన్స్ వేస్తుంటేనూ.. థాంక్యూ సో మచ్ ;)

కిరణ్.. థాంక్యూ.. నేనా? మీ మగేష్ గా? అంత లేదులే. బాబు సినిమాలో చెప్తే అవి బ్లాగులో రాసుకొని పండగ చేసుకునే లెవల్ నాది. ;)
థాంక్యూ ;)

రాజ్ కుమార్ said...

@Ravi teja.. thank you very much. i don't have twitter account :( ;(

మధురగారూ ధన్యవాదాలండీ.;)

చాణక్య said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

పోస్ట్ అదుర్స్. నేను కూడా స్కూల్లో లీడర్‌నే. నన్ను పదవికి నామినేట్ చెయ్యగానే గర్వంగా క్లాసంతా ఓ లుక్కిచ్చా. తర్వాత తెలిసింది క్రొకొడైల్ ఫెస్టివల్ అంటే. ఒకటో తరగతి పిల్లలనుంచి హెడ్‌మాస్టర్ దాకా ఎవ్వరూ గౌరవించేవారు కాదు. అదేం లీడర్ పదవో అర్థమయ్యేది కాదు. క్లాసుకి పెద్దపాలేరులా ఉండేది పని.

మనసు పలికే said...

రాజ్.. ఇకపై నీకు కామెంట్లు పెట్టొద్దని డిసైడ్ అయ్యాను :D.
ఎప్పుడూ పొగుడుతూనే పెట్టాల్సొస్తుంది మరి. నవ్వీ నవ్వీ కళ్లలో నీళ్లతో పెట్టాల్సి వస్తుంది. చాలా సీరియస్ గా చదువుదాం అని ఎంతట్రై చేసినా, ఎక్కడో అక్కడ దొరికి పోతాను;).. ఈసారేమో "నా తలకాయ్ సంధి" దగ్గర. గాట్టిగా నవ్వేశా...;)
టపా కి ఎంతగా నవ్వానో, శంకర్ గారి వ్యాఖ్యకి అంతగా నవ్వాను:) మొత్తంగా నవ్వుతూనే ఉన్నాను చదివిన ప్రతి సారీ..(చాలా సార్లే చదివేశా..హిహ్హిహ్హీ)

ఆ.సౌమ్య said...

హహహ్హహహ ఏం చెప్పమంటావు రాజ్...రోజు రోజుకీ ఇరగదీసేస్తున్నావ్!
అసలా కంపేరిజన్స్ ఎక్కడనుండి పుట్తుకొస్తాయో బాబు నీకు!
సూపర్ సూపర్ సూపర్...అంతే, మరో మాట లేదు!

రమణ said...

బాగుంది.

అద్దద్దిరూపాయ్ ని మేము అద్దద్దురూపాయ్ అనేవాళ్లం.

karthik said...

కెవ్వున్నర డయలాగులు:

>బోరు బావి లో బతికున్న కప్పలాంటి నేను
>వ్యాకరణానికీ, గ్రామకరణానికీ తేడా తెలీని ఘనుడివి కదరా నువ్వూ.
>నా తలకాయ్ సంధి
>విధి ఆడిన వింతనాటకానికి నా జీవితం ఒక రంగస్థలమయ్యిందనీ
>>రోడ్ రోలర్ కి రాకెట్ ఇంజన్ బిగించారేమో

finally, ఇప్పుడు మొత్తం చదివేశా.. :D

రాజ్ కుమార్ said...

చాణక్య గారూ.. ;)
>క్లాసుకి పెద్దపాలేరులా ఉండేది పని.>> యెస్స్ కరెక్ట్ గా చెప్పారు ;) ధన్యవాదాలు

మనసుపలికేగారూ.. అంతలా నవ్వారా? ఏటి నిజమే?;) హిహిహి మెచ్చినందుకు ధన్యవాదాలు ;)

రాజ్ కుమార్ said...

సౌమ్యగారూ.. ఏదో అలా కలిసొస్తాయండీ.. ;) మీకు కొత్తగా చెప్పేదేముందీ?
ధన్యవాదాలు.

రమణ గారూ.. థాంక్యూ అండీ.. యాస మారిపోతూ ఉంటాది కదండీ.. మరి మీదేవూరో తెలీదు నాకు.;)

కార్తీకూ.. చాలా కాలానికి ఇటేపు వచ్చినట్టున్నావు.. ;)
థాంక్యూ సో మచ్ ;)

రాజ్ కుమార్ said...

సౌమ్యగారూ.. ఏదో అలా కలిసొస్తాయండీ.. ;) మీకు కొత్తగా చెప్పేదేముందీ?
ధన్యవాదాలు.

రమణ గారూ.. థాంక్యూ అండీ.. యాస మారిపోతూ ఉంటాది కదండీ.. మరి మీదేవూరో తెలీదు నాకు.;)

కార్తీకూ.. చాలా కాలానికి ఇటేపు వచ్చినట్టున్నావు.. ;)
థాంక్యూ సో మచ్ ;)

chubby said...

Appala raju...inthati legibrity ani naaku ippudippudey thelusthondi...keka rajku....

Unknown said...

hai mee post lu chala bagunnai inka ilane rastu undandi

భాస్కర రామిరెడ్డి said...

ఏంటివన్నీ నిజమే :))

రాజ్ కుమార్ said...

Sudhakar reddy gaaru.. thnQ :)
i'll try :)

భాస్కర రామి రెడ్డి గారూ.. అవునండీ నిజ్జంగా నిజమే ;)